
తిరుమల: లోకేశ్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ సమర్థించడం లేదని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారని, తనకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని చెప్పారు. లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆపలేరని స్పష్టంచేశారు.