గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
పాట్నా: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం స్థానిక బీహార్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బీహార్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు విద్యానంద్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ మేరకు స్పందించింది. గిరిరాజ్ సింగ్ పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. తొలుత ఈ పిటిషన్ ముజాఫర్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టేట్ ముందుకు వస్తే దీనిపై విచారణను అక్కడి నుంచిసబ్ డివిజనల్ కోర్టుకు బదిలీ చేశారు.
సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.