రాహుల్‌.. ఒక్కసారి తెలంగాణవైపు చూడండి: కేటీఆర్‌ | KTR Request To Rahul Gandhi Over HYDRA Demolishes In Telangana | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. ఒక్కసారి తెలంగాణవైపు చూడండి: కేటీఆర్‌

Published Tue, Oct 1 2024 5:07 PM | Last Updated on Tue, Oct 1 2024 7:01 PM

KTR Request To Rahul Gandhi Over HYDRA Demolishes In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలపై ఆ‍గ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతలను రాహుల్‌ గాంధీ పట్టించుకోవాలని కోరారు. ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
ముఖ్యమంత్రి, 
వారి గూడుని కూల్చేసారు! 
వారి కలలను చిదిమేసారు!

ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు!

మీ మంత్రులను వచ్చి చెప్పమనండి.. వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని!

మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి..

మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము.. మీ బ్రతుకులు బాగుపడతాయని 🙏🏼

ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!

డియర్‌ రాహుల్‌ గాంధీ ఇప్పటికైనా తెలంగాణ సర్కార్‌ కూల్చివేతలను ఒక్కసారి చూడండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి సవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement