
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమెడీయన్ పాదయాత్ర చేస్తే కామెడీ తప్ప మరేమీ ఉండదని నారా లోకేష్‌ను ఉద్దేశించి సెటైరికల్ పంచ్ వేశారు.
కాగా, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పాదయాత్రలో లోకేష్ కామెడీ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ఐరన్ లెగ్‌గా అభివర్ణిస్తున్నారు. పాదయాత్రకు హాజరైన తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరం. ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేందటే వారి మానవత్వం ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయింది.
ఈ ఘటనను పెద్ద అపశృతిగా ప్రజలు భావిస్తున్నారు. మానవత్వం లేని చంద్రబాబు, లోకేష్ స్వభావం చూస్తుంటే అసహ్యంగా ఉంది. లోకేష్ ఈ జన్మలో నాయకుడు కాలేదు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్‌ల కారణంగా ఎందరో చనిపోతున్నారు. మీరు మనుషులను చంపడానికే వచ్చారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment