
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక అని తెలిపారు. సోమవారం హరీశ్‌రావు మీడియాతో మట్లాడారు.
‘రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే మాజీ సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష. ప్రభుత్వం ఇచ్చిన యాడ్‌లో జై తెలంగాణ పదం లేదు. తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమ కారుడు కాదు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా మేం జైలుకి వెళ్ళాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment