సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి రావాలని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆమె ఆహ్వానించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవుతుండటంతో ఆయనతో వేదిక పంచుకోవడం సరికాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కోల్‌కతా ర్యాలీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment