Tarakaratna
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్య. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సందడి చేశారు. ఇంటిని అలంకరించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. (ఇది చదవండి: తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!)కాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishkatarakratna) -
ఉగాది రోజు ఊహించని అతిథి.. అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు స్వయంగా తానే తారకరత్న ఇంటికి వెళ్లారు. పండుగ రోజు సంతోషంగా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా లైఫ్‌లో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాల్లోనూ ఎప్పుడు మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ప్రత్యేకంగా రావడం ఇంతకు మించిన సంతోషం లేదు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌పై మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. కాగా.. గతేడాది గుండెపోటుతో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇవాళ తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్ డే కావడంలో ఆయన భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. నీ నువ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ మమ్ము(అమ్మ) ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని ఎమోషనలైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్య రెడ్డికి కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
కూతురితో ఆడుకున్న తారకరత్న.. ఇదే చివరి వీడియో!
నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. భర్తే సర్వస్వం అనుకున్న అలేఖ్యా రెడ్డి, తండ్రే ప్రపంచం అనుకున్న నిష్కలను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి కావటంతో ఇటీవలే భర్త ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది అలేఖ్య. ఎన్నో కష్టనష్టాలను దాటుకుంటూ వారి ప్రయాణం కొనసాగిందని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత దగ్గరివాళ్లే దూరం పెట్టి నరకం చూపించారని, జీవితమంతా కష్టాలే అనుభవించామంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా నిష్క.. తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోను షేర్ చేసింది. హిందూపూర్‌కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి గేమ్ ఆడారు తారకరత్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు లవ్యూ తారక్ అన్నా అంటూ ఎమోషనలవుతున్నారు. కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishka_nandamuri) -
పెళ్లి తర్వాత మనపై వివక్ష, జీవితమంతా కష్టాలే: అలేఖ్య
నందమూరి తారకరత్న.. అలేఖ్యా రెడ్డి.. ఇద్దరూ కలిసి జీవించడానికి ఒక యుద్ధమే చేశారు. అన్ని అడ్డంకులను జయించి ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుని దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి ప్రేమకు గుర్తుగా కూతురు నిషిక, కవలలు తాన్యారామ్, రేయా జన్మించారు. కానీ తన కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టివేస్తూ ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు తారకరత్న. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది అలేఖ్య. తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు.. దీంతో తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ తను లేని లోటు గురించి బాధపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య. 'నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉన్నాయి. మన పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమ ప్రయాణంలో నేను కొంత బెరుకుగా ఉన్నా నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నామంటూ ఎంతో నమ్మకంగా ఉన్నావు. అప్పటి నుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాడావు. చివరికి మన పెళ్లి జరిగింది. అయినా ఈ వివాహంపై ఒక గందరగోళం. మనపై వివక్ష.. అయినప్పటికీ నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టాక మన జీవితమే మారిపోయింది. మన ఆనందం రెట్టింపైంది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి. 2019లో కవలల జననంతో నీ కల నిజమైంది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెలో ఉన్న బాధ ఎవరికీ అర్థం కాలేదు సరికదా కనీసం దాన్ని పట్టించుకోలేదు కూడా! మనకు బాగా కావాల్సినవాళ్లే మన మనసుకు పదేపదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు సపోర్ట్‌గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోయాం.. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం.. నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
Tarakaratna: నందమూరి తారకరత్న పెద్దకర్మ (ఫొటోలు)
-
తారకరత్న బర్త్ డే.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. భర్త దూరం కావడంతో పిల్లలతో పాటు భార్య అలేఖ్య రెడ్డి తీవ్రం విషాదంలో మునిగిపోయింది. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయడంతో ఆమె మరింత కృంగిపోయింది. ఫిబ్రవరి 22 తారకరత్న బర్త్‌డే సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 22 తారకరత్న 40వ పుట్టినరోజు. ఆయన బర్త్ డే సందర్భంగా.. తారకరత్న తన కూతురు నిష్కతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆయన భార్య అలేఖ్యా రెడ్డి. నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే.. నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ తారకరత్న అన్న పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede) -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
-
Taraka Ratna Death: తారకరత్న భౌతికకాయాన్ని చూసి తల్లడిల్లుతున్న కుటుంబసభ్యులు (ఫొటోలు)
-
మెరుగవుతోన్న తారకరత్న ఆరోగ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపారు. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్ -
‘తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేరా?’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమెడీయన్ పాదయాత్ర చేస్తే కామెడీ తప్ప మరేమీ ఉండదని నారా లోకేష్‌ను ఉద్దేశించి సెటైరికల్ పంచ్ వేశారు. కాగా, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పాదయాత్రలో లోకేష్ కామెడీ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ఐరన్ లెగ్గా అభివర్ణిస్తున్నారు. పాదయాత్రకు హాజరైన తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరం. ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేందటే వారి మానవత్వం ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయింది. ఈ ఘటనను పెద్ద అపశృతిగా ప్రజలు భావిస్తున్నారు. మానవత్వం లేని చంద్రబాబు, లోకేష్ స్వభావం చూస్తుంటే అసహ్యంగా ఉంది. లోకేష్ ఈ జన్మలో నాయకుడు కాలేదు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్‌ల కారణంగా ఎందరో చనిపోతున్నారు. మీరు మనుషులను చంపడానికే వచ్చారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, బెంగళూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్‌పై శనివారం మధ్యాహ్నం హృదయాలయ డాక్టర్లు బుటిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్బంగా తారకతర్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో, తారకరత్నను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నారాయణ హృదయాలయ డాక్టర్లు కుప్పం వెళ్లారు. వైద్య చికిత్సల అనంతరం.. శనివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే సరికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తీసుకువచ్చాము. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. -
నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి బెంగుళూరుకు తారకరత్న..
కుప్పం/కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా) : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో ఆదిలోనే అపశ్రుతి చోటుచేసుకుంది. లోకేశ్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు మనుమడు తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు. శుక్రవారం ఉదయం 11.10 గంటలకు కుప్పం మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలో బాబునగర్ వద్ద ఉన్న మసీదుకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 12 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు తోసుకొని మీద పడటంతో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. నిలదొక్కుకోలేక సొమ్మసిల్లి కింద పడిపోవటంతో కార్యకర్తలు హుటాహుటిన పట్టణంలోని కేసీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో పీఈఎస్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, రక్తనాళాలు 90 శాతం మూసుకుపోవటంతో తారకరత్న స్పృహ కోల్పోయాడన్నారు. ప్రాణాపాయం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తారకరత్నను ఆస్పత్రికి తరలించగానే మరోవైపు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. తారకరత్న వెంట వెళ్లకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించడంపై పార్టీలోని పలువురు నేతలు విస్మయం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుడు, బావ అయిన ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసినా, లోకేశ్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని, ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని వారు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా, తారకరత్నకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, వారినెవరినీ బయటకు పంపడం లేదని.. బయటి నుంచి కూడా ఎవరినీ ఆస్పత్రి లోపలకు అనుమతించడం లేదని సిబ్బంది కుటుంబీకులు వాపోతున్నారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని టీడీపీ శ్రేణులే గుసగుసలు పోతుండటం గమనార్హం. నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరుకు.. ఆస్పత్రిలో తారకరత్నకు వైద్యం అందించిన వైద్యులు.. బెంగళూరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రి మెడికల్ రిపోర్ట్ సమర్పిస్తే తప్పకుండా సహకరిస్తామని ఎస్పీ వారికి తెలిపారు. అంతలో తొలి రోజు పాద యాత్ర ముగించుకున్న లోకేశ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మామ బాలకృష్ణతో మాట్లాడారు. ఆ తర్వాత తారకరత్నను బెంగళూరుకు తరలించడం లేదని, బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు ఇక్కడే చికిత్స అందిస్తారని పార్టీ శ్రేణులకు వారు సమాచారం ఇచ్చారు. లోకేశ్ వెళ్లగానే నిర్ణయం మారిపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపో యారు. బెంగళూరుకు తీసుకెళ్లుంటే మరింత మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేదని, ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 9.30 గంటలకు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక(9) పీఈఎస్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు తారకరత్న బావమరిదితో బాలకృష్ణ, లోకేశ్, మరికొందరు మాట్లాడాకే.. తారకరత్నకు ఇక్కడే వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. తారకరత్న కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఇక్కడే వైద్యం కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే నాటకీయపరిణామాల మధ్య అర్థరాత్రి సమ యంలో తారకరత్నను మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలించారు. -
దేవినేని: నిజాలు చూపించాం
నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్‌లైన్. శివనాగు దర్శకత్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మించారు. రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ‘మా’ అసోసియేషన్ కార్యదర్శి జీవితా రాజశేఖర్ విడుదల చేయగా, ఫస్ట్ లుక్‌ను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారకరత్న అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో అతనికి పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నామన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘గతంలో బెజవాడను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకూ ఎవరూ చూపించని నిజాలను ఇందులో చూపించాం. వంగవీటి రంగాని ఎవరు చంపారు అనేది ఈ చిత్రంలో చూపించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగ పాత్రలో నటించిన సురేశ్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన నిర్మాత టి. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/hLIXtGw72G — Nandamuri TarakaRathna (@NTarakarathna) January 10, 2021 -
దోస్త్ మేరా దోస్త్
ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఉన్న స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘ఫ్రెండ్షిప్లో నెమ్మదిగా వెళ్లాలి. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అయిన తర్వాత ఆ బాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. మా మధ్య ఫ్రెండ్షిప్ని వివరించడానికి ఈ కొటేషన్ చాలు’’ అన్నారు తారక్. ‘‘కొన్ని బంధాలు ఏర్పడటానికి సమయం తీసుకుంటాయి. ఏర్పడ్డాక తిరిగి చూసేపనిలేదు. తారక్‌తో నాకు అలాంటి బాండ్ ఏర్పడింది’’ అన్నారు చరణ్. వీళ్లిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే పీరియాడికల్ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
తారకరత్న హీరోగా ద్విభాషా చిత్రం
నందమూరి తారకరత్న, మేఘ శ్రీ జంటగా చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘అమృత వర్షిణి’. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరోలు నారా రోహిత్, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాను థ్రిల్లర్, లవ్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చిక్‌మంగళూరులో జరగనున్న సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతున్న ఈసినిమాకు జెస్సీ గిఫ్ట్ సంగీతమందిస్తున్నారు. -
ప్రతిసినిమాలో కొత్తకోణం
బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో తారకరత్న కర్నూలు సీక్యాంప్: నందమూరి కుటుంబ హీరోలకు కర్నూలు అచ్చొచ్చిన ప్రాంతమని, ఇక్కడ తమ ప్రతి సినిమా బాగా అడుతుందని నందమూరి తారకరత్న అన్నారు. నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని హోటల్ ప్రకాశ్ రిజెన్సీలో ఎన్బీకే మోక్షాజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన తారకరత్న మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో బాబాయ్ బాలకృష్ణది ప్రత్యేకశైలి అన్నారు. ప్రతీ సినిమాను కొత్త కోణంలో తీయడం ఆయనకే చెల్లుతుందన్నారు. తన అభిమాన హీరో బాలకృష్ణ అని, ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సేవా సమితి సభ్యులు లతీఫ్, ఖాజామిన్నెల్ల, రమేష్‌రెడ్డి, మోతీలాల్, లక్ష్మీనారాయణ, చంద్ర, రమేష్, రామకృష్ణ, సలాం, బజారి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు తూచ్!
రాజధాని జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ వీఐపీలు, రాజకీయ నేతలకు తక్కువ ధరకే కేటాయింపు పోటీకి ఎవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్న వైనం 9999 నంబర్‌ను రూ. 50 వేలకే దక్కించుకున్న తారకరత్న గుంటూరు : అక్కడ సామాన్యులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి... ఉన్నతాధికారులు, వీఐపీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం నిబంధనలు అడ్డురావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నంబర్లను లక్షల్లో వేలం ద్వారా దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఫ్యాన్సీ నంబర్లకు వేలం లేకుండా అసలు ధరకే ఇవ్వాలంటూ ఆర్టీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండడంతో అడ్డుచెప్పలేక మిన్నకుండిపోతున్నారు. గుంటూరు డీటీసీ కార్యాలయంతోపాటు నరసరావుపేటలోని ఆర్టీవో కార్యాలయం, తెనాలి, పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాల్లో మాత్రం ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. జిల్లాలో నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఇక్కడే తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక మోస్తరు ఫ్యాన్సీ నంబరుకు సైతం పోటీ అధికంగా ఉండడంతో లక్షలు వెచ్చించి వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెంబరును ఆన్లైన్ ద్వారా నిబంధనల ప్రకారం కేటాయిస్తామని చెబుతున్న ఆర్టీఏ అధికారులు పలుకుబడి ఉన్నవారికి మాత్రం నిబంధనలు పక్కన బెట్టి నిర్ణయించిన ధరకే కేటాయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే ఫ్యాన్సీ నంబర్ గుంటూరులో కొన్ని నెలలుగా పోటీ ఎక్కువగా ఉన్న ఫ్యాన్సీ నంబర్లు సైతం నిర్ణయించిన ధరకే పోతున్నాయి తప్ప, అధిక ధరలకు ఎవరూ తీసుకోవడం లేదు. ఖర్చుపెట్టేందుకు ఆసక్తికనబర్చడం లేదనుకుంటే పొరబడినట్లే. ఫ్యాన్సీ నంబర్ల మీద కన్నేసిన ఉన్నతాధికారులు, అధికారపార్టీ నేతలు, వారి బంధువులు తమ పలుకుబడి ఉపయోగించి ఎవరినీ పాటకు రాకుండా బెదిరిస్తూ నిర్ణయించిన ధరకే తమకు కావాల్సిన నంబరును దక్కించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి తన వాహనానికి ఫ్యాన్సీ నంబ రును కేటాయించాలంటూ ఆర్టీఏ అధికారులకు హుకుం జారీ చేయడంతోపాటు, తన కార్యాలయ పరిపాలన అధికారిని అక్కడ ఉంచి ఎవరూ పోటీకి రాకుండా చేసి తక్కువధరకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన ఓ నాయకుడు సైతం ఫ్యాన్సీ నంబరును నిర్ణయించిన ధరకే దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రాకపోవడం చూస్తుంటే అధికారులు ఏస్థాయిలో నిబంధనలకు పాతర వేస్తున్నారో అర్ధమవుతోంది. 9999 నంబరును రూ. 50 వేలకు దక్కించుకున్న తారకరత్న ముఖ్యమంత్రి బంధువు, హీరో నందమూరి తారకరత్న తన వాహనానికి నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో ఏపీ07 సీడబ్ల్యూ 9999 నంబరును కేవలం రూ. 50వేలకు దక్కించుకున్నారు. స్థాని కంగా నివాసం ఉండనప్పటికీ ఓ బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్ని ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్సు ప్రూఫ్‌గా చూపించి నంబరును దక్కించుకున్నారు. ఈ నంబరుకు మరికొందరు పోటీకి వచ్చినప్పటికీ అధికారులు నచ్చజెప్పి వారిని విరమించుకునేలా చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్డు 15 రోజుల తరువాత పోసులో పంపుతారు. తారకరత్నకు మాత్రం నిమిషాల్లో కార్డు తయారు చేయించి చేతికిచ్చి పంపి ఆర్టీఏ అధికారులు తమ స్వామిభక్తి చాటుకున్నారు. -
ఉత్కంఠకు గురి చేసేలా...
టాలీవుడ్లో ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ‘ఎవరు’ పేరుతో మరో హారర్ చిత్రం తెరకెక్కింది. తారకరత్న, శేఖర్, యామిని, చందు ప్రధాన పాత్రల్లో రమణ సెల్వ దర్శకత్వంలో ముప్పా అంకమ్మ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరులతో మాట్లా డారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నారా రోహిత్ మాట్లాడుతూ-‘‘సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. వరుసగా హారర్ చిత్రాలు వచ్చి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే అంశాలు చాలా ఉంటాయి’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చేశాననే ఫీలింగ్ కలిగింది’’ అని తారకరత్న చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: లింగ శ్రీనివాసరావు. -
చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా!
నందమూరి కుటుంబంలో జరిగిన.... చెల్లెలు పెళ్లికి ఇద్దరు అన్నలు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమార్తె మోహన రూప వివాహానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయిన ఈ వేడుకకు జూనియర్, తారకరత్న మాత్రం మిస్ అయ్యారు. అయితే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని అందుకే ఎన్టీఆర్‌తో పాటు తారకరత్న కూడా హాజరు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితం అయ్యింది. గత ఏడాది బాలకృష్ణ కుమార్తె తేజస్విని పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్‌తో హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చెల్లెలు పెళ్లికి ఆహ్వానం అందక పోవటం వల్లే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ తరపున అబ్బాయి ప్రచారం చేయకపోవటంతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణాలతోనే అబ్బాయిని దూరంగా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్లో బాబాయ్ కాలికి దెబ్బ తగలటంతో... అబ్బాయ్ స్పందించి త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ కూడా చేశాడు. ఇక నందమూరి తారకరత్నకు కూడా పెళ్లి పిలుపు అందలేదట. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా అలేఖ్య అనే ఆమెను తారకరత్న ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తారకరత్న తల్లిదండ్రుల సూచన మేరకు అతడిని వివాహానికి ఆహ్వానించలేదట. ఇంతకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందా లేక కావాలనే హాజరు కాలేదా అనేది టాలీవుడ్‌తో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది.