ముగిసిన లాన్ టెన్నిస్ పోటీలు
ముగిసిన లాన్ టెన్నిస్ పోటీలు
Published Sun, Oct 23 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
గుంటూరు రూరల్ : గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అండర్ 14 విభాగం లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయోలా పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ అన్వర్ పాల్గొని మాట్లాడారు. క్రీడలతో మానసిక పరిపక్వత సాధిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందన్నారు.
పోటీల్లో బాలికల సింగిల్స్ విభాగంలో నల్లాపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత ప్రథమ స్థానం సాధించింది. విజయవాడ చైతన్య పాఠశాలకు చెందిన సీహెచ్ ప్రవల్లిక ద్వితీయ స్థానం గెలుపొందింది. సింగిల్స్ బాలుర విభాగంలో విజయవాడకు చెందిన భాష్యం విద్యార్థి జయకృష్ణ వంశీ ప్రథమ స్థానం, నిర్మల హైస్కూల్ విద్యార్థి కె.గిరీష్ కైవశంచేసుకున్నారు. బాలికల డబుల్స్ విభాగంలో నల్లపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత, విజయవాడ చైతన్య విద్యార్థి సీహెచ్ ప్రవల్లిక ప్రథమస్థానం, ఎన్‌ఎస్‌ఎమ్ స్కూల్ విజయవాడకు చెందిన విద్యార్థి ఎస్.యశస్వీ, కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని లావణ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరు చైతన్య విద్యార్థి షేక్ ఫరాజ్, విజయవాడ భాష్యం విద్యార్థి జయకృష్ణవంశీ ప్రథమ స్థానం, విజయవాడ నిర్మల హైస్కూల్ విద్యార్థి గిరీష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మాధవ్‌లు ద్వితీయ స్థానంలో నిలిచారు.
Advertisement