ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న లక్ష్మీపార్వతి
పంజగుట్ట: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, ఆయనకు తగిన శాస్తి జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జగన్ సరిదిద్దుతారని ఆమె తెలిపారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ..బాబు చేసిన ద్రోహంవల్లే ఎన్‌టీఆర్ చనిపోయారన్నారు. బాబు నమ్మకద్రోహి, ప్రజాద్రోహి అని అర్థం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, ఆ పార్టీ నీది కాదన్న విషయం గ్రహించాలన్నారు. జగన్ ఫ్యాన్ గాలికి బాబు కొట్టుకుపోయారని, ఈ రోజు ఎన్‌టీఆర్ ఆత్మశాంతించిందని, ఆయన కోరిక నెరవేరిందన్నారు. తెలంగాణలో పార్టీ అంతరించింది, ఆంధ్రాలో కూడా అంతరించి పోతుందన్నారు. జగన్ నాయకత్వంలో ఎస్సీ, దళితులు, బడుగు, బలహీనులు బాగుపడతారని, ఎన్‌టీఆర్ ఆత్మ జగన్‌కు అండగా ఉంటుందన్నారు.
నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్‌టీఆర్, కల్యాణ్‌రాం
పలువురు ప్రముఖుల నివాళి
జూనియర్ ఎన్‌టీఆర్, కల్యాణ్‌రామ్, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు ఎల్.రమణ, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని, నందమూరి రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
నారా బ్రాహ్మణి, టీడీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment