న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్నకు ఈనెల ప్రారంభంలో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.
గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్‌ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్‌లను డీఎస్పీ ప్రణీత్‌రావు, తదితరులు ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఏడు నెలలుగా ఈయన జైలులోనే ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడగా... ఈ కేసులో అప్పటి ఎస్‌ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు.
అయితే, కీలక నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment