invitation
-
కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: మన చుట్టూనే ప్రేమ, ఆదరణ నోచుకోని బాల్యాలెన్నో..తల్లిదండ్రులు లేకపోవడం వలనో, పేదరికం కారణంగానో అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఎందరో.. అందమైన భవిష్యత్ కలలు కంటూ, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటాయి ఆ పసి హృదయాలు. ఆ పిల్లలకు ప్రపంచ విజ్ఞానం, సంస్కృతుల సమ్మేళనం, ప్రస్తుత ఆధునిక జీవన శైలి గురించి తెలియాల్సిన అవసరం ఉందని కొందరి ఆలోచన. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని అనాథ చిన్నారులను హైదరాబాద్‌కు ఆహ్వానించి, విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి వారి సంతోషాలకు, విజ్ఞానానికి ప్రోత్సాహం అందించే ‘యూనిటీ–ఎక్స్’ అనే అద్భుత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడి చిన్నారులను సైతం వివిధ నగరాలకు తీసుకెళ్లే నూతన సంస్కృతికి నాంది పలికారు. గతేడాది సెప్టెంబర్ నెలలో చెన్నైలోని ఫరెవర్ ట్రస్ట్‌కు చెందిన 45 మంది చిన్నారులు నగరానికి చేరుకుని 4 రోజుల విజ్ఞాన, వినోద పర్యటనను ఆస్వాదించారు. ఈ యూనిటీ–ఎక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, పరిశోధన కేంద్రాలను వీక్షించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే నగరంలోని వాల్మీకి గురుకుల్కు చెందిన 20 మంది చిన్నారులు చెన్నైకి సుసంపన్నమైన యాత్ర చేశారు. ఐకమత్యం, కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా ఈ చిన్నారులు ఎన్నో మధుర జ్ఞాపకాలను, సామాజిక–వాస్తవిక అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టును హైదరాబాద్‌లోని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ హరి కిషన్ వాల్మీకి ప్రారంభించారు. ఈ గొప్ప ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా భాగస్వామిగా చేరింది. ఈ సంస్థల సీఎస్ఆర్ నిధులతో యూనిటీ–ఎక్స్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జీఆర్టీ రాడిసన్, టెంపుల్ బే, రెయిన్ ట్రీ, ది పార్క్ హోటల్, రెసిడెన్సీ హోటల్స్ తదితర 5–స్టార్ హోటళ్లలో బస చేయడం, అక్కడి ఆహారాన్ని విందు చేయడం, విలాసవంతమైన బెంజ్ బస్సులతో గరుడ లాజిస్టిక్స్‌లో ప్రయాణం చేయడం వంటి అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్య, విజ్ఞానం, కెరీర్ సెమినార్స్ తదితర అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రయాణం, అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గొప్ప ఉపాధ్యాయుడితో సమానం. ఈ కోణంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వ్యవస్థాపకులు డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మా ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ అధ్యక్షుడు షబిన్ సర్వోత్తమ్ వంటి వారు భాగస్వామ్య సహకారం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టును నగరంలోని వాల్మీకి ఫౌండేషన్ పర్యవేక్షిస్తూ, అవసరమైన మద్దతు, సహకారం అందిస్తోంది. ఐక్యతకు నిదర్శనంగాప్రేమ, ఆదరణ పొందకపోవడమే కాకుండా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఈ అనాథలు. వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే సౌలభ్యాలు, విద్య మాత్రమే సరిపోదు. అధునాతన ప్రపంచం, ఈ తరం జీవనశైలి, సామాజిక పరిపక్వత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్నారులు సైతం అందరి పిల్లలమాదిరిగానే వారి జీవితాన్ని ఆస్వాదించడంలో ప్రాజెక్ట్ యూనిటీ–ఎక్స్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక సమానత్వానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. – డాక్టర్ సూర్య గణేష్ వాల్మీకి, వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు. ఆలోచన మారింది.. మా ఆశ్రమం తప్ప మరే ప్రపంచం తెలియని మేమంతా చెన్నై వెళ్లడం మంచి అనుభూతి. ఈ ప్రయాణం విజ్ఞానంతో పాటు చెన్నైలో మంచి మిత్రులనూ చేరుకునేలా చేసింది. మళ్లీ అక్కడి పిల్లలు హైదరాబాద్ రావడం కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. యూనిటీ–ఎక్స్ నా ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను మార్చింది. ప్రపంచం చాలా పెద్దది, అవకాశాలకు కొదువ లేదు అనే నమ్మకాన్ని ఇచ్చింది. – మారుతి, వాల్మీకి గురుకుల్ విద్యార్థి ఇదీ చదవండి: 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..బెస్ట్ టిప్స్! -
‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్‌కు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
రకుల్, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్ కార్డ్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ తమ రిలేషన్ షిప్లో మరో అడుగు వేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. వీరి వెడ్డింగ్ స్పెషల్‌గా , చిరకాలం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు గోవా అందాలు కనిపించేలా ముద్రించడం విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్ క్యూట్ కుషన్లు.. మరో పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్‌కి దారి తీస్తూ, రకుల్, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా హాట్ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. -
నితిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన యంగ్ హీరో..!
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్‌లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
అయోధ్య నుంచి పిలుపు వచ్చింది..
-
అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు?
అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య నగరంలోని ప్రధాన రహదారులను సూర్య స్తంభాలతో అలంకరించారు. నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మ మార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. ఆ వివరాలు.. నటీనటులు 1. అమితాబ్ బచ్చన్ 2. మాధురీ దీక్షిత్ 3. అనుపమ్ ఖేర్ 4. అక్షయ్ కుమార్ 5. రజనీకాంత్ 6. సంజయ్ లీలా బన్సాలీ 7. అలియా భట్ 8. రణబీర్ కపూర్ 9. సన్నీ డియోల్ 10. అజయ్ దేవగన్ 11. చిరంజీవి 12. మోహన్ లాల్ 13. ధనుష్ 14. రిషబ్ శెట్టి 15. ప్రభాస్ 16. టైగర్ ష్రాఫ్ 17. ఆయుష్మాన్ ఖురానా 18. అరుణ్ గోవిల్ 19. దీపికా చిఖలియా వ్యాపారవేత్తలు 1. ముఖేష్ అంబానీ 2. అనిల్ అంబానీ 3. గౌతమ్ అదానీ 4. రతన్ టాటా క్రీడాకారులు 1. సచిన్ టెండూల్కర్ 2. విరాట్ కోహ్లీ రాజకీయనేతలు 1. మల్లికార్జున్ ఖర్గే 2. సోనియా గాంధీ 3. అధిర్ రంజన్ చౌదరి 4. డాక్టర్ మన్మోహన్ సింగ్ 5. హెచ్డి దేవెగౌడ 6. లాల్ కృష్ణ అద్వానీ 7. మురళీ మనోహర్ జోషి -
రామమందిర ప్రారంభోత్సవం.. ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న వైభవంగా జరిగిగే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వేడుకకు 7000 మంది హాజరుకానున్నారు. తాజాగా రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ స్థలం విషయంలో నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారికి కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ఆహ్వానం అందించింది. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరింది. బాబ్రీ మసీదుగా మద్దతుగా నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారికి 2020 ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపించిన విషయం గమనార్హం. అయితే ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ సమయంలో కూడా రోడ్డు షోలో పాల్గొన్న ప్రధానమంత్రికి ఇక్బాల్ అన్సారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఇక్బాల్ స్పందిస్తూ.. అతను(మోదీ) మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మాకు అతిథి, మా ప్రధానమంత్రి కూడా’ అంటూ అందుకే స్వాగతం పలికానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇక్బాల్ అన్సారి తండ్రి కూడా రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 95 ఏళ్ల వయస్సులో 2016లో మృతి చెందారు. అనంతరం రామజన్మభూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కీలకంగా వ్యవహిరించారు. కాగా.. రామజన్మభూమి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న కీలక తీర్పును వెలువరించింది. వివాదంలో ఉన్న స్థలాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ.. దానికి దగ్గరలో మరోచోటు ముస్లింలకు 5ఎకరాలకు స్థలాన్ని కేటించిన విషయం తెలిసిందే. చదవండి: జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట -
సీఎం జగన్ ఇంటికి సోదరి షర్మిల
సాక్షి, అమరావతి/కడప అర్బన్/గన్నవరం : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. తన తనయుడు రాజారెడ్డి వివాహానికి విచ్చేయాలని ఆహ్వానపత్రికను అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను మంగళవారం తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షర్మిల.. ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకుని, మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అందరినీ ఆహ్వానిస్తున్నా.. సీఎం రమేష్ కు చెందిన అదే స్పెషల్ ఫ్లైట్‌లో తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలి తదితరులతో కలిసి బుధవారం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు రాజారెడ్డి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్కడికి ముందుగానే ప్యాసింజర్ ఫ్లైట్‌లో చేరుకున్న భర్త అనిల్‌కుమార్‌తో పాటు తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్ జగన్‌కు షర్మిల అందజేశారు. అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఇండియా విమానంలో భర్తతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ సందర్భంగాప్రకటించారు. బీటెక్ రవితో అనిల్‌కుమార్ చర్చలు ప్యాసింజర్ ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్లేందుకు షర్మిల భర్త అనిల్ కుమార్ బుధవారం కడప విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ జమ్మలమడుగు సమన్వయకర్త భూపే‹Ùరెడ్డి తండ్రి దేవగుడి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు)లు కూడా విజయవాడకు వెళ్లేందుకు కడప విమానాశ్రయానికి వచ్చారు. వీరిద్దరితో వీఐపీ లాంజ్‌లో అనిల్‌కుమార్ సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్లైట్ అరగంటపాటు ఆలస్యం కావడంతో బీటెక్ రవి, నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటే.. కడప జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని తనతో అనిల్‌కుమార్ చర్చించినట్లు బీటెక్ రవి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న షర్మిలకు తన తరఫున శుభాకాంక్షలు చెప్పాలని అనిల్‌కుమార్‌కు చెప్పానని బీటెక్ రవి అన్నారు. ఆ తర్వాత ఒకే ఫ్లైట్‌లో అనిల్‌కుమార్, బీటెక్ రవి, నారాయణరెడ్డిలు విజయవాడ చేరుకున్నారు. -
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్‌లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్‌ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్‌లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
హార్వర్డ్ వర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బోస్టన్ యూనివర్సిటీలో వచ్చే సంవత్సరం జరిగే ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ఆహా్వనం అందింది. 2024 ఫిబ్రవరి 18న హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్‌లో ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ‘ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ, కల్చర్’అనే అంశంపై ఈ కాన్ఫరెన్స్ సాగనుంది. ‘ఇటీవలి కాలంలో తెలంగాణ సాధించిన వృద్ధిలో చూపిన ప్రభావవంతమైన నాయకత్వం, పోషించిన పాత్ర, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం, మాకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’అని ఈ సందర్భంగా కేటీఆర్‌కు పంపిన ఆహా్వన లేఖలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు, విధాన నిపుణులతో సహా 1,000 మంది భారతీయ ప్రవాస సభ్యులు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు కేసీఆర్‌తో పొన్నాల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు. సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్‌రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు. -
దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వనం
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, గుంటూరు: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం జగన్‌కు అందజేశారు. సీఎం జగన్‌ను ఆహ్వానించిన వారిలో ఆలయ దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఈ నెల 18 నుంచి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్‌కు ఆహ్వానం
-
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి మంగళవారం కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత: హోంమంత్రి -
జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం
దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే.. రాయిమతి ఘివురియా కోరాపుట్ జిల్లాలోని కుంద్ర బ్లాక్‌కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‌లోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్ స్కూల్‌ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి మరో మహిళా రైతు సుబాస మెహనత మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్ మిషన్ తీసుకొచ్చింది. చాలమంది మిల్లెట్ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్ మిషన్ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది. అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు. (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
హస్తినకు ‘పొందూరు’ కళాకారులు
పొందూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ముగ్గురు ఖాదీ కార్మికులకు ప్రత్యేక ఆహ్వనం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు, నేత కార్మికులకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో పొందూరుకు చెందిన బల్ల భద్రయ్య–లక్ష్మి దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు అదృష్టం దక్కింది. గుర్తింపు లభించిందిలా.. పొందూరులోని చేనేతవాడకు చెందిన బల్ల భద్రయ్య 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో 15 ఏళ్లు ఫైన్ ఖాదీ పంచెలు (దోవత్) నేయడంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. నూరవ కౌంట్ (ఫైన్) చిలపను తయారు చేసి వస్త్రం నేసేందుకు సంప్రదాయంగా అవసరమైన దారాన్ని తీయడంలో జల్లేపల్లి సూర్యకాంతం మంచి నేర్పరితనం కనబరచడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు.