ప్రజల్లో సంక్షేమం, అభివృధ్ధిలో గత ప్రభుత్వమే మేలన్న భావన మొదలైంది
ఢిల్లీలో మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారన్న సీఎం ఆరోపణలు పచ్చి అబద్ధం
ఈ ప్రభుత్వం ఐదేళ్లుంటేనే ఏ పార్టీ గొప్పో, తెలంగాణకు ఎవరు అవసరమో తేలుతుంది
ఫిరాయింపులపై కాంగ్రెస్‌ను, రాహుల్‌ను ఎండగడతాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. సంక్షేమం, అభివృధ్ధిలో గత ప్రభుత్వమే మేలన్న భావన నెలకొంటోందని చెప్పారు. ఫిరాయింపు లపై కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రయతి్నంచిందన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లుంటేనే ఏ పార్టీ గొప్పో, తెలంగాణకు ఎవరి అవసరం ఉందో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. పలు అంశాలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కేసీఆర్ అన్నారు
‘కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారన్న సీఎం రేవంత్ ఆరోపణలు పచ్చి అబద్ధం. ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చాక, ఎంఐఎం సైతం వారితో కలిశాక ప్రభుత్వం కూల్చడం అనే మాట ఉత్పన్నం కాదు. ఆందోల్‌లో నిర్వహించిన సభలో, లక్షలాది ప్రజల సమక్షంలో బీఆర్‌ఎస్ అధి నేత కేసీఆర్ స్వయంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.
అప్పుడే ప్రజలకు నీళ్లేవో, పాలేవో అర్థమవుతుందని అన్నా రు. కేసీఆర్‌ది అయినా, నాదైనా, పార్టీదైనా ఇదే మా ట.కొన్ని పత్రికలు మాత్రమే ప్రభుత్వాన్ని పడగొడ తామని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ కల్పిత కథ నాలు అల్లాయి..’ అని హరీశ్‌రావు విమర్శించారు.
అప్పుడు గంపగుత్తగా చేరారు కాబట్టి విలీనం
‘రాష్ట్రంలో ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేసి, వివిధ ఆశలు చూపి కాంగ్రెస్‌లోకి లాక్కుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి మారే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా 10వ షెడ్యూల్‌లో మార్పులు చే స్తామని హామీ ఇచ్చి0ది. రాహుల్‌గాంధీ స్వయంగా పార్టీ జాతీయ మేనిఫెస్టోని హైదరాబాద్‌లో ప్రక టించారు. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని రక్షించాలంటూ రాజ్యాంగాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు.
మరి అలాంటి రాహుల్, అతని పార్టీ.. మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఏంటి?. కాంగ్రెస్, రాహుల్ ద్వంద్వ నీతిని ఎండగడతాం. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంగా ఉంటూనే కలిసొచ్చే పార్టీలతో రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులపై కొట్లాడతాం. అవసరాన్ని బట్టి బీజేపీకి అంశాల వారీ మద్దతు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ నుంచి గంపగుత్తగా 12 మంది ఎమ్మెల్యేలు చేరినందునే శాసనభా పక్ష విలీనం జరిగింది.
ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యేకు విడిగా కండువాలు కప్పుతున్నందున బీఆర్‌ఎస్ నుంచి మూడోవంతు ఎమ్మెల్యేలు వెళ్లినా కాంగ్రెస్‌లో విలీనం సాధ్యం కాదు. ఫిరాయింపులపై న్యాయ పోరాటానికి సిధ్దమవుతున్నాం. దీనిపై సీనియర్ న్యాయవాదులతో చర్చించాం..’అని మాజీ మంత్రి తెలిపారు.
కేసీఆరే సుప్రీం
‘ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ నా ట్రాప్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం. కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్య లున్నాయి. పారీ్టలో కేసీఆరే సుప్రీం. ఆయన మాటే చెట్లుబాటు అవుతుంది..’అని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి రెండేళ్ల టైమ్ ఇస్తున్నాం..
‘తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య పోలిక మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఆ ప్రభుత్వానికి పరిపాలన చేతకావట్లేదు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్, తాగునీటి కొరత ఏర్పడినా పట్టించుకున్న నాథుడే లేడు. 2 నెలలుగా ఆసరా పింఛన్లు ఇవ్బడం లేదు.
మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతాలు లేవు. కనీసం గ్రామ పంచాయతీల్లో చెత్త కూడా ఎత్తడం లేదు. బీఆర్‌ఎస్ ఇంకా ఎక్కడా రోడ్డెక్కకున్నా, ఆందోళనలు చేయకున్నా ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత ప్రారంభమయ్యింది. ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రజాందోళనలు నిర్వహిస్తాం.
జాతీయ స్థాయి ఎన్నికలప్పుడే బీజేపీ ప్రభావం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ, నాన్ మోదీ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. రెండు పక్షాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ సహా వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు నష్టపోయాయి..’హరీశ్‌రావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment