కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, అసదుద్దీన్ ఓవైసీ
న్యూఢిల్లీ : భారతీయ ముస్లింలంతా రాముడి వారసులేనని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదుని నిర్మించి తీరుతామన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అసుదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం పట్టుకుందని, దేశాన్ని ముక్కలు చేయాలనే ధోరణితో అలా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ’వారంతా మక్కా యాత్రకు వెళ్తారు. మరి మేము ఎక్కడికి వెళ్లాళి. మా కోసం పాకిస్తాన్‌లో రామమందిరం నిర్మిస్తారా’ అని ప్రశ్నించారు.
భారత్‌లో బాబర్ వారసులెవరూ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనన్నారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, తామంతా ఒకటేనని, భారతీయులందరి పూజించేది రాముడేనని ఆయన చెప్పారు. అయోధ్యలో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తామని, సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తోందని ఒవైసీ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment