
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి
సాక్షి,హైదరాబాద్ : నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఉమెన్స్ ఫోరం ఆహాన్వం మేరకు అమెరికాలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే నాటా సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా నాటా మహాసభల్లో నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 10న డెట్రాయిడ్ చేరుకుని అక్కడ ట్రాయి అసోసియేషన్ వారిని కలుస్తారు. 15న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారు ఏర్పాటు చేసే ఓ కార్యక్రమం లో పాల్గొంటారు. అక్కడ ఎన్టీఆర్ బయోగ్రఫీ ఫస్ట్‌పార్ట్ పుస్తకాన్ని విడుదల చేస్తారు. అక్కడ నిర్వాహకులు ఆమెకు సన్మానం చేయనున్నారు. తర్వాత వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్‌సీపీ నేత రమేశ్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 25న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment