mohan bhagwat
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ
-
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
ధర్మం పేరిట అధర్మాచరణ: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ అన్నారు. మనిషిలో స్వార్థం పెరిగి.. ధర్మానికి, అధర్మానికి అర్థంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు. మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు. సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దాన్ని వదిలేసి వస్తు రూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు. భారత్ సనాతన దేశం. రుషులు, మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం. ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు, ధర్మాలు రాశారు. అలాంటి వాటిని అనుసంచాల్సిన మనం.. కేవలం అనుకూలమైనవాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు. మనమంతా సంస్కృతి, ధర్మంవైపు అడుగులు వేయాలి. కానీ వికృతి దిశగా వెళ్తూ సృష్టి ధర్మాన్ని విస్మరిస్తున్నాం. విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు. విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది. సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన ఉత్సవాలు లోక్‌మంథన్ భాగ్యగనర్–24 ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనే ఆవశ్యకతను వక్తలు వివరించారు. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా 210 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో మూడు వేదికల్లో 12 దేశాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖులు ఉపన్యాసాలు, బోధనలు అందించారు. సుమారు 1,500 మంది కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. లోక్ మంథన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఆహార ధాన్యాలు, ఔషధ మొక్కల స్టాల్స్, గిన్నిస్ రికార్డు అందుకున్న భారీ పెన్ను వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు ఉత్సవాల్లో అభినయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహాన్ భారతోహం పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు 2.10 లక్షల మందికిపైగా లోక్ మంథన్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. -
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్‌బాగ్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
మోదీకీ రిటైర్మెంట్ ఇస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చర్యలకు ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ‘జనతా కీ అదాలత్’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. ‘‘75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీలో నిబంధన ఉంది. ఎల్కే అడ్వాణీ వంటి నేతకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఈ నిబంధనను మోదీకి కూడా వర్తింపజేస్తారా? అడ్వాణీ మాదిరిగానే మరో ఏడాదికి మోదీని కూడా ప్రధాని పదవి నుంచి తప్పిస్తారా?’’ అని భగవత్‌ను ప్రశ్నించారు. ఆరెస్సెస్‌ను కూడా మోదీ ఖాతరు చేయడం లేదనే అర్థం ధ్వనించేలా, ‘కొడుకు చివరికి తల్లిపైకే తల ఎగరేసేంత పెద్దవాడయ్యాడా?’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘పారీ్టలను విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ సమరి్థస్తోందా? నేతలపై అవినీతిపరులనే ముద్రవేసి, చివరికి వారిని బీజేపీలో చేర్చుకోవడం సంఘ్‌కు ఇష్టమేనా? బీజేపీ సాగిస్తున్న ప్రస్తుత రాజకీయాల పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సైద్ధాంతికంగానూ, అన్ని రకాలుగానూ బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ ఇక మీదట పారీ్టకి అవసరమే లేదన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యలు విన్నాక మీకేమనిపించింది? వీటన్నింటిపై స్పందించండి. బదులివ్వండి’’ అని భగవత్‌ను కోరారు. దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, పదవుల కోసం కాదని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష ఏ తప్పూ చేయని తనపై అవినీతి ఆరోపణలు రావడంతో కలత చెంది సీఎం పదవికి రాజీనామా చేశానని కేజ్రీవాల్ అన్నారు. గత పదేళ్లలో గౌరవం సంపాదించుకున్నాను తప్పితే డబ్బు సంపాదించలేదని వ్యాఖ్యానించారు. ‘‘దసరా నవరాత్రుల తర్వాత అధికారిక నివాసం వీడతా. ప్రజలే నాకు వసతి కలి్పస్తారు’’ అన్నారు. కేజ్రీవాల్ ప్రశ్నలపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఆయనకు నైతిక విలువలే లేవంటూ ఎక్స్‌లో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. కేజ్రీవాల్ రాముడు, నేను లక్ష్మణుడినిఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో తనకున్నది రామలక్ష్మణుల సంబంధమని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా అభివర్ణించారు. ఏ రావణుడూ తమను విడదీయలేడంటూ బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జన్తా కీ అదాలత్‌లో సిసోడియా ప్రసంగించారు. అవినీతి రావణుడిపై పోరాటం సాగిస్తున్న రాముడు కేజ్రీవాల్ పక్కన లక్ష్మణుడిలా ఉంటానన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్ఆర్ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్ఎస్ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. ‘‘ ఆర్ఎస్ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్‌ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్‌కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు. -
అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు
బడంగ్పేట్: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను ప్రచారం చేస్తున్నారని.. కానీ అసలు అలాంటి సమావేశం ఏదీ జరగలేదని వివరించారు. ప్రస్తుతమున్న సాంకేతికత, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్లు చూపించడం సాధమవుతోందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల (సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ)ను ఆదివారం ఆయన చినజీయర్ స్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడారు. ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గంగా విద్యను ఆయన అభివరి్ణంచారు. 1952లో సరస్వతీ శిశుమందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని.. నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠ శాలలు నడుస్తున్నాయని చెప్పా రు. దేశభక్తి విలువలతో కూడిన విద్యకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మనమంతా రాముడి బాటలో నడవాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. స్వయం సేవక్‌లు చివరి శ్వాస దాకా సమాజం కోసం పనిచేస్తారని మోహన్ భాగవత్ తెలిపారు. మోదీ కృషి అభినందనీయం: చినజీయర్ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చినజియర్ స్వామి కొనియాడారు. భారత్‌ను విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. కేవలం భారతీయుడిగా తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. విద్య అనేది పొట్టకూటి కోసం కాదని.. సక్రమమైన పౌరులుగా తయారయ్యేందుకేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సు«దీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సు«ధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, రమే‹Ùగుప్తా, విష్ణువర్దన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమరం: లోక్‌సభ తొలి విడత పోలింగ్ చిత్రాలు
-
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే. అందుచేత.. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా ఆరెస్సెస్ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: భారత్ మూలాలపై రిషి సునాక్ భావోద్వేగం -
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తు!
బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం మంది విద్యావంతులేనని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. 70 శాతం మంది విద్యావంతు లని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు చదువుకునేవారనే అర్థం వస్తోంది. భారతదేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గత తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ కొంతకాలంగా అసాధారణ ప్రకటనలు చేస్తు న్నారు. దేవుడు కులాన్ని సృష్టించలేదనీ, పండిట్లు (పూజారులు) కులాన్ని సృష్టించారనీ అన్నారు. శాస్త్రాలు మౌఖికంగా బదిలీ అయి నంతకాలం బాగుండేవనీ, వాటిని ఎప్పుడైతే రాయడం జరిగిందో తప్పుడు విషయాలు పొందుపరుస్తూ వచ్చారని కూడా అన్నారు. ఈ రెండు ప్రకటనలు కాస్త సంస్కరణ తత్వంతో ఉన్నాయి. ‘2023 మార్చి 5న మోహన్ భాగవత్ బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం విద్యావంతులేనని పేర్కొన్నారు. అప్పట్లో దేశంలో నిరుద్యోగమనేది లేదని కూడా చెప్పారు’. ఆయన ఈ ప్రకటనకు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. సావిత్రీబాయి ఫూలే జయంతి నేపథ్యంలో 2023 మార్చి 7న ‘పుణేకర్ న్యూస్’లో కేమిల్ పార్ఖే 1824లో బాంబేలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించిన అమెరికన్ మిషనరీ మహిళ సింథియా ఫరార్ గురించి ఒక ఆసక్తికరమైన కథనం రాశారు. పుణేలో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఫరార్ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలోనే సావిత్రీ బాయి, ఫాతిమా బాలికలకు పాఠాలు చెప్పేవారు. జాతీయవాద దృష్టితో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీ బాయిని దేశం పరిగణిస్తోంది. నిజానికి సింథియా ఫరార్‌ను మొదటి మహిళా టీచర్‌గా భావించాలి. సింథియా పెళ్లి చేసుకోలేదు. భారత దేశంలో బాలికా విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారు. అహ్మద్‌నగర్‌లో 1862లో మరణించారు. ‘‘ముంబై, అహ్మద్ నగర్లలో అనేక బాలికా పాఠశాలలు, బాలికల బోర్డింగ్ స్కూల్స్‌ను ప్రారంభించిన ఘనత సింథియా ఫరార్దే’’ అంటారు పార్ఖే. చరిత్రలో ఏ కాలంలోనైనా భారత్‌లో హిందూ బ్రాహ్మణ మిషనరీలు అలాంటి బాలికా పాఠశాలలను ప్రారంభించడం జరిగిందా? 70 శాతం మంది భారతీయులంటే, అందులో శూద్రులు, గ్రామాల, పట్టణాల చివర నివసిస్తున్న దళితులకు విద్యాహక్కు ఉండాలి. బ్రిటిష్ పూర్వ భారతదేశం అంటే మొఘలాయి పాలన గురించి ఆయన మాట్లాడుతున్నారని అర్థం. ముస్లిం పాలనాకాలంలో 70 శాతం మంది భారతీయులు చదువుకున్నవారేనన్న అర్థాన్ని ఇస్తోంది మోహన్ భాగవత్ ప్రకటన. అదే నిజమైతే, ముస్లింల పాలన ఎందుకు చెడ్డది? మొఘలుల పాలనాకాలంలో భారత్‌లో 70 శాతం మంది ముస్లింలు లేరు. ముస్లిం పాలకులు శూద్రులను, దళితులను విద్యావంతుల్ని చేశాక కూడా వాళ్లు ఇటీవలి కాలం వరకూ నిరక్ష రాస్యులుగానే ఎందుకు ఉండిపోయినట్లు? మోహన్ భాగవత్ ప్రకటన సాధారణంగా ఆరెస్సెస్ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. కులం, మహిళల అసమానత్వం అనేవి సంస్కృత శాస్త్రాల్లోకి తదనంతర రచయితలు ప్రవేశపెట్టారని ఆరెస్సెస్ చెబు తున్నట్టయితే– ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చి శాస్త్రాల్లో కులం, మహిళల అసమానత్వం గురించిన ప్రస్తా వనలను తొలగించవచ్చు. శాస్త్రాలు, పురాణాల్లో దేవతలకు కూడా కులం అంటగట్టేశారు. ఉదాహరణకు రాముడిని క్షత్రియుడిగా, కృష్ణు డిని యాదవుడిగా పేర్కొంటారు. శూద్ర, చండాల వంటి కుల బృందాలను అత్యంత హీనంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. అదే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య సామాజిక వర్గాలను అత్యంత గౌరవనీయమైన రీతిలో పేర్కొన్నారు. పైగా శూద్రులు, చండాలురు వీరిని సేవించాల న్నారు. శాస్త్రాల్లో అలాంటి భాషను మార్చడాన్ని ఎవరూ ఆపరు. హిందువులుగా తమను పరిగణించుకునే అన్ని వృత్తి బృందాలకు అర్చక విద్య పొందే హక్కును కల్పించాలి. ‘దేవుడు కులాన్ని సృష్టించలేదు’ అని ఆరెస్సెస్ అధినేతగా భాగవత్ చెబుతున్నందున ఇది అవసరమైన చర్యే. ఆధ్యాత్మిక విద్యలో సమాన అవకాశాలపైన ఆధ్యా త్మిక సమానత్వం ఆధారపడి ఉంటుంది. హిందూ పిల్లలందరికీ హిందూ ఆధ్యాత్మిక విద్యను ఆరెస్సెస్, బీజేపీ కూటమి ప్రారంభించవచ్చు. ఇటీవలి కాలం వరకూ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే హక్కు శూద్రులకు, దళితులకు ఉండేది కాదని తెలిసిన విష యమే. ఈ పుస్తకాల్లోనే వీరి జీవితాన్ని పశువులతో సమానంగా చిత్రించారు. ‘రామచరిత్ మానస్’లో అలాంటి భాష గురించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. ఆరెస్సెస్, బీజేపీ పాలిస్తున్నప్పుడు అన్ని రంగాల్లో సమానమైన వాతావరణంలో విద్యా హక్కుకు హామీ ఉండేలా చూడాలి. భారతీయ వృత్తిజీవులందరి హుందాతనాన్ని నిలబెట్టేలా పాఠ్యప్రణాళిక ఉండాలి. ఏ కాలంలో, ఏ సమాజమైనా వ్యవసాయం, పశుపోషణ, చేతి వృత్తులు లేకుండా మనుగడ సాగించలేదు. కానీ రుగ్వేదం నుంచి రామాయణ, మహాభారతాల వరకు ఈ వృత్తులను దైవికం కానివిగా చూశాయి. అందువల్ల అవి శూద్ర లేదా చండాలమైనవి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఆధునిక యువత ఇలాంటి భాషను ఆమోదించలేదు. కాబట్టి మార్పు అవసరం. బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది విద్యావంతులని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు, మహిళలు చక్కగా చదువుకునే వారనే అర్థం వస్తోంది. దీనికి రుజువు ఉందా? ప్రాచీన, మధ్య యుగాల్లో అంటే బ్రిటిష్ వారు అడుగుపెట్టేంతవరకూ విద్యావిధానం నుంచి శూద్రులు, దళితులు, మహిళలను దూరం పెట్టాలని శాస్త్రాలే స్వయంగా చెబుతున్నప్పుడు బ్రిటిష్ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది భారతీ యులు చదువుకున్నారని మోహన్ భాగవత్ అనడంలో అర్థం ఉందా? భారతదేశంలో అన్ని కులాలు, సామాజిక బృందాల పిల్లలకు సూత్రరీత్యా విద్యను అందించేందుకు ఆమోదించిన మొట్టమొదటి పాఠశాలను విలియం కేరీ అనే బ్రిటిష్ మిషనరీ 1817లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ప్రారంభించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటి బాలికల పాఠశా లను 1824లో బాంబేలో అమెరికన్ మరాఠీ మిషన్ ప్రారంభించింది. ఆ మిషన్ తరఫున భారత్ వచ్చిన సింథియా ఫరార్ అన్ని కులాల మహిళలకు, పిల్లలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ముస్లిం పాలనా కాలంలో కానీ, అంతకుముందు కానీ భారత దేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? అలాంటి విద్యాసంస్థలు లేకుండా దేశంలోని 70 శాతం మంది పిల్లలకు ఎవరు విద్య నేర్పారు? ఏ రాజరిక ప్రభుత్వమూ పాఠశాలలను నడపలేదు. బ్రాహ్మణులు (ప్రధానంగా బ్రాహ్మణులు, క్షత్రియ విద్యావంతులు) ఆ పని చేసి ఉండాల్సింది. కానీ దానికి శాస్త్రాలు వారిని అనుమతించలేదు. మొఘలుల కాలంలో కూడా పర్షియా భాషలో అన్ని కులాల కోసం పాఠశాలలను ఏర్పర్చలేదు. సార్వత్రిక విద్యకు వ్యతిరేకులైన బ్రాహ్మణ పండితుల సూచన ప్రకారమే అక్బర్‌తో సహా మొఘల్ పాలకులు నడుచుకున్నారు. మొఘలుల పాలనాకాలంలో విషాదకర మైన విషయం ఏమిటంటే – ఇస్లాంలోకి మతం మార్చుకున్న కింది కులాల వారికి ఉన్నత కులాల ముల్లాలు, పఠాన్లు లేదా మొఘల్ జాతి వారు విద్య నేర్పలేదు. నేడు దళిత అక్షరాస్యత కంటే కిందికులాలకు చెందిన ముస్లింల నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. 70 శాతం అక్షరాస్యత గణాంకాలకు ఆరెస్సెస్ అధినేతకు ఆధారం ఏమిటి? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గతంలోని తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటు పైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి
నాగపూర్: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు. నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్ భగవత్ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు. ‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. -
ఆరెస్సెస్ చరిత్రలోనే తొలిసారిగా.. ఎవరామె?
నాగ్‌పూర్: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది. అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్ యాదవ్‌ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. ఎవరెస్ట్‌ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్ యాదవ్ పేరిట పదిలంగా ఉండిపోయింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది. -
మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్ వెల్లడించారు. -
భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!
నేటితో భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్ స్వరాజ్’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. భారత్ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది. కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. డా. మోహన్ భాగవత్ వ్యాసకర్త సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు. హింస ద్వారా సత్యం మరణించలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే పెద్ద ఆనందం, గర్వం ఏముంటుందని అన్నారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని భగవత్ పేర్కొన్నారు. ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్ చవాన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శేఖర్, రాజేందర్‌రెడ్డి, శంకర్, నిధి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. -
ABVP: విద్యార్థులే భవన నిర్మాతలు
‘విద్యార్థి సేవా సమితి ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి భవనం’ నిర్మితమైంది. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేతుల మీదగా రేపు విద్యార్థి లోకానికి అంకితం కాబోతోంది. 1949 జూలై 9న దేశవ్యాప్తంగా ఏబీవీపీ పనిని ప్రారంభిస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో పనిలోకి దిగింది. అప్పట్లో విద్యానగర్‌లో ఏబీవీపీ కార్యాలయం కోసం ఒక అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఆ కార్యాలయం అనేక విద్యార్థి ఉద్యమాలకు వేదిక అయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ఈ కార్యాలయం కేంద్ర బిందువయ్యింది, అనేక మంది నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఇక్కడ తయారయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యాలయమూ దీనిలోనే ఉంది. ఏబీవీపీ ‘సర్వవ్యాప్త– సర్వ స్పర్శి’ అనే నినాదంతో అన్ని విభాగాల విద్యార్థులకు చేరువ కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయం విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నందున ఆధునిక కార్యాలయం ఏబీవీపీకి తక్షణ అవసరంగా మారింది. అందుకే కొత్త కార్యాలయం కోసం హైదరాబాద్ తార్నాకలో వేయి గజాల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ సంగతి తెలిసి వేయిమంది పూర్వ కార్యకర్తలు ఒక్కొక్కరూ ఒక గజాన్ని కొనడానికయ్యే ఖర్చు భరించారు. 2017 ఏప్రిల్‌లో భూమి పూజ జరిగింది. ఈ ఐదేళ్లలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, కరోనా కష్టాలను దాటుకుంటూ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా పదిహేను వేలకు పైగా పూర్వ కార్యకర్తలు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారి నుండి ప్రేరణ పొంది లక్షలాది మంది విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. స్థానిక, అలాగే ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తినీ, సదుపాయాలనూ ఈ కార్యాలయం అందించాలనేది లక్ష్యం! – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ (జూన్ 16న ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి నిలయం’ ప్రారంభం సందర్భంగా) -
దేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ అసలైన దేశ వ్యతిరేకి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కేంద్రం రిమోట్ కంట్రోల్ తమ చేతిలో లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారని, కానీ రిమోట్ అవసరం లేకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మతరాజ్యంగా మార్చే ప్రమాదముందని హెచ్చరించారు. బీజేపీ రాజ్ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు యువత భగత్‌సింగ్, చేగువేరా లాంటి విప్లవ కిశోరాల్లాగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు రాజా ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమంలో ఎక్కడున్నాయ్? బ్రిటిష్ పాలనను కూలదోసేందుకు స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాడారని రాజా గుర్తు చేశారు. ఇప్పుడు గొప్ప దేశభక్తులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీలు నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బ్రిటిష్ వారితో చేతులు కలిపిన ఆర్ఎస్ఎస్కు అసలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాత్రే లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని.. అచ్చే దిన్ అదానీ, అంబానీలకే వచ్చాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వారికే కట్టబెడుతున్నారని.. దేశ సంపద, ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఏం మిగలుతుందని ప్రశ్నించారు. సభలో సీపీఐ రాజ్యసభ సభ్యులు బినొయ్ విశ్వం, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. -
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ కాదు: భగవత్
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు. -
Mohan Bhagwat: 80 శాతం నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవి
నాగ్‌పూర్: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్‌కు కేటాయించిన నిధుల్లో 80 శాతం రాజకీయ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, కాశ్మీర్ లోయ కోసం కేటాయించిన 80 శాతం నిధులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. కేటాయించిన నిధులు ప్రజలకు చేరలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా పొందుతున్నారని తెలిపారు. తాను జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి ప్రస్తుత అక్కడ ఉన్న పరిస్థితిని చూశానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. గతంలో జమ్మూ, లడఖ్‌పై తీవ్రమైన వివక్ష ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి వివక్ష లేదని పేర్కొన్నారు. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను అందించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
అడుక్కోవడానికి వెళ్లాలి.. ఆదివారం సెలవివ్వండి: ఇంజనీర్
భోపాల్: సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనే.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెడతాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ లీవ్లెటర్ని చూస్తే.. ఇదేందిరా భయ్ ఇలాంటి వాటికి కూడా సెలవు అడుగుతారా అనిపిస్తుంది. ఆ వెరైటీ లీవ్‌లెటర్ వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ యాదవ్ ఈ వింత లీవ్ లెటర్ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా అని రాజ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు.. అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. (చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’) వారిని షాక్‌కు గురి చేసిన ఆ సమాధానం ఏంటంటే.. తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నాని తెలిపాడు. అంతేకాక తనలోని అహాన్ని చెరిపివేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్‌కుమార్. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పూర్వ జన్మలో రాజ్‌కుమార్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్ భగవత్ శకుని మామ అట. గత జన్మలో వీరు ఇద్దరు రాజ్‌కుమార్ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. (చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..) ఇక ఈ లేఖ చదివిన రాజ్‌కుమార్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, “ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’’ అని రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్ లెటర్‌పై నెటిజనులు ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. In Agar Malwa of Madhya Pradesh, a sub-engineer has written a leave application to his superior saying that he gained recollection of his past life and wanted to do Bhagavad Gita paath to know more about his life & also beg alms to erase ego every Sunday pic.twitter.com/qOmMpyZB9j — ANI (@ANI) October 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం -
నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విపక్షాల నుంచి అన్ని వైపుల నుంచి దాడిని ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై నేడు ఢిల్లీలో జరిగే కీలక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా సుమారు 10మంది కీలక నాయకులు హాజరు కానున్నారు. అందులో పలువురు బీజేపీ నేతలు సైతం ఉండే అవకాశాలున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే, కృష్ణ గోపాల్, సురేష్ సోని, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకుని కసరత్తులు మొదలుపెట్టారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు దేశంలోని పరిస్థితులపై సంఘ్ ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. బెంగాల్లో పరిస్థితి ఏంటి? ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్ ఎన్నికలలో ఓటమి, బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏ దిశలో ముందుకు వెళ్ళాలనే విషయంపై చర్చించనున్నారు. బెంగాల్లో ఓటమితో నిరాశలో ఉన్న కమలదళంలో తిరిగి ఉత్తేజం నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఒక ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మరోవైపు, టీఎంసీని వదిలి ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చిన నాయకులు తిరిగి టీఎంసీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి. యూపీలో మార్పు సాధ్యమేనా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజకీయ ప్రతిష్టంభనను తగ్గించడంతో పాటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన ఎమ్మెల్యేల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కుల ప్రాతిపదికన ఆరోపించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ముఖ్యమంత్రి మధ్య విబేధాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయనే చర్చ జరుగుతోంది. అంతేగాక కేశవ్ ప్రసాద్ మౌర్యకు వచ్చే ఏడాది రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను అప్పగించడంతో పాటు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే విషయంలో బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో, రాబోయే ఎన్నికల్లో బిజెపి ఎలా విజయం సాధిస్తుందనేది పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో నేటి ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో ఒక స్పష్టత కోసం ప్రయత్నం జరగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. డ్యామేజ్ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి: మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం తన విశ్వసనీయతను ఎందుకు కోల్పోయింది. కరోనాతో వ్యవహరించడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? కేంద్ర మంత్రివర్గంలో మార్పు వల్ల పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా వంటి అంశాలపై జరుగుతున్న చర్చకు ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశం సంక్రమణ పట్టులో చిక్కుకున్న సమయంలోనూ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు బెంగాల్లో ప్రచారంపై దృష్టిపెట్టడంపై వచ్చిన విమర్శలతో జరిగిన డ్యామేజీని చక్కదిద్దే ప్రయత్నం ఈ భేటీలో జరుగనుందని సమాచారం. అంతేగాక ఇటీవల పలు టీవీ ఛానల్స్ నిర్వహించిన సర్వేల్లో ప్రధాని మోదీ, అమిత్ షా విశ్వసనీయత తగ్గిందని జరుగుతున్న చర్చ కమలదళంపై ప్రభావాన్ని చూపకముందే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందు కు సంఘ్–బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో శనివారం జరుగుతున్న ఈ భేటీలో చర్చించే అంశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కమలదళం అధికారంలోకి వచ్చిన చాలా కాలం తరువాత బీజేపీ విశ్వసనీయతను కాపాడే పనిలో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇప్పుడు బిజీగా ఉన్నారు. రాష్ట్రాల్లో, కేంద్రంలో ఉన్నపళంగా కీలక మార్పులు చేసిన పక్షంలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైతు ఉద్యమం ఇంకెన్నాళ్లు? దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 6 నెలలకు పైగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం బీజేపీ–ఆర్ఎస్ఎస్కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఉద్యమాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే రైతులు విసుగు చెంది ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగదని, అది విచ్ఛిన్నమవుతుందని కేంద్రప్రభుత్వం భావించింది. కానీ అది జరగలేదు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడే, ఇళ్ళకు తిరిగి వెళ్తామని రైతులు ఇప్పటికే స్పçష్టంచేశారు. కాగా ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో ముఖ్యమంత్రి, మంత్రుల బహిరంగ కార్యక్రమాలను సైతం రైతులు నిషేధించారు. కొన్ని రోజుల క్రితం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ప్రధానిని కలిసి ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ భేటీలో బీజేపీ ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు పుంజు కుంటున్నాయి. కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అనేకమంది వైద్యులు, ఇతర సెలబ్రిటీలు కోవిడ్-19 వైరస్ సోకుతోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. అయితే తేలికపాటి లక్షణాలతో నాగ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ భగవత్ ఆరోగ్యంపై సమాచారాన్ని పోస్ట్ చేసింది. మార్చి 7న ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. కాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల నమోదు భారీగా ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం తాజాగా1,45,384 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మరో 794 మంది మరణించారు. RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat today tested Corona positive. He has normal symptoms and admitted to Kigsway hospital Nagpur. — RSS (@RSSorg) April 9, 2021 -
ప్రముఖ నటుడి నివాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్‌ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్‌ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగాల్‌కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: 2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! -
అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’
ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్ కలెక్టర్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. (చదవండి: పేగుబంధం 'అన్వేషణ') వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్షిప్లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. -
వివక్ష వద్దు.. 130 కోట్ల జనం మనోళ్లే!
నాగ్‌పూర్: దేశం యావత్తూ మహమ్మారి కరోనాతో పోడుతుంటే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి వివక్షా లేకుండా బాధితులందరికీ సహాయం చేయాలని ఆర్ఎస్ఎస్ శ్రేణులను కోరారు. అదేవిధంగా దేశం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగ్‌పూర్ నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్లైన్లో తన సందేశం వినిపించారు. (చదవండి: ఆ రైలు అదే.. కిమ్ అక్కడే ఉండొచ్చు!) దేశంలో ఉన్న 130 కోట్ల మంది భరతమాత బిడ్డలేనని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భరతమాతను ముక్కలు చేస్తున్నామంటూ కొందరు ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తారని, వాటిల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చేసే తప్పిదాలకు మొత్తం సమాజాన్నే నిందించడం మంచిది కాదని తబ్లిగీ ప్రార్థనలను ఉద్దేశించి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. (చదవండి: బుసలు కొడుతున్న కరోనా) -
ఆరెస్సెస్ చీఫ్‌పై హీరోయిన్ ఫైర్!
న్యూఢిల్లీ: విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు. ‘‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సోనం కపూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్ అయ్యారు. -
'ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలుబొమ్మ కాదు'
మొరాదాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దేశంలో నైతికత, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందకు మాత్రమే పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మొరాదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా మొరాదాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా తాము పరిగణలోకి తీసుకోమని, గత 60 సంవత్సరాలుగా దేశ అత్యున్నత విలువలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కన్నా 130 కోట్ల మంది భారతీయుల నైతిక విలువలే తమకు ముఖ్యమని, వారికోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ చేతిలో ఆర్ఎస్ఎస్ ఒక కీలు బొమ్మ అంటూ వచ్చిన ఆరోపణలను భగవత్ ఖండించారు. 1925 లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడు చాలా కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే ప్రారంభమయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కాలక్రమంలో మా సంస్థ దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావంతో ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితమే ప్రసుత్తం దేశవ్యాప్తంగా 1.3 లక్షల సభ్యత్వాన్ని ఆర్ఎస్ఎస్ కలిగి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భగవత్ వెల్లడించారు. దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి మేధావులు, సామాజిక సంస్కర్తలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమ భావజాలంలో పుణికిపుచ్చుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని అన్నారు. రష్యా, చైనా, అమెరికా దేశాలు అభివృద్ధి పరంగా శక్తివంతమైన దేశాలుగా ముందుకు సాగుతున్నప్పటికి వాటి వల్ల ఇతర దేశాలకు కలుగుతున్న సమస్యలను చూస్తుంటే వారు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని వివరించారు. గంటపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ భగవత్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. -
భారతీయులందరూ హిందువులేనా?
ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తమ తమ దేవుళ్లతోపాటు, భారతమాతను పూజిస్తే చాలు.. వీరంతా హిందువులే అవుతారని ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్ సదస్సులో ప్రకటించారు. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అంటూ సూత్రీకరించారు. ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని కోరుకోరని చెప్పడం ద్వారా ఆయన కౌటిల్యుడిని, మనువును, సావర్కార్‌ని, హెగ్డేవార్‌ని, గోల్వాల్కర్‌ని కూడా దాటి ముందుకు వచ్చేశారు. అయితే రాజ్యాధికారం కోసం కాకపోతే బీజేపీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్న మోహన్ భగవత్ కొత్త సిద్ధాంతంపై చర్చ జరగాల్సి ఉంది. శాంతి, అహింసల ప్రబోధకుడిగా ప్రపంచమంతటా గుర్తించిన జీసస్ క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ, హిందువులు, హిందూయిజం పూర్తిగా భిన్నమైనవని నిర్వచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని 130 కోట్లమంది ప్రజలు హిందువులేనట. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అన్నారు. అంటే తమ తమ విశ్వాసాల మేరకు తమ దేవుడిని పూజించే, ప్రార్థించే భారతీయులందరూ ఇకనుంచి ఆర్ఎస్ఎస్ సృష్టించి, ప్రచారం చేస్తున్న భారతమాతను కూడా తమ దేవతగా తప్పకుండా పూజించాలన్నమాట. ఆయన చెప్పిందాన్ని బట్టి, ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తదితరులందరూ రెండు శక్తులను (ఒకరు తమ దేవుడు, మరొకరు దేవత అయిన భారతమాత) పూజించాల్సి ఉంటుంది. జాతీయ పౌర పట్టికలో కానీ, పాఠశాలలో కానీ, మరే ఇతర రికార్డులో కానీ మతం అనే కాలమ్‌లో భారతీయులు తప్పనిసరిగా ఇకనుంచి ముస్లిం–హిందూ, బుద్ధిస్టు–హిందూ, క్రిస్టియన్–హిందూ, సిక్కు–హిందూ, పార్శీ–హిందూ అని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు తమ పవిత్ర గ్రంథం, తమదైన ఆహార సంస్కృతిని, తమ వివాహ వ్యవస్థను అనుసరించవచ్చు. అయితే ఈసారి మాత్రం మోహన్ భగవత్ దేశపౌరులందరూ ఆవును పూజిం చాలని, గొడ్డు మాంసం తినడం ఆపివేయాలని తన ప్రసంగంలో చెప్పలేదు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇస్లాం లేక క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం లేక సిక్కిజం మరే ఇతర మతంలో అయినా చేరినా లేదా చేరాలని తలుస్తున్నవారు తప్పకుండా తమ మతంలో విడదీయరాని విధంగా హిందూ అనే పదాన్ని చేర్చాలన్నది ఆయన ప్రసంగ సారాంశం. సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్ తదితరులు హిందుత్వకు ఇచ్చిన గత నిర్వచనాల నుంచి మోహన్ భగవత్ వేరుపడ్డారు. గతంలో హిందుత్వ లేక హిందూయిజం కాస్త విభిన్నార్థంలో కని పించేది. కాని ఇప్పుడు ఆయన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించేశారు. ఈ క్రమంలో రాజకీయ సైద్ధాంతిక విషయాన్ని సైతం ఆయన తీసివేశారు. ఇది ముస్లింలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులను కలుపుకోవడానికి అవకాశమిస్తుందని ఆయన అభిప్రాయం. ఇది పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. వలస వచ్చిన ముస్లింలు లేక శరణార్థులు తమ పేర్లకు ముస్లిం–హిందూ అని చేర్చుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు అరబిక్ భాషలో అల్లా అని ప్రార్థించవచ్చు. కానీ ప్రార్థన ముగింపులో మాత్రం తప్పకుండా భారత్ మాతా కీ జై అని చెప్పాల్సి ఉంటుంది. కౌటిల్యుడు, మనువు తర్వాత హిందూ తత్వశాస్త్రానికి సంబంధించిన అతి గొప్ప సిద్ధాంతవేత్తగా మోహన్ భగవత్ ఆవిర్భవించారు. కౌటిల్యుడు, మనువు తమ సొంత సైద్ధాంతిక రచనలైన అర్థ శాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించడం ద్వారా మౌర్య చంద్రగుప్త, పుష్యమిత్ర శుంగ సామ్రాజ్యాలను స్థాపించారు. తమ సిద్ధాంతాలతో చంద్రగుప్తుడిని, పుష్యమిత్రుడిని అధికారంలోకి తెచ్చిన కౌటిల్యుడు, మనువు లాగే మోహన్ భగవత్ కూడా నరేంద్రమోదీని అధికారంలోకి తెచ్చారు. నరేంద్రమోదీ తర్వాత తాను జీవించి ఉన్న కాలంలోనే అమిత్ షా కూడా దేశ ప్రధాని కావచ్చు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీ సాధించిన మెజారిటీ కానీ, కేంద్రంలో రెండు దఫాల పాలన కానీ మోహన్ భగవత్ తాత్విక వ్యూహాత్మక చేర్పుగానే చెప్పాలి. హైదరాబాద్ సదస్సులో తన నూతన సిద్ధాంతాన్ని విస్తరించి చెప్పినట్లుగా మోహన్ భగవత్ అభిప్రాయం మేరకు, ప్రపంచంలోని మానవులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరందరికీ మూడు రకాలైన లక్షణాలు ఉంటాయి. అవి ‘తమో, రజో, సత్వ’ గుణాలు. తమోగుణం కలిగినవారు తాము విషాదంలో ఉంటూ ఇతరులనూ విషాదంలో ముంచెత్తుతుంటారు. వీరు హింసను ప్రేరేపించినప్పటికీ విజయం సాధించలేరు. అంతిమంగా వీరు ప్రతి ఒక్క అంశాన్నీ విధ్వంసం చేస్తారు. ఇక రజోగుణానికి చెందినవారు తమ ప్రయోజనాలకు చెందిన పనులను మాత్రమే చేపడుతుంటారు. తాము సంపన్నులు కావడానికి, తమ సొంత ప్రతిష్టలకు వీరు ఇతరులను ఉపయోగించుకుంటుంటారు. కాగా సంఘ్ పరివార్, భారతదేశం ధర్మ విజయాన్ని (సత్వ గుణాన్ని) నమ్ముతుంటాయి. ఈ ధర్మపాలనలో ప్రజలు ఇతరుల సంతోషం కోసం, శ్రేయస్సు కోసమే వీరు జీవి స్తుంటారు తప్ప స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని లేక మరి దేన్ని కూడా తమకోసం కోరుకోరు’’ (ది హిందూ 2019 డిసెంబర్ 28) ఇది ఎంత అత్యున్నతమైన సృజనాత్మక సిద్ధాంతం అంటే.. స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని రెండింటినీ సాధించడానికి నేరాలకు, హింసలకు పాల్పడుతూనే స్వర్గంపై, రాజ్యాధికారంపై విశ్వాసం నుంచి విశ్వాసులను కాపాడుతూ వస్తోంది. ఈ రెండు వ్యవస్థలూ మారణకాండకు దారితీసిన హింసను ప్రేరేపిస్తూ వచ్చాయి. ఇంతవరకు పవిత్ర ముస్లింలుగా, పవిత్ర క్రిస్టియన్లుగా, పవిత్ర బౌద్ధులుగా, పవిత్ర సిక్కులుగా చెప్పుకుంటూ జీవిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఈ జీవితంలో మరణం తర్వాత, రాజకీయాధికారం పొందిన తర్వాత స్వర్గాన్ని కోరుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్లందరూ హింసకు పాల్పడుతూనే వచ్చారు. అయితే తొలిసారిగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాన్నీ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. పైగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలకుమల్లే స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలనే కోరిక నుంచి బయటపడాలనే వారు తమ తమ మత చిహ్నాలతో పాటు హిందూ ట్యాగ్‌ను కూడా చేతపట్టాల్సి ఉంటుంది. హిందూయిజంలోకి మారాలని కానీ లేక తన హిందూ మతం నుంచి వేరొక మతంలోకి మారిన వారు ఘర్‌వాపసీలో భాగంగా మళ్లీ హిందూమతంలోకి మారాలని కానీ మోహన్ భగవత్ ఇప్పుడు ఎవరినీ కోరలేదు. దీనికి బదులుగా వీరందరూ తమ మతానికి అదనంగా హిందూ ట్యాగ్‌ను చేర్చుకుంటే చాలు. అయితే ఇక్కడ మనకు తట్టే ప్రశ్నల్లా ఏమిటంటే.. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాకపోతే భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? పాపకార్యాలుగా తాను భావిస్తున్న లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజ కీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? ఆరెస్సెస్ తన 95 ఏళ్ల జీవితకాలంలో తమో, రజోగుణ కార్యాచరణలో ఎన్నడూ పాల్గొనలేదని ప్రపంచానికి మోహన్ భగవత్ నొక్కి చెబుతున్నారు. లేక ధర్మ కాలంలోలాగా 2014కి ముందు ఆరెస్సెస్ ఘర్షణల చరిత్రను ఆయన గుర్తిం చడం లేదు. హిందువులకు స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలోనే మోహన్ భగవత్ ధర్మంలోని మౌలిక సారాంశం దాగి ఉంది. అందుచేత ఆయన ప్రస్తుత మాటలు గౌతమబుద్ధుడి కంటే మించిన రాడికల్ స్వభావంతో ఉంటున్నాయి. ప్రాచీన హిందూ పురాణాలు మనకు చెబుతూ వచ్చినట్లుగా తమో, రజో గుణం కలిగినవారు భారతదేశంలో లేరని భగవత్ నూతన హిందూ సిద్ధాంతం చెబుతోంది. వారు భారతదేశంలోని దిగువ కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు చెందినవారు కారనీ వారంతా భారత్ బయటే ఉంటున్నారని ఈ సిద్ధాంత భావన. అయితే భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోనట్లయితే అప్పుడు వారిని తమో, రజో, గుణ సంపన్నులుగా గుర్తించవచ్చు. ఈ రకమైన వరివర్తనకు మోహన్ భగవత్ తగినంత పరిధిని ఇచ్చారు. ఇదీ మోహన్ భగవత్ నూతన భారతదేశం. ఈ జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక భారీ డిజైన్ని సూచిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ప్రవచించిన సిద్ధాంతాన్ని పలురకాలుగా వ్యాఖ్యానించవచ్చు, పునర్ వ్యాఖ్యానించవచ్చు కూడా. ఇప్పటికే మీడియా ఆయన సిద్ధాం తాన్ని చాలా ప్రముఖంగా నివేదించింది. టీవీ చానల్స్ ఆయన ప్రసంగాన్ని విస్తృతంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర మతాలకు చెందిన మేధావులు, లౌకిక మే«థావులు, పాశ్చాత్య విద్యా పండితులు ఆయన సిద్ధాంతం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్యషెపర్డ్; డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
విద్యను సమాజ సేవకు ఉపయోగించాలి
రాజేంద్రనగర్: మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. విద్యను స్వార్థం కోసం కాకుండా దేశ రక్షణ, సమాజ సేవ కోసం ఉపయోగించాలని సూచించారు. ఆదివారం బండ్లగూడ జాగీరులోని శారదా ధామంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ జాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయవద్దని సూచించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. సరస్వతి విద్యా మందిరాలు వ్యాపార ధోరణితో విద్యను బోధించడం లేదని.. సమాజ, దేశ సేవ కోసం బోధిస్తున్నాయని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో భారతదేశం అన్ని దేశాలకు దిక్సూచిగా ఉందని కొనియాడారు. దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విద్యా పీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు. అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యారణ్య స్కూల్ భవనానికి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సీబీఆర్ ప్రసాద్ రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్మించనున్న పాఠశాలకు రూ.12.5 కోట్ల విలువైన భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వర్, పారిశ్రామికవేత్త ఎంఎస్ఆర్వీ ప్రసాద్, సేవిక సమితి ప్రధాన కార్య దర్శి అన్నదాన సీతక్క తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు.. సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్ నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పూర్తి నివేదికను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు నిర్వహకులకు అందిస్తున్నట్లు విద్యార్థి సమ్మేళనం సభ్యులు వెల్లడించారు. -
సమాజాభివృద్ధికి కృషి చేయాలి
హైదరాబాద్: మనం సంపాదించిన దాంట్లో మనకు అవసరమైనంత ఉంచుకుని మిగతాది.. ఆ సంపదను ఇచ్చిన సమాజానికి ఖర్చు చేసినపుడే మనిషి జీవితం సార్థకమైనట్లు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధి వట్టినాగులపల్లి శివారులో ఉన్న అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఎన్సీసీ సమష్టి సేవా పురస్కార్ ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పురస్కారంతో పాటు రూ.కోటి చెక్కును తన చేతుల మీదుగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజానికి డబ్బు, సమయం ఇచ్చి సమాజాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి విద్య, వైద్యంతో పాటు అనేక మౌలిక సదుపాయాలను కల్పించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సంపన్నులు తీసుకోవాలని సూచించారు. ఈ సమాజంలో కోట్లాది మంది గుప్త దానాలు చేసే నిస్వార్థపరులు ఉన్నారని, సేవ చేసినంత మాత్రాన ఎక్కువగా, పొందినంత మాత్రాన తక్కువగా భావించవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సేవ చేస్తారని, వారు సెలవులో ఉంటే వాటిని పక్కన పెడతారని, తమ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా కార్యక్రమాలకు సెలవే లేదన్నారు. ఆర్ఎస్ఎస్కు ప్రతిఫలం ఆశించే గుణం లేదని, కేవలం సేవ చేయటమే తమ విధిగా భావించి ముందుకు వెళ్లటంతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు వివరించారు. అదే సేవా నిరతితో పాటు వేదం, ఉపనిషత్తులతో నడుస్తున్న భారత్ ఎప్పటికైనా విశ్వగురువు కావటం ఖాయమన్నారు. దేశానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే భారతరత్న అవార్డు గ్రహీత నానాజీ దేశ్‌ముఖ్ 1968లోనే దీన్‌దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఎన్సీసీ చేపడుతున్న నిర్మాణాలు, దీన్‌దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్సీసీ సంస్థ చైర్మన్ హేమంత్, వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఏవీఎస్ రాజు, ఎండీ రంగరాజు, డైరెక్టర్ ఏవీఎన్ రాజుతో పాటు మాజీ డీజీపీ అరవింద్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆరెస్సెస్ చీఫ్‌పై కేంద్ర మంత్రి విమర్శలు!
-
ఆరెస్సెస్ చీఫ్‌పై కేంద్ర మంత్రి విమర్శలు!
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయులంతా హిందువులే అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు హాజరైన విషయం విదితమే. ఈ క్రమంలో మోహన్ భగవత్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... భారత్‌లో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు, సంప్రదాయలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ దృష్టిలో 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనని పేర్కొన్నారు. (చదవండి : భరతమాతను ఆరాధించేవారంతా హిందువులే) ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సామాజిక న్యాయ శాఖా మంత్రి రాందాస్ అథవాలే.. మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘భారతీయులంతా హిందువులేనని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఒకప్పుడు మన దేశంలో బుద్ధులు మాత్రమే ఉన్నారు. హిందుత్వ ఆవిర్భవించిన తర్వాతే మన దేశం హిందూ దేశంగా మారింది. నిజానికి భారత్‌లో ఉన్న వాళ్లంతా భారతీయులేనని మోహన్ భగవత్ చెప్పి ఉంటే బాగుండేది. మన దేశంలో బుద్ధులు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, లింగాయత్‌లు ఉన్నారు. వేర్వేరు మత విశ్వాసాలు గల వారు ఇక్కడ నివసిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు రాందాస్ అధ్యక్షుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. భారత్‌లో కేవలం ఒక మతం మాత్రమే ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోందని.. అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. Union Min Ramdas Athawale on Mohan Bhagwat's remark '130 cr population of India as Hindu society': Not right to say all are Hindus.There was a time when everyone was Buddhist in our country. When Hinduism came, we became a Hindu nation. If he means everyone is ours then it's good pic.twitter.com/bXWIsHhDbU — ANI (@ANI) December 26, 2019 -
ముగిసిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
-
దుర్జనులకు భయం సజ్జనులకు ప్రేమ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ‘మన శక్తిని చూస్తే దుర్జనులకు భయం కలుగుతోంది. సమాజ శ్రేయస్సు కోరే సజ్జనుల్లో ప్రేమ పుడుతుంది’అని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో దేశ భక్తి పెంపొందించేలా పని చేయాలని కరసేవకు లకు పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల మున్సి పాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లా డుతూ.. సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వమే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. ప్రవర్తన, భాష, సమాజహితం కోరే ఆలోచ నలు స్వయం సేవకులకు ముఖ్యమని, వాటి ని తెలియజేసే విధానం కార్య విస్తర ణలో కీలకమని, వీటిని ఎప్పుడూ విస్మరించ కూడ దని చెప్పారు. శిబిరం, సార్వజనికోత్స వం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిం చారు. ఇదే స్ఫూర్తితో స్వయం సేవకులు తమ కార్య క్షేత్రాల్లో పని చేయాలని ఆకాంక్షించారు. నేను చీఫ్‌ను కాదు..: ‘బయట నన్ను అందరూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు. నేను మీకు చీఫ్‌ను కాదు. మీరు నియమించుకున్న వ్యక్తిని’అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దండాలు పెట్టడం, దండలు వేయడం, ఫొటో ఫ్లెక్సీలు పెట్టడం హిందూ సమాజ సంస్కృతి కాదని చెప్పారు. ఇతర సంఘాలకు, ఆర్ఎస్ఎస్కు తేడా ఉందని, మనకంటూ ప్రత్యేకత ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, హిందు సమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారతీయ సహసర్ కార్యవాహ్ ముకుందా, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యామ్‌కుమార్, దూసి రామకృష్ణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డీకే ఆరుణ, విజయ రామారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి భోజనం.. మోహన్ భాగవత్‌తో పాటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులకు కూడా ఒకే రకమైన భోజనం వడ్డించారు. అందరూ సాధారణ కార్యకర్తలతో కలిసే భోజనం చేశారు. ఆహార పదార్థాలు వృథా కాకుండా ప్రతి ఒక్కరు భుజించడం ప్రత్యేకంగా కన్పించింది. కాగా, శిబిరం ముగింపు కార్యక్రమం వేదికపై మోహన్ భాగవత్‌తో పాటు దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్‌చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి ఉన్నారు. అయితే మోహన్ భాగవత్ ఒక్కరే ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా.. మూడు రోజుల పాటు భారత్ కళాశాలలో సంఘ్ కార్యకర్తలు వసతి పొందారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన 7,940 స్వయం సేవకులు, మరో వెయ్యి మంది ప్రబంధకులు కలసిమెలసి ఉన్నారు. శిబిరం ముగియడంతో వారంతా తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ ప్రాంగణంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు చక్కటి నడవడిక, సమయ పాలన పాటించడాన్ని చూసి ఆహూతులు మంత్రముగ్ధులయ్యారు. విజయ సంకల్ప శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు -
మనసంతా భరతమాత
-
నిందలను లెక్క చేయం... ఉండేది ప్రేమ భావమే
ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. – మోహన్ భాగవత్ సాక్షి, హైదరాబాద్ : ‘పేరు కోసం పాకులాడం, స్వార్థం కనిపించదు. ధన్యవాదాలను కూడా ఆశించం. ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. ఈ ప్రయాణంలో మాపై ఎన్ని నిందలు వచ్చినా.. ఎన్ని విమర్శలు ఎగసిపడ్డా లెక్క చేయం. అప్పుడప్పుడూ వాటికి స్పందిస్తూ మేం కొన్ని మాటలు అనొచ్చు.. కానీ మనసులో మాత్రం ప్రేమ భావమే ఉంటుంది. అందులో భరతమాతే కన్పిస్తుంది’అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్, సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమస్త హిందూ సమాజాన్ని బాగు చేసే లక్ష్యంతో సంఘ్ ముందుకు సాగుతోందని, ఇందులో ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా కాగడాను తలకిందులు చేసినా, అందులోని మంట ఊర్ధ్యముఖంగా ఉన్నట్లే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజులపాటు జరిగే విజయ సంకల్ప శిబిరంలో భాగంగా రెండో రోజైన బుధవారం సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన సార్వజనీన సమ్మేళనంలో ఆయన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను స్పృశిస్తూ సంఘ్ మూల సూత్రాన్ని వివరిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. సార్వజనీన సమ్మేళనానికి భారీగా హాజరైన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్య, శాఖల విస్తరణే లక్ష్యంగా పాతికేళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ సభ నిర్వహించింది. ఈ సభకు పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, వివిధ శాఖల ముఖ్య ప్రచారక్‌లు దక్షిణామూర్తి, రామకృష్ణారావు, సుందరయ్య, పానగిరి సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, మంగేశ్, సుహాసన్రావు, తిప్పే స్వామిజీ, సుధీర్జీ, శ్యామ్‌ప్రసాద్, సీఆర్ ముకుంద్జీలు హాజరయ్యారు. మనసు నిండా భరతమాతే.. తన కంటే సమాజమే ముఖ్యమని, దాన్ని ప్రగతి పథంలో ఉండాలని కోరుకునే వారి అవసరం ఇప్పుడు ఉందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. స్వాభిమానంతో సంఘటితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే హిందూ సమాజాన్ని నిర్మించటమే సంఘ్ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పయనంలో సత్ఫలితం సాధించినప్పుడే ఆర్ఎస్ఎస్ విజయం సాధించినట్టని చెప్పారు. ‘ఈ భూమి నాది.. దాని శ్రేయస్సే నా శ్రేయస్సు అన్న భావనతో.. ఎలాంటి భేదభావం లేకుండా సమస్త ప్రజలు నావాళ్లు అన్న అభిప్రాయంతో.. భరతమాతనే ఆరాధ్య దైవంగా భావించే వారు హిందువులు’అని తేల్చిచెప్పారు. చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు ఎవరినైనా ఆదర్శంగా తీర్చిదిద్దటమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. నిత్యం ఓ గంట పాటు సంఘ్ కార్యకలాపాల్లో ఉండటమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని సమాజం కోసం అర్పిస్తూ స్వయం సేవకులు ముందుకు సాగుతున్నారని కితాబిచ్చారు. దేవీదేవతల పూజలు పక్కన పెట్టి కేవలం భరతమాత ఆరాధనతో మాతృభూమి కోసం పనిచేస్తేనే మన దేశం విశ్వగురువు స్థానంలో నిలుస్తుందన్న వివేకానంద మాటలను తు.చ. తప్పకుండా పాటించేందుకు, ఆ మార్గంలో తాము పయనిస్తున్నామని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలు కీచులాడుకుని నాశనమవుతారని దేశం విడిచి వెళ్లేటప్పుడు ఆంగ్లేయులు భావించారని, కానీ అలా ఎన్నటికీ జరగదని, ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఏకత్వం వైపు సాగే ఉపాయాన్ని కనిపెడతారని ఆ ఉపాయం పేరే హిందుత్వమని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటలను గుర్తుచేశారు. భారత్‌ను గొప్ప దేశంగా తీర్చిదిద్దటం ఏ రాజకీయ శక్తి వల్లో.. మరే శక్తి వల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. సమాజాన్ని ఏకత వైపు నడిపించేలా చేసినప్పుడే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఆ శక్తులకు చోటులేదు సమాజంలో తామే సర్వం అనుకుంటూ ఇతరులను హింసిస్తూ, అప్పుడప్పుడూ తాము కష్టపడుతూ, తోటివారిని కష్టపెడుతూ సాధించే రాక్షస విజయాలు అవసరం లేదని పేర్కొన్నారు. అన్నీ తమకే కావాలంటూ ఇతరులను కష్టపెడుతూ తమ విజయం కోసం విధ్వంసాలకు తెగించే వారి ధన విజయాలూ తమకొద్దని, ఈ రెండు శక్తులకు హిందూధర్మంలో చోటు లేదని పేర్కొన్నారు. తమ కోసం కాకుండా ఇతరుల సౌఖ్యం కోసం పనిచేసే వారు సాధించే ధర్మ విజయాలు తమకు ముఖ్యమని, అలాంటి విజయాల కోసమే ఆర్ఎస్ఎస్ కష్టపడుతోందని స్పష్టం చేశారు. మనసులో తమోరజ గుణాల ప్రభావం ఉన్నా, ధర్మ భావంతో వాటిని జయిస్తున్నట్లు వెల్లడించారు. సమాజానికి ఈ లక్షణం చాలా అవసరమన్నారు. సమ్మేళనంలో కిషన్‌రెడ్డి, రాంమాధవ్, డీకే అరుణ తదితరులు రాజకీయాల ప్రస్తావనే లేకుండా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ వేల మంది సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే ఏవో రాజకీయపరమైన ఘాటు విమర్శలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. జాతీయ జనాభా జాబితా, జాతీయ పౌరుల జాబితా లాంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మోహన్ భాగవత్ మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధగా గమనించటం సహజం. కానీ వేలమందితో ఉన్న సభా వేదికమీదుగా దాదాపు అరగంట పాటు ప్రసంగించినా ఒక్కటంటే ఒక్క పదం కూడా రాజకీయ పార్టీలపై లేకపోవటం గమనార్హం. పరోక్షంగా కూడా ఏ పార్టీ వ్యవహారాన్ని ఎత్తిచూపకుండా కేవలం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలపైనే మాట్లాడటం విశేషం. సరిగ్గా ఆయన ప్రసంగ సమయానికే మత పెద్దల సమక్షంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. బహిరంగ సభలో పాల్గొన్న వారిలో ఈ అంశం ప్రస్తావన కూడా వినిపించింది. కానీ మోహన్ భాగవత్ మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తప్ప మరో అంశం జోలికే వెళ్లలేదు. ఆర్ఎస్ఎస్ పైన వచ్చే విమర్శలను కూడా రేఖా మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం విశేషం. సమ్మేళనంలో పాల్గొన్న విజయరామారావు, పెద్దిరెడ్డి, మురళీధర్‌రావు, లక్ష్మణ్, చింతల తదితరులు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి: బీవీఆర్ మోహన్‌రెడ్డి విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నిజాయితీ, క్షమాగుణం ఇలా అన్ని తన తల్లి వద్దే నేర్చుకున్నానని ప్రముఖ వ్యాపారవేత్త బీవీఆర్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విలువలు మాత్రమే మనిషిని విజయపథం వైపు నడిపిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఏది మంచో, ఏది చెడో తెలపాలని సూచించారు. మన ప్రవర్తనే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఏదో ఒకటి చదవాలని, పరిస్థితిని బట్టి, అర్థం చేసుకుని, అందుకనుగుణంగా నడుచుకుం టేనే విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే పెద్ద ఎన్జీవో అని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు దేశ ప్రజల ఐక్యతను పెంపొందిస్తోందని పేర్కొన్నారు. సంఘ్సేవకులతో భాగవత్.. ఇబ్రహీంపట్నం రూరల్: సమాజం సంఘటితానికి సంఘ్ కార్యకర్తలు పనిచేయాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ స్వయం సేవకులకు సూచించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం బుధవారం మధ్యాహ్నం వరకు జరిగింది. మంగళవారం రాత్రి శిబిరానికి చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భారత్ కాలేజీలోనే బస చేశారు. ఉదయం 4 గంటలకు సాధారణ కార్యకర్తలతో పాటే కరసేవ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు శిబిరంలో 2 వేల మంది కార్యకర్తలతో సమావేశమయ్యారు. 10 గంటల నుంచి 11.30 గంటల వరకు యాదాద్రి శిబిరంలో మరో 2 వేల మంది సంఘ్ సేవకులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సాధారణ కార్యకర్తలతో భాగ్యలక్ష్మినగర్ శిబిరంలో భోజనం చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని సభకు మంగళ్‌పల్లి శిబిరం నుంచి 196 బస్సుల్లో కార్యకర్తలు తరలిపోయారు. భారత్ కళాశాల నుంచి మోహన్ భాగవత్ 2.45 గంటలకు బయల్దేరారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బ్లాక్ క్యాట్ కమాండోలతో పటిష్టమైన బందోబస్తు మధ్య సరూర్‌నగర్ స్టేడియానికి వెళ్లారు. కదం కదం కదుపుతూ.. స్వయం సేవకుల భారీ కవాతు.. సాక్షి, హైదరాబాద్/మీర్‌పేట: తెలుపు.. ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో స్వయం సేవకులు భారీ కవాతు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కిసాన్ సంఘ్, ఏబీవీపీలకు చెందిన 7705 మంది స్వయం సేవకులు హస్తినాపూర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఇబ్ర ïహీంపట్నం ప్రధాన రహదారులపై కవాతు నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ చేరుకున్నారు. అటు నుంచి 5 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ఈ సభకు తెలం గాణ జిల్లాల నుంచి స్వయం సేవకులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిసిపోయింది. స్వయం సేవకులు ప్రదర్శించిన దండవ్యాయామం, వీరవజ్రాసనం, ఉపనిష్ట వ్యాయామాలు సభలో హైలెట్‌గా నిలిచాయి. వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, ఝాన్సీలక్ష్మీభాయ్, బీఆర్ అంబేడ్కర్ల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
‘తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలమైన శక్తి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. బర్కత్‌పుర కేశవ నిలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని రమేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 1600 క్లస్టర్లు ఉన్నాయని.. అన్ని క్లస్టర్లకు ఆర్ఎస్ఎస్ చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు. భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. దీనికి ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో పాటు, వక్తగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని రమేష్ తెలిపారు. 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్కి హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట -
ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలతో రాష్ట్రంలో 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిం చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఉనికి కనిపిస్తున్నా మొత్తంగా చూస్తే మాత్రం నామ మాత్రంగానే ఉంది. హిందుత్వ భావ జాలాన్ని గ్రామస్థాయి వరకు తీసు కెళ్లేందుకు తెలంగాణ అను వైన ప్రాంత మే అయినా ఇప్పటిదాకా తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావనతో ఇప్పుడు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. 2025కి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని ఘనంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ శివార్లలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగ ణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ హాజరు కానున్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే దాదాపు ఏడున్నర వేల మంది కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి.... రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం దాని ప్రత్యేకత. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆర్ఎస్ఎస్ తాజా ఆలోచన. దీనిపై మోహన్ భగవత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు లక్షల సభ్యత్వాల్లో సగం విద్యార్థులవి ఉండేలా చూడనున్నారు. ఇందుకోసం వారిని ఆకట్టుకునే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. సామాజిక అంశాలకు సంబంధించి పర్యావరణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విరివిగా మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సమ రసత కార్యక్రమం పేరుతో గ్రామాల్లో అన్ని కులాల వారు ఆలయ పూజల్లో పాల్గొనేలా చేయడంతోపాటు ఊరంతటికీ ఒకే శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఇక గ్రామ వికాస కార్యక్రమాల పేరిట మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి రక్షణగా ఉండటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోవుల వృద్ధిపై ముమ్మర ప్రచారం చేయనుంది. స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహించనుంది. కుటుంబాల్లో కలతల నివారణ, వృద్ధుల ఆదరణ, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించే కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. సోషల్ మీడియా అనర్ధాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. తద్వారా ప్రజలకు చేరవయ్యేలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత... ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ స్థానికంగా ముఖ్య శిక్షక్, ఆపై కార్యకర్తలకు శిబిరాలు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్‌లలో వాటిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. 2017లో కరీంనగర్లో సాధారణ శిబిరం, ఘట్కేసర్ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా రాష్ట్రవ్యాప్త శిబిరం మాత్రం ఇప్పుడే జరగనుంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు 2,500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,200కు పెరిగింది. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యం. శిబిరంలో భద్రాద్రి నగరం, యాదాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, జోగులాంబ నగరం, భాగ్యలక్ష్మి నగరం పేరుతో ఐదు విభాగాలు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే కార్యకర్తలకు బస ఏర్పాటు చేశారు. 24న ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశాలు ఉంటాయి. 25న ఉదయం సమావేశం తర్వాత కార్యకర్తలు నాలుగు మార్గాల్లో ఎల్బీ నగర్‌కు, అక్కడి నుంచి కవాతు ద్వారా సరూర్‌నగర్ మైదానానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు కూడా ఆయన ప్రధాన వేదిక మీదుగా మరోసారి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు శ్యామ్‌కుమార్, నాగరాజు, దూసి రామకృష్ణ, తిప్పేస్వామి, దక్షిణామూర్తి, కాచం రమేశ్, దేవేందర్ తదితరులు హాజరుకానున్నారు. -
సంక్షోభాల పరిష్కర్త ఎక్కడ?
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో చేసిన ప్రసంగంలో దత్తోపంత్ తెంగడిని గురునానక్, మహాత్మాగాంధీలతో సమస్థాయినిచ్చి ప్రస్తావించారు. తెంగడి ఎవరో కాదు. వాజ్‌పేయి ఆరేళ్ల పదవీకాలంలో ఆయన ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన బలమైన ఆరెస్సెస్ నేత. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తెంగడి నాడే ధ్వజమెత్తారు. కానీ నేడు నరేంద్రమోదీ వాజ్‌పేయి కంటే మించిన వేగంతో ప్రైవేటీకరణకు, పీఎస్‌యూల వేగంవైపుగా అడుగులేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉంది. తెంగడి వారసుడిగా స్వదేశీని బలంగా ప్రస్తావిస్తున్న భాగవత్.. మోదీతో తలపడతారా అన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత, సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆరెస్సెస్ విజయదశమి ఉత్సవాల్లో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగానికి సాధారణంగానే ప్రాచుర్యం ఉంటుంది. కానీ బీజేపీ రెండో దఫా కూడా భారీ మెజారిటీ సాధించి అధికారంలో ఉంటున్నప్పుడు ఆయన చేసే ప్రసంగానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆరెస్సెస్ కీలక వ్యవహారాలుగా భావిస్తున్నవాటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నప్పుడు ఆయన ప్రసంగానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్యలో రామమందిరం వీటిలో కొన్ని. దశాబ్దకాలంగా ఆరెస్సెస్ అధినేతగా ఉంటున్న మోహన్ భాగవత్ మూకదాడుల సమస్య, హిందూ ఎవరు అనే ప్రశ్నకు నిర్వచనం ఇవ్వడం, భారతీయుడు ఎవరు వంటి అంశాలను తడిమినందున ఈ సంవత్సరం విజయ దశమి ప్రసంగంతో మరింతగా వార్తల్లోకి ఎక్కారు. వీటిపై ఆయన వాదనలు వివాదాస్పదమైనవి, అందుకే అవి మరీ ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ఒక ముఖ్య అంశంపై ఆయన సుదీర్ఘంగా నొక్కి చెప్పిన అంశం మరుగున పడిపోయింది. ఆయన చేసిన ఆ 63 నిమిషాల ప్రసంగంలోని కొన్ని భాగాలను మీరు విన్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన ప్రసంగ వీడియోలోని తొలి నిమిషం, తర్వాత 28 నుంచి 42 నిమిషాల వరకు గల ప్రసంగ పాఠంలో తనదైన ఆర్థిక తత్వశాస్త్రాన్ని మీరు చూడవచ్చు. వీడియో ప్రారంభ క్షణాల్లోనే కీలకమైన అంశం ఉంది. ఇద్దరు ప్రముఖ, సుప్రసిద్ధ భారతీయుల వార్షికోత్సవాలను పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అవి గురునానక్ 550 జయంతి, మహాత్మాగాంధీ 150వ జయంతి. ఆరెస్సెస్–బీజేపీ వ్యవస్థకు అవతల ఉన్నవారికి లేదా భారత రాజకీయాలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ అనుసరిస్తూ ఉన్నవారికి భాగవత్ పేర్కొన్న మూడో ప్రముఖ వ్యక్తి అయిన దత్తోపంత్ తెంగడి గురించి తెలుసంటే నేను నమ్మలేను. దత్తోపంత్ శత జయంతి త్వరలో అంటే నవంబర్ 10న ప్రారంభమవుతుందని భాగవత్ పేర్కొన్నారు. ఈ పేరు పెద్దగా పరిచితమైన పేరు కాదు. పైగా గురు నానక్, గాంధీల తరహా లీగ్‌లో ఆయన లేరు. కానీ ఈ ఇద్దరి పక్కన ఆయన్ను ప్రస్తావించాల్సినంత ప్రాముఖ్యత మాత్రం ఆయనకుంది. ఆ వీడియోలో ఆ 14 నిమిషాల్లోని రెండో భాగాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఆయన ప్రస్తావన అప్రాధాన్యమైనది కాదని, మాటవరుసకు చెప్పింది కాదని అర్థమవుతుంది. నాగ్‌పూర్‌కు ఏమంత దూరంలో లేని వార్ధాలో 1920లో జన్మించిన తెంగడి ఆధునిక (స్వాతంత్య్రానంతర) ఆరెస్సెస్ వ్యవస్థాపక నిర్మాతల్లో ఒకరు. ఆరెస్సెస్ రెండు రాజకీయ అవతారాలైన భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ రెండింటి భావజాలానికి కూడా ఆయనను ప్రతినిధిగా చెప్పవచ్చు. అర్థశాస్త్రం ఆయనకు ఇష్టమైన అంశం. ప్రత్యేకించి భారత్ తన ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచి వేసిన గత 30 ఏళ్లలో మరే ఇతర దృక్పథాల కంటే ఆయన ఆలోచనాధారే ఆరెస్సెస్ ఆర్థిక ప్రపంచ దృక్పథాన్ని నిర్వచించింది. తెంగడి, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ప్రయాణించారు. ఇద్దరూ కలిసి 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్‌ని భోపాల్‌లో నెలకొల్పారు. కానీ, వాజ్‌పేయి ఆరేళ్ల పాలనలో వీరిరువురు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, దిగుమతి సుంకాల తగ్గింపు, ఎఫ్‌డీఐలకు తలుపులు తెరవడం వంటి అంశాల్లో వాజ్‌పేయి తీసుకున్న ప్రతినిర్ణయాన్నీ తెంగడి వ్యతిరేకించారు. ఒక దశలో ఆయన యశ్వంత్ సిన్హాను మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ ఇదే సిన్హా తర్వాత ఆర్థిక మంత్రిగా సంస్కరణలను ముందుకు తీసుకుపోయారు. తెంగడి డిమాండును వాజ్‌పేయి సంవత్సరం పాటు ప్రతిఘటించారు కానీ తర్వాత వెనక్కు తగ్గారు. ఆరెస్సెస్‌లో తెంగడికి చాలా బలం ఉండేది. ఆయ నకు అరుణ్ శౌరీ అంటే కూడా గిట్టేది కాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో పాత సోషలిస్టు ఆలోచనలను ఎత్తిపట్టినప్పుడు తెంగడి నిజంగానే పండగ చేసుకున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా అమ్మదలిచినప్పుడు పార్లమెంటరీ ఆమోదం పొందాలని సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది. వాజ్‌పేయి ప్రభుత్వం రెండు అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను పక్కన పెట్టినప్పుడే ఇది జరిగిందని మనం గుర్తించాలి. తెంగడిది ఒంటరి వాణి కాదు. ఆయన తొలి బిడ్డ అయిన భారతీయ మజ్జూర్ సంఘ్ వాజ్‌పేయి సంస్కరణల శకాన్ని వామపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ కంటే గట్టిగా నిరసించింది. ఈలోగా ఆయన మరోరెండు శక్తివంతమైన ప్రెషర్ గ్రూప్‌లను ఏర్పర్చారు. ఒకటి, 1979లో రైతుల కోసం స్థాపించిన భారతీయ కిసాన్ సంగ్. మరొకటి 1991లో స్థాపించిన స్వదేశీ జాగరణ్ మంచ్. ఈ సంస్థ ఇవాళ మనకు బాగా పరిచయమే. 1991 అంటేనే నాటిప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు ప్రారంభించిన సంవత్సరం అని గుర్తుండే ఉంటుంది. వెనువెంటనే స్వదేశీ జాగరణ్ మంచ్ డంకెల్ డ్రాఫ్ట్‌తో మొదలైన వాణిజ్య ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ స్వరాన్ని నిర్మించడం మొదలెట్టింది. వాజ్‌పేయి హయాం ముగిసేనాటికి ఇరువురి సంబంధాలు స్పష్టంగా దిగజారిపోయాయి. ఏదైనా కొత్త భావనను ప్రస్తావించదల్చినప్పుడల్లా, వాజ్‌పేయి ఇప్పుడు తెంగడిని ఆపేదెవరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. అంత తీవ్రమైన పోరు కొనసాగినప్పటికీ వాజ్‌పేయి బీటీ పత్తి విత్తనాలకు అనుమతి మంజూరు చేశేసారు. 2004లో ఇరువురి మధ్య పోరాటం ముగిసింది. ఆ ఏడు మే నెలలో వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. అక్టోబర్ 14న తెంగడి కన్ను మూశారు. బహుశా వామపక్షాల నియంత్రణలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రయివేటీకరణను తుంగలో తొక్కుతుందని, తాను కోరుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందన్న విశ్వా సంతోటే తెంగడి నిష్క్రమించి ఉంటారు. ఆర్థిక వ్యవస్థపై భాగవత్ 14 నిమిషాల వార్షిక ప్రసంగం గురించి ఇప్పుడు కాస్త మెరుగుగానే అర్థం చేసుకోగలం కూడా. భాగవత్ ప్రసంగం సారాంశం ఇంది. ఆర్థిక సంక్షోభం ఉంది కానీ దానికి మరీ ఎక్కువ విలువ ఇవ్వవద్దు. వృద్ధికి జీడీపీనే కొలబద్ద కాదు. అవినీతిపై కొరడా ఝళిపించండి కానీ అమాయకులను బలి చేయవద్దు. మనం స్వదేశీని నమ్ముతాం. అలాగని మనం ప్రపంచం నుంచి వేరుగా ఉండలేం. వాణిజ్యం గ్లోబల్ కావచ్చు కానీ మనం తయారు చేయలేని, మనకు అవసరమైన సరుకులను మాత్రమే కొనాలి. భారతీయ గోజాతి నుంచి వృద్ధి చేసిన బ్రెజిల్ హైబ్రిడ్ గోవు వీర్యాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? స్వదేశీ వీర్యాన్నే ఉపయోగించండి. ఇదీ భగవతి ప్రసంగ సారం. తర్వాత ఆయన ఎగుమతులు మంచివని, దిగుమతులు చెడ్డవని కూడా మాట్లాడారు. భాగవత్ మాట్లాడిన మాటల సారాంశం మొత్తంగా ప్రామాణికమైన తెంగడినమిక్స్ (తెంగడి ప్రతిపాదించిన ఆర్థిక శాస్త్రం)లో భాగమే. 2008 తర్వాత తీవ్రస్థాయిలో కొనసాగుతున్న భారతీయ ఆర్థిక పతనంతో మోదీ ప్రభుత్వం సాగిస్తున్న సమరాలు, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, చేసిన వాగ్దానాలతో భాగవత్ ప్రసంగం విభేదిం చింది. మోదీ ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానించింది. ప్రత్యేకించి అమెరికాతో పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. వాణిజ్య ఒప్పందాలు, పీఎస్‌యూల అమ్మకాలను స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. కానీ, ప్రతి రంగంలోనూ మోదీ ప్రభుత్వం భాగవత్ ప్రసంగానికి వ్యతిరేక దశలోనే చర్యలు తీసుకుంది. వాజ్‌పేయికి నవ్వు తెప్పించి ఉండేది, తెంగడికి కోపం తెప్పించి ఉండేది ఇదే కదా. వాజ్‌పేయి 2003లో చేయలేకపోయిన దాన్ని మోదీ ఇప్పుడు సులభంగా చేస్తూ అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్‌ను అమ్మకానికి పెట్టేశారు. స్వదేశీ ఆర్థికశాస్త్రాన్ని అంత వివరంగా ముందుకు తీసుకురావడం ద్వారా భాగవత్ కేంద్రప్రభుత్వంతో తలపడటానికి ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పలేం. వాజ్‌పేయి, మోదీ మధ్య అధికారానికి సంబంధించిన వ్యత్యాసాల రీత్యా ఇది సాధ్యపడదేమో కానీ అసాధ్యం కాకపోవచ్చు కూడా. మన ఆశ ఏమిటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉందన్నదే. శేఖర్‌గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మూకదాడులు దేశ ప్రతిష్టకు భంగం: భగవత్
సాక్షి, నాగపూర్: మూకదాడులు దేశంలో ఏ మాత్రం సరైనవి కావని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతదేశం భారతీయులందరిదీనని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. దసరా సందర్భంగా మంగళవారం నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి అని అన్నారు. ‘మూకదాడులు, సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి' అని భగవత్ అన్నారు. పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదుకొలిపేందుకు సంఘ్ స్వయంసేవక్‌లు కృషిచేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. -
‘హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ ఉత్సవాలు’
సుల్తాన్‌బజార్/గన్‌ఫౌండ్రి: దేశంలోనే భాగ్యనగరంలో ఎంతో ఉత్సాహంగా సామూహిక గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం హిందువుల ఐక్యతను తెలియజేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు అధ్యక్షతన నగరంలోని మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశంలోకెల్లా నగరంలోనే ఘనంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరెస్సెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
జైపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కొంతమంది వ్యక్తులకు అప్పజెప్పామని పేర్కొన్నారు. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ రాముని కోసం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఇది మా బాధ్యత. మాకు మేము స్వతహాగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యతను కొంతమంది వ్యక్తులకు అప్పగించాం. అయినప్పటికీ వారిపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసీ హెచ్చరికలను సైతం లెక్కచేయక.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా రామ మందిరం, ట్రిపుల్ తలాక్ పేరిట ఓట్లు అడిగిన విషయం విదితమే. ఇక రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆగస్ట్ 15న సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. కోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ కమిటీ నుంచి ఇప్పటివరకూ మే 7న మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించిందని, పూర్తి నివేదిక కోసం మరికొంత సమయం అవసరమని కోరిందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఈ వివాదంపై విచారణ జరుగనుంది. -
యుద్ధమే లేదు.. మరి ఎందుకిలా జరుగుతోంది?!
ముంబై : మన దేశంలో యుద్ధమేమీ జరగడం లేదు.. కానీ సైనికుల మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన ప్రహార్ సమాజ్ జాగృతి సంస్థ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘మన దేశంలో యుద్ధం జరగనప్పటికీ ఎంతో మంది సైనికులు అసువులు బాస్తున్నారు. యుద్ధం జరగని క్రమంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీతో బాటుగా సాధారణ పౌరులు కూడా దేశ భద్రతలో తమ వంతు పాత్ర పోషించాలి. దేశంలో అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. ద్రవోల్బణం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వీటికి నేనో, మీరో కారణం కానే కాదు. అయినప్పటికీ వీటి ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోందంటే మన పని మనం సరిగ్గా చేయడం లేదు కాబట్టే. అందుకే ఇకపై దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి. అప్పుడే అందరూ బాగుంటారు’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. -
శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. భగవత్ స్పందన!
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ : శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ.. భక్తులు చేపట్టిన ఆందోళన బుధవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడాన్ని నిరసిస్తూ.. గురువారం బంద్ చేపట్టారు. హిందూ సంఘాలు, భక్తుల బంద్‌తో కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు బస్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు. బంద్‌తో కేరళ అంతటా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంస్థలు చేపట్టిన బంద్‌కు బీజేపీ, దాని అనుబంధ పార్టీలు మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొనకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నట్టు తెలిపింది. మోహన్ భగవత్ స్పందన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమాజం, మహిళలు అంగీకరించి ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను పట్టించుకోకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి సుప్రీంకోర్టు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి: బీజేపీ
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలు క్రమం తప్పకుండా ఆరెస్సెస్ శ్రేణులతో సంప్రదింపులు జరపాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అగ్ర నాయకత్వం ఈ సూచనలు చేయగా ఆదివారం ఈ విషయం వెల్లడైంది. గతవారం ఢిల్లీలో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ రాజకీయ పార్టీ కోసం పనిచేయాలని తాము ఆరెస్సెస్ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదనడం గమనార్హం -
‘ముస్లింలను కలుపుకున్నదే హిందుత్వ’
న్యూఢిల్లీ: హిందూ దేశమంటే ముస్లింలకు చోటులేదని అర్థం కాదనీ, హిందుత్వమంటే అన్ని మతాలను కలుపుకుని పోవడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘భవిష్యత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం కోసం సంఘ్ పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే ప్రాథమిక సిద్ధాంతం నుంచి ఈ సౌభ్రాతృత్వం పుట్టుకొచ్చింది. హిందూ దేశంలో ముస్లింలకు లేదా ఇతరులకు చోటు లేదన్న రోజున అది హిందూత్వమే కాకుండా పోతుంది. వసుధైక కుటుంబం గురించి మాట్లాడేదే హిందూత్వం. అలా ఉంటేనే అది హిందూ దేశం’ అని భాగవత్ వివరించారు. అలాగే ఓ నిర్దిష్ట పార్టీ కోసం పనిచేయాలని ఆరెస్సెస్ తన కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పదనీ, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారికే మద్దతు తెలపాల్సిందిగా తాము కార్యకర్తలకు సూచిస్తామని భాగవత్ చెప్పారు. ఆరెస్సెస్ నేపథ్యమున్నవారు బీజేపీలో అత్యున్నత పదవుల్లో ఉండగా, ఆరెస్సెస్‌కు, బీజేపీకి వ్యత్యాసముందని చెప్పేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. -
‘మోదీ ప్రభుత్వంలో మా జోక్యం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. సంఘ్ కార్యకర్తలుగా పనిచేసిన ఎంతో మంది సేవక్‌లు ప్రస్తుతం ఉన్నత పదవులు అలంకరించారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న.. ‘భారత్ భవిష్యత్తు : ఆరెస్సెస్ విధానం’ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో స్వయం సేవకులు స్వతంత్ర, స్వాలంబనతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణమే ఆరెస్సెస్ లక్ష్యమని పేర్కొన్నారు. భిన్నత్వంతో ఏకత్వం భారతీయ సంస్కృతి గొప్పదనమన్న మోహన్ భగవత్.. దేశ ఉన్నతి కోసం కలిసి పని చేసేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఆరెస్సెస్ సేవకులకు శత్రువులెవరూ లేరని, ఒకవేళ అలాంటి వారెవరైనా ఉంటే దేశాభివృద్ధి కోసం వారిని కూడా వెంట తీసుకువెళ్తామని వ్యాఖ్యానించారు. జపాన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పీఠిక చదివిన మోహన్ భగవత్ తన ప్రసంగంలో భాగంగా రాజ్యాంగ పీఠిక చదివిన మోహన్ భగవత్.. భారతీయులంతా ఏకగ్రీవంగా రాజ్యాంగాన్ని ఆమోదించి పాటిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరిస్తూ సంఘ్ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకొని పోవడమే తమ విధానమని స్పష్టం చేశారు. హిందూ సమాజంలో అస్పృశ్యత పాపమని, అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్రంలో ముస్లింలకు చోటు లేదంటే అసలు హిందుత్వానికే అర్థం లేదన్నట్లేనని పేర్కొన్నారు. -
‘హిందువులందరినీ ఏకం చేయడం చాలా కష్టం’
న్యూయార్క్ : ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన మూలాలని, ఆధ్యాత్మికతని మర్చిపోవడం వల్లే ఇంత వెనకబడి ఉన్నాం’ అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. శుక్రవారం చికాగోలో నిర్వహించిన రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనకు తెలివి ఉంది.. జ్ఞానం ఉంది.. కానీ ఐకమత్యం లేదు. అందువల్లే మనం ఇంత వెనకబడి ఉన్నాం. మన హిందూ సమాజంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. కానీ వారందరికి సరైన గుర్తింపు లేదు. సింహాలు కలిసి సంచరించవు.. కానీ అడవి కుక్కలు కలిసి దాడి చేస్తాయి.. నాశనం చేస్తాయి’ అని తెలిపారు. అంతేకాక హిందువుల్లో ఐకమత్యం లోపించిందని ఆయన వాపోయారు. హిందూవులందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడం కూడా చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యారు. వీరిలో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. -
ఆరెస్సెస్ వేదికపై రాహుల్!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్ భారత్: ఆరెస్సెస్ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్ అభిప్రాయాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ అయిన ముస్లిం బ్రదర్ హుడ్‌తో ఆరెస్సెస్‌ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ‘వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు’ అని సంఘ్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రాహుల్‌కు భారత్ గురించి తెలియదు గతవారం లండన్ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌పై రాహుల్ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై అరుణ్ కుమార్ మండిపడ్డారు. ‘భారత్ గురించి అర్థం చేసుకోనన్ని రోజులు ఆరెస్సెస్ గురించి రాహుల్‌కు అర్థం కాదు. భారత్, భారత సంస్కృతి, వసుధైక కుటుంబకం అన్న గొప్ప ఆలోచన గురించి రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదు. ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా యావత్ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విషయం రాహుల్‌కు అర్థం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులేంటో ఆయనకు తెలియదు’ అని విమర్శించారు. -
‘రాహుల్ ముఖం నాకు అస్సలు నచ్చదు’
డెహ్రాడున్ : ధ్యాన సాధన ధార్మిక సంస్థ గాయత్రి పరివార్ చీఫ్ ప్రణవ్ పాండ్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ముఖం తనకు అస్సలు నచ్చదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ సంస్థను రాహుల్ సందర్శించడానికి వస్తే సంతోషమే గానీ అమిత్ షా లాగా ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ సంస్థల మద్దతు కూడగట్టడంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ప్రణవ్ పాండ్యా, స్వామి అద్వేశానంద్, స్వామి సత్యమిత్రానంద్ తదితరులతో సమావేశమయ్యారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది అనుచరులు కలిగి ఉన్నామని చెప్పుకునే గాయత్రి పరివార్ మద్దతు కోసం వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాయత్రి పరివార్ ప్రణవ్ పాండ్యాతో బుధవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమైన అనంతరం.. తాము బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రణవ్ పాండ్యా ప్రకటించారు. -
ప్రణబ్ ఎఫెక్ట్ : ఆరెస్సెస్‌కు పోటెత్తాయ్!
నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో సభ్యత్వానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం అనంతరం ఆరెస్సెస్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడింతలు పెరిగింది. అత్యధిక దరఖాస్తులు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరైన ప్రణబ్, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీల మధ్య సభ్యత్వం కోసం రోజుకు 378 దరఖాస్తులు రాగా, 7వ తేదీ నుంచి రోజుకు 1,779 దరఖాస్తులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రణబ్ ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారికి ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి వైద్య ధన్యవాదాలు తెలిపారు. -
ప్రణబ్ దా.. థాంక్యూ : మోహన్ భగవత్
సాక్షి, నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, భారతీయులందరికీ చెందిన సంస్థ ఇదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరెస్సెస్ మూడో శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి సదస్సుకు విచ్చేసిన ప్రణబ్ ముఖర్జీకి భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆరెస్సెస్ సదస్సుకు ప్రణబ్ రావడాన్ని వివాదం చేయ్యొద్దని ఆయన సూచించారు. ప్రముఖులను ఆరెస్సెస్ సదస్సులకు ఆహ్వానించడం ఆనవాయితీ అని అన్నారు. ప్రణబ్‌తో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అపార అనుభవం ప్రణబ్ సొంతమని ప్రశంసించారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధే మన లక్ష్యమని గుర్తుచేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సహజ లక్షణమని, ఒక మతాన్ని గుప్పిట్లో పెట్టుకొని దేశ రాజకీయాలను శాసించాలనే భావనతో ఆరెస్సెస్‌ను స్థాపించలేదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు. -
కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించిన ప్రణబ్
-
సహనమే మన శక్తి : ఆరెస్సెస్‌కు ప్రణబ్ ఉద్భోద
సాక్షి, నాగ్‌పూర్ : సహనమే మన శక్తి అని, బహుళత్వాన్ని గౌరవించి.. భిన్నత్వాన్ని సంబరంగా భావించడంలోనే మన దేశ గొప్పదనం ఇమిడి ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ‘అసహనం మన జాతీయవాద గుర్తింపు నీరుగారుస్తుంది. మతం, అధికారవాద సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టే’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. గురువారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ శిక్షా వర్గ్ ముగింపు సదస్సులో ప్రణబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ప్రతి రోజూ మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉంది. ఈ హింస అంధకారానికి ప్రతిరూపం. మన మాతృభూమి శాంతి, సామరస్యం, సంతోషం కావాలని అర్ధిస్తోంది. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిది’ అంటూ ప్రణబ్ తన ప్రసంగాన్ని ముగించారు. జాతి, జాతియత, దేశభక్తి తదితర అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రాచీనకాలం నుంచి భారత్‌లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారు వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్నది భారతీయత నుంచే వచ్చింది ఒక్కతాటిపైకి వచ్చిన భిన్న జాతుల సంస్కృతి.. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మౌర్యుల పాలన దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చింది భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల గొప్పతనం అసహనం, ద్వేషం జాతీయతకు ముప్పు ప్రాంతం, మతం, గుర్తింపు ప్రాతిపదికగా దేశాన్ని వీడదీసేందుకు ప్రయత్నిస్తే.. అది మన గుర్తింపునకు ప్రమాదం తెస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిని దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్ గాంధీజీ చెప్పినట్లు జాతీయవాదం ఏ ఒక్కరిది కాదు.. పైగా అదేం ప్రమాదకరం కాదు అన్ని మతాలు ముఖ్యంగా హిందు, ముస్లింలు కలిస్తేనే.. అది భారతజాతి అని నెహ్రూ చెప్పారు హెగ్డేవార్‌పై ప్రణబ్ ప్రశంసలు మోహన్ భగవత్‌తోపాటు ఆరెస్సెస్ ప్రధాన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆరెస్సెస్ వ్యవస్థాపక సర్సంఘ్చాలక్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని ప్రణబ్ సందర్శించారు. నాగ్‌పూర్‌లోని హెగ్డేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్ అని ప్రశంసించిన ప్రణబ్.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. ‘భారతమాత కన్న గొప్పబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఇక్కడికి వచ్చాను’ అని ఆయన విజిటర్స్ బుక్‌లో రాశారు. అంతకుముందు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్‌కు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సాదర స్వాగతం పలికారు. -
ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లొద్దు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించడం వివాదమైంది. వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రణబ్‌ను ఆహ్వానించగా, ప్రణబ్ ఓకే చెప్పారు. జూన్ 7న నాగ్‌పూర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రణబ్ నిర్ణయంపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదుగానీ పలు లౌకిక పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సీకే జాఫర్ షరీఫ్ ప్రణబ్‌కు లేఖ రాశారు. ‘రాజకీయాల్లో లౌకికవాదిగా కొనసాగి, రాష్ట్రపతిగా పనిచేసిన మీలాంటి వారు లోక్‌సభ ఎన్నికల ముందు సంఘ్ కార్యాలయాన్ని సందర్శించడం సరికాదు. మీరు ఆ నిర్ణయంపై పునరాలోచన చేస్తారని ఆశిస్తున్నా. దేశం, లౌకికత్వం ప్రయోజనాల దృష్ట్యా అక్కడికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని జాఫర్ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ హెచ్ హనుమంతప్ప ఈ లేఖపై సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ స్పందిస్తూ..ఆరెస్సెస్ జాతి వ్యతిరేక, చెడ్డ సంస్థ అని ప్రణబ్ గతంలోనే ఆరోపించారని, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన సంస్థ ఆయన మాటలను అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. స్వాగతించిన గడ్కారీ.. ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకాబోతుండటంపై కేంద్ర మంత్రి గడ్కారీ హర్షం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ కాదని, జాతీయవాదుల సంస్థ అని అన్నారు. బీజేపీని మత పార్టీ అంటే సంకుచితంగా ఆలోచిస్తున్నట్లేనని అన్నారు. ఆరెస్సెస్ నేతలతో షా, మంత్రుల భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఐదుగురు కేంద్ర మంత్రులు ఆరెస్సెస్ అగ్ర నాయకులతో సమావేశమై ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చర్చలు జరిపారు. రైతులు, కార్మికులపై బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. -
రామ్ మందిర్‌ను కూల్చింది వాళ్లు కాదు
- పాల్గర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ముంబాయి: అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్ ఈ విధంగా అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలు ఈ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్గర్ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందని అన్నారు. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందని అన్నారు. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు. దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఈవిధమైన కుల హింసకు, కుల ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. -
ఆ నినాదంతో సంబంధం లేదు: ఆర్ఎస్ఎస్
పుణే: ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ వంటి నినాదాలు కేవలం రాజకీయపరమైనవనీ, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘అటువంటివి రాజకీయ నినాదాలు. అది ఆర్ఎస్ఎస్ భాష కాదు. విముక్తి అనే మాటను రాజకీయాల్లోనే వాడుతుంటారు. ఎవరినీ వేరుగా చూసే భాష మేము వాడబోమ’ని అన్నారు. ఆర్ఎస్ఎస్ను సిద్ధాంత కర్తగా చెప్పుకుంటున్న బీజేపీ.. మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. జాతి నిర్మాణంలో భాగంగా వ్యతిరేకించిన వారిని సైతం కలుపుకుని పోవాలనేదే తమ సిద్ధాంతమని భగవత్ తెలిపారు. పుణేలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సానుకూల వైఖరి ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. ప్రతికూల భావాలున్నవారే సంక్షోభాలు, విభేదాల గురించే ఆలోచిస్తారన్నారు. అలాంటి వారు జాతినిర్మాణ ప్రక్రియలో ఎంత మాత్రం ఉపయోగపడలేరని స్పష్టం చేశారు. -
యుద్ధానికి సన్నద్ధమంటే ఎవరి మీద?
సాక్షి, న్యూఢిల్లీ : యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే తమ ఆరెస్సెస్ కార్యకర్తలకైతే మూడు రోజులు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. మోహన్ భాగవత్ భారత సైన్యాన్ని అవమానించారని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. అయితే అసలు యుద్ధానికి సన్నద్ధం కావడానికి ఆరెస్సెస్ ఏమిటీ? అది భారత సైన్యంలో భాగమా? అదో సాంస్కృత సంస్థ. అలాంటి సంస్థకు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ? ఎవరి మీద యుద్ధం చేస్తుంది? ఎవరూ మీదయినా యుద్ధం చేయాల్సిందే భారత సైన్యమే. అందుకు అవసరమైతే ఆదేశాలు జారీ చేయాల్సింది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వమే. మోహన్ భాగవత్ తన మాటల ద్వారా పరోక్షంగా యుద్ధానికి ఆరెస్సెస్ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లుంది. అయితే ఎవరి మీద ? పాకిస్థాన్ మీదనా? పాకిస్థాన్ సైన్యానికి ఎదుర్కొనే శక్తి లేదు. పైగా అది భారత సైన్యానికి సంబంధించిన అంశం. ఇకపోతే దేశంలోని ముస్లింలపై యుద్ధమా? దేశంలోని ముస్లింలపై జరిపే దాడులను యుద్ధం అనలేం. హింస అని అంటాం. ఇప్పటికే ఆరెస్సెస్ కార్యకర్తల్లో కావాల్సినంత హింస దాగి ఉంది. అలాంటి హింసను మరీ రెచ్చగొట్టడం ఏమిటీ? ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తమకుతాము సైన్యంగా చెప్పుకునే దళాలు పెరిగిపోయాయి. భజరంగ్ దళ్ సైనిక శిబిరాల్లాంటివి ఏర్పాటు చేసుకొని వాటిలో ఆయుధ శిక్షణ తీసుకుంటుండగా, గోరక్ష దళాలు లైసెన్స్‌లేని తుపాకులను పట్టుకొని దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాడులకు కూడా దిగుతున్నాయి. శివసేన ఆర్మీ ఆఫ్ శివాజీ అని చెప్పుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ‘హిందూ యువ వాహిణి’ని ఇప్పుడు ‘హిందూ యూత్ ఆర్మీ’ అని చెప్పుకుంటోంది. తమపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లోని దళితులు భీమ్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి సన్నద్ధం అంటే వివిధ మితవాద సంస్థల్లో పేరుకుపోయిన హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టడమే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -
ముస్లింలు కూడా హిందువులే..!
అలీగఢ్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ మరోసారి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిపురలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోని ముస్లింలందరూ హిందువులేనని అన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, దేశంలోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకుంటున్నట్లు ఆయన సష్టం చేశారు. మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం తప్పులేదని మహంత్ షకున్పాండే అన్నారు. భారత్‌లో నివసించే వారంతా హిందువులేనని.. అందులో ఎటువటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ముస్లింలుగా చెప్పుకుంటున్న వారంతా తమ నేపథ్యాన్ని పరిశీలించుకోవాలని ఆయన అన్నారు. ఒక్కసారి నేపథ్య పరిశీలన చేసుకుంటే.. వారికి కూడా తామంతా హిందువులమేనన్న వాస్తవం తెలుస్తుందని చెప్పారు. మహంత్ ధర్మదాస్ మహారాజ్ మాత్రం మోహన్ భగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల.. హిందువులు, ముస్లింలకు ఎటువంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని భగవత్‌ను ధర్మదాస్ ఆగ్రహంగా ప్రశ్నించారు. -
రామ మందిరంపై మాట్లాడటానికి మీరెవరు..?
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ఆరెఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భగవత్ ఎవరని, ఈ వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఏ అధికారంతో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశాడని, భగవత్ ఏమైన భారత ప్రధాన న్యాయమూర్తా.. అని ప్రశ్నించారు. రామమందిరం నిర్మించి తీరుతామని, ఈ నిర్ణయంలోఎలాంటి మార్పులేదని ఇటీవల భగవత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రామమందిరం నిర్మాణం త్వరలోనే నిర్మించబోతున్నామని, భక్తులంతా వచ్చే దీపావళి రామ మందిరంలో జరుపుకుంటారని బీజేపీ సీనియర్‌నేత సుబ్రమణ్యియన్ స్వామి ఆదివారం ప్రకటించారు. అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై 2010-అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం తుది విచారణ జరగనుంది. -
మోహన్ భాగవత్ రాయని డైరీ
సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిన కష్టం ఏ దేశ పౌరుడికీ రాకూడదు. గుండె తరుక్కుపోతోంది నాకు. ఆయనేం కోరాడని! ‘నా రాముడికి నన్ను పూజ చేసుకోనివ్వండి’ అనేగా. కోర్టు కాదంది! ‘తేలవలసినవి తేలాక అప్పుడు నీ సంగతి చూద్దాం’ అంది. పెద్ద లాయర్ అయుండి, పెద్ద బీజేపీ లీడర్ అయుండి, ఎనభై ఏళ్ల వయసుండి.. ఇవన్నీ కాదసలు.. రామభక్తుడు అయుండీ సుబ్రహ్మణ్య స్వామికి ఇదేం ఖర్మ.. అయోధ్యకు వెళ్లి పూజ చేసుకోడానికి లేకుండా! ‘తమిళనాడులో రామాలయం లేదా? అయోధ్యలోనే ఇంకో రామాలయం లేదా? అక్కడ చేసుకోవచ్చు కదా నీ పూజ’ అన్నారట కోర్టువారు! భక్తుడికీ, భగవంతుడికీ మధ్య ఈ కోర్టులేమిటో! భక్తుల సంగతి సరే. పాతికేళ్లుగా పూజల్లేక అయోధ్య రాముడు అలమటిస్తున్నాడే!! ‘మిలార్డ్’ అంటూ ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి అడిగినా, ‘ముందు డిస్ప్యూట్ క్లియర్ కానివ్వండి లార్డ్ శ్రీరామా.. తర్వాత మీ ఇష్టం.. ఎన్ని పూజలైనా చేయించుకోండి’ అంటుందేమో కోర్టు. డిసెంబర్ 5న ఫైనల్ హియరింగ్. కేసులో ఉన్న భక్తులంతా కోర్టుకు వచ్చి, కోర్టువారికీ, కోర్టు హాల్లో కూర్చున్నవారికీ, కోర్టు బయట నిలుచున్నవారికీ.. అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే అది ఫైనల్. ఏ ఒక్కరి భాష ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా కేసు మళ్లీ సెమీ ఫైనల్‌కో, క్వార్టర్ ఫైనల్‌కో వాయిదా పడిపోతుంది. ‘‘ఏమిటండీ ఈ అన్యాయం’’ అని మొన్న ఆగస్టులోనే సుబ్రహ్మణ్య స్వామి కన్నీళ్లు పెట్టుకున్నారు. దైవానికి మనిషిని దూరం చేస్తే వచ్చే కన్నీళ్లవి. కేసు డాక్యుమెంట్లు ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ అవలేదని జస్టిస్ మిశ్రా అయోధ్య కేసును మూడు నెలలు వాయిదా వేశారు. ఒకటీ అరా అయితే సుబ్రహ్మణ్య స్వామే కూర్చుని తర్జుమా చేసి ఉండేవారు. తొంభై వేల పేజీలు. ఎనిమిది భాషలు. అన్నిటినీ ఇంగ్లిష్‌లోకి మార్చాలి. రామకోటి రాయడం ఈజీ అంతకన్నా! ‘‘నాకిక అయోధ్య రాముడు లేడనుకోనా?’’ అని మళ్లీ ఈమధ్య విలపించారు సుబ్రహ్మణ్య స్వామి. ఏదో ఒక రాముడితో అడ్జెస్ట్ అయ్యేలా లేరు ఆయన. ‘‘చేద్దాం’’ అన్నాను. ‘‘ఏం చేస్తారు భగవత్‌జీ! హిమాచల్‌ప్రదేశ్ అయింది. గుజరాత్ అవుతోంది. తర్వాత కర్ణాటక. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరామ్, నాగాలాండ్, రాజస్తాన్, త్రిపుర. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. అవీ అయిపోతే.. రాముడు కనబడతాడా? మీరు కనబడతారా?’’ అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. భక్త రామదాసు కూడా ఇంత బాధపడి ఉండడు. ‘‘తేల్చేద్దాం దాసు గారూ’’ అన్నాను. ‘‘దాసా! దాసెవరూ?’’ అన్నారు స్వామి. ‘‘కేసు అనబోయి, దాసు అన్నాను లెండి’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్య
సాక్షి, ఇండోర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు. అయితే హిందుస్తాన్‌లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని ఆయన చెప్పారు. ఇండోర్‌లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులేకాక.. ఇతర మతస్తులు కూడా జీవించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు. పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ చెప్పారు. భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తమవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. ఇందుకోసం అందరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు. -
గోవులను పూజిస్తారు.. హింస తెలీదు
సాక్షి, జైపూర్: గో రక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ ఈ మధ్యే సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతీ జిల్లాకు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించాలని ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో గో రక్షక దళాలను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జైపూర్, జామ్దోలిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆవులను దైవంగా పూజించే వారు చాలా ప్రశాంత మనస్తతత్వంతో ఉంటారని, ఎదుటివారు తమ మనోభావాలను దారుణంగా దెబ్బ తీసినా చాలా ఓపికతో ఉంటారని ఆయన చెప్పారు. అంతేకానీ హింసకు ఎట్టిపరిస్థితుల్లో పాల్పడబోరని భగవత్ పేర్కొన్నారు. మరి దాడులకు పాల్పడుతుంది గో రక్షక దళ సభ్యులు కాదా? అన్న ప్రశ్నకు భగవత్ సమాధానం దాటవేశారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడని ఆరోపిస్తూ కొంతమంది గో సంరక్షకులు ఈ యేడాది ఏప్రిల్ నెలలో రాజస్థాన్‌లోనే ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. పెహ్లూ ఖాన్(50) అనే డైరీ ఫాం రైతుపై విచక్షణా రహితంగా అతని మీద దాడి చేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరుగురు నిందితులకు నేర పరిశోధన విభాగం ఈ మధ్యే పోలీసులు క్లీన్‌చీట్ ఇవ్వగా.. స్థానికంగా పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమైంది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు పెహ్లూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. -
భగవత్‌కు మమత ఝలక్
కోల్‌కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఆయన కార్యక్రమం కోసం చేసుకున్న ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేశారు. అక్టోబర్‌లో జరగనున్న కార్యక్రమం కోసం కోల్‌కతాలోని ప్రఖ్యాత మహజాతి సాదన్ ఆడిటోరియంను ఆర్ఎస్ఎస్ బుక్ చేసుకుంది. మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రసంగించాల్సివుంది. అయితే బుకింగ్‌ను రద్దు చేసినట్టు నిర్వాహకులకు ప్రభుత్వ వర్గాలు మౌఖికంగా తెలిపాయి. బెంగాల్ ప్రభుత్వ ఆధీనంలోని ఆడిటోరియంను ఆర్ఎస్ఎస్ ఇవ్వడం సీఎం మమతా బెనర్జీకి ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జనవరిలో కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు మోహన్ భగవత్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కలకత్తా హైకోర్టు జోక్యంతో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. 2014లో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ర్యాలీకి కూడా మమత సర్కారు అనుమతి ఇవ్వలేదు. -
అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్ చీఫ్ జెండావిష్కరణ!
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ కేరళలోని ఓ స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. రాజకీయ నేతలు పాఠశాలలో జెండాను ఎగురవేయరాదని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినా ఆయన ఖాతరు చేయలేదు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం పలక్కాడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాలల్లో రాజకీయ నేతలు జెండా ఎగురవేయడం సరికాదని, స్కూల్ అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రమే ఇందుకు అనుమతిస్తామని పలక్కాడ్ జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వ చర్యపై ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. రాష్ట్రంలో వామపక్షాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన దుమారం రేపుతున్నది. -
16 ఏళ్ల వ్రతాన్ని వదిలేసిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 16 ఏళ్లుగా తాను పెట్టుకున్న వ్రతాన్ని వదిలేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయన అవార్డుల కార్యక్రమాలకు వేటికీ వెళ్లలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఒక అవార్డు అందుకున్న మిస్టర్ పెర్ఫెక్షనిస్టు.. దాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అందుకోవడం మరో విశేషం. తన తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఇచ్చే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆమిర్‌ను స్వయంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆహ్వానించారు. లతాజీ ఆహ్వానాన్ని కాదనలేని ఆమిర్.. ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకున్నాడు. దంగల్ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్సుకు గాను ఆమిర్‌కు విశేష పురస్కారం ఇచ్చారు. ఇంతకుముందు లగాన్ సినిమా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆమిర్.. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ అవార్డు ఫంక్షన్‌కూ హాజరు కాలేదు. ప్రస్తుతం 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలలో ఆమిర్ నటిస్తున్నాడు. -
దేశవ్యాప్తంగా గోవధ నిషేధం
ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ డిమాండ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలులోకి తీసుకురావాలని రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. గోవధ పేరుతో ఏరకమైన హింసనూ అంగీకరించేది లేదని, ఇందుకోసం ఒక చట్టం తీసుకురావా లని అన్నారు. గో పరిరక్షణ పేరుతో హిం సకు పాల్పడటాన్ని తప్పుబట్టిన ఆయన.. దీని వల్ల అసలు లక్ష్యం పక్కదారి పడుతోం దని చెప్పారు. గోపరిరక్షణకు సంబంధిం చిన చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అయితే వీటిని పూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి లోబడి కొనసాగించాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఓ ముస్లిం వ్యక్తి గో సంరక్షకుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలుగోవధ నిషేధ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లయితే మిగిలిన రాష్ట్రాలూ దానిని అనుసరించే అవకాశం ఉందన్నారు. అయితే రాజకీయపరమైన కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి రావడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. -
గోరక్షణ పేరుతో హింస వద్దు: భగవత్
న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అన్నారు. దేశంలో గోవధను నిషేధిస్తూ చట్టం తేవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 'గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు దిగినా మన లక్ష్యానికి చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల'ని ఆయన అన్నారు. గోరక్షణ పేరుతో దాడులు పెరిగిపోవడంతో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెహ్లు ఖాన్(55) అనే రైతును గోరక్షకులు హత్య చేయడంతో ఆందోళనలు రేగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని విపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా భగవత్ పేరును ఇటీవల శివసేన తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక రేసులో తాను లేనని భగవత్ ప్రకటించారు. -
ఆయనే రాష్ట్రపతి కావాలి: ప్రధానికి లేఖ
బెంగళూరు: పార్టీ వైఖరికి భిన్నంగా రాష్ట్రపతి పదవి రేసులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రైల్వే మంత్రి జఫర్ షరీఫ్ మద్దతు పలికారు. భగవత్‌ను రాష్ట్రపతి చేయాలంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. మోహన్ భగవత్ దేశభక్తి విషయంలో ఎవరికీ సందేహాలు లేవని లేఖలో పేర్కొన్నారు. 'భారత్‌లోనే అనేక భావజాలాలు ఉన్నాయి. విశాలమైన ఒక దేశంలో అలాంటి విభిన్న భావజాలాలు ఉండటం సహజమే. మోహన్ భగవత్ ఒక భావజాలానికి చెందిన వ్యక్తి కావొచ్చు. కానీ ఆయన దేశభక్తిని, భారత ప్రజల పట్ల ఆయన ప్రేమను, దేశంపై ఆయనకున్న విధేయతను ఎవరూ తప్పుబట్టలేరు' అని షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాలన్న ఎలాంటి చర్యనైనా తాము నిర్ద్వంద్వంగా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆరెస్సెస్ భావజాలానికి తాము ఎంతమాత్రం మద్దతు తెలుపబోమని పేర్కొంది. -
రాష్ట్రపతి పదవా.. నాకొద్దు!
రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ విషయమై మొదలైన ఊహాగానాలకు ఆయన తెరదించారు. మోహన్ భాగవత్‌ను రాష్ట్రపతి చేయాలని, తద్వారా హిందూరాజ్యానికి బాటలు పరవాలని శివసేన చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ఎప్పటికీ జరిగేది కాదని, తాను ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే పనిచేస్తానని భాగవత్ తెలిపారు. ఆర్ఎస్ఎస్లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానని, ఈ విషయంలో వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా తాను ఎప్పటికీ ఒప్పుకోబోనని కుండ బద్దలుకొట్టారు. భాగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంతకుముందు అన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ - శివసేన మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఎవరికీ తగినంత బలం లేకపోవడంతో చివరకు శివసేనకు బీజేపీ మద్దతిచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కావల్సిన ఎలక్టొరల్ కాలేజి బలం చాలావరకు ఎన్డీయేకు వచ్చేసింది. అంతకుముందు వరకు కొంత అనుమానంగా ఉన్నా.. ఆ తర్వాత మాత్రం కమలనాథులు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎల్కే అద్వానీ లాంటి నాయకులను రాష్ట్రపతిగా చేసేటట్లయితే తాము సైతం మద్దతిస్తామని మమతా బెనర్జీ లాంటివాళ్లు సైతం అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం కూడా వేడెక్కింది. -
మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాలి!
తదుపరి రాష్ట్రపతిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును పరిశీలనలోకి తీసుకోవాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని మిత్రపక్షం శివసేన కోరింది. 'హిందూ రాజ్యం' కల సాకారం కావాలంటే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రావత్ పేర్కొన్నారు. 'నరేంద్రమోదీ రూపంలో దేశ ప్రధానమంత్రిగా ఒక హిందూత్వవాది ఉన్నారు. ఇటీవల మరో హిందూత్వ నాయకుడైన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి, హిందూత్వ రాజ్య స్వప్నం సాకారం కావాలంటే, భగవత్‌ను రాష్ట్రపతిని చేయాల్సిందే' అని రావత్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నది. ఎన్డీయే మిత్రపక్షాలను బుజ్జగించి తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ప్రధాని మోదీ ఈ వారం డిన్నర్‌కు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి రేసులోకి భగవత్ పేరును శివసేన తెరపైకి తెచ్చింది. అయితే, కొంతకాలంగా బీజేపీ-శివసేన మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. -
సీఎం వద్దన్నా.. ర్యాలీకి సై
సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుకుందామని అనుకున్నా కుదరలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతా నగరం నడిబొడ్డున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోహన్ భగవత్ ఈ ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శతవిధాలా ప్రయత్నించారు. పశ్చిమబెంగాల్ పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు ఉన్న రామ్‌ధోను అనే పదాన్ని రొంగ్‌ధోనుగా మమత మార్పించారు. రామ్‌ధోను అనేది ఇంద్రధనుస్సుకు బెంగాలీ పదం. దాన్నే ఇప్పుడు ఆమె రొంగ్‌ధొనుగా మార్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సీఎం ఆదేశాలతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో.. ఆర్ఎస్ఎస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భగవత్ సభకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మమత ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ఇంతకుముందు కూడా అసన్సోల్ నగరంలో సంసద్ మేళా నిర్వహించాలని బీజేపీ భావించగా, అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ అందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు సైతం హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని బీజేపీ సభ నిర్వహించింది. -
కేంద్రాన్ని ఆరెస్సెస్ నడపడం లేదు
ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య సాక్షి, మేడ్చల్: కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నడుపుతోందంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య స్పష్టంచేశారు. తాము ప్రజా సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ అంశాన్ని చర్చించడం లేదని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దళిత, గిరిజనులను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తోందని చెప్పారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో ఆదివారం ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం 8.30 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భేటీ అనంతరం బాగయ్య ఆరెస్సెస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్యతో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో హిందూవాదులు, ఆరెస్సెస్ కార్యకర్తలులపై దాడులు, రాజకీయ హత్యలు, పర్యావరణ సమతుల్యత, అంటరానితనం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి పలు తీర్మానాలను కేంద్ర కమిటీకి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఏపీలో పదేళ్లలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన రూ.25 వేల కోట్లను పక్కదారి పట్టించారని, ఆ నిధులను ఆ వర్గాల అభివృద్ధికే వెచ్చించాలని డిమాండ్ చేశారు. దళితులపై ఇంకా వివక్ష.. దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులు నేటికీ వివక్ష ఎదుర్కొంటున్నారని బాగయ్య పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఒక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అందులో మధ్యప్రదేశ్‌లో 9 వేల గ్రామాల్లో, మహారాష్ట్రలో దేవగిరి ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలోని 489 గ్రామాల్లో దళిత, గిరిజనులకు పలు దేవాలయాలు, మంచినీటి బావులు, చెరువులు, శ్మశానవాటికల్లోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పలు గ్రామాల్లోని హోటళ్లలో రెండు గ్లాసుల విధానం ఇంకా కొనసాగుతోందన్నారు. దీన్‌దయాళ్ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏకాత్మ మానవతా దర్శనం పేరుతో దేశాలు, వ్యక్తుల మధ్య విద్వేషాలు లేకుండా చేసేందుకు ఆరెస్సెస్ కృషి చేస్తోందన్నారు. ప్రకృతి తల్లి లాంటిదని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపుతామని స్పష్టంచేశారు. కోల్‌కతాలో హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయని, విద్రోహ శక్తులు పెట్రేగి పోతున్నాయన్నారు. దుర్గా నిమజ్జనంలో విధ్వంసం జరిగినా బెంగాల్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మైనార్టీలను సంతృప్తి పరచటానికి హిందువుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కేరళలో కమ్యూనిస్టుల రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. సమావేశాలకు మోహన్ భగవత్‌తోపాటు ఆరెస్సెస్ అఖిల భారత ప్రధానకార్యదర్శి సురేష్ భయ్యాజీ వంటి ప్రముులు హాజరయ్యారు. నేడు అమిత్‌షా రాక! బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం సమావేశాలకు రానున్నారని ఆరెస్సెస్ నాయకులు తెలిపారు. ఆదివారమే రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సోమవారానికి వాయిదా పడ్డట్లు వివరించారు. -
మోహన్‌జీ! మీరే పదిమంది పిల్లల్ని కనండి!
న్యూఢిల్లీ: హిందూ జనాభా విషయంలో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వింత సవాల్ విసిరారు. 'హిందువులను రెచ్చగొట్టే ముందు, మోహన్ భగవత్‌గారే స్వయంగా పదిమంది పిల్లల్ని కని, వారిని బాగా పెంచాలి' అని ఆయన సోమవారం ట్విట్టర్లో సూచించారు. మిగతా మతాలతో పోల్చుకుంటే హిందూ జనాభా తగ్గిపోతున్నదని, కాబట్టి హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆరెస్సెస్ ప్రోత్సహిస్తున్నది. గతవారం ఆగ్రాలో జరిగిన ఓ సమావేశంలో ఆహూతులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ 'హిందువులు తమ జనాభా పెంచుకోకూడదని ఏ చట్టం చెబుతున్నది? అలాంటి చట్టమేది లేదు. అలాంటప్పుడు జనాభా పెరుగుదలకు అడ్డేమున్నది? ఇది వ్యవస్థకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే సామాజిక వాతావరణమే ఇలా ఉంది' అంటూ భగవత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల ఉపాధ్యాయులతో ఆరెస్సెస్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హిందూ జనాభా తగ్గుదల అంశంపై మాట్లాడాల్సిందిగా ఆహూతులు కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని తాజాగా కేజ్రీవాల్ తప్పుబట్టారు. -
‘హిందూ జనాభా పెరగొద్దని ఏ చట్టం చెబుతోంది?’
లక్నో: ‘హిందువుల జనాభా పెరగొద్దని ఏ చట్టం చెబుతోంది? అలాంటి చట్టమేదీ లేదు. ఇతరుల జనాభా పెరుగుతోంటే తమ జనాభాను పెంచుకోకుండా హిందువులను ఏది అడ్డుకుంటోంది?’అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల వల్లే వారి జనాభా పెరగడం లేదన్నారు. ఆదివారమిక్కడ 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని అధ్యాపకులు కోరగా, కేంద్ర ప్రభుత్వ దూతను కానని, మంత్రి జవదేకర్‌కు విన్నవించుకోవాలని సూచించారు. కాగా భాగవత్ సమాజాన్ని విభజించే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందిస్తూ..‘ఎక్కువ మంది పిల్లల్ని సాకేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారా అని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని భాగవత్‌కు చెబుతున్నా’ అని అన్నారు. -
ఆర్ఎస్ఎస్ తరఫున లియోనార్డో డికాప్రియో ప్రచారం?
ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ కాస్టర్ డేవిడ్ అటన్ బరో, బిజినెస్ దిగ్గజం రిచర్డ్ బ్రాన్ సన్ లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తరఫున ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ కు చెందిన కొందరు వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 30, 31 తేదీలలో యూకే పర్యటనకు వెళ్లనున్న ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను హాలీవుడ్ ప్రముఖులు కలవనున్నట్లు తెలిపారు. బీఫ్ వినియోగం, శాఖాహారంపై ఆర్ ఎస్ఎస్ తరఫున వీరందరూ ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాత కాంటర్బ్యూరీలోని ఆర్చీ బిషప్ ను కలుస్తారని చెప్పారు. హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివీర్ గ్రాండ్ క్యాంప్ కోసం యూకే వెళ్తున్న ఆయన మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, జంతు వధలపై డికాప్రియో ఎప్పటినుంచో ప్రచారం చేస్తుండగా, వేగన్ అయిన బ్రాన్ సన్ తాను సొంతగా వేగన్ ఎయిర్ లైన్ ను ప్రారంభించబోతున్నట్లు 2015లో ప్రకటించారు.సంఘ్ పరివార్ కు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాల్లో ప్రచారకులు ఉన్నారు. -
'ఇండియాలో పుట్టినవారికి ఇద్దరు తల్లులు'
'భారత్ మాతాకీ జై' నినాదం గురించి దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చోపచర్చలు, వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాని గురించి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా మరో విషయం చెప్పారు. భారతదేశంలో పుట్టిన వాళ్లకు ఇద్దరు తల్లులు ఉంటారని, ఒకరు కన్న తల్లి కాగా మరొకరు భారత మాత అని ఆయన అన్నారు. ఉజ్జయినిలో క్షిప్ర నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో భాగంగా గురువారం ప్రారంభమైన మూడు రోజుల 'విచార్ మహాకుంభ్' సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జీవించడానికి వస్తున్న ప్రతి ఒక్కరినీ భారతమాత తన ఒడిలోకి తీసుకుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ సదస్సులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. -
తప్పుడు మ్యాపులకు మోహన్ భగవత్‌ను జైల్లో పెడతారా?
న్యూఢిల్లీ: భారత దేశ నైసర్గిక సరిహద్దులను మ్యాపుల్లో ఆన్‌లైన్‌లోగానీ, ముద్రణాపరంగాగానీ తప్పుగా చూపించినట్లయితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించేందుకు వీలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెల్సిందే. మరి అఖండ్ భారత్ లేదా అవిభాజ్య భారత్ చిత్ర పటాన్ని ఆది నుంచి ప్రదర్శిస్తూ వస్తున్న ఆరెస్సెస్‌ను ఈ కొత్త బిల్లు కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్‌ను అరెస్ట్‌చేసి జైల్లో పెడతారా? అఖండ్ భారత్ బ్యాక్‌డ్రాప్‌గా భారత మాతా చిత్రపటాన్ని ఆరెస్సెస్ తన అధికార మ్యాప్‌గా పరిగణిస్తున్న విషయం తెల్సిందే. ఆరెస్సెస్ మ్యాపుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి భారత్ మ్యాప్‌ను చూపిస్తోంది. కొన్ని చిత్రాల్లో అఫ్ఘానిస్తాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక దేశాలను కూడా చూపిస్తోంది. కొత్త బిల్లు చట్టంగా మారితే అధికార బీజేపీకి అండగా నిలుస్తున్న ఆరెస్సెస్ కూడా నేరానికి పాల్పడినట్లు కాదా? జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్లో, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో కలిపి భారత్ మ్యాప్‌లను ఆన్లైన్లో చూపిన కారణంగా ఈ బిల్లును తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమ జమ్మూ కశ్మీర్‌లోని సగ భాగం వాస్తవానికి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతం మన ఆధీనంలో ఉన్నట్లు మన మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. అలాగే, ఈశాన్యంలోని అక్సాయి చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నది. అది కూడా మన ఆధీనంలో ఉన్నట్లుగా మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. మన ఆధీనంలో లేని ప్రాంతాలను మన మ్యాపుల నుంచి తొలగిస్తే కొత్త చట్టం కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్‌ను శిక్షిస్తారో, లేదోగానీ వాస్తవ మ్యాపులను రూపొందిస్తే మాత్రం కచ్చితంగా శిక్షిస్తారని ప్రభుత్వ ధోరణి చూస్తే అర్థం అవుతుంది. -
'ఆర్ఎస్ఎస్ లోకి మహిళలను తీసుకోండి'
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆలయాల్లో స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు. మహిళల ఓట్లుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆర్ఎస్ఎస్ కూడా తమ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. స్త్రీ,పురుష సమాన హక్కుల కోసం మోహన్ భాగవత్ మద్దతు కోరతామన్నారు. తృప్తి దేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన నిర్ణయం
లక్నో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆలయాలను సందర్శించడం మామూలే. కానీ ఈసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మసీదును సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. లక్నోలో కొత్తగా నిర్మించిన మసీదుకు ఆయన వెళ్లనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డ్(ఏఐఎంపీడబ్ల్యూ ఎల్బీ) చైర్ పర్సన్ షైస్తా అంబర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన భాగవత్ ను అంబర్ కలిశారు. 'మాధో ఆశ్రమానికి సమీపంలో నేను నిర్మించిన మసీదును సందర్శించాలని భాగవత్ ను ఆహ్వానించాను. ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదుకు వస్తానని ఆయన నాకు హామీయిచ్చార'ని అంబర్ తెలిపారు. భాగవత్ మసీదును సందర్శిస్తే ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమనే భావన సమసిపోతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం, సామాజిక విషయాల గురించి కూడా భాగవత్ తో చర్చించినట్టు చెప్పారు. -
ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
కోల్ కతా: ప్రపంచం భారత దేశానికి సెల్యూట్ చేస్తుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్‌కు ఆత్మగౌరవం ఎక్కువని, ప్రపంచమంతా 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేయాలని తమ సంస్థ భావిస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ సహ వ్యవస్థాపకుడు, దివంగత మదన్ లాల్ అగర్వాల్ పై రాసిన ఓ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ను సంపన్న దేశంగా చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అవిభాజ్య భారత్ నుంచి విడిపోయినప్పుడు దేశం పేరు పాకిస్తాన్ అని పెట్టుకున్నారని ఎందుకంటే... భారత్ అని పేరు పెట్టుకునేందుకు వారిలో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు లేవని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజ్యాంగంలో పేర్కొనలేదని, అందుకే భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయనని ఒవైసీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలో ఉన్నందున తాను చాలా అదృష్టవంతుడినని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదం చేయను: ఒవైసీ
'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని తాను చేయబోనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్ ఈమేరకు స్పందించారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ 'ఆ నినాదాన్ని నేను చేయను. మీరు ఏం చేస్తారు? భగవత్ సాబ్' అని పేర్కొన్నారు. 'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని ఒవైసీ తెలిపారు. జెఎన్యూలో జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో దేశభక్తి పెంపొందించేలా యువతరానికి 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని బోధించాలని ఈ నెల 3న మోహన్ భగవత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. WATCH: Asaduddin Owaisi to RSS chief Mohan Bhagwat- Won't say "Bharat Mata Ki Jai" in Latur (Maharashtra) (March 13)https://t.co/nRNtaBfi6z — ANI (@ANI_news) March 14, 2016 -
'రామమందిర నిర్మాణం ఎప్పుడో చెప్పండి'
ముంబై: ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌ను శివసేన కోరింది. రామ మందిరాన్ని తాను బతికుంగానే నిర్మిస్తామని మోహన్ భగవత్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో శనివారం ఈ అంశంపై సంపాదకీయం రాసింది. 'మోహన్ భగవత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. అయితే నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఒక తేదీని ప్రకటించాలి. ఒక సారి నిర్మించిన తరువాత దాన్ని మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉండదు' అని పేర్కొంది. 'ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రామాలయాన్ని నిర్మించే దైర్యం ఉంది. ఈ విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతుంది' అని శివసేన పేర్కొది. ఒకవేళ ఇప్పుడు నిర్మించకపోతే ఇంకెప్పుడూ ఆలయాన్ని నిర్మించలేరని, ఈ అంశానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని, దీనిని సాగదీయటం సబబు కాదని శివసేన అభిప్రాయపడింది. -
మోహన్ భగవత్ ప్రసంగం పూర్తిపాఠం
Honorable Chief Guest of Today’s program Dr. V. K. Saraswat, other invited guests, revered citizens, mothers, sisters and beloved swayamsewaks:- Today, we are gathered here to celebrate our annual festivities of the Vijayadashmi Parva. 90 years have elapsed since the sangh work was started. This year is the 125th birth anniversary of Bharatratna Dr. Babasaheb Ambedkar. He made a lifelong struggle against the injustice of social inequality and made provisions in the Constitution thereby eradicating those discriminations from the political and economic spheres of our national life. In Shri Guruji’s (second Sarsanghchalak of RSS) words, his talent was a confluence of Acharya Shankar’s Sharp Intellect and Tathagat Buddha’s unbounded compassion. Last year was also the 125th Birth Anniversary of Parampujaniya Dr. Hedgewar (founder of Sangh). He envisioned creation of a prosperous Bharat as example for the whole world to follow, through collective efforts of an egalitarian society. The evolution of a technique to create honest and selfless workers, striving incessantly and wholeheartedly to achieve this goal was his lifetime contribution. Birth centenary of Late Shri Balasaheb Deoras, an expert in this technique and the third Sarsanghchalak of RSS, is also to commence this year. Late Pandit Deendayalji Upadhyay, who was nurtured in this technique, had suggested an integral approach called Ekatma Manav Darshan, adopted to modern times for the nation, based on the eternal values of Bharatiya Philosophy. His birth centenary has also commenced. By a pleasant coincidence, this is also the 1000th year of coronation of RajRajeshwar Rajendra Chola, a royal who had established a model of good governance in Bharat and had promulgated in South East Asia the benevolent influence of the eternal Bharatiya culture. Rejecting all disparities based on caste and creed, and breaking all the barriers of superstitious traditions, Shri Ramanujacharya made the path of Bhakti to all the sections of the society, thus paving the way for social harmony. Preparations are going on at the social level to celebrate his 1000th birth anniversary in the coming year. This is also the 1000th birth anniversary of great Shaiva philosopher from Jammu-Kashmir, Acharya Abhinav Gupt. The celebration of the 5151th Anniversary of our revered Bhagvad Gita, which conveys the message of doing Karma without expecting any of Phala, and the principles of “Karmasu Kaushalam” and “Samatva”, will be continued till the Gita Jayanti. Two great souls departed us this year. Our Ex President, Dr. Abdul Kalam was one who had dedicated his life towards instilling confidence and national pride in our young generation, while constantly urging them to achieve the best for our country in all walks of life. Swami Dayanand Saraswati, by being a Vedic teacher, provided a modern view of our eternal culture and aroused pride and activism about it in our society and the world at large. Both of these eternal souls etched the message of the glory of Bharat and social unity through their work. The reason behind remembering all these coincidence today is to draw our attention to the call of our innate duty to build up a prosperous, efficient and egalitarian Bharat, to bring peace, prosperity and progress, right from our families to the whole world. To accomplish this goal, based on the strength of an organized society, is the point of contemplation today. The resurgence of a self reliant, strong, prosperous and secure Bharat, giving benevolent and flourishing leadership to the world, is possible only when an egalitarian, organized and enlightened society with self esteem strives towards this end; not only that, the firm resolve of such a society will reflect on the policies of our democratic system and the constitutional authorities who run the system. Agile, clear, accurate policies as well as discretion of a society which is free of selfishness and divisiveness are mandatory requirements to change the destiny of nation and, therefore, it is essential that both should complement each other. With this picture in mind, when we ponder over the present situation in the country, we get a very optimistic and soothing view. An atmosphere of disappointment and lost faith, which existed couple of years back, has evaporated. An atmosphere of expectations has come to fore, generating a sense of optimism that such expectations shall be fulfilled. It has to be made sure that these positive vibes reaches the last person in the row, by turning it into an actual experience by bringing about a real positive change in his life; his trust in the bright future of his own personal life as also of national, should grow. It is becoming evident to all that Bharat’s esteem in the world has gone up many-fold in the last couple of years. In view of Bharat’s national interest, many pro active steps have been taken to improve bi lateral relationship with the neighboring countries, with successful results. It seems that the world is being introduced to a new modern Bharat. The World is experiencing a Bharat, which is full of self-respect and self confidence, maintaining the traditional view of goodwill towards all but, at the same time, unhesitatingly taking stand in very clear terms, in international diplomacy whenever national interests are involved, and giving a helping hand to nations in distress anywhere in the world. Bharat is reincarnating itself into an all together new manifestation and the world is enchanted to see Bharat’s new Avatar with utmost optimism. Bharat’s Gita, Yoga and Tathagat have a universal acceptance like never before. Keeping in view the need to develop goodwill for Bhartiya psyche and tradition and to protect and enhance its prestige, Policies are being formulated at the administrative level. All the developing nations of the world are looking forward to Bharat’s leadership to emancipate them from the undesirable influence of the so called world powers. Throughout its chequered history of rise and fall, Bharat has always treated the whole world as its own family. On account of its agility and strength, Bharat has always followed the tradition of finding the balance between national interests and world interests, with utmost integrity towards both, and today we are gradually experiencing the glimpse of same age-old diplomatic approach. It is necessary that this effulgent picture of Bharat is imprinted in the mind of the World as well as in the mind of every individual of the land. Hence, it is vital that we should make all walks of our national life vibrant with a new thought and new valiant efforts. So, creating a new picture of the society capable of adopting policies and systems in keeping with modern times and, at the same time, based on the foundations of the eternal truth, which forms the substratum of our immortal national life, is the need of the hour. We must come out of “Saheb is always Right” (“Saheb Wakyam Pramanam”) mentality. Making Bharatiya mind and soul as the basis, we should adopt whatever is good, truthful and fair from the rest of the world and create an independent modern road-map for our nation. The thoughts and actions of intelligentsia, administration and policies of government should be transformed accordingly. In the absence of this synergy, it will not be possible to present a Bharat that is self reliant, egalitarian, strong and prosperous. Deficiencies of the thought processes and philosophies, which prevailed for centuries in the world, are being scientifically proved. The ill-effects of such deficient thought process and philosophies are even more compelling to ponder over the very same thought processes and philosophies have made review of them all the more compelling. In 1951, Social and economic department of United Nations, supporting these deficient philosophies had made following proclamation: “There is a sense in which rapid economic progress is impossible without painful adjustments. Ancient philosophies have to be scrapped; old social institutions have to disintegrate. Bonds of caste, creed and race have to burst and large numbers of persons who cannot keep up with the progress have to have their expectations of a comfortable life frustrated. Very few communities are willing to pay the full price of economic progress.” It was an extremely materialistic, self-centered and insensitive philosophy that was forced upon the world. When the ill-effects of the very same philosophy started affecting the proponents of this philosophy, they made a sudden U turn. In October 2005, the conclave of the Governors of Central Banks of the G20 countries declared: “We note development approaches are evolving over time and thus need to be updated as economic challenges unfold. ------ We recognize there is no uniform development approach that fits all the countries. Each country should be able to choose the development approaches and policies that best suit its specific characteristics while benefitting from there accumulated experience in policy making over last decades, including the importance of strong macroeconomic policies for sustained growth.” Bringing more clarity to the statement above, News Bulletin of World Bank in 2008, said: “In our work across the world we have learnt the hard way that there is no one model that fits all. Development is all about transformation. It means taking the best ideas, testing them in new situations and throwing away what doesn’t work. It means, above all, having the ability to recognize when we have failed. This is never an easy thing to do. It is ever more difficult for an organization to do so, be it the government or the World Bank, which constantly need to adapt to the changing nature of developmental challenge.” After this self realization, phrases like ‘Holistic’ and ‘Sustainable development’ started appearing in the world discourse over development talks. Environmental concerns also could find made some place in this discourse. So, it will be prudent to free ourselves from the tendency to accept this deficient philosophy as the ultimate truth, since it in itself is going through the cycle of experiment- experience- change. It would be better if we stick to our time tested philosophy. This philosophy is based on cooperation and coordination. According to this philosophy, Dharma and Sanskar are at the forefront of Life and not Arth-Kaam. For sustainable development, this philosophy encourages least use of energy, maximum employment, sensitivity towards environment, ethics, and the wholesome approach to agriculture. It suggests a decentralized and self reliant economic and industrial order. There is a major emphasis on skill development and increased productivity. As per this philosophy, success of the system is judged on the fact whether the last person in the land is getting justice, education and basic needs of life. Hence the major emphasis has to be on farmers and agriculture, small and medium scale industries, small traders and craftsmen. All organizations, intellectuals, policy makers, political class and administrators working in the socio-economic field have to take a note of this. It is pleasurable to note that the manifesto of Niti Ayog is giving clear indications in the same direction. It is obvious that this metamorphosis will not take place all of a sudden. It would be a challenge to bring inherited economy back to normal state, balance political compulsions, and straighten administrative machinery. We ought to keep whole lot of patience to see the fruition of our efforts to take the benefits of development to the lowest strata of society and enlist their participation in the nation-building. We would like to see steady increase in their confidence towards nation building exercise. Mudra Bank, Jan Dhan Yojna, voluntary surrender of cooking gas subsidy, Swatch Bharat initiative, and skill development are some useful initiatives of the present government, in the same direction. It is essential to get credible data, both qualitative and quantitative, from the grassroots level to measure the efficacy of our developmental policies. It is also necessary to hold fruitful dialogues to ensure the participation of all in the nation building exercise, and speed up the execution of the program. Efficacy of all the policy measures aimed at changing the destiny of the nation will very much depend upon the enterprising spirit, capability to cooperate, and the wisdom of masses. To achieve it, enlightenment and training of society is a prerequisite. While speaking about development, population growth is one related aspect, which is much talked about. We need to seriously ponder our population policy. It must be discussed whether population is a boon or bane? Whether the current systems and resources would be adequate to provide employment and basic amenities to masses after 50 years from now? How much manpower would be required to run our systems effectively? Quiet often, it becomes mother’s responsibility to bringing up children and inculcating values in them. Hence diet, healthcare, self-respect, empowerment, enlightenment, opportunities and freedom to make use of those opportunities by our mothers need to be ensured by our system. Are our systems turned for the same? What is our anticipation regarding the condition of our environment after 50 years? Facts and figures of last two census reports and the imbalances that have come to notice as a result are being widely discussed. Our present and future is getting impacted by the same. We need to rise above vote bank politics to formulate a holistic approach, equally applicable to all citizens, towards the population policy. Such a population policy cannot be enforced by our Governments or laws, all alone. Considerable efforts are required to tune society’s psyche to the same. It would be prudent to think about the same during policy making exercise. To bring about a change in the natural instincts and behavioral patterns of humans, customary religious practices, and cultural traditions, in accordance with current times is often, too tricky. Even if this change is appropriate, it cannot be accomplished by just bringing in a law or making law enforcement agencies to enforce the law. It never happened this way and it will never happen this way. It can only be accomplished through a respectful dialogue with concerned entities. This dialogue and the efforts to enlighten the society through the dialogue, needs to take place at all the levels be it the government, administration, media or intellectuals in the society and it should consistently continue before and after such changes. We should not be guided by cheap popularity or political incentives. What is truthful and just should be our guiding principle. By adopting a compassionate approach towards every section of society, we can change their approach through a friendly and respectable dialogue. The anguish some sections of people felt as a result of some reasoned judgments could have been avoided. For example, Santhara, peculiar life style of Digambar Acharyas, Bal-Deeksha (initiations of children as recluses), etc., are some of the age old practices prevalent in the Jain community. To bring about changes in such matters without consulting the Acharyas of the respective sects about the reason, importance and philosophy behind such practices, will affect social cohesion and harmony and finally harm the nation. It has been a tradition in every sect/religion in our Country to introspect about their rituals and practices at regular intervals and attunes such a rituals and practices to current times and circumstances. This is the healthy way of bringing about necessary changes. All such changes have always come from within. Any external attempt to bring about such changes has always ended up only in controversies. Success in any systemic change is achieved only through changing the social psyche. Education system is an important tool for social transformation. In recent years, we have been observing commercialization of education. Getting more and more expensive, it is going beyond the reach of an ordinary citizen. Hence the purpose which education is expected to fulfill, is not taking shape. Apart from imparting formal education, education also aims at shaping a complete man, who is wise, self respecting, self reliant, compassionate, efficient and cultured. With this integral approach to education, many experiments are going on within as well as outside the country. We should take cognizance of all these experiments. Results from these experiments, and the suggestion made by various organizations, educationists and panels should form the basis for all the aspects of education be it curriculum, fee structure or management of education. Education should be society based. Education should be oriented towards fulfilling its goal as well as contemporary requirements of society. And in the light of these limits there should be freedom to chalk out the education system. To ensure that education is not commercialized; government needs to make sure that government educational institutions also are run well at all levels. This process starts with the quality of teachers we have. We need to have effective training, and maintain standards for teachers. More than anything else, we need teachers who realize their responsibilities. However, the role of parents and society is equally important. Do we tell our children that it is more important to have a meaningful life than a successful life? Is our behavior such, which instills the values of truthfulness, justice, compassion, sacrifice, patience and good behavior? Is our generation ready to tread this path in social and professional fields with insistence and agility, ignoring petty gains? Do we – the social and political leadership - and media care to see that our walk and talk leads the society, particularly new generation, towards national integrity, social harmony and ethical behavior? To say that Governance and economy and other systems drive human behavior -“Yatha Raja Tatha Praja”. Hence our policies should unite the society; caring for the uplift of the weakest link of the society, they should achieve progress of everyone in the society. We need fundamental reforms in our electoral practices, administration, tax systems, public health system, and industrial, educational and agricultural policies to make them more effective and people oriented. Hostilities by Pakistan, expansionism from China, rising fundamentalism and chauvinism in the world order, and unfair international diplomacy, resulting in rise of terrorist outfits like ISIS, are acting as a catalyst to already complicated and serious internal and external security of our country. Fostered by external powers and inspired by external ideologies, some people from within are walking the path of terrorism. It goes without saying that it is government’s responsibility to come out with a comprehensive and a firm policy to root out all such problems ones and for all. Ethical education should be made part of the education policy so as to preserve our social and cultural values intact and thwart all attempts at destroying our culture. There is a view that media should be regulated while conserving their freedom to ensure that no ill effect, knowingly or unknowingly, prevails in the society. It is a fair to expect that all the promised dreams are realized and became a reality fast. But this is also true that governance is driven by the will, quality of thoughts and organized state of the society. When a self realized, righteous and holistic society starts walking with determination on the path towards national glory, the systems and apparatus of nation follow and become helpful in the transformation. A nation becomes prosperous, safe and capable only when government, administration and public at large are on the same page on the issues of identity of nation, national pride, and credible integrity towards nation, and are ready for constant efforts with focused contemplation. What is the chord that can keep our diverse society together? (1) Certainly, it is our eternal culture - Hindu culture - that accepts and respects all forms of diversity and which precisely forms the nature and value system of every Bharatiya. (2) The very culture, based on which our ancestors build their lives, toiled hard to nurture and foster it, and even sacrificed their live for its protection and honor, even to this day, their glory is a source of inspiration and ideal for us. (3) This divine motherland endowed with richest and wealth, who helped us realize the truth that formed the foundation of that culture and the Dharma born out of it, whose abundance of divine wealth nurtured us and made us magnanimous, the love and devotion for whom we inherited from our ancestors, such motherland of ours, even today has the power to arouse the creative spirit of every individual of this country. Through these three factors an individual can easily be assimilated while keeping ones diverse identity of language, region, sect and party intact. Also, even while safeguarding one’s smaller identity, one becomes part of the larger social identity. The humanitarian spirit, vision and philosophy based on the above three factors, the decision in conformity and equally matched practice is what is called Hindutva. This lifestyle of Hindu society, from time immoral, even long before the term Hindu was coined, evolved in keeping with the time on the basis of above three factors. The onus of good and bad of this nation ever rusts only on their shoulders. For last 90 years, RSS has been constantly trying to galvanize the energies of Hindu society for nation building. Sangh founder Dr. Hedgewar had very well understood that the task of nation and society building cannot be entrusted on contract. When an efficient and organised society works persistently for the betterment of nation for a long time, then only the nation becomes prosperous. The mission of RSS is to prepare such workers who can organize the society for this noble cause. Today, everyone can see the impact created by Swayamsewaks coming out of the easy and simple modus operandi of RSS. Now they not only get respect and affection from a grateful society, but also the recognition of the whole world. Come on, let us all become Swayamsewaks and be part of this sacred work, because this the only way to build the Bharat that the world inevitably looks forward to for a new opening. The Bharatiya society has to become perfect and organised on the strength of their eternal identity. Soaked with the nectar of our Dharmic Values that ends all divisiveness and is capable of infuse the whole humankind with the feeling of fraternity by giving them real freedom, let us individually and collectively endeavor to accord happiness, peace and redemption to human race. This the way out and we have to do it. -
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
నాగపూర్ : విజయదశమి పర్వదినం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాద్రి లాంటి ఉదంతాల వల్ల దేశసంస్కృతి,సంప్రదాయాలకు వచ్చే నష్టమేమీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా చిన్న విషయమని ఆయన కొట్టిపారేశారు. (ప్రసంగం పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి) నాగపూర్ లో గురువారం జరిగిన దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత అభివృద్ధితో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రసంగంలో పలు అంశాలను ఉటంకించిన ఆయన దేశంలో చెలరేగిన మతఘర్షణలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాద్రి లాంటి ఘటనలు చాలా చిన్నవనీ, అలాంటి వాటి వల్ల దేశ ప్రతిష్టకు వచ్చే నష్టమేమీ ఉండదంటూ ఆవేశంగా ప్రసంగించారు. దీనిమూలంగా దేశసంస్కృతికి జరిగే అనర్థమేమీ ఉండదన్నారు. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డీఆర్డీఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ షరావత్ తదితులు పాల్గొన్నారు. -
'ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది'
నాగపూర్: ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెండేళ్ల క్రితం దేశంలో నిరాశకరమైన వాతావరణం ఉండేదని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆశావాద దృక్పథం కనిపిస్తోందని చెప్పారు. నాగపూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డీఆర్డీఓ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ షరావత్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
'రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరపాల్సిందే'
న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారని 'దైనిక్ జాగరణ్' పత్రిక తెలిపింది. రిజర్వేషన్లకు భాగవత్ వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతమున్న విధానంలో లక్షిత వర్గాలకు లబ్ధి జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని భాగవత్ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది. కాగా, రిజర్వేషన్ల విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం లేదని రెండు రోజుల క్రితం ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భాగవత్ డిమాండ్ పై రాజకీయంగా వివాదం తలెత్తడంతో బీజేపీ మౌనం దాల్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని పక్కన పెట్టింది. -
పెను దుమారం రేపిన దిగ్విజయ్ ట్వీట్!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల ముఖాలు అర్ధభాగాలున్నాయి. కుడివైపు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎడమ అర్ధభాగం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్న ఫొటోను దిగ్విజయ్ షేర్ చేశారు. రెండు మతాల ప్రచారం, అభివృద్ధి కోసం పాటుపడే వీరివల్ల సామాజిక దూరం పెరుగుతుందని దిగ్విజయ్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. తనకు ఓ ఫ్రెండ్ ఈ ఫొటోను షేర్ చేసినట్లు దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫోటోపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా దిగ్విజయ్, ఒవైసీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ నేత ముస్లింలను అవమానపరిచే విధంగా ప్రవర్తించారని ఒవైసీ వ్యాఖ్యానించారు. తన ఫొటోను అలా చేయడంతో తనకేం సమస్య లేదని అయితే ఈ చర్యతో ముస్లింలందర్నీ అవమానపరిచారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలన కాలంలో భిన్న మతాల మధ్య సామాజిక దూరం లేదన్న విషయాన్ని ఒవైసీ తెలుసుకోవాలని దిగ్విజయ్ వ్యాఖ్యానించగా... మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిహార్, అస్సాం రాష్ట్రాలలో మసీదులలో విగ్రహాలు పెట్టలేదా.. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అందులోనూ విగ్రహాలు ఉంచడం నిజం కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు. 1992 డిసెంబర్, 1993 జనవరిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ముంబయిలో మత ఘర్షణలు చోటుకున్నాయని, శ్రీకృష్ణ కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ ను ఉరితీయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మొసలి కన్నీళ్లు కారుస్తుందంటూ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని నీ ఇంట్లో పెళ్లిళ్లకు ఆహ్వానించడమే కాకుండా, ఆ ఫొటోలను పోస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. ముస్లింలు, దళితులు విద్య, ఉద్యోగం, ఇళ్లు ఇలా ప్రతిరంగాలలో వారి హక్కులను పొందగలిగినప్పుడే దేశంలో లౌకికవాదం బలపడుతుందని ఎంఐఎం ఎంపీ అభిప్రాయపడ్డారు. The Two Perpetrators of Religious Fanaticism who are destroying Social Fabric of this Country. Image sent by a friend pic.twitter.com/8xWLg5yov6 — digvijaya singh (@digvijaya_28) September 22, 2015 -
‘రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలి’
న్యూఢిల్లీ: రిజర్వేషన్ విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని.. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎవరికి అవసరం.. ఎంత కాలం అవసరం అనేది పరిశీలించటానికి రాజకీయాలకు సంబంధం లేని కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూచించారు. కోటా కోసం గుజరాత్లో పటేళ్ల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. -
మోహన్ భాగవత్‌తో అమిత్‌షా భేటీ
నాగ్‌పూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశమయ్యారు. శనివారం నాగ్‌పూర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో భాగవత్, ఇతర ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో సుమారు గంటన్నర పాటు అమిత్‌షా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విజయాలు, సంస్థాగతమైన అంశాలు, ప్రతిపక్షాల ఎదురుదాడి తదితర విషయాలపై వీరు చర్చలు జరిపినట్టు తెలిసింది. గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. మోహన్ భాగవత్‌తో భేటీ కాగా తాజాగా అమిత్‌షా ఆయనతో సమావేశం కావడం గమనార్హం. అయితే ఈ రెండు సమావేశాలకు సంబంధించి బీజేపీగానీ, ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ సందర్భంగా రేషిమ్‌బాగ్‌లోని స్మృతి మందిర్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. నాగపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్గడ్కారీతోనూ అమిత్‌షా భేటీ అయ్యారు. -
'మదర్ థెరీసా మతమార్పిడే లక్ష్యంగా పనిచేశారు'
భరత్ పూర్: భారతరత్న మదర్ థెరీసాపై ఆర్సెసెస్ చీఫ్ మోహన్ భగవత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె పేదలకు చేసిన సేవలకు వెనుక మతమార్పిడి అంశం ముడిపడి ఉందని తాజాగా వ్యాఖ్యానించారు. పేదలకు సేవ చేసి వారిని క్రైస్తవ మతంలోకి మార్చడమే ఆమె ప్రధాన ఉద్దేశమని భగవత్ వ్యాఖ్యానించారు. థెరీసా సేవలు ప్రశంసదగినవే అయినప్పటికీ ఆమె వాటిని మత మార్పిడికి ఒక సాధనంగా వినియోగించుకున్నారన్నారు. రాజస్థాన్ లోని బజేరా గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆపనాఘర్ సమావేశంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేవ పేరుతో మతమార్పిడిన కొనసాగించడం ఆ సేవకు విలువ తగ్గించడమే అవుతుందన్నారు. -
హిందూదేశంగా మార్చాలి: భాగవత్
సాగర్: నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించినట్లు హిందూ మతం భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తుందని.. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆదివారం ముగిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగవత్ ప్రసంగిస్తూ.. భారత్ హిందూ దేశంగా మారాలంటూ అందుకు ఠాగూర్ రచించిన ‘స్వదేశీ సమాజ్’ పుస్తకాన్ని ఉటంకించారు. ‘ పుస్తకంలో ఠాగూర్ బ్రిటిష్‌వారిని విమర్శించారు. హిందువులు, ముస్లింలు తమలో తాము కొట్లాడుకోవటం ద్వారా ఒకరినొకరు అంతం చేసుకోబోరని వారు ఉమ్మడిగా ఒక మార్గం కనిపెడతారని ఆ మార్గం హిందూదేశమని చెప్పారు’ అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సామరస్యాన్ని హిందుత్వం సమర్థిస్తుందన్నారు. ఒక దేశ ప్రజలు అభద్రతాభావంలో ఉన్నప్పుడు ఆ దేశం భద్రంగా ఉన్నట్లు చెప్పలేమన్నారు. ఎడారి, తక్కువ, జనాభా, విదేశీ దాడులు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ‘భారత్‌కు 5,000 కిలోమీటర్ల భూమి ఉంది. కోట్లాది మంది జనాభా ఉంది. శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ మనల్ని దాటి ముందుకెళ్లిపోయింది’ అని అన్నారు. -
కిరణ్ బేడీ.. సీఎం అభ్యర్థా?
-
కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు?
భోపాల్: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని బీజేపీ ప్రకటించడంపై ఆ పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్... బీజేపీ అగ్రనేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఓ వర్గం కావాలనే కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించినట్లు సమాచారం. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా... కిరణ్ బేడీ సీఎం అభ్యర్థి అంటూ ఎందుకు ప్రచారంలోకి వచ్చిందని సదరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. మోహన్ భగవత్ అసంతృప్తిపై కమలనాథులు ఒకింత ఉలిక్కిపడ్డారు. దాంతో బీజేపీ అగ్రనేతలు వెంటనే రంగంలోకి దిగారు. ఈ అంశంపై మోహన్ భగవత్ తో చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆగమేఘాలపై శుక్రవారం ఉదయం నాగపూర్ వెళ్లేరు. కాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
హిందువుల ఐక్యతే దేశానికి రక్ష
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అహ్మదాబాద్: హిందువుల ఐక్యతే దేశానికి రక్ష అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ సమాజం ప్రమాదంలో పడితే.. దేశమే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. హిందూ దేశంగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే హిందువులంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘హిందువులంతా ఏకతాటిపై నిలిచినట్లయితే దేశాభివృద్ధిని ఆపడం ఏ శక్తి తరమూ కాదు. గతంలో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ భారత్ విశ్వగురువుగా నిలిచింది. అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉండేది. ఆ వైభవం మళ్లీ తీసుకురావాలంటే హిందువులంతా ఒక్కటి కావాలి’ అని పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు, జాతి నిర్మాణంలో సంఘ్ పరివార్ తన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సంఘ్‌ను బయట్నుంచి చూడొద్దని, అది చేసే మంచి కార్యక్రమాలను గమనించి సంఘ్‌లో చేరాలని ప్రజలకు సూచించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ సమాజంలోని అన్ని వర్గాల పట్ల సమదర్శనం కలిగి ఉండాలన్నారు. ‘ఘర్ వాపసీ’పై మౌనం.. ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన వివాదాస్పద ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై భాగవత్ మౌనం పాటించారు. పరమత సహనం కలిగి ఉండాలన్న విషయాన్ని హిందూ ధర్మం ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉందన్నారు. ఇతర మతాల్లోని మంచిని కూడా చూసే గొప్పదనం హిందూ మతానికి ఉందని చెప్పారు. ఇతర మతాలను కూడా సమ్మతించాలన్న విషయాన్ని హిందూ మతం చెబుతోందన్నారు. ‘ఇతర మతాలను అనుసరించేవారు మంచివారు కాదని కొన్ని మతాల వారు చెబుతుంటారు. కానీ వారిపట్ల కూడా సహనం కలిగి ఉండాలని హిందూ మతం చెబుతోంది. ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలని పేర్కొంటోంది. గోమాత, తులసి, గంగా నదిని మనం దేవుళ్లుగా చూస్తాం’ అని చెప్పారు. కిందటి నెల కోల్‌కతాలో మాట్లాడుతూ భాగవత్ ఘర్ వాపసీని గట్టిగా సమర్థించారు. తర్వాత ఘర్ వాపసీ జోరందుకోవడంతో రాజకీయ దుమారం రేగింది. కిందటి వారమే భగవత్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఘర్ వాపసీపై భగవత్ కాస్త మెత్తబడడం గమనార్హం. ‘రేప్‌లకు ప్రభుత్వం బాధ్యత వహించదు’ కాన్పూర్: మహిళలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదని, సమాజమే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని ఓ మహిళా మంత్రి అనడం విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఇటీవల ఓ బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అరుణ కోరి ఆదివారం మాట్లాడుతూ.. ‘ఈ అత్యాచారానికి ప్రభుత్వం బాధ్యత వహించదు.. చిన్నారులను వేధింపులకు గురి చేసే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తున్నాం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు, మహిళాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. -
మత మార్పిడులను ప్రోత్సహించొద్దు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతా: మత మార్పిడులకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ ప్రచారం నిర్వహించటాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గట్టిగా సమర్థించారు. మత మార్పిడుల నిరోధక బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను డిమాండ్ చేశారు. హిందువులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు సూచించారు. బలమైన హిందూ సమాజం నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నటు చెప్పారు. ఇతర మతాలకు మళ్లిన హిందువులంతా ఇష్టప్రకారం కాకుండా బలవంతంగా, ప్రలోభాలతో మతం మార్చుకున్నారని చెప్పారు. శనివారమిక్కడ ఆయన హిందూ సమ్మేళన్‌లో మాట్లాడారు. హిందూమతంలోకి మార్పిడులను వ్యతిరేకించే వారు హిందువులను కూడా ఇతర మతాల్లోకి మార్చవద్దని డిమాండ్ చేశారు. హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్ పరివార్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరులను అణగదొక్కటంపై హిందూ సమాజానికి నమ్మకం లేదన్నారు. నూరు తప్పుల తరువాత ఇక ఉపేక్షించవద్దని భగవంతుడు సైతం చెప్పాడని గుర్తు చేశారు. హిందువులు ఎక్కువ మంది లేకపోవటం వల్లే పాకిస్థాన్ ప్రశాంతంగా ఉండలేకపోతోందని వ్యాఖ్యానించారు. -
భారత్‌ను విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు
ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ తుమకూరు : భారతదేశాన్ని విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ విమర్శించారు. అందువల్ల ప్రస్తుతం భారతీయులందరూ ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తన సందర్భంగా మంగళవారం తుమకూరులోని సిద్ధగంగా మఠంలో ఏర్పాటు చేసిన ‘సాధు సంతర సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో హిందూ ధర్మ సంప్రదాయాలు పాశ్చాత్య వైఖరి కారణంగా ఇప్పటికే చాలా వరకు నాశనమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో హిందూ సంప్రదాయాలు అదృశ్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను హిందువులందరూ కలిసికట్టుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి మన మాతృ మతంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సాధుసంతర సమావేశాన్ని ప్రారంభించిన సిద్ధగంగా మఠం పీఠాధిపతి శివకుమార స్వామీజీ మాట్లాడుతూ....హిందూ ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాలకు ఆదర్శమన్నారు. అయితే ప్రస్తుత తరంలో చాలా మంది యువకులు హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర గురూజీ, ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద నాధ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు వేయలేకపోయిన భాగవత్
నాగపూర్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిద్దరూ లక్నోలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆర్ఎస్ఎస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వీరు లక్నో వెళ్లారు. ఈ కార్యక్రమం ఏడాది క్రితమే నిర్ణయించినందున వారు వెళ్లక తప్పలేదని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నాగపూర్ తూర్పు నియోజకవర్గంలో భాగవత్, జోషి ఓట్లు ఉన్నాయి. -
ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటి?
నాగపూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దూరదర్శన్ చేసిన దాంట్లో తప్పేంలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన దూరదర్శన్ ప్రొఫెషనలిజం చూపాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. దూరదర్శన్ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా అక్టోబర్ 3న భాగవత్ చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. భాగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. -
హిందుత్వం.. దేశానికి జాతీయ గుర్తింపు
నాగ్‌పూర్: హిందుత్వ అనేది దేశానికి ఒక జాతీయ గుర్తింపు అంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత భిన్నత్వం మధ్య కూడా దేశంలో ఏకత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. జాతీయు భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయు సంబంధాలపై ప్రధాని మోదీ చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. భాగవత్ చేసిన ఈ ప్రసంగాన్ని దూరదర్శన్‌లో గంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేశారు. మరోవైపు ఇది ప్రభుత్వ ప్రసార వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శించాయి.ఆర్ఎస్ఎస్ 89వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు దసరా సందర్భంగా శుక్రవారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించారు. ‘‘1925 నుంచి బలమైన, సంస్థాగతమైన, ధర్మబద్ధమైన సమాజం కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోంది. హిందుత్వ అనేది మన జాతీయ గుర్తింపు. ప్రతి గ్రామానికి, వీధికి, ప్రతి సమాజానికి, ప్రతి ఇంటికి సంఘ్ శాఖను తీసుకెళుతున్నాం. సంఘ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతుంది. సంఘ్ ఎవరినీ ఏమీ వదిలి వేయాలని కోరదు. దేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీసే అహంకారాన్ని, గర్వాన్ని, దుర్గుణాలను వదిలివేయాలని మాత్రమే కోరుతుంది. అదే హిందుత్వ..’’ అని పేర్కొన్నారు. జాతీయు భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయు సంబంధాలపై ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. పాలనా విధానాలను మరింత సమర్థవంతంగా కొనసాగించడానికి మోదీకి ప్రజలు మరికొంత సమయం ఇవ్వాలన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిం చిన ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి కూడా. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు మోదీ ప్రశంస.. భాగవత్ ప్రసంగంలోని పలు అంశాలను మోదీ ప్రశంసించారు. ‘ఆయన లేవనెత్తిన సామాజిక సంస్కరణలు వంటి పలు అంశాలు ప్రస్తుత పరిస్థితులను చూపుతున్నాయి..’’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాగా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఎలాంటి తప్పూ లేదని కేంద్రం పేర్కొంది. ఆయన ప్రసంగానికి వార్తా ప్రావుుఖ్యం ఉందని కేంద్ర వుంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. భావజాల వ్యాప్తి కోసం కుట్ర..: భాగవత్ ప్రసంగం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఇది ప్రభుత్వ ప్రసార వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నాయి. ఇది ప్రమాదకర సంప్రదాయంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ నేత సందీప్ విమర్శించారు.ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ మరో నేత అభిషేక్‌మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. తమ హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తిచేయడం కోసం ఆర్ఎస్ఎస్ ఈ సందర్భాన్ని, ప్రత్యక్ష ప్రసారాలను వినియోగించుకుందని సీపీఎం, సీపీఐ ఆరోపించాయి. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. ఇది అధికారిక వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నారు. -
'మోడీ పాలనలో భారత్ దూసుకుపోతుంది'
నాగపూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో భారత్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి ఆకాంక్షించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాల వ్యవధిలోనే ... దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆయన సాధించిన పురోగతిని వివరించారు. దసరా పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం నాగపూర్‌లో రేషంబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవతి ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ పాలనతో భారత్ ప్రజలలో చిరు ఆశలు మొలకెత్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. మోడీ తన పాలన ద్వారా మరి పథకాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవతి ప్రసంగాన్ని డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతీయ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మైనారిటీ శాఖామంత్రి నజ్మా హెప్తుల్లా కొత్త వివాదానికి తెర తీశారు. భారతీయులందర్ని 'హిందీ' అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపడంతో తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. హిందీ అనే పదం మతానికి సంబంధించినది కాదని, కేవలం జాతీయతగానే చూడాలని నజ్మా చెప్పారు. భారతీయులందరూ హిందువులని అనలేదని ఆమె తెలిపారు. అరబిక్ భాషలలో భారతీయులను హిందీ, హిందుస్థానీ అనే పదాలతో పిలుస్తారని అన్నారు. జాతీయత సూచించే విధంగా హిందీ, హిందుస్థానీ అంటామని వివరణలో భాగంగా పేర్కోన్నారు. భారతీయులను హిందువులుగానే చూడాలని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారతీయుందరూ హిందీ(హిందువులు) అని నజ్మా హెప్తుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపింది -
భారత్.. హిందూ దేశమే!
ముంబై: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆదివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. ‘భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది’ ఆయన పేర్కొన్నారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కటక్ లో భారత్ లో ఉండేవారందరూ హిందూవులేనంటూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే దుమారం చెలరేగుతున్నా.. తాజాగా అవే వ్యాఖ్యలు చేశారు. -
ఆరెస్సెస్ చీఫ్ 'హిందుస్తానీ' వ్యాఖ్యలపై దుమారం!
న్యూఢిల్లీ: హిందుస్థాన్(భారత్)లో ఉండేవారందరూ హిందువులేనంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీయేతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ‘ఆయన రాజ్యాంగాన్ని చదివారా? అసలు ఆయనకు దానిపై విశ్వాసముందా?’ అని ప్రశ్నించాయి. రాజ్యాంగంలో దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారని, అందులో హిందుస్థాన్ అనే పదం ఎక్కడా లేదని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ చెప్పారు. భాగవత్ రాజ్యాంగాన్ని చదువుకోవాలని సూచించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్‌లు కూడా ఇదే విధంగా స్పందించారు. భాగవత్‌కు రాజ్యాంగం సరిగ్గా తెలియదని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో దేశంలో చాలా మతాలున్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నారని, అందుకే హిందుస్థాన్‌ను వాడకుండా దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారన్నారు. దేశంలో భిన్నమతాలు ఉన్నాయని, అయితే ఆరెస్సెస్ ఒకే మతం కోసం, అందర్నీ ఒకే గొడుగుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీకి చెందిన క్రై స్తవ మతపెద్ద ఫాదర్ సవ్రిముత్తు ఆక్షేపించారు. 'ఇంగ్లండ్ లో ఉండేవారందరూ ఇంగ్లీష్ వారు, జర్మనీలో ఉండేవారందరూ జర్మన్స్, యూఎస్ లో ఉన్నవారంతా అమెరికన్స్'అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. -
'ఆర్ఎస్ఎస్ లేనిదే మోడీ, అమిత్ షా సున్నా'
బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే.. వాళ్లిద్దరికీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగ్వత్ పెద్ద షాక్ ఇచ్చారు. లక్షలాది మంది సభ్యులు, ప్రచారకులతో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన ఆర్ఎస్ఎస్ను అసలు పట్టించుకోకుండా ఇలా పరస్పరం పొగుడుకోవడం ఏంటని ఆయనకు మండినట్లుంది. ఏ ఒకకరిద్దరు నాయకుల వల్లనో బీజేపీ విజయం సాధించలేదని మోహన్ భాగ్వత్ అన్నారు. ఎవరి పేర్లూ పైకి ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ప్రధాన నాయకులిద్దరినీ ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ''కొంతమంది పార్టీకి క్రెడిట్ ఇస్తుంటే, మరికొంతమంది కొందరు వ్యక్తులకే ఈ క్రెడిట్ ఇస్తున్నారు. కానీ ఈ వ్యవస్థ, పార్టీ, వ్యక్తులు ఇంతకుముందు కూడా ఉన్నారు. అప్పుడేం జరిగింది? ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్లే అధికారంలోకి తెచ్చారు. వాళ్లు సంతోషంగా లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేస్తారు'' అని ఆయన అన్నారు. ఎఫ్‌డీఐల లాంటి అంశాల్లో ఆర్ఎస్ఎస్ ప్రాథమిక సిద్ధాంతాలను కూడా మర్చిపోయినట్లుగా బీజేపీ సర్కారు ప్రవర్తిస్తోందని ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ వర్గాలు మండిపడ్డాయి. ఆర్ఎస్ఎస్ లేనిదే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ సున్నాలలాంటివాళ్లేనని కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోడీ సర్కారు పనిచేస్తోందని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విమర్శలు వినిపించాయి. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న కాన్వాయిలోకి ఓ టాటా సుమో అకస్మాత్తుగా వచ్చి... కాన్వాయిలోని ఓ కారును ఢీ కొట్టింది. అయితే భగవత్‌కు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పేరెడ్ రోడ్డులో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ భగవత్ కాన్వాయిలోకి ప్రవేశించిన టాటా సుమో హర్యానా నెంబర్ కలిగి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నేతలతో భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశమైన మరుసటి రోజే ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు భయ్యా జోషి, సురేష్ సోనిలతో రాజ్‌నాథ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరగనుండటం, అలాగే ఈనెల 16న ఓట్ల లెక్కింపు ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆ సంస్థ సం యుక్త ప్రధాన కార్యదర్శులు దత్తాత్రేయ హోసబల్, కృష్ణ గోపాల్‌లు కూడా పాల్గొన్నారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని కచ్చితంగా బీజేపీయే ఏర్పాటు చేస్తుందని మోడీ, రాజ్‌నాథ్‌లతో భేటీ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ధీమా వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అలాగే ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన ప్రచార వ్యూహంపైనా సంఘ్ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆర్ఎస్ఎస్కు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇది సాధారణ సమావేశమేనని, దీనికి ఎలాంటి ప్రాధాన్యతా లేదని భేటీ అనంతరం దత్తాత్రేయ వెల్లడించారు. అయితే, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చక్కగా కృషిచేశారని, అందువల్ల సంఘ్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకే రాజ్‌నాథ్ ఇక్కడికి వచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
సంఘ్ మాస్క్.. మోడీ
ఆర్ఎస్ఎస్: కాంగ్రెస్‌కు అసలు ప్రత్యర్థి మోడీ జపం వద్దంటూ సంఘ్ కార్యకర్తలకు మోహన్ జీ భాగవత్ సూచించారని మీడియాలో వార్తలు రాగా దానిపై ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య ఒక ఖండన విడుదల చేశారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవనీ, అందువల్ల స్వయంసేవకులు అందులో తప్పక పాల్గొంటారనీ, పలు జాతీయ అంశాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఆలోచనలను బీజేపీ సమర్థిస్తున్నందున సహజంగానే అది స్వయంసేవకుల ప్రచారం వల్ల లబ్ధి పొందుతుందనీ ఆయన వివరించారు. ఈ కోణం నుంచి ఆర్ఎస్ఎస్ తన ప్రచారక్ అయిన నరేంద్ర మోడీ గెలుపు కోసం సర్వశక్తులూ కేంద్రీకరిస్తోంది. స్వాతి: ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఫలితాలను ప్రభావితం చేయగల సంస్థలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒకటి. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే దీనికి రుజువు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆర్ఎస్ఎస్ తనదైన పద్ధతిలో ఎన్నికల రంగంలోకి దిగింది. అయితే ఆర్ఎస్ఎస్కు సంబంధించినంతవరకు ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. ఈసారి బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ స్వయంగా ఆర్ఎస్ఎస్ పూర్తిసమయ ప్రచారక్ కావడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏబీవీపీ నుండి బీఎంఎస్ వరకు పలు సంఘ్ పరివార సంస్థలునరేంద్ర మోడీకి అనుకూలంగా సాగే ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాయి. మిషన్ 272 ప్లస్ సాధించడమే వాటి తక్షణ లక్ష్యం. బెంగళూరులో 2014 మార్చి 7, 8, 9 తేదీలలో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో వార్షిక నివేదిక సమర్పిస్తూ సర్ కార్యవాహ భయ్యాజీ జోషీ లోక్‌సభ ఎన్నికలను ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. వివేకానంద సార్ధశతజయంతి (150) సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇటీవల 1,47,46,692 ఇళ్లకు వెళ్లి హిందూత్వ సందేశాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తరుణంలో ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్కు కలిసివచ్చింది. ఇదేగాక దేశవ్యాప్తంగా 860 జిల్లాలలో 19,095 ధర్మరక్షా సమితులను ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది. దీనికోసం 480 మంది పూర్తి సమయ కార్యకర్తలు పని చేస్తున్నారు. వీరు గ్రామగ్రామానికీ వెళ్లి ఆర్ఎస్ఎస్ దృక్పథాన్ని వివరించడం, ధర్మరక్షాబంధన్, భారతమాత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదంతా రాజకీయంగా ఆర్ఎస్ఎస్కు ఉపకరించింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చురుకుగా పని చేశారు. ఆ ఎన్నికలు సెమీ ఫైనల్స్ కాగా ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు తుది ఫలితాలను తేల్చేవి కనుక ఆర్ఎస్ఎస్ శ్రేణులు శక్తులన్నిటినీ కేంద్రీకరించి రంగంలోకి దిగాయి. 2013 విజయదశమి నుంచే ఇందుకు సన్నాహాలు జరిగాయి. నాగ్‌పూర్‌లో ఏ బాధ్యతా అప్పగించని సీనియర్ ప్రచారకుల సమావేశం జరిగింది. ఇందులో వేలాదిమంది ప్రచారకులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ (సర్ సంఘ్ చాలక్) మోహన్ భాగవత్ ఇటీవల పది రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో సమావేశాలు నిర్వహించి సంఘ్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలకు సురేశ్ (భయ్యాజీ) జోషీ, కర్ణాటక, బీహార్‌లకు దత్తాత్రేయ హోస్బలే, ఉత్తరప్రదేశ్, అసోంలకు కృష్ణ గోపాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు సురేశ్ సోనీ వంటి అగ్రనేతలు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాల ప్రగతిని సంఘ్ ప్రముఖులు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నారు. ఓటర్లుగా నమోదు చేయించుకోవడం దగ్గర్నుంచి వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి అనుకూలంగా ఓటు వేయించుకునేంత వరకు చేయగలిగినంత చేయాలని సంఘ్ అగ్రనేతలు స్వయం సేవకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా హిందూ ఉన్నత కులాల ఓట్లు, మధ్యతరగతి ఓట్లు బీజేపీకి (ఎన్డీఏ) అనుకూలంగా పడతాయని సంఘ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మైనారిటీల బుజ్జగింపు, కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలు అన్న అంశాలపై ప్రచారం చేయడం ద్వారా ఓబీసీల ఓట్లను కూడా గణనీయంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగినట్లు సమాచారం. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం ప్రధాని పేదరికానికి ఉండే నిర్వచనాన్ని మార్చేశారన్నది ఆర్ఎస్ఎస్ అభియోగం. మైనారిటీలకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకే దేశ వనరులపై మొదటి హక్కు ఉంటుందని మన్మోహన్ సింగ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 52వ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ ఉదాహరిస్తోంది. మతపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీ రిజర్వేషన్ల స్ఫూర్తికి గండిపడుతుందని సంఘ్ భావిస్తోంది. వాటితో పాటు మతహింస బిల్లును, ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఏర్పాటును కూడా ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంటింటి ప్రచారం రాష్ట్ర విభజన విషయంలో ఆర్ఎస్ఎస్ తెర వెనుక కీలకమైన పాత్ర పోషించిన సంగతి గోప్యంగానే ఉండి పోయింది. నిజానికి ఆర్ఎస్ఎస్ స్పష్టమైన నిర్దేశాల వల్లే బీజేపీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సహకరించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలలో కూడా ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గాలు చురుకుగా పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రంలో సంఘ్ పరివార్సంస్థలు ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక కరపత్రాన్ని రూపొందించి ఇంటింటి ప్రచారం సాగిస్తున్నాయి. గత పదేళ్ల యూపీఏ వైఫల్యాలను, కోల్గేట్, రైల్వే బోర్డుస్కామ్ వంటి కుంభకోణాలను ఇందులో ఎండగట్టారు. మోడీ పేరును ఇందులో ప్రస్తావించకపోయినా పాలనా సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. నిజానికి ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ. కనుక అది నేరుగా రాజకీయాలలోకి దిగదు. కానీ తన భావాలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలని అది ఆశిస్తుంది. అందుకోసం తన వంతు ప్రయత్నాలు శక్తివంచన లేకుండా చేస్తుంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ పేరును సంఘ్ పెద్దలు తెరమీదకు తెచ్చారు. నిజానికి 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి, 2009 ఎన్నికల్లో ఎల్కే అద్వానీ సారథ్యాన్ని ఆర్ఎస్ఎస్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆరేళ్ల ఎన్డీఏ పరిపాలన ఆర్ఎస్ఎస్ ఎజెండాను పక్కనబెట్టడమే దీనికి కారణం. వాజ్‌పేయి ప్రభుత్వ ఉదారవాద వైఖరి పట్ల సంఘ్‌కు అనేక అభ్యంతరాలున్నాయి. కాశ్మీర్ 370 అధికరణం, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలు వాజ్‌పేయి ప్రభుత్వం ఎజెండాలో లేనివి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. స్వయంగా ప్రచారక్ అయిన మోడీ ఇప్పుడు బీజేపీ కేంద్ర బిందువు. చేజారిన ఢిల్లీ గద్దెను తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన అదను అని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. రాహుల్ గాంధీతో ఢీ మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ భావజాలమే కారణమని ఫిబ్రవరిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అయితే గాంధీ హత్య దరిమిలా విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది నెహ్రూ హయాంలోనేనన్న సంగతి మరచిపోవద్దని సంఘ్ ప్రముఖులు ఎదురు దాడికి దిగారు. అంతటితో ఊరుకోలేదు. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేశాయి. 2014 మార్చి 11న హైదరాబాద్ సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్పై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాహుల్‌ను డిమాండ్ చేశారు. ఇలా ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్లోనూ కేంద్రబిందువుగా మారింది. తెర మీదకు రాకపోయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు నిజమైన సవాలు విసురుతున్నది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంఘపరివార వర్గం ఇప్పటికే నెటిజన్ల మద్దతును కూడగట్టగలిగింది. అది మిగతా వర్గాలను కూడా ఆకట్టుకోగలుగుతుందా? తన పునాదిని మరింత విస్తరించుకోగలుగుతుందా? వీటికి జవాబు కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ అన్న బీజేపీ ఎన్నికల నినాదం ఎంతవరకు ఫలిస్తుందన్నది నిజానికి ఆర్ఎస్ఎస్ వ్యూహంపైనే ఆధారపడి ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంఘ్ మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి ప్రచారం కీలక రాష్ట్రాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం ప్రచారంలో సంఘ్ పరివార్‌కు చెందిన అన్ని విభాగాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానీ దేశ రాజకీయాలను శాసిస్తుంది.. - ఎన్నికల్లో పాల్గొనదు కానీ ఎవరిని ఎన్నుకోవాలో చెబుతుంది.. - జెండా పట్టదు కానీ ఎజెండా నిర్దేశిస్తుంది.. - రాజకీయ పార్టీ కాదు కానీ దేశవ్యాప్తంగా సుశిక్షితులైన కేడర్ ఉంది.. అదే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ముఖ్యంగా మోడీని ప్రధానిని చేయడం కోసం నిశ్శబ్దంగా పనిచేసుకు పోతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్). - ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థి బీజేపీ అయితే.. తెర వెనక ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఈ ఎన్నికల్లో అది పోషిస్తున్న పాత్రపై కథనం. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్కు 44,982 శాఖలు ఉన్నాయి. 29,624 ప్రాంతాలలో దైనిక శాఖలను నిర్వహిస్తున్నారు. ఇవేగాక 10,146 సాప్తాహిక శాఖలనూ నడుపుతున్నారు. 35 దేశాలలో ఆర్ఎస్ఎస్కు 594 శాఖలున్నాయి. దేశమంతటా ఆర్ఎస్ఎస్కు వేలాదిగా పూర్తిసమయ ప్రచారక్‌లు ఉన్నారు. వారిలో కొందరు బీజేపీలో సంస్థాగత కార్యదర్శులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా ఆర్ఎస్ఎస్ రాజకీయరంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేస్తోంది. నిషేధాల నేపథ్యంలో ప్రస్థానం 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగింది. డాక్టర్జీగా పేరు పొందిన డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ దాని వ్యవస్థాపకులు. మహాత్మా గాంధీ హత్య దరిమిలా 1948 ఫిబ్రవరి 4న నిషేధానికి గురైంది. ఆ తర్వాత గాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని కపూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో బేషరతుగా నిషేధాన్ని తొల గించారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ మరోసారి నిషేధం ఎదుర్కొంది. అనంతర పరిణామాలలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆలోచనలను పంచుకొనే జనసంఘ్ నాడు జనతా పార్టీలో విలీనమైంది. అయితే జనతాప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆర్ఎస్ఎస్లో సభ్యులైనవారు ప్రభుత్వంలో కొనసాగరాదంటూ కొందరు అభ్యంతరపెట్టగా ద్వంద్వ సభ్యత్వ వివాదంతో జనతా సర్కారు కాస్తా పతనమైంది. దరిమిలా ఆర్ఎస్ఎస్ అనుకూలభావజాలంతో బీజేపీ అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సైతం ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. అయితే ఆధారాలు లేకపోవడంతో నిషేధం కొనసాగింపునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలా స్వాతంత్య్రానంతరం ఆర్ఎస్ఎస్ మూడుసార్లు నిషేధానికి గురైంది. ఎంతగా వ్యతిరేకించినా కూడా 1963లో స్వయంగా నెహ్రూ ఆర్ఎస్ఎస్ను రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం విశేషం. ప్రభుత్వ ఆహ్వానం మేరకు సంఘ్ స్వయంసేవకులు నాటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు. -
‘హర్ హర్ మోడీ’పై ద్వారకా పీఠాధిపతి కన్నెర్ర
అహ్మదాబాద్/ఫరూఖాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రచారంలోకి వచ్చిన ‘హర్ హర్ మోడీ’ నినాదంపై ద్వారక పీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు తన అభ్యంతరాన్ని తెలిపారు. ఇలాంటి వ్యక్తి పూజను నిలిపేయాల్సిందిగా ఆయన్ను కోరారు. హర హర మహాదేవ నినాదాన్ని మోడీ నినాదంగా మార్చడాన్ని స్వరూపానంద తప్పుబట్టారు. ఇది శివుడిని అవమానపర్చడమేనన్నా రు. వీటన్నింటిని భాగవత్‌కు తెలిపానని పీటీఐ వార్తా సంస్థకు స్వరూపానంద చెప్పారు. తన అభ్యంతరంపై భాగవత్ వివరణ ఇచ్చారని, తాము కూడా వ్యక్తిపూజకు వ్యతిరేకమని ఆయన చెప్పారన్నారు. ఇక ఆ నినాదం వద్దు: మోడీ ఆ నినాదంపై పీఠాధిపతులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో మోడీ స్పందించారు. తన మద్దతుదారులు భవిష్యత్‌లో ఈ నినాదం చేయవద్దని ట్విట్టర్లో కోరారు. పీఠాధిపతుల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ అన్నారు. -
ఆరెస్సెస్ అనుమతితోనే పేలుళ్లు!
స్వామి అసీమానంద చెప్పారంటున్న ఆ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం న్యూఢిల్లీ: సంరత ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు, అజ్మీర్ షరీఫ్ పేలుళ్లకు హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) అనుమతి ఉందంటూ స్వామి అసీమానంద చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం లేపాయి. పేలుళ్లకు సంబంధించిన హిందూ తీవ్రవాద కుట్రకు ఆరెస్సెస్ ఆమోదం ఉందంటూ ఆ పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్న స్వామి అసీమానంద.. కేరవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఈ అలజడికి కారణమైంది. ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షాలు ఖండించగా, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. ఆ వ్యాఖ్యలు.. - ‘ఆయనేం చెప్పాడో చూద్దాం. ఆయనే విషయాలైనా వెల్లడి చేసి ఉంటే అవి నిజమే కావచ్చు’ - కేంద్ర హోంమంత్రి షిండే - ‘మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు వారు ఏమైనా చేస్తారు’ - కేంద్రమంత్రి బేణిప్రసాద్ వర్మ ‘పేలుళ్లలో పాత్రకు సంబంధించి ఆరెస్సెస్ నాయకత్వంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. వాటిని కేంద్రం తేలిగ్గా తీసుకోవద్దు. సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి’ - బీఎస్పీ అధినేత్రి మాయావతి ‘గతంలో జరిగిన పేలుళ్ల సందర్భంలోనూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలి’ - ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ ‘అసీమానంద చెప్పారని చెబ్తున్న విషయాలన్నీ కల్పితం. నిరాధారం. కుట్రపూరితం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారు. అసీమానంద ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని మెజిస్ట్రేట్ ముందు కూడా స్పష్టంగా చెప్పారు. ఇంటర్వ్యూ ప్రామాణికతపై చాలా అనుమానాలున్నాయి’ - ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ -
మరోసారి కంటతడి పెట్టిన ఉక్కుమనిషి