పర్యాటక దినోత్సవ పోటీలకు ఆహ్వానం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపా రు. పోస్టర్ పెయింటింగ్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టూరిజం ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
► సుస్థిర పర్యాటకం–అభివృద్ధికి ఒక సాధనం అంశంపై పోస్టర్ పెయింటింగ్ పోటీ ఉంటుంది. ఈ అంశం ఆధారంగా స్పాట్ పెయింటంగ్ చేయాల్సి ఉంటుంది.
► పేపర్ ప్రెజెంటేషన్‌లో టూరిజం–ఏన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫినామినా, అర్బన్ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్‌మెంట్ మార్కెటింగ్, టూరిజం అండ్ ఎన్విరాన్‌మెంట్, ఎంటర్‌ప్యూనర్‌షిప్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటి, సస్టైనబుల్ టూరిజం–ఏ టూల్ ఫర్ డెవలప్‌మెంట్, జీఐఎస్ అప్లికేషన్ ఇన్ టూరిజం, డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్, టూరిజం ప్లానింగ్ రీజినల్ డెవలప్‌మెంట్, న్యూ టైప్స్ ఆఫ్ టూరిజం అంశాలపై వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి ఉపకరించే అంశాలను దీనిలో ప్రస్తావించి, వివరించాలి. నాలుగు వేల పదాలకు మించకుండా వ్యాసం ఉండాలి.
► క్విజ్ పోటీల్లో 60 శాతం ప్రశ్నలు ఏపీ పర్యాటకంపైన మిగిలిన 40 శాతం ప్రశ్నలు వర్తమాన అంశాలపై ఉంటాయి. ఒక్కో బృందంలో ఇద్దరు విద్యార్థులు ఉండాలి.
► ఏపీ పర్యాటక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఫొటోలు ఉండాలి. ఒక్కో విద్యార్థి గరిష్టంగా మూడు ఫొటోలను పోటీకి పంపవచ్చును. 2.5 మెగా పిక్సిల్స్‌కు తగ్గకుండా నాలు గు వేల మెగా పిక్సిల్స్‌కు మించని క్వాలిటీ కలిగి ఉండాలి. ఒక ఒరిజినల్ ప్రింట్, సాఫ్ట్ కాపీలను విద్యార్థి తమ స్వీయ లేఖను జరపరచి అందించాలి. డిజిటల్ సాంకేతిక సహకారంతో తీర్చిదిద్దిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోం. జేపీఈజీ ఫార్మాట్‌లో 4 ఎంబీల కంటే తక్కువ నిడివితో ఫొటోలను పంపాల్సి ఉంటుంది.
► పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలను జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. విశాఖపట్నంలో వచ్చేనెల 6న ఉదయం 10 గంటలకు ఎంబీఏ అనెక్స్ భవనం(ఏయూ అవుట్‌గేట్ వద్ద), శ్రీకాకుళంలో వచ్చేనెల 7న, విజయనగరం ఎంఆర్ పీజీ కళాశాలలో వచ్చే నెల 8న పోటీలు జరుగుతాయి. ఇతర సమాచారం కోసం ఏయూ వెబ్‌సైట్ www. andhrauniversity.edu.in, ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్. సాంబశివరావు(9848170274)ను సంప్రదించవచ్చును. విజేతలకు వచ్చేనెల 27న పర్యాటక శాఖ నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు.