సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీఆర్‌ఎస్ 100 సీట్లు రావడం ఖాయమని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకూ.. నాకలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.
ఈ మేరకు తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడుతూ..‘మమ్మల్ని డీల్ చేయడం కాదు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో ఉన్నాడు. పక్కనున్న వాళ్లే ఆయన్ను దించేయకుండా జాగ్రత్త పడాలి. ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్. సీఎం అయ్యేది కేసీఆర్. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా?. రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా.. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా నింపలేడు.
మూసీ సుందరీకరణకు మేము అనుకూలమే. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకం. మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నాం. మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీ రాజమౌళి సినిమాను తలపిది. మూసీ బాధితులకు మల్లన్న సాగర్‌కు మించిన పరిహారం ఇవ్వాలి. మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలి’ అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment