competitions
-
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్‌స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్‌లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్‌కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్‌కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘కమాండో కాంపిటీషన్స్’లో సత్తా చాటిన ఏపీ
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్‌గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి. ఆర్పీఎఫ్కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్‌గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్‌గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది. స్మాల్ టీమ్ ఆపరేషన్స్‌కు ఇచ్చే రణ్నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది. -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్‌లకు గాను 82 శాతం షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్‌లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్‌లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్‌లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్‌లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
ముగిసిన ఎస్జీఎఫ్ ఫుట్‌బాల్ పోటీలు
కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్(అండర్–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో 2–1 స్కోర్‌తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్‌లో 4–3 స్కోర్‌తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్‌లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్జీఎఫ్ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్‌ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. అండర్–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉదయ్‌భాస్కర్, శ్రీనివాసులు, రమేష్ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలజట్టు: ఎస్.భానుశ్రీ, కె.మనీషా, ఆర్.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్), పి.సుహర్ష, ఏ.బెహ్హప్మన్ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్‌గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు). బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్, ఎస్.డి.రవూఫ్, ఎస్.కె.నాగషరీఫ్(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్(కడప), సుఫియాన్, సి.అరవింద్(చిత్తూరు), జె.మైఖేల్(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్ అశ్వథ్(వైజాగ్), జే.రాముడు(కృష్ణ), కెల్విన్కెన్నెట్(చిత్తూరు), వై.కల్యాణ్(విజయవాడ), కె.అశోక్‌కుమార్(నెల్లూరు) స్టాండ్‌బైలుగా అఖిల్‌యాదవ్(చిత్తూరు), వి.విజయ్(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్‌గోదావరి), టి.రోహిత్.శ్రీ.ఫణిధర్(వెస్ట్‌గోదావరి), జ్ఞానేశ్వర్(శ్రీకాకుళం). -
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
హైదరాబాద్ హుసేన్ సాగర్ లో సెయిలింగ్ సందడి
-
పొంగి పొర్లిన శివ భక్తి.. ఖండాంతరాల్లో శివ పద నాద తరంగాలు!
శివ పదాలు అంటే మహా దేవుడైన శివుని భావస్వరాంజలులే, అటువంటి పదాలను పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100 పైగా అత్యద్భుతంగా రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో మూడవ శివపద అంతర్జాతీయ అంతర్జాల పాటల పోటీలు ఈ మే నెల 12,13,14వ తేదీల్లో యూట్యూబ్ మాధ్యమంగా శివపదాంకిత వాణీ, నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని, శ్రీనివాస్ మేడూరు సహకారంతో నిర్వహించారు. శివపద గీతాల పోటీను పూర్తిగా విన్న షణ్ముఖ శర్మ.. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివ పదాలను పాడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శివాశీస్సులు అందించారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు "గ్లోబల్ శివపదం టీం"ను, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీర్వదించారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు శ్రీ మారేపల్లి సూర్యనారాయణకు, విద్యుత్ అంతరాయాలు ఉన్నా కార్యక్రమంలో ఎటువంటి అంతరాయాలూ రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన శ్రీ తోలేటి వెంకట పవన్ కి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. మొత్తం 5 ఖండాలలోని వివిధ దేశాల నుంచి 300 మంది ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గునగా, 17 మంది ప్రఖ్యాత సంగీత గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి శారదా సుబ్రమణియమ్, తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్,పెద్దాడ సూర్యకుమారి, విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ పాల్గొన్నారు. అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతే కాకుండా సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వయసులవారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే 5 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా శివపదాలను అద్భుతంగా వీనులవిందుగా పాడారు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలలో పాల్గొనటం వలన పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయ నిర్ణేతలు అన్నారు. ఈ కార్యక్రమం మొత్తం అంతా శివమయంగా మారిపోయింది. పాడే వారు, వినే వారు అందరూ కూడా శివ భక్తి సారంలో తన్మయులయ్యారు. రసరమ్యముగా సాగిన ఈ కార్యక్రమం శుక్రవారం మొదలై ఆదివారం రోజు ముగిసింది. అప్పుడే పోటీలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని, వచ్చే ఏడాది కోసం ఇప్పటి నించే వేచిచూస్తామని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు అన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తామని, గాయకులూ, నిర్వాహకులూ, న్యాయనిర్ణేతలు, వీక్షకులూ అంతా అన్నారు. -
జోడుగా.. హుషారుగా.. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్‌లు
పిఠాపురం(కాకినాడ జిల్లా): వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు.. నేడు పరుగు పందేల్లోనూ సత్తా చాటుతున్నాయి. గతంలో పండగ రోజులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ఎడ్ల పరుగు పందేలు నేడు మామూలు సందర్భాల్లోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ ఈ ఎడ్లను రైతులు పెంచడం విశేషం. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినప్పటికీ దాని ద్వారా వచ్చే సంతృప్తి వెల కట్టలేనిదని వారు చెబుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఈ ఎడ్ల పరుగు పందేలు జరుగుతుండగా, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచీ రైతులు తమ ఎడ్లను తీసుకు వస్తున్నారు. జిల్లాలో లైను పందేలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందేలు ఆడుతుంటారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు ప్రత్యేక శిక్షణ పరుగు పందేల్లో పాల్గొనే ఎడ్లకు గిత్త ప్రాయం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఏడాది వయసులో ఉండగానే చిన్న సైజు బళ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. మామూలు ఎద్దుల్లా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలకు పరుగెత్తిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. ఈ పందేల్లో పాల్గొనే ఎద్దు రేటు రూ.లక్షల్లో పలుకుతుంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చయినా రైతులు వెనుకాడడం లేదు. మేత కూడ ప్రత్యేకమైనదే పందేల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేక దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు ప్రతి రోజూ ఉడకబెట్టి, నానబెట్టిన ఎండుగడ్డి ముక్కల్లో వేసి, దాణాగా మేపుతారు. మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకూ వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలున్నా లేకపోయినా వీటి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాల బళ్లుండేవి. కానీ పరుగు పందేల్లో ఉపయోగించే బళ్లను మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కువగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పందేలకు వెళ్లడమూ ప్రయాసే రాష్ట్రంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా ఎంతో వ్యయప్రయాసలకోర్చి వెళుతుంటారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఎడ్ల పందేలకు ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ, కడప, నెల్లూరు తదితర జిల్లాల నుంచి రైతులు తమ ఎద్దులను తీసుకువచ్చి పందేల్లో పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లో జరిగే పందేలకు ప్రైవేటు వాహనాలపై ఎడ్లబళ్లను తీసుకువస్తారు. ఇందుకు నిర్వాహకులు ఎటువంటి ఖర్చులూ ఇవ్వకపోయినా సుమారు రూ.50 వేల వరకూ సొంత ఖర్చులు పెట్టుకుని మరీ పందేలకు వెళ్తుంటారు. పందేనికి రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి ప్రదేశాలను ఎడ్లకు అలవాటు చేస్తుంటారు. పందెం జరిగే ప్రాంతంలో పందేనికి ముందు రోజు ఎడ్లను పరుగులు పెట్టించి శిక్షణ ఇస్తారు. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్‌లు కంటిలో లోపం రాకుండా దుమ్ము, ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయేలా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి వాటితో మసాజ్ చేస్తుంటారు. ప్రతి రోజూ పరుగులో శిక్షణ అనంతరం మసాజ్ చేయకపోతే కాళ్లు పట్టేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అందుకే పరుగు పెట్టిన ప్రతిసారీ తప్పనిసరిగా మసాజ్ చేయాల్సి ఉంటుందంటున్నారు. పందెం కొడితే విలువ పెంపు.. పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందేలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందేలు కొట్టిన ఎద్దులు ఒక్కొక్కటి సుమారు రూ.మూడు నాలుగు లక్షలకు అమ్ముడవుతాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందేలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు. గెలుపుతో వచ్చే ఆనందం వెలకట్టలేనిది మా కుటుంబంలో పూర్వం నుంచీ ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. మా దగ్గర పాత ఎడ్లు ఉండగా, రెండేళ్ల క్రితం మరో జత ఎడ్లను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాం. ఇవి శిక్షణ పొందినవి కావడంతో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు 15 పోటీల్లో పాల్గొనగా, ఆరుసార్లు రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచాయి. పందెం ఎడ్లలో సీనియర్స్, జూనియర్స్ విభాగాలు ఉంటాయి. మా ఎడ్లు సీనియర్స్ విభాగంలోకి వస్తాయి. ఇటీవల జిల్లాలో పలుచోట్ల జరిగిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సా«ధించాయి. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా, పోటీల్లో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది. – సత్యేంద్రకుమార్, రైతు, సామర్లకోట -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆన్లైన్ పోటీలు
కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్‌షిప్ ఆన్లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్‌లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లైవ్లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్‌కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
సందడిగా అందాల పోటీలు
-
గార్దభాలు భళా!
సాక్షి,బండిఆత్మకూరు: శివనంది ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడమల కాల్వ గ్రామంలో బుధవారం గార్దభాల(గాడిదల) బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సుమారు 120కేజీల బరువు గల ఇసుక సంచులను గాడిదపై వేశారు. 10 నిమిషాల సమయంలో ఎంత ఎక్కువ దూరం పరిగెడితే వాటిని విజేతలుగా ప్రకటించారు. చాగలమర్రి మండలం పెద్దవంగళి గ్రామం రమణయ్యకు చెందిన గార్దభం 5,509 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచింది. మహానంది మండలం పుట్టుపల్లె ప్రవీణ్‌కు చెందిన గార్దభం 5,400 అడుగులు లాగి రెండో స్థానం, వెలుగోడు నాగచరణ్కు చెందిన గార్దభం 5,373 అడుగులు లాగి మూడో స్థానం, వెలుగోడు మండలం వేల్పనూరు నాగేంద్రకు చెందిన గార్దభం 5,066 అడుగులు లాగి నాల్గోస్థానంలో నిలిచింది. వీరికి రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, రూ.2వేలు నగదును ఆలయ కమిటీ చైర్మన్ మేకల శ్రీనివాసులు, రాగాల బాబులు, వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా అందజేశారు. -
లడ్డూతినే పోటీలు నిర్వహిస్తున్నారా జాగ్రత్త..!
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు జరగడం పరిపాటి. ఆఖరి నాలుగు రోజులు ఇవి జోరుగా సాగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు ఓకే అయినా అవి తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన లడ్డూ తినే పోటీ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటు, టోపీలు, టీ–షర్టుల పంపిణీ, లడ్డూలు తినే పోటీటూ నిర్వహిస్తారు. ఆయా పోటీల్లో అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతులు అందజేస్తారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు. గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే... ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడం, విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా.. ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రేకియా దెబ్బతినడం వల్లే... ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు. లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. -
హెల్దీ బేబీస్..
ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఆఫ్ ఉలవపాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆరోగ్య పోటీలు నిర్వహించగా 110 మంది పాల్గొన్నారు. పీడియాట్రిక్ వైద్యుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను సోమవారం ప్రకటించారు. బేబీ ఆఫ్ ఉలవపాడు మేల్ విభాగంలో దామతోటి శ్రావణ్ కుమార్, ఫిమేల్ విభాగంలో పల్లకి చేత్రప్రియ విజేతలుగా నిలిచారు. వైద్యశాల సూపరింటెండెంట్ శోభారాణి, బ్రహ్మయ్య బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో 11 మంది పిల్లలకు బహుమతులిచ్చారు. టీకాలు వేస్తున్న సమయం, బరువు, తల్లితండ్రుల ఆరోగ్య సూచనలు, పిల్లల ఆరోగ్యం ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు వైద్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కరీమ్.. విటమిన్ డ్రాప్స్ అందజేశారు. కార్యక్రమంలో దంతæ వైద్యులు సురేష్, యూనియన్ నాయకులు అల్తాఫ్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు కొల్లేరులో తాటిదోనెల పోటీలు
కైకలూరు: కొల్లేరు సాంప్రదాయక వేటకు తాటి దోనెలు చిరునామాలు. మూడేళ్ల విరామం అనంతరం అటవీశాఖ తాటి దోనెల పోటీలు నిర్వహించనుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కైకలూరు మండలం సర్కారు కాల్వ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. మత్స్యకారులు ఈ పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రథమ బహుమతి రూ.10,000, ద్వితీయ బహుమతి రూ.5,000, తృతీయ బహుమతి రూ.3,000గా నిర్ణయించారు. కొల్లేరులో 2005 ఫిబ్రవరి 2న అప్పటి రేంజర్ సునీల్‌కుమార్ మొదటిసారి దోనెల పోటీలను నిర్వహించారు. నీటిలో రాకెట్లు తాటి దోనెలు కొల్లేరు సరస్సులో చేపల వేటకు తాటి దోనెలను ఉపయోగిస్తారు. ముందుగా ఓ బలమైన తాటిచెట్టును ఎంపిక చేసుకుని దానిని మొదలుతో సహా తీసుకొస్తారు. 15 రోజుల పాటు బరిసెతో చెక్కుతారు. నీరు చేరకుండా తారును అద్దుతారు. దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. తాటిదోనెలపై మావులను (చేపలు పట్టడానికి ఉపయోగించే కర్రల బుట్ట) తీసుకెళ్లి వేట సాగిస్తారు. ఈ తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. సాంప్రదాయ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు మాత్రమే వీటిని ఉపయోగించగలరు. సంప్రదాయం కొనసాగించాలి కొల్లేరు సరస్సులో చేపల చెరువుల సాగు విస్తీర్ణం పెరగడంతో తాటి దోనెల ఉపయోగం తగ్గింది. ఇంజను ఇనుప పడవల వాడకం ఎక్కువైంది. పూర్వం కొల్లేరులో 4వేల జనాభాలో కనీసం 1000 తాటి దోనెలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కో గ్రామానికి కేవలం 10 దోనెలకు పరిమితమైంది. మయ్యింది. ఈ సందర్భంగా అటవీ శాఖ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ రామచంద్రరావు మాట్లాడుతూ చిత్తడి నేలల ఆవశ్యకతను తెలిపేందుకు తాటి దోనెల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. -
తాడిపత్రిలో పందుల పోటీ!
తాడిపత్రి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోళ్ల పందేలు... కానీ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పందేలపై నిషేధం విధించడంతో తాడిపత్రిలో వినూత్నంగా పందుల మధ్య పందెం నిర్వహించారు. ఈ పందెం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. పోటీల్లో పాలు పంచుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పందుల పెంపకం దారులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పందుల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. పోటీల సందర్భంగా రూ. లక్షల్లో బెట్టింగ్ సాగింది. ఇదే విషయంపై డీఎస్పీ మాట్లాడుతూ.. ‘కోడి పందేలను నిషేధించారు... పందుల పోటీ నిర్వహించుకోవడంపై ఉన్నతాధికారులతో మాట్లాడం.. పందుల పందేలపై ఎలాంటి ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా తెలుగమ్మాయి పోటీలు
సంక్రాంతి సంబరాలలో భాగంగా నిడదవోలులో గురువారం తెలుగమ్మాయి పోటీలు జరిగాయి. పరికిణి, ఓణీలతో అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు హోయ లొలికించారు. నిడదవోలు : పట్టు పరికిణీల సందడులు సీతాకోకచిలుకల్ని గుర్తు చేశాయి. అచ్చు తెలుగింటి అమ్మాయిల్లా విద్యార్థినులు పరికిణి, ఓణీలతో హొయలొలికించారు. సంక్రాంతి ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. తెలుగమ్మాయిల పోటీలకు ఉత్సాహంగా తరలివచ్చారు. పట్టు బట్టలు, గాజులు, కళ్లకు కాటుక, కాలి పట్టీలు, వడ్డాణం, పావిట బొట్టు, నుదిటి బొట్టు, గోరింటాకు, పూలతో పాటు ప్రత్యేక వస్త్ర అలంకరణతో విద్యార్థినులు సందడి చేశారు. పట్టణంలోని ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రోటరీ సెంట్రల్ క్లబ్, సాక్షి పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దీనిలో భాగంగా విద్యార్థినులకు తెలుగమ్మాయి పోటీలను నిర్వహించారు. ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికాస్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపల్ పి.సరళ, రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు కూచిపూడి వీర వెంకట రామారావులు ప్రారంభించారు. సుమారు 200 మంది ఉత్సాహంగా పోటీ పడ్డారు. తెలుగమ్మాయి డిగ్రీ సీనియర్స్ విభాగంలో కె.నాగ పద్మిని (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) ప్రథమస్థానం సాధించింది. కోహిని (వికాస్ కళాశాల) ద్వితీయ స్థానం, ఆర్.పద్మావతి (ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల) తృతీయ స్థానంలో నిలిచారు. ఇంటర్ విభాగంలో అనూష, శైలజ, దేవిదుర్గలు వరుసగా మూడు స్థానాలను సాధించారు. సీనియర్ ముగ్గుల పోటీల్లో ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎం.దేవి, ఎ.అనూష, పి.సునీతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచారు. జూనియర్స్ ముగ్గుల పోటీల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు వి.సుప్రియ, వి.మధు, ఏవీ.సాయిలక్ష్మీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమెంటోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా తెలుగమ్మాయి పోటీలను నిర్వహించిన సాక్షి, రోటరీ సెంట్రల్ క్లబ్ సభ్యులను అభినందించారు. తెలుగు సంప్రదాయాలను వివరిస్తూ నేలపాటి సువర్ణ చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షుడు కూచిపూడి వీర వెంకట రామారావు, ప్రిన్సిపల్స్ పి.సరళ, శ్రీనివాసరావు, కార్యదర్శి వీడీ గంగాధరరావు, కోశాధికారి చింతల కిషోర్, అసిస్టెంట్ గవర్నర్ ముళ్ళపూడి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి గాలి రాఘవయ్య, బీఎన్వీ ప్రసాదరావు, కె.మోహన్‌బాబు, ముళ్ళపూడి హరిశ్ఛంద్రప్రసాద్, జీఎన్వీ ప్రసాద్, బండి వేణుగోపాలకృష్ణ, ఈదల నాగేశ్వరరావు, చుండ్రు అమ్మిరాజు, సింహాద్రి సాయిబాబా, సింహాద్రి శ్రీనివాస్, నీరుకొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఎం.శ్రీలక్ష్మి, ఉషారాణి, బి.శాంతిశేషు, గాలి ఈశ్వరి, కె.భువనేశ్వరి వ్యవహరించారు. -
27 నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు
పటమట (విజయవాడతూర్పు) : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి కీలకస్థానముందని, వ్యవసాయ రంగానికి చేయూతగా ఉండే పశువులను కుటుంబ సభ్యులుగా చూసుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో పటమటలంకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పటమటలోని వెర్టెక్స్ స్థలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఆరుపళ్ల విభాగంలో, 28న వ్యవసాయ విభాగంలో, 29వ తేదీ సబ్‌జూనియర్స్, జూనియర్స్ విభాగంలో, 30వ తేదీ సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని వివరించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన జతలకు నగదు పురస్కారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 జతల ఎడ్ల పేర్లు రిజిస్ట్రేషన్ జరిగిందని, రోజుకు 10–12 జతలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు 13వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అన్నాబత్తుని బాబీ, కమిటీ సభ్యులు యలమంచిలి దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక దినోత్సవ పోటీలకు ఆహ్వానం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపా రు. పోస్టర్ పెయింటింగ్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టూరిజం ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ► సుస్థిర పర్యాటకం–అభివృద్ధికి ఒక సాధనం అంశంపై పోస్టర్ పెయింటింగ్ పోటీ ఉంటుంది. ఈ అంశం ఆధారంగా స్పాట్ పెయింటంగ్ చేయాల్సి ఉంటుంది. ► పేపర్ ప్రెజెంటేషన్‌లో టూరిజం–ఏన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫినామినా, అర్బన్ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ మార్కెటింగ్, టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్, ఎంటర్‌ప్యూనర్‌షిప్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటి, సస్టైనబుల్ టూరిజం–ఏ టూల్ ఫర్ డెవలప్మెంట్, జీఐఎస్ అప్లికేషన్ ఇన్ టూరిజం, డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్, టూరిజం ప్లానింగ్ రీజినల్ డెవలప్మెంట్, న్యూ టైప్స్ ఆఫ్ టూరిజం అంశాలపై వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి ఉపకరించే అంశాలను దీనిలో ప్రస్తావించి, వివరించాలి. నాలుగు వేల పదాలకు మించకుండా వ్యాసం ఉండాలి. ► క్విజ్ పోటీల్లో 60 శాతం ప్రశ్నలు ఏపీ పర్యాటకంపైన మిగిలిన 40 శాతం ప్రశ్నలు వర్తమాన అంశాలపై ఉంటాయి. ఒక్కో బృందంలో ఇద్దరు విద్యార్థులు ఉండాలి. ► ఏపీ పర్యాటక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఫొటోలు ఉండాలి. ఒక్కో విద్యార్థి గరిష్టంగా మూడు ఫొటోలను పోటీకి పంపవచ్చును. 2.5 మెగా పిక్సిల్స్‌కు తగ్గకుండా నాలు గు వేల మెగా పిక్సిల్స్‌కు మించని క్వాలిటీ కలిగి ఉండాలి. ఒక ఒరిజినల్ ప్రింట్, సాఫ్ట్ కాపీలను విద్యార్థి తమ స్వీయ లేఖను జరపరచి అందించాలి. డిజిటల్ సాంకేతిక సహకారంతో తీర్చిదిద్దిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోం. జేపీఈజీ ఫార్మాట్లో 4 ఎంబీల కంటే తక్కువ నిడివితో ఫొటోలను పంపాల్సి ఉంటుంది. ► పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలను జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. విశాఖపట్నంలో వచ్చేనెల 6న ఉదయం 10 గంటలకు ఎంబీఏ అనెక్స్ భవనం(ఏయూ అవుట్గేట్ వద్ద), శ్రీకాకుళంలో వచ్చేనెల 7న, విజయనగరం ఎంఆర్ పీజీ కళాశాలలో వచ్చే నెల 8న పోటీలు జరుగుతాయి. ఇతర సమాచారం కోసం ఏయూ వెబ్సైట్ www. andhrauniversity.edu.in, ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్. సాంబశివరావు(9848170274)ను సంప్రదించవచ్చును. విజేతలకు వచ్చేనెల 27న పర్యాటక శాఖ నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్‌ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్‌ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్‌బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్‌లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్‌కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు. -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ ఉగాది నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. సముద్ర తీరంలోని సైకత శిల్పం అందంగా ఉంటుంది. అలల తాకిడికి కరిగిపోతుంది. అలల్లో కలిసిపోతుంది. అలానే యువతీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారు, వివాహబంధాలను వినాశనం చేసుకుంటున్నారు. ఆకర్షణలకు పోయి వాస్తవాలను విస్మరించి అపోహలతో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే సందేశంతో కళా రాధన (నంద్యాల) కళాకారులు ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శించారు. వివాహ బంధం అలలకు కరిగిపోయే సైకత శిల్పంలా కాకుండా సజీవ శిల్పంలా దృఢంగా నిలవాలని చాటిచెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు చూపే ప్రేమలో పరిమితి ఉండదనే సందేశంతో సాయి ఆర్ట్స్ (కొలుకులూరు) కళాకారులు ‘చాలు–ఇక చాలు’ నాటిక ద్వారా చాటిచెప్పారు. ముందుగా కర్నూలు జిల్లా బనగానపలి్లకి చెందిన కె.అంజలీనాథ్ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నంద్యాలకు చెందిన సుంకర రాజశేఖర ప్రసాద్‌కు జీవన సాఫల్య ఉగాది పురస్కారాన్ని అందజేశారు. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లా సాఫ్ట్‌బాల్ జూనియర్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా బాల, బాలికల జూనియర్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు తెలిపారు. ఈ ఎంపిక స్థానిక అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ డీ పాల్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు.ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు 1999 జనవరి 1 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఆర్డీటీ క్రీడా మైదానంలో కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఎడ్లపోటీలు