రామ మందిరంపై మాట్లాడటానికి మీరెవరు..? | Is Mohan Bhagwat the Chief Justice? Who is he, asked Owaisi | Sakshi
Sakshi News home page

రామ మందిరంపై మాట్లాడటానికి మీరెవరు..?

Published Mon, Dec 4 2017 10:28 AM | Last Updated on Mon, Dec 4 2017 10:33 AM

 Is Mohan Bhagwat the Chief Justice? Who is he, asked Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ఆరెఎస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్‌ అయ్యారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భగవత్‌ ఎవరని, ఈ వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఏ అధికారంతో భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడని, భగవత్‌ ఏమైన భారత ప్రధాన న్యాయమూర్తా.. అని ప్రశ్నించారు. 

రామమందిరం నిర్మించి తీరుతామని, ఈ నిర్ణయంలోఎలాంటి మార్పులేదని ఇటీవల భగవత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రామమందిరం నిర్మాణం త్వరలోనే నిర్మించబోతున్నామని, భక్తులంతా వచ్చే దీపావళి రామ మందిరంలో జరుపుకుంటారని  బీజేపీ సీనియర్‌నేత సుబ్రమణ్యియన్‌ స్వామి ఆదివారం ప్రకటించారు. అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై 2010-అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం తుది విచారణ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement