జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
గురజాల రూరల్: గురజాల శ్రీముక్కంటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో జె.ఎం.ఎం.ఎం ఫ్రెడ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు వంటూరి వెంకటప్పారెడ్డి, టీడీపీ నాయకులు సఖిల బాలకోటిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొత్తం 32 జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పీఈటీలు బి.బాలాజి నాయక్, జి.కోటేశ్వరావు, కె.కోటిబాబు పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన వారికి ఎనుముల మురళీధర్‌రెడ్డి ప్రథమ బహుమతి రూ.12,000 లు, ద్వితీయబహుమతిని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు వంటూరి వెంకటప్పారెడ్డి రూ.7,000, తృతీయ బహుమతిని శ్రీకాంత్ నర్సింగ్ హోం రూ. 5,000, నాల్గవ బహుమతిని సాంబశివ నర్సింగ్ హోం రూ. 3,000 అందిస్తున్నట్లు తెలిపారు. షీల్డులను యూటీఎఫ్ నాయకుడు టి.అరుణ్ కుమార్ అందిస్తారన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మువ్వా మల్లికార్జునరావు, మంచి కాటంరాజు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.