state
-
Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం
2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యకాలంలో మనం గడచిన ఏడాది మిగిల్చిన గురుతులను ఒకసారి నెమరువేసుకుందాం. ముఖ్యంగా 2024 ఎంతో ప్రత్యేకంగా నిలిచిన జమ్ముకశ్మీర్ గురించి చర్చిద్దాం.2024 అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికార హోదాను దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అత్యధిక మెజారిటీతో కొత్త అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే పూర్తి రాష్ట్ర హోదా లేని కారణంగా ఈ ప్రభుత్వానికి మునుపటిలా అత్యధిక అధికారాలు లేవు. దీంతో పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడపడం ఒమర్ అబ్దుల్లాకు సవాల్‌గా మారింది. అయితే ఈసారి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విలసిల్లింది.జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. 2024లో ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General election) గత 35 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది. 58.46 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగి, 63.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి వేర్పాటువాదులు, జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్నవారు కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమాత్-ఎ-ఇస్లామీ నిషేధానికి గురైనా, దానికి మద్దతు పలికిన అభ్యర్థులు 10 స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో చాలామంది తమ డిపాజిట్లను కూడా కాపాడుకోలేకపోయారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమాత్‌పై నిషేధం విధించారు.మరోవైపు జమ్ము డివిజన్లోని రియాసి, దోడా, కిష్త్వార్, ఉధంపూర్లలో పాకిస్తానీ ఉగ్రవాదులు(Pakistani terrorists) దాడులకు పాల్పడటం భారత భద్రతా ఏజన్సీల ఆందోళనను పెంచింది. జూన్ 9న రియాసిలో ఏడుగురు యాత్రికులు శివ్ ఖోరీ తీర్థయాత్ర నుండి బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. అదేవిధంగా ఉధంపూర్, కిష్త్వార్లలో ముగ్గురు గ్రామ రక్షణ గార్డులు మృతిచెందారు. వేర్వేరు ఉగ్రవాద ఘటనల్లో 18 మంది భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు.రాబోయే 2025లో జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భద్రతా సంస్థలు మరింత ఉత్సాహంగా పాక్ చొరబాటు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. 2019కి ముందున్న కాశ్మీర్ అందాలను కాపాడుతూ, ఇక్కడ అల్లరి మూకల హింసాకాండ చెలరేగకుండా భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: 100 శాతం ఫలితాలతో క్యాన్సర్ ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు. -
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్‌సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు. జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు నిర్వహిస్తుంది. -
టూత్‌పేస్ట్, చెప్పులు, బెలూన్.. స్వతంత్రులకు 190 ఎంపికలు!
దేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా వారి గుర్తులకు అత్యంత ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తుంటాం. అభ్యర్థులు కూడా ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును చూపించి, దానికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతుంటారు. ఓటింగ్ సమయంలోనూ ఓటర్లు అభ్యర్థి పేరు కంటే వారి చిహ్నాన్ని గుర్తు పెట్టుకుంటారు. అన్ని పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆయా ఎన్నికల చిహ్నాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. ప్రాంతీయ పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంటారు. అలాంటి అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 190 గుర్తులను ఖరారు చేసింది. నామినేషన్లు సమర్పించేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కమిషన్ అందించిన జాబితాలోని ఏదో ఒక ఎన్నికల గుర్తును ఎంచుకుని దానిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల గుర్తును కమిషన్ కేటాయిస్తుంది. దేశంలో ఆరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల చిహ్నాలలో పురాతన కాలం నుండి ఆధునిక కాలం నాటి అంశాల వరకు ఉన్నాయి. వీటిలో ఆహారం, రవాణా, దినచర్యలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. మొబైల్, మొబైల్ ఛార్జర్‌తో పాటు టెలిఫోన్ కూడా ఎన్నికల చిహ్నంగా ఉంది. స్లేట్, ల్యాప్‌టాప్ కూడా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. -
నాగాలాండ్‌లో ఎన్నికల బహిష్కరణ? ఈఎన్‌పీవో నిర్ణయం?
లోక్‌సభ ఎన్నికలను నాగాలాండ్‌లోని ఒక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) రాష్ట్రంలోని ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక పరిపాలన కేంద్రం లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూవస్తోంది. వీటిని నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఈఎన్పీవోతో పాటు అపెక్స్ నాగా బాడీ, ఆరు జిల్లాల్లోని దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ గత సంవత్సరం (ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఆ తరువాత ఈ విషయమై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఏకే మిశ్రా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు నాగాలాండ్‌ను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత ప్రజలకు స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల తెలిపారు. కాగా ఇఎన్పీవో ఇప్పటికే పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏ పార్టీకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. -
దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలున్నాయి?
‘ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోకపోతే ఎలా?’ అని చాలామంది అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అందుకే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో వైశాల్యం పరంగా రాజస్థాన్‌ను అతిపెద్ద రాష్ట్రంగా పరిగణిస్తారు. జనాభా కోణంలో చూస్తే ఈ టైటిల్ ఉత్తరప్రదేశ్‌కు దక్కుతుంది. అయితే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి? అవి ఎన్ని? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75. ఇవి 2,40,928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలను 18 డివిజన్లుగా విభజించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 822 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు, 350 తహసీల్లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద జిల్లా లఖింపూర్ ఖేరీ. ఇది దాదాపు 10.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లఖింపూర్ ఖేరీ పొరుగు దేశం నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ జిల్లాలో గోమతి, శారద, కథన తదితర నదులు ప్రవహిస్తున్నాయి. యూపీలోని అతి చిన్న జిల్లా హాపూర్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిల్లాలు కలిగిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా చింద్వారా. ఈ జాబితాలో మూడవ స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలున్నాయి. 101 సబ్ డివిజన్లు, 534 సిడి బ్లాక్‌లు ఉన్నాయి. బీహార్‌లోని అతిపెద్ద జిల్లా పట్నా. ఇది బీహార్ రాజధాని. పట్నా పలు ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం. -
ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు.. వేలల్లో!
బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాల పరిశీలనకు బీహార్‌కు వచ్చిన ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు. బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.64 కోట్లని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఈసారి 9.26 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని వెల్లడించారు. బీహార్‌లో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 21 వేలకు పైగా ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి అభ్యర్థులకు ప్రచారానికి ఐదు వాహనాలకు బదులు 14 వాహనాల వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. దేశంలో 18వ లోక్‌సభకు ఎంపీలను ఎన్నుకునేందుకు మరికొద్ది వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. Live from 2 pm today : Press Conference at Patna by Election Commission after Review of Poll-preparedness of #Bihar & #Jharkhand for #GeneralElection2024 https://t.co/G33lHSAJxg — Spokesperson ECI (@SpokespersonECI) February 21, 2024 -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
‘పశ్చిమ బెంగాల్’ పేరు మార్చండి: సీఎం మమతా డిమాండ్
తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది. భారత్‌లోనూ పంజాబ్ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు. -
ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు?
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అయితే మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? అనేదానిపై బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నవారి వారి జాబితా భారీగానే ఉంది. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి పీఠాలను ఎవరికి కట్టబెడతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. దీనిగురించి ఢిల్లీలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం విషయంలో బీజేపీ ఎప్పుటికి నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న అలానే మిగిలివుంది. సోమవారం (డిసెంబర్ 11) జరగనున్న శాసనసభా పక్ష సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. అదే సమయంలో ఆదివారం (డిసెంబర్ 10) రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనేది ఆరోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రుల ఎంపిక కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు ముగ్గురు చొప్పున పరిశీలకులను బీజేపీ నియమించింది. రాజస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే వ్యవహరిస్తుండగా, మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గడ్‌లకు మనోహర్ లాల్ ఖట్టర్ , కే లక్ష్మణ్, ఆశా లక్రా పరిశీలకులుగా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా నియమించారు. రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, మహంత్ బాలక్‌నాథ్ పేర్లు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగే శాసనసభా పక్ష సమావేశం తర్వాత ఇక్కడ సీఎం ఎవరనేది తేలనుంది. మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది డిసెంబర్ 11 నాటికి తెలియనుంది. సోమవారం భోపాల్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే సీఎం పేరు ఖరారు కానుంది. కాగా రాజస్థాన్‌లోని 199 స్థానాలలో భారతీయ జనతా పార్టీ 115 సీట్లు గెలుచుకుంది. ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని 230 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 163 సీట్లు వచ్చాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలను గెలుచుకుంది. ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
తెలంగాణ సృజనకు పట్టం!
స్టార్టప్‌లకు సహకారం అందించే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తాజాగా పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ (పీఎఫ్ఐ- 2023)లో తమ ఆవిష్కర్తలు భాగస్వామ్యం వహించనుండటంపై హర్షం వ్యక్తం చేసింది. గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్స్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్ (గెయిన్), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫారమ్‌ల (సీ-కాంప్) సహకారంతో ‘పీఎఫ్ఐ- 2023’ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనుంది. ‘స్కేలింగ్ ఇన్నోవేషన్స్: ఫ్రమ్ ఐడియా టు ఇంపాక్ట్’ అనే థీమ్‌తో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, జంతు ఆరోగ్యం, వ్యవసాయ యంత్రాలు, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణం, క్లీన్ ఎనర్జీతో సహా వివిధ రంగాలలో డీప్‌టెక్, గ్రాస్‌రూట్ ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023 ఒక వేదిక కానుంది. మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో బధిరులకు భద్రతా హెచ్చరిక హెల్మెట్ తయారుచేసిన ఎన్కే రాజలిపాషా, రోగులకు సహాయపడే హెల్త్ బెడ్ రూపకర్త అల్లాడి ప్రభాకర్, విద్యుత్-పొదుపు, వీధి దీపాల నియంత్రణ ఆవిష్కర్త రాజు ముప్పరపు, వ్యర్థాలను నియంత్రించే యంత్రం తయారు చేసిన తేజస్వి వెలుగపల్లి, వ్యవసాయం, గ్యాస్ సిలిండర్లతో ఆటోమేటెడ్ టైమర్ నియంత్రణ కవాటాలను రూపొందించిన ఎం గోపాల్ సింగ్ ఉన్నారు. తమ ఆవిష్కరణలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే అవకాశం కలగడంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు పీఎఫ్ఐ- 2023లో అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు. ఇది ఆవిష్కర్తల సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఆవిష్కర్తలకు జాతీయ వేదికపై తమ ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో నెట్వర్కింగ్ అవకాశాలు, సదస్సులు, ప్లీనరీ చర్చలు, ప్యానెల్ చర్చలు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. ఇది మేథస్సును పరస్పరం పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆవిష్కర్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులతో పాటు కీలక వాటాదారులు కూడా పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ.. -
ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉపాధి మార్గాలు లేక వేలాది మంది అల్లాడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామంది వీధుల్లో, ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు దిగుతున్నారు. తద్వారా వారు రెండు పూటలా కడుపు నింపుకుంటున్నారు. భారతదేశంలో కూడా బిచ్చగాళ్ల సంఖ్య అత్యధికం. పలు నగరాల్లో సిగ్నల్స్ దగ్గర, మాల్స్ వెలుపల కూడా బిచ్చగాళ్లు కనిపిస్తారు అయితే దేశంలో ఎక్కువ మంది బిచ్చగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. వాస్తవంగా దీనిని మించిన సంఖ్యలో బిచ్చగాళ్లు ఉండవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య 81 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది యాచకులు ఉండగా, వీరిలో రెండు లక్షల మందికి పైగా పురుషులు, దాదాపు రెండు లక్షల మంది మహిళలున్నారు. దీంతోపాటు చిన్నారులు కూడా యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా యాచకులు ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం విషయానికొస్తే లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది కాకుండా దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది యాచకులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైమనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ గణాంకాలను ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి! -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఈ పేరుతో రాష్ట్రం ఉండేదని తెలుసా?
భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి సారధ్యంలో పరిపాలన కొనసాగుతుంది. రాజ్యాంగంలో జిల్లాలను నిర్ణయించే వ్యవస్థ కూడా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో అవసరాన్ని అనుసరించి జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జిల్లాల సంఖ్యను పెంచుతుంది. అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద జిల్లా గురించి మీకు తెలుసా? నాటి రోజుల్లో ఆ జిల్లా పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిల్లాలో సగభాగం ఎడారి భారతదేశంలోని అతిపెద్ద జిల్లా పేరు కచ్. ఇది గుజరాత్లో ఉంది. విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద జిల్లాగా పేరొందింది. గుజరాత్‌లోని ఈ జిల్లా మొత్తం వైశాల్యం 45,674 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని 23.7 శాతం భూభాగంలో విస్తరించివుంది. ఈ జిల్లాలోని సగానికి పైగా ప్రాంతం ఎడారితో నిండి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ జిల్లా పేరుతో రాష్ట్రం ఒకప్పుడు భారతదేశంలో కచ్ పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఇది 1950లో ఏర్పాటయ్యింది. 1956 నవంబర్ ఒకటిన ముంబై రాష్ట్రంలో విలీనమయ్యింది. మరాఠీ, గుజరాతీ ప్రజలు అప్పట్లో కచ్‌లో నివసించేవారు. మార్వాడీలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. 1960లో ముంబై రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు. దీంతో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్. ఈ నేపథ్యంలో కచ్ జిల్లా గుజరాత్లో చేరింది. 2001 జనవరి 26న కచ్‌లో సంభవించిన భూకంపం ఆ జిల్లాను అతలాకుతలం చేసింది. ఇది కూడా చదవండి: ‘హిప్పీలు’ ఇస్కాన్ అనుచరులుగా ఎలా మారారు? -
Jammu Kashmir: 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌కు శుభవార్త, రాష్ట్ర హోదా..?
ఢిల్లీ:జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర హోదా కల్పించడంపై మరో రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని కోరింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందంటే : "కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు. ఎల్లుండి (సెప్టెంబర్ 1 2023న) కేంద్రం ఒక ప్రకటన చేయనుంది. ఇది జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. ఇక ముందు కూడా లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. లఢక్ లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒకటి లేహ్.. మరొకటి కార్గిల్. లేహ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. కార్గిల్ లో సెప్టెంబర్ లో ముగుస్తాయి" అని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్లో ఉందని చెప్పారు. కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాక ఆ ప్రయత్నాలు మొదలవుతాయని ధర్మాసనానికి విన్నవించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. SG: I have taken instructions and the instructions are that the UT is not a permanent feature and I will make a positive statement day after tomorrow. Ladakh would remain a UT.. but here we are only on Jammu and Kashmir. AG and I will make the statement. In terms of local body… — Bar & Bench (@barandbench) August 29, 2023 ఇదీ చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సీజేఐ చంద్రచూడ్ -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్‌లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్‌ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
ప్రతిభకు సర్కారు పట్టం
సాక్షి అమరావతి : రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న, కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్తె శివలింగమ్మ, టీచర్ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్ కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్ కుమార్తె చంద్రలేఖ.. వీరి కుటుంబాలకు పని ఉంటేనే రోజు గడిచేది.. లేకపోతే పస్తులే. ఇలాంటి వారి గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? అని అనిపించడం సహజం. పైగా.. ఈ కోవకు చెందినవారు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు.. పత్రికలో రాసేటంతగా విషయం ఏముంటుంది అని కూడా అనుకోవచ్చు.. కానీ, చదువులో రాణించి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే వీరు సాధించిన గొప్ప విజయం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన 150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష నిర్వహించగా మొత్తం 30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి పై 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఇప్పుడు వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు ప్రభుత్వ ఖర్చుతో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలపైన, పాఠశాలల అభివృద్ధిపైన మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ పర్యటనలో వీరు అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం సందర్శిస్తారన్నారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లుచేసినట్లు వారు వివరించారు. ఇక ఈ విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. గిరిజన బాలికకు అద్భుత అవకాశం.. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన సామల మనశ్విని తల్లి కృష్ణవేణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన మనశ్విని అమెరికా వెళ్లనున్న పది మంది విద్యార్థుల్లో ఒక్కరిగా నిలిచింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభలో తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. రైతు బిడ్డకు గొప్ప వరం కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మ ల నాలుగో సంతానం శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతి 541 మార్కులతో పాసైంది. బాలిక తండ్రి సోమనాథ్ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శివలింగమ్మ అమెరికా వరకు వెళ్లే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సోమనాథ్ ఎక్కడలేని ఆనందం వ్యక్తంచేశారు. ఐరాస సదస్సుకు రైతుబిడ్డ.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన వంజవాకం నాగరాజు, విజయ దంపతుల రెండో కుమారుడు యోగీశ్వర్. తండ్రి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే రైతు. ఇద్దరి సంతానంలో పాప విద్యశ్రీ ఇంటర్ చదువుతుండగా, కుమారుడు యోగీశ్వర్ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానం సాధించాడు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తమబిడ్డల చదువుకు ఎంతో సహకరించాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేక.. చంద్ర లేఖ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతుకూరి రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె చంద్రలేఖ. రాష్ట్ర విభజనతో కుటంబంతో భద్రాచలం నుంచి ఎటపాకకు వచ్చిన రామారావు చంద్రలేఖను స్థానిక కేజీబీవీలో చదివించారు. ఇటీవల పదో తరగతిలో 523 మార్కులు సాధించి కేజీబీవీ జిల్లా టాపర్‌గా నిలిచి ప్రభుత్వం అందించిన జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ఈ విజయమే ఆమెను ఐక్యరాజ్య సమితికి వెళ్లేలా బాటవేసింది. తల్లి కష్టంతో తల్లడిల్లి.. పూట గడవడం కూడా కష్టమైన ఇంట్లో పుట్టిన షేక్ అమ్మాజాన్ ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. రైతుకూలీ అయిన తల్లి కష్టంచూసి చదువుల్లో రాణించాలనుకుంది. ఐదో తరగతిలోనే వైఎస్సా ర్జిల్లా వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు తెచ్చుకుంది. ఇటీవల టెన్త్‌లో 581 మార్కు లు సాధించి రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యా లు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఐరాస గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరింది. ప్రతిభ చాటిన సెక్యూరిటీ గార్డు బిడ్డ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య గృహిణి. వీరి రెండో కుమార్తె జ్యోత్స్న టెన్త్‌లో 589 మార్కులు సాధించింది. దీంతో పాటు జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతూ అమెరికా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కౌలురైతు కొడుకు ఘనత.. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన జి.గణేష్ అంజనసాయి ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెం గురుకుల పాఠ శాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. తండ్రి గోపి కౌలురైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. కుటుంబానికి చదువు భారం కాకూడదని గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు. 590 మార్కులతో అదరహో.. తండ్రి కూలీ, తల్లి గృహిణి. తండ్రికి పని దొరికితేనే పూటగడిచే పరిస్థితి. తన భవిష్యత్‌ను చదువుల ద్వారా తీర్చిదిద్దుకుని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బలంగా అనుకుంది పసుపులేటి గాయత్రి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివి ఏకంగా 590 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. అమెరికా బృందానికి ఎంపికైంది. మెరిసిన మెకానిక్ కుమార్తె.. విజయనగరం శివారు జమ్మునారాయణపురంలో నివాసముండే అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డి రెండో కుమార్తె రిషితారెడ్డి స్థానిక మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ చదివి 587 మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. ఇప్పుడు అమెరికా వెళ్లే అరుదైన అవకాశం దక్కించుకుంది. నంద్యాల నుంచి అమెరికాకు.. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన విద్యార్థిని సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్, భార్య రామలక్ష్మమ్మ ఇంటివద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్లో టెన్త్ చదివి 583 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ఐరాసకు వెళ్లే అరుదైన అవకాశం కైవసం చేసుకుంది. -
ఐదుగురు రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అత్యుత్తమ నేర పరిశోధన చేసిన 140 మంది పోలీసు అధికారులను 2023 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపిక చేశారు. నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఈ పతకాలను 2018 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, బోధన్ ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రాజుల సత్యనారాయణరాజు, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ యం.జితేందర్‌రెడ్డి, ఏసీపీ భూపతి శ్రీనివాసరావు పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఐ అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సీఐ మన్సూరుద్దీన్ షేక్, డీఎస్పీ ధనుంజయుడు మల్లెల, ఏఎస్పీ సుప్రజ కోర్లకుంట, డీఎస్పీ రవిచంద్ర ఉప్పుటూరి అవార్డులు పొందారు. ఎనిమిది మందికి జీవితఖైదు – అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ప్రస్తుతం ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న మేకల తిరుపతన్న.. 2016లో సంగారెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కంగ్టి పోలీస్ స్టేషన్లో ఓ గిరిజనుడి హత్యకేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారు. పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్ నమోదు చేయడంతో ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు దోషులుగా తేలారు. వారికి గత ఫిబ్రవరిలో జీవిత ఖైదు విధించారు. హత్యాచారం కేసులో దర్యాప్తునకు.. – ఏసీపీ మూల జితేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషన రేట్లో ప్రస్తుతం ఎస్బీ ఏసీ పీగా విధులు నిర్వర్తి స్తున్న యం.జితేందర్‌రెడ్డి హనుమకొండ ఏసీపీగా పనిచేసే సమయంలో ఓ కేసు దర్యాప్తునకు అవార్డు దక్కింది. 2020 జనవరిలో హనుమకొండ రాంనగర్లో ఓ యువతిపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కేసులో దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నిందితుడుకి యావజ్జీవ శిక్ష పడింది. ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో దర్యాప్తునకు... – డీఎస్పీ కె.ఎం.కిరణ్‌కుమార్, ఏసీపీ బోధన్ ప్రస్తుతం బోధన్ ఏసీపీగా పని చే స్తున్న కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌కుమార్ భూపాలపల్లి డీ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు 2017 నవంబర్‌లో రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల దళిత పాపపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు కటకం శివను 3 రోజుల్లోనే గుర్తించి 6 నెలల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. కటకం శివకు యావజ్జీక శిక్ష పడింది. అనాథ బాలిక కేసులో... – డీఎస్పీ సత్యనారాయణరాజు అమీన్పూర్లో అనాథ బాలికపై నెలలపాటు లైంగిక దాడి చేయడం, ఆమె మృతికి కారణమైన కేసు దర్యాప్తును నారాయణ ఖేడ్ డీఎస్పీగా పని చేస్తున్న రాజుల సత్యనారాయణరాజుకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించడంతో ఈ కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. -
Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న టీ కాంగ్రెస్... అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తోంది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కసరత్తు నివేదిక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్‌కు అందినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు ముందే సునీల్ కనుగోలు ఈ నివేదికను వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. సునీల్ కనుగోలు మూడు రకాలుగా విభజన... వాస్తవానికి గత నెల 24న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సునీల్ కనుగోలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని, మిగిలిన చోట్ల ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నామని వివరించారు. అయితే ఏ అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వెల్లడించలేదు. తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశముందని, మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని, 36 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదని, ఆ స్థానాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని కె.సి.వేణుగోపాల్‌కు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకా రం గెలుపు అవకాశాలున్న చోట్ల ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని, గెలుపు కోసం కష్టపడాల్సిన స్థానాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కె.సి.వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఇక, పరిస్థితి ఏమాత్రం బాగాలేని 36 స్థానాల్లో ఏం చేస్తే మెరుగుపడతామన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని వేణుగోపాల్ మార్గనిర్దేశం చేసినట్టు తెలు స్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, విష్ణునాథ్, మన్సూర్‌అలీఖాన్, రోహిత్‌చౌదరి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఓవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మీరిలా పరస్పరం ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం ఏమిటి? ఎన్నికల వేళ ఈ లొల్లి ఆగకపోతే ఎలా? కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే... మేం కాదు. కర్ణాటక నేతలను చూసి నేర్చుకోండి. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 రోజులు ఐకమత్యంగా పనిచేయండి’అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. శనివారం గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల అనైక్యత గురించి వేణుగోపాల్ మాట్లాడారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బరాబర్... కలుగజేసుకుంటాం సమావేశంలో భాగంగా పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అభ్యంతరం తెలిపారు. కమిటీల ఏర్పాటు ఏకపక్షంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అన్ని జిల్లాల్లోనూ కలుగజేసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తీవ్రంగా స్పందించిన ఉత్తమ్... పీసీసీ చీఫ్‌గా పార్టీని నడిపించామని, 30–40 ఏళ్లుగా పారీ్టలో ఉంటున్నామని, తమకు రాష్ట్రమంతా అనుచరులు ఉన్నందున కలుగజేసుకోవద్దంటే ఎలా అని వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన వాళ్లు నిర్ణయాలు తీసుకుంటుంటే తాము పట్టించుకోకుండా ఎలా ఉంటామని, బరాబర్ కలుగజేసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యలో కలుగజేసుకున్న వేణుగోపాల్ నేతలందరూ సమన్వయంతో పనిచేసి ఈనెల 15లోపు మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ గురించి కసరత్తు చేస్తున్నామని చెప్పగా అన్ని వర్గాల డిక్లరేషన్లనూ పూర్తి చేయాలని వేణుగోపాల్ సూచించారు. చదవండి: Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42 ఆరు సభలు... సోనియా,రాహుల్, ప్రియాంక రాక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పలు వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించడం కోసం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నేతలు పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సభలకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని, సమయాన్నిబట్టి ఒక్కో సభకు ఒక్కో జాతీయ నేతను తీసుకురావాలని, రాహుల్ వీలైనన్ని సభలకు వచ్చేలా చూడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15 లోగా 3 బహిరంగ సభలు: షబ్బీర్ అలీ పీఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలసి పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడారు. పార్టీ గెలుపునకు కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేశారని చెప్పారు. గిరిజన దినోత్సవం రోజున తండాలలో బస చేయాలని, రాష్ట్రంలో భూ కుంభకోణాలు, అమ్మకాలపై చార్జిషీట్ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15లోగా జహీరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు కె.సి.వేణుగోపాల్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
రాష్ట్రంలో విద్యపై కేంద్రం వివక్ష!
సాక్షి, హైదరాబాద్: విద్య విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంస్థల కేటాయింపులో ప్రతి సారీ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందన్నారు. ‘విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పురోగతి’పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె బదులిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకూ విద్యపై రూ.96 వేల కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఈ ఏడాది రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ వచ్చాక 1,342 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఉన్నత విద్యకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాల రేటు 36.2 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ..’అని సబిత తెలిపారు. -
మన పులులు 21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనే ఉన్నాయని, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది. కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్ రిజర్వ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్స్ట్రాక్ట్ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు. తాజా నివేదికపై అధికారుల్లో చర్చ 2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో 19, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్ కారిడార్లు, బఫర్ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్ అయ్యాయని, టైగర్ కారిడార్ ఏరియాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు వచి్చనట్టుగా ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ ద్వారా సత్ఫలితాలు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం ములుగు (గజ్వేల్): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్సీఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా..
మన దేశంలో ప్రతిరోజూ కొన్ని కోట్లమంది రైలు ప్రయాణం సాగిస్తుంటారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగిన వ్యవస్థగా గుర్తింపు పొందింది. నేడు భారతీయరైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. మనం దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మనకు రైల్వే స్టేషన్ తప్పనిసరిగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు సాగించేవారు తప్పనిసరిగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. భారతీయ రైల్వే లైన్ పొడవు ఒక లక్షా 15 వేల కిలోమీటర్లు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రైలులో వెళ్లవచ్చు. నేటికీ రైలు మార్గం లేని రాష్ట్రం అయితే మనదేశంలోని ఒక రాష్ట్రం.. నేటికీ ఎటువంటి రైలు రాకపోకలకు నోచుకోలేదు. ఈ మాట వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ మాట వినగానే కొందరు దేశంలోని రైలు నడవని రాష్ట్రం కూడా ఉందా అనే ఆలోచనలోపడతారు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్రం ఎక్కడుందో తెలుసుకుందాం. నేటికీ రైల్వే లైన్ లేని రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో రైలు అన్నదే కనిపించదు. దేశంలోని రైలు వ్యవస్థలేని రాష్ట్రం ఇదొక్కటే. అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే సిక్కింనకు చేరుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అక్కడ అత్యంత వేగంగా రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 2024 నుంచి రాష్ట్రంలో రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
నడక హక్కును అమలు చేసిన తొలి రాష్ట్రం.. అక్కడ ఫుట్‌పాత్‌లు తప్పనిసరి!
దేశంలో నడక హక్కు (రైట్ టు వాక్)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారులు, సైక్లిస్టుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐతో సహా అన్ని రహదారి యాజమాన్య ఏజెన్సీలు రోడ్ల నిర్మాణం, విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించడాన్ని తప్పనిసరి చేసింది పంజాబ్ ప్రభుత్వం. తద్వారా 'నడక హక్కు'ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? పంజాబ్ హర్యానా హై కోర్ట్, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఆయా కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది . పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువా ఆ రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ అసిజాకు ఇచ్చిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఇకపై చేపట్టే అన్ని రోడ్ల నిర్మాణాలు, విస్తరణల్లో సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు తప్పనిసరి. ఈ మేరకు ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను నిర్మించడానికి కావాల్సిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, స్థానిక సంస్థలు, ఎన్హెచ్ఏఐ, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి లేఖలు అందాయి. ఇదీ చదవండి: మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ! -
అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే?
దేశ వ్యాప్తంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఆ నివేదికలో వరుసగా మూడో సారి దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. ఆర్ధిక సంవత్సరం-2023 అంటే ఏప్రిల్ 1,2022 నుంచి మార్చి 31, 2023 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం తమిళనాడు తీసుకున్న రుణాలు (స్టేట్ డెవలప్మెంట్ లోన్- ఎస్డీఎల్) రూ. 68,000 కోట్లకు చేరినట్లు నివేదించింది. రాష్ట్రాల వారీగా గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 - 2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మహరాష్ట్ర , వెస్ట్ బెంగాల్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉండగా ..ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి.తెలంగాణ, గుజరాత్, హర్యానాలు 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అప్పుల జాబితా ప్రకారం.. తమిళనాడు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్ధిక సంవత్సరం 2021లో రూ. 87,977 కోట్లు, ఆర్ధిక సంవత్సరం 2022లో రూ.87,000 కోట్లను అప్పుగా తీసుకుంది. అయితే, గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఆర్ధిక సంవత్సరం 2023 సమయానికి రుణాల శాతం తగ్గింది. ఆర్బీఐ నివేదికలో ఆర్ధిక సంవత్సరం 2023 ముగిసే సమయానికి దేశంలో అప్పులు తక్కువగా తీసుకున్న 10 రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఆర్ధిక సంవత్సరం 2022లో ఉత్తర ప్రదేశ్‌కు రూ.62,500 కోట్లు ఉండగా.. కేవలం 11 నెలల్లో ఆ మొత్తం కాస్త రూ. 33,500 కోట్లకు తగ్గింది. సొంత పన్ను, రాబడి వంటి ఇతర కారణాల వల్ల రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితా ఇలా ఉంది ఆర్బీఐ నివేదికలో 2023 ఏప్రిల్ - జూన్ సమయానికి 22 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు రూ.1.99-లక్షల కోట్ల రుణాలు తీసుకోవచ్చని అంచనా వేసింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి (క్యూ1) నాటికి మహరాష్ట్ర (రూ.25,000కోట్లు), తమిళనాడు (రూ.24,000 కోట్లు) మొత్తం రూ.2లక్షల కోట్లు రుణాలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ గురి
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలపై అధికార బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జిలు ఇందులో పాల్గొంటారు. దిశానిర్దేశం చేయనున్న నడ్డా గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి అంతకుమించి నెగ్గాలని లక్ష్యం నిర్దేశించుకుంది. 2014, 2019ల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈ లోక్‌సభ స్థానాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నలుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందాలు పర్యటించాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జేపీ నడ్డా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల భేటీలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కచ్చితంగా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నలోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో జరగబోయే త్రిపుర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, మరింత చేరువ కావాల్సిన ప్రాంతాలు, వర్గాలను గుర్తించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడానికి వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉందని మరో నాయకుడు చెప్పారు. అమరీందర్‌కు కీలక బాధ్యతలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు పంజాబ్ నేతలకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్, మాజీ ఎంపీ సునీల్ జాఖడ్,యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
Gujarat Assembly elections 2022: గుజరాత్ గతిని నిర్ణయించే ఎన్నికలివీ..
పాలన్పూర్/దేహ్‌గాం: గుజరాత్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన గురువారం బనస్కాంతా జిల్లా పాలన్‌పూర్‌లో, గాంధీనగర్ జిల్లా దేహ్‌గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్లో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పర్యావరణం, పర్యాటకం, పరిశుభ్రమైన తాగునీరు, సాగునీరు, పశువుల పెంపకం, ప్రజలకు పౌష్టికాహారం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఉద్ఘాటించారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత వంటి సమస్యలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించిందన్నారు. గుజరాత్లో బీజేపీ సర్కారు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యారంగం బడ్జెట్ ఏకంగా రూ.33,000 కోట్లకు చేరిందని, పలు రాష్ట్రాల మొత్తం విద్యారంగం బడ్జెట్ కంటే ఇది అధికమని చెప్పారు. డ్రోన్ కలకలం అహ్మదాబాద్ జిల్లా బావ్లా గ్రామంలో మోదీ సభకు ముందు వేదిక వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్ ద్వారా జనసందోహాన్ని చిత్రీకరించే ప్రయత్నించడంతో స్థానికులు ముగ్గురి అరెస్టు చేíశారు. విద్యుత్‌తో ఆదాయం పొందాలి విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పొందే రోజులు వచ్చాయని, ఉచితంగా తీసుకునే రోజులివి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. అరావళి జిల్లా మోదాసాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఆప్, కాంగ్రెస్ ఇచ్చాయి. ఈ హామీ విపరీతంగా ఆకర్షించడంతో దానిని కౌంటర్ చేయడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా పోలీసులు అందరికీ ఒకే యూనిఫామ్ : ప్రధాని మోదీ
-
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డులు
-
యాభై ఏళ్ల తర్వాత.. ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కు అంత్యక్రియలు
లండన్: బ్రిటన్‌లో దాదాపు అర్థ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలను రాజరిక సంప్రదాయంలో కాకుండా.. ప్రభుత్వా లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1965లో మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ గౌరవాన్ని పొందిన చివరి నేత. సుదీర్ఘకాలం రాణిగా పనిచేసిన క్వీన్ ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు సైనిక ఊరేగింపులో నేవికి చెందిన నావికులు గన్క్యారేజీపై క్వీన్ ఎలిజబెత్ మృతదేహాన్ని తీసుకువెళ్లడంతో అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వెస్ట్మిన్స్టర్ అబ్బే లేదంటే సెయింట్ పాల్స్ కేథడ్రల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు సందర్శనార్ధం రాణి భౌతికదేహాన్ని ఉంచుతారు. అంత్యక్రియలకు దాదాపు నాలుగు రోజులు ముందు వరకు ఆమె భౌతిక దేహం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంటుంది. ఆ తదనంతరం దేశాధినేతలకు 21 తుపాకుల గౌరవ వందనం ఇస్తారు. ఐతే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం డెత్ గన్‌సెల్యూట్ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల్లో ఫిరంగా కాల్పలు నిర్వహించారు బ్రిటన్ అధికారులు. ఇలా ప్రతి ఏడాది 96 రౌండ్ల గన్ షాట్లతో క్విన్ ఎలిజబెత్‌కి గౌరవ వందనం ఇవ్వాలని బ్రిటన్ అధికారలు నిర్ణయించారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కోట, నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో కోట, వేల్స్‌లోని కార్డిఫ్ కోట నుంచి కాల్పులు నిర్వహించారు. (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్) -
ఢిల్లీ–కేంద్రం వివాదం.. రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వ సివిల్ అధికారులపై ఆజమాయిషీ ఎవరికి ఉండాలనే అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తలెత్తిన వివాదాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల శాసన, కార్యనిర్వాహక అధికారాల పరిధిని మాత్రమే ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 11వ తేదీన విచారణ ప్రారంభమవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ‘క్యాట్’ ఖాళీలు భర్తీ చేయండి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో ఖాళీల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాటిని ఇంకా భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేవలం ఒక్క సభ్యుడితో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. క్యాట్‌కు చెందిన జబల్పూర్, కటక్, లక్నో, జమ్మూ, శ్రీనగర్ బెంచ్‌లలో కేవలం ఒక్కో సభ్యుడే ఉన్నారని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. క్యాట్‌లో ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ క్యాట్ (ప్రిన్సిపల్ బెంచ్) బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ...న్యాయ వ్యవస్థకు అగౌరవం భూ సేకరణ వ్యవహారంలో తీర్పు ముసుగులో కక్షిదారుకు అనుచితమైన లబ్ధి కలిగించడం న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడం, దుష్ప్రవర్తన కిందకే వస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాంటి తీర్పు ఇచ్చిన యూపీలోని ఆగ్రా మాజీ అదనపు జిల్లా జడ్జీ ముజఫర్ హుస్సేన్ ఉద్దేశాన్ని అనుమానించాల్సిందేనని పేర్కొంది. ముజఫర్ హుస్సేన్ దురుద్దేశపూర్వకంగా తీర్పు ఇచ్చారని అలహాబాద్ హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. జరిమానా కింద అతడి పెన్షన్‌లో 90 శాతం కోత విధించింది. దీన్ని సవాలు చేస్తూ ముజఫర్ హుస్సేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ‘‘ప్రజా సేవకులు నీటిలోని చేపల్లాంటి వారు. నీటిలో చేపలు ఎప్పుడు, ఎలా నీళ్లు తాగుతాయో ఎవరూ చెప్పలేరు’’ అని వ్యాఖ్యానించింది. ఆజం బెయిల్ ఆలస్యంపై అసంతృప్తి సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనంటూ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూ ఆక్రమణ కేసులో బెయిల్ దరఖాస్తుపై విచారణ పూర్తి చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచినట్లు ఆజం ఖాన్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఆయనపై 87 కేసులకు గాను 86 కేసుల్లో బెయిల్ మంజూరైందన్నారు. ‘‘ఒక్క కేసులో బెయిల్‌కు ఇంత జాప్యమా? ఇది న్యాయాన్ని అవహేళన చేయడమే. ఇంతకు మించి ఏమీ చెప్పలేం. దీనిపై బుధవారం విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఆజం ఖాన్ ప్రస్తుతం సితాపూర్ జైలులో ఉన్నారు. -
రాష్ట్రాన్ని స్వచ్చంధ్రప్రదేశ్ చేయడమే సీఎం జగన్ లక్ష్యం
-
679 వైద్య అధ్యాపక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 679 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి విభాగాల్లో అధ్యాపకుల కొర తను అధిగమించేందుకు అవసరమైతే 25 శాతం అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చి కాంట్రాక్టు లేదా రెగ్యులర్ పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేయాలని కూడా ప్రతిపాదించింది. మరోవైపు కొత్త కాలేజీ లకు అనుమతి కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు దరఖాస్తు ప్రక్రియను వైద్య, ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. సెప్టెంబర్ నాటికి నిబంధ నల ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన ఏమేరకు జరిగిందో పరిశీలించేందుకు ఎన్ఎంసీ ఉన్నతాధికారులు నవంబర్‌లో ఆయా కాలేజీలను సందర్శిస్తారు. వచ్చే ఏడాది బ్యాచ్ ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుబంధ ఆసుపత్రుల్లో పడకల కొరత... ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలంటే వాటికి అనుబంధ ఆసుపత్రులు అవసరం. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుబంధ ఆసుపత్రులుగా నిర్ణయించారు. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా 300 పడకలు ఉండాలన్నది నిబంధన. అయితే ఆ నిబంధన మేరకు ఏడు ఆసుపత్రుల్లో ఒక దానికే ఆ మేరకు పడకలు ఉన్నాయి. మిగిలిన ఆసుపత్రుల్లో 300 పడకలు లేవు. ఇది ఇప్పుడు వైద్య, ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 400 పడకలు ఉండగా వనపర్తి, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 చొప్పున, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం వంద చొప్పున పడకలు ఉన్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలున్నాయి. తక్కువ పడకలున్న జిల్లా ఆసుపత్రుల్లో ఆగమేఘాల మీద 300 పడకల చొప్పున వాటిని పెంచాల్సి ఉంటుంది. ఆ మేరకు తక్షణమే పడకల పెంపుపై దృష్టి సారించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే ప్రాంతాలు సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాల -
2014 నుంచి ఎన్ని నిధులిచ్చారో చెప్పండి..
సాక్షి, అమరావతి : ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులిచ్చారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన వారిలో పలువురికి ఉపాధి పనుల బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ డబ్బు అందిందా? లేదా? చెప్పాలని వారి తరఫు న్యాయవాదులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులిచ్చారు. తాము చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఓ మెమోను కోర్టు ముందుంచింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఆ వివరాలు సంతృప్తికరంగా లేవంటూ పైవిధంగా ఆదేశాలిచ్చారు. -
రాష్ట్ర సరిహద్దులపై పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్న అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యా రు. ఈ ప్రాంతాల్లో సాధారణ తనిఖీలతోపాటు సరిహద్దులు, అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కాగా గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మావోయిస్టులు నదులను దాటే ప్రయత్నం చేయకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మావో’పోస్టర్ల కలకలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘గ్రామ గ్రామాన వారోత్సవాలు నిర్వహించి, అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి. శత్రు సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్ ప్రహార్ దాడిని ఓడిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి’అని చర్ల – శబరి ఏరియా కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జిల్లా ఎస్పీ సునీల్ శర్మ కథనం ప్రకారం.. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతగుఫ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల కు దిగారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, పలువురు తప్పించుకొని పారిపోయారు. -
రెమ్‌డెసివిర్ బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : రెమ్‌డెసివిర్ ఔషధం పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ప్రస్తుతం రెమ్‌డెసివిర్ రోజువారీ ఉత్పత్తులు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మందావియా ప్రకటన చేశారు. ఇకపై రెమ్‌డెసివర్ పంపిణీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ ఏజెన్సీ, సీడీఎస్‌సీవోలను ఆయన ఆదేశించారు. అప్పుడు కీలకం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్ 15 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ రోజు 33,000 రెమ్‌డెసివిర్ వాయిల్స్ తయారయ్యేవి. మరోవైపు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో మే 8 నుంచి రెమ్‌డెసివర్ తయారీ కంపెనీల నుంచి కేంద్రం నేరుగా ఔషధాలను కొనుగోలు చేసేది. కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది. పెరిగిన ఉత్పత్తి రెమ్‌డెసివిర్ కొరత అధిగమించేందుకు ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్యను 20 నుంచి 60కి పెంచారు. దీంతో రెమ్‌డెసివిర్ ఔషధాల ఉత్పత్తి రోజుకు 33 వేల నుంచి 3.50 లక్షల వాయిల్స్‌కి పెరిగింది. దీంతో రెమ్‌డెసివిర్ పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ఇప్పటి వరకు కేంద్రం 53 లక్షల వాయిల్స్‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఇటీవల కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ మందును ఐసీఎంఆర్ తొలిగించింది. -
కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్లను అమలు చేయడంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా పాజిటివిటీ రేటు వారానికి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆసుపత్రుల్లో పడకలు 60 శాతానికి పైగా భర్తీ అయినప్పుడు ఈ పరిమితులను విధించాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న నిబంధనల ప్రకారం జిల్లా, నగర ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. లాక్ డౌన్ అనేది ఎప్పుడు, ఎక్కడ పెట్టాలన్న విషయాన్ని కరోనాతో ప్రభావితమైన జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆ ప్రదేశంలో ఉండే ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవశక్తి , ఇతర వనరులను దృష్టిలో ఉంచుకొని, విశ్లేషణలను ఆధారంగా చేసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతాలను "పెద్ద కంటైన్మెంట్ జోన్" పిలువవచ్చునని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంపై విస్తృత మార్గదర్శకాలను ఇచ్చామని గుర్తుచేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 14 రోజులపాటు ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లను గుర్తించిన తర్వాత కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన సూచనలు: నైట్ కర్ఫ్యూ - రాత్రిపూట అత్యవసర సేవలను మినహాయించి, మిగతా వాటిని పూర్తిగా బంద్ చేయాలి. నైట్ కర్ఫ్యూ సమయాన్ని స్థానికంగా ఉండే పరిపాలన అధికారులు నిర్ణయించాలి. ప్రజల కదలిక ఎక్కువగా ఉండే రాజకీయ, క్రీడ, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా నిషేధించాలి. ఇతర సమావేశాలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు ఒకచోట ఉండకుండా చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు. వివాహ వేడుకలకు కేవలం 50 మంది పాల్గొనేలా చూడాలి. అంత్యక్రియల్లో 20 మంది ఉండేలా చూడాలి. షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్, స్పా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. మతపరమైన ప్రదేశాలను కూడా మూసివేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కేవలం అవసరమైన సేవలు మాత్రమే కొనసాగాలి. రైల్వేలు, మెట్రోలు, బస్సులు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణాలో వాటి సామర్థ్యంలో సగం వరకు మాత్రమే ప్రయాణించేలా చూసుకోవాలి. అంతర్రాష్ట్ర రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేవు. కార్యాలయాలు కేవలం సగం మంది సిబ్బందితో పనిచేసేలా చూసుకోవాలి. పారిశ్రామిక, శాస్త్రీయ సంస్థలు భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలను జరపవచ్చు. ఈ సంస్థల్లో పనిచేసేవారికి ఎప్పటికప్పుడు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలి. కరోనా తీవ్రతను జాగ్రత్తగా విశ్లేషించి రాష్ట్రాలే స్వంతంగా నిర్ణయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కోవిడ్-19కు అంకితమైన ఆసుపత్రులకు సీనియర్ జిల్లా అధికారులను నియమించాలని, రోగులను సజావుగా మార్చడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇచ్చింది. -
రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. అదిలాబాద్‌లో మంగళవారం రాత్రి ఏకంగా 13.2 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత తగ్గింది. సోమవారం రాత్రి 15.5 డిగ్రీలు నమోదు కాగా.. ఒక్కరోజులోనే దాదాపు రెండు డిగ్రీలు తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్టేషన్లలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ నమోదు చేసింది. ఇందులో ఎనిమిది స్టేషన్లలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండ, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజుల్లో తేలికపాటి వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండ్రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. -
రాష్ట్ర అభివృధ్దిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు
-
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ధర్నా
-
అనంతపురంలో రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమావేశం
-
తాడోపేడో తేల్చుకుందాం: కత్తి నరసింహారెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాష్ట్రవ్యాప్తంగా 2004 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకుంటామని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు. సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసినముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించే విషయంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతామని, ఫ్యాప్టో, జేఏసీ ఆధ్వర్యాల్లోనూ వినూత్న పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎంఎండీ షఫీ, ఉపాధ్యక్షుడు జి.నాగేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్, నాయకులు ఈ.రాముడు, సుధీర్, సుబ్రమణ్యం, మల్లేశ్, జనార్ధన్, అజాంమేగ్ పాల్గొన్నారు. -
చట్టసభల్లో స్వతంత్రులేరీ ?
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రాభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నారు. ఒక ఎన్నికల నుంచి మరో ఎన్నికలకు వచ్చే సరికి గెలిచే ఇండిపెండెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రుల సీట్లతో పాటు వారి ఓట్ల శాతం కూడా క్షీణిస్తోంది. ఇటీవల కర్ణాటకలో 222 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఇండిపెండెంట్ గెలుపొందాడు. ఆరు దశాబ్దాలకు పైబడిన ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం.. 2013 శాసనసభలో 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. 2018 ఎన్నికల్లో ఈ ఎనిమిది మంది కూడా ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవి చూశారు. ఒక సిట్టింగ్ ఇండిపెండెంట్ మాత్రం మరో స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడాడు. కర్ణాటకలో పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు సీట్లతో పాటు ఓట్ల వాటా కూడా గణనీయంగా కోల్పోయారు. మొత్తం 1,129 మంది స్వతంత్రుల ఓట్ల వాటా ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ అంటే 3.9 శాతంగా నమోదైంది. గత ఎన్నికల్లో స్వతంత్రుల ఓట్లవాటాతో పోల్చితే ఇది సగం మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను బట్టి తెలుస్తోంది. 1957లో కర్ణాటక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలిచారు. 1967లో జరిగిన ఆ రాష్ట్ర మూడో ఎన్నికల్లో అత్యధికంగా 41 మంది విజయం సాధించారు. మొత్తం 331 ఇండిపెండెంట్లు పోటీచేయగా, వారి ఓట్లవాటా కూడా అత్యధికంగా 28 శాతంగా నమోదైంది. అయితే క్రమేణా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, వారికొచ్చే ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. గెలిచే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా దిగజారింది. ఇది ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయపార్టీల అధిపత్యం (జాతీయ, ప్రాంతీయపార్టీలు) పెరుగుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా స్వతంత్రులకు రాజకీయ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని రాజకీయపరిశీలకులు అంచనా వేస్తున్నారు. 11 రాష్ట్రాల్లో అతి తక్కువగా ఇండిపెండెంట్లు... ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల శాసనసభల్లో స్వతంత్రుల సీట్ల వాటా తక్కువగా నమోదు కాగా...22 రాష్ట్రాల అసెంబ్లీలలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్ల వాటా అత్యల్పంగా రికార్డయిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, బిహార్, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అతి తక్కువ మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాజస్థాన్, జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, సిక్కిం, మిజోరాం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు అభ్యర్థుల ఓట్ల వాటా గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుత లోక్‌సభలో ముచ్చటగా ముగ్గురే... ప్రస్తుత లోక్‌సభలో కేవలం ముగ్గురే ఇండిపెండెంట్ ఎంపీలున్నారు. 1991లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక స్వతంత్ర ఎంపీ గెలుపొందాడు. అప్పటి నుంచి (1991) ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉంటోంది. 1957లో జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందనివారు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్ధులు అత్యధికంగా 19.3 శాతం ఓట్ల వాటాను సాధించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా గెలుపొందడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాన్ని స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ సంస్థ ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగదీప్ చొక్కార్ వెలిబుచ్చారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు అందుబాటులో ఉన్నన్ని వనరులు ఇండిపెండెంట్లకు లేక పోవడమే ప్రధాన కారణం. వీరిమధ్య వనరులకు సంబంధించిన అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల్లో చేస్తున్న వ్యయం కూడా గణనీయంగా పెరగడంతో స్వతంత్రులుగా పోటీ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. పోటీ చేసిన వారిలోనూ గెలిచే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఈ విధంగా రాజకీయ వ్యవస్థపై రాజకీయపార్టీల పట్టు పెరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
చిట్యాల (నకిరేకల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ అమలు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతోందని తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడులో దశమి ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం గుండ్రాంపలిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్ల కాలంలోనే రూ.రెండు వేల కోట్లతో ఆభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గుండ్రాంపల్లి గ్రామంలో మరో 150 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆయా కార్యక్రమాల్లో జేసీ నారాయణరెడ్డి ,ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ రాచకొండ లావణ్య క్రిష్టయ్య, తహసీల్దార్ సీహెచ్.విశాలాక్షి, ఎంపీడీఓ జి.కాంతమ్మ, ఈఓపీఆర్డీ బి.లాజర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఎద్దులపురి క్రిష్ణ, గుండెబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, బక్క శేఖర్, గోలి మహేష్, బైకాని నాగరాజు, బోడిగె అంజయ్య, నర్సింహ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి నార్కట్‌పల్లి (నకిరేకల్) : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బి.వెల్లెంలలో రూ.5కోట్లతో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.రాష్ట్రంలో నేటి వరకు 2లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.700కోట్లతో ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. రూ.30కోట్లతో ప్రతి జిల్లాలో మత్సకార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బి.వెల్లెంల ఉదయ సముద్రంప్రాజెక్టు రెండు నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నార్కట్‌పల్లి మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. -
రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి రూ. 4,494 కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూ.4,494 కో ట్లు కేటాయించింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 188.51 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీచేసినట్లు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 161వ జాతీయ రహదారిలో కంది నుంచి రామసానిపల్లె వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రూ.1201.62 కోట్లు, రామసానిపల్లె నుంచి మంగ్లూ ర్ గ్రామం వరకు 46.6 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు కోసం మరో రూ.1,220 కోట్లు మంజూరు చేసింది. మంగ్లూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు కోసం రూ.1,082 కోట్లు, రేపల్లె్లవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ. 4 లైన్ల రోడ్డు కోసం రూ.988 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ వెల్లడించింది. -
బాబు తీరు రాష్ట్రానికి శాపమైంది: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు.. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈమేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారన్నారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు. ఆస్పత్రి పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని వెల్లడించారు. -
కేలో..కేలో..కేలోరే...!
ఉత్కంఠంగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మెయిన్ డ్రాలో ఆడుతున్న క్రీడాకారులు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ఉత్కంఠతతో కొనసాగాయి. క్రీడాకారులు మెయిన్‌డ్రాలో తమ సత్తాను చాటుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 13, 15 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్‌తో బాలురు, బాలికల జట్ల మ«ధ్య హోరాహోరీగా సాగుతోంది. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం, భాను ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్ జరుగుతుండగా, డబుల్స్ శుక్రవారం జరగనున్నాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారు త్వరలో జరగబోయే నేషనల్స్ టోర్నమెంటోలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. నేషనల్స్‌కు వెళ్లాలి నాకు చిన్నప్పటినుంచి షటిల్ అంటే తెలీని ఇçష్టం, దాంతో స్కూలులో ఎక్కువగా ఆడుతుండేవాడిని. అదే నాకు మంచి తోడ్పాడునిచ్చింది. ఇప్పటివరకు అండర్ 13లో నాలుగు టోర్నమెంట్లు ఆడాను. నేషనల్స్‌కు వెళ్లి రాష్ట్రం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. - అభిరామ్, షటిల్ క్రీడాకారుడు. శ్రీకాకుళం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నాను. వారిచ్చే ప్రోద్బలంతో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది. నేషనల్ ర్యాంకింగ్ కొయంబత్తూర్ ఆడాను. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాను. -కె.సాత్విక్ కోర్, షటిల్ క్రీడాకారుడు. ఒంగోలు ఒలింపిక్ సాధనే లక్ష్యం.. ఒలింపిక్ సాధనే లక్ష్యంతో ఆడుతున్నాను. నేషనల్ ర్యాంకింగ్ సెవెన్‌తో పాటు తెనాలి స్టేట్ విన్నర్‌గా నిలిచాను. అండర్ 13లో ఆడుతున్నాను. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఆసక్తికరంగా పోటీలు సాగుతున్నాయి. విజేతగా నిలిచేందుకు కృషి చేస్తున్నాను. - బాబారావ్, షటిల్ క్రీడాకారుడు. కడప. నేషనల్స్‌కు ఆటగాళ్లను పంపుతాం రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు వచ్చారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయలు కల్పించాం. క్రీడాకారులు పోటాపోటీగా ఆడుతున్నారు. 19న జరిగే పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారిని నేషనల్స్‌కు పంపుతాం. ఈ పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. - జి.సాయిబాబా, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ -
వందే.. మందేశ్వరా..!
రాష్ట్రంలోనే రెండో శనిక్షేత్రం వల్లూరిపల్లి 103ఏళ్ల చరిత్ర 19న శనిత్రయోదశి ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు నేరుగా స్వామికి తైలాభిషేక అవకాశం శనిదోషాల నివారణకు శనీశ్వరుని పూజించడం ఆనవాయితీ. శనిత్రయోదశి నాడు ఆ స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల నమ్మిక. మన జిల్లాలోనూ వల్లూరిపల్లిలో శనీశ్వరాలయం ఉందని, అది రాష్ట్రంలోనే రెండో క్షేత్రమని మీకు తెలుసా..! ఈ క్షేత్రంలో 19న శనిత్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర మహిమ గురించి ప్రత్యేక కథనం.. పెంటపాడు : రాష్ట్రంలోనే తొలి శనీశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఉంది. రెండో ఆలయం మన జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో ఉంది. ఇక్కడి మందేశ్వరస్వామి(శనీశ్వరుడు) ఆలయానికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంభూ ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో పూజలు చేస్తే శనిదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి లింగాకర రూపంలో ఉండడం విశేషం. 1815లో నిర్మించిన ఈ ఆలయం 103 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి, మందేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, విశ్వేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రతి శనిత్రయోదశి నాడు ఇక్కడ విశేష అభిషేకాలు జరుగుతాయి. 103ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19న శనిత్రయోదశి నాడు భక్తులే స్వామిని అభిషేకించే అవకాశం ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు తెలిపారు. శనిదోషాలంటే.. సూర్యుడు నుంచి కేతువు వరకు నవగ్రహాల సంచారం వల్ల కొంతమందికి గ్రహస్థితి సరిగాలేకపోవడం వల్ల విచారం, దిగులు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు సరిగా ఉండవు. వీటినే శనిదోషాలంటారు. వీటి నివారణకు శనీశ్వరుని పూజించాలని పండితులు చెబుతున్నారు. శనిదోష నివారణ పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడ పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు. తైలాభిషేక ప్రియుడు శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడని, ఆయనను నూనెతో అభిషేకిస్తే త్వరగా కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు. త్రయోదశి నాడు కాలువలో స్నానం చేసి ఆ దుస్తులను అక్కడే వదిలి కొత్త వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనాలని, లింగాకారంలో ఉన్న శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం, ఇతర పూజలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు, అష్టయిశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. ఇక్కడ పూజలు చేయించుకొన్నవారు తిరిగి మొక్కులు తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా మారింది. శనిత్రయోదశి నాడు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపత్యంలో అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆలయవంశపారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్, ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు వీటిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఏకైక ఆలయం జిల్లాలో ఏకైక శనీశ్వర ఆలయంగా వల్లూరిపల్లిక్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారంతో పాటు, శని త్రయోదశి రోజున జిల్లాతోపాటు, రాష్ట్రం నలుమూలల నుండి పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి వస్తారు. లింగాకారంలో ఉన్న శనీశ్వరుడు ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. ఆలయ అర్చకులు పూజ్యం వెంకటసత్యనారాయణ శర్మ ఇటీవల భక్తులు పెరిగారు మా ఊరులో శనీశ్వరుని ఆలయం ఉండడం ఆనందంగా ఉంది. నాచిన్నప్పుడు కన్నా ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి స్నానాలకు గదులు, వసతికి ప్రత్యేక రూములు నిర్మిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. దెయ్యం వెంకటేశ్వరరావు, వల్లూరిపల్లి గ్రామస్తుడు -
అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు
రూ. 20 లక్షల బంగారు, వెండి వస్తువుల స్వాధీనం కాకినాడ క్రైం : వారు ముగ్గురూ అంతర్ రాష్ట్ర నేరస్తులు.. రాష్ట్రంలో పలు పోలీస్స్టేషన్లలో పోలీసు కేసులున్నాయి.. పగటిపూట సింగిల్‌గా ఉంటున్న ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించడం, రాత్రిపూట ఇంట్లో పడి దోచుకోవడం... జైలుకెళ్లడం... బెయిల్‌పై వచ్చి చోరీలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ముగ్గురు అంతర రాష్ట్ర నేరస్తులను ఎట్టకేలకు కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నేరస్తుల వివరాలను వెల్లడించారు. జిల్లాలో కాజులూరు బ్రాహ్మణ వీధికి చెందిన ముప్పయ్ సంవత్సరాల షేక్ అజీజ్ (నాని), పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, కొండగూడెంకు చెందిన ఇరవై ఆరేళ్ల అంతర్ రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్, రాజమహేంద్రవరం మల్లిఖార్జునగర్కు చెందిన నలభై అయిదేళ్ల షేక్ బాషి (బాషా)లతో కలసి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 ఇళ్లల్లో రాత్రి పూట చోరీలకు పాల్పడ్డారు. ఇందులో షేక్ అజీజ్‌పై గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం, పెదపూడి, రాయవరం, అనపర్తి, అన్నవరం, రామచంద్రపురం, ద్రాక్షరామ, అంబాజీపేట, విజయవాడ, భీమడోలు, తణుకు, ఏలూరు జరిగిన 50 చోరీ కేసులలో అరెస్ట్ శిక్ష అనుభవించాడు. చీకట్ల సతీష్ హైదరాబాద్, ఒంగోలు, మచిలీపట్నం, ఏలూరు, కూచిపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, వైజాగ్, విజయనగరం లో సుమారు 40 కేసుల్లో అరెస్టయి 2016 డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. షేక్ అజీజ్ మార్చి నెలలో జైలులో ఉన్న నేరస్తుడు చీకట్ల సతీష్‌ని బెయిల్‌పై తీసుకొచ్చి మరో నేరస్తుడు షేక్ బాషితో కలసి రావులపాలెం, నిడదవోలు,2015 జనవరిలో సర్పవరం కాకినాడ పబ్లిక్ స్కూలు, 2016లో అశోక్‌నగర్ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. చీకట్ల సతీష్ కాకినాడ టూటౌన్ పరిధిలోని రెండు మోటార్ సైకిళ్లు, పశ్చిమగోదావరి జిల్లాలో లక్కవరం, ద్వారకా తిరుమల, నర్సాపురం, సమిశ్రగూడెంలో ఏడు ఇళ్లలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వీరి ముగ్గురిలో షేక్ అజీజ్‌పై 12 కేసులు, చీకట్ల సతీష్‌పై 12 , షేక్ బాషిపై 3 కేసులలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నేరస్తులు కాజులూరులో షేక్ అజీజ్ ఇంటిలో ఉన్నట్టు సమాచారం రావడంతో సోమవారం కాకినాడ క్రైం డీఎస్పీ ఏ.పల్లపురాజు ఆధ్వర్యంలో క్రైం ఎస్సైలు కేవీవీ రామారావు, జి.హరీష్కుమార్ల ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేశారు. 500 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, 9.323 కిలోల వెండి ఆభరణాలు, రెండు మోటార్ సైకిల్స్, ఒక ఎల్ఈడీ టీవీని నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడటం, గంజాయి అక్రమ రవాణా, మిలీషియా çకమాండర్ అరెస్ట్, దొంగతనాల రికవరీలలో సిబ్బంది మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. క్రైం డీఎస్పీ పల్లపురాజు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’
అలరించిన బాలల నృత్య ప్రదర్శన కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను గురువారం శుభోదయ ఫౌండేషన్ చైర్మన్ వాసా సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరిషత్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. బుద్ధరాజు చేస్తున్న సేవలను పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు కొనియాడారు. తదుపరి అభినయ ఆర్ట్స్(గుంటూరు) సారథ్యంలో శిష్టా చంద్రశేఖర్ రచించిన ‘సరికొత్త మనుషులు’ నాటికను ఎన్.రవీంద్రారెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. భారత దేశంలో అనాథశరణాలయాల ఆవశ్యతను చక్కగా చిత్రీకరించారు. మగవాడి పశువాంఛకు బలై గర్భం దాల్చిన కన్యలు పడుతున్న మనోబాధలను చక్కగా చిత్రీకరించారు. చేసిన తప్పుకు ఫలితంగా జన్మించిన పిల్లలను సమాజంలో గౌరవంగా సాకలేక, అలా అని వదిలిపెట్టలేక మనస్సు చంపుకొని అనాథ శరణాలయాలకు దొంగచాటుగా అప్పగిస్తున్న యధార్థ సంఘటనలను ఈ నాటికలో చిత్రీకరించారు. అనంతరం శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్రనాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్యులు ప్రదర్శించిన వినాయక శబ్ధం, శివ పంచాక్షరి నృత్యాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరీష, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు ఇక చాలు’ స్ధానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజల నుంచి నిర్వహిస్తున్న నాటిక పోటీలు గురువారంతో ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా చాలు ఇక చాలు నాటికను ఎంపిక చేసారు. ద్వితీయ ప్రదర్శనగా గోవు మాలచ్చిమి, తృతీయ ప్రదర్శనగా తేనేటీగలూ పగబడతాయి నాటికలు ఎంపిక చేసారు.అలాగే ఉత్తమ దర్శకులుగా చాలు ఇక చాలు నాటికకు దర్శకత్వ చేసిన గోపారాజు విజయ్, ఉత్తమ నటుడుగా చాలు ఇక చాలు కథానాయకుడు రమణ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారిణి అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటిగా సరికొత్త మనుషులు లో నటించిన టి.లక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ రచనకు గాను గోవుమాచ్చిమి నాటిక రచించిన చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ విలన్ గా తేనేటీగలూ పగబడతాయి నాటికలో దొర పాత్రదారి అమరేంద్ర ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా తేటేటీగలూ పగబడతాయి నాటికలో పాముల ఆదియ్య పాత్ర దారి బి.మోహాన్ ఎంపికయ్యారు. వీరికి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అవార్డులను ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కార్యదర్శి పంపన దయానందబాబు, సభ్యులు తదితరలు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’
రెండోరోజు ఉత్సాహంగా నాటికల పోటీలు కాకినాడ కల్చరల్: స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ముందుగా శ్రీమూర్తి అసోసియేషన్(కాకినాడ) సారధ్యంలో పీవీ భవానీ ప్రసాద్ రచించిన ‘అంతిమతీర్పు’ నాటికను డా.సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఒక దురదృష్ట సంఘటనకు లోనై తనలో తాను కుమిలిపోతు.. కసి, కోపం,ద్వేషం పెంచుకొని చివరకు కట్టుకున్న భర్తని, కన్న కొడుకును దరికి చేర్చుకోలేక , మనశ్శాంతికి దూరమైన ఒక జనని కథ అంతిమ తీర్పు నాటిక. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక (శ్రీకాకుళం) సారధ్యంలో కేకేఎల్ ప్రసాద్ దర్శకత్వం, రచన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’నాటిక ప్రదర్శించారు. భూస్వాముల దోపిడికి బడుగు, బీద వర్గం బలైపోయే సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రికరించారు. తదుపరి ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) సారధ్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రస్తుతం సమాజంలో అద్దె గర్భాలతో మన సంస్కృతిక, సాంప్రదాయలను మంట గలుపుతున్నారనే భావంతో ఈ నాటికను రూపొందించారు. పేద మహిళలు మనస్సు చంపుకొని ఏవిధంగా ఇటువంటి అద్దె గర్భాలకు అంగీకరిస్తోన్నారు కళ్ళకు కట్టినట్టు నాటిక ప్రదర్శించారు. తదుపరి శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకులూరు) సారధ్యంలో పి.వి.భవానీ ప్రసాద్ రచించిన ‘చాలు–ఇకచాలు’ నాటిక గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బొర్రా పద్మనాభం, కొల్లి వెంకట్రావు, ఎం.జానకీరామ్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరిష, తురగా సూర్యారవు తదితరులు పాల్గొన్నారు. నేడు సరికొత్త మనుషులు నాటిక స్థానిక సూర్యకళామందిర్‌లో గురువారం సాయంత్రం ఎన్.రవీంద్రా రెడ్డి దర్శకత్వంలో ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డు ప్రధానం చేస్తారు. 05కెకెడి197–270025: తేనేటీగలు పగబడతాయి నాటికలో ఒక సన్నివేశం 05కెకెడి198–270025: గోవు మాలచ్చిమి నాటికలో ఒక సన్నివేశం -
తాడో పేడో తేల్చుకుంటాం
కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తాం 7న కాకినాడలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ కాకినాడ రూరల్ కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వంతో తాడో డో తేల్చుకుంటామని జిల్లా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గురువారం కాకినాడ రూరల్ రమణయ్యపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ వీవై దాసు మాటట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు అడుగుతున్న తమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు దాడి చేయిస్తున్నారన్నారు. మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రోద్బలంతో ఉద్యమంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఏడాదికి కాపులకు రూ.1,000 కోట్లు రుణాలు ఇస్తామని చెప్పి, మూడేళ్ల పదవీ కాలంలో కేవలం రూ. 320 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 3.30 లక్షల మంది కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. కాపులు సామాజిక, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను 1.10 లక్షల మంది సంతకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్‌తో మంజునాథ కమిటీకి అందజేశామన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతుంటే పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు దాటకూడదని ప్రభుత్వం చెబుతోందని, ఇది ఎంతమాత్రం నిజం కాదని జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ తెలిపారు. దేశంలోని కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 65 నుంచి 70 శాతానికి పైగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. జిల్లాకు చెందిన దేశంలో ఎన్నడు లేని రీతిలో జిల్లాలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అత్యవసర పరిస్థితిని పోలీసులతో విధించారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ నుంచి నేటి దాకా సెక్షన్ 30 అమలు చేసిన ఘనత హోం మంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం ముఖ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎంకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. గ్రామాల్లోకి ఏముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారో అప్పుడే కాపుజాతి ప్రజా ప్రతినిధులను నిలదీస్తారన్నారు. కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ నెల 7న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్రస్థాయి జేఏసీ సర్వసభ్యుల సమావేశాన్ని కాకినాడ పద్మనాభ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కె.తాతాజీ, బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్‌ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్‌ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్‌బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్‌లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్‌కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు. -
ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు గొల్లప్రోలు : శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో తాటిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న 12వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్థానిక అపర్ణా కళాతోరణం, బత్తుల మురళీకృష్ణ కళావేదికపై మూడు రోజులుగా నాటిక పోటీలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ‘చాలు ఇక చాలు’, ఖాళీలు పూరించండి నాటికలను ప్రదర్శించారు. నాటిక పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, కళాభిమానుల తరలివచ్చారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు పోటీల్లో ఉత్తమ నాటికగా కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ నాటికగా తాడేపల్లి వారి అరవింద ఆర్ట్స్ ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమనాటికగా సికింద్రాబాద్ వారి కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ఖాళీలు పూరించండి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు– కరణం సరేష్(అనంతం), ఉత్తమ నటి–సాదినేని శ్రీజ(ఖాళీలు పూరించండి) , ఉత్తమ రచన– పి.మృత్యుంజయరావు(అనగనగా..), ఉత్తమదర్శకుడు ఆర్ వాసు (అనగనగా..) ఉత్తమ క్యారెక్టర్ నటుడు బీవీ లక్ష్మయ్య(ఆగ్రహం), ప్రతినాయకుడు –పి.భద్రేశ్వరరావు(చేతిరాత ), రంగాలంకరణ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(అనగనగా..) ఆహార్యం– పి.మోహనేశ్వరరావు(అనగనగా), ఉత్తమ సంగీతం– కేఎస్ఎన్ రావు(పితృదేవోభవ) ఎంపికయ్యాయి. అనగనగా నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. నాటికలకు న్యాయనిర్ణేతలుగా రాజాతాతయ్య, కట్టా కృష్ణారావు వ్యవహరించారు. విజేతలకు శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ అధ్యక్షులు పడాల రవి, ప్రధానకార్యదర్శి జక్కా సాంబశివరావు, రాజాతాతయ్య, బత్తుల వెంకటశివరామారావు తదితరులు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. కుటుంబభావోద్వేగాలను చాటిన ‘చాలు ఇక చాలు ’: కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక కుటుంబభావోద్వేగాలను చాటింది. ఈ లోకంలో ప్రతి దానికి మితం ఉందని.. కానీ పిల్లలు ఏదడిగినా తల్లిదండ్రులు కాదు.. లేదు..కుదరదు అని చెప్పలేరని... అదే పిల్లలు ఎదిగి పెద్దవారయ్యాక తల్లిదండ్రులు ఏది అడిగినా ‘కాదు.. లేదు..కుదరదు’ అని ఎంతో సులువుగా తప్పించుకుంటున్నారనే ఇతి వృత్తంతో నాటిక సాగింది. ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పీవీ భవానీ ప్రసాద్ రచించారు. ఆలోచింపజేసిన ‘ఖాళీలు పూరించండి’.. సికింద్రాబాద్‌కు చెందిన కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. సమాజంలో జరుగుతున్న నేరాలు..వాటి పరిణామాలను ఇతి వృత్తంగా చేసుకుని నాటిక సాగింది. రచయిత భాగవతుల ఉదయ్ నాటిక ద్వారా చక్కని సందేశమిచ్చారు. హాస్యాస్పదంగా సాగిన‘ అంతా మన సంచికే ’.. గుంటూరుకు చెందిన గణేష్ ఆర్ట్స్‌వారు ‘అంతా మన సంచికే ’ నాటిక ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం హాస్యాస్పదంగా.. సందేశాత్మకంగా సాగింది. డబ్బు కంటే మమతానురాగాలు ముఖ్యమని నాటిక తెలియచెప్పింది. -
‘అక్ను’ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం
యూజీసీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన ‘అక్ను’ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముత్యాలనాయుడు రాయవరం : ఆది కవి నన్నయ యూనివర్సిటీ రాష్ట్రంలోనే అతి పెద్ద విశ్వ విద్యాలయమని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. రాయవరంలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘అక్ను’ పరిధిలో 460 కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నట్టు తెలిపారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభించే సమయానికి 21 కోర్సులు ఉండగా, ప్రస్తుతం 36 కోర్సులు ఉన్నట్టు తెలిపారు. ఏటా కొత్త కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో సీపీఏ(అమెరికన్ కోర్సు), ఫోర్స్‌నిక్ సైన్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. యూనివర్సిటీలో లేని కోర్సులు డిగ్రీ కళాశాలల్లో పెడుతున్నట్లు ఆయన తెలిపారు. 45.28కోట్లు మంజూరు.. యూనివర్సిటీ ప్రారంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా రూ.45.28కోట్లు విడుదల చేశారన్నారు. ఆ నిధులతో నూతన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీకి 115 ఎకరాలు కేటాయించగా, ఇప్పటి వరకు 95 ఎకరాలు అప్పగించారని, ఇంకా 20 ఎకరాలు అప్పగించాల్సి ఉందన్నారు. నేడు, రేపు యూజీసీ కమిటీ పర్యటన.. ‘అక్ను’ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గురు, శుక్రవారాల్లో సందర్శిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. యూజీసీ కమిటీ యూనివర్సిటీకి ఉన్న భవన సముదాయం, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. యూజీసీ కమిటీ సానుకూలమైన నివేదిక ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 12బీ గుర్తింపుతోనే నన్నయ ప్రగతి రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బీ గుర్తింపు లభిస్తేనే త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద యూనివర్సిటీగా ఉన్న నన్నయ అభివృద్ధి ఇంతకాలం నామమాత్రంగానే జరిగిందన్నారు. గురు, శుక్రవారాల్లో యూజీసీ కమిటీ జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న వివిధ సదుపాయాల ఆధారంగా 12బీ అనుమతి ఇస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. -
‘స్టేట్’ అంటే రాష్ట్ర ప్రభుత్వమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసేకరణ కోసం తీసుకొచ్చిన ‘ది తెలంగాణ స్టేట్ పాలసీ ఫర్ అక్విజేషన్ ఆఫ్ ల్యాండ్ త్రూ అగ్రిమెంట్’లో స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వమేనని అర్థం చెబుతూ తెలంగాణ సర్కారు వివరణ ఇచ్చింది. జిల్లాల్లో భూసేకరణ సందర్భంగా కలెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వివరణ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని సచివాలయ విభాగాధిపతులు, కలెక్టర్లను ఆదేశించింది. -
సామాజిక రాయలసీమ కోసం పోరాటం
– ఆర్పీఎస్ అధ్యక్షుడు కందనవోలు కృష్ణయ్య కర్నూలు(అర్బన్): సామాజిక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని రాయలసీమ ప్రజా సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు కందనవోలు కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్‌లోని బీసీ భవన్లో ప్రజా సమితి ఉపాధ్యక్షుడు టీ నాగభూషణం అధ్యక్షతన ‘ రాయలసీమ వెనుకబాటు తనం – సామాజిక వెనుకబాటుతనం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయ ఆచారి, జనం మాట పత్రిక ఎడిటర్ సత్యన్న, రాయలసీమ ప్రజా వేదిక కన్వీనర్ సీవై రామన్న, కో కన్వీనర్ పగడాల శేఖర్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, బీసీ ఐక్యవేదిక కన్వీనర్ టీ శేషఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మారోజు వీరన్న, డాక్టర్ మాధవస్వామి స్ఫూర్తితో భౌగోళిక రాయలసీమలో బహుజన ప్రజారాజ్య స్థాపనకు ఉద్యమించాలన్నారు. జీఓ నెంబర్ 69ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గురు రాఘవేంధ్ర, వేదవతి, గుండ్రేవుల, చెన్నరాయుని తిప్ప ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరికి కేటాయించిన మిగులు జలాలకు చట్టబద్ధత కల్పించాలని, కేసీ కెనాల్ మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధనకు ఈ నెల 3న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని, 9న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ప్రజాపార్టీ అధ్యక్షుడు కంది వరుణ్‌కుమార్ యాదవ్, ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కే బలరాం పాల్గొన్నారు. -
పట్టిసీమపై మొట్టికాయ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ తలంటింది. పోలవరం కుడికాలువ పూర్తికాకుండా, కనీసం డిస్ట్రిబ్యూటరీలను, పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడాన్ని తప్పు పట్టింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని మొట్టికాయ వేసింది. ప్రాజెక్టు పూర్తయి ఏడాది దాటినా ఇప్పటికీ కుడికాలువ (ఇది పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ) పనులు పూర్తికాని సంగతి తెలిసిందే. పలు వంతెనలు, కుడికాలువ లైనింగ్ పనులు సైతం పూర్తి కాలేదు. హడావుడిగా నీరు విడుదల చేయటం వల్ల ఒకసారి జానంపేట వద్ద, మరోసారి రామిలేరు వద్ద కాలువకు గండ్లుపడ్డాయి. దీనివల్ల అదనంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. టెండర్ ప్రీమియాన్ని తగ్గించడం, పోలవరం కాలువ పనులు పూర్తికాకుండానే అధికంగా పెంచిన అంచనాలకు ఎత్తిపోతల పథకం పనులు కట్టబెట్టడాన్ని ప్రశ్నించింంది. నిర్మాణ పద్ధతిలో మార్పులు తేవడం ద్వారా రూ.18 కోట్లు అనవసర వ్యయం అయిందని, పైపులకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉన్నా రూ. 17 కోట్లు మళ్లీ చెల్లించాలి్సన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తరలించడంతో పాటు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 2016 మార్చి నాటికి పూర్తి అయినా పోలవరం కుడి కాలువ పనులు మాత్రం జూన్ నాటికి కూడా పూర్తి కాలేదని కాగ్ గుర్తించింది. ఈ ఎత్తిపోతలలో 24 పంపులకు గాను 2016 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య11 పంపులను మాత్రమే ఉపయోగించాల్సి వచ్చింది. ప్రణాళిక లేకపోవడం వల్ల పశ్చిమగోదావరి జిల్లాకు ఈ ప్రాజెక్టు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది. పట్టిసీమ ప్రాజెక్టు సరికాదంటూ విపక్షాలు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వానికి కాగ్ నివేదికతో తల బొప్పికట్టినట్టైంది. -
ఈ – ఆఫీసు అమలులో...అట్టడుగున ‘అనంత’
అనంతపురం అర్బన్ : ఈ – ఆఫీసు అమలులో అనంతపురం రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారానే పరిష్కరించాలని అధికారులు ఆదేశాలిస్తున్నారు. జిల్లాలో 100కు పైగా ప్రభుత్వ శాఖల్లో ఈ - ఆఫీసు అమలు చేస్తున్నారు. అయితే అమలులో చాలా వెనుకబడి ఉంది. జనవరిలో 1,380 ఫైళ్లు, ఫిబ్రవరిలో 1,004 ఫైళ్లు పరిష్కరించారు. మార్చిలో 741 ఫైళ్లను పరిష్కరించడంతో సరిపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఫ్లైళ్ల పరిష్కారంలో జాప్యం జరిగిందని కొందరు అధికారులు సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనంతపురం జిల్లాలో మాత్రమే జరగలేదు. అనంతపురం ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలు కూడా వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా యంత్రాంగానికి అదనపు పని ఏదైనా ఉందంటే అది ఓట్ల లెక్కింపు మాత్రమే. మిగతా ఎన్నికల ప్రక్రియ మూడు జిల్లాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మార్చిలో వైఎస్ఆర్ జిల్లాలో 6,906 ఫైళ్లు, కర్నూలు జిల్లాలో 1,347 ఫైళ్లను పరిష్కరించారు. జిల్లాలో మాత్రం 741కే పరిమితమైంది. ఒక్క మార్చిలోనే కాదు జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కంటే అనంతపురం జిల్లా వెనకబడి ఉంది. ఇక రాష్ట్రంలో ఏకంగా 13వ స్థానంలో నిలిచింది. ఈ–ఆఫీసుపై తగ్గిన శ్రద్ధ జిల్లా ఉన్నతాధికారులు ఈ–ఆఫీసు అమలు ప్రారంభంలో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ప్రతి ఫైలు ఈ–ఆఫీసు ద్వారానే రావాలనే కచ్చితమైన ఆదేశాలిచ్చారు. రానురాను ఈ–ఆఫీసుపై సమీక్షలు తగ్గిపోయాయి. అదే స్థాయిలో ఫైళ్ల పరిష్కారమూ మొక్కుబడి తంతుగా మారింది. -
సీఆర్సీ కళాసేవ అభినందనీయం
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్ -రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్‌రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) : ద్రాక్షారామ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా సికింద్రాబాద్ కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ ‘ఎవరిని ఎవరు క్షమించాలి,’ ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ ‘కేవలం మనుషులం,’ ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఉషోదయా కళానికేతన్ కట్రపాడు ‘గోవు మాలచ్చిమి,’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా ‘గోవు మాలచ్చిమి’ నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్.అమృతవర్షిణి. ఉత్తమ నటుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటికలో పుణ్యదాసు పాత్రధారి జోగారావు, ఉత్తమ దర్శకుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక దర్శకుడు ఉదయ్ భాగవతులు, ఉత్తమ రచనకు ‘కేవలం మనుషులం’ నాటిక రచయిత శిష్టా చంద్రశేఖర్, ఉత్తమ సంగీతం బహుమతి ‘గోవు మాలచ్చిమి’ నాటికకు పి.లీలామోహన్. ఉత్తమ విలన్‌గా ఒంగోలు జనచైతన్య ‘చేతిరాత’ నాటికలో గోవిందరాజు పాత్రధారి పి. భద్రేశ్వరరావు, ఉత్తమ కారెక్టర్ నటుడు ‘కేవలం మనుషులు’ నాటికలో మీర్జా ఆలీఖాన్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్, ఉత్తమ ద్వితీయ నటి ‘చేతిరాత నాటిక’లో దుర్గ పాత్రధారి ఎల్.పద్మావతి. ఉత్తమ ద్వితీయ నటుడు ‘గోవు మాలచ్చిమి’ నాటికలో నారాయణ పాత్రధారి చిరుకూటి సాంబశివరావుకు లభించాయి. ‘సప్తపది’ నాటికలో ముకుందం పాత్రధారి ఎ.హరిబాబు, ‘చేతిరాత’ నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి సీహెచ్ సుబ్బారావు, ‘కేవలం మనుషులం’ నాటికలో అమల్రాయ్ పాత్రధారి ఎ.లక్ష్మణశాస్త్రికి జ్యూరీ బహుమతులు లభించాయి. నాగిరెడ్డికి ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం ముగింపు సమావేశంలో ద్రాక్షారామ నాటక కళాపరిషత్ అధ్యక్షడు నాగిరెడ్డి సత్యనారాయణకు ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ నాగిరెడ్డి ఈ పరిషత్ స్థాపించి 80 ఏళ్ల వయసులో కూడా చేస్తున్న సేవలను కొనియాడారు. పరిషత్ ఉపా«ధ్యక్షుడు వైఎన్వీవీ సత్యనారాయణ (కొండ), కార్యదర్శి, సినీనటి వై.సరోజ, పరిషత్ కోశాధికారి అయినవిల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి వేమవరపు రాంబాబు, పరిషత్ ఆర్గనైజర్ నాగిరెడ్డి సతీష్‌రావు, పరిషత్ సభ్యులు మాకినీడి రామారావు, ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనను చిక్కాల సత్కరించారు. పెద్దిరెడ్డి సూరిబాబు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు స్టాలిన్, చింతపల్లి వీరభద్రరావు, చింతపల్లి ఈశ్వరరావు కాజులూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఆళ్ల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీర్జాఖాసిం హుస్సేన్, కోటిపల్లి అబ్బు తదితరులు పాల్గొన్నారు. -
పరుగో.. పరుగు
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు సీనియర్స్ విజేత విశాఖ జూనియర్స్ విజేత తూర్పుగోదావరి గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. * సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి. * జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి. విజేతలకు బహుమతులు సీనియర్స్‌లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు. -
హోదా రాకపోతే రాష్ట్రం నిర్వీర్యం
– ప్యాకేజీతో అభివృద్ధి శూన్యం - సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ పత్తికొండ: రాష్ట్ర విభజనలో పొందుపర్చిన డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రం నిర్వీర్యం అవుతుందని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని తేరుబజారులో సామాజిక హక్కుల వేదిక నియోజకవర్గ కన్వీనర్ నబిరసూల్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి ఉండదన్నారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించేవరకు ఉద్యమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో రాజ్యమేలుతున్న 14 రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సింగాపూర్ జపం చేయడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తీవ్ర కరువులతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగు హోదా కోసం చేసిన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో బీజీపీ నాయకుడు వెంకయ్య నాయుడు 10ఏళ్ల హోదా ఇస్తేమంటే.. కాదు 15ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌ను మరచి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టు కోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నోటి దురుసును అదుపు చేసుకోవాలని హెచ్చరించారు. పందులు, కోళ్ల పందేలతో ప్రజలను పోల్చడం సరైందికాదన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నాడని, డబ్బులు ఉన్న వారికే సీట్లు ఇస్తున్నాడని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలసి కట్టుగా హోదాను సాదించుకోవడానికి ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, జిల్లా కార్మిక సంఘం నాయకులు భీమలింగప్ప, శేఖర్, సీపీఎం నాయకులు వీరశేఖర్, రంగారెడ్డి, సామాజిక హక్కుల వేదిక నాయకులు గురుదాసు, సోమ శేఖర్, ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, శంకరయ్య, వెంకటేష్, రవి, కారు మంచి, కృష్ణయ్య, గిడ్డయ్య, సురేంద్ర, ఇబ్రహీమ్, ఇమ్రాన్ పాల్గొన్నారు, -
ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ
తాటిపర్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటకపోటీలు గొల్లప్రోలు (పిఠాపురం) : తాటిపర్తిలోని అపర్ణ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన విజయాదిత్య ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంటింటి కధ’ ఎంపికకాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన కళాంజలి బృందం ప్రదర్శించిన ‘జారుడుమెట్లు ’ ఎంపికైంది. ఉత్తమనటుడుగా ఇంటింటి కధ పాత్రధారి గోపరాజు విజయ్, ఉత్తమనటిగా జారుడుమెట్లు పాత్రధారి నవీన, ఉత్తమ రచనకు ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్ (ఇంటింటి కధ), ఉత్తమ దర్శకత్వానికి కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు), ఉత్తమ సంగీతం –సాంబశివరావు (ఇంటింటి కధ), రంగాలంకరణ–పిఠాపురం బాబూరావు (మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఉత్తమ ప్రతినాయకి– రజనీ శ్రీకళ (జారుడుమెట్లు), ఉత్తమ హాస్యనటుడు– పీఎస్ సత్యనారాయణ (ఇంటింటి కధ), సహాయ నటి–రమాదేవి æ(ఇంటింటి కధ), సహాయనటుడు–వరప్రసాద్ (జారుడుమెట్లు), ఆహార్యం– పరమేశ్వరరావు(మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఎంపికయ్యారు. విజేతలకు ప్రముఖసినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు, నాటకపరిషత్ కార్యదర్శి బత్తుల వీరభద్రం, ఆకొండి వెంకటేశ్వరశర్మ, దాసం కామరాజు, బాబూరావు, ఆకొండి వెంకటేశ్వరరావు, అమరాది గోపాలకృష్ణ, ప్రభాకరశాస్త్రి, సిద్దా నానాజీ, న్యాయనిర్ణేతలు రాజా తాతయ్య, సీఎ¯ŒS మూర్తి, కె పుల్లారావు తదితరులు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. హరనాథరావు మాట్లాడుతూ అపర్ణ నాటకకళాపరిషత్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకపోటీలు రసవత్తరంగా సాగాయన్నారు. ప్రతీ సంవత్సరం నాటకాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ నాటకరంగం రక్షించబడుతుందో అక్కడ కళారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కళాపరిషత్‌లు నాటక రంగానికి జీవం పోస్తున్నాయని తెలిపారు. -
రాజ్యాధికారం కోసం పోరాడుదాం
రాష్ట్ర చేనేత కులాల ఐక్యవేదిక సమావేశంలో నాయకులు పిఠాపురం టౌన్ : చేనేత కుటుంబాలు కష్టాల నుంచి బయటపడాలంటే సమానత్వం, ఆర్థికస్వాలంభన, రాజ్యాధికారం దిశగా పోరాడాలని రాష్ట్రంలోని పలు చేనేత కులాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో శనివారం జరిగిన రాష్ట్ర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. చేనేతే రంగం మీద ఆధారపడి జీవిస్తున్నవారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 19 శాతంగా ఉన్న చేనేత వర్గం అభివృద్ధి చెందాలంటే రాజకీయ ఆవశ్యకత అవసరమని కనీసం 10 మంది ఎమ్మెల్యేలను నెగ్గించుకునేందుకు ప్రతి చేనేత కుటుంబం కృషి చేయాలన్నారు. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. వీటికి నవరత్నాలు అని పేరుపెట్టారు. ఫ్రంట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా ఎంపికైన తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తీర్మానాలను చదివి వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యాయంతో సమగ్ర చేనేత జాతీయ, రాష్ట్ర విధానం అమలు చేయాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు వర్షాకాలంలో నేత విరామం అమలు చేయాలని, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు వార్షిక బడ్జెట్ కేటాయించాలని తీర్మానించారు. అలాగే చేనేత రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి ముఖ్యమంత్రికి స్వీయపర్యవేక్షణ ఉండాలని తదితర తీర్మానాలను ఆమెదించారు. వివిధ సంఘాల అధ్యక్షులు వై.కోటేశ్వరరావు, కోట వీరయ్య, మలిపెద్ది అప్పారావు, పాలాటి బాలయోగి, అడికి మల్లిఖార్జునరావు, ఎం.వెంకటేశ్వర్లు, తూతిక అప్పాజి, నక్కిన చినవెంకటరాయుడు, జగ్గారపు శ్రీనివాసరావు, రాయలసీమ ఇన్ చార్జ్ నేతాంజలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సంజీవ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బొమ్మన రాజ్‌కుమార్, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు శీరం ప్రసాదు, సభ్యులు, నాయకులు మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో జ్యోతిప్రజ్వలన చేసి చేనేత నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య, స్వర్గీయ బొమ్మన రామచంద్రరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అతుకులు లేకుండా జాతీయ జెండాను మగ్గంపై నేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్ష సత్యన్నారాయణను ఘనంగా సత్కరించారు. సమావేశంలో తోపులాట సమావేశంలో తమ నాయకుడు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పంపన రామకృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కొంతసేపు అంతరాయం ఏర్పడి తర్వాత సద్దుమణిగింది. -
అంగన్వాడీ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
కొత్తపేట : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి ఎనిమిదో తేదీ) పురస్కరించుకుని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గత నెల 18న ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో, 21న జిల్లా స్థాయిలో కాకినాడలో కబడ్డీ పోటీలు నిర్వహించగా కొత్తపేట ప్రాజెక్టు జట్టు జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. జిల్లా పోటీల్లో బాగా ఆడిన ఆర్ రత్నకుమారి, బీఎస్ఎన్ కుమారి(కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు), శాంతి, ప్రసన్న, సుజాత, వీరమణి, తులసి, త్రివేణి(తుని ప్రాజెక్టు), గంగాదేవి (పెద్దాపుర ప్రాజెక్టు)లను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుగా కూర్చారు. ఈ జట్టు మంగళవారం రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో క్వార్టర్స్‌లో పశ్చిమ గోదావరి జట్టుపై, సెమీ ఫైనల్స్‌లో చిత్తూరు జట్లపై గెలిచి, ఫైనల్స్‌లో కృష్ణా జిల్లా జట్టుపై ఘన విజయం సాధించినట్టు కొత్తపేట ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ జట్టును స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆర్జేడీ విద్యావతి, తుని, కొత్తపేట సీడీపీఓలు వి మాధవి, బి అనంతలక్ష్మి తదితరులు అభినందించారు. ఆ టీమ్ సభ్యులకు వచ్చే నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందచేస్తారని రాజ్యలక్ష్మి తెలిపారు. -
నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
పాయింట్ల ఆధారంగా విజేతల నిర్ణయం అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌కు సత్కారం అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ ఇన్విటేషన్ మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఐదు సెట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు సెట్లు గెలిచినవారు విజయం సాధిస్తారు. కాని మూడొంతుల మ్యాచ్‌లు ఐదు సెట్లు, నాలుగు సెట్లలోకాని ఫలితం తేలలేదు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలను పరిశీలిస్తే పురుషుల విభాగంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), వెస్ట్రన్ రైల్వే (ముంబై), పోస్టల్ (కర్ణాటక), మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), పోస్టల్ (కర్ణాటక) జట్లు విజేతగా నిలిచే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో సాయి (గుజరాత్)పై ఇన్‌కంట్యాక్స్ (చెన్నై) జట్టు 25–18, 27–17, 25–18 తేడాతో ఏకపక్షంగా సాగిన పోరులో విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్ మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), సాయి (గుజరాత్) జట్ల మధ్య జరగగా, ఎస్సీ రైల్వే 23–25, 25–16, 25–22, 25–22 తేడాతో విజయం సాధించింది. పోస్టల్ (కర్ణాటక) జట్టుపై వెస్ట్రన్ రైల్వే (ముంబై) జట్టు 25–16, 23–25, 27–25, 28–18 తేడాతో గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి పురుషుల విభాగంలో జరిగిన పోరులో సీఆర్పీఎఫ్(ఢిల్లీ) జట్టు సాయి (గుజరాత్)పై 23–25, 25–1, 25–22, 25–22 తేడాతో గెలుపొందాయి. నేటితో ముగింపు ఐదు రోజుల పాటు జరగనున్న ఎన్వీఆర్ వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రితో ముగియనున్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచినవారితోపాటు అన్ని జట్లకు కలిపి రూ.ఐదు లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీని అందించనున్నారు. సాత్విక్‌కు ఘన సత్కారం అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్‌కు ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ సోమవారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, టోర్నమెంట్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడులు సాత్విక్‌ను సత్కరించారు. అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, కోశాధికారి అరిగెల నానాజీ, సాంకేతిక కమిటీ సభ్యుడు ఉండ్రు రాజబాబులు ఉన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) :గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోరోజు శనివారం సాయంత్రం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో పోస్టల్ కర్నాటక జట్టుపై సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు 25–22, 22–25, 19–25, 25–19, 15–8 పాయింట్లతో గెలుపొందింది. మొత్తం ఐదు సెట్లలో జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మహిళా విభాగంలో కర్ణాటక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వేపై 27–25, 25–20, 17–25, 25–19 తేడాతో విజయం సాధించింది. ముందు రోజు శుక్రవారం రాత్రి రెండు గంటల వరకూ పోటీలు జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ (ఏపీటీం) జట్టు సాయి గుజరాత్‌పై 25–22, 25–16, 25–21 స్కోర్‌తో గెలుపొందింది. మహిళా విభాగంలో జరిగిన పోరులో పోస్టల్ కర్నాటక జట్టు సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టుపై 25–19, 25–23, 21–25, 25–18 స్కోర్‌తో గెలుపొందింది. ఒక్కో మ్యాచ్ ఫలితం కోసం నాలుగు, ఐదు సెట్లు ఆడాల్సి రావడంతో పోటీలు ఆలస్యమవుతున్నాయి. సుమారు ఐదువేల మంది సామర్థ్యం ఉన్న గ్యాలరీ నిండిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోతున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావులు రెండో రోజు పోటీలను తిలకించారు. వారికి టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్ స్వాగతం పలికారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు
భానుగుడి (కాకినాడ) : కాకినాడ ప్రెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో మూడు రోజులగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేడ్ జర్నలిస్టుల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మసత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ నిరంతరం మెదడుతో పనిచేసే జర్నలిస్టులకు మానసిక ప్రశాంతత చేకూర్చే క్రీడలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కబడ్డీలో కృష్ణా జిల్లా విజేతగా నిలవగా, తూర్పుగోదావరి రన్నర్‌గా నిలిచింది. క్రికెట్లో పశ్చిమ గోదావరి విజేతగా నిలవగా, గుంటూరు రన్నర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. నాకౌట్ పద్దతిలో నిర్వహించిన ఈ క్రీడల్లో జర్నలిస్టులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రెస్‌ఫోరమ్ అధ్యక్షుడు వీసీ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడాపోటీలు
భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడాపోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. రెండోరోజు షటిల్‌పోటీలు జేఎన్టీయూకే ఇండోర్ స్టేడియంలో, క్రికెట్ పోటీలు రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలో, కబడ్డీ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరిగాయి. రెండో రోజు క్రీడల్లో 13 జిల్లాల నుంచి వచ్చిన 300కిపైగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వివిధ క్రీడల్లో చాటారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్‌లా మైదానంలో మెరిశారు. క్రికెట్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై ఓటమి పాలైంది. శ్రీకాకుళం- నెల్లూరు జట్ల మధ్య సాగిన క్రికెట్ పోటీలో శ్రీకాకుళం విజయం సాధించింది. పశ్చిమ గోదావరి-అనంతపురం జట్లమధ్య సాగిన పోరులో అనంతపురం అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. కబడ్డీలో శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి అత్యుత్తమ ప్రతిభతో ఘన విజయాన్ని సాధించింది. పశ్చిమగోదావరి-కృష్ణాజట్ల మధ్య కబడ్డీ పోరులో కష్ణాజట్టు విజయాన్ని అందుకుంది. కబడ్డీ క్రీడాకారులను జిల్లా కబడ్డీజట్టు గౌరవా«ధ్యక్షుడు ఎంపీ తోటనరసింహాం ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సాహపరిచారు. -
ఆటంబరంగా
ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు ముఖ్యఅతి«థులుగా హాజరైన ఆర్థికమంత్రి యనమల, రాజప్ప భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు గురువారం కాకినాడ జర్నలిస్టుల క్రీడోత్సవ్–2017 పేరుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రికెట్, కబడ్డీ, షటిల్ పోటీలకు సంబంధించి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హాజరై మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడా పోటీల్లో జర్నలిస్టులు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఏటా ఉప్పలగుప్తంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నీని నిర్వహించడం ఆహ్వానించదగ్గదని, నాయకులు ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్టులు సైతం అంతే బిజీగా ఉంటారన్నారు. కార్యక్రమానికి కాకినాడ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వి.సి.వెంకటపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ క్రీడాపోటీలు నిర్వహించి జర్నలిస్టులకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందివ్వాలని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామనరాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, జేఎన్టీయూకే వీసీ కుమార్, శాప్ ఎండీ నల్లపురాజు బంగార్రాజు, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, డీఎస్డీఓ మురళీధర్, డీఈవో పి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. -
సత్కారాలు రాజకీయాలు కాకూడదు
సినీ గేయ రచయిత అదృష్టదీపక్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం రామచంద్రపురం : కళాకారులను సత్కరించటంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ప్రముఖ సినీగేయ రచయిత, విమర్శకులు అదృష్టదీపక్ సూచించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలోని బుద్దవరపు మహాదేవుడు కళావేదికలో మూడు రోజులు పాటు మయూర కళాపరిషత్ ఆధ్వర్వంలో నిర్వహించే 14వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. పరిషత్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రంగస్థల నటుడు, వై.ఎస్.కృష్ణేశ్వరరావును కళాపరిషత్ ఆధ్వర్యంలో సత్కరించడం అభినందనీయమన్నారు. నాటికల రచన, దర్శకత్వం, నటనలో కృష్ణేశ్వరరావు తనదైన శైలిలో ప్రేక్షకులను రంజిపజేస్తారని కొనియాడారు. నాటిక పోటీల ద్వారా ప్రజలకు సందేశాలను అందించటమే కళాకారుల విధి అని, అటువంటి నాటిక పోటీలను నిర్వహిచండంలో మయూర కళా పరిషత్ ముందున్నదన్నారు. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం అప్పలాచార్యర్ పరిషత్ ముందుమాటను వివరించారు. అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి నాటిక పోటీల విశిష్టతను వివరించారు. సినీ రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘చాలు... ఇక చాలు’, ‘మాకంటూ ఓ రోజు’ నాటికలను ప్రదర్శించారు. మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ జి.సూర్యనారాయణ, కమిషనర్ సిహెచ్.శ్రీరామశర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నందుల రాజు, మోడరన్ విద్యా సంస్థల అధినేత జీవీ రావు, చిలుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేత అదృష్టదీపక్ వ్యవహరిస్తున్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎక్సైజ్ స్పోర్‌్ట్స మీట్
విజయవాడ స్పోర్ట్స్: ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. ఆంధ్ర లయోల కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో శనివారం జరిగిన కబడ్డీ మొదటి సెమీ ఫైనల్లో నెల్లూరుపై ప్రకాశం, రెండో సెమీ ఫైనల్లో శ్రీకాకుళంపై కృష్ణా జట్లు విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. వాలీబాల్ సెమీస్‌లో పశ్చిమగోదావరిపై చిత్తూరు, తూర్పుగోదావరిపై శ్రీకాకుళం జట్లు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయాయి. అథ్లెటిక్స్ 200 మీటర్ల రన్నింగ్ పురుషుల విభాగంలో బి.మోహన్ (అనంతపురం), ఎస్.రమేష్ (చిత్తూరు), ఎస్.హరికృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మహిళల విభాగంలో ఆర్.బ్యూలా (పశ్చిమగోదావరి), కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. లాంగ్ జంప్ పురుషుల విభాగంలో ఎస్.రమేష్ (చిత్తూరు), బి.మోహన్ (అనంతపురం), ఇ.దశరథ్ (చిత్తూరు) వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. హైజంప్ పురుషుల విభాగంలో బి.సింహాచలం (శ్రీకాకుళం), ఇ.దశరథ్ (చిత్తూరు), జాన్మియా (కృష్ణా), మహిళల విభాగంలోఎం.నస్రీన్ (పశ్చిమగోదావరి), వరలక్ష్మి (కర్నూలు), శ్వేతరాణి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సైక్లింగ్ పురుషుల విభాగంలో పి.రాంబాబు (విశాఖపట్నం), బాజీ అహ్మద్ అబ్దుల్ (కృష్ణా), పి.శ్రీనివాసరెడ్డి (గుంటూరు), మహిళల విభాగంలో కె.మల్లేశ్వరీ (కృష్ణా), ఎస్.మెహæతాజ్ (కర్నూలు), ఎస్.వరలక్ష్మి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. త్రోబాల్ మహిళల విభాగంలో విశాఖపట్నం, కర్నూలు, పశ్చిమగోదావరి జట్లు వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించాయి. చెస్ పురుషుల విభాగంలో టి.శౌరి (గుంటూరు), జి.శ్రీధర్ (నెల్లూరు), కె.గిరిధర్ (తూర్పుగోదావరి), మహిళా విభాగంలో శాంతి లక్ష్మి (విశాఖపట్నం), నీలవేణి (కృష్ణా), మీనాకుమారి (కర్నూలు) వరుసగా మొదటి మూడు స్థానాలు పొందారు. విజేతలకు శనివారం సాయంత్రం ఎక్సైజ్ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని షీల్డ్‌లు అందజేశారు.ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు, డిప్యూటీ కమిషనర్లు సత్యప్రసాద్, వైబీ భాస్కర్‌రావు, జోసెఫ్, శ్రీమన్నారాయణ, నాగలక్ష్మి, సూపరింటెండెంట్లు మురళీధర్, మనోహా, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు టీడీపీ, బీజేపీలు అవాస్తవాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయి హోదాతో లాభమా, నష్టమా అనేది బాబు స్పష్టం చేయాలి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి నరసరావుపేట రూరల్: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేక హోదాకు పాలకపక్షమే అడ్డుపడుతోందని విమర్శించారు. నరసరావుపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయం నుంచి టీడీపీ, బీజేపీలు చెప్పిన మాట చెప్పకుండా అవాస్తవాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ధ్వజమెత్తారు. విభజన బిల్లు సమయంలోనే ప్రత్యేక హోదాపై బిల్లు పెట్టాలని బీజేపీ నాయకత్వం ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లో ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు, పదిహేను సంవత్సరాలు కావాలని చంద్రబాబు అడిగారని గుర్తుచేశారు. నేడు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది అని చంద్రబాబు మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏ మేలు జరగటం లేదనుకుంటే టీడీపీ నాయకులు అక్కడ పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. హోదాకు సరిపడా ప్యాకేజీ ఇస్తున్నారని చేబుతున్నారని, హోదావల్ల ఏంత వస్తుందో అంచనా వేశారా అని ప్రశ్నించారు. కేంద్రం అదనంగా ఏమి ఇచ్చిందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టంచేశారు. తమ లాలూచీ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే సమ్మెట్ పేరుతో లక్షల్లో ఉద్యోగాలు, కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువతపై పీడీ యాక్డు పెడతామనడం సిగ్గుచేటు రాష్ట్రంలోని 46వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని, రెండు లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారని గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల శాఖ ప్రకటించిందని... ఈ వివరాలు బహిర్గతం చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన మూడేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని, అదనంగా పరిశ్రమలు రాలేదని, ఉద్యోగం, ఉపాధి లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా సాధిచేందుకు నిరుద్యోగ యువత ముందుకోస్తే వారిపై పీడీ యాక్ట్ పెడతామనడం సిగ్గుచేటన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే కేంద్ర విశ్వవిద్యాలయాలు మనకు వచ్చాయని, ఇందులో ప్రత్యేకంగా వచ్చినవి ఏమీ లేవని అన్నారు. ప్రత్యేక హోదాపై రెండు సార్లు శాసన సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని, వారు దానిని బుట్టదాఖలు చేస్తే రాష్ట్ర పరువు ఏమి కావాలని ప్రశ్నించారు. హోదా రాదు అని తెలిస్తే తీర్మానం చేసి ఎందుకు పంపించారని నిలదీశారు. పోలవరానికి నాబార్డు ఇచ్చిన రూ.1900 కోట్ల రుణానికి బాధ్యత కేంద్రానిదో, రాష్ట్రానిదో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. చంద్రన్న కానుకల పేరుతో రెండు సంవత్సరాలుగా రూ.1900 కోట్లు ఖర్చు చేశారని, ఈ నిధులను పోలవరానికి ఖర్చు చేస్తే సరిపోయేదని పేర్కొన్నారు. పుష్కరాల కోసం రూ.3600 కోట్లు వృథాగా ఖర్చు చేశారని విమర్శించారు. తెలంగాణలో పుష్కరాల కోసం రూ.1100 కోట్లు మాత్రమే ఖర్చుపెటినట్టు తెలిపారు. చంద్రబాబుకు అల్జిమర్స్ వ్యాధి: ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఉందని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి అన్నారు. హోదా పదిహేను సంవత్సరాలు కావాలని గొంతు చించుకుని అరిచిన బాబు.. నేడు హోదాతో ఏమీ రాదని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. హోదా వల్ల లాభమా, నష్టమా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్భాటం కోసమే సమ్మెట్లు నిర్వహించి లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీనాయకులు సుజాతపాల్, రామిశెట్టికొండ, ఎన్.కె. ఆంజనేయులు, మండాలక్షణ్రావు, మల్లెల అశోక్, పుల్లంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.