
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు.