చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు.
చిలుకూరు: చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మొత్తం 80 జట్టు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత గడ్డం శ్రీను, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నెల్లూరి నాగేశ్వరరావు, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, డైరక్టర్ బెల్లంకొండ నాగయ్య, క్రీడల నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.