Laxmi parvathi
-
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు అండ్ కొ సంఘ విద్రోహులని మండిపడ్డారామె.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది. నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం. పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషే. ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?. వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు. రాజకీయ నీచుడు చంద్రబాబు. చంద్రబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం. ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోదీ చదివారు. సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు. గీతం భరత్‌ను ఓడించాలి. గీతం అంటేనే భూ కబ్జాలు. ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
‘టీడీపీ నుంచి చంద్రబాబును కార్యకర్తలే తరిమేయాలి’
సాక్షి, విజయవాడ: రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి. ఎల్లోమీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కోర్టుల్లోని కేసులను కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట. అలాంటి వ్యక్తి వలన ప్రజలకు ఉపయోగం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంటులో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనపడలేదు, వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది. అలాంటి వ్యవహారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. ఎన్నికలు వస్తుండటంతో రకరకాల వేషాలతో వస్తున్నారు. వారందరికీ నాయకుడే చంద్రబాబే. ఎన్టీఆర్‌కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు’ అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ‘ఇప్పుడు జగన్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టాడు. పేదల అభివృద్ధి కోసం జగన్ ఎంత చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఏనాడైనా పేదలను పట్టించుకున్నారా?. విద్య, వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూశాం. జగన్ లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షాతో కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబు అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారు. ..చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందికే అన్నిసీట్లనూ కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవటానికి చంద్రబాబు బీజేపీతో కలవబోతున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుంది. షర్మిళ దారి తప్పిన బాణం. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే షర్మిళ పని. చంద్రబాబు, జనసేన మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు’ అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు అవినీతి ప్రస్థానం
‘‘ఎక్కడి నీచు లెక్కడి హీనులెంతటి తులువలు / ఎంతటి భ్రష్టు లెచ్చటి దుష్టు లెక్కడి నష్టజాతకులీ నాయకులు / నా తెలుగు జాతికి శాపంగా దాపురించారో’’ అంటారు మహారథి. ఈ మాట అక్షరాలా మన నారా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమజిలీ కథల్లో పాఠకులను భయపెట్టే ఒక మహావట వృక్షం ఉంటుంది. అంతకంటే భయంకరమైన అవినీతి వృక్షం తెలుగు జాతికి సంక్రమించింది. ఒకే పెరడులో పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఎదగనీయకుండా వ్యవస్థల్ని కూడా భయపెడుతున్న ఈ ‘నారా’ అవినీతి వృక్షం మూలాల్లోకి వెళ్లి ఒక్కసారి పరిశీలిద్దాం. చంద్రబాబుకు నారావారి పల్లెలో ఒక చిన్న పూరిల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. అనుకోకుండా 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ‘ఇందిరా కాంగ్రెస్’ ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎవ్వరడిగినా టిక్కెట్ ఇచ్చింది. ఆ విధంగా ‘నారా’వారు టిక్కెట్ సంపాదించి ఆమె ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడతని నెల జీతం 350 రూపాయలు. పాకాల నారాయణస్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు ఆర్థిక సాయం అందించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే రాజకీయాల్లో సీనియారిటీ, సిన్సియారిటీ పనికి రాదనుకున్నాడు. మంత్రి కావా లనే ఆశతో అన్ని అడ్డదారులు తొక్కటం ప్రారంభించాడు. అమాయకుడైన అంజయ్యగారి అల్లుణ్ణి, పట్టు కొని, అతనిని ప్రలోభపెట్టి చేసి 1980లో మంత్రి పదవి కొట్టేశాడని ఆ రోజుల్లోనే ఒక కాంగ్రెస్ నాయ కుడు ఆక్షేపించాడు. మంత్రిగా అతని జీతం 2,500 రూపాయలు. అదే విధానంలో సంజయ్ గాంధీతో పరిచయం పెంచుకున్నాడు. ఇక మంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుండి అతని అవినీతి యాత్ర ప్రారంభమైంది. తిరుపతిలో 1970– 80లలోనే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు. ఆ తరువాత భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో ఆ రోజుల్లో సినిమావాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేసేవాడని స్వయంగా దాసరి నారాయణ రావుగారు నాతో చెప్పారు. ఆ పరిచ యాలతోనే 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో అతని వివాహం జరిగింది. ‘ఇంత డబ్బు నీకెక్కడిది?’ 1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు ఇతడు కాంగ్రెస్‌లోనే ఉండి ఎన్టీఆర్‌ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలుగుదేశం పార్టీ 200 సీట్లతో గెలవటంతో అప్పటికప్పుడు పార్టీలో చేరతానని వచ్చేశాడు. అప్పటికే అతని మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నందువల్ల ఎన్టీఆర్ తిరస్కరించారు. అప్పుడు గర్భిణిగా ఉన్న భువనేశ్వరిని ముందుపెట్టి ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చి పార్టీలో చొర బడ్డాడు. కార్యకర్తగా చేరిన చంద్రబాబు నంబర్ 2 పొజిషన్ కోసం అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న నాయకులందరినీ ఏదో ఒక వంకతో బయ టకు పంపేశాడు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానారెడ్డి, ఉపేంద్ర, కె.ఇ. కృష్ణ మూర్తి, వసంత నాగేశ్వరరావు... వీరంతా ఎన్టీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగినవారు. బయటకు వెళ్లాక చంద్ర బాబు నీచ రాజకీయాన్ని గురించి తీవ్రంగా విమర్శ చేయటం గమనించదగిన అంశం. అప్పటినుండి పార్టీలో ‘ఏకులా వచ్చి మేకులా’ తయార య్యాడు. ఎన్టీఆర్‌కు రాజకీయ అవగాహన లేకపోవటంతో పార్టీ బాధ్యతనంతా అతనికి అప్పజెప్పటంతో పార్టీ వ్యవహారాలే కాక ప్రభుత్వంలో కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడు. దానికి తోడు ఎన్టీఆర్ అతనిమీద ఉంచిన అపారమైన విశ్వాసంతో ఎవరు తనను కలిసినా ‘బాబును కలవండి’ అని చెప్పటంతో పార్టీలో, ప్రభు త్వంలో అతనికి హద్దు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లో 1,200 గజాలు కొని మంచి భవనం కట్టించాడు. ఆ గృహ ప్రవేశానికి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించాడు. ఆ భవనం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ‘ఇంత డబ్బు నీకెక్కడిది? ఎలా కట్టించావు?’ అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. ఇంటా బయటా చర్చ చంద్రబాబు అవినీతి మీద ‘ఈనాడు’ పేపరు ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించింది. బ్లాటింగ్ పురుషోత్తం (మద్రాసు) వద్ద రెండున్నర కోట్లు ముడుపులు తీసుకున్న విషయం పార్టీలో, బయటా పెద్ద చర్చనీయాంశమైంది. అప్పటికి నష్టాల్లో నడుస్తున్న ‘విష్ణుప్రియ’ హోటల్‌ను సి.ఎం. బలరామిరెడ్డికి బలవంతంగా అంటకట్టి, కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం అతనిని కడప జడ్పీ ఛైర్మన్ గా చేశాడు. అదే విధంగా మూతపడివున్న భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని రేణుకా చౌదరికి అంటగట్టి ఎన్టీఆర్‌ను బలవంతంగా ఒప్పించి రెండవసారి రాజ్యసభకు పంపించాడు. 1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సాలీనా వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించాడు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులుగానీ, ఆదాయ మార్గాలుగానీ లేవని వెల్లడించాడు. అప్పుడు భార్య భువ నేశ్వరి ఆస్తి సుమారు 400 గ్రాముల బంగారం, 50,000 రూపాయల నగదు. తరువాత ఏ పదవిలో లేడు గనుక సంపాదించే అవకాశమే లేదు. 1989 ఎన్నికల్లో తన ఆదాయం 2,16,000, అగ్రికల్చర్ ఆదాయం 36,000గా చూపించాడు. 1992లో 14 కోట్ల 75 లక్షల పెట్టుబడి అంచనాలతో ‘హెరిటేజ్ గ్రూపు’ సంస్థను స్థాపించటం జరిగింది. దాని పెట్టుబడులకు కూడా పార్టీలో అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తానని పార్టీ మనుషుల చేత లక్షల రూపాయల షేర్లు కొనిపించాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు అప్పజెప్పా డని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగానే విమర్శించాడు. నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 600 ఎకరాల్లో టేకు మొక్కలు నాటి వాటిని సొంతం చేసుకోవటమే కాకుండా, యానాం చుట్టుపక్కల బినామీ పేర్లతో కొన్ని వందల ఎకరాలు కొన్నాడని పార్టీ వాళ్ళే ఒకరికొకరు చెప్పుకున్న విషయం. ఇక హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూలలో ఆరున్నర కోట్ల రూపాయలు సమీకరించాడు. ఈ పరిశ్రమలో తనకు 76 లక్షల 15 వేల రూపాయల విలువ గల వాటాలున్నట్టు, భార్య భువనేశ్వరికి ఒక కోటి 21 లక్షల 31 వేల రూపాయల విలువైన వాటాలున్నట్టు, లోకేష్ పేర 3 లక్షల 15 వేల రూపాయల వాటాలు న్నట్టు 1994లో ప్రకటించాడు. అప్పటికే జూబ్లీహిల్స్‌లో ఒక భవనం, పంజాగుట్టలో ఒక భవనం ఉన్న విషయం గమనించాలి. ఏ పదవీ లేకుండా 1992 నాటికే అతని కుటుంబ ఆస్తులు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తున్నది. వెన్నుపోటు తర్వాత లేని హద్దు 1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసి సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అతని ఆస్తులు ఆకాశమే హద్దుగా పెరిగి పోవటం, దేశంలోనే నంబర్‌వన్ స్థాయి అవినీతి పరునిగా విమర్శలు రావడం జరిగింది. తెహల్కా డాట్‌కామ్ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, మీడియా అతని అవినీతిని ప్రశ్నించటం జరిగింది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర్నుండి పారదర్శకత, నిజాయితీ గురించి ఎక్కువగా ఉపన్యాసాలివ్వడం ప్రారంభించాడు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు దోహద కారులైన తోటి శాసన సభ్యుల వలే తను కూడా తన ఆస్తిపాస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం ప్రకటించడం మొదలు పెట్టాడు. అతని ప్రకటన ప్రకారం చంద్ర బాబు కుటుంబ ఆస్తుల విలువ 30 కోట్ల వరకు చేరింది. ఆ ప్రకటనలో నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ‘నిందలి గ్రామం’లో తన పేర 26.43 ఎకరాలు, భార్యకు 10.23 ఎకరాలు, కుమారునికి 9.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రకటించాడు. వివిధ కంపెనీలలో కుమారుడికి ఒక కోటి 67 లక్షల 15 వేల రూపాయల విలువగల వాటాలు, భార్య భువనేశ్వరి పేరున మొత్తం 3 కోట్ల 4 లక్షల 1 వేయి రూపాయల విలువ గలిగిన వాటాలు, తనకు ఒక కోటి 40 లక్షల 15 వేల 65 రూపాయల విలువ కలిగిన వాటాలు ఉన్నట్లు చెప్పాడు. భవనాలు, వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు మొదలైన వివరాలు కూడా వెల్లడి చేశాడు. వాటి విలువను తక్కువగా చూపించడం గమనార్హం. 1994లో ప్రకటించిన హెరిటేజ్ డైరీ ప్రాస్పెక్టస్‌లో కూడా తనకు వేరే కంపెనీలతో లావాదేవీలు గానీ ఇత రత్రా ఆదాయ వనరులు గానీ లేనట్లు ప్రకటించి, కంపెనీల రిజి స్ట్రార్ సమక్షంలో అంతకుముందు తాను ఆర్థికపర, క్రిమినల్ నేరారోపణ లను ఎదుర్కొనలేదని పేర్కొన్నాడు. మరి 1988లో సాలీనా తన గరిష్ఠ ఆదాయం లక్షన్నర రూపాయలే అని చెప్పిన పెద్ద మనిషికి ఒక్క సారిగా ఇన్ని ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయి? ఆనాటి ప్రశ్నకు ఈరోజు సీఐడీ కేసుల ద్వారా సమాధానం లభించింది. ఆస్తులు ఎలా పెరిగాయో సంజాయిషీ ఇవ్వాలి! చంద్రబాబు పేర్కొన్న ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా అప్పటి పీసీసీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డిగారు డిమాండ్ చేయటం జరిగింది. అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా 1999 జూన్ 5న రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. నిజానికి 90 మంది శాసన సభ్యులకు నాయకుడైన రాజశేఖర రెడ్డి గారి విజ్ఞాపనకు గవర్నరు ప్రతిస్పందించటం కనీస ధర్మం. అప్పటికే ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడ య్యాడు. గవర్నర్ మారు మాట్లాడలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో 1999 జూలై 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు చట్టప్రకారం అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. అందుకు హైకోర్టు 1999 నవంబర్ 2వ తేదీన ఒక సుదీర్ఘ తీర్పులో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దర ఖాస్తును కొట్టేసింది. గవర్నర్ గారి పదవీ బాధ్యతల నిర్వహణ మీద సమీక్ష జరిపే అధికారం రాజ్యాంగం ప్రకారం కోర్టులకు ఉండదని ఆ జడ్జిమెంట్ సారాంశం. హైకోర్టు తీర్పు మీద (నేడు టీడీపీ పార్టీలో ఉన్న) కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ‘ఆమోస్’ గార్లు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని ఆ కేసు కొట్టేసింది. దాని మీద వారు హైకోర్టులో ఏ కేసు వేసినప్పటికీ తమకు న్యాయం జరగట్లేదనీ, చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులొస్తున్నాయనీ నివేదించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం వినిపించుకోలేదు. అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఈ కేసును వాదిస్తూ, రాష్ట్ర హైకోర్టు మీద చంద్రబాబు నాయుడి ప్రభావం పనిచేస్తున్నదంటూ బ్రిటన్‌లోని ‘ససెక్స్’ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ జేమ్స్ మైనర్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించినా బెంచ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, దేవినేని అవినాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్. కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్ మీటింగ్‌కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు. దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు. ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. -
‘తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేరా?’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమెడీయన్ పాదయాత్ర చేస్తే కామెడీ తప్ప మరేమీ ఉండదని నారా లోకేష్‌ను ఉద్దేశించి సెటైరికల్ పంచ్ వేశారు. కాగా, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పాదయాత్రలో లోకేష్ కామెడీ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ఐరన్ లెగ్గా అభివర్ణిస్తున్నారు. పాదయాత్రకు హాజరైన తారకరత్నకు గుండెపోటు రావడం బాధాకరం. ఎన్టీఆర్ మనవడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపలేందటే వారి మానవత్వం ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయింది. ఈ ఘటనను పెద్ద అపశృతిగా ప్రజలు భావిస్తున్నారు. మానవత్వం లేని చంద్రబాబు, లోకేష్ స్వభావం చూస్తుంటే అసహ్యంగా ఉంది. లోకేష్ ఈ జన్మలో నాయకుడు కాలేదు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్‌ల కారణంగా ఎందరో చనిపోతున్నారు. మీరు మనుషులను చంపడానికే వచ్చారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. -
లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల: లోకేశ్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ సమర్థించడం లేదని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారని, తనకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని చెప్పారు. లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆపలేరని స్పష్టంచేశారు. -
తెలుగుదేశం విలాపం
నారా చంద్రబాబు నాయుడు గార్కి– ‘విధిరహో బలవానితి మేమతిః’ ఎంతటివారయినా విధిచేతికి చిక్కి అనుభవించాల్సిందే. మొన్న మీ ఏడుపు చూశాక ఈ ఉత్తరం రాయాల నిపించింది. ఆరోజు మా వ్యవస్థాపక అధ్యక్షుడు నీవల్ల దుఃఖించిన సంఘటన గుర్తుకు వచ్చింది. నాతో పాటు యావదాంధ్ర జాతికీ గుర్తొచ్చి వుంటుంది. ‘సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత్యను గచ్ఛంతి.’ ఇది కూడా భర్తృహరి లాంటి పెద్దలే చెప్పారు. చేసిన పాపాలు వెంట తరుముతూ ఉంటే, మీడియా సాయంతో కట్టుకున్న అబద్ధాల కోట కూలిపోయే దృశ్యం ఆనందంగా చూశాను. నువ్వు చేసిన కర్మలే నిన్ను వెన్నంటి వస్తాయి అని భగవద్గీత కూడా చెప్పింది. ఎటువంటి పార్టీని నేను, ఎలాంటి స్థితికి చేరుకున్నాను! చెడ్డవాడి చేతి ధనంలాగా నీ చేతిలో పడి ఎంత పతన మయ్యాను! ఎన్టీఆర్ దగ్గర నా వైభవం ఆకాశానికి ఎగసింది. హరివిల్లు సప్తరంగులను ఒకే పసుపురంగుగా మార్చుకుంది. దేశమంతా తిరిగాను. ఎక్కడికెళ్ళినా జేజేలు అందుకున్నాను. 1982 మార్చి 29న నా జననం జరిగింది. నాకు రూప మిచ్చిన నా తండ్రి, గురువు ఎన్టీఆర్ 35 సంవత్సరాలు సినిమా నటుడిగా అఖండ ప్రజాభిమానాన్ని పొంది, పురాణ పురు షుడిగా తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానటుడు. రాజకీయాలు తెలియకపోయినా పేదప్రజల ఆకలి ఆర్తనా దాలు, అసమానతలు తెలుసు కనుక రెండు రూపాయలకే కిలోబియ్యం, పది రూపాయలకే చీర– ధోవతి, బడుగు వర్గాలకు పక్కా ఇళ్ల పథకం వంటివి అందించి అందరికీ అన్నగా నిలబడిపోయారు. పేదవాని ముంగిట అన్నంగిన్నెగా మారిపోయారు. 35 సంవత్సరాల కాంగ్రెస్ కోటను బీటలు పర్చి, 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. ఆంధ్రదేశమే కాదు, భారతావనిలో, ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా నాపేరు విని పులకరించారు. ఈ జాతికో దిక్సూచి దొరికిందని, రాష్ట్రంలోనే కాక కాంగ్రెసుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. నేషనల్ ఫ్రంటుగా ఏర్పడి మా నాయకుడి ఆధ్వర్యంలో నన్ను ముందుపెట్టుకుని పోరాటం సాగించాయి. అబ్బో ఆనాటి వైభవం ఏం చెప్పను. ఒక నోరు సరిపోతుందా? వీపీ సింగ్, లాలూప్రసాద్ యాదవ్, రామకృష్ణ హెగ్డే, బొమ్మయ్, బిజూ పట్నాయక్, దేవీలాల్, కమ్యూనిస్టు కురువృద్ధుడు సూర్జీత్ సింగ్, ప్రఫుల్లకుమార్ మహంతా, కరుణానిధి లాంటి అతిరథ మహారథులందరూ మా నాయ కుడికి నమస్కారాలు పెడుతుంటే ఈ కళ్ళతోనే చూసి ఆనంద బాష్పాలు రాల్చాను. ఈ నాయకులంతా ఎందుకు ఎన్టీఆర్ వెనకే నడిచారు? అది ఆయన వ్యక్తిత్వం, ఇచ్చినమాట మీద నిలబడే గుణం, విశ్వసనీయత, అవినీతి రాహిత్యం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లగల గుండె ధైర్యం, ఇవే ఆయన్ని జాతీయ నాయకుడిని చేశాయి. అవన్నీ కళ్ళముందే కరిగిపోయి ‘ఈన గాసి నక్కల పాలయినట్లు’ వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, విలువలు లేనివ్యక్తి, అవినీతి స్వార్థ పరత్వమే అడ్రసుగా కలిగిన నీ చేతుల్లో పడి దుష్టుడికి చిక్కి భ్రష్టత చెందిన సాధ్విలా ఎటువంటి పతనావస్థకు చేరుకున్నాను! నా రాజ్యాంగంలో శాశ్వత అధ్యక్షుడిగా చెక్కబడిన ఆ శిలాక్షరాలపై దాడి చేశావు, కత్తులతో పొడిచి వాటిని లాగేశావు, అవమానాల అగ్నిలో వేసి కాల్చావు. 74 ఏళ్ళ వయసులో, అనారోగ్యంతో ఉండికూడా రాష్ట్రమంతా తిరిగి సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని చెప్పులేసి రోడ్డు పాల్జేశావు. బ్యాంకు ఖాతాను కూడా స్తంభిం పజేసి చివరకు ప్రాణాలు తీశావు. ఆనాడు ఆయన మరణాన్ని కన్నీళ్ళతో చూస్తుండిపోయాను. అక్రమంగా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నీకు బానిసగా మార్చుకున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు సాగించిన అరాచకాలు ఎన్నని చెప్పగలను. ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను దిగజారుస్తూ నువ్వు ఎదిగావు. నేను మాత్రం రోజురోజుకు పాతాళానికి జారిపోతూనే ఉన్నా. 1982లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు, 43 శాతం ఓట్లు; 1984లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు, అంతే ఓట్ల శాతం. ఇంకా పెరిగినయ్యేమో గుర్తులేదు. 1989లో నీవల్లనే ఓడి పోయినా ఏ మాత్రం తగ్గని ఓటింగు. వెంటనే 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ మరణం ముందు వరకు జరిగిన పోల్ నేనే సొంతం చేసుకున్నా. తరువాత సాను భూతితో కాంగ్రెసుకు పోయాయి. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, 36 మిత్రపక్షాలకు వెరసి 258 సీట్లతో 51 శాతం ఓట్లతో రికార్డు తిరగరాశాను. అజేయమైన శక్తిగా నిలబడ్డాను. అదీ మా నాయకుడి సత్తా. మరి ఇప్పుడో! ఒక్కసారి కొన్ని నా చరిత్ర పుటలు తిరగేయ్. నువ్వేంటో, నీ బతుకేంటో తెలుస్తుంది. 40 సంవత్సరాల పుట్టుక నాది. ఎంతోమంది నాయకుల్ని తయారు చేశాను. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నిలిచాను. లక్షలాది మంది సభ్యులు కలిగినదాన్ని. కోట్లాది రూపాయల ఫండ్. నెలకు దానిమీద వచ్చే వడ్డీయే 3 కోట్ల రూపాయలు ఉంటుందంటే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్నదాన్ని! ప్రతి జిల్లాలో సొంత భవనాలు– కొన్ని మండలాల్లో కూడా. నువ్వేమైనా తక్కువ వాడివా. 1978లోనే మంత్రిగా చేశావు. 8 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వెలగ బెట్టావు కదా. ప్రధానమంత్రుల్ని నువ్వే పెట్టానన్నావు. దేశ రాజకీయాలు నీ కనుసన్నల్లో నడిచాయని చెప్పావు. నువ్వు చెప్పుకునే సొంత డబ్బాలో ప్రపంచ మేధావివి. అపర చాణక్యుడివి. హైటెక్ నిర్మాతవు. అబ్బో చాలా చెప్పుకుంటావులే. ఇక సింబలా? సామాన్యుడి చేతి చక్రాయుధం లాంటి సైకిలు. ఓటర్లా – రాష్ట్రంలోనే 60 శాతానికి మించి ఉన్న బీసీ గణాలు. సొంత కులం అండ. ఒక పది దాకా కుల మీడియా వ్యవస్థలు నిన్నెప్పుడూ పొగుడుతూనే ఉంటాయి. మరోపక్క న్యాయ వ్యవస్థ. ఇన్ని కొమ్ముకాస్తుంటే ఇంత స్థాయిలో ఎలా ఓడి పోయావు? అసలు 2014 ఎన్నికల్లోనే ఓడిపోవాల్సింది. మోదీ జోడుతో పవన్ కల్యాణ్ గాలితో ఎలాగో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డావు. ఇక 2019 ఎన్నికల్లో నీ ఐదు సంవత్సరాల ముదనష్టపు పాలనకు విసిగిపోయిన జనం నిన్ను ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నారు. వైకాపాకు 49.95 శాతం ఓట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. మరి నాకో 39.18 శాతం ఓట్లు అంటే 10 శాతం తక్కువతో ఓడిపోయాను. 2014లోనే పోయుంటే బాగుండేది. ఈ ప్రజలకు నీ కష్టాలు తప్పేవి. పోనీ రెండున్నర సంవత్సరాల తర్వాతైనా నువ్వు పుంజు కుంటావనుకుంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 52.6 శాతం. నాకేమో 30.7 శాతం. ఇదీ నా దురవస్థ. చివరకు 40 ఏళ్ల నుండి దొంగ ఓట్లతో గెలుస్తున్న నీ సొంత నియోజక వర్గం కుప్పం జనాలు కూడా తరిమేశారు. ఈనాటికి కదా నా నాయకుడికి ఆత్మశాంతి. ఒకనాడు పేద వర్గాలకు అమ్మలాగా, అక్కలాగా అండగా నిలబడ్డాను. ఈరోజు నా పార్టీలోకి ఎవరెవరో సూట్లుబూట్లు వేసుకుని వస్తున్నారు. అసలు కార్యకర్తలు కనుచూపు దూరంలో లేరు. విలువలు, సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ఎప్పుడో అటకెక్కాయి. ఇప్పుడంతా కార్పొరేట్ వ్యక్తులు, అవినీతి సొమ్ముకు బినామీలు, బ్యాంకుల లూటీదార్లు, సారా కాంట్రాక్టర్లు, కాల్మనీవాళ్లు... ఛీ..ఛీ.. నా బ్రతుకిలా అయి పోయింది. నావాళ్లనుకున్న వాళ్లను దూరం చేశావు. ఇంకా ఏం మిగిలిందని? చివరకు నా పతనానికి పరాకాష్టగా– ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నా తండ్రి నన్ను పుట్టించాడో ఆ కాంగ్రెస్ వాళ్ల కాళ్ల దగ్గర పడేశావు కదా. ఆ రోజే నేను కూడా పూర్తిగా చచ్చిపోయాను. పవిత్ర గంగలాంటి నన్ను మురికిగుంటగా మార్చావు. ఇక ఈ బాధలు నాకొద్దు. ఈ హీన జీవితం గడపలేను. నన్ను ప్రేమతో సృష్టించి, గౌరవించి, దేశ స్థాయిలోనే ఉన్న తంగా నిలబెట్టిన నా తండ్రి దగ్గరకే పోతున్నా. ఇంకా నన్నేదో ఉద్ధరిద్ధామనుకోకు. ఈ శరీరంలో రక్తమాంసాలు ఇంకిపోయి నాయి. ఆత్మ, మనస్సు చచ్చిపోయాయి. శరీరం చిక్కి శల్యా వస్థకు చేరుకుంది. ఇక రాసే ఓపిక కూడా లేదు. సెలవు. జన్మలో నీ ముఖం చూడను. ఇట్లు తెలుగుదేశం పార్టీ -
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం
సాక్షి, ఏఎన్‌యూ: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు ఆ పాలకులు ఎందుకు చొరవ తీసుకోలేదో చెప్పాలన్నారు. మాతృభాషా వికాసానికి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. చదవండి: సీఎం జగన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదే తరుణంలో తెలుగు సబ్జెక్టును కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలుగు భాషపై లోతైన అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. తెలుగు కవుల గొప్పతనాన్ని తెలియజేస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీకి తిక్కన విక్రమ సింహపురి యూనివర్సిటీగా పేరు మార్చుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నామని తెలిపారు. గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్ర చిత్రాలతో పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలుగు, సంస్కృత భాష వికాసానికి కృషి చేస్తున్న 13 మందికి మంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ -
సీఎం జగన్ నాయకత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
-
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. కులమత వ్యత్యాసాలు లేకుండా.. పార్టీల విద్వేషాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి సీఎం వైఎస్ జగన్‌ను మతాన్ని ఆపాదించడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. పేదలపై ప్రేమ, ఆప్యాయత లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించింది: లక్ష్మీ పార్వతి తెలుగు బాషా చైతన్య సదస్సులు తిరుపతిలో నిర్వహించామని.. ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు. పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. టీడిపీ ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం పట్ల లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు. -
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి?
అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలపై ఆదివారం ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె నిలదీశారు.తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు. -
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
-
నా భర్తకు చేసిన అవమానమే ఇప్పుడు వాళ్లకు: లక్ష్మీ పార్వతి
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ పార్టీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని చెప్పారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని తెలిపారు. మరో 30 ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయిందని ధ్వజమెత్తారు. బాబు చేసిన పాపాలు తన కొడుకు రూపంలో శాపంగా మారాయని ఆమె విమర్శించారు. చదవండి: ‘ఇక టీడీపీ లేదు, దాని తోక పార్టీలు లేవు’ -
‘రాధాకృష్ణ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
‘రాధాకృష్ణ’ మూవీ స్టిల్స్
-
‘బీసీల అభ్యున్నతికి బాబు మోకాలు అడ్డుపెట్టారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, బీసీల రిజర్వేషన్లను బాబు అడ్డుకున్నారని, ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూముల కోసం అమాయకులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, బాబుకు రాజకీయ విలువలు లేవని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. (స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ప్రతాప్‌రెడ్డి బాబు అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలతో ప్రతాప్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయన తెలిపారు. -
‘చంద్రబాబు అక్రమాస్తుల’ కేసు 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఫిర్యాదు దశ లో చంద్రబాబు తరఫు వాదనలు వినరాదని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది గతంలో చేసిన వినతిని కోర్టు ఆమోదించింది. ఫిర్యాదుపై 26న తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం జడ్జి తెలిపారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంపై 2005లో లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీడీపీ అధినేత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొంది ఈ ఫిర్యాదుపై విచారణ జరగకుండా అడ్డుకుంటూ వచ్చారు. అయితే సుప్రీంకోర్టు గతేడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలేనని తేల్చిచెప్పింది. తిరిగి స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకపోతే గతంలోనే స్టే రద్దయినట్లేనని పేర్కొంది. దీనికనుగుణంగా తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు గత విచారణలో చెప్పింది. దీనిపై లక్ష్మీపా ర్వతి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. దీంతో ఎలాంటి వాదనలు లేకుండానే ఈ నెల 26కు వాయిదా పడింది. -
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్‌నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్‌పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
ఈ హత్యకు 24 యేళ్లు
ముప్పైఅయిదు సంవత్సరాలు సినిమా రంగాన్ని.. ఆపైన దేశవ్యాప్తంగా రాజకీయ రంగాన్ని శాసించిన రారాజు, తెలుగుజాతికి, పౌరుషానికి నిలువెత్తు రూపం, తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావుగారి మరణం ఇప్పటికీ మర్చిపోలేని ఒక విషాదం. రోమ్ చక్రవర్తి ‘సీజర్’కు జరిగినట్లే విషాద తిరోగమనం అల్లుడి రూపంలో ఆయనకు జరగటం అత్యంత విషాదం. చరిత్రను ఎంత తొక్కిపెట్టినా దాగని సత్యాలు, ఆగని కాలంలో ఏదో ఒకనాడు బయటపడి వాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెడతాయని చంద్రబాబును ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుజువు చేశారు. మొదటి నుండి స్వార్థం, సంకుచితత్వం, కుట్రలు, అడ్డదారి రాజకీయం, పదవీలాలస, ధనాశలను డిగ్రీలుగా పొంది చంద్రబాబు చేసిన నేరాలకు అంతే లేదు. ఎంతమందినో తొక్కుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎన్టీఆర్ అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి చివరకు ఆ ఇంటి పెద్దనే కూల్చేశాడు. The Camel and Desert అనే కథ అతనికి పూర్తిగా వర్తిస్తుంది. అయినా సిగ్గులేదు, మార్పురాదు. ఎన్టీఆర్ చివరి దశను అత్యంత అవమానంగా, పెను విషాదంగా మార్చి ఒక రకంగా హత్యకు సమానమైన స్థితిని కల్పించిన ఈ ఘట్టాన్ని తెలుగువాళ్లు ఎప్పటికీ మర్చిపోకూడదనే మళ్లీ గుర్తు చేస్తున్నాను. మొదటినుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దగ్గుబాటి, నాదెండ్ల, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర లాంటి వారిని తెలివిగా పక్కనపెట్టించి ప్రధాన కార్యదర్శి పదవితోపాటు సర్వాధికారాలతో 1986లో కర్షక పరిషత్తును తీసుకున్నాడు. ఈ చర్యను న్యాయస్థానం, ప్రజలు హర్షించలేకపోయారు. పర్యవసానం 1989లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభుత్వ పతనం, రాజ్యాంగేతర శక్తిగా, అవినీతిపరుడిగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి తీవ్ర కళంకం తెచ్చాడు. ఏడుపదుల వయస్సులో చూసుకునేవారు లేక, అనారోగ్యంతో అల్లాడుతూ 1993లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకుంటే నానారభస చేసి పెళ్లికి ముందూ, వెనుకా అతడు జరిపిన కుట్రలకు లెక్కేలేదు. పైకి వినయం నటిస్తూ 1994 ఎన్నికల్లో 60 మంది సభ్యులకు స్వయంగా డబ్బుపంచి తనతో ఉండాలని మాట తీసుకున్నాడు. అతని రాజగురువు రామోజీ లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలవదని, వచ్చిన సీట్లలో తన 60మందిని వేరు చేసుకుని కాంగ్రెస్‌తో చేతులు కలపాలనే నిర్ణయంతో దుష్ట రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు జగన్మోహన్రెడ్డి గారిమీద, ఆయన ప్రభుత్వంమీద ఎలాంటి నిందలు వేస్తున్నారో ఆరోజూ అలాగే జరిగింది. అందుకే ఎన్టీఆర్ ఈనాడు పత్రికను చెత్తబుట్టగా వర్ణించారు.1994 ఎన్నికల్లో వాళ్ల అంచనాలకు మించి ఎన్టీఆర్‌కు 222 సీట్లు... మిత్ర పక్షాలకు 36 సీట్లు రావటంతో అయోమయంలో పడ్డ గురుశిష్యులిద్దరూ ప్లాన్–2కు పన్నాగం పన్నారు. దానిలో భాగంగానే ఆయన ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నప్పటికీ ఆయనమీద, ఆయన భార్యమీద విమర్శల దాడి మొదలయ్యింది. ఆమెనొక రాజ్యాంగేతర శక్తిగా, ఎన్టీఆర్ భార్యా లోలుడిగా, అసమర్థుడిగా వీళ్ల పేపర్లో అసహ్యమైన కార్టూన్లు వేయించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు నవరత్నాల ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తుంటే వాటిని ప్రజల మనస్సుల్లోకి వెళ్లకుండా రోజుకో గందరగోళం, మతపరంగా, ఇసుకపరంగా, అయినవాళ్లకే ఉద్యోగాలనీ, మూడు ప్రాంతాల అభివృద్ధిని అరాచకపు పాలనగా ఒకటా, రెండా ప్రభుత్వం ప్రారంభమై వారం తిరక్కుండానే వీళ్ల దుష్ట పన్నాగం మొదలయ్యింది. చంద్రబాబు చేసిన వెధవ పనులన్నిటినీ ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈ విష పత్రికల కూటమి ఎలా దండయాత్ర చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. 1994 నాటి పరిస్థితి పునరావృతమౌతున్నది. అదే సామాజిక వర్గం. అదే పెత్తందారీ వ్యవస్థ. అదే మీడియా. అదే గురుశిష్యులు. సామాజిక అభివృద్ధితో వీళ్లకు పనిలేదు. పేదవర్గాలంటే జాలి లేదు. మంచి పనులు చేసే నాయకులంటే అసలు పడదు. విస్తరించుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఎన్ని అల్లర్లయినా సృష్టిస్తారు. ఎన్ని హత్యలయినా చేస్తారు. వీళ్లను ఈ మీడియా కాపాడుతూనే ఉంటుంది. చెప్పాలంటే అష్టగ్రహ కూటమి అనే పదం సరిపోతుంది. అందుకే ఎన్టీఆర్ గవర్నమెంటును కూల్చటానికి వీళ్ల తాబేదారు యనమల రామక్రిష్ణుడు (ఈరోజు వేలకోట్లకు అధిపతి)కు స్పీకర్ పదవి ఇప్పించుకోవటంలో కృతకృత్యులయ్యారు. వీరి కుట్రల కోణాన్ని ఎన్టీఆర్ గుర్తించలేక అమాయకంగా నమ్మి మోసపోయారు. అత్యధిక మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ముఖ్యమంత్రిని 8 నెలల కాలం తిరక్కుండానే ఆయన భార్యను సాకుగా చూపించి 1995 ఆగస్టు 20న బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ఆ సమయంలోనే ‘ఈటీవీ’ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు విషం నూరిపోసి పార్టీ పగ్గాలు వారికే ఇస్తామని నమ్మబలికి చివరకు అధ్యక్ష పదవితోపాటు ముఖ్యమంత్రి పదవి కూడా కొట్టేశాడు. ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశతో 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి చంద్రబాబు మోసానికి గురై వారం తిరక్కుండానే 14 మందితో తిరిగొచ్చి ఎన్టీఆర్ గూట్లో చేరాడు. ఆగస్టు 25న చంద్రబాబు హరిక్రిష్ణను వెంట బెట్టుకుని ఎన్టీఆర్‌ని కలిసి కొన్ని షరతులు పెట్టాడు. పార్వతిని వంటింట్లో ఉంచటం, ముద్దుక్రిష్ణను, బుచ్చయ్యచౌదరిని, నర్సింహుల్ని మంత్రి పదవుల్నుండి తొలగించటం లాంటి షరతుల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించటంతో అనేక రంగులద్ది వీళ్ల పత్రికల్లో అభూతకల్పనలు రాయించారు. వైస్రాయ్కి క్యాంపును మార్చి ఎన్టీఆర్‌ను అధ్యక్ష పదవినుండి తొలగించి ఇటు ఢిల్లీ కాంగ్రెస్‌వారిని, అటు శాసన సభ్యులను మచ్చిక చేసుకున్నాడు. గవర్నరుకు రాష్ట్రపతి పదవి ఆశ చూపించి ఫోర్జరీ సంతకాలను ఒప్పించుకున్నాడు. దానికంటే ముందే ఆగస్టు 25వ తేదీన ఎన్టీఆర్ చంద్రబాబుతో సహా 5గురు మంత్రుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన లెటరు గవర్నరుకు పంపినా ఆయన దానిని బేఖాతరు చేసి చంద్రబాబుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించుకున్నాడు. 1995 ఆగస్టు 26న ఎన్టీఆర్ చైతన్యరథం మీద ముఖ్యమంత్రి హోదాలో శాసన సభ్యులతో మాట్లాడటానికి వైస్రాయ్ హోటల్‌కు వెళ్తే ఆయనకు రక్షణగా ఒక్క పోలీసు కూడా లేడు. పైగా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తులు పరిటాల రవి మీద, నెహ్రూ మీద దాడి చేసారు. ఎన్టీఆర్ వచ్చారని తెలిసి భయంతో చంద్రబాబు తన తోకలు ఎమ్మెల్యేలను ఉసిగొల్పితే వారు ఆయనమీద రాళ్లు, చెప్పులు వేసి అవమానం చేశారు. అవమానంతో కుంగిపోయిన ఎన్టీఆర్ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘అల్లుడని గౌరవించినందుకు నాకింత ద్రోహం చేశాడు. దేశమంతా గౌరవించిన వ్యక్తిని చెప్పులతో అవమానించాడు. ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం– తెలుగు పౌరుషాన్ని చాటిన మీ అన్న దుస్థితి చూడండి. ఎన్టీఆర్ ఎప్పుడో చావటం కాదు. చంద్రబాబు దుర్మార్గానికి ఇప్పుడే మరణించాడు’అని విలపించటంతో అక్కడకు వచ్చిన వాళ్లంతా కళ్లనీళ్లు పెట్టుకున్నారు. దానికి కూడా సానుభూతి రానివ్వకుండా లక్ష్మీపార్వతిమీద తోసేసారు. ఆగస్టు 31న ఎన్టీఆర్ తీవ్ర అనారోగ్యంతో మెడిసిటీ హాస్పిటల్లో చేరారు. గవర్నరును పంపి బలవంతపు రాజీనామా తెప్పించుకున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ తీవ్రమైన బాధల్లో ఉంటే కుటుంబ సభ్యులందరూ చంద్రబాబుతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన్నారు. పార్టీ పెట్టిన పెద్దకు కన్నీరు– చంద్రబాబుకు అధికారపు పన్నీరు. ఇక్కడ గుండెల్లో మంటలు– అక్కడ ఆనందోత్సవపు భోగిమంటలు. నమ్మిన విశ్వాసం నట్టేట ముంచింది, అన్నం పెట్టిన చెయ్యినే నరికింది. అయినవారే పరాయిగా మారి గుండె లోతుల్లో గునపాలు గుచ్చితే తట్టుకోలేని రోషం, అభిమానం ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. మళ్లీ గెలిచి చంద్రబాబును అండమాన్ జైలుకు పంపుతానన్న తన ప్రతీకారాన్ని నెరవేర్చుకోకుండానే ఆ గుండె ఆగిపోయింది. తట్టుకోలేని అవమానం ఆ గుండెను ఆపేసింది. ‘ఇదిగో వీడే హంతకుడు. ప్రజలారా మీ అన్నను చెబుతున్నాను వినండి’ అంటూ ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో రూపంలో, ‘ధర్మపీఠం’లో వీడియో రూపంలో తనను ఎంతో అభిమానంతో ఎన్నుకున్న తన తెలుగు ప్రజలకు ‘చివరి వీలునామా’గా అందించి 1996 జనవరి 18వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ మహానుభావుడు అందరినీ దుఃఖంలో ముంచి వెళ్లిపోయాడు. మద్యపాన నిషేధం ద్వారా మహిళల కళ్లల్లో ఆనందం నింపిన ఆయన కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ఎవరు దేనికి కారకులు? తన అధికారం కోసం మామ చావుకు కారకుడైన ఈ వ్యక్తిమీద ఆయన ఆత్మ ప్రతీకారంతో రగులుతూనే ఉంది. జగన్మోహన్రెడ్డిగారు అతడిని చావుదెబ్బ కొట్టి 23 సీట్లకే పరిమితం చెయ్యడంతో బహుశా స్వర్గంలోని ఆయన ఆత్మ సంతో షిస్తూ ఉంటుంది. చంద్రబాబువంటి వ్యక్తుల్ని రాజకీయ రంగం నుండి పూర్తిగా తొలగిస్తే సమాజంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి అని నమ్ముతూ... ఆశ్రువేదనతో... లక్ష్మీపార్వతి. (నేడు నందమూరి తారకరామారావు వర్ధంతి) నందమూరిలక్ష్మీపార్వతి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షులు -
చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. అయితే తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును లక్ష్మీపార్వతి కోరారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించ క ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వాదనలను కూడా వినా లని కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సీనియర్ న్యాయవాది హాజరు నిమిత్తం విచారణను వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి రెండోసారి చేసిన అభ్యర్థన మేరకు మళ్లీ విచారణ వాయిదా పడింది. -
వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా?
సాక్షి, తాడేపల్లి : పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా? ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా ‘తెలుగు అంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం ఎందుకు కృషి చేయలేదు? తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు రాష్ట్రానికి తేలేకపోయారు? ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనూ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం ఆరువేల పాఠశాలలను చంద్రబాబు మూయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేదు. కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టమని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసిన చంద్రబాబుకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చే జన్మంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుడతామని చెప్పలేదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని బట్టి తెలుగంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవచ్చని లక్ష్మీపార్వతి విమర్శించారు. మరోవైపు తెలుగు రాని లోకేష్‌ని ఇంగ్లీష్ మీడియంలో చదివించినా ఆ భాష కూడా సరిగా రాదని ఎద్దేవా చేశారు. ఇదికాక, ఇంగ్లీష్ మీడియంలో పట్టులేక అనేక మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే ఉన్నత స్థానానికి ఎదిగారని ఆమె వ్యాఖ్యానించారు. -
లక్ష్మీపార్వతికి కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్. ఎ పూర్తి చేశారు. -
బాబుకు తగిన శాస్తి జరిగింది
పంజగుట్ట: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, ఆయనకు తగిన శాస్తి జరిగిందని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జగన్ సరిదిద్దుతారని ఆమె తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ..బాబు చేసిన ద్రోహంవల్లే ఎన్టీఆర్ చనిపోయారన్నారు. బాబు నమ్మకద్రోహి, ప్రజాద్రోహి అని అర్థం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, ఆ పార్టీ నీది కాదన్న విషయం గ్రహించాలన్నారు. జగన్ ఫ్యాన్ గాలికి బాబు కొట్టుకుపోయారని, ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని, ఆయన కోరిక నెరవేరిందన్నారు. తెలంగాణలో పార్టీ అంతరించింది, ఆంధ్రాలో కూడా అంతరించి పోతుందన్నారు. జగన్ నాయకత్వంలో ఎస్సీ, దళితులు, బడుగు, బలహీనులు బాగుపడతారని, ఎన్టీఆర్ ఆత్మ జగన్‌కు అండగా ఉంటుందన్నారు. నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం పలువురు ప్రముఖుల నివాళి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్.రమణ, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని, నందమూరి రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నారా బ్రాహ్మణి, టీడీపీ నాయకులు -
‘నేను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా’
గుంటూరు: తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్‌కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. మంగళగిరి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలన్నారు. స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని ఆరోపించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన, పోరాడుతున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబుకి, జగన్‌కు చాలా తేడాలున్నాయన్నారు. జగన్ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. జగన్‌పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్‌పై హత్యాయత్నం కూడా చేయించిన నీచుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు. బాబుకి మతిమరుపు రోగం చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్ఫోర్డ్ గ్యాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్ అని, ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్‌ని నిలబెట్టాడని ఆరోపించారు. లోకేష్‌ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదన్నారు. మరో నంద్యాలలా చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడిలా నాలుగు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వైఎస్ జగన్‌కు తెలియదన్నారు. ప్రజల కోసం ఒంటరిగా పోరాడే వ్యక్తి జగన్ అని చెప్పారు. మంగళగిరి అన్ని నియోజకవర్గాల కంటే ప్రత్యేకమైనదన్నారు. మంగళగిరిలో ఆర్కే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. లోకేష్‌ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును నీరులా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరో నంద్యాల ఉప ఎన్నికలా చేయాలని చూస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని డబ్బును విపరీతంగా పంచుతున్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు నీతి నిజాయతీ గల వ్యక్తులు అని, ఎవరికి ఓటువేయాలో వారికి తెలుసునన్నారు. సింగపూర్ పారిపావాల్సిందే ఆర్కే లాంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాల్లో ఉంటే ప్రజల సమస్యలు తీరతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తండ్రీకొడుకులు(నారా చంద్రబాబు, నారా లోకేష్) ఇద్దరూ సింగపూర్ పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఆర్కే గెలిస్తే మంగళగిరి ప్రజలు గెలిచినట్టేనని అభిప్రాయపడ్డారు. -
పాతపట్నం.. కొత్తరూటు
సాక్షి, ఎల్ ఎన్ పేట, (శ్రీకాకుళం): పాతపట్నం.. జిల్లాలో అత్యంత చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతం. వరాహ వెంకట గిరిని జాతికి అందించిన గడ్డ ఇది. ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన లుకలాపు లక్ష్మ ణదాస్ రాజకీయ ఓనమాలు దిద్దిందీ ఇక్కడే. చంద్రబాబు తన అనుచర గణాన్ని అంతా దింపినా లక్ష్మీపార్వతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రాంతమిది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇతర పార్టీలూ ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే. గత ఎన్నికల్లో స్థానిక ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కడితే.. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కేస్తూ కలమట వెంకటరమణ టీడీపీకి ఫిరాయించారు. ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోతోందని స్థానికులంటున్నారు. అపురూప చరిత్ర.. పాతపట్నం నియోజకవర్గం 1952 నుంచి యాక్టివ్‌గా ఉంది. అప్పట్లో ద్విసభ్య శాసనసభగా ఉండేది. లుకలాపు లక్ష్మణదాస్, వీవీ గిరి నుంచి నేటి కలమట వెంకటరమణ వరకు దాదాపు పద్దెనిమిది మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొదట్లో కాంగ్రెస్‌పై అభిమానం చూపిన నియోజకవర్గ ప్రజలు అనంతరం ఎన్టీఆర్‌పై అపార ప్రేమ చూపించారు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఎన్టీఆర్‌వైపే నిలబడ్డారు. అందుకు నందమూరి లక్ష్మీపార్వతి గెలుపే నిదర్శనం. ఎన్టీఆర్ తర్వాత వైఎస్సార్‌పైనే ఇక్కడి వారు మళ్లీ అంతటి ప్రేమ చూపించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందగా, 2014లో కలమట వెంకటరమణ వైఎస్సార్ జెండా పట్టుకుని గెలుపొందారు. అయితే ఆయన ఆ జెండాను దింపేసి టీడీపీ జెండాను నెత్తినెత్తుకున్నారు. రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి జనాభిప్రాయాన్ని కించపరిచారు. మొత్తం ఓటర్లు: 2,16,221 పురుషులు: 1,08,606 మహిళలు: 1,07,594 ఇతరులు: 17 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 316 ప్రధాన సమస్యలు.. అభివృద్ధికి నోచుకోని వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ వంశధార నిర్వాసితులదే ఇక్కడి ప్రధాన సమస్య. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు సజావుగా జరిగి, ప్యాకేజీలు, పునరావాలు కూడా ఎలాం టి గొడవలు లేకుండా జరిగాయి. కానీ టీడీపీ అధికారం చేపట్టాక ఈ పనుల్లో గందరగోళం మొదలైంది. పునరావాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు లేదు. ఇళ్లు లేవు. వారికి రేషన్లు, పింఛన్లు, ఓట్లు చాలా సదుపాయాలు మృగ్యమైపోయాయి. వీటిపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికార పార్టీ పంచన చేరారు. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. విశిష్టతలు ♦ పాతపట్నం నుంచే రాజకీయ ఓనమాలు దిద్దిన వి.వి.గిరి (వరాహ వెంకట గిరి) కేంద్ర కార్మిక మంత్రి, భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. ♦ పాతపట్నం నుంచి గెలిచిన లుకలాపు లక్ష్మణదాస్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా వెలుగొందారు. ♦ 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్నందున టీడీపీ నుంచి గెలిచిన కలమట మోహనరావు ఎన్నికల చెల్లదంటూ అప్పటి ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు (కాంగ్రెస్) కోర్టుకు వెళ్లడంతో 1996లో కలమట ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ♦ 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కలమట మోహనరావు సతీమణి వేణమ్మపై ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసిన నందమూరి లక్ష్మీపార్వతి ఘన విజయం సాధించారు. లక్ష్మీపార్వతి విజయాన్ని అడ్డుకునేందుకు అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గాన్ని అంతా దించినా నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించి లక్ష్మీపార్వతి ఎన్నికయ్యారు. కలమట కోటకు బీటలు 1978 నుంచి కలమట కుటుంబానికి కంచుకోటగా మారిన పాతపట్నం నియోజకవర్గంలో కలమట మోహనరావు ఐదు సార్లు, ఆయన కొడుకు కలమట వెంకటరమణమూర్తి ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఆ కోటకు బీటలు పడనున్నట్లు తార్కాణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 2016లో అధికార టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను ఓడించాలనే ధ్యేయంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 2016 నుంచి రాత్రి పగలు, కొండలు, నదులు అనే తేడా లేకుండా పల్లెపల్లెకు, గడప గడపకూ తిరిగారు. అన్ని వర్గాల వారితో కష్టసుఖాలు పంచుకున్నారు. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాలో కలమట అక్రమాలు జనాలకు తెలిసిపోయాయి. ఇవే ప్రస్తుత ఎలక్షన్లను ప్రభావితం చేయనున్నాయి.