రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో 2018–22 మధ్య నాలుగేళ్లలో ఒక లక్షా 5 వేల 906 ప్రమాదాలు జరగ్గా, 35,565 మంది మరణించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాల్లో ఒక లక్షా 4వేల 589 మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 74 వేలకు పైగా మంది మరణించినట్లు బుధవారం తెలిపింది.
దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల 77 వేల 423మంది దుర్మరణం చెందిన ట్లు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్క రీ ప్రకటించారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో చోటుచేసుకోగా, తక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతంగా లక్షదీ్వప్ నిలిచినట్లు తెలిపారు. జాతీయ రహదారులపై 32.94శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 36.22% మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాదాల నివారణకు సదస్సులు
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర/జిల్లా స్థాయిల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ రీసెర్చ్, రీజనల్ డ్రైవింగ్ సెంటర్‌ల ఏర్పాటు కోసం ఓ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment