National Highways
-
త్వరలో కొత్త టోల్ పాసులు.. హైవేలపై నో టెన్షన్!
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికే జీవిత కాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బేస్ టోల్ రేటును కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉంది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం రూ. 3 వేలు మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్ గేట్నైనా ఈ పాస్‌తో దాటొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది. కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై పని చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. -
పండుగ ప్రయాణం సురక్షితం చేద్దాం
కోదాడ/ సూర్యాపేట టౌన్/ చౌటుప్పల్ రూరల్/పాలమూరు: జాతీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. సాధారణ రోజుల్లోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటిది సంక్రాంతి పండుగ కోసం లక్షలాది మంది హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళుతుంటే.. వాహనాల రద్దీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో అప్రమత్తంగా లేకున్నా, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్లే హైవేపై, అటు బెంగళూరు రూట్లో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న (బ్లైండ్ స్పాట్) ప్రాంతాల్లో సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్సును, ప్రమాదాలు జరిగితే వాహనాలను పక్కకు జరిపేందుకు క్రేన్లను, సరిపడా సిబ్బందిని అందుబాటులో పెట్టారు. వాహనదారులు కూడా ఆయా మార్గాల్లో పరిస్థితిని తెలుసుకుని, జాగ్రత్తగా ప్రయాణిస్తే... పండుగ ప్రయాణం సురక్షితం అవుతుంది. ఈ క్రమంలో అవగాహన కోసం ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. దీనిపై ప్రత్యేక కథనం..విజయవాడ రూట్లో..హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని దండు మల్కాపురం నుంచి తెలంగాణ–ఏపీ సరిహద్దుగా ఉన్న రామాపురం క్రాస్‌రోడ్డు వరకు 181 కిలోమీటర్ల పరిధిలో అనేక చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. పలుచోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనితో జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. ⇒ దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మాజీగూడెం, పంతంగి, పిట్టంపల్లి, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట పట్టణ శివారులోని జనగామ క్రాస్‌రోడ్డు, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్స్పాట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ⇒ సూర్యాపేట సమీపంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నందున సర్వీస్‌రోడ్డులో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. ⇒ జమ్మిగడ్డ, నేలమర్రి క్రాస్‌రోడ్, ముంకుదాపురం, ఆకుపాముల, కొమరబండ వై జంక్షన్, కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, దుర్గాపురం క్రాస్‌రోడ్ వద్ద బ్లాక్స్పాట్ల విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ⇒ తెలంగాణ– ఏపీ సరిహద్దులో ఉన్న పాలేరు నదిపై ఉన్న రెండు వంతెనలలో ఒక వంతెన అప్రోచ్‌రోడ్డు ఇటీవలి వరదలకు కొట్టుకుపోయింది. దీని మరమ్మతు పనులు జరుగుతున్నాయి.బెంగళూరు రూట్లో..హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్లేవారు హైదరాబాద్–బెంగళూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తారు. దీనిని నాలుగు లేన్లుగా విస్తరించినా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనితో ఆరు లేన్లుగా విస్తరిస్తున్నారు. దీనికి సంబంధించి పలుచోట్ల పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 21 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సైన్ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. ⇒ మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి దగ్గర రైల్వే డబుల్ ట్రాక్ పనులు జరుగుతుండటం, కొత్త బ్రిడ్జి నిర్మిస్తుండటంతో జాతీయ రహదారిపై ఒకేవైపు రాకపోకలు సాగుతున్నాయి. పాత బ్రిడ్జి మధ్యనే బారికేడ్లు పెట్టి... రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఇక బాలానగర్ చౌరస్తాలో బ్రిడ్జి నిర్మిస్తుండటంతో.. సర్వీస్ రోడ్ మార్గంలోకి దారి మళ్లిస్తున్నారు. వాహనాల వేగం కట్టడి కోసం రాజాపూర్ చౌరస్తా, పెద్దాయిపల్లి దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రిస్తాం పండుగ ట్రాఫిక్ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. అధిక వేగం వద్దు. రోడ్డు పక్కన వాహనాలు నిలపవద్దు. విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతున్న చోట్ల.. డైవర్షన్లు ఏర్పాటు చేసి గమనిక బోర్డులు పెట్టాం. వాటిని పాటించాలి. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల రైతులు, ప్రజలు పొలాలకు, పనులకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు సిబ్బందితో రోడ్లపై 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నాం. – సన్‌ప్రీత్‌సింగ్, సూర్యాపేట జిల్లా ఎస్పీపొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదంచలికాలం కావడంతో ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉంటుంది. తెల్లవారుజామునే ప్రయాణించే వారికి ఇబ్బంది మరింత ఎక్కువ. రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఉదయం 8–9 గంటల తర్వాత బయలుదేరి సాయంత్రానికల్లా గమ్యాన్ని చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఫాగ్ లైట్లు ఏర్పాటు చేసుకుంటే కొంత మేర ఇబ్బంది తప్పుతుంది.ఫాస్టాగ్ ‘సరిచూసుకోండి పండుగల వేళ టోల్ ప్లాజాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది. అందువల్ల తమ వాహనాలకు ఉన్న ఫాస్టాగ్ వేలిడిటీ, బ్యాలెన్స్ సరిచూసుకోవాలి. లేకుంటే ఇబ్బందిగా మారుతుంది. ముందుగానే వీలైనంత బ్యాలెన్స్ వేసుకోవడం, వేలిడిటీ అయిపోతే.. మళ్లీ యాక్టివ్ చేయించుకోవడం మంచిది.ఎట్టి పరిస్ధితుల్లో రోడ్డు మీద వాహనాలు నిలపొద్దు పండుగ వేళ వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. టాయిలెట్ కోసమో, కాసేపు సేదతీరడానికో, ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తినడానికో చాలా మంది మధ్యలో ఆగుతుంటారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే, కొన్నిసార్లు కాస్త రోడ్డుపై ఉండేలా వాహనాలను ఆపుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. జాతీయ రహదారిపై బస్ బే, లారీ బే ఉంటాయి. అక్కడ వాహనాలను నిలపాలి. లేదా రోడ్డుకు కాస్త లోపలగా ఉన్న చోటు చూసుకుని ఆపడం మంచిది.అత్యవసరమైతే టోల్ ఫ్రీ ‘1033’నంబర్‌కు ఫోన్ చేయండి జాతీయ రహదారిపై అత్యవసర పరిస్థితుల్లో (వైద్యం, ప్రమాద) సాయం కోసం వాహనదారులు 1033 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఇది టోల్‌ఫ్రీ, 24 గంటలు అందుబాటులో ఉంటుంది. 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చినా కూడా పోలీసుల నుంచి సాయం అందుతుంది.20 కిలోమీటర్లకో అంబులెన్స్ సంక్రాంతి పండుగ రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజాల నిర్వహకులు పోలీస్, రెవెన్యూశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారుల పరిధిలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేన్, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ముందు జాగ్రత్తగా సిద్ధంగా ఉంచారు. టోల్‌ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించారు. ఒక్కోచోట 10–20 మంది పోలీసులను కూడా సిద్ధంగా ఉంచారు.మూడంచెల స్పీడ్‌బ్రేకర్లు జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు మూడంచెల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. జంక్షన్ రావటానికి మూడు వందల మీటర్ల దూరంలో కొంత ఎత్తులో మొదటి.. రెండు వందల మీటర్ల దూరంలో మరింత ఎక్కువ ఎత్తుతో రెండోది.. జంక్షన్‌కు ముందు రెండు అంగుళాల ఎత్తులో మూడో దఫా స్పీడ్ బ్రేకర్లు సిద్ధం చేశారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేగం తగ్గి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి..
రెంజల్ (బోధన్)/నిజామాబాద్ నాగారం: జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాలను నివారించేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా రెంజల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా 300 వరకు హెల్త్ సబ్‌సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కేన్సర్ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామన్నారు. జీజీహెచ్‌లో ఏం జరుగుతోందో నాకు తెలుసు.. ‘నిజామాబాద్‌లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో ఏం జరుగుతోందో నాకు తెలుసు. 60 శాతం మంది వైద్యులు విధులకు గైర్హాజరు అవుతున్నారు. నా వద్ద పూర్తి సమాచారం ఉంది’అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. వందరోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోగా మార్పు రాకుంటే కఠిన చర్యలు ఉంటాయ న్నారు. ఆదివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో పైపులైన్ లీకేజీ, భవనాలపై పిచ్చిమొక్కలు పెరగడం, కిటికీల అద్దాలు పగిలిపోవడం, లిఫ్ట్‌లు చెడిపోవడం, ఎలు కలు తిరుగుతుండటాన్ని గమనించి సూపరింటెండెంట్ ప్రతి మారాజ్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీజీహెచ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ. 7 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు. -
హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు
జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు. – సాక్షి, అమరావతి దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన జాతీయ రహదారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వచ్చే ఏడాది జూన్ నాటికి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్ స్టేషన్లు 7,432మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230 -
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన మేరకే కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు 2023 డిసెంబర్లోనే ప్రతిపాదనలు పంపింది. కీలకమైన విజయవాడ తూర్పు బైపాస్తోసహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..⇒ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. ⇒ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు⇒అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు⇒ విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.669కోట్లు⇒ చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రూ.325కోట్లు⇒ గన్నవరం సమీపంలోని గుండుగొలను ‘గామన్ జంక్షన్’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.150కోట్లు⇒ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు -
నాలుగేళ్లలో లక్ష ప్రమాదాలు.. 35 వేల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో 2018–22 మధ్య నాలుగేళ్లలో ఒక లక్షా 5 వేల 906 ప్రమాదాలు జరగ్గా, 35,565 మంది మరణించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాల్లో ఒక లక్షా 4వేల 589 మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 74 వేలకు పైగా మంది మరణించినట్లు బుధవారం తెలిపింది.దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల 77 వేల 423మంది దుర్మరణం చెందిన ట్లు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్క రీ ప్రకటించారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో చోటుచేసుకోగా, తక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతంగా లక్షదీ్వప్ నిలిచినట్లు తెలిపారు. జాతీయ రహదారులపై 32.94శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 36.22% మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు సదస్సులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర/జిల్లా స్థాయిల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ రీసెర్చ్, రీజనల్ డ్రైవింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఓ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘సర్వీసు’ లేకుండానే ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్‌ప్రెస్ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్చేంజ్ కూడళ్లలోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్ ఆర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు. సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్ ఆర్‌ను కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది. సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్ బూత్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది. ⇒ పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్‌ప్రెస్ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ⇒ ఎక్స్‌ప్రెస్ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్‌ప్రెస్ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారి అయినందున.. ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్ ఆర్ పూర్తి గ్రీన్‌ఫీల్డ్ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్‌ప్రెస్ వేల నియమావళి వర్తించదు. ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరటం విశేషం. -
నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే
సాక్షి, అమరావతి : ‘ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. అభివృద్ధి.. సంక్షేమం చేసి చూపించడం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇందుకోసం ఎంపీలు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు.ఇప్పటికే ఐదు హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచి్చన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీలకు శాఖలు అప్పగించామని, ఆ మేరకు ఎన్ని నిధులు తెచ్చారు.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో అందరి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాలని, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చూడాలని సూచించారు.విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ స్టీల్, కడప ఉక్కుపైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలని సూచించారు. విశాఖలో రైల్వే జోన్‌కు అవసరమైన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలని చెప్పారు.రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, కొత్త వలసలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. 2029లో కూడా పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, దాన్ని 1995లో అమలు చేశానని చెప్పారు. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలని సూచించారు. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చని, ప్రజల తలరాతలు మార్చవచ్చని గతంలో చేసి చూపించామన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వినుకొండ హత్య పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఉనికి కోసం దానికి జగన్ రాజకీయ రంగు వేస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరించారన్నారు. పోలీసుల విచారణలో కూడా అదే విషయం తేలిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.ఉనికి చాటుకోవడానికే జగన్ హింసా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఫేక్ పాలిటిక్స్‌నే నమ్ముకున్నాడని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై నేరస్తుల ఆటలు ఏమాత్రం సాగనివ్వమన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే తానే స్వయంగా విచారణకు వస్తానన్నారు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదన్నారు. -
హైవేలపై ఆగి ఉన్న మృత్యువు
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్లక్ష్యం మరికొందరిపాలిట మృత్యుపాశమవుతోంది. అనుమతి లేకున్నా జాతీయ రహదారుల వెంట నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ఢీకొని దుర్మరణంపాలవుతున్నారు. జాతీయ రహదారుల్లో వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ముందు ఆగిన లారీలు, భారీ ట్రక్కులను గుర్తించే లోపే నష్టం జరిగిపోతోంది. ఏప్రిల్ 25న కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజుకో రోడ్డు ప్రమాదం.. మూడు రోజులకొకరు మృతి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ తరహాలో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను ఢీకొట్టడం కారణంగా ప్రతి రోజూ కనీసం ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 600 మంది మృతి చెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2022లో తెలంగాణలో మొత్తం 331 రోడ్డు ప్రమాదాలు ఈ తరహాలో జరగ్గా, 128 మంది మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరగడం గమనార్హం. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆగిఉన్న లారీలను ఢీకొట్టే కార్లు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైవేలపై పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవుజాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు నిలిపి ఉంచడం, పార్కింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం. అలా వాహనాలు నిలిపితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల వెంట ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఈ తరహాలో వాహనాలు నిలపకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ వేళల్లో పోలీసులను మరింత అప్రమత్తం చేసేలా సర్క్యులర్‌ను జారీ చేస్తాం. – మహేష్ భగవత్, తెలంగాణ రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన నిర్లక్ష్యం ఇలా.. » జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపి ఉంచవద్దని నిబంధనలు ఉన్నా.. భారీ ట్రక్కులు, లారీల డ్రైవర్లు కొందరు వీటిని విస్మరిస్తున్నారు. » ఏదైనా మరమ్మతుల కారణంగా వాహనం తప్పక ఆపాల్సి వస్తే వెనుక నుంచి వాహనదారుడికి ఆ విషయం తెలిసేలా పార్కింగ్ లైట్లు తప్పక ఆన్ చేసి పెట్టాలి. సేఫ్టీ ట్రైయాంగిల్ ఆకారాన్ని వాహనానికి కొంత దూరంలో పెట్టాలి. » జాతీయ రహదారుల వెంట ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపి ఉంచాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు » డ్రైవర్ అలసిపోయినప్పుడు తెల్లవారుజాము సమయంలో వాహనాన్ని జాతీయ రహదారి వెంటే నిలిపి ఉంచి నిద్రిస్తుండడం సైతం మిగిలిన వాహనదారులకు మృత్యుపాశమవుతోంది. -
జాతీయ రహదారులపై మళ్లీ బరితెగించిన ఈనాడు..
-
‘వ్యర్థాలతో’ జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రయత్నాలు ఆరంభించింది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గుట్టలు, గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను దేశంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. వ్యర్థాలను జాతీయ రహదారుల నిర్మాణం కోసం సద్వినియోగం చేసుకోవడాన్ని ఎన్హెచ్ఏఐ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ–ఎన్సీఆర్ హైవేల నిర్మాణంలో ఈ వ్యర్థాలను ఉపయోగించింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం మార్కింగ్ చేసిన మార్గంలో భూమిని కొంత వరకు ఎత్తు పెంచిన అనంతరం కొత్త రహదారులను నిర్మిస్తారు. ఇందుకోసం ఇప్పటి వరకు మట్టి, కంకరలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు నగరాలు, పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలోని సాలిడ్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించాలని ఎన్హెచ్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 2,304 డంపింగ్ యార్డుల్లో ప్రస్తుతం 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉందని స్వచ్ఛ భారత్ మిషన్ అంచనా వేసింది. దాదాపు 10వేల హెక్టార్ల మేర ఉన్న డంపింగ్ ప్రదేశాల్లో ఆ వ్యర్థాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐకు అందించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశించింది. ఇందుకోసం డంపింగ్ యార్డ్ల వద్ద బయోమౌనింగ్ యంత్రాలను ఎన్హెచ్ఏఐ సమకూర్చనున్నది. తద్వారా దేశంలోని వ్యర్థాలను సక్రమ నిర్వహణ, సరైన రీతిలో సద్వినియోగానికి సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పర్యావరణ కాలుష్య సమస్యకు కూడా సరైన పరిష్కారంగా పరిగణిస్తోంది. -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
హైవే పెట్రోలింగ్‌పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్‌లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్‌లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్‌లైన్‌కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్‌కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్‌లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్‌కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
ఏఐతో రాజమార్గాల్లా.. జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై ప్రమాదాలకు అధునాతన టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) సిద్ధమవుతోంది. అందుకోసం ఆర్టిఫిషయల్ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానంతో ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టం(ఏటీఎస్)’ విధానాన్ని రూపొందించింది. ఇప్పుడున్న సీసీ కెమెరాలతో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా పూర్తిస్థాయిలో డిజిటల్ పరిజ్ఞాన పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి దశలవారీగా కొత్త టెక్నాలజీని అమలు చేయనుంది. సరికొత్తగా పర్యవేక్షణ.. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న కెమెరాల స్థానంలో సరికొత్త ‘వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్–ఎన్ఫోర్స్మెంట్ సిస్టం(వైడ్స్)’ టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వైడ్స్‌తో రూపొందించిన ఈ కెమెరాలతో 14 రకాలుగా వాహనాలను పర్యవేక్షించడానికి సాధ్యపడుతుంది. వాహనాల వేగం అంచనాతో పాటు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, నిర్దేశిత లైన్‌ను ఉల్లంఘించి ప్రయాణించడం, రాంగ్రూట్లో ప్రయాణం, జాతీయ రహదారులపై పశువుల సంచారం, పాదచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్ లైన్స్, అంబులెన్స్‌ల రాక సహా 14 రకాల సంఘటనలను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వెంటనే జాతీయ రహదారులపై విధులు నిర్వహించే పాట్రోలింగ్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు. ప్రతి 10 కి.మీ.కు కెమెరాలు.. జాతీయ రహదారులపై ప్రతి 10 కి.మీ.కు ఓ చోట ఈ వైడ్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇక ప్రతి 100 కి.మీ.కు ఓ మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పుతారు. జాతీయ రహదారుల వెంబడి వేయనున్న ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకుని ఈ సెంటర్లు పని చేస్తాయి. ఈ సెంటర్ల పరిధిలోని ప్రాంతంలోని కెమెరాల డాటాను అక్కడ విశ్లేíÙస్తారు. వైడ్స్ కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఆటోమేటిగ్గా గుర్తించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. ఇక ప్రమాదాలను గుర్తించడం, రహదారులపై నిలిచిపోయిన వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఆ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లతోపాటు ఆయా రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాలతో అనుసంధానిస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి కనీసం ఒకరు ఆ కమాండ్కంట్రోల్ సెంటర్లలో అందుబాటులో ఉంటారు. ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్‌తో అనుసంధానం జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘రాజ్‌మార్గ్ మొబైల్ యాప్’తో ఈ వైడ్స్ కెమెరాల డేటాను అనుసంధానిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఆటోమేటిగ్గా ఈ–చలానాలు జారీ చేస్తుంది. ఆ సమాచారాన్ని రాజ్‌మార్గ్ మొబైల్ యాప్ ద్వారా వెంటనే వాహన చోదకులకు చేరవేస్తుంది. దాంతోపాటు జాతీయ రహదారులపై ఎదురుగా ఉన్న సైన్‌బోర్డులు, ట్రాఫిక్ జామ్, ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తూ సందేశాలను పంపుతుంది. వాహన చోదకులు ఏదైనా అత్యవసర సహాయాన్ని అర్థించేందుకు ఆ యాప్ ద్వారా ఎన్హెచ్ఏఐ అధికారులను సంప్రదించవచ్చు. -
విధ్వంసానికి టీడీపీ భారీ కుట్ర
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగిస్తామని టీడీపీ మరోసారి రుజువు చేసింది. విద్యార్థులు, యువతను పావులుగా వాడుకుని రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు పథకం రూపొందించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ప్రజాధనం లూటీకి పాల్పడ్డ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయ్యి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తమ అవినీతి బండారం బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ విధ్వంస కాండకు సిద్ధపడుతోంది. ఆ కుట్రను పక్కాగా అమలు చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో అతి పెద్ద హింసాత్మక సంఘటన ఏదైనా జరగాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని పన్నాగం పన్నింది. జాతీయ రహదారులు వేదికగా.. ప్రధానంగా జాతీయ రహదారులపై విధ్వంసం సృష్టించాలని టీడీపీ తమ పార్టీ నేతలకు ఆదేశాలు పంపింది. జాతీయ రహదారులను దిగ్బంధించి వాహనాలపై దాడులకు తెగబడటంతోపాటు దుకాణాలు, హోటళ్లు, దాబాల్లో విధ్వంసం సృష్టించాలన్నది పన్నాగం. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టించాలని పేర్కొంటూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ శ్రేణులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. చెన్నై–బెంగళూరు జాతీయ రహదారితోపాటు కడప, అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులపై దాడులకు తెగబడాలని అల్లరి మూకలను పురిగొల్పింది. సామాన్యులపై దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా పోలీసులు అనివార్యంగా లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి సృష్టించి వీలైతే పోలీసు కాల్పుల వరకు పరిస్థితిని తీసుకెళ్లాలని పథకం వేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతే దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు తెరతీసి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని పన్నాగం పన్నింది. సోషల్ మీడియా సాధనం.. ప్రధానంగా సోషల్ మీడియా వేదికల ద్వారా రెండు రోజులుగా యువత, విద్యార్థులను టీడీపీ రెచ్చగొడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు వెళ్లి విద్యార్థులను రెచ్చగొడుతుండటం గమనార్హం. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీకి తరలి రావాలని విద్యార్థులను కోరారు. ర్యాలీ, ఫ్లాష్ మాబ్... అంటూ విద్యార్థులు, యువతను సమీకరించేందుకు సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నారు. అందరూ జాతీయ రహదారులపైకి రావాలని అందులో నిర్దేశించడం గమనార్హం. ఒకసారి జాతీయ రహదారులపైకి చేరుకున్నాక టీడీపీ రౌడీలు, గూండాలు, అల్లరి మూకలంతా విద్యార్థుల్లో కలసిపోయి విధ్వంసానికి పాల్పడాలన్నది పన్నాగం. విజయవాడ, విశాఖతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులను భారీగా తరలించేందుకు యత్నించారు. అందుకోసం వివిధ జిల్లా కేంద్రాలకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు వేర్వేరు సమయాలను కేటాయించడం గమనార్హం. అంటే ఒకచోట విధ్వంసానికి పాల్పడిన కొద్దిసేపటికే మరో జిల్లా కేంద్రానికి చేరుకుని రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టించాలన్నది టీడీపీ కుయుక్తి. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. టీడీపీ పన్నాగాన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీలను సందర్శించి ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లతో చర్చించారు. అల్లర్ల కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్ దెబ్బతింటుందని విద్యార్థులకు కౌన్సెలింగ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కపోవడంతోపాటు పాస్‌పోర్ట్, వీసా జారీకి అడ్డంకులు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ నంబర్లు తీసుకుని వాట్సాప్ సందేశాలు కూడా పంపారు. తాము విధ్వంసకర కార్యక్రమాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు చెప్పడంతో మధ్యాహ్నం నుంచి వారిని ఇళ్లకు పంపించారు. కుట్రకు నేతృత్వం వహిస్తున్న టీడీపీ నేతలనుæ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ çఘటనలు జరగకుండా కట్టడి చేయగలిగారు. -
మీ రాతల్లోనే ‘వెనుకబాటు’
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు తన కళ్లకు ‘పచ్చ’కామెర్లు కమ్మాయని మరోసారి నిరూపించుకున్నారు. అందుకే జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉన్న వాస్తవం ఈనాడు కళ్లకు కనిపించడంలేదు. ‘జాతీయ రహదారుల పనుల్లో వెనుకబాటు’ అంటూ ఓ అసత్య కథనం ప్రచురించి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించింది. జాతీయ రహదారుల నిర్మాణం, అందుకోసం వేగంగా భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన విషయన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ప్రాజెక్టులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సత్వరం పూర్తిచేసి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలనూ శరవేగంగా సాగేలా చూస్తోంది. ఉదా.. ♦ విజయవాడలో బెంజిసర్కిల్ మొదటి ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ పనులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రెండు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. ♦ విజయవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసింది. విజయవాడ పశ్చిమ బైపాస్ పనులను శరవేగంగా పూర్తిచేస్తోంది. ♦ అలాగే ఎన్‌హెచ్–216 నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. ♦ కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారిని 2015–16, 2016–17లో మంజూరు చేసింది. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకూ తీర ప్రాంతాన్ని ఆనుకుని 374.83 కి.మీ. పొడవున రూ.3,826.84 కోట్లతో జాతీయ రహదారి నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం మొత్తం 10 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒక్క ప్యాకేజీ పనులనే పూర్తిచేయగలిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు ప్యాకేజీల పనులను పూర్తిచేశారు. మొత్తంగా ఏడు ప్యాకేజీల రూపంలో 360కి.మీ మేర రహదారిని నిర్మించారు. మిగిలిన మూడు ప్యాకేజీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ♦ కాకినాడ బైపాస్ కింద తిమ్మాపురం–గురజానపల్లి జాతీయ రహదారి పనులు 95శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి ఆ రహదారి నిర్మాణం పూర్తవుతుంది. ♦ పాసర్లపూడి–దిండి సెక్షన్లో రహదారి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తిచేయలేకపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించింది. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి ఈ రహదారి నిర్మాణం పూర్తిచేస్తారు. ♦ ఇక రేపల్లె, ఈపురుపాలెం సెక్షన్లో రహదారి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని పూర్తిచేయడమే కాక 90శాతం వరకు నిర్మాణం పనులు పూర్తిచేసింది. ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఆర్ఓబీతో రహదారిని అనుసంధానించడంతోపాటు టోల్‌ప్లాజా, రెస్ట్ ఏరియా ఏర్పాటు పనులు మాత్రమే పెండింగులో ఉంటాయి. వాటిని కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయనుంది. -
NCAP: ఇక దేశీయంగా కార్ల క్రాష్ టెస్టింగ్..
న్యూఢిల్లీ: వాహనాలను మరింత సురక్షితం చేసే దిశగా కేంద్రం దేశీయంగా తొలి కార్ల క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (భారత్ ఎన్‌క్యాప్)ను ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. విదేశాలతో పోలిస్తే చౌకగా దేశీయంగానే కార్ల క్రాష్ టెస్టింగ్‌ను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని గడ్కరీ చెప్పారు. ‘విదేశాల్లో ఈ పరీక్షలు చేయించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లవుతుంది. అదే భారత్ ఎన్‌క్యాప్ కింద చేస్తే సుమారు రూ. 60 లక్షలవుతుంది. కాబట్టి దీనికి మంచి మార్కెట్ కూడా ఉండగలదు‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం కింద కార్ల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా తమ వాహనాలను పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల్లో వాహనాల పనితీరును బట్టి 0–5 వరకు స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధానం కింద 30 పైగా మోడల్స్‌ను టెస్ట్ చేయించుకునేందుకు పలు కంపెనీలు సంప్రదించినట్లు గడ్కరీ తెలిపారు. -
Manipur violence: మణిపూర్ రహదారులు మళ్లీ దిగ్బంధం
ఇంఫాల్: మణిపూర్‌లోని కాంగ్పోక్పిలో జాతీయ రహదారులపై కుకీలు తిరిగి నిరవధిక దిగ్బంధనం చేపట్టారు. రాష్ట్రంలోని కొండప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమకు నిత్యవసరాలను సరిపడా అందజేయాలంటూ కుకీలకు చెందిన సదర్ హిల్స్ ట్రైబల్ యూనిటీ కమిటీ(సీవోటీయూ) డిమాండ్ చేసింది. నాగాలాండ్‌లోని దిమాపూర్ను ఇంఫాల్‌తో కలిపే రెండో నంబర్ జాతీయ రహదారితోపాటు ఇంఫాల్‌తో అస్సాంలోని సిల్చార్‌ను కలిపే 37వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం కుకీలు బైఠాయించారు. కాగా, పటిష్ట బందోబస్తు నడుమ నిత్యావసరాలతో కూడిన 163 వాహనాలు రెండో నంబర్ జాతీయ రహదారి మీదుగా ఇంఫాల్ వైపుగా వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు. తమకు నిత్యావసరాలు, ఔషధాలు అందకుంటే ఈ నెల 26 నుంచి దిగ్బంధనం చేస్తామని కుకీ జో డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది. అల్లర్లకు సంబంధించి కుకీలపై నమోదైన కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరుతూ కుకీ విద్యావంతులు లేఖ రాశారు. -
రూ.19,761 కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రూ.19,761.8 కోట్లతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో 9 నిర్మాణదశలో ఉండగా, 3 అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని, మరో 11 ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్ అవార్డు కాలేదని వివరించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. మొత్తంగా రూ.12,951.68 కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ధి పనులు గ్రౌండ్ అయి వివిధదశల్లో పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. రూ.1,989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు కాంట్రాక్ట్‌లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రూ.4,820.72 కోట్లతో చేపట్టాల్సిన 11 హైవే పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు మంత్రి వివరించారు. ఎన్డీఆర్ఎఫ్కు రూ.1,60,153 కోట్లు ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 2021–26 మధ్య కాలంలో ఎన్డీఆర్ఎఫ్కు రూ.1,60,153 కోట్లు కేటాయించినట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. గత కేటాయిపులతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికమని చెప్పారు. దీనికి అదనంగా మరో రూ.68 వేల కోట్ల తక్షణ సహాయనిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోస్తా రాష్ట్రాల్లో తుపాన్లు వచ్చినప్పుడు భారత వాతావరణ విభాగం (ఐఎండీ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ విపత్తు సహాయ చర్యలను చేపడుతోందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్దపీట
-
దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలకం: ప్రధాని మోదీ
వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడంలో తెలంగాణ పాత్ర ఉందని.. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా దేశ చరిత్రలో దీని పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యంతో దేశ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, రవాణా సదుపాయాలు పెంచడానికి కేంద్రం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని.. సబ్కా సాథ్ సబ్ కా వికాస్‌ను అనుసరిస్తూ హైవేలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రూ.6,109 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ.5,500 కోట్లకుపైగా ఖర్చయ్యే జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు.. కాజీపేటలో తలపెట్టిన రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఈ సందర్భంగా విడిగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా మారింది. 21వ శతాబ్దపు మూడో దశాబ్దం స్వర్ణ సమయంగా మారింది. ప్రస్తుత కాలం యువ భారత్‌కు గోల్డెన్ పీరియడ్. ప్రతి సెకన్ను సద్వినియోగం చేసుకో వాలి. వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. సరి కొత్త లక్ష్యాల సాధన కోసం కొత్త మార్గాలు కనుక్కో వాలి. అప్పుడే దేశ అభి వృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇప్పుడున్న మౌలిక వసతు లతో ఇది అసాధ్యం కాబట్టే.. కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఎక్స్‌ప్రెస్ హైవే లు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లను, జాతీయ రహదారు ల విస్తరణను చేపట్టి.. రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే! ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ గతంలో 2,500 కిలోమీటర్లే ఉండగా.. ఇప్పుడు 5 వేల కిలోమీటర్లకుపైగా పెరి గింది. మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలంగాణ మీదుగా వెళుతున్నాయి. హైదరాబాద్ – ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై – సూరత్ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – పనాజీ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ఆ కోవలోనివే. ఒక విధంగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోంది. ఈ హైవేలతో ఎంతో ప్రయోజనం ఇప్పుడు శంకుస్థాపన చేసిన నాగ్‌పూర్ – విజయ వాడ కారిడార్‌లోని మంచిర్యాల–వరంగల్ సెక్షన్ నిర్మాణంతో.. తెలంగాణకు అటు మహారాష్ట్రతో, ఇటు ఏపీతో మెరుగైన అనుసంధానాన్ని కలిగిస్తుంది. మంచిర్యాల–వరంగల్ మధ్య దూరం తగ్గి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఎస్ఈజెడ్ వంటివి ఎక్కువగా లబ్ధి పొందుతాయి. వ్యవసాయం, పరిశ్రమలతోపాటు కరీంనగర్ జిల్లా లోని గ్రానైట్ పరిశ్రమకూ ప్రయోజనం ఉంటుంది. యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశా లు కూడా పెరుగుతాయి. కనెక్టివిటీ పెర గడం వల్ల పర్యాటక రంగం కూడా లబ్ధి పొందుతుంది. భద్రకాళి ఆలయంలో మోదీ పూజలు వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అర్చకులు, అధికారులు ప్రధానికి మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మోదీ గోశాలలో ఆవులకు గ్రాసం తినిపించి, ధ్వజస్తంభం వద్ద జ్యోతి వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు.. అమ్మవారి శేషవస్త్రంతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా.. ఓ ఉద్యమం.. మేకిన్ ఇండియా ఒక ఉద్యమం. పీఎల్ఐ పథకంతో దేశంలో తయారీ రంగానికి ఎంతో ప్రోత్సా హం లభించింది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోనూ ఈ పథకం కింద 50కిపైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయి. దేశం ఈ ఏడాది రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించింది. తొమ్మిదేళ్ల కింద రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు రూ.16 వేల కోట్లు దాటాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఇలా ఎగుమతులు చేసిన సంస్థల్లో ఉంది. తయారీ రంగంలో భారత రైల్వే కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మేడిన్ ఇండియా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. కాజీపేటలో ఈరోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్ ఇండియాకు కొత్త జీవం పోస్తుంది. దీనితో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంది. అభివృద్ధి మంత్రంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలి..’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు ‘ఎన్‌హెచ్’ మణిహారం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: జాతీయ రహదారుల మణిహారంగా తెలంగాణ మారుతోందని కేంద్ర ఉపరితల రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని, గతిశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకు రూ.లక్షా పదివేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్–ఖమ్మం జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి రూ.2,235 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వరంగల్ –ఖమ్మం (ఎన్‌హెచ్–163) రహదారిపై వరంగల్ జిల్లా వెంకటాపూర్ గ్రామం నుంచి మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లసేనకేశ గ్రామం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ. 1,111.76 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ రహదారికి కొనసాగింపుగా తాళ్లసేనకేశ గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.1,123.32 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈరెండు రహదారులను కలిపి 70 కిలోమీటర్ల రహదారిని ‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్’లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల–వరంగల్–విజయవాడ, కరీంనగర్–వరంగల్‌తో పాటు హైదరాబాద్, నాగపూర్, విజయవాడ, విశాఖపట్నంను కలిపేలా పలు జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆరునూరైనా బీజేపీ గెలుస్తుంది: ఈటల ‘సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా బీజేపీ గెలుస్తుంది’ అని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన సీఎం కేసీ ఆర్ ఓటమే లక్ష్యంగా.. బీజేపీ శ్రేణులు కంకణబద్ధులుగా పని చేస్తారన్నారు. కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని విష ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్,బీఆర్ఎస్ ఒక్కటై బీజేపీపై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వరంగల్‌లో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టడం ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభ సూచకమని ఈటల పేర్కొన్నారు. -
ఎన్‌హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్
జాతీయ రహదారుల నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి తన సత్తాను చాటింది. 2022–23లో జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) నివేదిక వెల్లడించింది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిధులతో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ చేపట్టే రహదారుల నిర్మాణంలోనూ దేశంలో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. తద్వారా ఎన్హెచ్ఏఐ రహదారుల నిర్మాణంలో, కేంద్రం నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యాన రోడ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్ల నిర్మాణాలకు గరిష్టంగా నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. - సాక్షి, అమరావతి ఆర్అండ్బీ ద్వారా నిర్మాణాల్లోనూ రెండోస్థానం కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 2014–19 వరకు భాగస్వామిగా ఉన్నప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధులు రాబట్టలేకపోయింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లు మాత్రమే తీసుకువచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి రికార్డుస్థాయిలో నిధులు తీసుకురావడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క 2022–23లోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 6,861.68 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1,302.04 కి.మీ. మేర జాతీయ రహదారులను నిర్మించింది. దాంతో 2023 మార్చి నాటికి రాష్ట్రంలో 8,163.72 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనావిుక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మిన్నగా... ఎన్హెచ్ఏఐ 2022–23లో దేశవ్యాప్తంగా 6,003 కి.మీ. మేర రహదారులను నిర్మించింది. అందులో అత్యధికంగా 845 కి.మీ.మేర జాతీయ రహదారుల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ (740 కి.మీ.), మూడో స్థానంలో మధ్యప్రదేశ్ (524 కి.మీ.), నాలుగో స్థానంలో జార్ఖండ్ (442 కి.మీ.), ఐదో స్థానంలో కర్ణాటక (419 కి.మీ.) నిలిచాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల్లో 56శాతం హైబ్రీడ్ యాన్యుటీ విధానం (హెచ్ఏఎం)లో, ఈపీసీ విధానంలో 35శాతం, ఐటం రేట్ విధానంలో 8శాతం, బీవోటీ విధానంలో ఒక శాతం నిర్మించినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఇక ప్రా జెక్టు నిర్మాణ విలువలో కూడా అత్యధికంగా 68 శాతంతో హెచ్ఏఎం విధానంలోనే నిర్మించారు. -
నేషనల్ హైవేలుకాదు..లోకల్ రోడ్లే డేంజర్!
సాక్షి, హైదరాబాద్ : విశాలంగా ఉండే జాతీయ రహదారులు.. వేగంగా దూసుకెళ్లే వాహనాలు... దీంతో అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని అనుకోవడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారులే యమ డేంజర్ అని పోలీస్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ రహదా రుల్లో ప్రయాణంతో పోలిస్తే వాహనదారులు స్థానిక రోడ్లపై నడిపేటప్పుడు అంత్యంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలుస్తోంది. పక్క ఊరికే కదా వెళ్లేది.. పది కిలోమీటర్ల దూరానికే హెల్మెట్ ఎందుకు? ఊర్లో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరగాలా? కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా అడిగేదెవరు..? అన్న ధీమాతో వెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నట్టు వెల్లడవుతోంది. నిర్లక్ష్యమే మృత్యుపాశం.. వాహనదారుల నిర్లక్ష్యమే వారి పాలిట మృత్యువై వెంటాడుతోంది. జాతీయ రహదారులతో పోలిస్తే.. స్థానిక రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం రోడ్డు భద్రత నియమాలను లెక్క చేయడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతులు ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడం.. హెల్మెట్ పెట్టుకున్నా.. దాన్ని సరిగా లాక్ చేయకపోవడం మరణాలకు ప్రధాన కారణాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దూరం ఎంతైనా సరే.. తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా కారులో సీటుబెల్ట్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడకం తప్పక అలవాటు చేసుకోవాలని చెపుతున్నారు. పట్టణ, గ్రామీణప్రాంతాల వారీగా 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 12203 మృతుల సంఖ్య - 2873 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 9416 మృతుల సంఖ్య - 4684 రాష్ట్రంలో 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య ఇలా.. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
4 డిజైన్లలో ఇంటర్ ఛేంజర్లు
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డులో నాలుగు రకాల డిజైన్లలో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లు రాబోతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులను రింగురోడ్డు క్రాస్ చేసే చోట్ల భారీ ఇంటర్ ఛేంజ్‌లను నిర్మించనున్న విషయం తెలిసిందే. రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇలాంటి కూడళ్లు ఉండనున్నాయి. రింగురోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు, ఇతర రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలు పరస్పరం అడ్డు రాకుండా వేటికవే రోడ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్రాస్ అవుతాయి. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి వాహనాలు మారేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ లూప్స్‌ను నిర్మిస్తారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయా క్రాసింగ్స్‌లో ఉండే ట్రాఫిక్ ఒత్తిడి, అనుసంధానమయ్యే రోడ్ల సంఖ్య ఆధారంగా లూప్స్ వైశాల్యం, సంఖ్య ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు డిజైన్లను ఖరారు చేసి, ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితికి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేయబోతున్నారు. ట్రంపెట్ ఆకృతిలో లూప్ నిర్మాణం సాధారణంగా ప్రధాన రోడ్లను ఇతర రోడ్ల మీదుగా వచ్చే వాహనాలను అనుసంధానించేందుకు ట్రంపెట్ (సంగీత పరికరం) ఆకృతిలో లూప్ నిర్మిస్తారు. రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు ట్రంపెట్ల ఆకృతిలో నిర్మిస్తారు. క్లవర్ లీఫ్ (నాలుగు ఆకులతో కూడిన మొక్క భాగం) ఆకృతిలో కూడా విరివిగా నిర్మిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో ఈ రెండు ఆకృతుల్లో ఇంటర్‌ఛేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు డంబెల్ (వ్యాయామ ఉపకరణ) ఆకృతితోపాటు రౌండ్ ఎ»ౌట్ (పూర్తి వృత్తం)లో కూడా నిర్మించాలని నిర్ణయించారు. గిర్మాపూర్, చౌటుప్పల్ వద్ద డంబెల్ ఆకృతిలో నిర్మాణాలు నాగ్‌పూర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారుల మీద రెండు ప్రాంతాల్లో క్లవర్ లీఫ్ నమూనాను ఎంపిక చేశారు. శివంపేట, రాయగిరిల వద్ద డబుల్ ట్రంపెట్ డిజైన్‌ను ఎంపిక చేశారు. రీజినల్రింగ్రోడ్డు ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్, ముగింపు ప్రాంతమైన చౌటుప్పల్‌తోపాటు జాతీయ రహదారి 161ఏ మీద డంబెల్ ఆకృతిలో నిర్మించాలని భావిస్తున్నారు. మరో మూడు చోట్ల రౌండ్ ఎ»ౌట్లను ఎంపిక చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లకు భారీగా స్థలాన్ని సేకరించే విషయంలో స్థానికులతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డిజైన్లలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కీలక 3డీ గెజిట్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఆందోల్–జోగిపేట, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్.. ఈ మూడు కాలా అథారిటీలో పూర్తయిన విషయం తెలిసిందే. వీటి పరిధిలో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకానున్నందున ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లపై త్వరలో నిర్ణయంతీసుకోనున్నారు. మిగతా కాలా అథారిటీల పరిధిలో 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీకి కొంత సమయం ఉన్నందున, మరో నెల రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని స్ట్రక్చర్లను ఖరారు చేయనున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో నిర్మించే ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు ఒక్కోటి దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్టు తెలిసింది. వాహనాలు ఇంటర్‌ఛేంజ్ లూప్స్ మీదుగా, వాటికి నిర్మించే ర్యాంప్స్ మీదుగా కూడా గంటకు 50 కి.మీ. మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా వీటిని విశాలంగా నిర్మించాలని నిర్ణయించారు. తొలుత 70 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించాలని అనుకున్నా.. వాహనాల వేగం గంటకు 30 కి.మీ.లోపే నియంత్రించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ రహదారులకు మహర్దశ
-
Andhra Pradesh: రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాదీ కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాధించింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక ప్రణాళికలో రూ.12,130 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్ ప్రణాళికకు కేంద్రం ఆమోదం రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేపడుతున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తూ పట్టుబట్టి నిధులను సాధిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి రహదారుల అభివృద్ధే కీలకమన్న అంశంపై ఏకాభిప్రాయం రావడమే రాష్ట్రానికి మరింత సానుకూలంగా మారింది. 2019–20 వార్షిక ప్రణాళికలో తొలుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.600 కోట్లే కేటాయించింది. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తేవడంతో 2019–20లో రాష్ట్రానికి నిధుల కేటాయింపును రూ.1,304.42 కోట్లకు పెంచారు. ఇక 2020–21 వార్షిక ప్రణాళికలో కేంద్రం రూ.2,476.50 కోట్లు మంజూరు చేయగా, 2021–22లో ఏకంగా రూ.7,561 కోట్లు మంజూరు చేసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించడం గమనార్హం. తాజాగా 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు మంజూరు చేసింది. 541.45 కి.మీ. మేర 24 ప్రాజెక్టులు 2022–23కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళిక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం 24 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.11,699.55 కోట్లతో ఇప్పటికే 513.72 కి.మీ. మేర 21 ప్రాజెక్టులను పూర్తి చేసింది. రూ.431.27 కోట్లతో 27.73 కి.మీ.మేర మూడు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరు భవిష్యత్‌లో నిధుల కేటాయింపుపై సానుకూల ప్రభావం చూపనుంది. 2023–24 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి మరింత భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. నాడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా.. నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు జాతీయ రహదారుల అభివృద్ధికి తగిన నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లే తేగలిగింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనామిక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది. -
అభివృద్ధికి బాటలు
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్‌కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్‌హెచ్‌ల అనుసంధానానికి భారత్‌మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి. 22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్హెచ్లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి. రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్‌హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్‌హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్‌హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది. బిడ్ల పరిశీలన.. డీపీఆర్ కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు. విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్హెచ్ఏఐ నిర్ణయించాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో భరోసా విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆక్వా అదనపు అవకాశం కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి ♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు ♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్‌హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు ♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్‌హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి 22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 446 కి.మీ మొత్తం దూరం రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం రానున్నవి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌వే ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. -
రూ.2,516 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి
‘దారి’్రద్యాన్ని తొలగిస్తూ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య రాకపోకలను సులువు చేసే విధంగా జాతీయ రహదారులను సైతం తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ‘హాయి’వేలపై ప్రయాణం బడలిక లేకుండా సాగనుంది. కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోడ్లను మెరుగు పరుస్తూనే ... మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో ఐదు జాతీయ రహదారులను అభివృద్ధి చేయనుంది. ఈ ఐదు జాతీయ రహదారుల పనులు పూర్తి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మంజూరైన ఐదు జాతీయ రహదారుల పనులకు సంబంధించి మరో నెలన్నర రోజుల్లో నాలుగు పనులకు టెండర్లు ఆహా్వనించనుండగా, మరో పనికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. మొత్తం రూ.2516 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ నంబర్: 167 కే, 765, 167 , 340బీలో 208.781 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. ఈ వ్యయంలో రూ.461 కోట్లను భూ సేకరణకు వెచ్చిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి భూములను ఇచ్చిన రైతులకు పరిహారంగా ఈ నిధులను అందించనున్నారు. మరమ్మతులకు అధిక ప్రాధాన్యం జిల్లా పలు ఆర్అండ్బీ రోడ్లకు కాలానుగుణంగా మరమ్మతులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి రూ.43.35 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈఎన్సీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పూర్తి అధ్వానంగా తయారైన రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారులు కూడా ఉన్నాయి. రాష్ట్ర రహదారులకు సంబంధించి 16 రోడ్లలో 102.668 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ఆయా రోడ్లకు ప్యాచ్ వర్కులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లను కూడా వేయనున్నారు. కర్నూలు – బళ్లారి, కోడుమూరు – ఎమ్మిగనూరు, బిల్లేకల్ – ఎమ్మిగనూరు, గుత్తి – పత్తికొండ ( ఆదోని రోడ్డు ), పెద్దతుంబలం – కోసిగి ( హాల్వి– రాంపురం రోడ్డు ), మద్దికెర – పత్తికొండ, ఆలూరు – హోళగుంద ( కర్ణాటక సరిహద్దు వరకు ) తదితర రోడ్లను ఈ ప్రతిపాదనల్లో చేర్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన అనంతరం ఈ రోడ్ల పనులను ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి చెందనున్న హైవేల వివరాలు.. ♦ సంగమేశ్వరం నుంచి నల్లకాల్వ (93/819 నుంచి 124/530 కిలోమీటరు) వరకు, వెలుగోడు నుంచి నంద్యాల (141/700 నుంచి 173/560 కి.మీల) వరకు మొత్తం రూ.776.17 కోట్లతో 62.571 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు జరగనున్నాయి. ఇందులో భూ సేకరణకు రూ.165 కోట్లు ఖర్చు చేయనున్నారు. ♦ ప్రకాశం జిల్లాకు సంబంధించి దోర్నాల నుంచి కుంట (244/0 నుంచి 268/700 కి.మీల) వరకు మొత్తం రూ.244.83 కోట్లతో 24.20 కి.మీల మేర పనులు చేపట్టనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.51 కోట్లు వెచ్చించనున్నారు. ♦ నంద్యాల నుంచి జమ్మలమడుగు (186/02 నుంచి 248/010 కి.మీల) వరకు మొత్తం రూ.690 కోట్లతో 62.01 కి.మీల మేర పనులు చేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ. 135 కోట్లు వెచ్చించనున్నారు. ♦ రూ.155 కోట్లతో 7 కి.మీల మేర ఆదోని బైపాస్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ♦ సోమయాజులపల్లె నుంచి డోన్ (0/0 నుంచి 53/0 కి.మీల) వరకు రూ.650 కోట్లతో 53 కి.మీల మేర రోడ్డును వేయనున్నారు. ఇందులో భూసేకరణకు రూ.110 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. నాలుగు రోడ్లకు త్వరలోనే టెండర్లు జిల్లాకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నాలుగు రోడ్ల పనులకు నెలన్నర రోజుల వ్యవధిలోనే టెండర్లను ఆహా్వనించేందుకు చర్యలు చేపట్టాం. టెండర్లు పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభం అవుతాయి. సోమయాజులపల్లె – డోన్ జాతీయ రహదారికి సంబంధించిన టెండర్ ఈ నెలాఖరు నాటికి ఖరారు కానుంది. ఈ పనులు పూర్తి అయితే ఇటు వైఎస్సార్, అటు ప్రకాశం జిల్లాలకు మన జిల్లా నుంచి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. – ఏ ఇందిర, ఈఈ, ఎన్‌హెచ్ కర్నూలు -
భారతమాలకు రహదారులు
సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు, తొండంగి సమీపాన గేట్‌వే ఆఫ్ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వడివడిగా.. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో.. ♦ కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్ నుంచి అన్నవరం మీదుగా కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ♦ 40.32 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ♦ కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్‌వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్ హార్బర్ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. ♦ వాకలపూడి జంక్షన్లో ఒక ఫ్లై ఓవర్, అన్నవరం, కాకినాడ సెజ్, హార్బర్ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంటుంది. ♦ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ♦ ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది. ♦ ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు. ♦ రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. చకచకా భూసేకరణ ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ హైవేలో సగం గ్రీన్‌ఫీల్డ్ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వద్ద ప్రారంభమై ఎఫ్‌సీఐ గోడౌన్స్, సుగర్ ఫ్యాక్టరీ, కెనాల్ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి. 33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది. -
ఏపీలో రూ.1,292.65 కోట్ల హైవే పనులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,292.65 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. భారతమాల పరియోజనలో భాగంగా బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల మేర ఆరులేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నిమిత్తం నిధులకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వరస ట్వీట్లలో పేర్కొన్నారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ బెంగళూరు ఎస్టీఆర్ఆర్ నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఉన్న బెంగళూరు–విజయవాడ (ఎన్‌హెచ్–44)లోని కొడికొండ చెక్‌పోస్ట్ వరకు రహదారిని వినియోగించుకుంటుందని తెలిపారు. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎన్‌హెచ్–16లోని అద్దంకి వద్ద ముప్పవరం గ్రామం వరకు తదనంతరం విజయవాడ వరకు ఉన్న రహదారిని వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు 342.5 కిలోమీటర్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే అని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రతిపాదిత అభివృద్ధిని 14 ప్యాకేజీలుగా చేపడతామని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. -
స్మార్ట్ హైవేలుగా మన జాతీయ రహదారులు.. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ!
సాక్షి, అమరావతి: మన జాతీయ రహదారులు త్వరలో స్మార్ట్ హైవేలుగా రూపాంతరం చెందనున్నాయి. దేశంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు వేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. రూ.6వేల కోట్లతో 25వేల కి.మీ. మేర ఓఎఫ్సీ లైన్ల ఏర్పాటుకు భారీ ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ‘గతి శక్తి ప్రాజెక్టు’ కింద ఈ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) స్మార్ట్ హైవేలు/డిజిటల్ హైవేల ప్రాజెక్ట్ కార్యాచరణకు ఉపక్రమించింది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ముంబై–ఢిల్లీ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులలో 2వేల కి.మీ.మేర ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనుంది. ఇందుకోసం రూ.500కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. అనంతరం చెన్నై–విజయవాడ, ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో 5వేల కి.మీ. మేర పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. బహుళ ప్రయోజనకరంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ... ► బహుళ ప్రయోజనకరంగా స్మార్ట్ హైవేల ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 2050నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ► దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. ► 5జీ సేవల కోసం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఓఎఫ్సీ లైన్లు వేసేందుకు వివిధ అనుమతులు పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అందుకే జాతీయ రహదారుల వెంబడి కేంద్ర ప్రభుత్వమే డార్క్ ఫైబర్ కనెక్టివిటీని ఏర్పరచడానికి ఓఎఫ్సీ లైన్లు వేయాలని నిర్ణయించింది. ► హైవేల వెంబడి అవసరమైన చోట్ల ఓఎఫ్సీ లైన్లను నిర్ణీత ఫీజు చెల్లించి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు వాడుకునేందుకు ట్రాయ్ సమ్మతిస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఓఎఫ్సీ లైన్లను ఉపయోగించేందుకు వీలుగా ఏర్పాటుచేస్తారు. ► దేశవ్యాప్తంగా త్వరలో టోల్ గేట్లను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. టోల్ గేట్లు లేకుండా 5జీ నెట్వర్క్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఓ వాహనం జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే శాటిలైట్ ఆధారిత పరిజ్ఞానంతో ఆటోమేటిగ్గా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల వెంబడి 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి కూడా ఓఎఫ్సీ లైన్లు ఉపయోగపడతాయి. ► జాతీయ రహదారులపై భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కూడా ఈ ఓఎఫ్సీ లైన్లు ఉపకరిస్తాయి. ► రహదారి భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఎ‹సీ లైన్లు ద్వారానే స్పీడ్ రాడార్లు పనిచేస్తాయి. ► జాతీయ రహదారుల వెంబడి దశలవారీగా స్మార్ట్ హైవే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఓఎఫ్సీ లైన్లు దోహదపడతాయి. -
5న విజయవాడకు రాష్ట్రపతి
సాక్షి, అమరావతి: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఆమె ఐదో తేదీ విజయవాడలో పర్యటిస్తారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన మూడు జాతీయ రహదారులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ సమాచారం ఇచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పూర్తి షెడ్యూల్‌ను ఖారారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్ అండ్ బీ శాఖ రాష్ట్రపతి పర్యటన కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాయచోటి–అంగల్లు సెక్షన్ జాతీయ రహదారిని, జాతీయ రహదారి–205పై నాలుగు లేన్ల ఆర్వోబీ–అప్రోచ్ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. -
‘ఉత్తర రింగు’లో 84 ఊళ్లే!
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికిగాను అవసరమైన భూమిని సేకరించే గ్రామాల సంఖ్యలో స్పష్టత వచి్చంది. ఉత్తర భాగం పరిధిలో వంద మీటర్ల వెడల్పుతో 162.46 కి.మీ. మేర రింగురోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మించనున్న నాలుగు వరసల రోడ్డును భవిష్యత్తులో ఎనిమిది వరసలకు విస్తరించనున్నారు. ఎనిమిది వరసలు, స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని ఇప్పుడే సేకరిస్తారు. ఇందుకు 4,638 హెక్టార్లు అవసరమవుతాయని అధికారులు లెక్క తేల్చారు. తొలుత 4,200 హెక్టార్లు సరిపోతుందని భావించినా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇంటర్ఛేంజర్లను మరింత విశాలంగా నిర్మించాలని నిర్ణయించటంతో అదనంగా మరికొంత భూమిని సేకరిస్తున్నారు. ఇందుకు అదనపు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. కానీ, గెజిట్‌లో మాత్రం 4,942 ఎకరాలు అవసరమవుతాయని ప్రాథమికంగా పేర్కొన్నారు. భూసేకరణలో భాగంగా స్వల్ప మొత్తం భూమి పక్క గ్రామ సర్వే నంబర్ పరిధిలో ఉన్నా.. దాని వివరాలను కూడా గెజిట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సర్వే నంబర్లవారీగా భూమి వివరాల నమోదుకు సమయం పట్టనున్నందున, ప్రాథమికంగా అలైన్‌మెంట్‌కు రెండువైపులా అర కి.మీ. పరిధిలోని 122 గ్రామాలను తొలుత గుర్తించారు. ఇప్పుడు స్పష్టంగా వివరాలు నమోదు చేయటంతో గ్రామాల సంఖ్య 84కు పరిమితమైంది. 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికి 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సేకరించే భూమికి రూ.5,200 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవలే బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయా ఆర్డీవోల పరిధిలో భూమిని సేకరించే గ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామాల వివరాలు ఇవే... ఆర్టీవో సంగారెడ్డి: మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతపల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవల్‌పల్లె, సికిందర్‌పూర్, దౌల్తాబాద్ కొత్తపేట ఆర్టీవో ఆందోల్–జోగిపేట: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ ఆర్డీవో నర్సాపూర్: నాగులపల్లె, మూసాపేట్, జానకంపేట, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, ఖాజీపేట్, తిర్మల్పూర్, తుజల్పూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబోగూడ, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లె ఆర్డీవో తూప్రాన్: వట్టూరు, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్‌పల్లె, గుండారెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంటకాయపల్లె, నర్సంపల్లె. ఆర్డీవో గజ్వేల్: బేగంపేట, యాల్కల్, బంగ్లా వెంకటాపూర్, నెమ్టూరు, మఖత్ మాసాన్‌పల్లె, జబ్బాపూర్, మైలారం మక్తా, సంగాపూర్, ముట్రాజ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, పాములపర్తి, చేబర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్: వీరారెడ్డిపల్లె, కోనాపురం, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వేల్పుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె. ఆర్టీవో భువనగిరి: రాయగిరి, కేసారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, గౌస్‌నగర్, ఎర్రంబల్లె ఆర్డీవో చౌటుప్పల్: పహిల్వాన్పూర్, రెడ్లరాపాక, పొద్దటూరు, వెర్కట్‌పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, తలసింగారం, చౌటుప్పల్, లింగోజిగూడ. -
ప్రాణాలు తీస్తున్న అతివేగం
సాక్షి, అమరావతి: దేశంలో జాతీయ రహదారులపై అతివేగమే (ఓవర్ స్పీడ్) అత్యధిక రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమని తేలింది. ఆ తరువాత తప్పుడు మార్గంలో డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019, 2020 సంవత్సరాల్లో ఈ రెండు కారణాల వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం 2020లో రోడ్డు ప్రమాదాలపై విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగా దేశంలో జాతీయ రహదారులపై 74 శాతం ప్రమాదాలు జరుగుతుండగా.. 69 శాతానికిపైగా మరణాలు నమోదవుతున్నట్లు తెలిపింది. డ్రగ్స్, మద్యం తీసుకుని డ్రైవింగ్ చేయడం కారణంగా 33.3 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల 26.3 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వివరించింది. రెడ్‌లైట్ సిగ్నల్స్ జంపింగ్ చేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో ఈ ప్రమాదాలు, మరణాలు కూడా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
తెలంగాణలో కొత్తగా మరో 10 హైవేలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో గత కొన్నేళ్లుగా దూసుకుపోతున్న తెలంగాణ, కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో 10 కొత్త రహదారుల (ప్యాకేజీల ప్రకారం) పనులు ప్రారంభించనుంది. 715 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్ల నిర్మాణానికి రూ.28,615 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కొద్దిరోజుల క్రితమే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 258 కి.మీ. నిడివి గల కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వీటికి రూ.4,927 కోట్ల వ్యయం కానుంది. ఈ పనులు ప్రారంభం కాగా కొత్తగా మరో 10 రోడ్ల పనులు ప్రారంభించేందుకు వీలుగా అవార్డులు పాస్ చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డులోని ఉత్తరభాగంతో పాటు నాగ్‌పూర్–విజయవాడ మధ్య కొత్తగా నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కూడా ఇందులో ఉంది. ఈ 2 రోడ్లు పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ కావడం విశేషం. వీటితో కలుపుకొంటే గత ఎనిమిదేళ్ల కాలంలో 2,251 కి.మీ. నిడివి గల కొత్త జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. భూసేకరణే కీలకం.. : రీజినల్ రింగురోడ్డు, నాగ్‌పూర్–విజయవాడ కారి డార్లో భాగంగా తెలంగాణ పరిధిలో మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా ఏపీ సరిహద్దు వరకు 311 కి.మీ. మేర నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేలలో భూసేకరణే కీలకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కానీ ఈ రోడ్ల వల్ల పారిశ్రామిక పురోగతికి గొప్ప అవకాశం ఉన్నందున, భూసేకరణ సాఫీగా సాగేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల–ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేతో నాగపూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ.మేర తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా వెళ్లే ట్రాఫిక్ చాలావరకు ఈ కొత్త రోడ్డుమీదుగా డైవర్ట్ అవుతుంది. ఇది కొత్త ప్రాంతాల్లో పారిశ్రామిక పురోగతికి దోహదపడటమే కాకుండా,దూరం తగ్గడంతో ఇంధనం, సమయం ఆదా అవుతుంది. -
టోల్గేట్లకు త్వరలో టాటా
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్‌ఫీజు చెల్లింపునకు టోల్గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్‌ఫీజు వసూలు కోసం కొత్త విధానంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేస్తోంది. రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోలుఫీజు వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేసేందుకు ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (జీఎన్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. హేతుబద్ధంగాలేని ప్రస్తుత విధానం ప్రస్తుతం జాతీయ రహదారులపై రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. వాహనాలు టోల్‌గేటు వద్దకు చేరుకోగానే వాటిపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్‌చేసి సంబంధిత ఫీజు మొత్తం ఆ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆ రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని పూర్తిగా ప్రయాణిస్తే ఆ ఫీజు హేతుబద్ధమే. కానీ రెండు గేట్ల మధ్య పూర్తి దూరాన్ని ప్రయాణించకపోయినా ఈ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మీదుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనాలు గుంటూరు జిల్లాలో కాజ వద్ద టోల్ ఫీజు చెల్లించాలి. మళ్లీ ఆ రహదారిపై 66 కిలోమీటర్ల తరువాత కలపర్రు వద్ద టోల్గేట్ ఉంది. అంటే కాజ నుంచి కలపర్రు వరకు 66 కిలోమీటర్ల ప్రయాణానికి కాజ టోల్గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్నారు. కాజా నుంచి కలపర్రు వరకు ప్రయాణించే వాహనాలకు ఆ టోల్‌ఫీజు సహేతుకమే. కానీ వాహనాలు కాజ గేటు దాటిన తరువాత విజయవాడ వరకుగానీ, గన్నవరం వరకుగానీ ప్రయాణించినా సరే.. కలపర్రు వరకు అంటే 66 కిలోమీటర్ల దూరానికి టోల్‌ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్‌గేటు దాటి ఒక కిలోమీటరు ప్రయాణించినా సరే మొత్తం 66 కిలోమీటర్లకు టోలుఫీజు చెల్లించాల్సిందే. ఈ విధంగా దేశంలో ఉన్న వెయ్యికిపైగా టోల్గేట్లలో ప్రస్తుతం ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో 4.50 కోట్లకుపైగా ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు తాము ప్రయాణించే దూరానికి మించి టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు. నావిగేషన్ టోల్‌ఫీజు విధానం ఇలా.. టోల్‌ఫీజు విధానాన్ని మరింత హేతుబద్ధీకరించేందుకు జీఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తారు. అంటే వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్నప్పటి నుంచి ఆ దారిలో ప్రయాణించే దూరాన్ని జీఎన్ఎస్ఎస్ విధానంలో పరిశీలించి టోల్ వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై నుంచి పక్కకు జరగగానే ప్రయాణించిన దూరాన్ని ఆటోమేటిగ్గా లెక్కించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు తీసుకుంటారు. ఈ విధానంలో జాతీయ రహదారిపై ఎంతదూరం ప్రయాణిస్తే అందుకుతగ్గ టోల్ఫీజే వసూలు చేస్తారు. ఇక టోల్గేట్లు ఉండవు. కాబట్టి జాతీయ రహదారులపై టోల్‌ఫీజు చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి. ఐరోపా దేశాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్న ఈ జీఎన్ఎస్ఎస్ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ఈ విధానంపై ఎన్హెచ్ఏఐ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తోంది. దేశంలో 1.37 లక్షల వాహనాల నుంచి ప్రస్తుతం ఈ విధానంలో టోల్‌ఫీజు ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై రష్యా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు త్వరలో నివేదిక సమర్పించనున్నారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ విధానం అమలుపై ఎన్హెచ్ఏఐ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అందుకోసం అవసరమైతే జాతీయ రవాణా విధానంలో సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు
ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్అండ్బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రహదారులు ఉన్నాయి. అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్డీబీ నిధులతో.. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. సీఆర్ఐఎఫ్ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు. రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హై లెవిల్ బ్రిడ్జిలకు నిధులు ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. ఏలూరు డివిజన్ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి. -
దశాబ్దాల కల సాకారం.. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ రహదారుల అనుసంధానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రగతికి సోపానం కానుంది. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితాన్నిచ్చి, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. రాబోయే రెండేళ్లలో జాతీయ రహదారులు అన్ని రంగాల అభివృద్ధిలో కీలకంగా నిలవనున్నాయి. జిల్లాల పునర్విభజన తరువాత జాతీయ రహదారులకు గుర్తింపు, అనుసంధానంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వాణిజ్య సంబంధాలు మెరుగు పడేందుకు సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ పోర్టు – సామర్లకోట రైల్వే జంక్షన్, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు కీలక రహదారులు జాతీయ హోదాతో నాలుగు వరుసలుగా అభివృద్ధి సాధించనున్నాయి. మరింత స‘పోర్టు’ విశాఖపట్నం తరువాత ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న కాకినాడ పోర్టు నుంచి ఇతర జిల్లాలకు రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. దీంతో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవకు ఎంపీలు, మంత్రుల సమన్వయంతోడు కావడంతో ఇది సాకారం కానుంది. కాకినాడ పోర్టు నుంచి పామోలిన్ క్రూ డ్, ఎరువుల దిగుమ తులు జరుగుతున్నా యి. ఆఫ్రికా దేశాలకు బియ్యం, సింగపూర్, మలేషి యా వంటి దేశాలకు గ్రానైట్ వంటి ఎగుమతులు జరు గుతున్నాయి. ఇంతటి కీలకమైన రేవును జాతీయ రహదారితో అనుసంధానించడం వలన ఎగుమతి, దిగుమతులు మరింత ఊపందుకునే అవకాశాలు పెరుగుతాయి. కాకినాడ పోర్టుతో అటు అన్నవరం, ఇటు సామర్లకోట జంక్షన్లను జాతీయ రహదారితో అనుసంధానం చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఈ ప్రాంతాల గుండా కాకినాడకు నాలుగు వరుసల హైవే పారిశ్రామిక ప్రగతిలో మేలిమలుపు కానుంది. చదవండి👉 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం) అచ్చంపేట – పెద్దాపురం ఏడీబీ రోడ్డు ఈ జాతీయ రహదారికి భూసేకరణ జరుగుతోంది. కాకినాడ సమీపంలోని అచ్చంపేట జంక్షన్ నుంచి ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా 25 అడుగులతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. అచ్చంపేట నుంచి పెద్దాపురం ఏడీబీ రోడ్డు పొడవు 12.25 కిలోమీటర్లు. దీని నిర్మాణంతో సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సామర్లకోట మండలం నుంచి 12.25 కిలోమీటర్ల భారత్‌మాల రోడ్డుకు రూ.395.60 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇది ఉండూరు జంక్షన్ నుంచి కాకినాడ – సామర్లకోట రోడ్డులో ముత్యాలమ్మ గుడి, గోదావరి కాలువ మీదుగా వీకే రాయపురం, సామర్లకోట పంచారామ క్షేత్రం వెనుక నుంచి హుస్సేన్పురాన్ని కలుపుతూ సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ మీదుగా రాక్ సిరామిక్స్ సమీపాన పెద్దాపురం ఏడీబీ రోడ్డును కలవనుంది. అచ్చంపేట నుంచి రాజానగరం వరకూ నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారికి ఈ రోడ్డు అనుసంధానం కానుంది. దీంతో రాజానగరం నుంచి కాకినాడ వరకూ ఏడీబీ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. దశాబ్దాల కల సాకారం ఇప్పటి వరకూ అమలాపురం నుంచి అంబాజీపేట, ముక్కామల మీదుగా రావులపాలెం వరకూ ఆర్అండ్బీ రోడ్డు ఉంది. దీనిని రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి కత్తిపూడి – పామర్రు 216 జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. 216ఈగా పిలిచే ఈ కొత్త జాతీయ రహదారి అమలాపురం శివారు పేరూరు వై జంక్షన్ నుంచి భట్లపాలెం – ఇందుపల్లి – ఈదరపల్లి – ముక్కామల బైపాస్ రోడ్డు మీదుగా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. కోనసీమలో కొత్తగా 35 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ రోడ్డు ఆర్అండ్బీ నుంచి ఎన్‌హెచ్‌కు బదిలీ అయింది. కొత్త హైవేను ఈదరపల్లి – ముక్కామల బైపాస్ మీదుగా నిర్మించడంతో ఈ 8 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో కోనసీమ వాసుల ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఈ హైవే నిర్మాణంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల సాకారమవుతోంది. మూడు ఫ్లై ఓవర్లకు గ్రీన్‌సిగ్నల్ ►ఇటీవలనే ఆమోదం లభించిన జొన్నాడ, మోరంపూడి, దివాన్‌చెరువు ఫ్లైæఓవర్లతో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే జాతీయరహదారి 216పై ప్రమాదాలు తగ్గనున్నాయి. ►జొన్నాడ ఫ్లైఓవర్‌కు రూ.24కోట్లు, మోరంపూడి ఫ్లైæఓవర్‌కు రూ.56కోట్లు, దివాన్‌చెరువు ప్లైఓవర్‌కు ఐదేళ్ల క్రితం రూపొందించిన అంచనా రూ.20కోట్లు అవసరమవుతాయి. ►వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మరో కీలకమైన రహదారి కాకినాడ–జొన్నాడ. దీనికి జాతీయ హోదా ప్రయత్నం ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైంది. ►కాకినాడ, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ►కాకినాడ–అమలాపురం మధ్య జాతీయరహదారి 216 ను కలిపి ద్రాక్షారామ–కోటిపల్లి–అయినవిల్లి మీదుగా ఉన్న రాష్ట్ర రహదారిని కాకినాడ–వేమగిరిని కలుపుతూ ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారి హోదా ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. వాకలపూడి లైట్ హౌస్ – అన్నవరం పొడవు: 40.32 కిలోమీటర్లు. నాలుగు వరుసల రహదారి అంచనా : రూ.776.82 కోట్లు. హోదా : ఎన్‌హెచ్ 516–ఎ‹ఫ్ నిర్మాణ గడువు : రెండేళ్లు -
రూ.930 కోట్లతో ఆరు బైపాస్ రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కొత్తగా ఆరు బైపాస్ రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూనే బైపాస్ రహదారులు ఉండేవి. కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలు విస్తరిస్తుండటం, సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి స్థిరపడటంతో జనాభా పెరుగుదల తదితర కారణాలతో ఆ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరుగుతోంది. సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పట్టణాలగుండా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా మొదటి దశలో ఆరు పట్టణాల్లో బైపాస్ రహదారులు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఇటీవల ఖరారు చేసిన 2022–23 వార్షిక ప్రణాళికలో ఆ ఆరు బైపాస్‌లకు చోటు కల్పించారు. మొత్తం 64.20 కిలోమీటర్ల మేర రూ.930 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఖరారు చేసి అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. డబుల్ లేన్ విత్ పావ్డ్ షోల్డర్స్‌గా 12 మీటర్ల వెడల్పుతో బైపాస్ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
జాతీయ రహదారులకు రూ.6,212 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. రూ.6,212.9 కోట్లు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను ఖరారు చేసిన కేంద్రం ఇందులో అత్యధికంగా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు రూ.7,530 కోట్లు కేటాయించింది. మూడో స్థానంలో తెలంగాణ నిలి చింది. రాష్ట్రం ఆవిర్భవించాక ఓ ఆర్థిక సంవత్సరం లో రోడ్లకు ఇంత భారీగా నిధులు కేటాయించటం ఇదే తొలిసారి. నిధుల కేటాయింపునకు సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల విభాగాలు ఆమోదముద్ర వేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ రహదా రులకు సంబంధించి 16 రోడ్ల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రహదారులుగా ఉన్న వీటిని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతిచ్చింది. ఆ మేరకు జాతీయ రహదారుల విభాగం డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఆ డీపీఆర్‌లను సెంట్రల్ ఫైనాన్స్ కమిటీకి సమర్పించగా వాటిని పరిశీలించి నిధుల విడుదలకు తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీంతో టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మూడో తీగల వంతెన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కె జాతీయ రహదారిని విస్తరించనున్నారు. రెండు వరుసలుగా రోడ్డును విస్తరించే క్రమంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై దాదాపు 2 కిలోమీటర్ల నిడివిగల వంతెనను నిర్మించాల్సి ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీగల (సస్పెన్షన్ బ్రిడ్జి) వంతెనను నిర్మించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతం శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోకి వస్తున్నందున అక్కడ కృష్ణా నది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నదీగర్భంలో పునాదులు తీసి వంతెన కట్టడం కంటే తీగల నమూనా మంచిదన్న అభిప్రాయాన్ని కూడా ఇంజనీర్లు ఇచ్చారు. ఖర్చు పెరిగినా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణమే ఉత్తమమని తేల్చారు. ఇందుకు దాదాపు రూ.750 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పేర్కొ న్నారు. బ్రిడ్జి నమూనా సిద్ధం చేయాల్సి ఉంది. వెరసి వంతెనతో కలుపుకుంటే నిర్మాణ వ్యయం రూ.1,600 కోట్లు అవుతుంది. దీంతో వంతెన భాగానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణ యించింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ రోడ్డుకు సంబంధించిన నిధులకే పచ్చజెండా ఊపింది. వంతెన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం రోడ్ ప్లాన్‌లో చేర్చనున్నారు. త్వరలో టెండర్లు 2 వరుసలు, 4 వరుసలకు రోడ్ల విస్తరణతో పాటు 3 రోడ్లను పటిష్టపరిచేందుకు కూడా నిధుల విడుదలకు కమిటీ అనుమతిచ్చింది. ఇందులో హైదరాబాద్–భూపాలపట్నం రోడ్డుకు సంబంధిం చి 39.7 కిలోమీటర్లకు రూ.48.2 కోట్లు, సిరోంచ–ఆత్మకూరు రోడ్డుకు 8 కిలోమీటర్లకు రూ.79.42 కోట్లు, కల్యాణ్–నిర్మల్ రోడ్డుకు 7 కిలోమీటర్లకు 39.96 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్–బేలా రోడ్డు డీపీఆర్‌కు రూ.1.26 కోట్లను కూడా మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. -
హైవేలకు రూ.7,869 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషి ఫలించింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2021–22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర జాతీయ రహదారులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రవి ప్రసాద్ విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ప్రాంతీయ అధికారి ఎస్.కె.సింగ్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ వి.రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏపీ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూ. 7,513 కోట్లు, తెలంగాణకు రూ. 6,211 కోట్లు కేటాయించారు. ప్రతిపాదనల కంటే మిన్నగా.. రాష్ట్ర ప్రభుత్వం 2021–22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే మిన్నగా నిధులు రాబట్ట్డడం గమనార్హం. రాష్ట్రంలో 609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్ అండ్ బీ శాఖ ప్రతిపాదనలను సమర్పించింది. కానీ అంతకంటే ఎక్కువగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి అధికంగా నిధులు కేటాయించింది. ఇక 2022–23 వార్షిక ప్రణాళిక కింద మరింత భారీగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకోసం రూ.12 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే మిన్నగా రాష్ట్ర విభజన అనంతరం జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధికంగా 2021–22 వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. అంతేకాదు.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో కంటే 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబడుతోంది. గత వార్షిక ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మొదట రూ. 1,300 కోట్లే కేటాయించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీతో వెంటనే మాట్లాడటంతో ఆ నిధులను రూ. 2,700 కోట్లకు కేంద్రం పెంచింది. సీఎం కృషి ఫలితంగానే అత్యధిక నిధులు జాతీయ రహదారుల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభిృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకే ఆయన పలు దఫాలుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరపడంతోనే రాష్ట్రానికి అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి. కేంద్రం మంజూరు చేసిన నిధుల మేరకు త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతాం. – వి.రామచంద్ర, చీఫ్ ఇంజినీర్,ఆర్ అండ్ బి(జాతీయరహదారుల విభాగం) -
జూన్‌కల్లా ఆనందపురం–అనకాపల్లి హైవే సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆనందపురం–పెందుర్తి–అనకాపల్లి మధ్య నిర్మిస్తున్న ఆరులేన్ల జాతీయ రహదారి జూన్‌కల్లా పూర్తవుతుందని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రూ.2,527 కోట్లతో సుమారు 50 కిలోమీటర్ల మేర 2019 ఏప్రిల్‌లో ఈ రహదారి నిర్మాణం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ నిర్మాణం గత జూలై నాటికి పూర్తికావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా జాప్యం జరిగిందన్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశం లేదని చెప్పారు. విభజన హామీల అమలుకు 26 సమావేశాలు రాష్ట్ర విభజన చట్టం హామీల అమలుకు సంబంధించి 26 సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. విభజన చట్టంలోని చాలా ప్రొవిజన్లు అమల్లో ఉన్నాయని, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు. ఆయా సంస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల పూర్తికి చట్టంలో పదేళ్ల సమయం ఉందని, వీటి పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ చేయూత తరహా పథకం లేదు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు (45–60) ఆర్థిక భరోసా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ చేయూత తరహా పథకం కేంద్రంలో లేదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
హైవేల నిధులకు ‘రూట్’ క్లియర్!
National Highways to be expanded: రాష్ట్రంలోని కొత్త జాతీయ రహదారులకు ‘రూట్’క్లియర్ అయింది. కొన్నేళ్లుగా కేంద్రప్రభుత్వం తెలంగాణకు కొత్త జాతీయరహదారులను బాగానే కేటాయిస్తున్న విషయం తెలిసిందే, వాటి నిర్మాణానికి కూడా భారీగానే నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు పచ్చజెండా ఊపిన కేంద్రం, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన రోడ్డు పనులకు అనుమతులు మంజూరు చేసే అవకాశముంది. తాజా బడ్జెట్లో దేశవ్యాప్తంగా 25 వేల కి.మీ. రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో మన రాష్ట్రానికి రూ.3,500 కోట్ల మేర కొత్తగా నిధులు కేటాయించే అవకాశముందని ఒక అంచనా. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు సంబంధించి దాదాపు రూ.3,500 కోట్లు త్వరలో రానున్నాయి. అవి పాత బడ్జెట్ కిందే ఇచ్చే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్ కేటాయింపుల నుంచి మరో రూ.3,500 కోట్లు వస్తుండొచ్చని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లకుపైగా విలువైన కొత్త రోడ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇచ్చిన కేంద్రం, వాటికి అనుమతులు, డీపీఆర్‌లు, పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపనుంది. మరో రెండుమూడు కొత్త రోడ్లకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అనుమతులు రావాల్సిన రోడ్లు ఇవే.. గత ఏడాదికాలంలో తెలంగాణ రాష్ట్రంలో 3,306 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందులో 2,168 కి.మీ. మేర రోడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 1,138 కి.మీ. రోడ్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వాటిల్లో రీజినల్ రింగురోడ్డులోని ఉత్తర భాగానికి అనుమతి రాగా, దక్షిణ భాగమైన చౌటుప్పల్–ఆమన్‌గల్–షాద్‌నగర్–కంది రోడ్డుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఇది దాదాపు 183 కి.మీ. మేర ఉంటుంది. ఇక కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారి, కొత్తకోట–గూడూరు–మంత్రాలయం, జహీరాబాద్–బీదర్–డెగ్లూర్ రహదారులకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) నుంచి రూ.750 కోట్లు కేటాయించాల్సి ఉంది. వీటికి మరిన్ని జత చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయించే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఆరు వరుసల్లో హాయిగా.. బెంగళూరు, నిజామాబాద్ హైవే.. ఇంకా మరిన్ని..
►అక్కల్కోట్–కర్నూలు ఎకనమిక్ కారిడార్ రూపంలో పూర్తి కొత్త రోడ్డు ►గద్వాల రోడ్డుపై కర్ణాటక–తెలంగాణ సరిహద్దు నుంచి కర్నూలు వరకు నిర్మాణం ►కొత్తూరు నుంచి తొండుపల్లి వరకు బెంగళూరు హైవే విస్తరణ ►బోయిన్పల్లి నుంచి కాల్లకల్ వరకు నిజామాబాద్ హైవే విస్తరణ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఆరు వరుసల హైవేలొస్తున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులుగా ఉన్న కొన్నింటిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ఆరు వరసల జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవల డీపీఆర్‌లు రూపొందించి పంపగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు వాటికి క్రమంగా టెండర్లు పిలుస్తూ ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభించబోతోంది. ఇంతకాలం నగరంలో మినహా, వెలుపల ఆరువరసల రోడ్లు పెద్దగా పరిచయం లేదు. కీలక రహదారులు కావటంతో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోవటం, ప్రమాదాలు లేకుండా వాహనాలు వేగంగా గమ్యం చేరటం లక్ష్యాలుగా వీటిని ఆరు వరసలకు అభివృద్ధి చేయనున్నారు. సూరత్– చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక ఎకనమిక్ కారిడార్ దేశంలో ఉత్తర–దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్‌ప్రెస్‌వేలను కేంద్రం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్ నుంచి చెన్నై వరకు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల మధ్య ఎకనమిక్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఒకటి 280 కి.మీ. నిడివి గల మహారాష్ట్రలోని అక్కల్కోట్ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వరకు నిర్మించే కారిడార్. ఇందులో.. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో రాయచూర్–గద్వాల్ రోడ్డు నుంచి జూలెకల్ గ్రామం వరకు ఒక ప్యాకేజీగా, అక్కడి నుంచి కర్నూలు వరకు రెండో ప్యాకేజీగా ఇప్పుడు టెండర్లు పిలిచారు. రూ.1,870 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. బెంగళూరు హైవేపై.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. దీంతో దాన్ని ప్యాకేజీలుగా చేసి ఆరు వరసల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ లిమిట్స్ ముగియగానే శంషాబాద్ దాటిన తర్వాత ఔటర్ జంక్షన్‌వద్ద ఉండే తొండుపల్లి నుంచి ఎగువన కొత్తూరు కూడలి వరకు 12 కి.మీ. ప్రాంతాన్ని ఆరు వరసలకు విస్తరించబోతున్నారు. ఇందుకు రూ. 410 కోట్లు వ్యయం చేయనున్నారు. అప్పా జంక్షన్–మన్నెగూడ విస్తరణకు టెండర్లు.. హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్‌నుంచి వికారాబాద్ రోడ్డుపై పరిగి మలుపు సమీపంలో ఉండే మన్నెగూడ కూడలి వరకు 45.5 కి.మీ. మేర రోడ్డును నాలుగు వరసలు గా నిర్మించనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్లలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజామాబాద్ హైవేలో.. హైదరాబాద్–నిజామాబాద్ జాతీయ రహదారిపై నగర శివారులో కొత్త కాలనీలు, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తుండటంతో కొన్నేళ్లుగా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీంతో నగర శివారులోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ దాటిన తర్వాత కల్లకల్ వరకు రోడ్డును ఆరు వరసలుగా విస్తరించనున్నారు. దీన్ని రెండు ప్యాకేజీలుగా చేసి వెడల్పు చేయనున్నారు. బోయిన్పల్లి నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ. నిడివి రోడ్డును రూ.521 కోట్లతో విస్తరిస్తారు. గుండ్లపోచంపల్లి నుంచి కల్లకల్ వరకు 17 కి.మీ. నిడివిని రూ.730 కోట్ల భారీ వ్యయంతో విస్తరించనున్నారు. ఈ రోడ్డులో కొంపల్లి–దూలపల్లి కూడలి వద్ద, జీడిమెడ్ల కూడలి వద్ద సినీప్లానెట్ సమీపంలో, రద్దీగా ఉండే సుచిత్ర కూడలిలో భారీ ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇక ఇరుకుగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలతో హడలెత్తిస్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిని నాలుగు వరసలుగా విస్తరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. -
గిద్దలూరు–వినుకొండ రోడ్డుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: రాయలసీమను విజయవాడతో అనుసంధానిస్తూ మరో కొత్త రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు కొత్త రహదారిని నిర్మించనున్నారు. ప్రధానంగా రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి విజయవాడకు మరింత మెరుగైన కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ హైవే, అనంతపురం నుంచి విజయవాడకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. వాటితో రాయలసీమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో అనుసంధానం సాధ్యపడుతోంది. కానీ, రాయలసీమలోని నల్లమల ప్రాంతానికి మాత్రం విజయవాడతో సరైన రహదారి లేకుండాపోయింది. దాంతో సీమలోని వెనుకబడిన ప్రాంతాలను విజయవాడ ప్రాంతంతో మరింతగా అనుసంధానించేందుకు గిద్దలూరు–వినుకొండ రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వినుకొండ నుంచి విజయవాడకు ఇప్పటికే ప్రధాన రహదారితో కనెక్టివిటీ ఉంది. కాబట్టి గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రహదారి నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును ఆమోదించింది. రూ.925.60 కోట్లతో ప్రణాళిక ► ఈ జాతీయ రహదారిని ఎన్‌హెచ్–544డీ పేరుతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు నిర్మిస్తారు. ► 112.80 కి.మీ. పొడవున రెండు వరుసల రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.925.60 కోట్ల ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. ► ఈ రహదారి నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ త్వరలో శంకుస్థాపన చేస్తారు. ► 2023 జనవరి నాటికి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నది ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
పెరుగుతున్న టోల్‌ప్లాజాల సంఖ్య..
సాక్షి, హైదరాబాద్: గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై 23 టోల్‌ప్లాజాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 27కు పెరిగింది. మరో నాలుగైదు రాబోతున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులుగా ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా మారుస్తుండటంతో వాటిపై కొత్తగా టోల్గేట్లు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు నుంచి మెదక్ వరకు ఏర్పడ్డ జాతీయ రహదారిపై నర్సాపూర్ చేరువలోని గుమ్మడిదలలో టోల్గేట్ ఏర్పాటు చేశారు. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొత్తగా జాతీయ రహదారిని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్లంపల్లి వద్ద కొత్తగా టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఇక జడ్చర్ల–కల్వకుర్తి రోడ్డులో మున్ననూరు వద్ద, ములుగు–భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై జవహర్‌నగర్ వద్ద మరో టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఈ నాలుగింటి వల్ల కూడా టోల్ వసూళ్లు కొంతమేర పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో వాహనాల సంఖ్య కూడా కొంత పెరగటంతో ఆ మేరకు వసూళ్లు పెరిగాయి. -
జాతీయ రహదారులతో భూముల ధరల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్షించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
రాయలసీమకు మరో రెండు రహదారులు
సాక్షి, అమరావతి: రాయలసీమకు మరో రెండు ప్రధాన రహదారులు మంజూరయ్యాయి. వైఎస్సార్ జిల్లాను అనంతపురం, కర్నూలు జిల్లాలతో మరింతగా అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఎన్నడూలేని రీతిలో 2021–22 వార్షిక ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.6,421కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రణాళికలో భాగంగా చేపట్టే పనుల్లో ఆర్ అండ్ బీ శాఖ ఈ రెండు రోడ్లను కూడా తాజాగా ప్రతిపాదించింది. అందుకోసం రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించే ప్రక్రియను చేపట్టింది. ►ముద్దునూరు– హిందూపూర్ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రహదారిని పులివెందుల, కదిరి మీదుగా హిందూపూర్ వరకూ 159 కి.మీ. మేర నిర్మిస్తారు. అందుకు రూ.1,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి నిర్మాణానికి డీపీఆర్ వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం మూడు ప్యాకేజీల కింద టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ►కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ‘పావ్డ్ సోల్డర్స్(డబుల్ లైన్ల రోడ్డుకి రెండు వైపులా మరో 3 మీటర్లు కలిపి కలిపి అదనంగా.. 7+3) రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 88 కి.మీ.మేర నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. చదవండి: (ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం: పేర్ని నాని) -
శరవేగంగా శ్రీనగర్–లద్దాఖ్ భారీ టన్నెళ్ల నిర్మాణం
శ్రీనగర్ సోనామార్గ్ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్‌సింగ్ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్–మోర్ టన్నెల్ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. తగ్గనున్న రవాణా భారం... సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్–మోర్ టన్నెల్ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది. పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. -
రహదారులే రన్వేలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నా«థ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ఎస్ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం ఈ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్–30ఎంకేఐ ఫైటర్ జెట్, ఏఎన్–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో.. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ తరహా స్ట్రెచ్ నిర్మించడం ద్వారా దేశ ఐక్యత, వైవిధ్యం, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత ఖర్చయినా వెనకాడం అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యిందని రక్షణ మంత్రి రాజ్నా«థ్ అన్నారు. ఎన్నో హెలిప్యాడ్ల నిర్మాణంలో జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని తెలిపారు. రక్షణపరమైన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... సైన్యానికి జాతీయ రహదారులు సైతం ఉపకరించడం దేశాన్ని మరింత సురక్షితం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఫ్లైఓవర్ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్ వరకు రన్‌వే నిర్మాణంలో ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సట్టా–గాంధవ్ మార్గంతోపాటు గగారియా–బఖాసర్ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ మార్గంపై అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ జంక్షన్ వద్ద సిద్ధమవుతున్న రన్‌వే -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
Telangana: ఇవేం రోడ్లు.. వాహనదారుల బెంబేలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్ శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు బదిలీ అయిన గ్రామీణ రోడ్లు.. ఇలా ఆ రోడ్డు, ఈ రోడ్డు అని లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ధైర్యం చేసి కొద్దిగా దూరంగా వెళితే చాలు ఒళ్లు హూనమవుతోంది. ఎప్పట్నుంచో మరమ్మతులకు నోచక గుంతలు పడిన రోడ్లు ఇటీవలి భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీస్తున్నాయి. జాతీయ రహదారుల మరమ్మతుకు చాలాచోట్ల సాంకేతిక అంశాలు అడ్డుగా మారుతుండగా, రాష్ట్ర రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు నిధుల లేమి ఆటంకంగా మారింది. రోడ్లు భవనాల శాఖలోకి బదిలీ అయిన గ్రామీణ రోడ్లపై.. అప్పట్నుంచీ ఒక్క కంకర రాయి కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. హైవేపై స్పీడుకు తారు ధరలతో బ్రేకు జాతీయ రహదారులంటే.. వాహనం రయ్యిన దూసుకెళ్లేలా, ఎలాంటి కుదుపులకు తావివ్వని విధంగా నున్నగా, విశాలంగా ఉండాలి. ఆ మేరకు తీర్చిదిద్దేందుకే సాధారణ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తారు. వాటి నిర్వహణ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు వాటిని ఓ విచిత్ర సమస్య వెంటాడుతోంది. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు తారు ధర మెట్రిక్ టన్నుకు రూ.27 వేలుగా ఉండేది. గత ఏడాదిన్నర కాలంలో దాని ధర ఏకంగా రూ.40 వేలకు చేరింది. దీంతో జాతీయ రహదారుల రెన్యూవల్ వర్క్స్ (పూర్తిస్థాయి మరమ్మతులు)కు పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ ధరను కోట్ చేస్తున్నారు. సాధారణంగా 5 శాతం ఎక్సెస్ వరకు అనుమతి ఉంటుంది. కానీ తారు ధర భారీగా పెరగటంతో కాంట్రాక్టర్లు 25 శాతం వరకు ధర పెంచి కోట్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు లోబడి లేని విషయం కావటంతో అధికారులు టెండర్లను రద్దు చేస్తున్నారు. కొన్ని చోట్ల టెండర్లు ఓకే అయినా.. తారు ధర అదుపులోకి వచ్చాక రెన్యూవల్ వర్క్స్ చేపట్టొచ్చని కాంట్రాక్టర్లు చిన్నపాటి గుంతలను సరిచేసేందుకే పరిమితమవుతున్నారు. రాష్ట్ర రహదారుల్లో 20 వేల కి.మీ. తిప్పలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరుసల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మించిన దాదాపు 8 వేల కి.మీ. రోడ్లు మాత్రం బాగున్నాయి. ఇవి పోను రాష్ట్రంలో మిగిలిన 20 వేల కి.మీ మేర విస్తరించి ఉన్న రాష్ట్ర రహదారులు మాత్రం క్రమంగా దారుణంగా మారుతున్నాయి. ఇందులో ఏడు వేల కి.మీ మేర ఉన్న పాత పంచా యతీరాజ్ శాఖలోని గ్రామీణ రోడ్లు దాదాపు ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లను ఉన్నతీకరించేందుకు గత ఏడేళ్ల కాలంలో కొన్నికొన్ని చొప్పున రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశారు. ఈ శాఖ ఆధీనంలోని 21 వేల కి.మీ. రోడ్లను నిర్వహించేందుకే నిధులు సరిపోని పరిస్థితిలో, కొత్తగా వచ్చిచేరిన ఈ రోడ్లను నిర్వహించటం దానివల్ల కావటం లేదు. దీంతో ఈ ఏడేళ్లలో ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఆ రోడ్లను బలవంతంగా తమకు అప్పగించారన్న అభిప్రాయంతో ఆ శాఖ ఉంది. వరంగల్ శివారు హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామం నుంచి ఎల్కతుర్తి మధ్య రోడ్డు. దీని పరిస్థితి కూడా దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నామరూపాల్లేకుండా చెదిరిపోయి పెద్దపెద్ద గోతులేర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అయినప్పటికీ ఆరోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఉత్తర తెలంగాణలో కొంత మేర ఓకే ఇక గత ఏడాది నుంచి వానలు, ఇతర కారణాలతో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోడ్ల మరమ్మతుకు డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ప్రభుత్వం రూ.300 కోట్లు (బొగ్గు తవ్వకాల ప్రభావం ఉన్న జిల్లాలకు) కేటాయించింది. వాటితో కొన్ని ప్రాంతాల్లో పనులు జరగటంతో కొంతమేర ఆయా రోడ్లు బాగుపడ్డాయి. పనులు జరగని చోట్ల వాహనాలు సరిగా తిరగలేని దుస్థితే ఉంది. అదే దక్షిణ తెలంగాణలో పనులు అంతగా జరగకపోవటంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు నెలకొన్నాయి. ఇటీవలి వానల తర్వాత గుంతలు పూడ్చేందుకు రోడ్లు భవనాల శాఖ రూ.25 కోట్లు విడుదల చేసింది. కానీ అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. తీర్చిదిద్దాలంటే వేల కోట్లు కావాలి ఇప్పటికిప్పుడు 21 వేల కి.మీ రోడ్లపై గుంతలు పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే రూ.550 కోట్లు కావాలని ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. ఆ నిధుల కోసం ఇప్పుడు ఆ శాఖ ఎదురుచూస్తోంది. గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. వీటిల్లో ఒక్క పాత పంచాయతీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకే రూ.250 కోట్లు అవసరం. వాటిని పూర్తిస్థాయి మరమ్మతు చేస్తూ సింగిల్ రోడ్లుగా కొత్త తారు పూతతో తీర్చి దిద్దాలంటే ఏకంగా రూ.3 వేల కోట్లు కావాలి. అదే రెండు వరుసలకు విస్తరించాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. ముట్టుకుంటే ఇంత ఖర్చు కానుండటంతో రోడ్లు భవనాల శాఖ వాటి జోలికెళ్లటం లేదు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ–దంతాలపల్లి మధ్య రోడ్డు దుస్థితి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు పూర్తిస్థాయి మరమ్మతు జరిగింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అప్పట్నుంచీ తూట్లు పడుతూ పడుతూ ఇలా తయారయ్యింది. పెద్దపెద్ద గుంతలతో వాహనదారులకు నిత్యం నరకం చూపుతోంది. ఇటీవల దీని మరమ్మతుకు 3 పర్యాయాలు టెండర్లు పిలిస్తే, తారు (బిటమిన్) ధరలు బాగా పెరిగాయని చెప్పి కాంట్రాక్టర్లు 25శాతానికి పైగా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేయటంతో అధికారులు తిరస్కరించారు. తారు ధరల పెంపునకు తగ్గట్టు బిల్లులు చెల్లించే అవకాశం లేక జాతీయ రహదారుల విభాగం విషయాన్ని ఢిల్లీకి చేరవేసి మిన్నకుండిపోయింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే హైదరాబాద్–నల్లగొండ ప్రధాన రహదారి అంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అంతలా ఈ రోడ్డు దెబ్బతింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలు ఆటంకంగా మారాయి. ఫలితంగా వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. -
3 పోర్టులు.. 13 రహదారులు: ఏపీ మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మూడు ప్రధాన పోర్టులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా లాజిస్టిక్స్, కార్గో రవాణా రంగాల అభివృద్ధి పుంజుకోనుంది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 13 కొత్త రహదారులను నిర్మించనున్నారు. ఈ రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలతో పాటు మూడు సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఊపందుకోనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదముద్ర వేసింది. 277.25 కి.మీ. రోడ్ల నిర్మాణం.. నాలుగు లేన్లు, ఆరు లేన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో మొత్తం రూ.7,876.56 కోట్లతో 277.25 కిలోమీటర్ల మేర కొత్తగా 13 రోడ్లను నిర్మించనున్నారు. ఇప్పటికే 6 రోడ్లకు డీపీఆర్‌లు పూర్తి కాగా, మరో 7 రోడ్లకు డీపీఆర్‌లను రూపొందిస్తున్నారు. డీపీఆర్‌లు ఖరారు చేసిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. ఏడాదిన్నరలో ఈ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. ఈ రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ, తదితర విషయాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. లక్ష్యం ఇదీ.. ఆగ్నేయాసియా దేశాల నుంచి ఎగుమతి, దిగుమతులకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను గేట్ వేలు మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఎగుమతి, దిగుమతులకు మన రాష్ట్రంలోని ఈ మూడు పోర్టులే కీలకం. అందుకే ఈ మూడు పోర్టుల నుంచి తక్కువ సమయంలో, తక్కువ ఇంధన వ్యయంతో చేరేందుకు వీలుగా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఈ రహదారుల నిర్మాణానికి నిర్ణయించింది. మూడు మార్గాల్లో అనుసంధానం కొత్తగా నిర్మించే 13 రహదారుల్లో ఆరు రహదారులు విశాఖ పోర్టును మూడు మార్గాల్లో జాతీయ రహదారి–16తో అనుసంధానిస్తారు. వాటిలో విశాఖపట్నం పోర్టు నుంచి బీచ్ రోడ్డు మీదుగా భోగాపురం వరకు 4 లేన్ల రహదారి ఉండటం విశేషం. తద్వారా త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ పోర్టుతో అనుసంధానించడం సాధ్యపడుతుంది. మరో నాలుగు రహదారులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును ఎన్‌హెచ్–16తో అనుసంధానిస్తారు. దాంతో అటు రాయలసీమతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి కార్గో రవాణాకు మార్గం సుగమమవుతుంది. మూడు రహదారులను కాకినాడ పోర్టును ఎన్‌హెచ్–16తో అనుసంధిస్తారు. పూర్తి సహకారం అందిస్తాం రాష్ట్రంలో లాజిస్టిక్స్, కార్గో రవాణా రంగాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా మూడు పోర్టులను అనుసంధానిస్తూ ఈ 13 రహదారుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కొంతకాలం కిందట ప్రతిపాదించారు. ఈ రహదారుల ఆవశ్యతను సమగ్రంగా వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. ఈ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ -
మూడేళ్లలో 7 హైవేలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత మూడేళ్లలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2020 జూన్ 29న ఖమ్మం–దేవరపల్లి, గతేడాది జూన్ 6న కల్వకుర్తి–కొల్లాపూర్–కరివేన, ఈ ఏడాది మార్చి 23న మెదక్–ఎల్లారెడ్డి–రుద్రూర్, బోధన్–బాసర–బైంసా, ఈ ఏడాది ఏప్రిల్ 7న హైదరాబాద్ ఓఆర్ఆర్–వలిగొండ–తొర్రూర్–మహబూబాబాద్– ఇల్లెందు– కొత్తగూడెం, తాండూర్–కొడంగల్–మహబూబ్‌నగర్ రహదారి నిర్మాణ పనులు మంజూరైనట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు. ►బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఏవియేషన్ వర్సిటీని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనేదీ కేంద్ర పౌరవిమానయాన శాఖ వద్ద లేదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్.జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంలో తెలిపారు. ►ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)లో భా గంగా తెలంగాణకు 2.24 లక్షల ఇళ్లు కేటాయి ంచగా, ఇప్పటివరకు 2.05 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్టు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ►సమగ్రశిక్ష అభియాన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.290.42 కోట్లు కేంద్రం విడుదల చేసిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ►వందేభారత్ మిషన్ ద్వారా గత నెల 29 వరకు 100 దేశాల నుంచి 88,700 విమాన సర్వీసుల ద్వారా 72 లక్షల మంది ప్రయాణికులను విదేశాల నుంచి భారత్‌కు వచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వి.కె.సింగ్.. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ►తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో అనుమతుల్లేని వాటిని ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ►దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీలు, నీలకంఠం సామాజిక వర్గాలకు చెందిన నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ►గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించగా, అందులో తెలంగాణలో 4 ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ►కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని అంగన్వాడి సేవలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.116.11 కోట్లు విడుదల చేశామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇంకా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కింద రూ.1.57కోట్లు, బేటీ బచావో బేటీ పడావో పథకం అమలుకు రూ.2.19 కోట్లు తెలంగాణకు విడుదల చేశామన్నారు. -
పెట్టుబడులను ఆకర్షించేలా..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పారిశ్రామిక పార్కుల్లోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ రహదారులతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేయబోతోంది. జాతీయ రహదారులతో అనుసంధానం వల్ల పారిశ్రామిక పార్కులు విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. చైనాలోని టాంజిన్ ఎకనామిక్ టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియా, సింగపూర్ సుజోహు పారిశ్రామిక పార్క్, తైవాన్ హిసించు సైన్స్ పార్క్‌ల విజయంలో రహదారుల అనుసంధానం కీలకపాత్ర పోషించినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. చైనాలో టాంజిన్ పార్కును 10 ప్రధాన రహదారులతో అనుసంధానం చేయగా, సింగపూర్‌లో 5 ఎక్స్‌ప్రెస్ హైవేలు, తైవాన్‌లో 2 ప్రత్యేక హైవేలతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేశారు. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీ మీదుగా వెళ్తున్న విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్లలో చేపట్టిన పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేసేందుకు ఆరు రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. పారిశ్రామిక పార్కుల నుంచి వేగంగా హైవేల మీదకు చేరుకునేలా 1,318 కి.మీ. రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక పార్కులకు ప్రయోజనం చేకూరే విధంగా కడప–తడ మధ్య 208 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. విశాఖ నోడ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్‌హెచ్16ను ఎన్‌హెచ్ 30తో అనుసంధానం చేస్తారు. ఇందుకు విశాఖ–చింటూరు మధ్య 238 కి.మీ మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. మచిలీపట్నం నోడ్‌కు ప్రయోజనం చేకూరేలా ఎన్‌హెచ్ 16ను ఎన్‌హెచ్ 44తో అనుసంధానం చేస్తారు. ఇందుకు బాపట్ల–గుంటూరు (49 కి.మీ), గుంటూరు–కర్నూలు(281కి.మీ), గుంటూరు–అనంతపురం(370 కి.మీ) రహదారులను ప్రతిపాదించారు. కాకినాడ్ నోడ్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఎన్‌హెచ్ 16ను ఎన్‌హెచ్ 65తో అనుసంధానం చేస్తారు. ఇందుకు దేవరపల్లి–సూర్యాపేట మధ్య 172 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. -
నేషనల్ హైవేలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మోనటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ ఎమినిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
దూకుడుతో నష్టం.. భవిత ఎంతో కష్టం
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులు, పట్టణ రోడ్లమీద.. గల్లీల్లోను కుర్రాళ్ల దూకుడు ప్రాణాల మీదకు తెస్తోంది. దూకుడుతో పాటు ద్విచక్ర వాహనంలో స్పీడుగా వెళ్లడమనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీనివల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. అనేకమంది శాశ్వత వైకల్య బాధితులుగానూ మారుతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు నాన్నా జాగ్రత్త.. నాన్నా జాగ్రత్త అంటూ తల్లిదండ్రులు పదేపదే చెబుతుంటారు. కానీ యువకులు ఇలాంటివి పెడచెవిన పెడుతున్నారు. ఉదాహరణకు 2020 సంవత్సరంలో విశాఖపట్నం లోని కింగ్‌జార్జి ఆస్పత్రి ట్రామాకేర్‌లో 613 మంది ప్రమాద బాధితులు నమోదు కాగా.. అందులో 40 ఏళ్లలోపు వారే 325 మంది ఉన్నారు. అంటే 50 శాతం కంటే ఎక్కువ. ఆ ఏడాది ఇదే ఆస్పత్రిలో 137 మంది మృతిచెందారు. వీరిలో 82 మంది కుర్రాళ్లే. 80 శాతం మంది ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురైనవారే. హైవేల్లోనే కాకుండా గల్లీల్లో కూడా ఇలాంటి వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. 18 ఏళ్ల లోపు వారికీ తల్లిదండ్రులు బైకులిస్తుండటం కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమవుతోంది. లైసెన్సు రాకముందే.. చాలాప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వారిలో 18 ఏళ్లలోపు వారూ ఉన్నారు. ఎక్కువగా వీళ్లు 150 సీసీ బైకుల్లో రైడింగ్ చేయడం, బ్యాలెన్సు చేయలేక పడిపోవడం వంటివి జరుగుతున్నాయి. చదువుకునే వయసులోనే ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు ఫ్రాక్చర్లు చేసుకుంటున్న ఘటనలున్నాయి. అనేకమంది హెల్మెట్ కూడా లేకుండా డ్రైవ్ చేసి, తలకు గాయాలై తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. ప్రమాదానికి గురైన వారిలో 30 శాతం మందికి మేజర్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. విచిత్రమేమంటే 2020 మార్చి నుంచి కోవిడ్ ఉంది. అయినా సరే 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు గతంలో లాగా కాకపోయినా ఓ మోస్తరు ప్రమాదాలు జరిగాయి. ఇందులో కుర్రాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదానంతరం శస్త్రచికిత్సలు చేయించుకున్నా గతంలో వలె ఉండలేకపోతున్నారు. కొందరు శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు టీనేజీలో గుర్తింపు సమస్య చాలామంది టీనేజీ కుర్రాళ్లలో ఐడెంటిటీ క్రైసిస్ (గుర్తింపు సమస్య) ఉంటుంది. నన్ను అందరూ చూడాలి, అందరికంటే నేనే గొప్ప.. ఇలాంటివి. దీనివల్ల ఏదో ఒకటి చేసి వాళ్లు గుర్తింపు కోరుకోవడం అన్నమాట. ఇలాంటివాళ్లలో బైక్‌రైడింగ్ చేసేవాళ్లు ఎక్కువ. వాళ్లు స్పీడుగా నడిపితే వాళ్లవైపు అందరిచూపు ఉంటుందని అనుకుంటారు. మరికొందరిలో నార్సిస్టిక్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే సెల్ఫ్ ఐడెంటిటీ అంటారు. ఇలాంటి వారిలో ఏదో ఒక మానసికమైన జబ్బు ఉంటేనే ఇలాంటివి చేస్తుంటారు. వీరికి బాగా కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్యనిపుణులు, కడప సర్వజనాస్పత్రి -
జాతీయ రహదారుల నిర్మాణం రయ్.. రయ్..
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను శరవేగంగా రూపొందించనున్నారు. మొత్తం 383.60 కిలోమీటర్ల మేర కొత్త ఎన్‌హెచ్ (నేషనల్ హైవే)ల నిర్మాణానికి, అభివృద్ధికి కేంద్రం అనుమతిచ్చింది. డీపీఆర్‌ల తయారీ కోసం కన్సల్టెన్సీ సర్వీసులకు గాను కేంద్రం రూ.17 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.6 కోట్ల నిధులతో కొత్తగా 200 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందిస్తారు. డీపీఆర్‌ల రూపకల్పనలో కీలక రహదారి ప్రాజెక్టులున్నాయి. సాక్షి, అమరావతి: ఎన్‌హెచ్–516–ఈ నిర్మాణంలో భాగంగా అరకు నుంచి బౌదార వరకు (పూర్తిగా కొండ ప్రాంతం) 42.40 కి.మీ.వరకు రూ.3 కోట్లతో డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం చేయనున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 నిర్మాణాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజించారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం –కొయ్యూరు, కొయ్యూరు –లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు – బౌదార మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. అరకు–బౌదార ఘాట్ రోడ్డు డీపీఆర్ పూర్తైతే వచ్చే వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులు కేటాయించనుంది. ఏజెన్సీ ప్రాంతం చింతూరు–మోటు 8 కి.మీ.ల రోడ్డు అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయనున్నారు. వైఎస్సార్ జిల్లాలో కడప–రాయచోటి సెక్షన్లో ఐదు కి.మీ. టన్నెల్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించనున్నారు. మూడు ఎన్‌హెచ్‌ల బలోపేతానికి రూ.115.92 కోట్లు రాష్ట్రంలో మూడు జాతీయ రహదారుల బలోపేతానికి కేంద్రం ఈ వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించింది. దేవరపల్లి–జంగారెడ్డిగూడెం, అనంతపురం–గుంటూరు, రేణిగుంట–కడప–ముద్దనూరు జాతీయ రహదారులకు మొత్తం 38.62 కి.మీ.మేర రోడ్ల బలోపేతానికి రూ.115 కోట్లు కేటాయించింది. -
ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే టోల్ ఫీజు రెట్టింపు!!
న్యూఢిల్లీ: టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించే దిశగా వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ఫీజు భారం రెట్టింపు కానుంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోని అన్ని లేన్లను ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి ’ఫాస్టాగ్ లేన్లు’గా మారతాయని పేర్కొంది. ‘నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుంది‘ అని ఎన్హెచ్ఏఐ వివరించింది. డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజుల చెల్లింపును ప్రోత్సహించేందుకు, ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని తెలిపింది. 2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది. ఇక డెడ్‌లైన్ పొడిగించేది లేదు: మంత్రి గడ్కరీ ఫాస్టాగ్ అమలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గడువును ఇప్పటికే రెండు, మూడు సార్లు పొడిగించామని పేర్కొన్నారు. వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు. కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90 శాతం దాకా ఉంటోందని, తీసుకోని వారి సంఖ్య కేవలం పది శాతమే ఉండొచ్చని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇది అందుబాటులో ఉంటుందని వివరించారు. -
ఆర్టీసీలో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో టికెటింగ్ విధానంపై వినూత్న ప్రాజెక్టుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టికెటింగ్, రిజర్వేషన్, ట్రాకింగ్, ఫిర్యాదులు, డేటా అంతా ఒకే యాప్‌లో రూపొందించేలా ‘యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్’ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దేశంలో ఏ ఆర్టీసీ అమలు చేయని విధంగా ఈ ప్రాజెక్టును ఏపీఎస్ఆర్టీసీ చేపట్టనుంది. ప్రస్తుతం టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌కు, ట్రాకింగ్, ఫిర్యాదులకు వేర్వేరు వెబ్సైట్లను ఆశ్రయించాలి. ఇకపై ఒకే యాప్‌లో అన్ని సేవలు లభ్యమయ్యేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఆర్టీసీ పంపిన డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం ఇప్పుడు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి ఎంపికైన కన్సార్షియంకు ప్రాజెక్టును అప్పగిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.30 కోట్ల నిధుల్ని అందిస్తోంది. పల్లె వెలుగు నుంచి.. పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్ టెక్నాలజీ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మాత్రమే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతం ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ అంటే? ఏటా ఆర్టీసీలో రూ.5 వేల కోట్ల విలువైన టికెట్లు అమ్ముడవుతున్నాయి. రోజుకు 30 లక్షల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ టికెట్లను జారీ చేయడానికి ఆర్టీసీకి ఏటా రూ.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. టిమ్ మిషన్లకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు, పేపర్ రోల్స్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతోంది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ప్రాజెక్టులో ఆర్టీసీకి ఎలాంటి ఖర్చు లేకుండా టికెట్ల జారీ మొత్తం కన్సార్షియంకు టెండర్ విధానం ద్వారా అప్పగిస్తారు. బ్యాంకు, సాఫ్ట్వేర్ కంపెనీ కలిపి కన్సార్షియంగా ఏర్పడి టెండర్లలో పాల్గొనాలి. అన్ని బస్ సర్వీసుల్లో టిమ్ మిషన్లకు బదులు బ్యాంకు అందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్ మిషన్లలో టికెట్లను జారీ చేస్తారు. టెండర్లలో పాల్గొనే కన్సార్షియంకు టికెట్‌కు ఎన్ని పైసలు కమీషన్ అందించాలనే అంశంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయం నుంచి ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న విధానం అయితే డిపోకు టిమ్ మిషన్ తీసుకువచ్చిన తర్వాతే టికెట్ల అమ్మకం వివరాలు తెలుస్తాయి. -
1,076 కి.మీ జాతీయ రహదారులు 24,000కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి రూ. 24 వేల కోట్లతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదా రులను నిర్మించ నుంది. ఈ రోడ్ల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేం దుకు ప్రణాళిక రచిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే రెండేళ్లలోనే ఈ పనులు పూర్తికానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేందుకు... దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావి స్తోంది. చాలా ప్రాంతాల్లో పరి శ్రమలు ఏర్పాటు కావటానికి మౌలికవసతుల కొరతే అడ్డం కిగా మారింది. మంచి రోడ్ నెట్వర్క్ ఏర్పాటైతే కొత్త ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబ డులు పెట్టేందుకు సంస్థలు ముందు కొస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ మాలా ప్రాజెక్టు కింద భారీగా రోడ్ల అభివృద్ధికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ. 27 వేల కోట్ల మేర రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమాయత్తమవు తోంది. ఇందులో రూ. 24 వేల కోట్లతో నాలుగు వరుసల రోడ్లను నిర్మించనుండగా మరో రూ. 3 వేల కోట్లతో జాతీయ రహదారులను వెడల్పు చేయనుంది. చదవండి: (బీజేపీలో చేరతా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి) భూసేకరణ వేగంగా జరిగితే.. రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కేంద్రం సూచించింది. అందుకయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. కావాల్సిన భూము లను సేకరించి కేంద్రానికి కేటాయిస్తే వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తేల్చిచెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. -
35 శాతం మృతులు ద్విచక్ర వాహనదారులే
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై నిత్యం జరిగే ప్రమాదాల్లో అత్యధికంగా 35 శాతం మృతులు ద్విచక్ర వాహనదారులే కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఎటువంటి సంబంధం లేని పాదచారులు కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు, మృతులపై కేంద్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం 18.6 శాతం రోడ్డు ప్రమాద మృతులు కార్లు, టాక్సీలు, వాన్లలో ప్రయాణించేవారేనని తేలింది. అలాగే 19.7 శాతం రోడ్డు ప్రమాద మృతులు ట్రక్కుదారులు, 4.9 శాతం బస్సుల్లో ప్రయాణించేవారు చనిపోతున్నారు. 2019లో జాతీయ రహదారులపై ప్రమాదాల్లో 53,872 మంది మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. హైవేలపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్ల డిజైన్లలో మార్పులు చేయడంతో పాటు వేగ నియంత్రణకు సంబంధిత కంట్రోల్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది. వివిధ కేటగిరీల వారీగా జాతీయ రహదారులపై ప్రమాదాల్లో ఏ వాహనదారులు ఎంత శాతం మంది మృతి చెందారో వివరాలిలా ఉన్నాయి.. -
ఆయన దారి.. జాతీయ రహదారి
ఎక్కడి అరదలి.. ఎక్కడి ఢిల్లీ. ఎక్కడి కుగ్రామం.. ఎక్కడి రాజధాని నగరం! కాలినడకకు ఆనాడు మామూలు బాట కూడా లేని వెనుకబడిన వాతావరణం నుంచి.. నిరాశాజనక నేపథ్యం నుంచి ఇంత దూరం ప్రయాణం అంటే.. నేడు అత్యున్నత స్థాయి పదవీ పురస్కారమంటే.. అదో అద్భుతం కాదూ.! అదో అసాధారణం కాదూ! నీకూ నాకూ అది అసాధ్యమేమో. కానీ తనకు మాత్రం అది సాధ్యమని ఒక్కడు నిరూపించాడు. నడిచే సంకల్పమే ఉంటే ఎంతదూరమైనా.. ఎంత దుర్భరమైనా.. మంచినీళ్ల ప్రాయమని మన హైవే మీద నిలబడి మరీ ప్రపంచానికి చాటి చెప్పాడు. అతి సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన అతడు ఆత్మస్థైర్యంతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. తానే ఓ శిఖరమై నిలిచాడు. అతడే బుగత మురళీధరరావు. కుగ్రామం నుంచి వచ్చి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిని అందుకున్న ఆ సంకల్ప ధీరుడి విజయాన్ని వర్ణించాలంటే నిజంగా మాటలు రావు. పేరు బుగత మురళీధరరావు. కొలువు ఎన్హెచ్ఏఐలో చీఫ్ జనరల్ మేనేజర్. స్వస్థలం పాలకొండ మండలం అరదలి గ్రామం... ఈ సాధారణ పరిచయం ఆయనకు సరిపోదు. మట్టి దారుల్లో నడుస్తూ అత్యున్నత శిఖరాలను పాదం కింద ఉంచుకోవచ్చని తెలిపే ఆయన ప్రయాణం అందరికీ తెలియాలి. జీరో నుంచి నడక మొదలుపెట్టి హీరోగా పరుగులు పెడుతున్న ప్రస్థానం అంతా తెలుసుకోవాలి. తండ్రికి ఉద్యోగం పోయి, అన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల నుంచి ఆయన ఎదిగిన వైనం స్ఫూర్తి రగిలించాలి. రోడ్డే లేని ఊరిలో చదివిన రోజుల నుంచి రహదారుల శాఖలో అత్యున్నత పదవి అధిరోహించే వరకు ఆయన సాగించిన విజయ విహారాన్ని ఓ బ్లాక్‌బస్టర్ సినిమాను తెరపై చూసినంత ఇష్టంగా ఆస్వాదించాలి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం కుగ్రామం నుంచి.. పాలకొండ మండలం అరదలి గ్రామం జిల్లా వాసులకే తెలీని ఓ చిన్న పల్లెటూరు. పాలకొండకు దాదాపు 5 కిలోమీటర్లలో ఉంటుంది. బొబ్బిలి ఇనాం గ్రామం. 1987 వరకు ఈ ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ ఊరిలో పుట్టి అక్కడే చదువుకున్న మురళీధర్ ఇప్పుడు జాతీయ రహదారుల శాఖలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఉత్తర భారతీయుల ఆధిపత్యం ఉండే ఈ శాఖలో ఫైనాన్స్ విభాగానికి చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఢిల్లీలో గురువారం బాధ్యతలు స్వీకరించడం గొప్ప విశేషం. ఈ విజయం వెనుక ఓ కథ దాగి ఉంది. ఆ కథ తెలియాలంటే ముందు మురళీ తండ్రి గురించి తెలియాలి. మురళీధర్ తండ్రి జోగినాయుడు అరదలి గ్రామ కరణంగా పనిచేశారు. 1987లో గ్రామ ఉద్యోగుల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఉన్న కరణం ఉద్యోగం పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పెద్ద కొడుకు కృష్ణారావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవారు. కుటుంబమంతా ఆశలన్నీ పెద్ద కొడుకుపైనే పెట్టుకుంది. అప్పటికి మురళీ ఇంకా చిన్న పిల్లాడే. ఇలాంటి సమయంలో కృష్ణారావు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి జోగినాయుడుకు పరీక్ష కాలం మొదలైంది. కష్టకాలం.. ఉద్యోగం పోయింది. పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కుంగిపోతారు. కానీ జోగినాయుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. అరదలిలోనే నాగవంశం వీధిలో కిరాణ దుకాణం ప్రారంభించారు. మిగిలిన దుకాణాలతో పోటీపడలేక నష్టపోయారు. చివరికి కన్న ఊరును, ఉన్న ఇంటిని విడిచిపెట్టి పాలకొండ వలసపోయారు. మంచి కరణంగా పేరున్న జోగినాయుడు తన కలాన్నే నమ్ముకున్నారు. ఆ కలంతోనే పిల్లలను ప్రభుత్వ బడుల్లోనైనా చదివించారు. నాన్న కష్టం గమనించి.. సొంత గ్రామంలో ఐదో తరగతి వరకు, పాలకొండలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లు చదివిన మురళీధర్ నాన్న కష్టాన్ని కళ్లారా చూశారు. చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. బీటెక్‌లో సీటు రావడం ఆయన జీవితం మేలిమలుపు. అదే ఊపులో ఎంఈ కూడా చేశారు. సింగరేణిలో ఇంజినీర్ ఉద్యో గం వచ్చింది. దాదాపు 30 ఏళ్లు సింగరేణిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అక్కడితో ఆగిపోతే ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం ఎందుకవుతుంది. అన్నేళ్లు పనిచేశాక కూడా మురళీధర్ విద్యా దాహం తీరలేదు. మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలనే ధ్యేయం పెట్టుకున్నాడు. జాతీయ స్థాయి అధికారికి కావాల్సిన అర్హత కోసం ఐసీడబ్ల్యూఏ పరీక్ష రాశారు. దేశంలో 48వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గల అర్హతలను, సింగరేణికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు తీసుకొచ్చింది. లక్షా 30వేల కోట్ల బడ్జెట్ గల విభాగం అది. ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా వెళ్లిన మురళీధర్ తన నిబద్ధతను, నిజాయితీ సేవలను నిరూపించుకున్నారు. కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ విభాగం ఆయనను చీఫ్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ చేసి అదే ఫైనాన్స్ విభాగానికి అధిపతిని చేసింది. కృషి ఉంటే.. కృషి, నిబద్ధత, ధ్యేయం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరగలడని ‘ఫోన్’లో సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ మురళీధర్ అన్నారు. డబ్బు కంటే చదువు గొప్పదనే సత్యం అందరికీ తెలియాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గుర్తించాలన్నారు. ఢిల్లీలో తాను ఉన్నా తన పల్లె అరదలిని మరచిపోలేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు గతం కన్నా మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి తన కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో మురళీధర్‌ను గుర్తు చేసుకున్న బాల్య మిత్రుల్లో నల్లి ధర్మారావు ఒకరు. మురళీతో బాల్య స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తనతో వీధుల్లో, పొలాల్లో తిరిగిన మిత్రుడు ఈ స్థాయికి చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ నాయకుడు నల్లి ధర్మారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మురళీ ఈ స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉందని, ఊరి పేరును ఢిల్లీ స్థాయిలో నిలబెట్టడం గర్వకారణమని ధర్మారావు తండ్రి, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన 94 ఏళ్ల కృష్ణంనాయుడు చెప్పారు. నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఏ స్థాయికి చేరినా అహంలేని మనిషి, మూలాలు మరచిపోలేని నిరాడంబరుడని ఆనందం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి తెలిపింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది. (హైవేల విస్తరణకు నిధులు) అలాగే ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రిని సోమవారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నెడునూరి దిలీపాచారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు. (రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు) -
రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కురిసిన అతిభారీ వర్షానికి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు ఉప్పొంగడం, గండ్లుపడటంతో వచ్చిన ఉధృతికి సమీప రోడ్లు దెబ్బతిన్నాయి. భారీగా కోతకు గురైతారు అట్టముక్కలా లేచి కొట్టుకునిపోయాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది. అలాగే సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాష్ట్ర రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లితే, మంగళవారం ఒక్కరోజే రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ఇంకా పారుతుండటంతో తాత్కాలిక మరమ్మతులకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రం మట్టి, కంకరతో గుంతలను పూడ్చి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద విజయవాడవైపు వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీని మీదుగా వాహనాల ప్రయాణం సాధ్యం కాకపోవటంతో ఎడమవైపు కాజ్వే మీదుగానే వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై నారపల్లి వద్ద అర కిలోమీటరు వెడల్పుతో వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలను బుధవారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు. అలాగే జోడిమెట్ల జంక్షన్ వద్ద చెరువు ఉప్పొంగడంతో అర కిలోమీటరు మేర రోడ్డు నీట మునిగింది. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. రూ.2 వేల కోట్లు కావాల్సిందే.. ప్రస్తుతం వరదలతో ముంచెత్తిన ప్రాంతాల్లో కొన్ని వంతెనలు కూడా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఈ తరహా ముంపు లేకుండా ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో పనులు చేపడితే రూ.2 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చి పూర్వపు స్థితికి పునరుద్ధరించాలంటే రూ.500 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. -
జాతీయ రహదారుల కథ ఏమిటంటే..!
సాక్షి, అమరావతి బ్యూరో: జనం గమ్యం చేరడానికి రహదారులే కీలకం. పలు రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో జాతీయ రహదారులది మరింత కీలక పాత్ర. ప్రయాణం సజావుగా సాగడానికి వీలుగా ఈ నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఈ శాఖ చూస్తుంది. ఈ జాతీయ రహదారులపై పయనించే వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తుంది. ఆ సొమ్ముతో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ వ్యయం వంటి వాటికి ఖర్చుచేస్తుంది. ఇందుకోసం అవసరమైన టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తుంది. ఇలా విజయవాడ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలో ఐదు టోల్ ప్లాజాలున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారుల తీరుతెన్నులు, హైవేపై ప్రయాణించే వారికి అత్యవసర సేవలు, ఆపదలో అవసరమైతే ఎవరిని సంప్రదించాలి? అందుబాటులో ఉన్న అంబులెన్సులు, పెట్రోలింగ్ వాహనాలు, వాహనాదారులు తెలుసుకోవలసిన విషయాలు, టోల్‌ఫీజులు, ఫాస్టాగ్ వంటి సమగ్ర సమాచార సమాహారమే ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) పలు రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలను సులువు చేస్తాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (రోడ్ వింగ్) జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ♦నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పార్లమెంట్ చట్టం, ఎన్హెచ్ఏఐ చట్టం–1988ను అమలులోకి వచ్చింది. ఇది జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం ఏర్పాటైంది. ♦జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆర్థిక సాయం చేస్తూ నిర్వహణ చూస్తుంది. రాష్ట్ర రహదారులను ఆయా రాష్ట్రాల ప్రజా పనుల శాఖ అభివృద్ధి చేస్తుంది. ♦ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న అన్ని జాతీయ రహదారులకు సంఖ్యలు కూడా ఉపయోగిస్తారు. ఆరోహణ క్రమంలో తూర్పు నుంచి పడమర వరకు కేటాయిస్తారు. ♦తూర్పు నుంచి పడమరకు ఉన్న జాతీయ రహదారులు బేసి సంఖ్యలను ఆరోహణా క్రమంలో కేటాయిస్తారు. అన్ని ముఖ్య రహదారుల కోసం ఒకటి లేదా రెండు అంకెల సంఖ్యలు ఉపయోగిస్తారు. మూడంకెల సంఖ్యతో సూచించే రహదారులను అనుబంధ రోడ్లుగా పేర్కొంటారు. టోల్ ఫీజు నుంచి వీటికి మినహాయింపు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, లోక్‌సభ స్పీకరు, కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నరు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, లోక్‌సభ సభ్యులు, ఆర్మీ కమాండర్, భారత ప్రభుత్వ కార్యదర్శి, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పరమవీరచక్ర, అశోకచక్ర, మహావీర్‌చక్ర, కీర్తి చక్ర, వీర్‌చక్ర, శౌర్యచక్ర అవార్డు గ్రహీతలు, రక్షణరంగ వాహనాలు, ఉద్యోగులకు, పోలీసులకు, ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్లు, అగి్నమాపక వాహనాలు, అంబులెన్సులు, అంత్యక్రియల వాహనాలు వంటి వాటికి టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇంకా ఫాస్టాగ్ కలిగి ఉన్న వారు నేరుగా టోల్‌ప్లాజా నుంచి వెళ్లవచ్చు. విశ్రాంతి కోసం లే బేలు.. ♦జాతీయ రహదారికి ఆనుకుని లేబేలు ఏర్పాటు చేస్తారు. వాటిని జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలను నిలపడానికి, ఎమర్జెన్సీ పార్కింగ్‌కు, లేదా డ్రైవర్ల విశ్రాంతి కోసం వినియోగిస్తారు. అక్కడ పెద్ద లేబేలుంటే ఆహార విక్రేతలూ ఉంటారు. ఆహార పదార్థాలు, విశ్రాంతి, తాగునీరు, మరుగుదొడ్లు, టెలిఫోన్ సదుపాయం ఉంటాయి. ♦హైవేలపై మూడు రకాల రహదారి చిహ్నాలు ఉంటాయి. వాటిలో తప్పనిసరి/నియంత్రణ, జాగ్రత్త/హెచ్చరిక, సమాచార సంకేతాలు తెలిపేవి ఉంటాయి. ప్రధాన క్యారేజీ వే, సరీ్వసు, స్లిప్‌రోడ్లు, టోల్‌ప్లాజా ఇతర ప్రాజెక్టు హైవే సౌకర్యాలకు సరైన సంకేతాలు అందిస్తాయి. ♦హైవేలపై ఉండే లైన్లపై రంగులు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. తెలుపు రంగు రోడ్లపై దృష్టి స్పష్టతకు, పసుపు రంగు ట్రాకింగ్ నియంత్రణకు, మార్కింగ్, పార్కింగ్ అనుమతులు లేని చోట సూచనలకు ఉపయోగపడుతుంది. ప్రమాదకర ప్రదేశాన్ని సూచించడానికి ఎరుపు రంగు, రోడ్డుపై సైకిళ్లు వంటి మోటారు లేని వాహనాలు వెళ్లడానికి ఆకుపచ్చ రంగు, బస్సుల వేగవంత రవాణా కోసం నీలం రంగులు ఏర్పాటు చేస్తారు. ఫాస్టాగ్ ఎందుకంటే.. ♦టోల్ ఫీజు చెల్లింపుల్లో జాప్యం నివారణ, డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేయడం, ప్లాజాల్లో రద్దీని, ఇంధన వినియోగం, వాయు కాలుష్యం, నిరీక్షణా సమయాన్ని తగ్గించడం వంటి వాటి కోసం ఫాస్టాగ్‌ను అమలులోకి తెచ్చారు. ♦ఫాస్టాగ్ లేని వాహనాలు నగదు చెల్లింపు వరసలో వెళ్లేందుకు అనుమతిస్తారు. ♦అన్ని టోల్‌ప్లాజాలు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐడీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకుల పీఓసీ కౌంటర్లు, అమెజాన్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫాస్టాగ్ కార్డులు కొనుగోలు, రీచార్జి చేసుకోవచ్చు. ♦దీనికి వాహనం ఆర్సీ కాపీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, చిరునామా కోసం కేవైసీ పత్రాలు, ఫాస్టాగ్ కోసం గుర్తింపు పత్రాలు అవసరమవుతాయి. ♦జిల్లాలో హైవేలకు సమీపంలో ఉన్న పట్టణాలు, నగరాలు, ఆస్పత్రుల వివరాలను సూచించే సమాచార బోర్డులు హైవే వెంబడి ఉన్నాయి. లోకల్ పాస్ పొందాలంటే.. ♦టోల్ ప్లాజా వద్ద ఫీజు నుంచి స్థానికులకు మినహాయింపు, రాయితీలు ఉంటాయి. వాటికి సంబంధించి కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సూచించింది. ♦లోకల్ పాస్ పొందాలంటే ఆ వాహనం ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోనిదై ఉండాలి. ♦నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు. ♦టోల్‌ప్లాజా సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తే సంబంధిత ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌కు లేదా 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి. ♦ఒకవేళ ఏదైనా వాహనం టోల్‌ప్లాజా ఫీజు చెల్లించకుండా వెళ్లిపోయినా, ప్లాజా ఆస్తులకు నష్టం కలిగినా, దౌర్జన్యానికి పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. టోల్ ప్లాజాల వివరాలు ♦విజయవాడ ఎన్‌హెచ్ డివిజన్ పరిధిలో ఐదు టోల్ప్లాజాలున్నాయి. పొట్టిపాడు, కీసర, బాడవ, దవులూరు, కలపర్రు (పశి్చమ గోదావరి) ♦ఈ ఐదు ప్లాజాల నుంచి రోజుకు సగటున రూ.50 లక్షల వరకు టోల్ ఫీజు వసూలవుతోంది. ♦ఈ ప్లాజాల మీదుగా రోజుకు దాదాపు 54,700 వాహనాలు ప్రయాణిస్తాయి. వీటిలో ఎన్‌హెచ్–16 మీదుగా 34 వేలు, ఎన్‌హెచ్–65 మీదుగా 13 వేలు, ఎన్‌హెచ్–30 మీదుగా 7,700 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ♦హైవేపై 24 గంటలూ ఐదు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ♦ఈ టోల్‌ప్లాజాల పరిధిలో ఐదు పెట్రోలింగ్ వాహనాలు, ఐదు క్రేన్లు ఉన్నాయి. నాలుగు ట్రక్ లే బేలు ఉన్నాయి. సేవలు, ఫిర్యాదులు ♦ఎన్హెచ్ఏఐ చేపట్టిన నిర్మాణం/నిర్వహణ పనులపై 1033 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. ♦జాతీయ రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే 1033 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఫోన్ నంబర్లు హైవేపై ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల్లోనూ ఉంటాయి. 100తో పాటు 8688831459 నంబర్లలోనూ సంప్రదించొచ్చు. ♦హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ♦జాతీయ రహదారులపై పెట్రోలింగ్ సేవలు 24 గంటలూ లభిస్తాయి. రూట్ పెట్రోలింగ్ సమాచారం కోసం సైన్ బోర్డులూ ఉంటాయి. ♦హైవేలపై డ్రైవర్లు, రవాణా వాహనదారులు ఫిర్యాదు చేయడానికి లేదా సమాచారానికి 1033 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు. ♦ఐఆర్సీఎస్పీ: 84–2014 ప్రకారం డివైడర్ల వెడల్పు పెంచవచ్చు, తగ్గించవచ్చు. డివైడర్ల వెడల్పు కనీసం 1.50 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉంటుంది. సాధ్యమైనంత వరకు డివైడర్ల తొలగింపు సాధ్యపడదు. ♦ఎవరైనా అనధికారికంగా తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తొలగించాల్సి వస్తే ఎన్హెచ్ఏఐ అనుమతితో అత్యవసరమైతేనే తొలగించే వీలుంటుంది. ఆ తర్వాత డివైడర్‌ను విధిగా పునరుద్ధరించాలి. టోల్‌ప్లాజాలు ఎందుకంటే.. ♦జాతీయ రహదారుల రుసుము 2008 ప్రకారం నిర్దిష్ట రోడ్డుపై వినియోగం/ప్రయాణించడం కోసం టోల్‌ఫీజు వసూలు చేస్తారు. ♦యూజర్ చార్జీల వసూలు కోసం ఈ–బిడ్డింగులు నిర్వహిస్తారు. ఈ–బిడ్డింగులో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. టోల్ ఫీజుల్లో వ్యత్యాసం ఎందుకు? ♦ఒక్కో టోల్‌ప్లాజాలో టోల్ ఫీజు ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే.. ఆ ప్లాజా పరిధిలో రోడ్ల పొడవు, వెడల్పు, వంతెనలు, బైపాస్‌లు వంటి నిర్మాణాలకు అనుగుణంగా టోల్ ఫీజు నిర్ణయించి వసూలు చేస్తారు. అందువల్ల ప్లాజాల మధ్య టోల్ ఫీజు వసూలులో వ్యత్యాసం ఉంటుంది. ♦మున్సిపల్/స్థానిక పట్టణ ప్రాంత పరిమితుల నుంచి పది కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజాను గుర్తించడానికి అథారిటీకి అధికారం ఉంటుంది. కానీ ఏ సందర్భంలోనైనా ఐదు కిలోమీటర్ల లోపు జాతీయ రహదారి, శాశ్వత వంతెన, బైపాస్, టన్నెల్ (సొరంగం) వంటి వాటిలో ఒక భాగం, మున్సిపల్ లేదా పట్టణ ప్రాంత పరిమితుల్లో నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తే నివాసితుల ఉపయోగం కోసం ఆ ఏరియాల్లోనూ ప్లాజాను ఏర్పాటు చేయవచ్చు. ♦హైవేలో ఒక ప్లాజాకు మరో ప్లాజాకు 60 కిలోమీటర్ల దూరం ఉండాలి. 60 కిలోమీటర్ల లోపు మరొకటి ఏర్పాటు చేయకూడదు. ♦హైవేపై ప్రయాణించే వాహనాలకు వసూలు చేసే చార్జీలు ప్లాజా పరిధిలో దూరం, రోడ్లు, బైపాస్‌లు, వంతెనలు వంటివి ఆధారంగా నిర్ణయిస్తారు. విజయవాడ డివిజన్లో ఇలా.. ♦విజయవాడ డివిజన్ పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్ 16, ఎన్‌హెచ్–30 జాతీయ రహదార్లు వెళ్తున్నాయి. ♦ఎన్‌హెచ్–65: నందిగామ–ఇబ్రహీంపట్నం–విజయవాడ సెక్షన్, విజయవాడ–మచిలీపట్నం సెక్షన్ మీదుగా 112.611 కిలోమీటర్ల పొడవున ఇది విస్తరించింది. ♦ఎన్‌హెచ్–16: గుండుగొలను–చిన్నఅవుటపల్లి సెక్షన్, చిన్న అవుటపల్లి–కనకదుర్గమ్మ వారధి వరకు ఇది జిల్లాలో విస్తరించింది. దీని పొడవు 78.20 కిలో మీటర్లు. ♦ఎన్‌హెచ్–30: చంద్రగూడెం–ఏపీ/తెలంగాణ బోర్డర్ సెక్షన్ మీదుగా 37.80 కిలోమీటర్ల పొడవున ఇది ఉంది. ♦జాతీయ రహదారులపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అజమాయిషీ ఉండదు. ♦జాతీయ రహదారులపై పచ్చదనం, లైటింగ్, మరమ్మతులు వంటి నిర్వహణకు సంబంధించిన పనులు కాంట్రాక్టు ఒప్పందం నిబంధనల ప్రకారం ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టుల ద్వారా చేయిస్తుంది. -
జాతీయ రహదార్లకు ర్యాంకింగ్‌లు
సాక్షి, అమరావతి: రహదారుల నాణ్యతను మెరుగుపరిచేందుకు రోడ్ల పనితీరు ఆడిట్ ఆధారంగా ర్యాంకింగ్ వ్యవస్థను ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. హైవేలపై ప్రయాణికులకు అందే సేవలపై, రోడ్డు నాణ్యత, రహదారి భద్రతలపై అభిప్రాయాలు సేకరించి ఆ మేరకు ర్యాంకింగ్‌లను నిర్ణయించనుంది. అక్టోబర్ నుంచి జాతీయ రహదార్ల ర్యాంకింగ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ర్యాంకింగ్‌లతో పాటు బీవోటీ (బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్), హెచ్ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్), ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాజెక్టుల కింద చేపట్టిన రోడ్లకు ప్రత్యేక ర్యాంకింగ్‌లను కేటాయిస్తారు. జాతీయ రహదార్లపై రోడ్ ఇంజనీరింగ్ లోపాల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లోపాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీల ఇంజినీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సర్వే చేసి రోడ్ ఇంజినీరింగ్ లోపాలపై నివేదిక ఇస్తారు. ఏపీలో మొత్తం 6,672 కి.మీ. మేర జాతీయ రహదార్ల నెట్వర్క్ ఉంది. 38 జాతీయ రహదార్ల ప్రాజెక్టులకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నారు. ర్యాంకింగ్‌ల అంచనాకు ప్రామాణికం ఇదే.. ► హైవే సామర్థ్యం (45 శాతం), రోడ్ సేఫ్టీ (35 శాతం), యూజర్ సర్వీసెస్ (20 శాతం) ఈ మూడు విభాగాల్లో అంచనా వేస్తారు. ► వాహనం ఆపరేటింగ్ వేగం, యాక్సెస్ కంట్రోల్, టోల్ ప్లాజాల వద్ద తీసుకున్న సమయం, సేవలు, ప్రమాద రేటు తదితర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► ఈ అంచనా ప్రకారం ఎన్హెచ్ఏఐ ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తుంది. ► ప్రతి జాతీయ రహదారి కారిడార్ పొందిన స్కోరు, మెరుగుపరుచుకునేందుకు ప్రయాణికుల అభిప్రాయాలను ఎన్హెచ్ఏఐ సేకరిస్తుంది. ► నాణ్యమైన రహదార్లను నిర్మించేందుకు ఈ ఆడిట్ అవసరమని ఎన్హెచ్ఏఐ పేర్కొంటుంది. -
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా రాజమండ్రి–విజయనగరం ఎన్‌హెచ్
సాక్షి, అమరావతి: రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి (516–ఈ)ని గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గుర్తించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పునరావాస పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సామాజిక ప్రభావ అంచనా సర్వే (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే) ఇటీవలే పూర్తయింది. ఆర్ అండ్ ఆర్కు మొత్తం రూ.210 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారిని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టును హరిత కారిడార్ ప్రాజెక్టుగా ప్రకటించింది. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులుగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్) 782 కి.మీ. హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో ఏపీకి సంబంధించి 209 కి.మీ. వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు. మూడు ప్యాకేజీల కింద ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశ కింద రెండు స్ట్రెచ్‌లలో రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. మార్చి నెలాఖరున టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రహదారి నిర్మాణానికి మొత్తం రూ.1,550 కోట్లు ► 209 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి 190 హెక్టార్ల మేర భూమి అవసరం అవుతుంది. రహదారి నిర్మాణానికి రూ.1,550 కోట్ల వరకు ఖర్చవుతుంది. ► కొయ్యూరు–పాడేరు (133 కి.మీ.), పాడేరు–అరకు (49 కి.మీ.), బౌదార–విజయనగరం (27 కి.మీ.) మూడు స్ట్రెచ్‌లుగా నిర్మాణం చేపడతారు. ► ఈ ఇంటర్ స్టేట్ హైవే నిర్మాణం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, పాడేరు, కేడీ పేట, అరకు ప్రాంతాల మీదుగా సాగుతుంది. ► సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తి చేసిన ఎన్హెచ్ఏఐ గ్రీవియన్స్ రీడర్స్ కమిటీ (జీఆర్సీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ► బౌదార–విజయనగరం, పాడేరు–అరకు రెండు ప్యాకేజీలకు సంబంధించి 80 కి.మీ. రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. -
హైవేలపై మరణిస్తే ప్రత్యేకంగా పరిహారం లేదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ రహదారులపై ఒక మనిషి రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. వీటిలో కుటుంబ పెద్దలు మరణిస్తే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం ఉండదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. జాతీయ రహదారులపై ఏటా ఎంతమంది చనిపోతున్నారు? ఎంత మంది వికలాంగులుగా మారుతున్నారు? పరిహారం ఎంతమందికి ఇస్తున్నారు? టోల్గేట్ల రుసుములో ఏమైనా బీమాను కలుపుతున్నారా? అన్న ప్రశ్నలతో సూర్యాపేటజిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్ సమాచార హక్కు కింద చేసిన దరఖాస్తుకు ఎన్హెచ్ఏఐ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది. టోల్గేట్ రుసుము ద్వారా వసూలు చేసిన డబ్బులో ఎలాంటి బీమా రుసుము వసూలు చేయడంలేదని, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు వైద్యసదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపింది.అది విధానపరమైన నిర్ణయమని, అలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి బీమా, నష్టపరిహారం ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చింది. కానీ, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకంలో రూపే డెబిట్ కార్డు కలిగినవారికి ప్రమాదబీమా రూ.లక్ష వర్తిస్తుందన్నారు. అలాగే, మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం.. జాతీయ రహదారులపై అంబులెన్స్ సౌకర్యంతోపాటు, తీవ్ర ప్రమాదాల్లో గాయపడ్డవారికి (గోల్డెన్ అవర్) నగదు రహిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల వల్ల పలు రైతు, కూలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పల్లెటూళ్లలో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురినీ సైతం ప్రమాదాలు బలితీసుకుంటున్న ఉదంతాలు ఉన్న సంగతి పలువురికి విదితమే. (బుల్డోజర్లతో నదీ ప్రవాహం మళ్లింపు!) -
హైవే ఎక్కుతున్నారా.. ఆలోచించండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్గేట్ గేట్ల వద్ద ఫీజుల వసూలు మళ్లీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టోల్ ఫీజుల వసూళ్లపై కేంద్ర హోం శాఖ మార్చి 25న తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు మళ్లీ టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ), హైవేస్ డెవలపర్స్ వెల్లడించాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. టోల్ ఫీజు వసూలు సందర్భంగా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. సిబ్బందికి సరిపడా గ్లోవ్స్, మాస్క్‌లు, శానిటైజర్లు అందించినట్టు చెప్పాయి. లాక్డౌన్ ఎత్తివేయకుండా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) వ్యతిరేకించింది. రబీ వ్యవసాయోత్పత్తుల సేకరణపై ఈ చర్య తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో 85 శాతం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిపై టోల్ ఫీజు భారం మోపడం సరికాదని తెలిపింది. ఒకే వేదికపై మోదీ, పోప్.. ఇదెలా సాధ్యం! -
అభయారణ్యాల్లో రోడ్లకు.. రైలు మార్గాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: పులుల అభయారణ్యాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ చర్యలవల్ల పులుల సంరక్షణకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో (జాతీయరహదారి–363)ని రోడ్డును (94 కి.మీ పొడవు) ‘ఫోర్ లేనింగ్ నేషనల్ హైవే’గా మార్చాలనే ప్రతిపాదనపై ఇటీవల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాఖుది, రేచ్ని రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య కాగజ్‌నగర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో (కారిడార్ ఏరియా) పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గ్రేజ్ లైన్‌ను వేసేందుకు 168.43 హెక్టార్ల అటవీభూమిని మళ్లించడంపైనా ఈ భేటీ ఆమోదం తెలిపింది.డబ్ల్యూఎల్ఎం వరంగల్ డివిజన్లోని ఉరాట్టం–ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని మళ్లించేందుకు ఈ బోర్డు అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో గోదావరి నదిపై తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–1, ప్యాకేజ్–1లో భాగంగా బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల వన్యప్రాణి ప్రాంతాల్లోని అటవీభూమిని సైతం మళ్లించడంపై వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. పులులకు తీరని నష్టం... అభయారణ్యాల్లో పులుల తిరుగాడే ప్రధాన ›ప్రాంతం (కోర్ ఏరియా), మహారాష్ట్ర సరిహద్దులోని పులులకు కీలకమైన ప్రాంతాల్లో భాగమైన ఆయాచోట్ల రోడ్ల విస్తరణ, కొత్తరైల్వేలైన్ల నిర్మాణం సరికాదని పర్యావరణ వేత్తలు, జంతుప్రేమికులు వాదిస్తున్నారు.మహారాష్ట్రలోని తడోబా ఆంథేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలు కావడంతోపాటు కవ్వాల్ టైగర్ అభయారణ్యం పరిధిలో ఇక్కడే పిల్లలు కూడాపెడుతున్నాయి. ఈ తరుణంలో పులుల వృద్ధికి, వాటి సంచారానికి, వలసలకు కీలకమైన ఈ ప్రాంతంలో నాలుగు లేన్ల రోడ్లు వేయడం, కొత్త రైల్వేలైను వేయడం వల్ల పులులసంఖ్య పెరిగేందుకు ప్రతికూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో 94 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదనపై వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోద ముద్ర వేసినట్టుగ రాష్ట్ర వన్యప్రాణి మండలి సభ్యులు చెబుతున్నారు. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయా అంశాలు పరిశీలించి, అత్యవసరమైన సందర్భాల్లోనే ఆమోదం తెలుపు తున్నట్టు స్పష్టం చేశారు. -
నగదు చెల్లింపునకు ఇక ఒక్క లేనే
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లించే వాహనాలకు ఒక్కోవైపు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించే విషయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టమైన హామీ ఇవ్వనందున బుధవారం నుంచి దాన్ని తొలగిస్తున్నట్టు ఎన్ హెచ్ఏఐ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. హైబ్రిడ్ విధానంలో 25% లేన్లు నగదు చెల్లించే వాహనాలకు కేటాయించగా, ఫాస్టాగ్ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి రద్దీ ఉన్నా, ఎక్కువగా ఇబ్బంది లేకుండా వాహనాలు ముం దుకు సాగాయి. పంతంగి లాంటి రద్దీ ఎక్కువగా ఉండే టోల్‌ప్లాజాల వద్ద అర కిలోమీటరు మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ప్రస్తుత హైబ్రిడ్ విధానం గడువు మంగళవారంతో తీరిపోయింది. బుధవారం నుంచి కేంద్రం ముందు చెప్పినట్టుగా టోల్ గేట్ల వద్ద ఒక్కోవైపు ఒక్కోవైపు మాత్రమే నగదు చెల్లింపు వాహనాల కోసం కేటాయించనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందే సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు నగరం నుంచి భారీ సంఖ్యలో జనం ఊరిబాట పట్టారు. దాదాపు 35 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. పండుగ తర్వాత వీరు మళ్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. వెళ్లేప్పుడు హైబ్రీడ్ విధానం వల్ల టోల్గేట్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఒక్కలే¯Œ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిస్తున్నందున, తిరుగు ప్రయాణంలో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో టోల్గేట్ల వద్ద నమోదైన లెక్కల ప్రకారం.. 55% వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. 45% వాహనాలకు టోల్‌ను నగదు రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఈ 45% వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ ‘ఒక్కోవైపు ’నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతో కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం క్యూలు ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది పండుగకు రెండ్రోజుల ముందు వెళ్లగా, వచ్చేటప్పుడు నాలుగైదు రోజుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే వెళ్లేప్పుడు ఉన్న రద్దీ ఉండదు. అయినా, ఒక్క లేన్ నుంచి అన్ని వేల వాహనాలు వెళ్లాల్సి రావటం కొంత ఇబ్బందేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు తీవ్రంగా ఉంటే, అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పెంచే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒకవేళ హైబ్రిడ్ విధానం గడువు పెంచితే, బుధ వారం ఉదయం తమకు సమాచా రం వస్తుందని, అప్పుడు ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. -
ఇకపై టోల్‌ఫ్లాజాల వద్ద ‘ఫాస్ట్’ విధానం
టోల్‌ప్లాజా వచ్చిందంటే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అప్పటివరకు రయ్‌మంటూ సాగే వాహనాలకు టోల్‌ప్లాజాలు అడ్డుకట్టగా మారేవి. బారులు తీరిన వాహనాలకు రుసం వసూలు చేస్తూ..బోలెడు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ-రుసుం చెల్లింపుతో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్గేట్ల వద్ద ఛార్జీల చెల్లిపులను ఎలక్ర్టానిక్ పద్దతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఈ విధానం డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విధివిధానాలు, అసునరించాల్సిన పద్దతులేంటో తెలుసుకుందాం. -ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్‌ఫ్లాజా దగ్గరకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్ అకౌంట్‌కి చెల్లింపులు జరుగుతాయి. -ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్సస్ర్కీన్పై అతికించాల్సి ఉంటుంది. -ఎన్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల ద్వారా కూడా వీటిని పొందవచ్చు. -ఫాస్టాగ్‌ను ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా రూపొందించారు. * టోల్‌ప్లాజా వచ్చినప్పుడు ఫాస్టాగ్ ఉన్న లేన్‌ను చూపుతూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ మార్గంలోనే ఫాస్టాగ్ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. * నిర్దేశించిన లేన్‌లో వెళ్లినప్పుడు వాహన వేగం 25-30కి మించి ఉండకూడదు. * అలాగే మీరు వెళ్తున్న లేన్‌లో మీ ముందున్న వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి. * ఒకసారి మీ ఫాస్టాగ్ రీడ్ అయిన తర్వాత మీ వాహనం ముందుకు సాగొచ్చనే సంకేతంగా అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడే ముందుకు వెళ్లాలి. * గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత కూడా వాహనాన్ని ఎక్కువ సమయం అక్కడే ఉంచితే... బారియర్ గేట్ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది. * ఒకవేళ ఏదైనా కారణంతో మీ ఫాస్టాగ్ పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగులోకి మారుతుంది. * అప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది తమ చేతిలో ఉన్న పరికరంతో మీ ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకుంటే ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ఛార్జీని రుసుము ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. -
బాట‘సారీ’!
ఆకివీడు: జిల్లాలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. విస్తరణ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకూ జాతీయరహదారి విస్తరణ పనులు మాత్రం జరుగుతున్నాయి. మిగిలిన జాతీయ రహదారుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అవి ప్రతిపాదనలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. గత ఏడాది కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. జిల్లా ద్వారా వెళ్లే పామర్రు–దిగమర్రు జాతీయరహదారి(నంబర్ 216)తోపాటు దేవరపల్లి–కొయ్యలగూడెం(నంబర్ 516డీ) జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. పనులు మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత లేదు. ఆకివీడులో పామర్రు–దిగమర్రు రోడ్డుకు వేసిన శిలాఫలకం కూడా మట్టికొట్టుకుపోయింది. ప్రయాణికులకు చుక్కలు.. జాతీయ రహదారులు 216, 516డీలపై ప్రయాణం వాహనచోదకులు, ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రధానంగా దేవరపల్లి– జీలుగుమిల్లి రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పామర్రు–దిగమర్రు రహదారి కూడా అధ్వానంగా మారింది. కనీసం వీటికి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. ఈ రహదారులపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఆసక్తి చూపడం లేదు. 216 జాతీయ రహదారి ప్రతిపాదనలు ఇవీ.. 216 జాతీయ రహదారిని పామర్రు నుంచి దిగమర్రు వరకూ 108 కిలోమీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. జిల్లాలో దీని విస్తీర్ణం 46 కిలోమీటర్లు. దీనికి తొలిదశలో రూ.500 కోట్లు కేటాయించారు. ఆకివీడు, ఉండి, భీమవరం, కైకలూరు ప్రాంతాల్లో రహదారి విస్తరణలో భాగంగా బైపాస్‌లు నిర్మించాలి. ఆకివీడు వద్ద బైపాస్ రోడ్డుకు ఉప్పుటేరుపై వంతెన, వెంకయ్య వయ్యేరుపై మరో వంతెన నిర్మించాల్సి ఉంది. ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి ఆగస్టు నెలలో మట్టి పరీక్షలు చేశారు. ఇదే రహదారితోపాటు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లాలో నేషనల్ హైవే నంబర్–5 నుంచి బైపాస్ రహదారిగా ఉన్న దేవరపల్లి–గోపాలపురం–కొయ్యలగూడెం ఎన్‌హెచ్ రహదారి(516డీ) అభివద్ధికి కూడా అప్పట్లో డిజిటల్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి 20 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు, పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.93 కోట్లు విడుదలయ్యాయి. ఈ జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉన్నంత కాలం ఇవి అభివృద్ధికి నోచుకోవని పెదవి విరుస్తున్నారు. వాహనాలకు దెబ్బే.. 216 జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్న జాతీయ రహదారుల శాఖ రహదారులను అభివద్ధి చేయడంలేదు. కేంద్రం ప్రభుత్వం, ఏంపీలు పట్టించుకోవాలి. – కురెళ్ల పౌలు, లారీ డ్రైవర్, దుంపగడప నరకం చూస్తున్నాం.. 216 జాతీయరహదారిపై ప్రయాణం నరకం చూపిస్తోంది. ఆకివీడు నుంచి భీమవరం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది. పంచాయతీ రోడ్లను తలపిస్తోంది. ఇరుకురోడ్లు, గతుకు, గుంతలతో ఎన్నాళ్లీ అవస్థలు. – లావేటి త్రిమూర్తులు, ప్రయాణికుడు, చెరుకుమిల్లి ప్రతిపాదనలు వెళ్లాయి.. జాతీయరహదారి నంబర్ 216 విస్తరణ, బైపాస్ రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. దేవరపల్లి– జీలుగుమిల్లి జాతీయ రహదారి అభివృద్ధికి రూ.93 కోట్లతో టెండర్లు పిలిచాం. టెండర్లు ఖరారైన తరువాత రహదారి పనులు మొదలుపెడతారు. – మునగళ్ల శ్రీనివాసరావు, డీఈఈ, ఎన్‌హెచ్ 216, భీమవరం -
వాహనదారులకు యాక్సిస్ ఉచిత ఫాస్టాగ్స్
ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. 70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. -
‘ఫాస్ట్’గానే ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థపై వాహనదారుల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యవస్థలో భాగంగా వాహనాల ముందు అద్దానికి అమర్చే ఫాస్టాగ్‌ల విక్రయం ఒక్కసారిగా జోరందుకుంది. సరిగ్గా వారం క్రితం తెలంగాణలో కేవలం 3,500 ట్యాగ్లే అమ్మకం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య పదిన్నర వేలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వారంలోనే ఎక్కువ ట్యాగ్లు అమ్ముడుపోవటం తో చాలా ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ట్యాగ్లు అందుబాటులో లేవన్న సమాధానం వస్తుండటంతో వాహనదారులు బ్యాంకులు, టోల్‌ప్లాజాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో కూడా ఈ వారంలోనే ఏకంగా 7 వేల ట్యాగ్లు అమ్ముడు కావటంతో ఇక్కడా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేది. కానీ, నేషనల్ హైవే అథారిటీ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ట్యాగ్‌లకు ఇండెంట్ పెట్టి తెప్పించారు. వాటి అమ్మకాలు పెరిగే సమయంలో అద నంగా 15వేల ట్యాగ్లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో రాష్ట్రంలో వాటికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ప్రతిచోటా.. ఒక్కోవైపు 5 చొప్పున 10 కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్ముతున్నారు. బ్యాంకుల్లో నేరుగా విక్రయం, ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవటంతో పోలిస్తే.. టోల్‌ప్లాజాల్లోనే ఎక్కువగా అమ్మకం అవుతున్నాయి. అన్ని టోల్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు యంత్రపరికరాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. 4టోల్ కేంద్రాల్లో పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘సగమే వసూలు’ నిబంధనకు తూట్లు.. వాహనం టోల్‌ప్లాజా దాటేప్పుడు తిరుగు ప్రయాణానికీ ఒకేసారి టోల్ చెల్లించేవారుంటారు. వాహనం 24 గంటల్లోపు తిరిగొస్తే, రెండోసారి సగం రుసుమే చెల్లించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక టోకెన్ పద్ధతి చెల్లింపు విధానంలో.. మొత్తం రుసుము చెల్లిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ప్రశ్నించి మరీ సగమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్ విధానం పూర్తిగా ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థే అయినందున ఆ సమస్య ఉత్పన్నం కాకూడదు. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులిచ్చే ట్యాగ్‌ల్లో లోపాల వల్ల పూర్తి మొత్తం కట్ అవుతోందంటూ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని, ఎక్కడైనా లోపం జరిగితే ఆ మొత్తాన్ని వాహనదారుడికి తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని లేన్లకే ఇది పరిమితమై ఉన్నందున, పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటైతే ఇలాంటి లోపాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో ఇబ్బందేనా..? చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కురుస్తుంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ఫాస్టాగ్‌ల నుంచి టోల్ మినహాయింపు ప్రక్రియ మందగించే పరిస్థితి ఉండనుంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అధికారులకు కొన్ని ఫిర్యాదులం దాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సెన్సార్లకు అడ్డుగా వచ్చి ట్యాగ్‌ను వేగంగా రీడ్ చేయలేదని తెలుస్తోంది. దీని వల్ల రుసుమును మినహాయించుకోవటంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాదని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉండొచ్చన్నారు. -
రన్నింగ్‌లోనే కొల్లగొట్టేస్తారు !
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల–పాణ్యం మధ్యలో ఈ నెల 4వ తేదీ రాత్రి ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్’ వాహనాన్ని దొంగలు కొల్లగొట్టారు. ఇందులో బిగ్‌సీ, లాట్ మొబైల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థల వస్తువులు రవాణా అవుతుంటాయి. కర్నూలు–కడప హైవేపై ఈ నెల 5న అర్ధరాత్రి డీటీడీసీ కొరియర్ వాహనంలో దొంగలు దారిదోపిడీకి తెగబడ్డారు. ‘డాట్‌జాట్’ అనే ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థతో డీటీడీసీకి ఒప్పందం ఉంది. అదృష్టవశాత్తు ఆ రోజు లోడింగ్ లేదు. దీంతో కేవలం రూ.2 లక్షల విలువైన వస్తువులు దోపిడీకి గురయ్యాయి. దీనిపై నంద్యాల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత నంద్యాల– ఆళ్లగడ్డ మధ్యలో ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్’ వాహనాన్ని కూడా దోపిడీ చేశారు. ఆళ్లగడ్డ స్టేషన్లో కేసు నమోదైంది. వరుసగా రెండు రోజులు వరల్డ్ ఫస్ట్ కొరియర్ వాహనాన్ని కొల్లగొట్టడం గమనార్హం. ఈ నెల 6న కర్నూలు– బెంగళూరు హైవేపై ‘ఎక్స్‌ప్రెస్ బీస్’ అనే కొరియర్ వాహనాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా ఆన్లైన్ షాపింగ్ వస్తువులను రవాణా చేస్తుంటుంది. అదే రోజు అర్ధరాత్రి తర్వాత నంద్యాల గాం«దీచౌక్లోని వెంకటరమణ అనే వ్యాపారి దుకాణంలో 1.4 కిలోల బంగారం, రూ.5లక్షల నగదు దోచేశారు. దీనిపై నంద్యాల వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు వరుసగా జరిగిన ఈ దొంగతనాలను పరిశీలిస్తే ఉత్తర భారతదేశానికి చెందిన ‘పార్థిగ్యాంగ్’ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైవే దొంగతనాలు, సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా రైలు దోపిడీలు చేయడంలో ‘పార్థిగ్యాంగ్’ దిట్ట. వీరు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దిగారంటే వరుసగా నెల రోజుల పాటు కొల్లగొట్టి వెళతారు. హైవేలో దోపిడీలు ఎలా చేస్తారంటే.. కొరియర్ సర్వీసులు, బంగారు దుకాణాలకు చెందిన నగలు ఎక్కువగా ఐచర్ వాహనాల్లో రవాణా చేస్తుంటారు. సదరు వాహనంపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక్కో దోపిడీకి నాలుగు ముఠాలు పనిచేస్తాయి. రెండు ముఠాలు బైక్‌లను, ఒక ముఠా క్యారేజ్ కారు, మరో ముఠా లారీని వినియోగిస్తాయి. ఐచర్ ముందు వెళుతుంటే బైక్‌లో ఇద్దరు అనుసరిస్తారు. వాహనం వెనుకభాగంలోని లాక్కు దగ్గరగా బైక్ వెళుతుంది. బైక్ వెనుకభాగంలోని వ్యక్తి కట్టర్ ద్వారా లాక్ తొలగిస్తాడు. ఆ తర్వాత రన్నింగ్‌లోనే బెక్ ముందుభాగంలోకి వచ్చి ఐచర్‌లోకి వెళతాడు. ఇలా మరో వ్యక్తిని కూడా ఐచర్‌లోకి పంపిస్తారు. డోర్ మూసేసి లోపల ఉన్న బాక్స్‌లను కట్ చేస్తారు. సెల్ఫోన్లు, బంగారం, ఇతరత్రా చిన్నగా ఉన్న విలువైన వస్తువులన్నీ రెండు పెద్ద బ్యాగ్‌లలో సర్దుతారు. ఐచర్ వెనుక వీరి ముఠాకు చెందిన లారీనే వస్తుంది. దీని వెనుక బైక్‌లో అనుసరించే మరో ముఠా వెనుక వాహనాలు రాని సమయం చూసి ఫోన్లో సమాచారం ఇస్తుంది. అప్పుడు క్యారేజ్ కారును ఐచర్ వాహనానికి దగ్గరగా రప్పించి.. డోర్లు తెరిచి బ్యాగ్‌లను వెనుక పడేస్తారు. కారును ఒక ప్రదేశంలో ఆపేసి ఆ బ్యాగ్‌లను లారీలోకి మారుస్తారు. ఇలా రోజూ 2– 3 ఐచర్ వాహనాలను దోచేస్తారు. దోపిడీ జరిగిన విషయం లారీ డ్రైవర్‌కు ఏమాత్రమూ తెలీదు. 4,5 ,6 తేదీల్లో జిల్లాలో జరిగిన హైవే చోరీలన్నీ ఈ తరహావే కావడం గమనార్హం. డీటీడీసీ నిర్వాహకుడు నాగేంద్రరెడ్డితో పాటు ఇతర కొరియర్ సరీ్వసుల బాధ్యులు, పోలీసులు దోపిడీల తీరు చూసి విస్తుపోయారు. ఈ తరహా దోపిడీలు చేసేది ఉత్తరభారతదేశానికి చెందిన ‘పార్థి గ్యాంగ్’ మాత్రమే! బైక్ నడపడం, దానిపై నుంచి మరో వాహనంలోకి వెళ్లడం లాంటి ప్రమాదకర ఫీట్లు వారు మాత్రమే అత్యంత చాకచక్యంగా చేయగలరు. కొరియర్ల ద్వారా విలువైన సామగ్రి రవాణా.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ల ద్వారా వస్తువులను బుక్‌చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. మొత్తం వ్యాపారంలో 40శాతం ఆన్లైన్ షాపింగ్ ద్వారానే జరుగుతుండడం గమనార్హం. వీటిని వినియోగదారులకు అందజేసే కొరియర్లతో పాటు బిగ్‌సీ, బిగ్‌బీ, లాట్, హ్యాపీ మొబైల్స్ లాంటి సంస్థలు తమ వస్తువులను ఐచర్ వాహనాల్లో రవాణా చేస్తున్నాయి. ఇది తెలిసే దొంగలు దారి దోపిడీలకు తెగబడుతున్నారు. పగలు రెక్కీ..రాత్రి దోపిడీ.. పార్థి గ్యాంగ్ ఒక ప్రాంతాన్ని ఎంచుకుని రంగంలోకి దిగుతుంది. నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో దారిదోపిడీలు, చోరీలకు తెగబడుతుంది. ఆపై తిరిగి సొంతప్రాంతానికి చేరుకుంటుంది. హైవేలో దారి దోపిడీలతో పాటు బంగారు దుకాణాలు, ఇళ్లలోనూ చోరీలకు పాల్పడతారు. ఉదయం దుప్పట్లు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ తాళాలు వేసిన ఇళ్లు, బాగా వ్యాపారం జరిగే, విలువైన వస్తువులు ఉంటాయని భావించే షాపులను గుర్తిస్తారు. ఇళ్ల ముందు తీగలపై ఆరేసిన దుస్తులు చూసి ఇంట్లో ఏ వయసు వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నారనేది పసిగడతారు. ఇంటి చుట్టూ వాసన చూసి కిచెన్ ఎక్కడుంది? హాలు, స్టోర్ రూం ఎక్కడున్నాయనేది తేల్చేస్తారు. రాత్రికి రంగంలోకి దిగుతారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడతారు. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రీన్‌లైట్ లేకుండా సిగ్నల్ కట్ చేస్తారు. రైలు ఆగిపోతుంది. వెంటనే రైలులోని ‘పార్థిగ్యాంగ్’ సభ్యులు కత్తులతో భయపెట్టి నగదు, నగలు దోచుకుని దిగివెళ్లిపోతారు. ఇదంతా 2–4 నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. హైవే దోపిడీలు, బంగారు దుకాణంలో చోరీతో ‘దొంగల ముఠా’లు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వరుస చోరీలకు తెగబడే ప్రమాదమూ లేకపోలేదు. వరుస చోరీలతో భయమేస్తోంది.. రోజూ హైదరాబాద్ నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్‌కు మా వాహనాలు వెళుతుంటాయి. విలువైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్ వస్తువులు రవాణా అవుతుంటాయి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ తీసుకోరు. చోరీ జరిగిన తర్వాత గొడవ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆళ్లగడ్డ–కర్నూలు మధ్యలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. వాహనం గమ్యం చేరేదాకా నిద్రపట్టడం లేదు. –నాగేంద్రరెడ్డి, డీటీడీసీ సూపర్ ఫ్రాంచైజీ ఇన్చార్జ్, కడప ఆధారాలు దొరికాయి..త్వరలోనే పట్టుకుంటాం బైక్‌లో వెళుతూ రన్నింగ్లోని వాహనం లాక్ కట్ చేసి..లోపలికి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా వాహనంలో నుంచి వస్తువులను కింద పడేస్తారు. వెనుక ఉన్నవారు వాటిని తీసుకుంటారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతానికి చెందిన వారే అని తెలుస్తోంది. కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. త్వరలోనే పట్టుకుంటాం. – ఫక్కీరప్ప, ఎస్పీ, కర్నూలు -
త్వరలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్టోర్స్
సాక్షి, అమరావతి: త్వరలో స్కిల్ డెవలప్మెంట్ స్టోర్స్ ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారులకు ఇరువైపులా పెట్రోల్ బంకుల ఆవరణలో ఈ స్టోర్స్ ఏర్పాటుకానున్నాయి. వీటిలో చేతివృత్తి కళాకారులు తయారుచేసిన వివిధ రకాల వస్తువుల అమ్మకాలు జరగనున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు సంబంధించిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. చేతివృత్తి కళాకారుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు ప్రత్యేక పథకాలు అమల్లోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రతిపాదనలు తయారుచేసింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వచ్చే వాహనదారులు ప్రత్యేకతలు కలిగిన ఈ స్టోర్స్‌లోని వస్తువులు, ఆహారపదార్థాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ప్రయోగాత్మకంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు స్టోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు, ఆర్థిక వెసులుబాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా హిందుస్థాన్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లు పెట్రోలు, డీజిల్ బంకులను డీలర్ల వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నాయి. కొందరు నిర్వాహకులకు పెట్రోల్ బంకులతో పాటు.. కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ విక్రయాలకు అదనంగా స్థలాలున్నాయి. ఈ స్టోర్స్‌లో మార్కెట్లో లభించే సాధారణ వస్తువులే లభిస్తుండటంతో వాహనదారులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. వీటిలో స్టోర్స్ ఏర్పాటుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ఆయిల్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ స్టోర్స్‌లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, విజయనగరం జిల్లా గుడితికి చెందిన రాగి పాత్రలు, గొల్లప్రోలు కలంకారీ, సరసరాపురం లేసులు, మచిలీపట్నం గోల్డు కవరింగ్ ఆభరణాలు, ఏలూరు తివాచీలు, దుర్గి సాఫ్ట్ స్టోన్ క్వారింగ్ బొమ్మలు, నరసరావుపేట తోలుబొమ్మలు, తిరుపతిలో ఉడ్ కార్వింగ్‌తో చేసిన దేవుని బొమ్మలతో పాటు.. ఇతర ప్రాంతాల చేతివృత్తి కళాకారులు తయారుచేసిన బొమ్మలను విక్రయిస్తారు. లేపాక్షి సంస్థ నిర్వహిస్తున్న రీతిలోనే కళాకారుల నుంచి వస్తువులను తీసుకుని విక్రయానంతరం నగదు అందజేస్తారు. ఈ విధానం వలన ఉపాధి అవకాశాలతో పాటు.. చేతివృత్తి కళాకారుల వస్తువుల అమ్మకాలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని.. అనుమతి రాగానే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
జాతీయ రహదారులపై.. ‘వైఎస్సార్ అత్యవసర చికిత్స’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్ వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్‌లకు (హెచ్ఈసీ) శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 4,500 కి.మీ. మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్ఈసీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్‌లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్‌కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్‌లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో హెచ్ఈసీలో శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు. సత్ఫలితాలివ్వని ట్రామా కేర్లు రాష్ట్రంలో చెన్నై–కోల్‌కత, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. ఫలితంగా జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తరచూ అనేకమంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా, క్షతగాత్రుల కోసం గతంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా 32 ట్రామాకేర్ ఆస్పత్రులు గుర్తించింది. వీటిలో 19 ప్రభుత్వాస్పత్రులు కాగా, 13 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే, రవాణా శాఖ గుర్తించిన ప్రైవేటు ట్రామాకేర్ ఆస్పత్రుల నిర్వాహకులు క్షతగాత్రులను చేర్చుకునేందుకు ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు కూడా సకాలంలో చికిత్స అందక తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు..రోడ్డు ప్రమాదానికి గురైన గంటలోపు (గోల్డెన్ అవర్) ఆస్పత్రిలో చేరిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే వీలుంది.కానీ, ట్రామాకేర్ ఆస్పత్రులలో సదుపాయాలు లేకపోవడంతో జనరల్ ఆస్పత్రుల్లో బాధితులు బెడ్లు లేక క్యాజువాలిటీలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కో జనరల్ ఆస్పత్రికి వస్తున్న కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది నుంచి పది వరకు ఉంటున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వైఎస్సార్ రహదారి చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. -
రోడ్డున పడ్డ భద్రత!
ఓవర్ స్పీడ్‌కు కళ్లెం ఏది? - రాష్ట్రంలోని ముంబై,విజయవాడ(65), బెంగళూర్ (44), భూపాలపట్నం (163) జాతీయ రహదారులపై వాహనాలు మితి మీరిన వేగంతో దూసుకెళుతున్నాయి. కార్లు గంటకు 90–120 కి.మీ., ప్రైవేటు లారీలు, బస్సులు 120 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ఈ రహదారులపై స్పీడ్‌కు ఎలాంటి కళ్లెం లేదు. స్పీడ్గన్లు లేవు. - ఆయా రహదారులపై గూడ్స్ వాహ నాలు పలువురు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నాయి. వీటిని పోలీసులు, ఆర్టీఏ అధికారులు అడ్డుకోవడంలేదు. తూతూ మంత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తేనే! మామూలు జరిమానాలను ఎవరూ పెద్దగా ఖాతరుచేయడంలేదు. ఓవర్‌స్పీడ్ విభాగం లోనే గత ఆరునెలల్లో ఏకంగా రూ.46 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఓవర్లోడిం గ్‌కు రూ.2కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా ఇలాంటి డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇంతకాలం ఓవర్‌స్పీడ్‌కు కేవలం రూ.400 మాత్రమే జరిమానా విధించేవారు. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే రూ.1000తోపాటు వాహనంలో ఎంతమంది ఉంటే అన్ని రూ.2000 చెల్లించాలి. అప్పుడుగానీ కాస్త మార్పు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు లేని వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. వాటిలోనే కూలీలు ప్రయాణిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి కూలీలు మరణించినా వారి కుటుంబాలకు పరిహారం దక్కదు. అలాంటి వాహనాలు ఎక్కడమే చట్టవిరుద్ధమైనపుడు వాటి వల్ల ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలకు కోర్టులు న్యాయం చేయవు. – ఆటో అండ్ మోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ - ఇటీవల మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్చిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది చనిపోయారు. - గతేడాది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద 100 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలో పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. - ఓవర్‌లోడ్ వాహనాలపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ రెండు ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగిందని రోడ్డు భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డుభద్రత ‘నేతి బీరలో నెయ్యి చందం’ అయింది. భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్ వాహనాలకు కళ్లెం వేసేనాథుడు లేడు. ఆర్అండ్ బీ, ఆర్టీఏ శాఖలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తు న్నాయి. ఫలితంగా రహదారులు రక్తధారలుగా మారుతున్నాయి. పెద్దసంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
జాతీయ రహదారులకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేసి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించేందుకు గడ్కరీ సోమవారం పార్లమెంటులో తెలంగాణ ఎంపీలకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు వెంకటేశ్ నేత, శ్రీనివాస్‌రెడ్డి, రాములు ఆయన్ను కలసి రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ ప్రతిపాదనలతో వినతిపత్రాన్ని సమర్పించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి నిర్మాణం చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో 3,155 కి.మీ మేర కేంద్రం జాతీయ రహదారులను నిర్మించాల్సి ఉన్నా ఇప్పటికీ కేవలం 1,388 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే గుర్తించారని వివరించారు. ఇంకా 1,767 కిలోమీటర్ల రహదారులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపాదనలు.. ఎంపీలు చేసిన ప్రధాన ప్రతిపాదనలు ఇలా.. హైదరాబాద్‌లోని గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్– వలిగొండ– తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెంలోని ఎన్‌హెచ్–30 మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. మెదక్–ఎల్లారెడ్డి– రుద్రూర్ మార్గాలను అదే తరహాలో గుర్తించాలి. బోధన్–బాసర–బైంసా మార్గాన్ని, మెదక్– సిద్దిపేట్–ఎల్కతుర్తి మార్గాలను సైతం గుర్తించాలి. చౌటుప్పల్–షాద్‌నగర్–కంది మార్గాలను దక్షిణ ప్రాంత రీజినల్ రింగ్ రోడ్డుగా గుర్తించాలి. ఉత్తర ప్రాంత రీజినల్ రింగ్ రోడ్డు అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–భువనగిరి–చౌటుప్పల్ మార్గాన్ని దక్షిణ ప్రాంత రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలి. ఎన్‌హెచ్‌లుగా గుర్తిస్తూ గెజిట్ జారీ చేయండి.. జాతీయ రహదారుల గుర్తింపు, నిర్మాణంలో రాష్ట్ర వాటాగా భూసేకరణ, నిర్వాసితుల తరలింపు, ఆటవీ భూముల మళ్లింపులో 50 శాతం వ్యయం భరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గడ్కరీకి టీఆర్ఎస్ ఎంపీలు వివరించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి గెజిట్ విడుదల చేయాలని, వీటి నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చించిన గడ్కరీ పనుల ప్రారంభంపై ఆదేశాలు జారీచేశారు. మళ్లీ టెండర్లు ఆహ్వానించాలి.. టీఆర్ఎస్ ఎంపీల తరువాత కాంగ్రెస్ తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లి గడ్కరీని కలిశారు. నకిరేకల్–నాగార్జునసాగర్ వయా నల్గొండ టౌన్ మీదుగా వెళ్లే లైను 2014లో ప్రారంభమైతే ఇప్పటికీ పనులు పూర్తికాలేదని, కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే ఆపేశారని గడ్కరీకి కోమటిరెడ్డి వివరించారు. దీనివల్ల ఈ లైన్లో రోడ్డు ప్రమాదాల వల్ల 60–70 మంది చనిపోయారని, ఈ లైను పనులకు కొత్త టెండర్లు పిలవాలని స్థానిక అధికారులను కోరినా వారు పట్టించుకోలేదన్నారు. దీనిపై గడ్కరీ స్పందించి 20–30 రోజుల్లో కొత్త టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ టెండర్లను పిలవకపోతే అధికారులతోపాటు తనపై కూడా కేసు పెట్టాలని గడ్కరీ చెప్పారన్నారు. దీనికి ఆయన్ను అభినందించాలన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు 8 లేన్ల రహదారిగా మార్చేందుకు అవసరమైన రూ. 300 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. -
ఈ జంక్షన్లో నిత్యం టెన్షనే..
సాక్షి, తూర్పు గోదావరి : పదహారో నంబర్ జాతీయ రహదారిపై స్థానిక ఏడీబీ రోడ్డు సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు వెళ్లేందుకు ఇది ముఖ్యమైన జంక్షన్. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఇక్కడి నుంచే కాకినాడ వైపు ఏడీబీ రోడ్డులోకి మళ్లుతాయి. అదే సమయంలో జాతీయ రహదారిపై అదుపు చేయలేనంత వేగంతో వాహనాలు దూసుకువస్తూండడంతో తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 28న హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రాలీని విశాఖ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జవగా, ట్రాలీపై ఉన్న పెద్ద గ్రానైట్ రాయి రోడ్డుకు అడ్డంగా పడింది. రెండు రోజుల్లోనే గత నెల 30వ తేదీన ఇదే జంక్షన్లో వ్యాన్ ఢీకొని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు పలు కార్లు, ఆటోలు, లారీలు ఈ సెంటర్లో ప్రమాదాలకు గురయ్యాయి. పలువురు అసువులు బాయగా, మరింతమంది క్షతగాత్రులుగా మిగిలారు. విశాఖ నుంచి వస్తున్నవాహనాలతో.. ముఖ్యంగా విశాఖపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న వాహనాల కారణంగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలు కాకినాడ వైపు వెళ్లేందుకు ఇక్కడ ఏడీబీ రోడ్డు వైపు మలుపు తిరగాలి. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలు.. మలుపు తిరుగుతున్న వాహనాలను దూరం నుంచి గమనించే పరిస్థితి లేదు. విశాఖపట్నం వైపు జాతీయ రహదారి మలుపు తిరిగి ఉండటంతో దగ్గరకు వచ్చే వరకూ వాహనచోదకులు ఈ జంక్షన్‌ను గుర్తించలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ జంక్షన్లో విద్యుద్దీపాలు కూడా రాత్రి సమయంలో సరిగ్గా వెలగవు. తగినంత లైటింగ్ లేకపోవడం కూడా ఈ సెంటర్లో ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. గడచిన ఆరు నెలల్లో జరిగిన ప్రమాదాలనే పరిశీలిస్తే.. ఎక్కువగా విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు వాటిని నియంత్రించేవిధంగా చర్యలు తీసుకోవడం లేదు. అసలు తరచుగా ఇక్కడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని పరిశీలించడం లేదు. ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. స్థానికులు మాత్రం ఈ జంక్షన్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలనే సంకల్పంతో భగవంతునిపై భారం వేస్తూ భారీ ఎత్తున పంచముఖాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు చేస్తున్నారు. -
రూ 1.20 లక్షల కోట్లతో అభివృద్ధికి రహ‘దారి’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్లో తమకు రూ 1.20 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరుతోంది. జులై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తమ మంత్రిత్వ శాఖకు అధిక నిధులు కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి అభ్యర్ధించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేటాయింపుల కంటే రూ 37,000 కోట్లు అదనంగా రూ 1.20 లక్షల కోట్లు తమ శాఖకు కేటాయించాలని గడ్కరీ కోరుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు మౌలిక రంగ ప్రాజెక్టులను ప్రైవేట్ పెట్టుబడులతో నిమిత్తం లేకుండా సత్వరమే పూర్తిచేసేందుకు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బడ్జెట్లో అధిక నిధులను కోరుతోందని ఆ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే మౌలిక వసతులను అత్యాధునికంగా నిర్మించాలని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘జాతీయ రహదారులపై కేంద్రాన్ని నిలదీస్తాం’
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి గడ్కరీ గతంలో రాష్ట్రానికి ప్రకటించిన పలు జాతీయ రహదారుల నిర్మాణంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారన్నారు. జాతీయ రహదారుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన సగటు గుర్తింపునివ్వడం లేదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అనేక సార్లు గడ్కరీకి లేఖ రాశారని చెప్పారు. కేసీఆర్ చొరవతో 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. హైదరాబాద్‌కు 50 కి.మీ దూరంలో జాతీయ రహదారులను కలిపేలా రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిన కేంద్రం తెలంగాణలో ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించక పోతే వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. -
‘టోల్’ పెరిగింది!
షాద్‌నగర్ టౌన్ : జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారంగా మారనుంది. టోల్ ప్లాజా.. ప్రయాణికుల తోలు తీస్తోంది. రుసుం పెంచి వారి జేబులు ఖాళీ చేస్తోంది. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలో ఉన్న రాయికల్ టోల్ ప్లాజాలో టోల్ ధరలు పెంచేశారు. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రయాణం మరింత భారం సువిశాలంగా నిర్మించిన రోడ్డుపై రయ్.. రయ్ అంటూ వాహనదారులు దూసుకుపోతున్నారు. అయితే, వారి ప్రయాణం మరింత భారమైంది. 44వ జాతీయ రహదారిపై కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న సుమారు 58 కిలోమీటర్ల మేర సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో రోడ్డును విస్తరించి అవసరమైన చోట్ల బైపాస్ నిర్మించారు. 2009లో అప్పటి కేంద్ర మంత్రి ఈ రోడ్డును ప్రారంభించారు. షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ గ్రామ శివారులో టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి రుసుంను వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది టోల్ రుసుం పెరుగుతూ వస్తోంది. అయితే, తాజాగా పెరిగిన టోల్ ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన టోల్‌తో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు ఇవీ.. ప్రతి ఏడాది టోల్ గేట్ నిర్వాహకులు రుసుమును పెంచుతూనే ఉన్నారు. కారు, జీపువ్యానుకు ఒకసారి ప్రయాణానికి రూ.65, ఒకరోజులో బహుళ ప్రయాణానికి రూ.95, లైట్ కమర్షియల్ (ఎల్సీవీ) వాహనానికి రూ.110, రానుపోను ప్రయాణానికి రూ.165, ట్రక్కు, బస్సులకు(2 యాక్సిల్స్) ఒకసారి ప్రయాణానికి రూ.220, బహుళ ప్రయాణానికి రూ.330, మల్టీ యాక్సిల్ వాహనం(2 యాక్సిల్) ఒకసారి ప్రయాణానికి రూ.355, బహుళ ప్రయాణానికి రూ.535, స్కూల్ బస్సుకు నెలవారీగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కారు, జీపు వ్యానులకు నెలవారీ పాసు రూ. 1,895, లైట్ కమర్షియల్ వాహనాలకు రూ.3,315, ట్రక్కు, బస్సులకు రూ.6625, మల్టీ యాక్సిల్ వాహనాలకు రూ.10,650 వసూలు చేస్తారు. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. గతంలో కంటే అన్ని వాహనాలకు రూ. 5 నుంచి 15 రూపాయల వరకు ధరలను పెంచారు. అంటే.. సుమారు 2.5 శాతం రుసుం పెరిగింది. ప్రస్తుతం వసూలు ఇలా.. కారు, జీపు, వ్యాన్లకు ఒకసారి ప్రయాణానికి రూ.60, బహుళ ప్రయాణానికి రూ.90, లైట్ కమర్షియల్ వాహనాలకు ఒకసారి ప్రయాణానికి రూ.110, బహుళ ప్రయాణానికి 160, ట్రక్కు, బస్సులకు ఒకసారి ప్రయాణానికి రూ.215, బహుళ ప్రయాణానికి రూ.325, మల్టి యాక్సిల్ వాహనం ఒకసారి ప్రయాణానికి రూ.345, బహుళ ప్రయాణానికి రూ.520లు ప్రస్తుతం వసూలు చేశారు. లక్షల్లో టోల్ రుసుం వసూలు షాద్‌నగర్ సమీపంలో ఉన్న రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు ఐదువేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. వాహనదారుల నుంచి ప్రతిరోజు సుమారు రూ. 15 లక్షల వరకు రుసుం వసూలు అవుతోంది. చార్జీలు పెంచడం వలన ప్రతిరోజు మరో రూ.50 వేల వరకు అదనంగా రానుంది. గత ఏడాది ఈ టోల్ ప్లాజాలో వసూలు చేసే రుసుమును తగ్గించినా ఈసారి మాత్రం పెంచారు. వాహనాలను అమ్ముకుంటున్నాం ఏటేటా టోల్ రుసుం పెంచుతూ పోతున్నారు. ధరలను పెంచడం వలన లారీల నిర్వాహకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాహనాలను నడిపించడం భారంగా మారింది. దీంతో వాహనాలను అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే టోల్గేట్లను ఎత్తివేయాలి. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ సామాన్యుల నడ్డి విరుగుతోంది ప్రతి ఏడాది టోల్ రుసుమును పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నారు. టోల్ ధరలు పెంచడంతో బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో సామాన్యులపై భారం పడుతోంది. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. టోల్ చార్జీల రూపంలో ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదు – నర్సింహ్మ, షాద్‌నగర్ -
నాలుగేళ్లలో 3,155 కి.మీ. రోడ్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్ర జాతీయ రహదారుల సగటు 2.2 కిలోమీటర్లు. అది జాతీయ రహదారుల సగటు (2.84 కిలోమీటర్లు) కంటే తక్కువ. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారుల నిర్మాణానికి నడుం బిగించారు. పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అలా ఎన్నో రహదారులను సాధించుకున్నాం. కేంద్రం నుంచి వచ్చిన అనుమతులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు 4.1 కిలోమీటర్లకు చేరింది. నాలుగేళ్లలో 3,155 కిలోమీటర్ల నిడివి ఉన్న జాతీయ రహదారులు రాష్ట్రానికి వచ్చాయి’’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పలు రహదారులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం హైదరాబాద్ రానున్నారని చెప్పారు. శుక్రవారం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి మెదక్ 765డీ జాతీయ రహదారిపై 62.92 కిలోమీటర్ల నిడివి గల రహదారికి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. ఆ రహదారి నిర్మాణం అంచనా రూ.426.52 కోట్లు. భూ సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్–నర్సాపూర్–కౌడిపల్లి–అప్పాజిపల్లి–రాంపూర్–మెదక్ పట్టణాల అనుసంధానం జరుగుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. మెదక్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ఆవలంబనకు దోహదపడుతుంది’’అని వివరించారు. ప్రాంతీయ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై ఆరాంగఢ్–శంషాబాద్ మధ్య 10 కిలోమీటర్ల నిడివి గల రహదారిని ఆరు వరుసలుగా నిర్మిస్తామని తుమ్మల తెలిపారు. ఇది రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్య రహదారని పేర్కొన్నారు. అంబర్పేట్ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, హైదరాబాద్‌లో కోఠి–ఉప్పల్ మధ్య సిటీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉప్పల్‌లో హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల నిడివిగల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తామని తెలిపారు. ప్రాంతీయ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, జగదేవ్‌పూర్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర 330 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుందని వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఇందుకు ఖర్చు కానుందని చెప్పారు. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు తెలిపారు. గోదావరి తీరం వెంబడి పలు ప్రాజెక్టులను కలిపేలా రహదారి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖలో రిటైరైన వారిని తీసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఙులను తీసుకుంటున్నామని తెలిపారు. కోదండరాం ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై వ్యాఖ్యానించడానికి తుమ్మల నిరాకరించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి పాల్గొన్నారు. నేడు నగరంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన రూ.1,523 కోట్ల పనులకు శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనిలో భాగం గా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.1,523 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్ 765డి లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచ డం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులున్నాయి. వీటికి గడ్కరీ శంకు స్థాపన చేస్తారు. రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు. -
రాజస్తాన్‌లో ప్రైవేట్ వాహనాలకు ‘టోల్’ లేదు
జైపూర్: జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ పెరగ్గా రాజస్తాన్ ప్రభుత్వం మాత్రం వాహనదారులకు ఊరట కల్పించింది. రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రైవేట్ వాహనాలకు టోల్‌ను తొలగించింది. ఈ మినహాయింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్ తెలిపారు. జిల్లా రోడ్లతోపాటు 15,534 కిలోమీటర్ల పొడవైన 56 రాష్ట్ర రహదారులపై నిత్యం 1.25 లక్షల ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వీటిపై 143 పాయింట్లలో టోల్ ట్యాక్స్ వసూళ్లు జరుగుతుంటాయని వివరించారు. పన్ను మినహాయింపు ఫలితంగా ప్రజలకు రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. -
టోల్ ధరలు పెంచిన ఎన్హెచ్ఏఐ
-
హైవేలపై పెరిగిన టోల్ ఫీజు
ఆగ్రా: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారంగా మారింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ రేట్లను 5 నుంచి 7శాతం పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల రవాణా వాహనాలకూ ఇది వర్తిస్తుంది. జాతీయ రహదారి–2 ప్రాజెక్టు డైరెక్టర్ మహ్మద్ షఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జాతీయరహదారులపై 372 టోల్ప్లాజాలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ రేట్లను టోకు ధరల సూచీ ప్రాతిపదికగా సవరిస్తుంది. దీంతో ఒకే ప్రాంతంలోని టోల్‌ప్లాజాల వద్ద వసూలు చేసే ఫీజులు ఒకేలా ఉండవు. ఎన్‌హెచ్–2పై టోల్ రేట్లలో 5శాతం పెరుగుదల ఉంటుంది’అని షఫీ తెలిపారు. ఎక్కువ శాతం టోల్‌ప్లాజాల వద్ద ఇదే పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు. నెలవారీ పాస్‌లున్న వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. టోల్ రేట్ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని వాహనయజమానులు అంటున్నారు. ఎన్‌హెచ్–1, 2లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం టోల్ ఫీజు పెంచిందని విమర్శిస్తున్నారు. -
రేపటినుంచి ‘టోల్’ బాదుడు!
సాక్షి, న్యూఢిల్లీ:జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన చోదకులకు ఇక మరో టోల్ బాదుడు తప్పదు. మార్చి31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త టోల్‌చార్జీలు నేపథ్యంలో జాతీయ రహదారులపై డ్రైవింగ్ మరింత భారం కానుంది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ రేట్లును 5నుంచి 7శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారీటి టోల్ ప్లాజాలపై అన్ని రకాల వాహనాలపై టోల్ చార్జీలు 5శాతం పెరగనున్నాయి. మంత్లీ ప్లాన్‌లో (నెలకు 50 ట్రిప్పులు) ధరలను కూడా నేషనల్ హైవే అథారిటీ పెంచింది. ఫలితంగా నిత్యావసర ధరలు కూడా ఈ మేరకు భగ్గుమనడం ఖాయం. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏటా ఏప్రిల్ నెలలో చార్జీలను పెంచుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన టోల్ చార్జీ అమలు కానుంది. నేషనల్ హైవే 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ మొహమ్మద్ సఫీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొత్తం 372 టోల్ ప్లాజాలున్నాయని చెప్పారు. టోల్‌రేట్లు కూర్పు ప్రతి ఆర్థికసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా రేట్లు సవరణ ఉంటుందనీ, అయితే ఆయా ప్రాంతాలనుబట్టి రేట్లు మారతాయన్నారు. మరోవైపు ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్‌చార్జీలు అధికంగా ఉన్నా,మళ్లీ రేట్లు పెంచడం అసమంజసమనే ఆందోళన సర్వత్రా వ్యకమవుతోంది. ఈ పెంపుపై ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు ఇ-వే బిల్లు, పెరిగిన డీజిల్ ధరలకు తోడు టోల్ చార్జీలపెంపు కారణంగా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. -
రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి రూ. 4,494 కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూ.4,494 కో ట్లు కేటాయించింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 188.51 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీచేసినట్లు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 161వ జాతీయ రహదారిలో కంది నుంచి రామసానిపల్లె వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రూ.1201.62 కోట్లు, రామసానిపల్లె నుంచి మంగ్లూ ర్ గ్రామం వరకు 46.6 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు కోసం మరో రూ.1,220 కోట్లు మంజూరు చేసింది. మంగ్లూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు కోసం రూ.1,082 కోట్లు, రేపల్లె్లవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ. 4 లైన్ల రోడ్డు కోసం రూ.988 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ వెల్లడించింది. -
తిరుపతిలో జాతీయ రహదారుల దిగ్బంధం
-
విజయవాడలో జాతీయ రహదారుల దిగ్బంధం
-
జాతీయ రహదారుల దిగ్బంధం
-
అనంతలో జాతీయ రహదారుల దిగ్బంధం
-
జాతీయ రహదారుల దిగ్బంధం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు, సంఘాలు నిర్వహిస్తున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డి పాలెం రహదారి వద్ద వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. ఈ దిగ్బంధానికి ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లోనూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చింది. కాగా, రహదారుల దిగ్భంధానికి ఇతర పార్టీలు, 45 ప్రజా సంఘాలు కూడా మద్దతిచ్చాయి. గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఉధృతం. జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా గుంటూరు శివారులోని హైవేపై ఆందోళనకారులు బైఠాయించారు. ఆందోళనకారులకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపి హోదా ప్లకార్డులు పట్టుకొని ధర్నాలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కు అంటూ ఆయన నినాదం చేశారు. అనంతపురం : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధంలో భాగంగా కాశ్మీర్-కన్యాకుమారి జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. ఇందుకు వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు ఆశ్రమం జాతీయ రహదారి వద్ద దిగ్బందించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, వామపక్ష పార్టీలు, జనసేన, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మధ్యాహ్నపు ఈశ్వరి, కొఠారు అబ్బాయి చౌదరి, బొద్దాని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. చిత్తూరు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తనపల్లి క్రాస్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. https://cms.sakshi.com/video/news/national-highways-blockade-special-status-tirupati-1055978 శ్రీకాకుళం : పలాస వద్ద జాతీయ రహదారిని వైఎస్ఆర్సీపీ నేతలు జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా నిర్బంధించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. కృష్ణా : కనకదుర్గమ్మ వారధి వద్ద జాతీయ రహదారుల దిగ్బంధంలో భాగంగా వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు, పార్ధసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, భవకుమార్, సీపీఎం నేత పీ మధు, సీపీఐ నేత కే రామకృష్ణలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప : ప్రత్యేక హోదా కోసం పోరు ఉధృతం. కడప-రాజం పేట బైపాస్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఇందులో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చింది. రావులపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఐదవ నంబరు రహరారిపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన నేతలు పాల్గొన్నారు. కర్నూలు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. హైవేపై ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకులు శిల్పా చక్రపాణి రెడ్డి, బీవౌ రామయ్య, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య, ఇన్‌చార్జ్‌లు హాఫీజ్ ఖాన్, మురళి కృష్ణ, రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసనగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నాయకులపై పోలీస్ జూలూం విసిరింది. పోలీసులు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలని బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరికికు నిరసనగా వైసీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులనూ అరెస్ట్ చేయడంతో హైవేపై ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో లంకెలపాలెం జాతీయరహదారి దిగ్బంద కార్యక్రమం చేపట్టారు. అదీప్ రాజ్‌తో సహ పలువురిని పోలీసులు అరెస్టు చేసి పరవాడ పీఎస్‌కు తరలించారు. ప్రకాశం : జిల్లా ముండ్లమూరు మండలంలో వామపక్షాల ఆద్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోదా కోసం రోడ్లను నిర్బంధించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మార్టూరు జాతీయరహాదారిపై బైటాయించి, నిరసన వ్యక్తపరుస్తున్నారు. దీంతో వాహానాల రకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు : జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ నేతలు వాహనాలను అడ్డుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సీపీఎం నేతలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో పోలీసులు పలువురి నేతలను అరెస్టు చేశారు. విజయనగరం : ఏపి కిప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ-రాయ్ పూర్ 26వ నంబరు జాతీయ రహదారి దిగ్బందనం. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. -
1033 హెల్ప్‌లైన్ త్వరలో..దేనికో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు గురించి నివేదించేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను లాంచ్ చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జియో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం పని పూర్తి చేసినట్టు జాతీయ రహదారుల అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్) తెలిపింది. ప్రమాద బాధితులకు తక్షణం సహాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతేకాదు త్వరలోనే దీనిపై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి, ప్రాణాలను రక్షించే యోచనలో భాగంగా ఈ చర్య తీసుకోవాలని అధారిటీ యోచిస్తోంది. 1033 అనే టోల్ నెంబర్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. 1033 హెల్స్‌లైన్ ద్వారా ఎమర్జన్సీ లేదా నాన్ ఎమర్జన్సీ సేవలతో హైవే వినియోగదారులకు "వన్ స్టాప్ పరిష్కారం" అందించనున్నామని భారత జాతీయ రహదారుల అథారిటీ అధ్యక్షుడు దీపక్ కుమార్ వెల్లడించారు. ప్రమాద బాధితులను నిర్ధారించడానికి, సకాలంలో వైద్య చికిత్స అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి లేదా ఏదైనా ఇతర అత్యవసర పరిస్థితి గురించి ఒక కాల్ వచ్చినప్పుడు టోల్ నంబర్ ఆపరేటర్లు ఆ సమాచారాన్ని సమీపంలోని ఆపరేషన్ సెంటర్‌కు చేరవేస్తారు. తద్వారా అంబులెన్స్ , క్రేన్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30శాతం జాతీయ రహదారులపైనే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 2016 సంవత్సరంలోనే ఈ ప్రమాదాల్లో 52,075 మంది ప్రాణాలు కోల్పోగా, 1.46 లక్షలమంది గాయాలపాలైనట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. -
రోడ్లు బాగు చేయండి : డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: మేడారంలో వచ్చే ఏడాది జనవరి 31న జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రహదారుల శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ...ఈ జాతరకు దాదాపు కోటిమందికిపైగా భక్తులు వస్తారని, ఇందులో రోడ్లు అత్యంత ప్రాధాన్యమైనందున వాటిని పూర్తిస్థాయిలో బాగు చేయాలని కోరారు. సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్, జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, ఎస్.ఈ రాజిరెడ్డి, ఈఈ హఫీజ్, ఎల్ అండ్ టీ ప్రతినిధులు హాజరయ్యారు. -
జాతీయ రహదారిపై మళ్లీ మద్యం
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ రహదారులపై మళ్లీ మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. నగర, పురపాలక సంస్థల పరి«ధిలో నుంచి వెళుతున్న జాతీయ రహదాలపై మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తరాది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని మన రాష్ట్రంలో కూడా దుకాణాలు ఏర్పాటు చేసేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జాతీయ రహదారులు అధిక శాతం నగరాల మధ్య నుంచి వెళుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన సుప్రీం ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే పలు కారణాల వల్ల ఆ గడువును మార్చి నెలాఖరుకు, ఆ తర్వాత జూన్ వరకు పొడిగించింది. రాష్ట్రంలో మద్యం నూతన పాలసీ జూలైలో ప్రారంభం కావడంతో అప్పటి నుంచి ఆ తీర్పును అమలు చేశారు. మద్యం వల్ల వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆ«ధీనంలో ఉన్న రాష్ట్ర రహదారులను నగరపాలక, పురపాలక, మండల కేంద్రాల పరిధి వరకు జిల్లా ప్రధాన రహదారులుగా మార్చివేసింది. తాజాగా ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వెలుసుబాటును ఉపయోగించుకుని జాతీయ రహదారుల పక్కన కూడా మద్యం దుకాణాల ఏర్పాటు చేసుకోడానికి వ్యాపారులకు అనుమతిస్తోంది. ప్రాణాలు పోతే మాకేంటి..? రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గత మద్యం పాలసీలో 545 దుకాణాలకుగాను 499 దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులపై 379 దుకాణాలున్నాయి. జాతీయ రహదారులపై 39 ఉండగా మిగిలిన 340 దుకాణాలు రాష్ట్ర రహదారులపై ఉన్నాయి. సుప్రీం తీర్పుతో ఈ దుకాణాలను రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే దుకాణాలు ఏర్పాటు చేసే పట్టణాల్లో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయడంతో ఎప్పటిలాగే 340 దుకాణాలు యథాతథంగా ఉన్నాయి. -
నా దారి ‘రహదారి’
సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగం, దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అధిక ధరలు.. ఇన్ని సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని వృద్ధి బాటన పరుగులు పెట్టించడం ప్రధాని నరేంద్ర మోదీకి అతిపెద్ద సవాల్‌గా ముందుకొస్తున్నది. విపక్షాలు, విమర్శకుల నుంచి ఎదురయ్యే రాజకీయ దాడిని ఎదుర్కోవడమూ సంక్లిష్టమే. సార్వత్రిక ఎన్నికల ముందు ముంచుకొచ్చిన ఈ సవాళ్లను ఆయన ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సవాళ్లను స్వీకరిస్తూనే దేశ రూపురేఖలను మార్చేందుకు బృహత్తర పథకంగా భారీ రహదారుల నిర్మాణాన్ని మోదీ తలకెత్తుకున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులైన రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున పూనుకోవడంతో నిరుద్యోగ సమస్యకూ చెక్ పెట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. 2022 నాటికి రూ 6.92 లక్షల కోట్లతో 83,677 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవడంతో పాటు దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 14.2 కోట్ల పనిదినాలను కల్పించనున్నాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి తరహాలో రహదారుల ద్వారా భారత్ ముఖచిత్రాన్ని మార్చివేయాలన్నది మోదీ సంకల్పంగా భావిస్తున్నారు. హైవేలు కేవలం రహదారులే కాదు అవి దేశ గతిని మార్చే భాగ్యరేఖలని గతంలో నాలుగు ప్రధాన నగరాలని కలిపే స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు చేపట్టిన సందర్బంగా వాజ్‌పేయి చెప్పిన మాటలను మోదీ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. మౌలిక రవాణా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధికి బాటలువేయాలన్న వాజ్‌పేయి ఆకాంక్షను మోదీ అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక భారత్‌మాల పథకం కింద రాబోయే రోజుల్లో రూ. 5.35 లక్షల కోట్లతో హైవేలను అభివృద్ధి చేయనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టుకు మార్కెట్ రుణాలు, కేంద్ర రహదారి నిధులు, బడ్జెట్ కేటాయింపుల వంటి వనరుల ద్వారా నిధులు సమీకరించనుంది. -
రోడ్లకు 7లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు ఆమోదముద్ర పడింది. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. మంగళవారం కేబినెట్ ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్లలో ముంబై–కొచ్చిన్–కన్యాకుమారి, బెంగళూరు–మంగళూరు, హైదరాబాద్–పణజీ, సంబల్పూర్–రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి. భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే వెల్లడించారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది. అనుసంధానత, ఉపాధి కల్పన మౌలిక వసతులను పెంచటం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతి పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన అని, అందుకు భారీగా నిధులను కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సమర్థవంతమైన రవాణా కోసం రోడ్ల రంగంలో ఉన్న ప్రతిబంధకాలను ప్రభుత్వం తొలగించిందని జైట్లీ తెలిపారు. దీని ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 2021–22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ‘ఈ ప్రాజెక్టు కోసం రూ.2.09 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సేకరించనున్నాం. రూ.1.06 లక్షల కోట్లను ప్రైవేట్ పెట్టుబడులు (పీపీపీ ద్వారా), రూ.2.19 లక్షల కోట్లను సెంట్రల్ రోడ్ ఫండ్, టీవోటీ మానిటైజేషన్, ఎన్హెచ్ఏఐ టోల్ కలెక్షన్ల ద్వారా సేకరిస్తాం’ అని ప్రభుత్వం తెలిపింది. భారత్‌మాల ప్రాజెక్టు.. గతంలో ఎన్నడూ లేనట్లుగా భారత్‌ను అనుసంధానం చేస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా 9వేల కిలోమీటర్ల ఎకనమిక్ కారిడార్లు, 6వేల కిలోమీటర్ల ఇంటర్ కారిడార్, 5వేల కిలోమీటర్ల నేషనల్ కారిడార్ల సామర్థ్యం పెంపు.. 2వేల కిలోమీటర్ల సరిహద్దు అనుసంధానత, 800 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలు, 10వేల కిలోమీటర్ల మేర మిగిలిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టునకు రూ.5.35లక్షల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించింది. 6 ఐఐటీలకు క్యాంపస్‌ల నిర్మాణం కోసం రూ.7వేల కోట్ల విడుదలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇందులో తిరుపతి, పాలక్కడ్, ధార్వాడ్, జమ్మూ, భిలాయ్, గోవా ఐఐటీలున్నాయి. గోధుమలు, పప్పుధాన్యాల మద్దతు పెంపు పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలను అదుపులోకి తెచ్చేందుకు వీటి ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017–18 రబీ సీజన్లో పలు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.110 పెంచగా.. కందిపప్పుపై క్వింటాలుకు రూ.400, మసూర్లపై క్వింటాలుకు రూ. 300 పెంచినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రబీ సీజన్లో ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. పెరిగిన మార్పులతో క్వింటాలు గోధుమలకు రూ. 1,735లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మారిన ధరలతో కందిపప్పుకు రూ.4,400, మసూర్లకు రూ.4,250 లను ప్రభుత్వం చెల్లించనుంది. ఆవాలు, కుసుమ నూనె ఉత్పత్తిని పెంచేందుకు వీటి కనీస మద్దతు ధరను కూడా గణనీయంగా పెంచింది. ఆవాలు క్వింటాలుకు రూ.300 (మొత్తం ధర రూ.4 వేలు), కుసుమలపై క్వింటాలుకు రూ.400 (మొత్తం ధర రూ.4,100), బార్లీ మద్దతు ధరను క్వింటాలుకు రూ. 85 పెంచినట్లు మంత్రి తెలిపారు. -
నిబంధనలు పాటించాల్సిందే
అరసవల్లి: ‘మేము ఇంతవరకు జాతీయ రహదారులపైనే దృష్టి పెట్టాం. నగరంలో ఆటోలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ దృష్టి సారిస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు.. జాగ్రత్త.. కచ్చితంగా నిబంధనల ప్రకారం ఆటోలు నడపాల్సిందే..’’ అంటూ జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం సాయంత్రం జెడ్పీ సమావేశ మందిరంలో రవాణా శాఖ, పోలీసు శాఖల సంయుక్తంగా నిర్వహించిన రహదారి భద్రతపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడా ది జనవరి నుంచి మార్చి వరకు మన జిల్లాయే ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉందని, ఇప్పుడు పలు భద్రతా చర్యల కారణంగా ఆ స్థానం మారిందని గుర్తుచేశారు. ప్రమాదాల నివారణలో పోలీసులదే బాధ్యత కాదని, డ్రైవర్లు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. అవగాహన లోపంతోనే జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్నాయ ని చెప్పారు. నిబంధనలను పాటించే క్రమంలో నగరంలో మొదట ఆదర్శంగా ఐదుగురు సీనియర్ ఆటో డ్రైవర్లు పరి మితి ప్రకారం ఆటోలు నడపాలని, వారి ని చూసి మరికొందరు మారే అవకాశముందని ఉదాహరణలతో వివరించా రు. ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి వాహనానికి బీమా, డ్రైవర్‌కు లైసెన్స్ తప్పనిస రి అని, అవసరమైతే ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు. మారనున్న చట్టాలు.. వాహన ప్రమాదాలకు కారకులపై త్వరలో రానున్న చట్టాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని జిల్లా అదనపు న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.సుధామణి అన్నారు. డ్రైవర్లు చేతిలో ప్రయాణికుల విలువైన ప్రాణాలుంటాయని, అది దృష్టిలోపెట్టుకుని వాహనాలను నడపాలని, మద్యం సేవించకుండా, సెల్‌ఫోన్ వినియోగించకుండా డ్రైవింగ్ చేస్తే దాదాపుగా ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. ప్రతి ఆటోలో వాహనం ఫిట్నెస్, డ్రైవర్ వివరాలన్నీ ఉండేలా ఏర్పాటు చేయాలని డీటీసీ శ్రీదేవికి సూచించారు. ముఖ్య ప్రాంతాల్లో ప్రమాద సూచికలు పెట్టించాలన్నారు. విద్యార్హత లేకున్నా లైసెన్స్.. ఆటో డ్రైవర్ల సమస్యలేంటో తమకు తెలుసునని, అందుకు తగ్గట్టుగానే రవాణా శాఖ చర్యలు చేపడుతుందని డీటీసీ శ్రీదేవి తెలిపారు. అందులో భాగంగా ఎనిమిదో తరగతి, పదో తరగతి విద్యార్హతలు లేకపోయినప్పటికీ, లైసెన్స్‌లు ఇస్తున్నామని, రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి డ్రైవర్లు లైసెన్స్‌లు పొందవచ్చునని చెప్పారు. సదస్సులో ఓ ఆటో యూనియన్ నేత వరాహ నర్సింహం అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించి ప్రతి సెంటర్లో ఫిక్స్డ్ రేట్లు పెట్టబోతున్నామని చెప్పారు. దీనిపై ఆటో డ్రైవర్లంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా ఇకపై ఆటోలో కనీస విద్యార్థులు ఐదుగురు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓవర్లోడ్లతో ఆటోలు కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతకుముందు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు ఆటో డ్రైవర్లు, పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రభాకరరావు, డీఎస్పీలు వి.భీమారావు, పెంటారావు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు, వైద్యులు కె.చిన్నబాబు, శ్రీకాంత్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ అంతర్గత జలమార్గాల నిర్మాణంతో దేశం రూపురేఖలు మారిపోతాయని, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో రూ.7,015 కోట్లతో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో కలసి రాష్ట్రంలో రూ.1,614.03 కోట్ల వ్యయంతో.. 381.9 కి.మీల పొడవున అభివృద్ధి చేసిన ఏడు జాతీయ రహదారులను రిమోట్ ద్వారా జాతికి అంకితం చేశారు. రూ.2,539.08 కోట్లతో 250.45 కి.మీ. పొడవున చేపట్టిన మరో ఆరు జాతీయ రహదారుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, కృష్ణా నదిలో జాతీయ అంతర్గత జలమార్గం4 నిర్మాణంలో భాగంగా తొలిదశ కింద రూ.96 కోట్లతో చేపట్టిన విజయవాడముక్త్యాల జలమార్గం పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలోను, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించాక అక్కడి మీడియాతోనూ నితిన్ గడ్కరీ మాట్లాడారు. పోలవరం పూర్తికి కృషి వచ్చే ఎన్నికల్లోగా పోల వరం ప్రాజెక్టు పూర్తికావడం కష్టమేనని.. అయినా, పూర్తిచేయడానికి శాయశక్తులా కృషిచేస్తామని గడ్కరీ తెలిపారు. 2018 డిసెంబర్ తర్వాత 3,4 నెలల్లో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ : చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ముక్త్యాలవిజయవాడ జలమార్గానికి శంకుస్థాపన చేయడం చారిత్రాత్మకమన్నారు. ఇది పూర్తయితే ఆగ్నేయాసియా ఖండానికి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్ అవుతుందన్నారు. బీజేపీ నేతలతో గడ్కరీ భేటీ రద్దు రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ నేతలతో జరగాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. సమయాభావంవల్ల మంత్రి కార్యక్రమం రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుం దని ప్రభుత్వ సీఎస్ దినేశ్ కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమా వేశంలో పలు సంస్థలకు భూముల కేటాయిం పు తదితర అంశాలు ఎజెండాకు రానున్నాయి. -
రాష్ట్రానికి మరో రెండు జాతీయ రహదారులు
మారుమూల ప్రాంతాల అనుసంధాన పథకంలో భాగంగా కేటాయించిన కేంద్రం ∙ వరంగల్–మహబూబాబాద్ మధ్య 71 కి.మీ. మేర ఒకటి ∙ కరీంనగర్–భూపాలపల్లి మధ్య 130 కి.మీ. మేర రెండోది నిర్మాణం ∙ అంచనా వ్యయం రూ.690 కోట్లు.. మంజూరుకు కేంద్రం ఆమోదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు జాతీయ రహదారులను మంజూరు చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి రూ.690 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన కేంద్రం.. ఆ మేరకు నిధుల మంజూరుకు ఆమోదం ప్రకటించింది. ఇందులో కరీంనగర్ నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఓ రహదారి కాగా, రెండోది వరంగల్ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం వరకు నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలను సమీప పట్టణాలతో అనుసంధా నించి ఇతర జాతీయ రహదారులతో జోడించే పథకంలో భాగంగా కేంద్రం ఈ రెండు రహదారులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సంబంధం లేకుండా వీటిని మంజూరు చేయటం విశేషం. వరంగల్‌కు కొత్త జాతీయ రహదారి ప్రస్తుతం వరంగల్ పట్టణం రెండు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వరకు 163వ నంబర్ జాతీయ రహదారి, జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా 563వ నంబర్ జాతీయ రహదారి వరంగల్‌తో జత కలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వరంగల్‌తో మహబూబాబాద్‌ను జాతీయ రహదారితో అనుసంధానించి సూర్యాపేట– మహబూబా బాద్– ఖమ్మం మధ్య ఉన్న 365వ నంబర్ జాతీయ రహదారితో జత చేస్తారు. వెరసి మూడు జాతీయ రహదారుల అనుసంధానం ఏర్పడుతుంది. ఈ కొత్త రహదారి వరంగల్ లోని రంగశాయిపేటలో మొదలై చింత నెక్కొండ, నెక్కొండ, కేసముద్రం మీదుగా మహబూబాబాద్ (71 కి.మీ.)తో కలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న ఆ రోడ్డు నాలుగు వరుసలతో జాతీయ రహదారిగా మారుతుంది. భూపాలపల్లి–కరీంనగర్ మధ్య ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి లేదు. భూపాలపల్లి నుంచి అన్షాస్పల్లి, గోర్వీడు, నేరుడుపల్లి తండ (చైనపాలక), గరిమిళ్లపల్లి, బూరపల్లి, ఎంపేడు, వావిలాల, జమ్మికుంట, వీణవంక, కరీంనగర్ రోడ్డును జాతీయ రహదారిగా మారుస్తారు. ఇది 130 కి.మీ. మేర సాగుతుంది. కొత్త రాష్ట్రంలో 25 కొత్త రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భూభాగంలో జాతీయ రహదారుల నిడివి నామమాత్రమే. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం 23 జాతీయ రహదారులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రహదారుల పొడవు గతం కంటే రెట్టింపు అయింది. వీటి నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలవు తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా రెండు రోడ్లను మంజూరు చేయటంతో మొత్తం రోడ్ల సంఖ్య 25కు పెరిగింది. మొత్తంగా మూడున్నరేళ్లలో తెలంగాణకు మంజూరైన మొత్తం జాతీయ రహదారుల నిడివి 3,175 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఏరులై పారుతున్న మద్యం
► జాతీయ రహదారులపైనే అమ్మకాలు ► మోటారు సైకిళ్లపై సరుకు పెట్టి సరఫరా ► విచ్చలవిడిగా బెల్టుషాపుల నిర్వహణ ► కోర్టు ఆదేశాలు బేఖాతర్ ► నరసాపురంలో మద్యం సిండికేట్ల బరితెగింపు నరసాపురం: జాతీయ రహదారులకు 500 మీటర్లు మేర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం గండి కొట్టగా వ్యాపారులు మరో రకంగా రెచ్చిపోతున్నారు. నరసాపురం పట్టణం గుండా 216 జాతీయ రహదారి వెళ్లడంతో పాత షాపు ఒక్కటి కూడా ఇక్కడ యథాస్థానంలో పెట్టే వీలు లేపోయింది. దీంతో మద్యం వ్యాపారులు బస్టాండ్ చుట్టుపక్కల గతంలో ఉండే మద్యం దుకాణాల స్థానంలో బెల్టుషాపులు పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఏకంగా మోటార్‌సైకిళ్లపై పెట్టి జాతీయ రహదారిమీదే మద్యం విక్రయాలు సాగిస్తుండడం విశేషం. విచ్చల‘ విడి’గా.. నరసాపురంలో పది రోజులుగా విచ్చల విడిగా బెల్టుషాపుల నిర్వహణ సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మార్చినా మినహాయింపు దక్కక పోవడంతో బస్టాండ్ చుట్టుపక్కల పాత షాపుల స్థానంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్ ఈ వ్యవహారం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న మద్యం బాటిళ్లు కూడా కూనపరెడ్డి ప్రసాద్వని చెబుతున్నారు. బస్టాండ్ పక్కన, గడ్డి బజార్ సందులోను పాత షాపుల్లోనే ఫుల్‌గా స్టాకు నిలువ ఉంచి రాత్రి, పగలూ తేడా లేకుండా బెల్టు విక్రయాలు సాగిస్తున్నారు. 5,291 బాటిళ్ల మద్యం స్వాధీనం బెల్టుషాపు నిర్వహణ నిమిత్తం పట్టణంలో ఓ చెరువుగట్టు వద్ద షెడ్డులో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను సోమవారం ఉదయం 6 గంటలకు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 110 కేసుల మద్యం సీసాలతో పాటుగా, విడిగా మరో 11 బాటిళ్లు ఉన్న కేస్‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీతారామస్వామి సిబ్బందితో కలిసి దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.5 లక్షల విలువగల 5,291 బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు డీఎస్పీ చెప్పారు. పట్టుకున్న మద్యం బాటిళ్లు మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలో నడుస్తున్న గాయత్రి వైన్స్షాపులోనివని గుర్తించారు. ఈ దాడిలో రుస్తుంబాధకు చెందిన మోకా సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నరసాపురం ఎక్సైజ్ సీఐ టి.గోపాలకృష్ణ చెప్పారు. మద్యం బాటిళ్లు గాయత్రి వైన్స్లోనివి కాగా, వాటిని పట్టుకున్న షెడ్డు మరో మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్దని చెప్పారు. సత్యనారాయణ తనకు ఏ సంబంధం లేదని చెప్పడం విశేషం. -
మద్యం దుకాణాలు వర్థిల్లు గాక! రహదారులనే రద్దు చేస్తాం.
జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్పు: మంత్రి జవహర్ సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలుండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, జనం ఇబ్బం దులెదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ఆందోళ న వ్యక్తం చేసింది. రోడ్డు పక్కనే మద్యం దొరుకుతుండడంతో డ్రైవర్లు అక్కడే సేవించి, వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగు తున్నాయంది. అందుకే జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారు లకు 200 మీటర్ల లోపు ఎక్కడా మద్యం దుకాణాలు ఉండరాదని అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభు త్వం సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. మద్యం దుకాణాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై యథాతథంగా కొనసాగించ డానికి వీలుగా ఆయా రోడ్లనే రద్దు చేస్తామని చెబుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్చేస్తోంది. సాక్షా త్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. సర్కారు నిర్ణయంతో రహదారుల పై నిత్యం మద్యం జాతర ఎప్పటì æలాగే కొనసాగనుంది. ఇప్పటికే జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారు ప్రధాన రహదారుల పైకి రావడానికి వీలుగా ప్రభుత్వం పలు వెసులుబాట్లు ప్రకటించింది. షిఫ్టింగ్ ఫీజుల ను ఎత్తివేస్తామంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు ఇచ్చేస్తామని ప్రకటిం చింది. జాతీయ రహదారులను డీనోటిఫై చేయడం ద్వారా మద్యం దుకాణాలను యథాతథంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ కేఎస్ జవహర్ తెలిపారు. ఇలా డీనోటిఫై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, తాము ఎక్కడా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. మంత్రి జవహర్ గురువారం వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్‌లు పొందిన వాళ్లు కూడా తిరిగి ప్రధాన రహదారులపైకి రానున్నట్లు వెల్లడించారు. పారదర్శకంగా షాపుల మంజూరు మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జనావాసాల మధ్య లిక్కర్ షాపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు 9951314101 నంబర్‌కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు. 5 రోజుల్లో రూ.120 కోట్ల నష్టం జాతీయ రహదారులను డీనోటిఫై చేస్తూ అందాల్సిన ఉత్తర్వులు ఆలస్యం కావడంతో చాలామంది యజమానులు ఇంకా మద్యం షాపులు ప్రారంభించలేదని, దీనివల్ల ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.120 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు మంత్రి జవహర్ వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులపై సీఎం ఆగ్రహం మద్యం దుకాణాలు పూర్తిగా తెరుచుకోక పోవడం వల్ల ఒకపక్క ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుం డడమే కాకుండా, జనావాసాల మధ్య షాపుల ఏర్పాటు పై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళ నలు చేస్తుండడంతో ఎక్సైజ్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి చాలా రోజులైనా దానికి అనుగుణంగా జూలై 1 కల్లా కొత్త షాపులను ప్రారంభించేలా చేయడంలో అధికారులు విఫలం కావడం పై ఆయన మండిపడినట్లు తెలిసింది. -
బ్రిడ్జిలైతేనే.. బాగుబాగు
వంతెనలతో ట్రాఫిక్‌కు చెక్.. రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక - రాష్ట్ర ఖజానాపై భారం లేకుండా నిర్మాణానికి కసరత్తు - అంబర్‌పేటలో భారీ వంతెనకు కేంద్రం పచ్చజెండా - ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌ల ప్రతిపాదనలు పరిళీలిస్తున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ చిక్కులకు ప్రధాన కారణంగా ఉన్న మతపరపమైన కట్టడాలున్న చోట భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జాతీయ రహదారులుగా ఉన్న రోడ్లపై నిర్మించే వంతెనలన్నింటికీ కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో వంతెనల కోసం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుతానికి అటకెక్కించిన ప్రభుత్వం, వ్యూహం మార్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.11 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున, నగరంలో వంతెనలకు అయ్యే భారీ వ్యయాన్ని భరించటం పెద్ద సమస్యగా మారింది. దీంతో వీలైనన్ని చోట్ల జాతీయ రహదారులపై వంతెనలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. మరికొన్ని కీలక రోడ్లను జాతీయ రహదారులుగా మార్చి, వాటిమీద నిర్మించే వంతెనలను కలిపి మొత్తంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందాలని నిర్ణయించింది. అంబర్‌పేట ఫ్లైఓవర్‌కు రూ.254 కోట్లు ఇక వీటితోపాటు వరంగల్ జాతీయ రహదారిపై అంబర్‌పేట కూడలి వద్ద ఫ్లైవోవర్ నిర్మించబోతోంది. దీనికి కేంద్రం నుంచి నిధులు పొందేందుకు తాజాగా అనుమతి రావడం విశేషం. చే నంబర్ శ్రీరమణ సినిమాహాల్ కూడలికి వచ్చే మార్గంలో రోడ్డుకు రెండు వైపులా శ్మశానవాటికలు ఉన్నాయి. గతంలో విస్తరణకు ప్రయత్నం చేయగా మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో అక్కడ పొడవాటి వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి దాదాపు రూ.300 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేయడంతో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు దాన్ని కేంద్రం ఖాతాలోకి వేయటంలో విజయం సాధించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.245 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 1.1 కి.మీ. పొడవుతో సాగే ఈ వంతెన దాదాపు 4 బాటిల్ నెక్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందుకోసం అక్కడక్కడా కొంత భూసేకరణ జరపాలి. ఇందుకు రూ.80 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ మొత్తాన్ని భరించాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేంద్రం తిరస్కరించింది. దాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే... రాజేంద్రనగర్ వద్ద ఆరాంఘర్ కూడలి, ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఎల్బీనగర్ వద్ద మరో మూడు వంతెనలకు నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ప్యాట్నీ–శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ రాష్ట్ర రహదారిగా ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారుల ఖాతాలోకి మార్చాలని తాజాగా ప్రతిపాదన పంపింది. ఈ రోడ్డుపై నగరంలో ప్యాట్నీ చౌరస్తా నుంచి శామీర్‌పేట వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతోంది. అవసరమైన స్థలాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ శాఖను కోరింది. దీనికి దాదాపు రూ.750 కోట్లకు పైగా వ్యయం కానుంది. అలాగే ప్యారడైజ్ నుంచి నిజామాబాద్ హైవేలో సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కూడా రక్షణ శాఖ నుంచి స్థల సేకరణ చోయబోతోంది. దీనికి కూడా భారీ వ్యయం అవుతున్నందున దీన్ని కూడా కేంద్రం నుంచి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
హైవేలను అనుసంధానిస్తూ ఓఆర్ఆర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలకు కొత్తగా జాతీయ రహదారులు మంజూరైన నేపథ్యంలో వాటికి మరోవైపు రోడ్ల నిర్మాణం చేపట్టి ఔటర్ రింగు రోడ్లు (ఓఆర్ఆర్)గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా ప్రధాన పట్టణాలకు రింగు రోడ్లు సమకూరుతాయన్నారు. రూ.223.35 కోట్లతో చేపడుతున్న గజ్వేల్ రింగు రోడ్డు పనులు మొదలయ్యాయని, రూ.209 కోట్లతో చేపట్టనున్న ఖమ్మం రింగు రోడ్డు డీపీఆర్ సిద్ధమైం దని, రూ.96.70 కోట్లతో చేపట్టనున్న మహబూబ్‌నగర్ రింగురోడ్డు నిర్మాణ సంస్థ ఖరారైందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు మరోపక్క జాతీయ రహదారితో దీన్ని రింగు రోడ్డుగా మారుస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డికి సంబంధించి జాతీయ రహదారి మినహా శంకర్పల్లి–కంది మధ్య రాష్ట్ర నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనగామను కూడా అదే పద్ధతిలో అనుసంధానించనున్నట్లు తెలిపారు. -
బార్లు ఆ పరిధిలోకి రావు: ఏజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం షాపులన్నిం టినీ మూసేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీ వల ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందుతున్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమానులకు అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ తీపి కబురు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జాతీయ రహదారుల వెంట 500 మీటర్ల లోపు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు వర్తించదని, కేవలం మద్యం దుకాణాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఈ నెలాఖరు కల్లా మూసివేయాలి. ఈ తీర్పు వల్ల తమకు ఆదాయపరంగా భారీ నష్టం కలుగుతుం దని, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో తమకు కొంత స్పష్టతనివ్వాలంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఏజీ అభిప్రాయాన్ని కోరింది. దీంతో బుధవారం ఆయన ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా బార్ అండ్ రెస్టారెంట్ల గురించి చెప్పలేదని, మద్యం దుకాణాల మూసివేత గురించే చెప్పిందని వివరించారు. మద్యం దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వ్యత్యాసం ఉందన్న ఆయన, తీర్పు పరిధిలోకి బార్ అండ్ రెస్టారెంట్లు రావని స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వర్తింపజేసుకోవచ్చు. -
హైవేలు రయ్.. రయ్..
జాతీయ రహదారులకు రూ. 64,900 కోట్లు గత ఏడాదికన్నా 12శాతం అధికం పీఎంజీఎస్‌వైకి రూ.19,000 కోట్లు కొత్తగా 2 వేల కి.మీ.ల తీరప్రాంత కనెక్టివిటీ రోడ్లు న్యూఢిల్లీ: 2017–18లో నేషనల్ హైవేలకు కేటాయింపులను 12 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. మొత్తం కేటాయింపులు రూ. 64,900 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. హైవేల రంగానికి సంబంధించి 2016–17 బడ్జెట్ అంచనాలు రూ.57,976 కోట్లుగా ఉండగా.. సవరించిన అంచనాలు రూ. 52,447 కోట్లు అని ఆయన తెలిపారు. 2017–18 బడ్జెట్ అంచనాలను రూ. 64,900 కోట్లకు పెంచుతున్నాం.’’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైల్వేలు, రహదారులు, షిప్పింగ్ కలపి మొత్తం రవాణా రంగానికి సంబంధించి కేటాయింపులు రూ. 2.41 లక్షల కోట్లకు చేరుకున్నట్లు జైట్లీ తెలిపారు. 2,000 కిలోమీటర్ల మేర తీరప్రాంతాలను కలిపే రహదారులను గుర్తించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని నిర్మించి అభివృద్ధి చేస్తామని జైట్లీ వెల్లడించారు. దీనివల్ల దూరప్రాంతాలలోని గ్రామాలకు నౌకాశ్రయాలున్న ప్రాంతాలకు మధ్య రహదారుల సదుపాయాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారులు సహా 2014–15 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 1,40,000 కి.మీ.లకు పైగా రహదారులను నిర్మించామని, అంతకుముందు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని జైట్లీ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో 100మందికి పైన ఉండే తండాలను కలుపుతూ రహదారులను నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ వివరించారు. 2017–18లో పీఎంజీఎస్‌వైకి రూ.19,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాల వాటాతో కలిపి 2017–18లో ఈ పథకం కింద రూ.27,000 కోట్లను వెచ్చించనున్నామని వివరించారు. విమానాశ్రయాల నిర్వహణలో ‘ప్రైవేటు’ ఎంపిక చేసిన ద్వితీయశ్రేణి నగరాలలోని విమానాశ్రయాలలో కార్యకలాపాల నిర్వహణ ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నట్లు జైట్లీ వెల్లడించారు. భూముల రూపంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వీలు కల్పించేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించారు. -
కొత్త జాతీయ రహదారులు 2,776 కి.మీ.
► 70 ఏళ్లలో రానిది.. రెండున్నరేళ్లలో తెచ్చాం: సీఎం కేసీఆర్ ► ఇవి పూర్తయితే దక్షిణాదిలో మనమే టాప్ ► ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్‌ల అభివృద్ధికి 8,000 కోట్ల రూపాయలు ► అటవీ, మారుమూల ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.1,020 కోట్లు ► హైదరాబాద్ చుట్టూ 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డుకూ ఓకే ► బంగారు తెలంగాణ సాధనలో మేలిమలుపు ఇది ► దీనిపై శాసనసభ తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతున్నాం ► అసెంబ్లీలో జాతీయ రహదారుల అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,776 కిలోమీటర్ల మేర 18 కొత్త జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌లు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 2,527 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే... తమ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే 2,776 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించుకున్నామని చెప్పారు. ఇది బంగారు తెలంగాణ సాధనలో మేలిమలుపు అని, ఇది రాష్ట్రం సాధించిన గణనీయ విజయమన్నారు. శుక్రవారం శాసనసభలో ఎన్‌హెచ్‌లపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తమ అభ్యర్థనలోని సహేతుకతను గుర్తించి పెద్ద మొత్తంలో జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. సమైక్య పాలనలో వివక్ష.. తెలంగాణ ఏర్పడే నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కి.మీ.గా ఉంటే... ఆంధ్రప్రదేశ్ సగటు 3.15 కి.మీ., తెలంగాణ సగటు 2.20 కి.మీ.గా ఉందని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ల విషయంలోనూ వివక్ష కొనసాగిందన్నారు. తాజాగా కేంద్రం మంజూరు చేసిన నూతన రహదారులు ఏర్పాటైతే రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5,303 కిలో మీటర్లకు చేరుతుందని చెప్పారు. అప్పుటికి జాతీయ సగటు 3.81 కిలోమీటర్లుగా ఉంటే.. తెలంగాణ సగటు అంతకన్నా ఎక్కువగా 4.62 కిలోమీటర్లకు చేరుతుం దని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఇప్పటివరకూ అట్టడుగున ఉందని.. కొత్త రహదారులు ఏర్పాటైతే దక్షిణాదిలోనే అగ్రగామి అవుతుందని చెప్పారు. రోడ్లన్నింటికీ మహార్దశ రాష్ట్రంలో ప్రస్తుతమున్న జాతీయ రహదారులను నాలుగు లేన్లు (ఫోర్ లేన్)గా విస్తరించేందుకు కేంద్రం మరో రూ.8 వేల కోట్లను మంజూరు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం రూ.2,690 కోట్ల విలువైన ప్రాజెక్టులను.. రాష్ట్రంలోని ఇతర రోడ్ల అభివృద్ధి కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి రూ.1,020 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం రూ.1,590 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం అంగీకరించిందని కేసీఆర్ తెలిపారు. గోదావరి నది తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక నుంచి కాళేశ్వరం దాకా, ప్రాణహిత నది వెంట కాళేశ్వరం నుంచి కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల దాకా రోడ్ల ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఇక హైదరాబాద్ చుట్టూ మరో రింగ్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపగా... 338 కిలోమీటర్ల మేర అతి పొడవైన రీజనల్ రింగ్‌రోడ్డును జాతీయ రహదారుల ప్రమాణాలతో నిర్మించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలపై విశాల దృక్పథంతో స్పందించి.. రహదారులు, నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ అధికారులను కేసీఆర్ అభినందించారు. సీఎం చెప్పిన కొత్త జాతీయ రహదారులివే.. రహదారి దూరం (కి.మీలలో) హైదరాబాద్–మెదక్–రుద్రూరు–బోధన్–బాసర–భైంసా 248 నిజాంపేట–నారాయణఖేడ్–బీదర్ 60 మద్దునూర్–బోధన్–నిజామాబాద్ 76 హైదరాబాద్–మొయినాబాద్–చేవెళ్ల–మన్నెగూడ–కొడంగల్–కర్ణాటక 135 కోదాడ–మిర్యాలగూడ–దేవరకొండ–కల్వకుర్తి–జడ్చర్ల 211 కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం 165 సిరిసిల్ల–సిద్ధిపేట–జనగామ–అర్వపల్లి–సూర్యాపేట 184 మంచిర్యాల–చంద్రాపూర్ వయా ఆసిఫాబాద్, రెబ్బన 90 నిర్మల్–మామడ–ఖానాపూర్–మల్లాపురం–రాయికల్ 90 సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావుపేట–రాజమండ్రి 177 సారపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌటాల–సిర్పూర్ 396 మిర్యాలగూడ–పిడుగురాళ్ల–నర్సరావుపేట 26 భద్రాచలం–జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం–దేవరపల్లి 68 జహీరాబాద్–బీదర్–దెగ్లూర్ 25 సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగ్దేవ్పూర్–భువనగిరి–చౌటుప్పల్ 152 చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం–ఆమనగల్–షాద్‌నగర్–చేవెళ్ల–శంకర్పల్లి–కంది 186 మెదక్–సిద్ధిపేట–ఎల్కతుర్తి 133 హైదరాబాద్ (ఓఆర్ఆర్)–ఘట్కేసర్–ఏదులాబాద్–వలిగొండ–తొర్రూరు– నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెం 234 వరంగల్–ఖమ్మం 120 మొత్తం 2,776 ================================================================ నాలుగు లేన్లుగా మార్చే జాతీయ రహదారులు రహదారి వ్యయం (కోట్లలో) సంగారెడ్డి–నాందేడ్ 2,500 సూర్యాపేట–ఖమ్మం 1,000 జగిత్యాల–కరీంనగర్–వరంగల్ 2,300 మంచిర్యాల–చంద్రాపూర్ 1,500 కోదాడ–ఖమ్మం 700 మొత్తం 8,000 -
నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూలు
-
తెలంగాణ జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
-
దేశంలో 40 శాతం రోడ్లు అవేనట!
న్యూఢిల్లీ : పల్లె అయినా, పట్టణమైనా అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ముందు రోడ్లు బాగుండాలి. కానీ దేశ ఆర్థికవ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న రహదారుల అభివృద్ధి అరకొరగానే సాగిందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు అనుసంధానమయ్యే జాతీయ రహదారుల్లో 78శాతం ఒకటి లేదా రెండు వరుసల బాటలేనట. మరో విచారకర విషయమేమిటంటే 40శాతం గ్రామ రహదారులు, జిల్లాలను అనుసంధానించే రోడ్లు, రాష్ట్ర రహదారులు మట్టితో వేసినవేనని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల్లో వెల్లడైంది. అంటే గ్రామీణప్రాంతాల్లో రోడ్ల రవాణా వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తున్నట్లు రిపోర్టులో తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్న నాలుగు లైన్ల రహదారుల అభివృద్ధి ప్రయత్నాలు దేశ ఆర్థికవ్యవస్థకు సవాలుగా నిలుస్తున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. మారుమూల ప్రదేశాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే, వచ్చే ఏళ్లలో ఉద్యోగవకాశాలు పుష్కలంగా కల్పించవచ్చని ఆశిస్తున్నట్టు రిపోర్టు తెలిపింది. ఇంకా 14 లక్షల కిలోమీటర్ల పైగా రహదారులను విస్తరించాల్సి ఉండగా.. వాటిలో 11.5 లక్షల కిలోమీటర్ల రోడ్లు గ్రామీణ, ప్రాజెక్టు రోడ్లేనని రిపోర్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించాల్సిన బాధ్యత పంచాయతీలకు, జిల్లా పరిషత్తులకు ఉంటుందని, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కూడా గ్రామాల్లో రోడ్లను నిర్మస్తారు. ప్రాజెక్టు రోడ్లకు ఫారెస్ట్, ఇరిగేషన్, ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ ఇతరాత్ర డిపార్ట్మెంట్లు బాధ్యత వహిస్తుంటాయని రిపోర్టు తెలిపింది. మట్టి రోడ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అసోం(2.67 లక్షల కిలోమీటర్లతో) మొదటిస్థానంలో ఉండగా దాని తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. ఎక్కువ పట్టణ రోడ్ల వ్యవస్థ కలిగిన ప్రాంతంగా నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీలో కూడా 8,700 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్లు విస్తరించి ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది. రోడ్ల వ్యవస్థను మెరుగుపరిస్తే దేశ ఆర్థికవ్యవస్థలో బహుళ ప్రయోజనాలుంటాయని, భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించవచ్చని రోడ్డు రహదారుల మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు భారత్‌లో ఉద్యోగవకాశాలు భారీగా కనుమరుగవుతాయని అంచనాల నేపథ్యంలో రోడ్ల అభివృద్ధి చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవలే రోడ్లు రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కూడా జాతీయ రహదారులను 1.05 లక్షల కిలోమీటర్ల నుంచి 1.40 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఆమోదించినట్టు అధికారులు తెలిపారు. -
మరో 30యేళ్ల పాటు టోల్ ట్యాక్స్ బాదుడు?
న్యూఢిల్లీ: దేశంలో టోల్‌టాక్స్‌ల పేరుతో సాగుతున్న వసూళ్ల పరంపర మరో ముప్పై సంవత్సరాలు కొనసాగునుందట. నేషనల్ హైవేలపై వసూలు చేసే టోల్ ట్యాక్స్ ను మరో 30 ఏళ్ల పాటు వసూలు చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టుచేసింది. ప్రధానంగా భారత్ మాలా పథకంలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టులకవసరమైన నిధుల కోసం రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రతిపాదించనుంది. ప్రజా నిధులతో సుమారు 75 జాతీయ రహదారులు ప్రాజెక్టుల నిర్మాణం కోసం యత్నిస్తున్న మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రతిపాదనకు త్వరలోనే కేంద్ర క్యాబినేట్ ఆమోదం కూడా లభించనుంది. 25 నుంచి30 సం.రాలపాటు ప్రయివేటు నిర్వాహకులకు ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతలను అప్పగించనుంది. దీనికి ఆమోద ముద్ర పడితే సుమారు ఎనభైవేల కోట్ల రూపాయల ఆదాయాన్నిఆర్జించవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ) మోడల్ కింద కొన్న ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించింది. గత రెండేళ్లుగా అమల్లో ఉన్నదీనిద్వారా ప్రభుత్వానికి రూ.2700కోట్ల వార్షికఆదాయం సమకూరుతోంది.పటిష్టమైన రహదారులు నిర్వహణ మరింత సమర్థవంతంగా భరోసా, తక్షణ వనరుల కల్పన కోసం ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మరోవైపు దాదాపు50వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఏడులక్షల కోట్లను వెచ్చించనున్నట్టు ప్రభుత్వం గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టోల్‌టాక్స్ వసూళ్లతో దేశంలో వాహనంతో రోడ్డుమీదికి రావాలంటే గుండె దడ పుడుతోందన్న విమర్శలు చెలరేగాయి. ప్రయాణానికి వాహనానికి అవసరమైన ఇంధనానికయ్యే ఖర్చు కన్నా, టోల్‌టాక్స్‌ల భారం తడిసిమోపెడు అవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ మాఫియా దోపిడీ ఎక్కువైందని ప్రజల నుంచి మొదలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులదాకా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
దారి చూపుతున్న దార్శనికత
- రోడ్ నెట్‌వర్క్‌లో తెలంగాణను దేశంలోనే ఉన్నతంగా నిలిపేలా ప్రభుత్వ ప్రణాళికలు - రూ.11 వేల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారీగా పెట్టుబడులు రావాలి.. పరిశ్రమల ఏర్పాటుకు మంచి రహదారులు ఉండాలి.. అందుకే కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రాధాన్యం ఇచ్చిన అంశాల్లో రహదారులూ ఒకటి! ఐదేళ్ల కాలంలో రోడ్ నెట్‌వర్క్‌లో తె లంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.11 వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం, పాత రహదారులు అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళికకు కార్యరూపం ఇచ్చింది. పాత విధానాలకు చెల్లు.. రోడ్ల నిర్మాణంలో పాత విధానాలకు చరమగీతం పాడుతూ సీఎం కేసీఆర్.. సాహసోపేత ముందడుగు వేశారు. దేశం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే రహదారులు ఉన్నతంగా ఉండాలని రెండు దశాబ్దాల క్రితమే గుర్తించిన చైనా ప్రభుత్వం నలుదిశలా విశాలమైన దారులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది. అందుకు దాదాపు రెండు జాతీయ బడ్జెట్లలో సింహభాగం నిధులను కేటాయించింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. సాధారణంగా పాత రోడ్లను మెరుగుపరచటంతోపాటు దశలవారీగా కొత్త రోడ్లను నిర్మించడం.. ఇప్పటివరకు జరుగుతోంది. కానీ ఇలా కాదని.. ఒకేసారి రాష్ట్రం మొత్తం విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి. సింగిల్ రోడ్లు రెండు వరుసలుగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ రోడ్లను రెండు వరుసలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3,016 కిలోమీటర్ల రోడ్లను రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తోంది. అందుకు రూ.3,953 కోట్లు కేటాయించింది. మొత్తం 258 పనులుగా వీటిని కొనసాగిస్తోంది. ఇందులో ఇప్పటికే 1,543 కిలోమీటర్ల నిడివితో 158 పనులను రూ.1,987 కోట్లతో చేపట్టింది. ఇందులో 97 కి.మీ. నిడివి గల 19 పనులు పూర్తయ్యాయి. మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లు ప్రస్తుతం చాలా మండల కేంద్రాల్లో సరైన రోడ్లు లేవు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. అన్ని మండల కేంద్రాల్లో రెండు వరుసల రోడ్లు ఉండాలని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వాటిని అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 1,970 కిలోమీటర్ల నిడివితో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు రూ.2,571 కోట్లు కేటాయించారు. వంతెనలే వంతెనలు నదులైనా, వాగులైనా వంతెనలుంటేనే రవాణా సాగుతుంది. ఎప్పుడో నిర్మించి శిథిలమై ఎప్పుడు కూలుతాయో తెలియని వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించటంతోపాటు వంతెనలు లేనిచోట కొత్తవి నిర్మించాలని సీఎం ఆదేశించారు. దీంతో సర్వే చేసిన రోడ్లు భవనాల శాఖ అధికారులు 358 వంతెనలు అవసరమని లెక్క తేల్చటంతో ప్రభుత్వం వాటికోసం రూ.1,718 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రస్తుతం రూ.942 కోట్లతో 208 వంతెనల పనులు చేపట్టారు. ఇప్పటికి 10 వంతెనలు సిద్ధమయ్యాయి. ఈ మూడు రకాల పనులతోపాటు కేంద్రం ఇచ్చిన రూ.615 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో 58 పనులు చేపట్టింది ప్రభుత్వం. రూ.387 కోట్ల నాబార్డు నిధులతో 429 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా 1,950 కి.మీ. జాతీయ రహదారులు జాతీయ రహదారుల విషయంలో ఇప్పటి వరకు తెలంగాణపై చిన్నచూపు చూస్తున్న కేంద్రాన్ని ఒప్పించటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నది సాధించారు. జాతీయ రహదారుల విషయంలో పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడిన తెలంగాణను గౌరవప్రదమైన స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషి ఫలించింది. తెలంగాణకు కొత్తగా దాదాపు 1,950 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. వీటికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వం అనుకున్నట్టు పనులు సాగితే.. ► కేవలం 3 గంటల్లో హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకోవచ్చు ► హైదరాబాద్ నుంచి ఏ జిల్లా కేంద్రానికైనా గరిష్టంగా 2 గంటల్లో చేరుకోవచ్చు ► ఊపు ఇలాగే సాగితే మూడేళ్లలో రాష్ట్ర పురోగతి గుజరాత్‌ను మించే అవకాశం ఉంటుంది జాతీయ రహదారులుగా మారే రాష్ట్ర రహదారులివే... ► హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్స్వాడ-బోధన్, బాసర-భైంసా-జాతీయ రహదారి 61 (పాత జాతీయ రహదారి 222)తో అనుసంధానం. - నిడివి: 230 కిలోమీటర్లు ► హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడ-కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు. - నిడివి:133 కిలోమీటర్లు ► కోదాడ- మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల - నిడివి: 220 కిలోమీటర్లు ► నిర్మల్ నుంచి జగిత్యాల వరకు, వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ నుంచి ఎన్‌హెచ్ 61, ఎన్‌హెచ్63లతో అనుసంధానం. - నిడివి:110 కిలోమీటర్లు ► అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట. -నిడివి: 160 కిలోమీటర్లు ► కరీంనగర్ నుంచి సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు - నిడివి: 165 కిలోమీటర్లు ► ఖమ్మం జిల్లా సారపాక నుంచి వరంగల్ జిల్లా ఏటూరునాగారం మీదుగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మీదుగా సిర్పూర్కాగజ్ నగర్‌కు సమీపం వరకు అభివృద్ది. -నిడివి: 475 కిలోమీటర్లు ► హైదరాబాద్-మెదక్-బోధన్ (175 కి.మీ.) ►సారపాక-మణుగూరు-ఏటూరు నాగారం రహదారి (104 కి.మీ.) ► కరీంనగర్ జిల్లా సిరిసిల్ల-సిద్దిపేట-జనగామ-సూర్యాపేట మార్గంలో సూర్యాపేట నుంచి అవరపల్లి వరకు రహదారి (33 కి.మీ.) -
108.. ఎప్పుడూ లేట్
అక్టోబర్ 30న సుగ్లాంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌కు చెందిన సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 108కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ అదే రాత్రి మరణించాడు. కమాన్‌పూర్ మండలం కన్నాల పరిధి పాతలంబాడి తండాకు చెందిన లావుడ్య బద్యానాయక్(65) నెల రోజుల క్రితం బసంత్‌నగర్ టోల్గేట్ సమీపంలో రోడ్డుపై పల్సర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు టోల్గేట్ అంబులెన్స్‌ను తాత్కాలికంగా పెట్రోలింగ్ వాహనంగా మార్చుకుని సిబ్బంది సుల్తానాబాద్ సమీపంలో ఉన్నారు. బసంత్‌నగర్ బస్‌స్టాప్‌లో ఉండే 108 కూడా అందుబాటులో లేదు. దీంతో ఓ ట్రాలీలో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఇవీ... జిల్లాలో రోడ్డు ప్రమాదాలఅనంతరం పరిణామాలు. క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి గట్టెక్కించే 108 అంబులెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం... అందుబాటులో అత్యవసర వైద్యచికిత్స అందించే ఆసుపత్రులు లేకపోవడం... సకాలంలో వైద్యం అందక ఏటా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. * రహదారులపై రక్తపుటేరులు * అత్యవసరాల్లో ఆదుకోని అంబులెన్సలు * క్షతగాత్రుల తరలింపులో జాప్యం * గాల్లో కలుస్తున్న ప్రాణాలు కరీంనగర్ సిటీ : జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు నాలుగున్నాయి. ఈ రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. శనిగరం నుంచి జిల్లాలోకి ప్రవేశించే రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగితే తప్పనిసరిగా కరీంనగర్‌కు తీసుకురావాల్సిందే. గంట ప్రయాణం చేస్తే తప్ప క్షతగాత్రుడికి వైద్య సహాయం అందించలేరు. ఈలోగా బాధితుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. హుజూరాబాద్ నుంచి వరంగల్ రూట్లో ప్రమాదాలు జరిగితే, వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుంటారు. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ మార్గమధ్యంలో ప్రమాద బాధితులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సిందే. కరీంనగర్ నుంచి రాయపట్నం రూట్లో ప్రమాదం జరిగితే కరీంనగర్ ఆసుపత్రే దిక్కు. కోరుట్ల, మెట్పల్లి ఏరియా ఆసుపత్రులున్నా, అత్యవసర వైద్య సేవలు అక్కడ అంతంతమాత్రమే. ఇక కరీంనగర్, జగిత్యాల రహదారిలో ఎక్కడ ప్రమా దం జరిగినా కరీంనగర్‌కు రావాల్సిందే. అత్యవసర చి కిత్స అందించే వైద్యులు ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండకపోవడంతో తప్పనిసరిగా జిల్లా కేం ద్రానికే తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీం తో అత్యవసర పరిస్థితుల్లో నూ గంటల తరబడి ప్రయాణం చే యాల్సి రావడంతో బాధితుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండాపోతోంది. 108లు కూడా ఎ ప్పుడు అందుబాటులో ఉంటా యో తెలియని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఐదు నిమిషాల ప్రయాణ దూరం ఉండే ఎల్ఎండీలో రోడ్డు ప్రమాదం జరిగితేనే 108 దిక్కులేక పోవడం, జిల్లా లో ఆంబులెన్స్ సేవల దుస్థితిని తెలియజేస్తోంది. జిల్లాలో రేణికుంట, బసంత్‌నగర్ వద్ద టోల్‌గేట్లున్నాయి. ఈ రెండు చోట్ల విధిగా అంబులెన్స్ ఉండాలి. ఉన్నాయి కూడా... కానీ, అవసరానికి మాత్రం అందుబాటులో ఉండవనే విమర్శలున్నాయి. బసంత్‌నగర్ టోల్గేట్ వద్ద ప్రమాదం జరిగితే అంబులెన్స్ లేకపోవడంతో ఆటోలో తరలిస్తుండగా బద్యానాయక్ అనే క్షతగాత్రుడు మరణించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. 30 కిలోమీటర్లకు ఒక 108 ఉన్నా.. నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ప్రధాన కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లున్నాయి. జిల్లాలో 108 అంబులెన్స్‌లు 32 ఉండగా, అందులో ఫిట్నెస్లేనివి 25. సకాలంలో మరమ్మతు చేయించక కండీషన్ తప్పుతున్నాయి. గతంలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్క ట్యాబ్లెట్ కూడా పనిచేయడం లేదు. ఆక్సీజన్ లీకేజీలు, వెంటిలేటర్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. చివరకు అంబులెన్స్ డీజిల్ ట్యాంకులకు మూతలు లేకపోవడంతో, మక్కజొన్న, క్లాత్‌లు చుట్టిపెట్టి నెట్టుకొస్తున్నారు. అర్జంట్ అవసరాల్లో 108కు ఫోన్‌కాల్స్ వస్తే... అదే సమయంలో చాలా వరకు అంబులెన్స్‌లు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఐఎఫ్‌టీ కేసులను ట్రాన్స్‌పోర్టు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సకాలంలో సేవలందక క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాజీవ్ రహదారి వెంట 108 సర్వీసులు ఉన్నా... ఆపద సమయంలో ఆదుకునేందుకు రావనే భావన ప్రజల్లో ఉంది. 108, హైవే అంబులెన్స్ అందుబాటులో లేక.. సమయానికి ఆసుపత్రులకు చేరక 2015 జనవరి నుంచి ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు. 108 సర్వీసులను పెంచడం, ఉన్న అంబులెన్సులను సక్రమంగా వినియోగించడం, అత్యవసర సేవలకు ప్రాధాన్యతనివ్వడం, సరిపడా వైద్యులను నియమించడం, ఏరియా ఆసుపత్రులను మెరుగుపరిస్తే తప్ప క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. ప్రమాణాలకు విరుద్ధంగా రహదారుల నిర్మాణం జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులున్నా, సరైన ప్రమాణాలతో నిర్మించలేదనే ఆరోపణలున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల, జాతీయ రహదారుల నిర్మాణంలో మూ లమలుపులు (కర్వ్స్) తొలగి స్తారు. కానీ, జిల్లాలో నిర్మించిన రహదారులను ఉన్నది ఉన్నట్లుగా కేవలం విస్తరించారే తప్ప మూలమలుపులు సరిచేసే ప్రయత్నం చేయలేదు. దీంతో మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేడిపల్లి వద్ద వాహనాలు గమనించుకోకపోవడంతో తూఫాన్ వాహనం, లారీ ఢీకొట్టిన సంఘటనలో భూపాల్పల్లికి చెందిన తొమ్మిది మంది అసువులు బాశారు. ధర్మపురి మండలం ఖమ్మర్‌ఖాన్‌పేట క్రాస్‌రోడ్ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ గతంలో ఆటో, లారీ ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు చనిపోయారు. మూలమలుపు వద్ద రోడ్డు కనిపించకపోవడంతో లారీ చెట్టును ఢీకొని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. కొలిమికుంట మూలమలుపు వద్దా అదే పరిస్థితి. ఇటీవల నవ దంపతులు దుర్మరణం చెందింది అక్కడే. వెదిర వద్ద రెండు బ్రిడ్జీలు ఉండడంతో... ఎటువెళ్లాలో తికమకకు గురై, నేరుగా బ్రిడ్జిని ఢీ కొడుతున్న సంఘటనలు అక్కడ సర్వసాధారణం. 2015లో ప్రమాదాలు 1573 మృతులు 610 క్షతగాత్రులు 1802 2016 (ఇప్పటివరకు) 220 మృతులు 80 జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారుల వివరాలు.. ♦ సికింద్రాబాద్-కరీంనగర్- రామగుండం (ఎస్‌హెచ్ 1 - రాజీవ్ రహదారి) : జిల్లాలో శనిగరం నుంచి రామగుండం వరకు 115 కిలోమీటర్లు ♦ వరంగల్-కరీంనగర్-రాయపట్నం (ఎస్‌హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి రాయపట్నం వరకు 120 కిలోమీటర్ల మేర ఉంది. ♦ వరంగల్-కరీంనగర్-జగిత్యాల (ఎన్‌హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు 120 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ♦ మెట్పల్లి-జగిత్యాల-రాయపట్నం (ఎస్‌హెచ్): జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గండిహన్మాన్ నుంచి జగిత్యాల, ధర్మపురి మీదుగా రాయపట్నం వరకు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. డేంజర్ జోన్స్ ⇒ మెట్పల్లి శివారులోని ఆరెపేట, మేడిపల్లి ⇒ చొప్పదండి మండలం ఆర్నకొండ శివారు మూలమలుపు, ఖమ్మర్ఖాన్పేట్ ఎక్స్ రోడ్, కొలిమికుంట శివారులోని మూలమలుపు. ⇒ దేశ్రాజ్పల్లి సమీపంలోని కెనాల్ మలుపు, వెదిర బ్రిడ్జి, కురిక్యాల మలుపు, గంగాధర దాటగానే ఉన్న మలుపు, నమిలికొండ, కొం డగట్టు నుంచి మల్యాల క్రాస్‌రోడ్ వరకు. ⇒ సుగ్లాంపల్లి, నారాయణపూర్ క్రాస్‌రోడ్, అందుగులపల్లి, రామగుండం క్రాస్‌రోడ్. ⇒ మానకొండూరు మండలం సదాశివపల్లి, గట్టుదుద్దెనపల్లి, ఈదులగట్టెపల్లి బ్రిడ్జి, కొత్తగట్టు. 108 అందుబాటులో ఉండే ప్రాంతాలు రాజీవ్ రహదారి : బెజ్జెంకి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్‌నగర్, రామగుండం. వరంగల్-రాయపట్నం రహదారి : హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, వెల్గటూరు. కరీంనగర్-జగిత్యాల రహదారి : కరీంనగర్, గంగాధర, మల్యాల, జగిత్యాల. మెట్పల్లి నుంచి రాయపట్నం : మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి. -
రాష్ట్రంలో 50 వేల కోట్లతో జాతీయ రహదారులు: గడ్కరీ
సాక్షి,విజయవాడ: రాష్ర్టం ప్రభుత్వం భూసేకరణ చేసి, సమగ్రమైన నివేదిక (డీపీఆర్)తో ముందుకొస్తే, రాష్ట్రంలో రూ.50,560 కోట్ల వ్యయంతో 3092 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారుల శాఖ రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖల సమ్వనయంతో విజయవాడ సమీపంలో 447.88 కోట్లతో దుర్గగుడి వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, 5.122 కి.మీ నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి చండ్రగూడెం వరకు గల ఎన్‌హెచ్ 30ని రెండు లైన్లతో పునః నిర్మాణం, కత్తిపూడి నుంచి కాకినాడ బైపాస్ సెక్షన్ వరకు 26.15 కి.మీ. ఎన్.హెచ్ 216ను నాలుగు లైన్ల పునః నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్‌కు, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గతంలో రోజుకు రెండు కి.మీ మాత్రమే జాతీయ రహదారులు నిర్మాణం జరిగేదని ప్రస్తుతం 18 కి.మీ చొప్పున నిర్మిస్తున్నామని, వచ్చే మార్చినాటికి 30 కి.మీ చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విజయవాడ చుట్టూ 150 నుంచి 200 కి.మీ వేగంతో వెళ్లేందుకు వీలుగా 180 కి.మీ 8 లైన్ల అవుటర్ రింగ్ రోడ్డును రూ.20 వేల కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో తాము ముంబాయి నుంచి పూనేకు ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించడం వల్ల 9 గంటల్లో వెళ్లే ప్రయాణం గంటన్నరలోగా వెళ్లిపోతున్నారని వివరించారు. విజయవాడలో జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ నెల 19 న ఎయిమ్స్‌కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ త్వరలోనే భూసేకరణ చేసి, బ్లూప్రింట్తో వస్తామని నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన రాష్ర్టం ఇక బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో శక్తివంతమైన రాష్ట్రంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలను కేంద్ర మంజూరు చేసిందని ఈ నెల 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అధ్యక్షత వహించగా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. -
టోల్ వసూళ్లకు బ్రేక్
న్యూఢిల్లీ: తమిళనాడులోని జాతీయ రహదారులన్నింటిపై ప్రవేశ రుసుము(టోల్ ఛార్జీలు) వసూలుకు ప్రస్తుతానికి విరామాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. తమిళనాడులో భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితులు దయనీయంగా మారిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 11 వరకు తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ పన్ను వసూలును తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే అమల్లోకి వచ్చాయి. -
త్వరలో కొత్త జాతీయ రహదారులు
1,018 కి.మీ. రోడ్లకు కేంద్ర మంత్రి హామీ * గడ్కారీని కలసిన మంత్రి తుమ్మల, ఎంపీల బృందం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలో కొత్తగా 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. గత 50 ఏళ్లలో రాని రహదారులను 5 ఏళ్లలో ఇస్తామని భరోసా ఇచ్చారు. రహదారుల గురించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్, మరికొందరు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో కేంద్ర మంత్రి గడ్కారీని కలసి వినతి పత్రాన్ని అందచేసింది. భేటీ అనంతరం మంత్రి తుమ్మల, ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల సమస్యను, వామపక్షతీవ్రవాద ప్రాబల్యప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్ల నిర్మాణాల అంశాలను గడ్కరీ దృష్టికి తెచ్చామన్నారు. డ్రైపోర్టులు, జలరవాణా మార్గాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న 1,018 కి.మీలలో 220 కి.మీ కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి చెప్పారు. కాగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలు, ప్రాజెక్టులన్నిటినీ తెలంగాణకు వర్తింప చేయాలని మంత్రి తుమ్మల.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు. అశోక గజపతిరాజుతో తుమ్మల భేటీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖ స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రతిపాదనలు, కొత్తగూడెం, వరంగల్‌లో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇచ్చే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దానిని పౌరవిమానాశ్రయంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. -
మళ్లీ హైజాక్ ముఠా!
- రహదారుల్లో డ్రైవర్లను మట్టుపెట్టే గ్యాంగ్ - ఇటీవల కొందరు జైలు నుంచి విడుదల పలమనేరు : జాతీయ రహదారుల్లో లారీలను హైజాక్ చేసి డ్రైవర్లను అత్యంత క్రూరంగా మట్టుపెట్టే గ్యాంగ్ మళ్లీ జిల్లాలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గతంలో లారీ ైెహ జాక్‌లకు పాల్పడే నరహంతక ముఠాలోని కీలక సభ్యులు ప్రస్తుతం పలు జైళ్లలో ఉన్నారు. కొందరు ఆరునెలల క్రితం విడుదలయ్యారు. వీరు కొత్త గ్యాంగ్‌లా ఏర్పడి మళ్లీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం తమిళనాడులోని శూలగిరిలో లారీని హైజాక్ చేసి తీసుకెళ్లి ఇద్దరు డ్రైవర్లను హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో పలమనేరుతో ప్రమేయమున్న ఈ నర హంతకుల విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ గ్యాంగ్ 12 మందికి పైగా డ్రైవర్లను హత్యచేసి పలు లారీలను దోచుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్తులు: లారీల హైజాక్ గ్యాంగ్‌లో సుమారు 18 మంది సభ్యులున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు. మిగిలిన వారు కర్ణాటక, తమిళనాడులకు చెందిన వారు. వీరిలో ముఖ్యమైన వ్యక్తి గుండుగల్లు శ్రీరాములు (58). ఇతనిపై మూడు రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. ఈ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన కాపర్ లారీలనే టార్గెట్ చేసి ఆ డ్రైవర్లను హత్య చేసి లారీలు, సరుకును తీసుకెళ్తుంది. ఇప్పటికే 12 మందికి పైగా డ్రైవర్ల హతం: ఈ ముఠా తమిళనాడు, కర్ణాటకతో పాటు మన జిల్లాలోని ములకలచెరువు, పీటీఎం, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. ప్రయాణికుల్లా లారీలు ఎక్కడం, అటవీ ప్రాంతం రాగానే డ్రైవర్ల మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి చంపడం లేదా పదునైన కత్తులతో నరకడం చేస్తుంటారు. గతంలో జరిగిన హత్యలన్నీ ఇదే రీతిలో జరిగాయి. హత్య చేసి మృతదేహాలను అటవీప్రాంతాల్లో పూడ్చిపెడుతుంటారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలతో ఈ ముఠా ప్రస్తావన మళ్లీ వినిపిస్తోంది. -
ఏపీకి సై... తెలంగాణకు నై!
* జాతీయ రహదారుల మంజూరులో కేంద్ర మంత్రి గడ్కారీ మాయాజాలం * ఏపీకి 707 కి.మీ. మేర నాలుగు రోడ్లకు ఎన్‌హెచ్ హోదా * వెయ్యి కి.మీ. తెలంగాణ ప్రతిపాదనలు బుట్టదాఖలు * తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ రహదారుల మంజూరులో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలంగాణకు మొండిచేయి చూపారు. జాతీయ రహదారుల విస్తీర్ణంలో వెనకబడ్డ తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో విస్మరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 707 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా కల్పించేందుకు అనుమతించారు. వెయ్యి కి.మీ. మేర రోడ్లకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దీనికి గడ్కా రీ సానుకూలత వ్యక్తం చేసినా ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీనిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ వద్ద తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఢిల్లీ వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గడ్కారీ అపాయింట్మెంట్ కోసం ఆయన కార్యాలయానికి తుమ్మల అత్యవసరంగా లేఖ రాశారు. మరో 2, 3 రోజుల్లో ఆయన గడ్కారీతో భేటీ కానున్నారు. -
జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఠాణాలు!
పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ జిల్లా ఎంపిక నల్లగొండ: జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మృత్యుమార్గాలుగా మారిన జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణతో పాటు నిషేధిత పదార్థాల రవాణా జరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ంది. నల్లగొండమీదుగా హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్-65), హైదరాబాద్-వరంగల్(ఎన్‌హెచ్-163) జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటిపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ చొప్పున ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా జిల్లా పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్‌హెచ్-65పై ఆరు, ఎన్‌హెచ్-163పై రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటవుతాయని అంచనా. నల్లగొండ నుంచి 200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వెళుతున్నాయి. చౌటుప్పల్ మండలం కొత్తగూడెం నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 153 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. మరోవైపు హైదరాబాద్-వరంగల్ మార్గంలో బీబీనగర్ నుంచి ఆలేరు వరకు 55 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది. ఇవి తరచూ ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ ఠాణా.. ఓ భరోసా నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయరహదారులపై ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా చాలా రకాలుగా మేలు జరుగుతుందని స్థానిక పోలీసులంటున్నారు. ప్రమాదాలను నివారించడమే కాకుండా ప్రమాదాలకు గురయ్యే బాధితులకు సత్వర సాయం అం దుతుందని చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే జాతీయ రహదారులను తనిఖీ చేయడం, నిషేధిత పదార్థా లు, అక్రమ మద్యం, దొంగ రేషన్ బియ్యం, ఇసుక లాంటి వనరుల అక్రమరవాణా కూడా అరికట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు. -
4 లేన్లుగా కొత్త జాతీయ రహదారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులను ఒకేసారి నాలుగు లేన్లుగా నిర్మించనున్నట్టు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీకి ఈ మేరకు విన్నవించగా సానుకూలంగా స్పందించాన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 1,018 కిలోమీటర్ల నిడివి ఉన్న 6 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు 15 రోజుల్లో అనుమతి రానుందని గురువారం సచివాలయంలో వెల్లడించారు. కేంద్రం దారిలోనే రాష్ట్ర పరిధిలో కూడా వీలున్న చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తామన్నారు. అవసరమైన సిమెంటును రాయితీ ధరకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.‘‘జడ్చర్ల-రాయచూర్ రోడ్డును 4 లే న్లుగా మార్చేందుకు, జగిత్యాల-వరంగల్ జాతీయ రహదారిని ఖమ్మం దాకా పొడగించేందుకు గడ్కరీ అనుమతించారు. శంషాబాద్-నాగ్‌పూర్ రోడ్లపై కట్టడాలను తొలగించి విస్తరించేందుకూ సరేనన్నారు. ఖమ్మం మాదిరిగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కూడా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గుర్తించి, రూ.2,000 కోట్లతో ప్రత్యేక రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చాం. తెలంగాణకు 2 డ్రై పోర్టులు కేటాయించేందుకూ సుముఖత వ్యక్తం చేశారు. వీటి ఎంపికకు అధ్యయన బాధ్యతను ప్రైవేటు సంస్థలకు సీఎం అప్పగించారు’’ అని చెప్పారు. కొత్త సచివాలయ భవనం డిజైన్ రూపకలప్పన బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించామన్నారు. గోదావరిని జలరవాణాకు కేంద్రం ఎంపిక చేయనుందని, బాసర నుంచి చెన్నై దాకా సరుకు రవాణామార్గంగా అభివృద్ధి చేస్తారని వివరించారు. -
'ఇలాంటి నష్టం భవిష్యత్‌లో ఏ వ్యక్తికి రాకూడదు'
హైదరాబాద్ : జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డివైడర్లు, ఎన్హెచ్లను ఆనుకుని ఉన్న దారులను ప్రక్షాళన చేయాలన్నారు. జాతీయ రహదారుల వ్యవస్థ సరిగా లేకుంటే మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. హరికృష్ణ కుటుంబానికి శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి నష్టం భవిష్యత్తులో ఏ వ్యక్తికీ రాకూడదని ఆయన అన్నారు. కాగా నల్గొండ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
రహదారులకు రూ.13 000 కోట్లివ్వండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 46,440 కిలోమీటర్ల మేజర్ రహదారులను ప్రధాన రోడ్లకు అనుసంధానిస్తూ జాతీయ రహదారులకు కలిపేలా ప్రణాళికలు తయూరు చేశారు. రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులకు రహదారులను అనుసంధానించి కారిడార్లుగా వినియోగించుకునేలా అంచనాలు రూపొందించారు. వైఎస్సార్ జిల్లా, కర్నూ లు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి నూతన రాజధాని విజయవాడకు రోడ్డు వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రతిపాదనల్లో సింహభాగం స్థానం కల్పించినట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. 600 కి.మీ. జాతీయ రహదారులుగా మార్చండి రాష్ట్రంలో 4,302 కి.మీ. మేర జాతీయ రహదారులున్నాయి. ప్రధానంగా ఓడరేవుల నుంచి జాతీయ రహదారుల వరకు రోడ్డును అనుసంధానిస్తూ జాతీయ రహదారులుగా మార్చాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 600 కి.మీ. మేర రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చాలని ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ప్రతిపాదనలు అందచేశారు. -
80% భూమి సేకరించాకే హైవే ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో కనీసం 80 శాతాన్ని సేకరించకుండా ఆయా ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోమని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 10 శాతం భూమిని కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టారనీ, రహదారుల రంగంలో నెలకొన్న సమస్యలకు ఇదే కారణమనీ విమర్శించారు. వచ్చే 5-10 ఏళ్లలో బిడ్డింగ్ నిర్వహించడానికి 300 ప్రాజెక్టులను అన్ని అనుమతులతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి మందగించడానికి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయకపోవడమే కారణమని గుర్తించినట్లు చెప్పారు. మౌలిక సౌకర్యాలు, వ్యాపారాల్లో సమయమే అత్యంత కీలకమైనదనీ, ఫైళ్లు మూడు నుంచి ఆరునెలల పాటు పెండింగులో ఉంటున్నాయనీ చెప్పారు. ఇలాంటి జాప్యాల కారణంగా దేశంపై రోజుకు రూ.15 కోట్ల భారం పడుతోందన్నారు. రైల్వేల నుంచి అనుమతులు లేకపోవడంతో 300కు పైగా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పెండింగులో ఉందన్నారు. మౌలికం వృద్ధికి పటిష్ట పీపీపీ నమూనా మౌలిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక కార్యదర్శి అరవింద్ మయారామ్ సదస్సులో పేర్కొన్నారు. ఈ దిశలో పటిష్టవంతమైన, సంక్లిష్టతలకు తావులేని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధాన నమూనాకు రూపకల్పన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. -
రూ. 30 వేల వరకు చికిత్స ఫ్రీ!
జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు సాయం.. ప్రస్తుతం గుర్గావ్-జైపూర్ మార్గంలో అమలు.. త్వరలో రెండు మార్గాల్లో.. ఆపై దేశమంతటా! న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల బాధితులకు రూ.30 వేల వరకు ఉచిత చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని దశలవారీగా దేశమంతా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 226 కిలోమీటర్ల గుర్గావ్-జైపూర్ జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలకు అమలు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రమాద బాధితులకు రూ.30,000 వరకు చికిత్స ఖర్చు తాము భరిస్తున్నామని, దానికి పైన అయ్యే ఖర్చు బాధితులు లేదా వారి బంధువులే భరించాలని రహదారి శాఖ కార్యదర్శి విజయ్ చిబ్బర్ తెలిపారు. ఇప్పుడు దాన్ని ముంబై-బరోడా, రాంచీ-జంషెడ్పూర్ రహదారులపై కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయన శనివారమిక్కడ ఓ సదస్సులో మాట్లాడారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.20 కోట్లను కేటాయించిందన్నారు. త్వరలో ఏడాదికి రూ.500 నుంచి 600 కోట్లు కేటాయించి ఈ ప్రాజెక్టును దేశమంతా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వివరించారు. -
ప్రమాదాల నివారణకు ఎక్స్ ప్రెస్ హైవేలు అవసరం: కేసీఆర్
హైదరాబాద్: జాతీయ రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు ఎక్స్‌ప్రెస్ హైవేల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) దృష్టి సారించారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖపై అధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి అన్నిజాతీయ, రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసే విధంగా ఎక్స్‌ప్రెస్ హైవేల అవసరం ఉందని అధికారులతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఎంతో అవసరమని అధికారులకు కేసీఆర్ సూచించారు. -
రయ్... రయ్
ఖమ్మం-కురవి, రాయపట్నం-వరంగల్ ఆర్అండ్బీ నుంచి ఎన్‌హెచ్‌కు మళ్లింపు జాతీయ రహదారుల విభాగం గ్రీన్‌సిగ్నల్ హన్మకొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో మరో రెండు రహదారులు నేషనల్ హైవే (జాతీయ రహదారులు) విభాగంలో చేరిపోయాయి. ఎన్నికలకు ముందే ఈ రెండు రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించగా... తెలంగాణ రాష్ట్రంలో వీటికి మోక్షం లభించింది. ఇప్పటికే ఒక రహదారికి సంబంధించి విస్తరణ పనులు మొదలయ్యూయి. జిల్లాలో ఇటీవలే తానంచెర్ల-మల్లంపల్లి (ఎన్‌హెచ్ 365), ఆత్మకూరు-సిరొంచ (ఎన్‌హెచ్ 363) రోడ్లు నేషనల్ హైవేలో చేరాయి. ఈ రోడ్ల విస్తరణకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలో మరో రెండు రోడ్లను నేషనల్ హైవే పరిధిలోకి తీసుకొచ్చారు. ఖమ్మం-కురవి ఖమ్మం నుంచి కురవి వరకు ఉన్న స్టేట్ హైవేను ఎన్‌హెచ్ పరిధిలోకి మార్చేందుకు ఆర్అండ్బీ అధికారులు జాతీయ రహదారుల విభాగానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ రోడ్డులో కరీంనగర్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు వెళ్లే పెద్ద పెద్ద వాహనాల సంఖ్య పెరిగిందని నివేదికల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ రహదారిగా మార్చాలని, విస్తరణ అనంతరం జిల్లా సరిహద్దులో టోల్గేట్ ఏర్పాటు చేయూలని చేసిన ప్రతిపాదనలను నేషనల్ హైవే విభాగం స్వీకరించింది. ఖమ్మం-కురవి రోడ్డును నేషనల్ హైవే పరిధికి మార్చుతున్నట్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ రోడ్డుకు ఎన్‌హెచ్ సంఖ్యను కేటాయించనున్నట్లు ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ విభాగాలకు సమాచారం అందజేసింది. ప్రస్తుతం డబుల్ లేన్‌గా ఉన్న ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని... ఆ తర్వాత ఫోర్ లేన్‌గా విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది. రాయపట్నం-వరంగల్ ఇప్పటివరకు రాయపట్నం-కోదాడ వరకు ఉన్న స్టేట్ హైవేను రాయపట్నం- వరంగల్‌గా మార్చి నేషనల్ హైవే పరిధికి మార్చారు. 135 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు సైతం నేషనల్ హైవే విభాగం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్అండ్బీ కింద భీమారం-అనంతసాగర్ వరకు విస్తరణకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. ఆర్అండ్బీ విభాగం నుంచి విస్తరణ పనుల టెండర్లు పిలిచారు. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును రూ. 21 కోట్లతో ఫోర్ లేన్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ క్రమంలోనే రాయపట్నం నుంచి వరంగల్ వరకు 135 కిలోమీటర్లను ఎన్‌హెచ్ పరిధికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌హెచ్ పరిధికి మారుస్తున్నట్లుగా ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోడ్డుకు కూడా ఇంకా సంఖ్యను కేటాయించలేదు. సంఖ్యను కేటాయించిన అనంతరం డబుల్ లేన్‌గా ఉన్న ఈ రోడ్డు ఫోర్‌లేన్‌గా విస్తరణకు నోచుకోనుంది. -
రణ రంగం
- ‘దేవనహళ్లి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత - టోల్ చార్జీల పెంపునకు నిరసన - బీజేపీ, కర్ణాటక రక్షణా వేదిక ఆందోళన - భారీ స్థాయిలో పోలీసుల మోహరింపు - అధికారులతో మంత్రి మహదేవప్ప భేటీ - ఇది బీజేపీ తప్పిదమని విమర్శ - టోల్ చార్జి తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో టోల్‌ను ఉన్నఫళంగా రెండున్నర రెట్లు పెంచినందుకు నిరసనగా మంగళవారం పలు సంఘాలు, పార్టీలు అక్కడ చేపట్టిన ఆందోళనతో ఆ ప్రాంతం రణ రంగంగా మారింది. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ కొన్ని సంఘాల కార్యకర్తలతో ఘర్షణ పడాల్సి వచ్చింది. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు ఆర్. అశోక్, బీఎన్. బచ్చేగౌడ, యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రభృతులు ఆందోళనకు నాయకత్వం వహించారు. మరో వైపు కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ నాయకత్వంలో ఆందోళన జరిగింది. అధికారులతో మంత్రి చర్చలు టోల్ పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన సాగుతుండడంతో ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప అధికారులతో సమావేశమై చర్చించారు. టోల్‌ను తగ్గించడం సాధ్యమవుతుందా అని ఆరా తీశారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ టోల్ పెంపుపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. సదానంద గౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి వర్గ సమావేశంలో టోల్ ధరను నిర్ణయించారని వెల్లడించారు. టోల్ పెంపు వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై సోమవారం ఢిల్లీలో తాను జాతీయ రహదారుల ప్రాధికార అధికారులతో చర్చించానని తెలిపారు. స్థానికులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టోల్ తగ్గింపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కొందరు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన పరోక్షంగా బీజేపీని విమర్శించారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని 2,108 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసిందని మంత్రి తెలిపారు. మొత్తం ఏడు రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నారని, దీనికి రూ.10 వేల కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. సుమారు 65 ఏళ్ల తర్వాత తొలి సారిగా ఇంత పెద్ద ఎత్తున జాతీయ రహదారులుగా మార్చనున్నారని వెల్లడించారు. -
కాసులు దొరవారికి.. కేసులు పనివారిపై..
సాక్షి, సంగారెడ్డి/ సంగారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంటగల దాబాలు, రెస్టారెంట్లలో రాత్రింబవళ్లు అక్రమ మద్యం విక్రయాలు, అనధికార సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎంపీ మందజగన్నాథం ఈ అంశంపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌కు నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖరేషీ నేతృత్వంలో గత నెల 23 నుంచి ఈ నెల 3 తేదీ వరకు దాడులు జరిగాయి. గజ్వెల్, సిద్దిపేట, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లోని ధాబాల పై దాడులు జరిపి అక్రమ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మూడు ధా బా టల యజమానులపై కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులు మరో మూడు ధాబాల విషయంలో మాత్రం పనివాళ్లపై కేసులు పెట్టారు. గత నెల 14న గజ్వేల్‌లోని ఆధిత్య ఫ్యామిలీ రెస్టారెంట్, నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు జరపగా బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అయితే, ఈ రెస్టారెంట్ల యజమానులకు బదులు అందులో పనిచేస్తున్న యువకులపై కేసులు పెటారు. పొట్ట కూటి కోసం ఆధిత్య రెస్టారెంట్లో పనిచేస్తున్న సాయి కుమార్, నక్షత్ర రెస్టారెంట్లో పనిచేస్తున్న ఎల్. వంశిలపై కేసులు పెట్టారు. మెదక్ మండలం పిల్లికొట్యాల వద్ద గల రాజ్దాబాపై ఈ నెల 3న దాడులు జరపగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభ్యమైంది. 18 విస్కీ బాటిళ్లు, 22 బీర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ దాబా యజమానికి బదులు అందులో సప్లయర్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ అనే యువకుడిపై కేసు పెట్టి జైలుపాలు చేశారు. సిద్దిపేటలోని మయూరి, కొకకోలా దాబాలతో పాటు గజ్వేల్‌లోని యోగేష్ ఫ్యామిలీ దాబాల విషయంలో మాత్రం యజమానులపై కేసులు పెట్టారు. షరా‘మామూళ్లే’ జిల్లాపై నుంచి 65వ, 44వ నంబర్ల జాతీయ రహదారితో పాటు రాజీవ్ రహదారి వెళ్తున్నాయి. ఈ రహదారులపై పక్క రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలుంటున్నాయి. దీంతో రహదారులకు ఇరువైపుల వందల సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లు వెలిసాయి. ప్రతి రోజూ తెల్లవారుఝామున వరకు ఈ ధాబాల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో 147 లెసెన్సైడ్ మద్యం దుకాణాలున్నాయి. అయితే, అంతే సంఖ్యలో ధాబాలు, రెస్టారెంట్లలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ప్రతి ధాబా నుంచి నెలనెల మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేసులపై పరిశీలిస్తాం దాబాలు, రెస్టారెంట్లలో అక్రమ మద్యం నిల్వలు లభించినప్పుడు అందుకు బాధ్యులైనవారిపై మాత్రమే కేసులు పెడతాం. గజ్వేల్, మెదక్‌లోని రెస్టారెంట్లు, దాబాల్లో అక్రమ మద్యం వ్యవహారంలో పనివారిపై కేసులు పెట్టిన విషయంపై పరిశీలన చేస్తాం. -డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్, మెదక్ జిల్లా