లాన్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం | Lawn tennis competitions begin | Sakshi
Sakshi News home page

లాన్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

Oct 21 2016 10:54 PM | Updated on Sep 4 2017 5:54 PM

లాన్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

లాన్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

మండలంలోని నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్‌ 14 సింగిల్స్, డబుల్స్‌ లాన్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

గుంటూరు రూరల్‌: మండలంలోని నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్‌ 14 సింగిల్స్, డబుల్స్‌ లాన్‌  పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొన సాగనున్న పోటీలను ఎన్టీఆర్‌స్టేడియం సెక్రటరీ శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ రెవరెండ్‌ ఫాదర్‌ ఆంథొని మాట్లాడుతూ లాన్‌ టెన్నిస్‌ క్రీడలు తమ పాఠశాలలో నిర్వహించటం ఆనందంగా ఉందని, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం నిర్వహించేందుకు తాము సిద్ధమేనన్నారు. మొదటిరోజు బాలుర సింగిల్స్‌ విభాగంలో 64 మంది, బాలికల సింగిల్స్‌ విభాగంలో 16 మంది పోటీ పడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement