Ayodya dispute
-
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
బలగాల రక్షణలో ప్రశాంతంగా...
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు వద్ద.. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు. రామ జన్మభూమి అయోధ్యలో... అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు. దేశ రాజధానిలో.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు. -
‘అయోధ్య’ కేసు విచారణలో కొత్త ట్విస్ట్!
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు కీలకమైన మలుపు తీసుకుంది. కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు లలిత్ తప్పుకున్నారు. గురువారం అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన 14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జనవరి 29కి ధర్మాసనం వాయిదా వేసింది. అనంతరం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. జస్టిస్ లలిత్ గతంలో కల్యాణ్ సింగ్ తరుపున అయోధ్య కేసు వాదించారు. కాగా న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ ధావన్ అభ్యంతరం మేరకు జస్టిస్ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. జస్టిస్ లలిత్ స్థానంలో మరొకరిని రాజ్యాంగ ధర్మాసనంలో చేర్చే వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది. -
ఈనెల 29న అయోధ్య కేసు విచారణ
-
రామ మందిరం కట్టకపోతే బీజేపీ కథ అంతే!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. రెండు రోజుల అయ్యోధ్య పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదాస్పద రామమందిరం-బాబ్రీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారో బీజేపీ చెప్పాలి. రాష్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. దశాబ్దాలుగా రామమందిర విషయాన్ని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో మందిర నిర్మాణం కష్టమే కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీలో ఉందన్నారు. ఆర్డినెన్స్ తెస్తారో చట్టం చేస్తారో మాకనవసరమని, రామ మందిర నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో మాత్రమే చెప్పండంటూ నిలదీశారు.‘ రామ మందిరాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్మించాలి, ఆ ఘనతను వారేనే తీసుకోమనండి. వారు నిర్మించకపోయినా.. రామమందిర నిర్మాణం జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం అధికారంలో కొనసాగదు’ అని హెచ్చరించారు. రామమందిరం ముందుండేది, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. ఈ ఆలయ నిర్మాణం హిందువుల మనోభావాలకు సంబంధించిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని, తామెప్పుడు చూడాలని ప్రశ్నించారు. తొలుత ఆర్ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) రామమందిర నిర్మాణనికి ఆర్డినేన్సు తిసుకురావలంటూ డిమాండ్ చేయగా.. తాజాగా విశ్వహిందూ పరిషత్, శివసేనలు సైతం ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ ఆలయ స్థలం వివాదం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం ఈ కేసును జనవరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
ప్రధాని, సీఎంపై ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు దేశ అత్యున్నత న్యాయస్థానమే అయోధ్య భూవివాదం కేసుపై ఆచితూచి అడుగులేస్తుండగా.. మరోవైపు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న యోగీ ఆదిత్యనాథ్.. అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏం చేస్తున్నారు. హిందుత్వ వాదులు అంత గొప్ప స్థానాల్లో ఉండగా.. రాముడు ఇంకా టెంట్లలో ఉండడమా’ అని అసహనం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. (అయోధ్యపై సత్వర విచారణకు నో) మోదీ, యోగీ స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేదని చెప్పారు. కరుడు గట్టిన హిందుత్వ వాదులు ఏలుతున్న దేశంలో రాముడు ఇంకా టెంట్లోనే ఉండడం బాధాకరమన్నారు. ఇది హిందూ జాతికే దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దనీ..దేవుడి ఆశిస్సులతో ఆలయ నిర్మాణం త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాముడు ఎప్పడు తలచుకుంటే అప్పుడే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 2010లో అలహాబాద్ కోర్టు అయోధ్యలోని వివాదాస్పద రామాలయం-బాబ్రీ మసీదు భూమిని మూడు భాగాలుగా చేసి పంచాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో వాదనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వచ్చే ఏడాది జనవరిలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. Modi ji jaisa mahan PM ho wo bhi hinduvadi aur Yogi ji jaisa mahan hinduvadi neta CM ho, uss samay bhi Bhagwan Ram tent mein rahen, isse bada durbhagya Bharat aur Hindu samaj ke liye nahi hone wala. Aisi paristhiti banai jaani chahiye ki Ram mandir Ayodhya mein bane: S Singh,BJP pic.twitter.com/Nmq2UN5ijo — ANI UP (@ANINewsUP) November 17, 2018 -
అయోధ్యపై సత్వర విచారణకు నో
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసును సత్వరమే చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై విచారణను జనవరిలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. అయోధ్య భూవివాదం విషయంలో సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత్ హిందు మహాసభ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘అయోధ్య వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్పీళ్లన్నీ జనవరిలో ధర్మాసనం ముందుకు రానున్నాయి. అప్పటి వరకు సత్వర విచారణ చేపట్టలేం’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అయోధ్య అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. ఇక అఖిల భారత్ హిందూ మహాసభ తరఫున లాయర్ బరుణ్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు. -
మదర్సా వ్యవస్థను రద్దు చేయండి : వసీం రిజ్వీ
లక్నో : మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీని హత్య చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. మదర్సాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తనని, తన కుటుంబాన్ని హతమారుస్తామని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు బెదిరిస్తున్నారని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ రిజ్వీ..! ‘పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లలో పేరుపొందిన ఉగ్రవాదులు దియోబంధి మదర్సాలలో తయారు చేయబడ్డారు... ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని’ ఆరోపిస్తూ రిజ్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, కేబినెట్ సెక్రటరీకి ఐదు పేజీలతో కూడిన ఈ- మెయిల్ చేశారు. మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాసి రజ్వీ వార్తల్లోకెక్కారు. ‘వారంతా పాకిస్తాన్ వెళ్లాలి’... రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ రిజ్వీ వ్యాఖ్యానించారు. మసీదు పేరిట జిహాద్‌ను వ్యాప్తి చేసేవారు అబూ బకర్ ఆల్-బాగ్దాదీ లేదా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షియా వర్గానికి చెందినవారు రజ్వీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి లేఖలు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించాలని గత నెలలో రిజ్వీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అంతేకాకుండా దేశంపై, దేవుడిపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటే అయెధ్యలో రామ మందిర నిర్మాణం, లక్నోలో మసీద్-ఇ-అమన్ నిర్మించేందుకు ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సహకరించాలని సూచించారు. -
బహుభార్యత్వం కన్నా.. అయోధ్యకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్లు సుప్రీంకోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ముస్లింల బహుభార్యత్వం వివాదం కంటే ఇది చాలా ముఖ్యమైన కేసని ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ కోర్టుకు నివేదించారు. ఈ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్లను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. సున్నీ వక్ఫ్‌బోర్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహా కక్షిదారుల వాదనలు విన్న అనంతరం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా ? వద్దా ? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. అలహాబాదాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ గతంలో 2:1 మెజారిటీతో తీర్పునిస్తూ... సదరు భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లీలా సమానంగా పంచుకోవాలని పేర్కొంది. -
‘భారతీయ ముస్లింలంతా రాముడి వారసులే!’
న్యూఢిల్లీ : భారతీయ ముస్లింలంతా రాముడి వారసులేనని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదుని నిర్మించి తీరుతామన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అసుదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం పట్టుకుందని, దేశాన్ని ముక్కలు చేయాలనే ధోరణితో అలా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ’వారంతా మక్కా యాత్రకు వెళ్తారు. మరి మేము ఎక్కడికి వెళ్లాళి. మా కోసం పాకిస్తాన్లో రామమందిరం నిర్మిస్తారా’ అని ప్రశ్నించారు. భారత్‌లో బాబర్ వారసులెవరూ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనన్నారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, తామంతా ఒకటేనని, భారతీయులందరి పూజించేది రాముడేనని ఆయన చెప్పారు. అయోధ్యలో మళ్లీ బాబ్రీ మసీదును నిర్మిస్తామని, సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తోందని ఒవైసీ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
రామ మందిరంపై మాట్లాడటానికి మీరెవరు..?
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ఆరెఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భగవత్ ఎవరని, ఈ వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఏ అధికారంతో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశాడని, భగవత్ ఏమైన భారత ప్రధాన న్యాయమూర్తా.. అని ప్రశ్నించారు. రామమందిరం నిర్మించి తీరుతామని, ఈ నిర్ణయంలోఎలాంటి మార్పులేదని ఇటీవల భగవత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రామమందిరం నిర్మాణం త్వరలోనే నిర్మించబోతున్నామని, భక్తులంతా వచ్చే దీపావళి రామ మందిరంలో జరుపుకుంటారని బీజేపీ సీనియర్‌నేత సుబ్రమణ్యియన్ స్వామి ఆదివారం ప్రకటించారు. అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై 2010-అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం తుది విచారణ జరగనుంది. -
సయోధ్య సాధ్యమేనా?
రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు వెలుపల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చేసిన సూచనతో ఆ వివాదం మరో మలుపు తిరిగింది. తొలిసారి 1885లో ఈ వివాదం కోర్టు మెట్లెక్కగా ఆనాటినుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. అది యాజమాన్య హక్కులకు సంబంధించిందో, వారసత్వ హక్కులకు సంబంధించిందో అయితే పరిష్కారం ఎప్పుడో సాధ్యమయ్యేది. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు బృందాల మధ్యనో కొనసాగుతుంటే... ఎవరో ఒకరు చొరవ తీసుకుని మధ్య వర్తిత్వం వహించడం సాధ్యమయ్యేది. అంతా చక్కబడేది. కానీ ఈ వివాదం రెండు ప్రధాన వర్గాల విశ్వాసాలతో ముడిపడిపడి ఉంది. ఆ విశ్వాసాల చుట్టూ కోట్లాది మంది ప్రజల భావోద్వేగాలు అల్లుకుని ఉన్నాయి. అవి తరచుగా కట్టుదాటి ఉద్రిక్త తలకు దారి తీస్తున్నాయి. కొన్ని సంస్థలు వాటికి ఆజ్యం పోస్తున్నాయి. రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, దేశంలోనే అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు చొరవ తీసుకుని ఉంటే ఇప్పటికే దీనికొక పరిష్కారం సాధ్యమయ్యే దేమో! కానీ అది జరగకపోగా ఇరు వర్గాల్లోనూ ఉన్న భావోద్వేగాలను సొమ్ము చేసుకునే ధోరణులు పెరిగిపోయాయి. సమస్య మరింత జటిలంగా మారింది. సుప్రీంకోర్టు సూచనపై వివిధ పక్షాల స్పందన గమనిస్తేనే సమస్య ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. బీజేపీ ఈ సూచనను స్వాగతించింది. ఇరు పక్షాల మధ్యా చర్చలే ఉత్తమమని తెలిపింది. కాంగ్రెస్ అభిప్రాయం కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. కానీ బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం(బీఎంఏసీ)తో సహా వివిధ ముస్లిం సంస్థలు మాత్రం ఈ సూచన విషయంలో నిర్లిప్తంగానే మాట్లా డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి తాము సుముఖమం టూనే కోర్టు వెలుపల పరిష్కారం మాత్రం కుదరనిపని అని బీఎంఏసీ తేల్చి చెప్పింది. మధ్యవర్తిత్వం వహించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ సిద్ధపడే అవకాశం లేదు. వివాద పరిష్కారానికి మధ్యవర్తులను ఎంచు కుంటే వారి మధ్య జరిగే చర్చల్లో తాను, తన సహచరుల సహకారం ఉంటుందని మాత్రమే ఆయన చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు సుప్రీంకోర్టు సూచనకు ఎందుకు సుముఖంగా ఉన్నాయో, ముస్లిం సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో సుస్పష్టం. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్నది కనుక వివాదం రామ జన్మభూమికి అనుకూలంగా పరిష్కారమవుతుందని ముస్లిం సంస్థలు భావిస్తున్నాయి. అందువల్లే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమే యం ఉండి, కోర్టు పరిధిలో పరిష్కారాన్ని అన్వేషిస్తేనే చర్చలకు సిద్ధపడతామని బాబ్రీ కమిటీ అంటోంది. నిజానికి సుప్రీంకోర్టు చేసిన చర్చల ప్రతిపాదన కొత్తదేం కాదు. చంద్రశేఖర్, పీవీ నరసింహారావు ప్రధానులుగా పనిచేసినప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. వాటికి ముందు 1986లో కంచి కామకోటి పీఠాధిపతి, ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అలీ మియాన్ నద్వీల మధ్య చర్చలు జరిగాయి. ఈలోగా ఆ అధికారం వారికెక్కడిదంటూ రెండు వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈలోగా చర్చలే విఫలమయ్యాయి. 1989 సార్వత్రిక ఎన్నికల తర్వాత మధు దండావతే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ హిందూ, ముస్లిం నేతల మధ్య ముఖాముఖి చర్చలు సాగేందుకు కృషి చేసింది. పర్యవసానంగా చంద్రశేఖర్ ప్రభుత్వం బాబ్రీ ఉద్యమ సమన్వయ సంఘం(బీఎంఎంసీసీ)కి, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ)కి మధ్య చర్చలు ఏర్పాటుచేసింది. తమనూ పిలవాలంటూ మరో సంస్థ బీఎంఏసీ పేచీకి దిగింది. దాంతో చర్చలే ఆగిపోయాయి. బీఎంఎంసీసీ చంద్రశేఖర్ వర్గంలోనివాడైన షాబుద్దీన్ నెలకొల్పిన సంస్థ అయితే...బీఎంఏసీ మాజీ ప్రధాని వీపీ సింగ్ సన్నిహితుడైన ఢిల్లీ జమా మసీదు ఇమాం బుఖారీ కనుసన్నల్లో నడిచేది. రెండు ముస్లిం సంస్థల మధ్య నెలకొన్న వైరానికి ఆ ఇద్దరి నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలే కారణమని వేరే చెప్పనవసరం లేదు. 1990లో ఈ పరిస్థితి తిరగబడింది. ఈసారి బీఎంఏసీ, వీహెచ్పీల మధ్య చర్చలకు రంగం సిద్ధం చేస్తే బీఎంఎంసీసీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కొన్నాళ్లపాటు ఈ చర్చల తంతు నడిచింది. తమ తమ వాదనలకు మద్దతుగా రెండు సంస్థల ప్రతినిధులూ వివిధ పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఎవరూ మెట్టు దిగడానికి సిద్ధం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఒకవేళ బీఎంఏసీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా బీఎంఎంసీసీ గట్టిగా ప్రతిఘటించేది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల ప్రదేశాన్ని కక్షిదారులైన రాంలాలా పక్షానికీ, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడాలకూ సమంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ అది చట్టం, సాక్ష్యాధారాలనుబట్టి కాక విశ్వాసాలకూ, సామరస్యానికీ ప్రాధాన్యమిస్తూ వెలువరించిన తీర్పు. కక్షిదారులు అడగకుండానే పంపకాలు చేయడానికి మీరెవరని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును ప్రశ్నించడమే కాక...యథాతథ స్థితి కొనసాగించమని ఆదేశించింది. వీటన్నిటినీ గమనించాక పరిష్కారం ఎంత జటిలమైనదో అర్ధమవుతుంది. నిజానికి సుప్రీంకోర్టు ముందున్న సమస్యల్లా వివాదాస్పద ప్రాంతం హక్కుదారు ఎవరన్నదే. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడతామని... అందుకు ఎంతకాలమైనా ఎదురుచూస్తామని ముందుగా ఇరుపక్షాలూ రాత పూర్వకంగా చెబితే ఆ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే చర్చలే శరణ్యం. 13 అఖాడాలకు నేతృత్వంవహిస్తున్న అఖిల భారతీయ అఖాడా పరిషత్ చేసిన ప్రకటన ఈ సందర్భంలో ఎన్నదగినది. రాజకీయ పక్షాలు ఈ వివాదానికి దూరంగా ఉంటేనే చర్చలు ఫలిస్తాయని... ఏకాభిప్రాయం తర్వాతే వివాదాస్పద ప్రాంతంలో ఏ నిర్మాణమైనా చేపట్టాలని అది చెబుతోంది. అన్ని పక్షాలూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటే... పరిణతితో, బాధ్యతతో వ్యవహరిస్తే సామరస్యపూర్వక పరిష్కారం సాధ్యమవుతుంది. అది ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచుతుంది.