'మదర్ థెరీసా మతమార్పిడే లక్ష్యంగా పనిచేశారు'
భరత్ పూర్: భారతరత్న మదర్ థెరీసాపై ఆర్సెసెస్ చీఫ్ మోహన్ భగవత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె పేదలకు చేసిన సేవలకు వెనుక మతమార్పిడి అంశం ముడిపడి ఉందని తాజాగా వ్యాఖ్యానించారు. పేదలకు సేవ చేసి వారిని క్రైస్తవ మతంలోకి మార్చడమే ఆమె ప్రధాన ఉద్దేశమని భగవత్ వ్యాఖ్యానించారు. థెరీసా సేవలు ప్రశంసదగినవే అయినప్పటికీ ఆమె వాటిని మత మార్పిడికి ఒక సాధనంగా వినియోగించుకున్నారన్నారు.
రాజస్థాన్ లోని బజేరా గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆపనాఘర్ సమావేశంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేవ పేరుతో మతమార్పిడిన కొనసాగించడం ఆ సేవకు విలువ తగ్గించడమే అవుతుందన్నారు.