
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.4,494 కో ట్లు కేటాయించింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 188.51 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీచేసినట్లు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 161వ జాతీయ రహదారిలో కంది నుంచి రామసానిపల్లె వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రూ.1201.62 కోట్లు, రామసానిపల్లె నుంచి మంగ్లూ ర్ గ్రామం వరకు 46.6 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు కోసం మరో రూ.1,220 కోట్లు మంజూరు చేసింది.
మంగ్లూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు కోసం రూ.1,082 కోట్లు, రేపల్లె్లవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ. 4 లైన్ల రోడ్డు కోసం రూ.988 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ వెల్లడించింది.