ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రేపు(మంగళవారం) ఉదయం విచారణ చేస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై. చంద్రచూడ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తొలుత కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు రావడంతో రేపటికి సుప్రీం కోర్టు విచారణ వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.
కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేసీఆర్‌కు నోటీసు పంపిన విచారణకు రాలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. దీంతో విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పును మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment