చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా! | Why Junior NTR escapes from sister mohana roopa Marriage | Sakshi
Sakshi News home page

చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా!

Published Mon, Aug 18 2014 1:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా!

చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా!

నందమూరి కుటుంబంలో జరిగిన.... చెల్లెలు పెళ్లికి ఇద్దరు అన్నలు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమార్తె మోహన రూప వివాహానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయిన ఈ వేడుకకు  జూనియర్, తారకరత్న మాత్రం మిస్ అయ్యారు. అయితే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని అందుకే ఎన్టీఆర్తో పాటు తారకరత్న కూడా హాజరు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితం అయ్యింది.

గత ఏడాది బాలకృష్ణ కుమార్తె తేజస్విని పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్తో హాట్ టాఫిక్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చెల్లెలు పెళ్లికి ఆహ్వానం అందక పోవటం వల్లే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ తరపున అబ్బాయి ప్రచారం చేయకపోవటంతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణాలతోనే అబ్బాయిని దూరంగా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్లో బాబాయ్ కాలికి దెబ్బ తగలటంతో... అబ్బాయ్ స్పందించి త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ కూడా చేశాడు.

ఇక నందమూరి తారకరత్నకు కూడా పెళ్లి పిలుపు అందలేదట. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా అలేఖ్య అనే ఆమెను తారకరత్న ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తారకరత్న తల్లిదండ్రుల సూచన మేరకు  అతడిని వివాహానికి ఆహ్వానించలేదట. ఇంతకు ఎన్టీఆర్కు ఆహ్వానం అందిందా లేక కావాలనే హాజరు కాలేదా అనేది టాలీవుడ్తో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement