మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది...
ఎందుకీ గందరగోళం..
విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది.
మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు.
శృంగేరిలో కూడా..
శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం.
(చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి)
Comments
Please login to add a commentAdd a comment