Vijayadashami
-
హైదరాబాద్: వేడుకగా రావణ దహనం
హైదరాబాద్, సాక్షి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే దసరా ఉత్సవాలు జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరా నగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రావణ దహన వేడుకలు బస్తీలో కన్నుల పండుగగా నిర్వహించారు. టి పి సి సి కార్యదర్శి విజయా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రావణ దహనాన్ని నిర్వహించారు. డప్పు చప్పులు, రంగురంగుల బాణా సంచాల మెరుపుల మధ్య రావణ దహన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి మోహన్ యాదవ్, రమేష్ చారి, సత్తి గౌడ్, సల్మాన్ రాజ్, సింహం వెంకటేష్, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్‌బాగ్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్‌షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
Devi Navaratrulu 2024: అయ్యవారికి చాలు ఐదు వరహాలు
(ఈ ఫొటోలో ఉన్నది రావణుడు. దసరాకి రావణ దహనం చేస్తారు. అందుకు తయారవుతున్న బొమ్మ ఇది. ఢిల్లీలోనిది ఈ ఫొటో) పిల్లలూ... దేవీ నవరాత్రులను దసరా పండగగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. ఈ పద్యం చూడండి.ఏ దయా మీ దయా మా మీద లేదు,ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,దసరాకు వస్తిమనీ విసవిసలు పడకచేతిలో లేదనక అప్పివ్వరనకపావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,ముప్పావలా అయితే ముట్టేది లేదు,హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,అయ్య వారికి చాలు ఐదు వరహాలుపిల్ల వారికి చాలు పప్పు బెల్లాలుజయీభవా...దిగ్విజయీభవా -
ఈ రోజే ఎందుకు విజయదశమి జరుపుకుంటున్నాం?
మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది... ఎందుకీ గందరగోళం.. విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు. శృంగేరిలో కూడా.. శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం. (చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి) -
విజయదశమి సందర్భంగా దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
-
స్త్రీ శక్తి విజయం విజయ దశమి
ఈ చరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఈ శక్తి లేనట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కృత్యాలైన సృష్టి స్థితిలయాలు నిర్వర్తించటమే కాదు, కదలటం కూడా చేత కాని వారవుతారు. ఆ శక్తినే అదిశక్తి, పరాశక్తి అంటారు. ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలతో శక్తిబీజం సంయోగం చెందితే ‘స్త్రీ’అవుతుంది. అటువంటి త్రిగుణాలతో కూడిన శక్తి ఆవిర్భవించి దుష్టరాక్షస సంహారం చేసిన సమయం శరదృతువు. ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయవలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవలసిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయటం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందటం సంప్రదాయం అయింది. అందరు దేవతల శక్తి ఏకీకృతమై రూపుదాల్చిన శ్రీదేవి రాక్షసులతో యుద్ధంచేసే సమయంలో దేవతలు, ఋషులు ఆమెకు పుష్టి కలగటానికి – యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు, పారాయణలు మొదలైన దీక్షలు పూనారు. మానవులు కూడా ఉడతాభక్తిగా తమకు తోచిన విధంగా దీక్షలు చేయటం మొదలు పెట్టారు. ప్రథమంగా ఆవిష్కృతమైన శక్తి తమోగుణ ప్రధానమైనది. నిర్గుణయైన పరాశక్తి మొదటి సగుణ ఆవిర్భావం తమోగుణమయమైన మహాకాళి. అందువల్లనే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని జగదంబిక త్రిశక్తులలో మొదటిదిగా మహాకాళినే పేర్కొనటం జరుగుతుంది. ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం. సావర్ణి మన్వంతరంలో ఆదిపరాశక్తి రజోగుణ ప్రధానమైన మహాలక్ష్మిగా అవతరించింది. దానికి హేతువు మహిషాసురుడు.ఈ తత్త్వాన్ని వంట పట్టించుకోవటం ఏ కాలం లోనైనా అవసరమే. మహిషాసురులు ఎప్పుడూ ఉంటారు. అందుకే మహిషాసుర మర్దినులైన మహాలక్ష్ముల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మహిషుని సంహరించేందుకు త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన తేజస్సు అమ్మవారిగా ఆకారం ధరించింది. దేవతలందరూ ఆమెకు తమ తేజస్సును, ఆయుధాలను సమకూర్చారు. తన సంహారం కోసమే ఆమె ఆవిర్భవించిందని తెలిసినా మహిషుడు రకరకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. ఆమె అంగీకరించకపోయేసరికి కామరూపి గనుక ఆమెతో రకరకాల రూపాలతో యుద్ధం చేశాడు. ఆ రూపాలకు తగిన రూపాలను ధరించి దేవి మహిషరూపంలో ఉన్న రాక్షసుని సంహరించింది. ఇది జరిగింది ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున. అప్పటివరకు దీక్ష వహించిన వారందరు దశమి నాడు జగదంబను స్తుతించి, అమ్మకు పట్టాభిషేకం చేసి, స్త్రీ శక్తి విజయానికి వేడుకలు చేసుకుని ఆనందించారు. వారి స్తుతులకు సంతసించిన శ్రీ దేవి వారిని వరం కోరుకోమన్నది. తమకు అవసరమైనప్పుడు ఈ విధంగా కాపాడమని కోరారు. ఆమె వారు తలచినప్పుడు అవతరిస్తానని మాట ఇచ్చింది. మరొకప్పుడు శుంభ నిశుంభులనే దానవ సోదరులు వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే – తమకు అమరత్వం ప్రసాదించమని కోరారు. బ్రహ్మ అది తన చేతులలో లేదని, ఇంకేదైన వరం కోరుకోమని అన్నాడు. వారు తమకు అమర, నర, పశు, పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్త్రీలు బలహీనులు కనుక మాకు వారి వల్ల భయం లేదు అని చెప్పారు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్రైలోక్యాధిపత్యాన్ని, యాగభాగాలని కూడా హరించారు. దిక్పాలకులను సూర్యచంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు. దేవతలు బృహస్పతి సూచనననుసరించి హిమవత్పర్వతం మీద ఉన్న దేవిని శరణు వేడారు. జగదంబ వారికి అభయం ఇచ్చింది. ఆ సమయంలో సర్వదేవతలు తమ తమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రక్తబీజుని సైన్యాన్ని మట్టు పెట్టసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు. 1. బ్రహ్మ శక్తి బ్రహ్మాణి. 2. విష్ణువు శక్తి వైష్ణవి 4. కుమారస్వామి శక్తి షష్ఠీ దేవి కౌమారి. 5. ఇంద్రుని శక్తి ఐంద్రి, మాహేంద్రి, ఇంద్రాణి అనే పేర్లు కూడా ఆమెకున్నాయి. 6. ఆదివరాహమూర్తి శక్తి వారాహీ దేవి 7. నృసింహుని శక్తి నరసింహ రూపం నారసింహీ అనే నామం. ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బంధించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది. యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విధంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమసదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూతి కూడ విజృంభించి దానవులను నేలకూల నేస్తూ ఉంటే, చాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్తబీజుని కోపం మిన్ను ముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబిందువు నుండి, ఒక్కొక్క రక్తబీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది. దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్తబీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగివేయ మని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, కింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే, కాళిక తినేసింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది. అపుడు నిశుంభుడు శ్రీదేవితో యుద్ధానికి బయల్దేరాడు. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాసాడు. శుంభుణ్ణి శ్రీదేవి తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోరయుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాటలతో సాధించిన విజయానికి సంకేతం ఇది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది. సామూహికంగా కుంకుమార్చనలు చేసినా, చండీహోమాదులు చేసినా, బొమ్మల కొలువులు పెట్టినా, బతకమ్మలు ఆడినా కనపడేది ఏదైనా పదిమంది కలిసి చేయాలనే ఐక్యభావన. శక్తి స్వరూపమైన స్త్రీ జాతి పట్ల గౌరవ మర్యాదలు నెరపటం. ‘‘యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.’’ నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సాహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్రనామాలతోనే చేస్తారు. జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితో పాఖ్యానంలో వివరించబడింది. ఆమె సర్వచైతన్యస్వరూపిణి కనుక ఆమెను ‘లలిత’ అని పిలిచారు.తమను కన్నతల్లి లాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంటే సుఖపడటం – సుఖపడటం అంటే తినటం, నిద్ర పోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒకటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురవధ చేయటానికి సర్వచైతన్యస్వరూపిణిగా అవతరించింది. బండతనం మీద చైతన్యం విజయం సాధించటానికి సంకేతం విజయదశమి. శరన్నవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా! సమాజంలో ఎప్పుడూ మంచి చెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయ దశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడుపడుతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచనలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు కావచ్చు, ప్రకృతిని, పర్యావరణాన్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చును, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికి ఉండాలనే స్వార్థం కావచ్చును, ఒక జాతినో, వర్గాన్నో చులకన చేసే అహంకారం కావచ్చు ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చును – ఇటువంటి ఎన్నో చెడులక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయ దశమి. ముఖ్యంగా స్త్రీ పట్ల చులకన భావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయ దశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుంటూ జమ్మి పత్రాలని బంగారం, వెండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు. – డాక్టర్ ఎన్ .అనంతలక్ష్మి -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
విజయవాడ : సాంస్కృతిక సంబరం అంబరాన్నంటింది (ఫొటోలు)
-
కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు. -
సీఎం జగన్‌కు ‘విశాఖ వందనం’
సాక్షి, విశాఖపట్నం: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి పరిపాలించాలని తీసుకున్న నిర్ణయాన్ని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ స్వాగతించింది. విశాఖకు తరలిరానున్న ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయించింది. మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని జేఏసీ తీర్మానం చేసింది. సర్క్యూట్ హౌస్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ నేతృత్వంలో శనివారం జరిగిన సమీక్షలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో సహా పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వస్తే.. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయన్నారు. తాను ఇటీవల కాలంలో సర్వే చేస్తే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి 98 శాతం వరకు మద్దతు పలికారని తెలిపారు. స్పష్టమైన నిర్ణయంతో సీఎం జగన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వృథా ఖర్చులు చేసిందన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతిలో రాజధాని నిర్మించాలనుకున్నారని, అదీ సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని చెప్పారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖకు రాజధానిని తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులున్నా.. సీఎం రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా పాలన సాగించవచ్చన్న భావనతో విశాఖ వైపు అడుగులేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు.. ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్ విజయకుమార్, నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ జార్జ్ విక్టర్, వ్యాపారవేత్త ముస్తఫా, ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, డాక్టర్ ఎస్.రామారావు, ఏపీ హోటల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్, ఏపీ ఎన్జీవో ప్రతినిధి కె.ఈశ్వరరావు, ఏయూ ప్రిన్సిపాల్ శోభాశ్రీ, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రతినిధి కృష్ణమోహన్, ప్రొఫెసర్ షారోన్‌రాజ్, విశాఖ మత్స్యకార సంఘాల అధ్యక్షుడు జానకీరామ్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్ సూర్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణే‹Ùకుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయాలనిచ్చే విజయదశమి...
-
అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ రెడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్‌పేట్‌లో దుర్గామాత ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. కళాకారులు వీటికి రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరం వేదికగా దసరా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ఆదివారం ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. (క్లిక్: దాండియా జోష్...స్టెప్పులు అదరహో..) 26 నుంచి రామాయణ్ మేళా అబిడ్స్: ఈ నెల 26 నుంచి 50వ రామాయణ మేళా వేడుకలు నిర్వహిస్తున్నట్లు రామాయణ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్‌రాఠి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామాయణ మేళాలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే రామాయణ్ మేళాలో ప్రతి రోజు రామాయణం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. 29 నుంచి 3వ తేదీ వరకు గర్బా దాండియా నిర్వహిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా వేడుకలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దసరా రోజు అక్టోబర్ 5న వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం, శమీ పూజ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమల్‌నారాయణ అగర్వాల్, గిరిధర్ లాల్, మనోజ్ జైస్వాల్, రామ్‌దేవ్, సుమిత్‌రాఠి పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు) -
ఆర్టీసీకి ‘విజయ’ దశమి
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా ప్రయాణికుల ముందుకు ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురానుంది. 1,016 కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. మూడు రకాల కేటగిరీలకు సంబంధించి రెండింటికి అశోక్ లేల్యాండ్, మరో రకానికి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేశాయి. ఆ ధరలను మరికాస్త తగ్గించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం ఆయా సంస్థల ప్రతినిధులతో బేరం కోసం భేటీ కానున్నారు. కనీసం ఒక్కో బస్సుపై రూ. లక్ష చొప్పున తగ్గించేలా ఒప్పిం చాలని ఆర్టీసీ యత్నిస్తోంది. ఈ బస్సులను ఆయా కంపెనీలు దసరా నాటికి ఆర్టీసీకి అందించనున్నాయి. తొలిసారి స్లీపర్ బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 90 శాతం స్లీపర్ బస్సులే నడుపుతుండటంతో వాటికి ప్రయాణికుల ఆదరణ మెరుగ్గా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకోవాలంటే స్లీపర్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 16 స్లీపర్ బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. 30 బెర్తులతో కూడిన ఒక్కో ఏసీ బస్సుకు రూ. 50 లక్షల వరకు అశోక్ లేల్యాండ్ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. సోమవారం జరిగే చర్చల తర్వాత కొనుగోలు ఆర్డర్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి సొంత బస్సులు 6,200 వరకు ఉండగా వీటిలో దాదాపు వెయ్యి బస్సులు కాలంచెల్లి తుక్కుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తగినన్ని బస్సులు లేక చాలా ప్రాంతా లకు ప్రజారవాణా దూరమైంది. ఆ సంఖ్య మరింత తగ్గకుండా ఇప్పుడు 1,016 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటి తర్వాత హైదరాబాద్ సిటీ రీజియన్ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. రూ. 340 కోట్ల ఖర్చుతో.. గతంలో ఇంజన్ ఛాసిస్‌లను మాత్రమే ఆర్టీసీ వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసి బాడీలను మాత్రం సొంతంగా ఏర్పాటు చేసుకొనేది. ప్రస్తుతం ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ బలహీనపడినందున బాడీలతో కలిపే బస్సులు కొనే యోచనలో ఉంది. ఇందుకోసం టెండర్లలో ఛాసిస్లు, బాడీతో కలుపుకొని అనే రెండు రకాల ధరలను ఆహ్వానించింది. ధరల తగ్గింపుపై కంపెనీలతో చర్చల తర్వాత ఏది కొనాలనే విషయమై నిర్ణయం తీసుకోనుంది. బస్సుల కొనుగోలుకు సుమారు రూ. 340 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. సూపర్ లగ్జరీ బస్సులే ఎక్కువ.. ఆర్టీసీ కొననున్న బస్సుల్లో 630 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. ఈ కేటగిరీలో అశోక్ లేల్యాండ్ కంపెనీ తక్కువ కోట్ చేసింది. ఛాసిస్ అయితే ఒక్కో బస్సు ధరను రూ. 20 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 35 లక్షల వరకు కోట్ చేసింది. ఈ బస్సు 12 మీటర్ల పొడవు ఉండనుంది. ఇక 370 ఎక్స్‌ప్రెస్ బస్సులకు సంబంధించి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేసింది. 11 మీటర్ల పొడవుండే ఈ బస్సులకు ఒక్కో దానికి ఛాసిస్ అయితే రూ. 15 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 25 లక్షల వరకు కోట్ చేసినట్లు తెలిసింది. ఈ బస్సులకు సంబంధించి ఛాసిస్లే కొనుగోలు చేసి బాడీని విడిగా తయారు చేయించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సూపర్ లగ్జరీ వరకు బాడీతో కలుపుకొనే కొంటే బాగుంటుందనే యోచనలో ఉంది. -
Photo Story: ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం
బాసరలో ముగిసిన ఉత్సవాలు భైంసా(ముధోల్): దేవీనవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాసరలోని మహాలక్ష్మీ, మహంకాళి, వేదవ్యాసుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. హారతి ఘాట్‌లో గంగమ్మతల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబురం సాక్షి వరంగల్: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లా‹స్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో శుక్ర , శనివారం సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలుఅంబరాన్నంటాయి. 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ మహిళలు ఆడిపాడారు. వాయినం ఇచ్చుకుని బంగారు బతుకమ్మలను నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అబ్రేటీఎక్స్లోని బిగ్ రాంచ్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్‌లో ఆయుధ పూజ సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు జరిపారు. వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్‌పై దేవస్థానం ఈఈ భాస్కర్ మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. హంస వాహనం ఇప్పటికే సిద్ధమవగా, వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణానదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. దుర్గమ్మ ఆదాయం రూ.18.08 లక్షలు వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం అమ్మవారికి రూ.18.08 లక్షల ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. మూలానక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. -
జయాభి జై భవ! జయోస్తు!
గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్ మొదలయ్యేవి. ఒక పద్యం తప్పక అయ్యవార్లు పిల్లలకు నేర్పించేవాళ్లు. ‘ధరా సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై...’ అనే పద్యం చాలా ప్రసిద్ధి. పిల్లలం దరికీ నోటికి పట్టించేవారు. దసరా అంటే శరన్నవ రాత్రోత్సవాలలో పిల్లల విద్యా ప్రదర్శన, దాంతోపాటు గురు దక్షిణ స్వీకారం జరిగేది. ఈ పద్యం ఏ మహాను భావుడు రచించాడో చాలా గొప్పది. దేవుణ్ణి పొగిడి, పొగిడి ఆఖరికి ‘వర్ధిల్లు నారాయణా’ అంటూ దీవెనలు పెడతాడు. ధరా సింహాసనమై, భూమి ఆసన్నమై, ఆకాశం గొడుగై, దేవతలు సేవకులై, వేదాలు స్తోత్ర పాఠకులై, శ్రీగంగ కుమార్తె కాగా ‘నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారా యణా’ అంటూ పూర్తి అవుతుంది. అనాదిగా వస్తున్న దసరా పద్యాలలో ఇదొకటి. తర్వాత పిల్లలు జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ బడి పిల్లలు జై కొడుతూ అయ్యవారి వెంట బయలు దేరతారు. ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ప్రతి గడపా వేయికళ్లతో ఎదురుచూసేది. ఆడ, మగ పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, మగ పిల్లలు విల్లమ్ములు, ఆడ పిల్లలు ఆడే కోతి బొమ్మలు పట్టుకుని పాటలతో, వీధుల వెంట సందడి చేసేవారు. ఆ చిన్న విల్లమ్ములు చిత్రంగా ఉండేవి. దాంతో గులాములు కొట్టడానికి వీలుండేది. ఆడ పిల్లలు కొత్త పరికిణీలు వేసుకుని కోతిని ఆడిస్తూ ఆట పట్టించేవారు. పిల్లలు ఇంటింటికీ తిరిగేవారు. జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు! పావలా అయితేను పట్టేది లేదు! అర్ధరూపాౖయెతే అసలే మాకొద్దు! అయ్యవాండ్రకు చాలు ఐదు వరహాలు! పిల్ల వాండ్రకు చాలు పప్పుబెల్లాలు! అంటూ యాగీ చేసేవారు. వీధి బడిలో ఏడాది పొడుగునా చదువు చెప్పిన వారికి ఐదు వరహాలు గురుదక్షిణ. వరహా అంటే నాలుగు రూపా యలు. ఆ రోజుల్లో అయ్యవార్లు ఎంతటి అల్ప సంతో షులు! ఇది విజయదశమి నాటి సంరంభం. ముందు రోజు ఆయుధపూజ. అదీ మరీ పెద్ద ఉత్సవం. రైతుల దగ్గర్నించి, పల్లెల్లో పట్టణాల్లో ఉండే సమస్త చేతివృత్తుల వారు తాము నిత్యం వాడే పరిక రాలను ఆయుధాలుగా భావించి వాటికి సభక్తికంగా పూజలు చేస్తారు. దీనికి రకరకాల ఐతిహ్యాలు చెబుతారు. పాలపిట్టని చూస్తే శుభమని తెలంగాణ ప్రాంతీయులు నమ్ముతారు. వెండి బంగారం అంటూ జమ్మి ఆకులు ఇచ్చి పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణలో జానపదుల బతుకమ్మ పండుగ దసరాతో కలిసే వస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రిళ్లలో రోజుకో అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఇట్లా పదిరోజులు సాగే పెను పండుగ మరొకటి లేదు. దేశమంతా కనకదుర్గ, మహంకాళి అమ్మవారి ఉత్సవాలు రకరకాల పేర్లతో వైభవంగా జరుగు తాయి. మన దేశం అన్ని విషయాలలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా పండుగలూ పర్వాలనూ పంచాంగం చెప్పిన ప్రకారం జరుపుకుంటోంది. ఇదొక విశ్వాసం, ఇదొక నమ్మకం. ఎన్నో తరాలుగా, ఆర్ష సంప్ర దాయం అనుసరించి వస్తున్న పండుగలు పచ్చాలు భక్తిప్రపత్తులతో చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మన సంప్రదాయాన్నీ, ఆచారాన్నీ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెజవాడ దుర్గమ్మకి సభక్తికంగా రాష్ట్ర ప్రజలపక్షాన పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ప్రజలు ఆనందించారు. మన దేశంలో పెద్ద నదులన్నింటికీ పుష్కరాలు జరుగుతాయి. గంగానది సాక్షాత్తూ శివుడి తలమీంచి జనావళి కోసం దిగి వచ్చిందని మనం నమ్ముతాం. భగీరథుడి కృషికి దివి నుంచి భూమికి గంగ దిగి వచ్చింది. గంగ పుష్కరాలని కుంభమేళాగా వ్యవహరిస్తారు. సాధు సంతులు, సంసారులు, సామాన్యులు కుంభమేళా గంగ స్నానాలు ఆచరిస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన నాటి మన ప్రధాని నెహ్రూని, మీరు ఇలాంటి వాటిని నమ్ముతారా అని ఓ పత్రికా ప్రతినిధి అను మానంగా అడిగాడు. అందుకు జవహర్లాల్ ఏ మాత్రం తొట్రుపడకుండా– ‘కోట్లాది మంది విశ్వాసాల్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఉంటే నమ్మకం. గౌరవం అంటే నమ్మకం’ అని జవాబు ఇచ్చారు. ఎక్కువమంది విశ్వసించే వాటిని గౌరవించడం కూడా ఒక సంస్కారం. మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరు దసరా. అందుకే విజయదశమి అయింది. ఇహ నించి జాతికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవన్తు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పండగే పండగ.. మనకు కాదు.. కరోనాకు..
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఒకవైపు... కరోనా వేళ బతుకలేనమ్మ మరోవైపు.. గుంపులు, గుంపులుగా చేరి పండగ చేసుకుందామంటే.. గుబులు గుబులుగా ఉంది పరిస్థితి. ఓనం పండగ తర్వాత కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళీయులు కేరళకు వెళ్లడం, అక్కడ పండగను సందడిగా నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా, దీపావళి పండగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ ఉత్సవాలను జరుపుకోలేదు. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను నిర్వహిస్తే వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తెలంగాణకు ప్రాణం బతుకమ్మ... తెలంగాణ పండగల్లో కీలకమైనది దసరా. బతుకమ్మ ఆటపాటలు మరీ ముఖ్యమైనవి. వీటిని ఆడపడుచులు ఒకచోట గుమిగూడి నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ చేపడుతోంది. బతుకమ్మ పండగను పురస్కరించుకొని మహిళలు ఒక చోట నుంచి మరోచోటకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు. ఆ తర్వాత క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసగా ఉన్నాయి. వాటి విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై సర్కారులో తర్జనభర్జన సాగుతోంది. కేసుల పెరుగుదలతో జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. పల్లెల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజుకు పది వరకు కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం సీజన్ దాటి చలికాలం ప్రారంభ దశలో ఉన్నాం. సహజంగా వైరస్ వ్యాప్తికి చలికాలం వాహకంగా ఉంటుంది. ఫ్లూ వంటి వ్యాధులు ఈ కాలంలోనే విజృంభిస్తాయి. ఎలా నిర్వహించుకోవాలి? ఈ పండగల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీకాలేదు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కొన్ని సూచనలు చేస్తున్నారు. ► భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ► పండుగల సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా చూసుకోవాలి. ► పండగలకు బంధువులను పిలవకుండానే ఎవరికివారు తమ ఇళ్లలో నిర్వహించుకోవాలి. ► కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసోలేషన్‌లోనే ఉండాలి. పండగలకు హాజరుకాకూడదు. ► దీపావళి విషయంలో ఇదే మాదిరి చర్యలు తీసుకోవాలి. -
అందుకే ఆమెను పెళ్లాడాను..
కోల్‌కతా : దేశమంతా విజయదశమి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఓ యువజంట దుర్గాదేవి ఆశీస్సులతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చాటింగ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. నేరుగా కలిసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. దుర్గామాత సాక్షిగా తమ మధుర క్షణాలను జీవితకాలపు ఆల్బమ్‌లో పదిలపరచుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున జరిగిన దసరా వేడుకల్లో చోటుచేసుకుంది. హింద్ మోటార్‌కు చెందిన సుదీప్ ఆప్టిక్ లెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతడికి సియోరాఫులికి చెందిన ప్రతిమతో పరిచయం ఏర్పడింది. జూలై 25న ఫేస్బుక్లో ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్న వీరి మధ్య స్నేహబంధం బలపడింది. ఈ క్రమంలో అక్టోబరు 6న హుగ్లీ నది ఒడ్డున జరుగుతున్న విజయదశమి వేడుకలకు సుదీప్ హాజరయ్యాడు. ప్రతిమ కూడా అక్కడికి దగ్గర్లోనే ఉన్న మరో వేదిక వద్ద ఉందని తెలుసుకుని.. ఒకసారి నేరుగా కలుద్దామని ఆమెను కోరాడు. ఇందుకు ప్రతిమ అంగీకరించడంతో ఓ పూజా మండపంలో తొలిసారి కలుసుకున్నారు. చూపులు కలిసిన శుభవేళే సుముహూర్తం అన్నట్లుగా ప్రతిమను చూసిన నాలుగు గంటల్లోనే సుదీప్ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయగా... మౌనమే ఆమె అంగీకారమైంది. ఇక అక్కడే ఉన్న భక్తులు, ప్రతిమ-సుదీప్‌ల స్నేహితులు హర్షధ్వానాలతో వారిని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో సుదీప్.. ప్రతిమ నుదుటన సింధూరం దిద్ది పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఇరువురు పూలదండలు మార్చుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఈ విషయం గురించి సుదీప్ మాట్లాడుతూ..‘ ముందు మేమిద్దరం మంచి స్నేహితులం. తర్వాత తనతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో తెలీదు. ప్రతిమ నా పేరిట సింధూరం ధరించాలని భావించింది. ముహుర్తాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. అందుకే తనను పెళ్లాడాను అని చెప్పుకొచ్చాడు. ఇక సుదీప్‌లోని అమాయకత్వం, దయాగుణమే తనను ఆకర్షించిందని.. అందుకే తన మాట కాదనలేకపోయానని చెబుతూ సిగ్గులమొగ్గయింది. ఈ పెళ్లిని తన తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం తమ బంధాన్ని అంగీకరించారని హర్షం వ్యక్తం చేసింది. అత్తగారు కూడా తనను చూసి చాలా సంతోషపడ్డారని.. సుదీప్తో తన పెళ్లి జరగడంతో వారింట ఆనందాలు వెల్లివిరిశాయని పేర్కొంది. -
బన్నీ ఉత్సవం రక్తసిక్తం.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ రణరంగంలో 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా దేవరగట్టు కొండలో వెలసిన మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధానికి దిగడం అక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. దీనిలో భాగంగా ఏటా దసరా పర్వదిననం రోజు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాలు ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్దరాత్రి కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయల్దేరుతారు. ఈ సందర్భంగా విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అయితే ఈ సంప్రదాయంపై పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆనవాయితీ పేరిట ఏటా ఈ రక్తపాతం జరుగుతూనే ఉంది. -
పండగకు పోటెత్తిన పూలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ నేపథ్యంలో నగరానికి పూలు పోటెత్తాయి. గత వారమంతా బతుకమ్మ సందడి, నవరాత్రలతో పూలకు గిరాకీ బాగా ఉండగా...దసరాకు అది మరింత పెరిగింది. దీంతో గ్రేటర్ శివారు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం నగరానికి పూలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలతోపాటు డెకరేషన్‌కు ఉపయోగించే పూలకు డిమాండ్ బాగా ఉంది. దసరాకు ఆయుధపూజలు నిర్వహించడంతోపాటు వాహనాలు, షాపులు, వివిధ సంస్థలను పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పూల విక్రయాలు పెరిగాయి. ఈసారి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గులాబీ, చామంతి, బంతితో పాటు ఇతర పూలు ఎక్కువ మొతాదులో మార్కెట్‌కు వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం మర్కెట్‌కు బంతి సుమారు 2 వేల క్వింటాళ్లు, చామంతి 800 క్వింటాళ్లు దిగుమతి అయ్యాయని మార్కెట్ వర్గాల అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా కనకాంబరం పూల ధర రికార్డు స్థాయిలో కిలో రూ.1500 పలికిందని మార్కెట్ అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంతి పూలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు అంచనా. బంతిపూల ధరలు తక్కువగా ఉండడంతో జనం ఇతర పూల కంటే వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. దిగుమతులు అధికమవడం వల్లే బంతి పూల ధరలు తగ్గాయని వ్యాపారులు, రైతులు అంటున్నారు. గత ఏడాది బంతి రూ.50 నుంచి 80 రూపాయలు ధర పలికితే...ఈ ఏడాది రూ.50–30 మధ్యే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతో తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. కేవలం కనకాంబరాల దిగుమతి తక్కువగా ఉండడం వల్లే రేటు బాగా పలికిందన్నారు. రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు గతేడాది బంతి పూల ధర కిలో రూ.50 లోపే ఉండగా...చామంతి ధర అత్యధికంగా రూ.100 ఉంది. ఈ ఏడాది శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మోతాదులో ప్రత్యేకంగా బంతి, చామంతి, సెంట్‌గులాబీ, కాగడాలు, లిల్లీ తదితర రకాల పూలు దిగుమతి అయ్యాయి. డిమాండ్‌కు సరిపడ దిగుమతులు ఉంటే ధరలు సర్వసాధారణంగా పెరగవు. డిమాండ్‌కు తక్కువగా దిగుమతులు ఉంటే ధరలు పెరుగుతాయి. ధరలు మరింత పడిపోకుండా నియత్రించడానికి ప్రయత్నించాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
దసరానాడు జమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు?
విజయదశమినాడు శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవా సం పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ’అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు. అంతకన్నా ముందు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు. -
సర్వం శక్తిమయం
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః... చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసినదే. లోక కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన సందర్భంగా దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కూడా తెలిసినదే. విజయదశమికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు రావణుడిని వధించినది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజేనని కూడా పురాణగాథలు ఉన్నాయి. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పన్నెండేళ్ల అరణ్యవాసం తర్వాత విరాటరాజు కొలువులో పాండవులు ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే ద్రౌపదిని వేధించిన కీచకుడిని భీముడు హతమారుస్తాడు. కీచకుడి మరణవార్త విన్న దుర్యోధనుడు పాండవులు విరాటరాజు వద్ద తలదాచుకుని ఉంటారని తలచి, విరాట రాజ్యంపై దండెత్తాడు. అప్పటికి అజ్ఞాతవాసం గడువు తీరిపోతుంది. కౌరవులు ఉత్తర గోగ్రహణానికి పాల్పడినప్పుడు ఉత్తరకుమారుడి సారథిగా బృహన్నల వేషంలో వెళ్లిన అర్జునుడు, కౌరవసేనను చూసి భీతిల్లిన ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పి, జమ్మిచెట్టుపై దాచి ఉంచి ఆయుధాలను బయటకు తీస్తాడు. జమ్మిచెట్టు మీద నుంచి విజయుడనే పేరు గల అర్జునుడు ఆయుధాలను తీసిన రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి కావడంతో, ఈ రోజుకు విజయ దశమిగా పేరు వచ్చిందనే గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. విజయదశమి రోజున భారతదేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. దసరా రోజున దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. దుర్గా ఆలయాలతో పాటు అన్ని శక్తి ఆలయాల్లోనూ శక్తి స్వరూపాలుగా తలచే గ్రామదేవతల ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ వేడుకలు దశమి నాటితో పూర్తవుతాయి. సనాతన సంప్రదాయంలో శాక్తేయం ప్రత్యేక మతంగా ఉండేది. కొన్నిచోట్ల జంతుబలుల వంటి పద్ధతులపై ఆంక్షలు ఉన్నా, దసరా వేడుకలు చాలావరకు శాక్తేయ పద్ధతుల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రులలో దుర్గాదేవిని నవరూపాలలో ఆరాధిస్తారు. దుర్గాదేవికి గల ఈ తొమ్మిది రూపాలనే నవదుర్గలని అంటారు. ఇదేకాకుండా, అమ్మవారిని దశమహావిద్య రూపాల్లోనూ ఆరాధిస్తారు. నవదుర్గలు నవదుర్గల పేర్లు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు దుర్గా దేవిని ఈ రూపాలలో పూజిస్తారు. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయినీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిద్ధిదాప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా దుర్గాదేవికి గల ఈ తొమ్మిది నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పినట్లు ప్రతీతి. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని కొందరు నవదుర్గలను కులదైవంగా ఆరాధిస్తారు. చండీ సప్తశతిలో అమ్మవారికి మరో తొమ్మిది పేర్లు ప్రస్తావించి ఉన్నాయి. అవి: మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. అయితే, ఈ నామాలను నవదుర్గలుగా వ్యవహరించలేదు. నవదుర్గల ప్రాచీన ఆలయం మొదట గోవాలోని రేడి ప్రాంతంలో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన పోర్చుగీసువారు ఆలయ వ్యవహారాల్లో దాష్టీకం చలాయించడంతో పదిహేడో శతాబ్దిలో ఆ ఆలయంలోని దేవీ దేవతా మూర్తులన్నింటినీ మహారాష్ట్రలోని వెంగుర్లకు తరలించి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శాక్తేయం చరిత్ర వేదాలలో ఎక్కడా అమ్మవారి ప్రస్తావన ప్రత్యేకంగా లేదు. అయితే, సింధూలోయ నాగరికత కాలంలోనే ఆదిశక్తి ఆరాధన వాడుకలో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. సింధూలోయ నాగరికతకు చెందిన ప్రజలు శివుడిని పశుపతిగా, లింగమూర్తిగా ఆరాధించేవారు. ఆదిశక్తిని జగజ్జననిగా, లోకమాతగా ఆరాధించేవారు. ఉపనిషత్తులలో ‘ఉమ’ పేరిట అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో ఆదిశక్తిని ‘మహామాయ’గా ప్రస్తావించడం కనిపిస్తుంది. లలితా సహస్రనామం, చండీ సప్తశతి వంటి అమ్మవారి స్తోత్రాలు దాదాపు మహాభారత కాలం నాటివని చరిత్రకారుల అంచనా. లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలోనిది. క్రీస్తుశకం మూడో శతాబ్దం నాటికి భారత ఉపఖండంలో శాక్తేయ మతం బాగా వ్యాప్తిలో ఉండేది. త్రిపురా ఉపనిషత్తును శాక్తేయ సంప్రదాయంలోని తాంత్రిక విధి విధానాలకు మూలంగా భావిస్తారు. పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు త్రిపురా ఉపనిషత్తుకు భాష్యాన్ని రాశాడు. దేవీభాగవతం, కాళికా పురాణం వంటి ఉపపురాణాల్లో అమ్మవారి గాథలు విపులంగా ఉంటాయి. దేవీభాగవతంలోని సప్తమ స్కందాన్ని ‘దేవీగీత’గా పరిగణిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తానేనని, సరస్వతి లక్ష్మి పార్వతులు తానేనని, సూర్యచంద్రులు, నక్షత్రాలు తానేనని... సమస్త చరాచర సృష్టి తానేనని అమ్మవారు స్వయంగా వెల్లడించినట్లుగా దేవీభాగవతం చెబుతోంది. దేవీ తత్వాన్ని శ్లాఘిస్తూ, ఆదిపరాశక్తిని స్తుతిస్తూ అద్వైత మత వ్యవస్థాపకుడు ఆదిశంకరాచార్యులు ‘సౌందర్య లహరి’ని రచించారు. ‘సౌందర్యలహరి’ని శ్రీవిద్యా రహస్యాలను బోధించే మంత్రంగా, తంత్రంగా, దేవీ సౌందర్యాన్ని కీర్తించే స్తోత్రంగా, అద్భుత ఛందోవిన్యాసంతో రచించిన కావ్యంగా పరిగణిస్తారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికి కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఆదిశక్తిని ప్రధాన దైవంగా లలితా త్రిపురసుందరి రూపంలో ఆరాధించే ‘శ్రీకుల’ సంప్రదాయం ఉంది. శాక్తేయంలో ఇదొక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించేవారు శ్రీవిద్య ఆరాధన సాగిస్తుంటారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి శాక్తేయం దక్షిణాదికి కూడా విస్తరించింది. దక్షిణాదిలో కూడా ఎక్కువగా శ్రీకుల సంప్రదాయమే పాటిస్తారు. శాక్తేయంలో మరో ప్రధాన సంప్రదాయమైన ‘కాళీకుల’ సంప్రదాయం నేపాల్‌తో పాటు ఉత్తర భారత, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడుకలో ఉంది. కాళీకుల సంప్రదాయానికి చెందిన వారు ఎక్కువగా కాళి, చండి, దుర్గ రూపాల్లో ఆదిశక్తిని ఆరాధిస్తారు. ఆదిశక్తి రూపాలైన దశమహావిద్యల ఆరాధన, సాధన కొనసాగిస్తుంటారు. దసరా నవరాత్రుల వంటి ప్రత్యేకమైన పర్వదినాలలో అమ్మవారికి తాంత్రిక పద్ధతుల్లో కోళ్లు, మేకలు, దున్నపోతులు వంటి జంతువులను బలి ఇస్తారు. నేపాల్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో నవరాత్రి వేడుకల్లో జంతుబలులు జరుగుతాయి. దశ మహావిద్యల ప్రశస్తి ఆదిశక్తికి గల పదిరూపాలను దశ మహావిద్యలుగా భావిస్తారు. శాక్తేయ సంప్రదాయం పాటించేవారు ఈ విద్యలను సాధన చేస్తారు. గురుముఖత మంత్రోపదేశం పొంది, నియమబద్ధంగా వీటిని సాధన చేయడం వల్ల ఇహపరాలలో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. దశ మహావిద్యలలో మొదటిది కాళి. ఏళ్ల తరబడి యోగసాధనలో సాధించలేని ఫలితాలను కాళీ సాధనతో శీఘ్రంగానే సాధించవచ్చని ప్రతీతి. కవి కాళిదాసు కాళీ సాధనతోనే గొప్ప విద్యావంతుడయ్యాడంటారు. రెండో విద్య తార. తారా ఉపాసకులలో వశిష్ట మహర్షి ప్రసిద్ధుడు. మూడవది ఛిన్నమస్త. హిరణ్యకశిపుడు వంటివారు ఛిన్నమస్త సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాలుగవది షోడశి. షోడశి ఆరాధన జ్ఞానసంపద, ఐశ్వర్య సంపద కలిగిస్తుందని ప్రతీతి. ఐదవది భువనేశ్వరి. భువనేశ్వరీ సాధన మానసిక స్థైర్యాన్ని, శాంతిని, ఐహిక ఆముష్మిక ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరవది త్రిపుర భైరవి. ఈ విద్య సాధన ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందవచ్చని అంటారు. ఏడవది ధూమావతి. ధూమావతి సాధనతో దారిద్య్రబాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఎనిమిదవది బగళాముఖి. శత్రుబాధ తొలగడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పరశురాముడు బగళాముఖి సాధన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మాతంగి. మాతంగి సాధనతో సమస్త మనోభీష్టాలూ నెరవేరుతాయని నమ్ముతారు. పదవది కమల. భృగు మహర్షి పూజించడం వల్ల ఈ దేవతను భార్గవి అని కూడా అంటారు. కమలా సాధన వల్ల సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. దశ మహావిద్యల ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాళీ ఆరాధన వల్ల శని గ్రహదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు తారా ఆరాధన చేయడం వల్ల ఫలితం పొందవచ్చు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి. చంద్రగ్రహ దోషం నుంచి ఉపశమనానికి భువనేశ్వరిని ఆరాధించాలి. రాహు దోష విమోచన కోసం ఛిన్నమస్తను, కేతు దోష పరిష్కారం కోసం ధూమావతిని ఆరాధించాలి. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. జాతకంలో రవిగ్రహం బలహీనంగా ఉంటే మాతంగిని ఆరాధించాలి. శుక్రగ్రహ దోషాల నుంచి ఉపశమనానికి కమలను ఆరాధించాలి. ఇక జన్మలగ్నమే దోషభూయిష్టంగా ఉంటే భైరవిని ఆరాధించడం ద్వారా ఫలితం ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. గ్రహదోషాలకు ఇతరేతర ఉపశమన పద్ధతులు ఎన్ని ఉన్నా, వాటితో పోల్చుకుంటే దశ మహావిద్యల సాధన వల్ల శీఘ్ర ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇతర మతాలపై ప్రభావం దేవీ ఆరాధన ప్రధానమైన శాక్తేయం ఇతర మతాలను కూడా ప్రభావితం చేసింది. బౌద్ధ, జైన మతాలలో శాక్తేయ తాంత్రిక పద్ధతులు కనిపిస్తాయి. ముఖ్యంగా బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతుల్లో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. సనాతన మతాలైన శైవ, వైష్ణవాలపైన కూడా శాక్తేయం గణనీయమైన ప్రభావం చూపింది. శక్తి రూపాలైన మాతృకలను బౌద్ధులు పూజించేవారు. బౌద్ధ మాతృక కుడ్యశిల్పాలు ఎల్లోరా గుహలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం ఆరు–ఏడు శతాబ్దాల మధ్యకాలం నాటివని చరిత్రకారుల అంచనా. ఈ గుహలలోనే దుర్గాదేవి సహా ఇతర దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. జైనులు శక్తిరూపాలైన విద్యాదేవతలను, శాసనదేవతలను పూజించేవారు. ఇక సిక్కుల దశమగ్రంథంలో గురు గోవింద్‌సింగ్ చాలా శాక్తేయ దేవతలను ప్రస్తావించారు. వీటిలో చండీ ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. – పన్యాల జగన్నాథదాసు దశ మహావిద్యల ఆలయాలు దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం...కోల్‌కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్‌లో రక్షకాళీ ఆలయం, కటక్‌లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్లో బీర్భూమ్ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్‌లోను, భవన్లోను, బహిదా బాఘ్‌లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లా ఉడాల్‌కోట్‌లోను, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్‌నగర్ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గాంవ్‌లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి. ఒడిశాలోని బౌ«ద్ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్‌లోని రాజ్రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్గోడ్ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా నల్ఖేడా గ్రామంలోను, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోను, పంజాబ్‌లోని లూధియానాలోను, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్‌లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి.