
ఢిల్లీ: తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. వట్టి జానయ్య కేసులో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది దేవీన సెహగల్ సరైన జవాబు ఇవ్వకపోవడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదికి సరైన వివరాలు అందించడంలో పోలీస్ శాఖ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రాసిక్యూషన్‌కు, ప్రభుత్వ న్యాయవాదికి మధ్య గ్యాప్ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న తెలంగాణ డీజీపీ వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదంటే వర్చువల్‌గానైనా హాజరు కావాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
వట్టి జానయ్య కేసులో చార్జ్ షీట్ల తేదీల వివరాలను సుప్రీంకోర్టు కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తనను వేధిస్తోందని వట్టి జానయ్య పిటీషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది దేవీన సెహగల్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment