నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోగల రేషమ్‌బాగ్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
#WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D
— ANI (@ANI) October 12, 2024
ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి
Comments
Please login to add a commentAdd a comment