పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఢిల్లీ: ఎన్నికల తర్వాతే మా కూటమి నాయకుడు ఎవరనేది నిర్ణయిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాను మమతా బెనర్జీ సందర్శించారు. అనంతరం మమత మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఎలా ఉన్నా జాతీయస్థాయిలో మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి కడతామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ముందు జాతీయస్థాయిలో ప్రీపోల్ అలయెన్స్ ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించారు.
రాజకీయ కారణాల వల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు పొత్తుకు రావడం లేదని తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తయారీ జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాము టచ్‌లో ఉన్నామని మమత చెప్పారు. దానిపై చర్చించిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఇంటికి పంపడమే మా లక్ష్యమని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment