ఢిల్లీ, సాక్షి: విచారణ కమిషన్లు వేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, అలాంటిది తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పవర్ కమిషన్ చైర్మన్ తప్పుకున్నట్లు చెప్పిన ఆయన.. సాక్షితో మాట్లాడారు.
విచారణ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్‌పెట్టేందుకే ప్రెస్ మీట్ పెట్టాను. పైగా ఆ ప్రెస్ మీట్‌లో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. కనీసం ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు.
పవర్ కమిషన్ విచారణలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కమిషన్ తరఫున 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్ తప్ప అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ కమిషన్‌లో నేను పని చేశా. అలాంటిది విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోమని కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలోనూ సమాజం అంగీకరించని భాష వాడారు. ఎన్నో కమిషన్ చైర్మన్లు ప్రెస్ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.
అందరి అభిప్రాయాలు తీసుకుని నేను నివేదిక కూడా సిద్ధం చేశా. నేను ఇచ్చే రిపోర్ట్ నా వ్యక్తిగతం.. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. ఆ ఇచ్చిన రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్ చేయొచ్చు అని అన్నారాయన. అంతకు ముందు..
కేసీఆర్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం బెంచ్‌కు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment