NATA
-
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
NATA Convention 2023: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డాలస్ లో నిర్వహించిన నాటా కన్వెన్షన్ 2023లో ఎన్నో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో నాటా విమెన్ ఫోరమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సానపురెడ్డి, నాటా మహిళా ఫోరం ఛైర్పర్సన్ సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసంలో తెలుగు మహిళలు చేసిన పనులు స్ఫూర్తిదాయకం అన్నారు. ఏ ఏ అంశాలు? గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, లైంగిక వేధింపులు, హాలీవుడ్ సినిమాలో నటించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నాటా మహిళా ఫోరం సలహాదారులు కృష్ణవేణి రెడ్డి, లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వినూత్నంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారు, నిర్వాహకులు, సమన్వయ కర్తలు అందరూ మహిళలే అవడం, "మా అందరిదీ ఒకే మాట ఒకే బాట" అంటూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఉమాభారతి కోసూరి (నృత్య సాహిత్య కళా భారతి) మధురమైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనీ శాస్త్రి (అమేరికోకిలా) మధురమైన గళముతో పాడి వినిపించారు. మహిళా పరివర్తన - దశాబ్దాలుగా 'స్త్రీ' ఎదుగుదల - సంగీత సాహిత్య దృశ్య కథనం విభాగంగా అతివల గురించి అందమైన శ్రవణ దృశ్యాలతో పాటు చక్కని మాటలతో పాటలతో మనసుకు హత్తుకునేలా చేశారు. మహిళా విశిష్టత మహిళా ప్రతిభ - చరిత్రలో తెలుగింటి ఆడపడుచులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఆడపడుచుల అనుభవాలను, అనుభూతులను, కష్టాలను, ఎదుగుదల, ఈ స్థాయికి ఎలా వచ్చారో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కల్పించారు అమల దుగ్గిరాల (EVP ఎంట్రప్రెస్స్ CIO at USAA ), ఉమా దేవిరెడ్డి (TEDx Leadership Coach),, ప్రేమ రొద్దం (Corporate & Business Immigration Attorney ) స్పూర్తిదాయకమైన స్త్రీలు వారి జీవితంలో ఎన్నుకున్న వృత్తి ఎంతవరకు వారు న్యాయం చేశారో చేస్తున్నారో చర్చించారు. అమ్మ నుండి అంతరిక్ష మహిళ వరకు “మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సంస్కరణలు, మహిళా సాధికారతకు తమవంతుగా మహిళలు తాము వున్నాం అని తెలపడం జరిగింది. అమ్మ నుండి అంతరిక్షం వరకు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు.. ఎందులోనూ తీసిపోరు అన్నట్లు వసంత లక్ష్మి అయ్యగారితో నిర్వహించిన మహిళా మిమిక్రీ కార్యక్రమం అత్యంత జనరంజకంగా సాగింది. ఇన్నాళ్లు మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకున్న ఈ మిమిక్రీ కళను అత్యంత సమర్థతతో నిర్వహించి కడుపుబ్బా నవ్వించారు. మరికాస్త హాస్యం కోసం ‘టాక్ ఆఫ్ ది టౌన్ 'లో సజితా తిరుమలశెట్టి , కవిత రాణి కోటి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. మనీ శాస్త్రి వారి మధురమైన గళముతో పాడి వినిపించారు, ఉమాభారతి కోసూరి వ్యాఖ్యాతగా (నరేషన్) సంగీత సాహిత్య సమ్మోహనం - మాన్యుల మన్నన మనల్ని అలరించే ఓ అద్భుతమైన దృశ్యం. ముఖ్య అతిధులుగా వాసిరెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఛైర్ పర్సన్ అఫ్ TTD LAC in ఢిల్లీ ఉమెన్స్ ఫోరమ్.. మహిళలందరిని ప్రశంసించారు. ఇక్కడి మహిళలు తమ వృత్తిని, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనేక జనరంజక కార్యక్రమాలలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న కూచిపూడి నృత్య కళాకారిణి పద్మ శొంఠి నృత్య కార్యక్రమం, మహిళా రక్షణ గురించి వివేక్ తేజ చెరుపల్లి ప్రసంగం తో పాటుగా మహిళలు తనకు తానుగా రక్షణ, భద్రత ఉపాయాలు మెళకువలు తెలిపారు. వైష్ణవి రామరాజు 'సొగసు చూడతరమా' అంటూ మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వేసుకునే మహిళల వస్త్రధారణ తీరులను ప్రదర్శన చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్ అయింది. అరుణ సుబ్బారావు (పేరడీ క్వీన్, ఫోక్ సింగర్)- తన పేరడీ తో పాటు కొన్ని ఫోక్ పాటలు కూడా పాడి వినిపించడం ద్వారా ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. మహిళ ప్రతిభ మహిళా సాధికారత” (Women Empowerment) విభాగంలో మన తెలుగింటి ఆడపడుచులు పల్లవి శాస్త్రి (Hollywood Producer & Actress) వారి మూవీ "LAND GOLD" (Brilliant Film on Faith Family & Culture in America) కీర్తన శాస్త్రి, Hollywood Producer & Casting Director) మరియు అపూర్వ గురుచరణ్ (Los Angels based Indian Producer) మూవీ "JOYLAND " వారిని 'మహిళా ప్రతిభ' పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలో వేటికవే గొప్ప ప్రదర్శనలు అయినప్పటికీ 'పురాతన సంప్రదాయ చీరల ప్రదర్శన' మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1930 నుండి 1990 వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని చీరల ప్రదర్శన, ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 40 చీరలు పైగా ఈ ప్రదర్శనలో చూడటం జరిగింది. ఆ కాలంలో వాడిన కాంచీపురం, ధర్మవరం, ఆరణి, వేంకటగిరి, మంగళగిరి, పైతాని, బనారస్, షికార్గ్, కశ్మీరీ పట్టు చీరలు , ఈ కాలంలో దొరకని అపురూప చీర సంపదలను ప్రదర్శించి, ఆహూతులను అచ్చెరువొందేలా చేశారు. ఈ చీరలను చూసి తమ అమ్మమ్మ, నానమ్మ దగ్గర చూసిన చీరలు అని అందరూ తమ గత జ్ఞాపకాల్లోకి జారుకుని, ఆనందానుభూతులకు లోనయ్యారు. సంధ్య పుచ్చలపల్లి (ఫౌండర్ అఫ్ ఆర్తి హోమ్) చీరలు మగ్గం మీద నేయడం ఒకొక్కటిగా వివరించి, నేత కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం, చీర యొక్క పుట్టుపూర్వోత్తరాలు వివరించడం విశేషం. ఆఖరున కృష్ణవేణి రెడ్డి శీలం, NATA ఉమెన్స్ ఫోరమ్ Advisor కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, అభిమానులకు, NATA ప్రెసిడెంట్ శ్రీ కొర్సపాటి శ్రీధర్ గారికి మరియు వారి కార్యవర్గానికి NATA ఉమెన్స్ కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో మహిళల ప్రాధాన్యత, వారి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రయత్నం అంచనాలను మించి విజయవంతం అయిందని, దీనికి తోడ్పాటు అందించిన వారిందరికి నాటా మీడియా అడ్వైజర్ కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
NATA Political debate: సీఎం వైఎస్ జగన్ సర్కారు మార్గమే సరైనది
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అట్టడుగు స్థాయి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా, సంస్కరణలలో కూడిన పాలన సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్న దారే సరైనదని ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)’తెలుగు మహాసభల్లో వక్తలు తేల్చి చెప్పారు.. వైఎస్సార్ సీపీ అమలు చేస్తున్న పథకాలు, విధానాలను ఏపీలో ప్రతిపక్షాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించడం ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు–2023లో భాగంగా రాజకీయ ప్యానెల్ చర్చలు జరిగాయి. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. అవాస్తవ ప్రచారాలతో మభ్యపెడుతూ.. ఇటీవల చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని.. ఏదైనా వైఎస్ జగన్ చేసిన దానికి ఐదు రెట్లు చేస్తామని ప్రకటించారని కొమ్మినేని చెప్పారు. ఇన్నాళ్లూ జగన్ సంక్షేమ పథకాలను తప్పుపట్టిన రెండు పత్రికలు.. చంద్రబాబు హామీలను ఎంతో పొగిడాయని గుర్తు చేశారు. అంటే వైఎస్ జగన్ చేస్తున్నదే సరైనదని, చంద్రబాబు దాన్ని అనుసరించాల్సిందేనని వారే ఒప్పుకొంటున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల మేనిఫెస్టోకు ఒక విలువ, ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని.. చెప్పింది చెప్పినట్టుగా 98.5 శాతం హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారు. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేక.. కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ అవాస్తవ ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. సుస్థిర అభివృద్ధి దిశగా పాలన ‘‘స్వాతంత్య్రం నాటికి విపరీతమైన అసమానతలు, భిన్నత్వం, కుల వ్యవస్థ, పాలన తీరు వంటివి ఉన్నా.. రాజ్యాంగం దేశాన్ని ఒక్కటిగా, ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకెళ్లింది. రాజ్యాంగ పీఠిక ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమన్యాయం కలి్పస్తామని హామీ ఇచి్చంది. ఈ సైద్ధాంతిక పునాది, స్ఫూర్తితోనే పేదలు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారో అన్నింటిలోనూ వారిని ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా.. సుస్థిర అభివృద్ధికి వీలుగా విధానాలను, పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే..’’అని ‘సాక్షి’మీడియా గ్రూపు ఎడిటర్ వర్ధెల్లి మురళి తెలిపారు. ఇటీవలి ‘టైమ్స్ నౌ–నవభారత్ సర్వే’ప్రజల్లో వైఎస్ జగన్‌కు ఉన్న ఆదరణను పట్టి చూపిందని, 24–25 ఎంపీ సీట్లు వైఎస్సార్ సీపీకే వస్తాయని తేలి్చందని వివరించారు. నాడు–నేడు ఎంతో మార్పు విద్య, వైద్యంతోపాటు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో ‘నాడు–నేడు’ఎంతో మార్పు వచి్చందని.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఆర్థిక సాయం దాకా అన్ని అంశాల్లో పేదలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు పథకాలను అమలు చేస్తుంటే దోచిపెడుతోందంటూ ప్రతిపక్షం అవాస్తవ ప్రచారాలకు పాల్పడుతోందని.. పేదలకు మంచి విద్య, సరైన వైద్యం అందిస్తే దోచిపెట్టినట్టా? అని ప్రశ్నించారు. మాటలే కాదు.. చేతల్లో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. పూర్తి వీడియో -
డాలస్ : అమెరికాలో అంగరంగ వైభవంగా నాటా వేడుకలు (ఫొటోలు)
-
గ్రామాలకు చేయూత
మీలో ఎంతో మంది మూలాలు మన మట్టిలోనే, మన గ్రామాల్లోనే ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మీలో ఎంతో మంది అక్కడ రాణించేందుకు కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ కారణం. ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. అలాంటి కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉండటాన్ని నేను చూశా. ఆకాశాన్ని అధిగమించి ఎదిగేందుకు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలన్న తపనతో నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. గ్లోబల్ సిటిజన్‌గా ఎదగాలంటే చదువన్నది ఒక పెద్ద సాధనం. – ప్రవాసాంధ్రులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు విలువైన తమ నైపుణ్యాలు, అనుభవాలను పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐక్యంగా కాపాడుకుంటూ ఎన్నారైలు విదేశాల్లో కీలక పదవుల్లో, ఉన్నత స్థానాల్లో రాణిస్తుండటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ‘నాటా’ (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ సోమవారం వీడియో సందేశం పంపారు. గ్లోబల్ సిటిజన్‌గా ఎదిగేందుకు చదువన్నది కీలక సాధనమన్నారు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు నాలుగేళ్లుగా విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, గ్రామాల్లోనే అందిస్తున్న సేవలను గమనించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీరంతా మాకు గర్వకారణం.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తోపాటు అందరికీ శుభాకాంక్షలు. నాలుగేళ్ల క్రితం నేను డల్లాస్ వచ్చిన సందర్భంగా మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. విదేశాల్లో ఉన్న ఇంత మంది తెలుగువారు గొప్పవైన మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, పేరు పొందిన డాక్టర్లుగా రాణిస్తున్న మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం. సర్కారు స్కూళ్ల స్వరూపాన్ని మార్చేశాం రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన మార్పులను గమనిస్తే మన గవర్నమెంట్ బడులన్నీ పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు – నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్య అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి అన్నిచోట్లా వీటి ఏర్పాటు పూర్తి అవుతుంది. మన గవర్నమెంట్ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్, ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వ తరగతి నుంచే సన్నద్ధం చేసి టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్.. ఇలా పదో తరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ విద్యా వ్యవస్ధలో తెచ్చిన మార్పులు. చదువు అనే ఆయుధం ఎంత అవసరమో తెలియచేసేందుకు ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తోంది. సుదీర్ఘంగా వెల్లడించే సమయం లేకున్నా రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగా. గ్రామాల్లోనే 600 రకాల పౌర సేవలు విద్యారంగం ఒక్కటే కాదు.. ఏది చూసినా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. అంతెందుకు.. మీ అందరికీ గ్రామాల్లోనే మూలాలు, పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి మీ గ్రామాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ చూడని విధంగా విలేజ్ సెక్రటేరియట్ మీ కళ్లెదుటే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది ఉద్యోగులు మీ ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి 2,000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను తెచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్న గొప్ప పరిస్థితి ఇవాళ ఉంది. పౌర సేవల్ని వలంటీర్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. పెన్షన్, రేషన్ అన్నీ మన ఇంటి ముంగిటికే వస్తున్న గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. విత్తనం నుంచి పంట విక్రయాల వరకూ ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తోంది. నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కూడా కనిపిస్తాయి. ప్రివెంటివ్ కేర్‌పై దృష్టి ప్రివెంటివ్ కేర్‌పై ఒక ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ లాంటి జీవన శైలి జబ్బులకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్, కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే ప్రివెంటివ్ కేర్ చాలా ముఖ్యం. అందుకే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను తెచ్చాం. ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క వైద్య రంగంలోనే 48 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. నాడు – నేడుతో ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం. మన గ్రామాల్లో ఆర్థిక సుస్థిరత ఇక్కడ మన రాష్ట్రం గురించి మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తే వినియోగం పెరిగిపోయి ఉత్పత్తిదారులు లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత తలెత్తి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే విక్రయిస్తాం. ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే రవాణా వ్యయం కూడా ఉంటుంది. అంతేకాకుండా రీటైల్ మార్జిన్, సరఫరా వ్యయం కూడా భరించాలి. అందుకే ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న పనులతో వాటిని చేరుకోగలం. గ్రామాల్లో ఉన్నవారు ఏం కోరుకుంటారో గమనిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. పిల్లలకు ఇంగ్లిష్ రావాలని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్నవారి కోసం విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను ప్రవేశపెట్టాం. ఇవికాకుండా వ్యవసాయ రంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అనేది రాబోయే రోజుల్లో సాకారం కానున్న గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామానికి వస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కూడా వస్తాయి. గ్రామస్ధాయిలో మన కళ్లెదుటే జరుగుతున్న గొప్ప మార్పులివి. పోర్టులు, హార్బర్లు, ఇండ్రస్టియల్ కారిడార్లు.. మౌలిక వసతులపై నాలుగేళ్లుగా పురోగతిని గమనిస్తే పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు సాకారమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లుగా రాష్ట్రంలో ఆరు పోర్టులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాం. తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటవుతుండగా అందులో మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన గ్రామాలపై దృష్టి పెట్టండి.. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపార నైపుణ్యం మీకుంది. మన రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా తోడ్పాటు అందించండి. ఆర్ధికంగా అనే మాటలు కాస్తో కూస్తో బాగుంటాయి కానీ అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం మీద, మన గ్రామాలపైన ధ్యాస పెట్టగలిగితే అవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. నాటా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఏది కావాలన్నా ఇంగ్లిష్‌లోనే.. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను మన పిల్లలు చదువుతున్నారు. ప్రపంచంలో విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం ఇంగ్లిష్. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్‌గా ఎదగటానికి ఇంగ్లిష్ ఒక సాధనం. ఏది చదువుకోవాలన్నా, సబ్జెక్ట్పె అవగాహన పెంచుకోవాలన్నా ముందు ఇంగ్లిష్‌పై పూర్తి స్థాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్ ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉంది. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఇంగ్లిష్ ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. ఈవోడీబీలో మూడేళ్లుగా నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం వరుసగా మూడేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్ 4, 5 స్థానాల్లో ఉంది. మనందరి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, మహిళా సంక్షేమం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన.. ఇలా ప్రతి విషయంలో దేశంలోనే గొప్ప మార్పులకు నాంది పలికింది. -
నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్‌పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్ సుధాకర్ పెన్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. వాషింగ్టన్ డీసీలో జరగుతున్న నాటా తెలుగు మహాసభలకు రావడం మొదటిసారిగా వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అని ప్రశ్నించగా..ఇది మొదటిసారి కాదని, న్యూఢిల్లీ, జర్మనీలో బెర్లిన్ తదితర కార్యక్రమాల్లో హాజయరయ్యానని చెప్పారు. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వాళ్లందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది 'నాటా' అన్నారు. ఇది ఒకరకంగా మనమంతా ఒకే కుటుంబం అనే ఒక గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. మన నేపథ్య ఏదైనా.. మనమంతా ఎప్పటికీ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఎలుగెత్తి చాటారు. మొన్నటివరకు కోవిడ్ భయంతో డిప్రెషన్‌గా బిక్కుబిక్కుమంటూ నాలుగోడలకే పరిమితమైన అనంతరం ఆనందంగా నూతనోత్సహంతో జరుపుకుంటున్న ఒక వేడుక ఇది అని అన్నారు. అలాగే ప్రస్తుత టెక్నాలజీ ఆధ్యాత్మిక జీవనానికి ఉపకరించేదా భంగం కలిగించేదా అని ప్రశ్నించగా..మానవుని కంఫర్ట్ కోసమే కదా టెక్నాలజీ. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేలా వాడుకోవడమనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీ మనిషికి మంచే చేస్తుంది. ఉపయోగించే విధానంలోను ఉంది అంతా అని చమత్కారంగా చెప్పారు. మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడూ ఉండగలం అని ప్రశ్నించగా.. మన మైండ్ క్లియర్‌గా ఉంటేనే అది సాధ్యం అని బదులిచ్చారు. మెడిటేషన్ అని సులభంగా చెప్పినంతా ఈజీ కాదు కదా చేయడం అని అడగగా..అదే కదా నా జాబ్ అని నవ్వుతూ జవాబిచ్చారు గురూజీ రవి శంకర్. మంచి గైడెన్స్‌లో చేయడం నేర్చుకుంటే అది ఈజీగానే చేయొచ్చు అని అన్నారు. మానవత్వానికి అతిపెద ఛాలెంజ్ వివక్ష, స్టీరియో టైప్ థింకింగ్ , ఫాల్స్ మైండ్ తదితరాలని అన్నారు. ఆ దుర్గుణాలని దూరం చేసిమంచి వైపు తీసుకువెళ్లగలిగేది మెడిటేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను నక్స్‌లైట్లను కలుసుకున్న సందర్భం గుర్తు చేసుకుంటూ..ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ బోర్డర్ల మధ్య ఉన్న నక్సల్స్ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ వారు తమ గురువు కారల్ మార్క్స్ అని చెప్పారన్నారు. అది వారి ఓపెనియన్. అక్కడ వారు తాము ఎంత వివక్షతకు గురయ్యమో వివరించారు. ఆ తర్వాత వారి చెప్పిందంతా ఓపికగా విన్నా. ఆ తర్వాత వారు నా ప్రసంగం విని నచ్చాక ..కాసేపు తనాతో కలిసి మెడిటేషన్ కూడా చేశారన్నారు. ఆ తర్వాత క్రమేణా వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. కొందరూ పూర్తి స్థాయిలో మారారు కూడా. మెడిటేషన్‌కి చాలా పవర్ ఉందని, కుల, మత భేదాలతో సంబంధం ఉండదని ఎవ్వరైన చేయొచ్చు. చివరిగా నువ్వేంటీ? అనేది నీ అంతరంగమే నీకు బోధించేలా చేస్తుందని రవిశంకర్ అన్నారు. ఇలా డల్లాస్‌లో జరిగిన నాటా మహాసభలో మెడిటేషన్ , ప్రాణాయామాకి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు. (చదవండి: నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్) -
నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా, టెక్సాస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 30 నుంచి జులై 2 వరకు జరుగుతున్న తెలుగు మహాసభల్లో భాగంగా అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. నాటా మహాసభల్లో రెండోరోజు వేడుకల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైకాపా సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, వైకాపాను ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. (చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాటా మహాసభలు..జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు) -
'నాటా అవార్డు ఇన్ జర్నలిజం-2023'ని అందుకున్న కొమ్మినేని
ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ - నాటా అవార్డు ఇన్ జర్నలిజం–2023 అందుకున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్లో జరిగిన నాటా మహాసభల్లో కొమ్మినేని ఈ అవార్డును అందుకున్నారు. నాటా ఆధ్వర్యం లో ప్రతి రెండేళ్ల ఒకసారి జరిగే తెలుగు మహాసభలు.. ఈ ఏడాది అమెరికాలోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్వెట్ డేతో ప్రారంబమైన ఈ వేడుకలు జులై 2 వరకు జరగనున్నాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా.. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. (చదవండి: 'నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక ) -
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి నాటా ఎక్స్ లెన్స్ అవార్డ్
-
డల్లాస్‌లో నాటా మహాసభలు.. ఘనంగా ఏర్పాట్లు పూర్తి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా)మహాసభలు ఈనెల 30నుంచి అమెరికాలో ఘనంగా జరగనున్నాయి. డల్లాస్‌లో జూలై 1, 2 తేదిల్లో విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్ 2023 విమెన్స్ ఫోరం ఛైర్పర్సన్ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి అని పేర్కొన్నారు. జులై 1న వివిధ రంగాల్లో ప్రముఖులైన ఉపన్యాసాలు, పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జులై2న టాక్ ఆఫ్ ద టౌన్‌తో మొదలై, మహిళా తెలుసుకో సెగ్మెంట్లో అలంకరణపరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సూచనలు, సొగసు చూడతమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటుందని తెలిపారు. నాటా సభల్లో వాసిరెడ్డి పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్ మరియు వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పోల్గొననున్నారు. -
‘నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అవార్డు ఇన్ జర్నలిజం–2023కు ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నాటా” ఆహ్వానం మేరకు సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు ఈ నెల 29న (గురువారం) పయనమౌతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యం లో ఏటా జరిగే తెలుగు ప్రజల ఉత్సవాలను యీ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో నిర్వహిస్తున్నారు. జూన్ 30 నుండి జులై 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను సన్మానించడం జరుగుతుంది. 2023 సంవత్సర "నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్స్ లెన్స్" అవార్డును అందుకునేందుకు శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు జులై 1 నాటికి చేరుకుంటారు. తిరిగి జులై 16న విజయవాడ చేరుకుంటారు. ఇది కూడా చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
నాటా వేడుకలకు వేళాయె!
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండు వరకు అమెరికాలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ వేదికవుతోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజసేవే నాటా బాట’ అనే నినాదంతో ఇప్పటివరకు ఆ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నాటా సభలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో వంద మందికి పైగా రాజకీయ, సినీ, అధికార ప్రముఖులు ఉంటారని సమాచారం. ఈ సభల్లో దాదాపు 20 వేల మంది వరకు ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించి ఏరోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందుకు నాటా అధ్యక్షుడు డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి ఆతిథ్యం వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు పలు కమిటీల సభ్యులు, వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడురోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కరోనా తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రవాసాంధ్రులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలుగా ఇవి మిగిలిపోనున్నాయని నిర్వాహకులు అంటున్నారు. ప్రవాసాంధ్రులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్క కుటుంబం అనే భావన తీసుకురావడమే ప్రపంచ తెలుగు మహాసభల వెనుక ఉన్న ఉద్దేశమని చెబుతున్నారు. భావి తరాలకు ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమవంతు సహాయం చేయడం, కొత్త తరానికి స్ఫూర్తిదాయక సందేశం ఇవ్వడమే నాటా ముందున్న లక్ష్యాలు. కరోనా తర్వాత నిర్వహిస్తుండటంతో ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లలో వసతి, రాకపోకలకు అధునాతన రవాణా సౌకర్యం, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. -
నాటా వసుధైక కుటుంబం
అమెరికా.. ఎందరికో కలల దేశం. అగ్రరాజ్యమైన అమెరికా వెళ్తే.. ఎంచుకున్న రంగంలో రాణించవచ్చన్న లక్ష్యంతో వేల మంది ప్రవాసాంధ్రులు వెళ్లారు. కొందరిది ఉద్యోగం, మరికొందరిది వ్యాపారం, ఇంకొందరిది వైద్యం, సేవల రంగం. ఇప్పుడు అమెరికాలో కీలకమైన పదవుల్లో తెలుగు వారందరో ఉన్నారు. ఇలాంటి వారు సొంతగడ్డ రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ఒక వారధిలా మారింది. మనసంతా జన్మభూమిపైనే.. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం అమెరికా వైపు మొగ్గుచూపుతున్నారు. గత 30 ఏళ్లుగా సాఫ్ట్వేర్, వైద్య, ఇతర వృత్తి నిపుణులు అమెరికాకు వెళ్తున్నారు. వేల మంది ప్రవాసాంధ్రులు ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక అభివృద్ధి పనుల్లో తమ వంతుగా పాల్గొంటున్నారు. నాటా సేవాడేస్ ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ప్రతినిధులు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో ముందుగానే కసరత్తు చేస్తారు. వేర్వేరు పద్ధతుల్లో సేకరించిన సమాచారాన్ని వడపోసి.. తమ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ప్రతీ ఏటా నాటా ప్రతినిధి బృందం తెలుగు రాష్ట్రాలను సందర్శించి తమ సహకారాన్ని తోడ్పాటును అందిస్తారు. * ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి * నాడు-నేడులో భాగంగా మౌలికసదుపాయాల అభివృద్ధి * ప్రజావసరాల కోసం కమ్యూనిటీ భవనాలు * మంచినీటి ప్లాంటులు * బాగా చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకాలు * సేవ్ ద గర్ల్ ఛైల్డ్ క్యాంపెయిన్ * మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపులు * అన్నదానాలు, విద్యాబోధన * ఆటలపోటీలు, క్రికెట్ టోర్నమెంట్లు ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. అంటూ కవి రాయప్రోలు సుబ్బారావు నినదించినట్టు... నాటా నేతృత్వంలో ప్రవాసాంధ్రులు మాతృభూమి సేవలో తరిస్తున్నారు. అమెరికాలో స్థిరపడినా తాము పుట్టి పెరిగిన ప్రాంతంపై మమకారాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సాంస్కతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తూ భావిభారత పౌరుల భవిష్యత్తుకు బాటలు వేస్తుండగా, మరికొందరు గ్రామం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నాటా ఫౌండర్ ప్రేమ్ సాగర్ రెడ్డి స్వయంగా ఇటీవల ఏపీలో పర్యటించారు. ప్రేమ్ సాగర్ రెడ్డి తన స్వంత గ్రామం అయిన నిడుగుంట పాలెంతోపాటు ఆంధ్రరాష్ట్రం లో పర్యటించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి కి విశ్వ వైద్య విభూషన్ అవార్డును ప్రధానం చేసింది నాటా బృందం. జూన్ 30 నుంచి జులై 2 వరకు అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. -
ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా.. నాటా వేడుకలకు డాలస్ రెడీ
(అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) టెక్సాస్ : అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉండే డాలస్‌లో ఈ వేడుకలు జరగనుండడం.. మరింత ఊపు తెచ్చింది. (NATA నాటా కార్యవర్గ బృందం) కనివినీ ఎరుగని రీతిలో సభలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఘనంగా ఈ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది కమిటీ. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, నాయకులు, కళాకారులు హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించడానికి అత్యున్నతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తమవంతుగా వేడుకల కోసం కృషి చేస్తున్నారు. (ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసిన NATA బృందం) నాయకులకు వెల్కం అంగరంగ వైభవంగా జరిపేందుకు తలపెట్టిన ఈ మహా వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసింది నాటా బృందం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను సన్మానించిన నాటా సభ్యులు.. మహాసభలకు సంబంధించిన విశేషాలను పంచుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇక ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. సినిమా సందడే సందడి నాటా తెలుగు మహాసభల్లో టాలీవుడ్ సందడి కనిపించనుంది. స్పెషల్ అట్రాక్షన్‌గా రాంగోపాల్ వర్మ, బెస్ట్ మ్యూజిక్ ట్రయో దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్, అలాగే గేయ రచయిత అనంత శ్రీరాం, సింగర్ ఎస్పీ శైలజ, మధు ప్రియ తదితరులు హాజరు కానున్నారు. సినీ ప్రముఖులు శ్రీనివాసరెడ్డి, అలీ, లయ గోర్తి, పూజ ఝువాల్కర్, స్పందన పల్లి, అనసూయ, ఉదయభాను, రవి, రోషన్, రవళి తదితర ప్రముఖులతో ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ దుస్తుల డిజైనర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో, సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ పర్యవేక్షణలో పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీన్ నాటా, మిస్ నాటా, మిసెస్ నాటా పోటీలు కూడా జరగనున్నాయి. ధ్యాన సందేశం ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్‌ను ఆహ్వానించింది నాటా కార్యవర్గం. గురు రవిశంకర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించే అవకాశాన్ని ప్రవాసాంధ్రులకు కల్పించింది. సూపర్ వెన్యూ డాలస్ డాలస్ అనగానే గుర్తొచ్చేది అమెరికాలో తెలుగు కాపిటల్ అని. అలాంటి చోట.. అది కూడా డౌన్టౌన్లో అందరికీ అనుకూలమైన K బెయిలీ హచిసన్ కన్వెన్షన్ సెంటర్ (#KBHCCD)లో నాటా సభలు జరగనున్నాయి. పది లక్షల స్క్వేర్ ఫీట్ ఎగ్జిబిట్ స్పేస్, మూడు భారీ బాల్రూంలు, 88 మీటింగ్ రూంలు, ఒక భారీ థియేటర్ డాలస్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు. 1957లో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ను అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. 2013లో అమెరికా మాజీ సెనెటర్ K.బెయిలీ పేరును ఈ కన్వెన్షన్ సెంటర్‌కు పెట్టారు. అన్నింటికీ అనుకూలం డాలస్ కన్వెన్షన్ సెంటర్ డౌన్ టౌన్లో ఉండడం వల్ల సులువుగా చేరుకోవచ్చు. ఈ కన్వెన్షన్‌లో భారీ పార్కింగ్ సెంటర్లున్నాయి. అన్నీ రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం అయి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుగుణంగా ఆమ్ట్రాక్, ట్రినిటీ రైల్వేలకు సమీపంలో ఉంది ఈ కన్వెన్షన్ సెంటర్. అలాగే కన్వెన్షన్‌తో నేరుగా స్కైవే బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యేలా రెండు హోటళ్లు హయత్ రీజెన్సీ, షెరటాన్ హోటల్ ఉన్నాయి. (NATA వేడుకలు జరగనున్న డాలస్ కన్వెన్షన్) మూడు రోజులు డాలస్‌కు పండగ కళ జూన్ 30 శుక్రవారం ప్రారంభమయ్యే వేడుకలు.. జూలై 2 ఆదివారం వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా బాంకెట్ డిన్నర్ ఏర్పాటు చేశారు, ఇక్కడ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నాటా ఎక్సలెన్స్ అవార్డులతో గుర్తించి సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ టీం సంగీత విభావరితో ఊర్రూతలూగించనున్నారు. జూలై 1, జులై2 రోజంతా సందడే సందడి. ఆట, పాట, మాట, మంతి.. ఒకటేంటి.. పండుగ వాతావరణంలో ప్రవాసాంధ్రులంతా ఒక్క చోట చేరి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించనున్నారు. జులై 2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరుడి కళ్యాణ వేడుక పద్మావతి అమ్మవారితో అంగరంగవైభవంగా జరగనుంది. మహాసభల ఏర్పాట్లను నాటా కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి, రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మ బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్ సీరం, సలహాదారులు హరి వేల్కూర్, రామిరెడ్డి ఆళ్ల, ఉషారాణి చింత, సుజాత వెంపరాల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు నాటా వెబ్సైట్ https://nataconventions.org/conference-registration.php లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నాటా PR&మీడియా డీవీ కోటి రెడ్డి (9848011818)ని సంప్రదించాలని తెలిపారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన నాటా ప్రతినిధులు
-
నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వనం అందింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్, సభ్యులు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లి.. ఆయన్ని కలిసి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించిన వాళ్లలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, నాటా సభ్యులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. -
రెడ్‌క్రాస్ సేవలు అమూల్యం.. కోవిడ్ సమయంలో అద్భుత సేవలు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్‌క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్‌క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్‌క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్‌బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్‌కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్‌కుమార్‌తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘నాటా’కు ప్రశంశలు కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్‌క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు) -
డాలస్‌లో నాటా బోర్డు మీటింగ్: నిధుల సేకరణకు విశేష స్పందన
డాలస్: అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కార్యదర్శి ), సతీష్ నరాల (సంయుక్త కోశాధికారి ) తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూన్ 30, జులై 1-2 2023 లో డాలస్ లో జరిగే కన్వెన్షన్ గురించి వివరాలు తెలిపారు. బోర్డు సమావేశం తర్వాత సభ్యులు అందరూ డాలస్ కన్వెన్షన్ టూర్ కు వెళ్లి అక్కడ వేదికను పరిశీలించి నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు కల్పించే సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన నిధుల సేకరణ విందు లో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు ($2,600,000) ఇస్తామని నాటా కు వచ్చిన హామీ అమెరికాలో సరిక్రొత్త రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి గారిని నాటా కార్యవర్గం ప్రత్యేకం గా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందు లో పాల్గొన్న దాతలకు పరిచయం చేసినారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్ రామిరెడ్డి (కన్వీనర్ ), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్ ), కృష్ణ కోడూరు (కో కన్వీనర్), భాస్కర్ గండికోట(కో కోఆర్డినేటర్), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్ చొప్ప ఇతరులు అతిధులకు సౌకర్యాలను కల్పించారు. ఈ నిధుల సేకరణ విందుకు హాజరై హామీ ఇచ్చిన దాతలు అందరిని నాటా కార్యవర్గం పేరు పేరున అభినందించింది. -
అట్లాంటాలో అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా నగరంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా), APNRT అద్వర్యంలో HTA వారి సహకారంతో జులై 9వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ కళ్యాణం కార్యనిర్వాహకవర్గం సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కొట్లూరి, నంద గోపి నాథ రెడ్డి, HTA కార్యవర్గ కమిటీ, వారి మిత్ర బృందం, వాలంటీర్ల సహకారంతో స్వామి వారి కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు, వేదపండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్య ధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. హిందూ టెంపుల్ అఫ్ అట్లాంటా కార్య వర్గం వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి, తరించారు, భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ వేడుకల్ని నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, స్వామివారి దర్శనానికి నోచుకోని వేలాది మంది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. దాదాపుగా 100 సభ్యులతో కూడిన గాన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలతో ఈ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. గాయనీ గాయకులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీదర్ కొరసపాటి, నాటా నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డితో పాటు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఏఈఓ బి. వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ యూఎస్ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నంద గోపినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్ఎంఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
వరద సాయం.. కదిలిన ఎన్నారైలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కడప జిల్లాలోనూ ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. కొంతమంది జీవనోపాధి కోల్పోగా.. మరికొందరు ఆస్తినష్టం జరిగి కట్టుబట్టలతో మిగిలారు. ఈ పరిస్థితుల్లో తక్షణ సహాయంగా మౌలికమైన వసతులు కల్పించటం కోసం ఎన్నారైలు కదిలారు. అమెరికాలోని అట్లాంటా సిటీ నాటా అసోషియేషన్, వైఎస్సార్ అభిమానులు స్పందించి విరాళాలు అందించారు. దాతల్లో ఒకరైన నాటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి కొట్లూరు ఇక్కడే ఉండటం వల్ల స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు గ్రామాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. రాజంపేట మండలం మండపల్లిలో చెయ్యేరు ఉధృతికి రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో తలా ఒక లక్ష రూపాయల సహాయం అందచేశారు. అలాగే ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నా నది తీరాన ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలోని 35 మందికి దుప్పట్లు దోమతెరలు, దుస్తులు పంచిపెట్టారు. అలాగే మరో రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సాయం అందించిన వెంకట రామ్ రెడ్డి చింతం, నంద గోపినాధ రెడ్డి, పంగ భూపాల్, ఉపేంద్ర రెడ్డి, కందుల కిరణ్, యర్రపురెడ్డి అనిల్ రెడ్డి, ఓజిలి పాండురంగారెడ్డి, గూడా కృష్ణమోహన్ రెడ్డి, హారతి శ్రీహరి, ఎద్దుల మోహన్ కుమార్, సగిలి రఘు రెడ్డి, నరాల సతీష్, చారుగండ్ల లక్ష్మీనారాయణ, తమ్మినేని శివ, బొమ్మిరెడ్డి రామిరెడ్డి, హరి హర రెడ్డి, ఆలూరి శ్రీనివాస్, బోరెడ్డి రవి కుమార్‌లకు.. సాయం అందుకున్న పలువురు ధన్యవాదాలు తెలిపారు. -
తానా నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి
వాషింగ్టన్: నీతి, నిజాయితీ, నిరాడంబరత, మంచితనం, మాటకు బద్దులై వుండటం, మానవతా దృక్పథం, ప్రజా సేవా తత్పరత మొదలైన సాత్విక లక్షణాలన్నింటి సమాహారమే అంజయ్య చౌదరి లావు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ( 2021-23) బాధ్యతలు స్వీకరించ బోతున్న మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ మనసా, వాచా, కర్మణా స్వాగతిస్తున్నారు. మాటల్లో నిష్కల్మషం, ఆచరణలో నిజాయితీ, అంజయ్య చౌదరి లావు ఔన్నత్యానికి నిదర్శనం. కష్టపడటం కాలంతో పరిగెత్తడం, అనుకున్న లక్ష్యం సాధించే వరకు అనునిత్యం అలుపెరగని పయనం సాగించనున్నారు. తెలుగు వారి పట్ల ప్రేమ వారి సమస్యల పరిష్కారం కొరకు కడదాకా పోరాడే యోధుడు అంజయ్య చౌదరి లావు . డాలర్ల వేటలో మానవ సంబంధాలను మరుస్తున్న ఈరోజుల్లో ఖండాంతరాల అవతల కూడా కాసులకు అతీతంగా సేవలందించి అందరి మన్ననలను పొందుతున్న తెలుగుతేజం అంజయ్య చౌదరి లావు. తానా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా పర్వదినం. తన కుటుంబ శ్రేయస్సు కాకుండా అమెరికాలోని తెలుగువారు కుటుంబాలను కూడా తన కుటుంబంగా భావించి ఆపదలో ఉన్నవారు ఎవరైనా ఏ సమయంలో వచ్చినా వెంటనే స్పందించి , వారికి కొండంత ధైర్యాన్ని కల్పించి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్న అంజయ్య చౌదరి లావు కి అభినందనలను తెలియజేశారు. తెలుగువారి సేవలో పరమాత్మను సేవిస్తూ తన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోతూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకోవాలని అంజయ్య చౌదరి లావు లక్ష్యం . ఆ లక్ష్య సాధన కోసమే ఆయన నిరంతరం ఆరాటపడుతున్నారు. కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు - శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నంలో పనిచేయడం వలన అంజయ్య చౌదరి చిన్నతనంలోనే బాబాయి లావు రంగారావు,పిన్నమ్మ కోటేశ్వరమ్మ ల సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరం లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు. పూవు పుట్టగానే పరిమళించినట్లు గా అంజయ్య చౌదరి చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు. 1988 లో అమెరికా వెళ్లి అట్లాంటాలో నివాసమున్నారు. 1997 లో అనకాపల్లి కి చెందిన నతాషా తో వివాహం జరిగింది. అంజయ్య చౌదరి లావు గారికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తే అక్షిణ శ్రీ చౌదరి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ,వారికి ఆపన్నహస్తం అందించడంలోనే జీవిత పరమార్థం దాగి ఉన్నదని భావించే అంజయ్య చౌదరికి కుటుంబ ప్రోత్సాహం బాగా తోడయింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ సహకారం తప్పక ఉంటుందనే అక్షరసత్యం నిజం చేస్తూ అంజయ్య చౌదరి లావు ప్రతి విజయం వెనుక వారి ధర్మపత్ని చేయూత, ప్రోత్సాహం ఉంది. ఆమె ప్రోద్బలంతోనే అంజయ్య చౌదరి సేవా కార్యక్రమాలకు ఎదురులేకుండా ( తానా ఎమర్జెన్సీ అసిస్టెంట్స్ మేనేజ్మెంట్ ) తానా టీమ్ స్క్వేర్ అంజయ్య చౌదరి లావుగా పేరుపొందారు. పేద ప్రజల గుండెచప్పుడు పెద అవుటపల్లి పల్లి గ్రామంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ వైద్యులు వారి తలుపు తట్టి ఉచితంగా వారికి రోగాలు నయం చేస్తున్నారు . ఈ సామాజిక, ఆరోగ్య చైతన్యం వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే అంజయ్య చౌదరి లావు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి , సొంత లాభం కొంత మానుకొని స్వగ్రామానికి తోడ్పాటును అందించాలనే జన హితుడు ఆయన పేర్కొన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పటల్ వైద్యబృందం సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు. జైపూర్ నుండి వికలాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను తెప్పించి పంపిణీ చేయించారు. తాను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా తాను పుట్టి పెరిగి నడిచివచ్చిన దారిని మర్చిపోకుండా అందరినీ కలుపుకొని పోతూ తన స్వగ్రామం పెద్ద ఉటపల్లి అభివృద్ధికి నడుం బిగించిన అజాతశత్రువు అంజయ్య చౌదరి. "ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుని కో మాల అని నమ్మి " ఎన్నో సేవా కార్యక్రమాలకు స్వయంగా అంజయ్య చౌదరి విరాళం అందించారు . మిత్రులు సహృదయులు వద్ద నుండి విరాళాలు సేకరించి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. గ్రామంలోని అనాధ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. నిరు పేద పిల్లలకు కానుకలు, ఆటబొమ్మలు పంపిణీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, అనాధ శరణాలయం లో అన్నదానం, గ్రామంలో మొక్కలు నాటడం చేపట్టారు. తానా స్కాలర్షిప్పులు వంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారు. భారతదేశంలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. గ్రామాభివృద్ధి లో చౌదరి అలుపెరుగని కృషి చేస్తున్నారు. పెద్ద అవుటపల్లి గ్రామంలో మొదలైన అంజయ్య చౌదరి లావు సామాజిక సేవా పరిమళం మెల్లమెల్లగా అమెరికా అంతా వ్యాపించింది . అమెరికన్ రెడ్ క్రాస్ ఇతర జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాల నిర్వహణ లో అంజయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా జరిగిన అనేక రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అక్కడ నిర్వహించే వైద్య శిబిరాలు తగిన హాల్స్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమకూర్చటం, ధన సహాయం చేయడం, వైద్యం కోసం వచ్చిన వారికి తగిన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. " ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న " అనే నానుడిని ప్రగాఢంగా విశ్వసిస్తూ సాటి మనిషికి సాయం పడటం వారికి ప్రేమను పంచడం ఇవే నా జీవితాన్ని నడిపించే అంజయ్య చౌదరి లావు మూలసూత్రాలంటారు అన్నదానం " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి వారిని ఆదుకోవడం కన్నా మంచి పని ఏమి ఉంటుందని భావించారు అంజయ్య చౌదరి లావు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి స్తోమతను బట్టి గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక వృద్ధ శరణాలయాల్లో అన్నదానం చేస్తూ అందరి అభిమానాన్ని అంజయ్య చౌదరి లావు చూరగొన్నాడు. పదవులకే వన్నెతెచ్చిన అంజయ్య చౌదరి లావు అంజయ్య చౌదరి లావు పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి . వరించిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చాడు. అతి చిన్న వయసులోనే అనేక పదవులు చేపట్టారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ గా మొదలైన వారి ప్రయాణం నేడు తానా అధ్యక్షులు వరకూ వచ్చింది. "తానా" టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13) "తానా" సంయుక్త కోశాధికారి ( 2013-15) "తానా" టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15 ) "తానా" కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 - 17 ) "తానా' టీమ్ స్క్వేర్ కో చైర్ (2015 - 17) "తానా" జనరల్ సెక్రటరీ (2017 - 19) తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ ( 2017 -19) "తానా" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 - 21 ) "తానా" ప్రెసిడెంట్ ( 2021 -23) తెలుగు వారి సేవలో అమెరికాలో ఉద్యోగం చేస్తూనే అంజయ్య చౌదరి లావు అక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారం కోసం తానా సంస్థలో సభ్యులుగా చేరారు. తెలుగువారు హత్యకు గురైనా, రోడ్డు ప్రమాదాల్లో మరణించినా వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడంలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి అన్ని తానై పూర్తి చేసేవారు. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇండియా నుండి అమెరికా కి వెళ్లి ఇబ్బందులకు గురైతే వారికి అండగా నిలిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారి సమాచారాన్ని తెలుసుకొని వారికి సహాయపడేవారు. కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా సుమారు 100 కు పైగా సేవా కార్యక్రమాలు అమెరికా వ్యాప్తంగా చేశారు. ముఖ్యంగా బోన్‌మారో డ్రైవ్ , బ్లడ్ డ్రైవ్, ఫుడ్ అండ్ టాప్ డ్రైవ్, ట్రైనింగ్ వర్క్ షాప్, టాక్స్ సెమినార్లు, ఫైనాన్స్ ప్లానింగ్ సెమినార్ నిర్వహించి ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొనేలా తన వంతు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తెలుగు వారిని ఆదుకునేందుకు 2008వ సంవత్సరంలో ప్రారంభించబడిన టీమ్ స్క్వేర్ సంస్థకు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అంజయ్య చౌదరి చేసిన సేవలు అనిర్వచనీయం. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సుమారు 600 మంది కార్యకర్తలను సంధాన పరుస్తూ సేవా యజ్ఞాన్ని కొనసాగించారు. రానున్న రోజుల్లో "తానా" కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు ,తానా యాష్చంద్రిక లను దశదిశలా వ్యాపింప చేసేందుకు అంజయ్య చౌదరి లావు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దామని పేర్కోనారు. -
నాట్స్‌కు సొంత కారును విరాళమిచ్చిన తెలుగు మహిళ
న్యూ జెర్సీ: అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి తమ వంతు సహకారం అందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూజెర్సీకు చెందిన తెలుగు మహిళ బినోదిని వుతూరి తను వాడే సెడన్ కారును నాట్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించిన బినోదిని.. సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన మద్దతును తెలుపుతూ ఉంటారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలను తెలుసుకున్న బినోదిని తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటితో మాట్లాడి తన సొంత కారును విరాళంగా ఇస్తానని ప్రకటించగా, అనుకున్న విధంగానే ఆమె కారుకు సంబంధించిన యాజమాన్య హక్కులను నాట్స్ కు బదలాయించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని సహకరించారు. నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహనకృష్ణ మన్నవ ఆధ్వర్యంలో నాట్స్ న్యూజెర్సీ విభాగం నుంచి శ్రీ హరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీవెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సురేశ్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, రాంబాబు వేదగిరి, మురళీ మేడిచెర్ల తదితర నాట్స్ నాయకులు బినోదిని ఇంటికి వెళ్లి కారు డాక్యుమెంట్లను స్వీకరించారు. నాట్స్ కోసం బినోదిని తన కారును విరాళంగా ఇవ్వడంపై నాట్స్ నాయకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం -
మిస్ నాటా 2020 రన్నరప్‌గా తారిక
సాక్షి, లక్డీకాపూల్: మిస్ నాటా 2020 ప్రథమ రన్నరప్‌గా ప్రవాస భారతీయురాలు తారిక యెల్లౌలా నిలిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీనటి ప్రియమణి, యాంకర్ శ్యామలు వ్యవహరించారు. అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఎంతో మంది ప్రతిభావంతులను, కొత్త వారిని ప్రోత్సహించే క్రమంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో నాటా ప్రపంచ స్థాయి మిస్ నాటా పోటీలను నిర్వహించింది. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న పదహారేళ్ల తారక యెల్లౌలా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (పులికి, గద్దకు పురస్కారం! ) మిస్ నాటా 2020 రన్నరప్‌గా నిలిచిన ఆమె తన చదువును కొనసాగిస్తూనే నటనను, నృత్యాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్, రోజా, గురువు మాళిని అయ్యర్ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే నాట్యం, అభినయం వంటి కళల్లో శిక్షణ తీసుకుంటూ తన సోదరి తాన్వికతో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో నటనతో పాటు నృత్యాన్ని కొనసాగిస్తానని ఆమె వివరించారు. (శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు) -
నాటా పెయింటింగ్ పోటీ
చికాగో: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) వారి ఆధ్వర్యంలో నాటా పెయింటింగ్ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతులు సెప్టెంబర్ 7వ తేదీలోగా పెయింటింగ్‌ను పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వున్నపద్మశ్రీ గ్రహీత ఎస్వీ రామారావు.. పెయింటింగ్‌ల నుంచి 10-15 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు ఎంపిక అయిన వారితో సెప్టెంబర్ 27న ఆన్లైన్ ఫైనల్ పోటీ నిర్వహించనున్నారు. (వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం) విజేతలకు మొదటి బహుమతిగా 500 డాలర్లు, రెండవ బహుమతిగా 400 డాలర్లు, మూడవ బహుమతిగా 300 డాలర్లు, అలాగే మిగిలిన ఏడుగురికి 100 డాలర్ల చొప్పున బహుమతులు ఉంటాయి. ఈ సదవకాశం ప్రపంచంలో వున్న తెలుగు వారికీ అందరికీ! ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ 7లోగా మీ పెయింటింగ్‌ను పంపండి. ఈ పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు https://www.nataus.org/art2020 ను సంప్రదించగలరు. (ఒకేసారి 50 దేశాల్లో హనుమాన్ చాలీసా పారాయణం) -
‘నాటా’తో ఆర్కిటెక్చర్లో ప్రవేశాలు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఆప్టి ట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాం.. ఈఏడాది నిర్వహించే నాటా పరీక్షకు మరో రెండురోజులు (ఆగస్టు 16 వరకు) గడువు ఉందని.. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య దురైరాజ్ విజయ్‌కిశోర్ కోరారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయ పనుల ప్రగతి, ప్రవేశాల ప్రక్రియ గురించి ‘సాక్షి’ పలుకరించగా పలు విషయాలు పంచుకున్నారు. వైవీయూ : బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాల కోసం నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ద్వారా వచ్చే ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు. మన రాష్ట్రంలో 13 జిల్లాల విద్యార్థులు ఇక్కడ సీటును కోరుకోవచ్చు. నాటాకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. మొదటి పరీక్ష ఈనెల 29న నిర్వహించనుండగా, రెండోసారి నాటా నిర్వహించే పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ యేడాది కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే వర్చువల్ విధానంలో టెస్ట్‌కు హాజరుకావచ్చు. ఇప్పటి వరకు డ్రాయింగ్ టెస్ట్ సిలబస్ స్కిల్స్‌ను పరీక్షించేదిగా ఉండేది. ప్రస్తుతం దాన్ని అవగాహనను పరీక్షించేదిగా మార్చారు. ఈ విధానంలో అభ్యర్థి బొమ్మలు గీయాల్సిన పనిలేదు. కంప్యూటర్ ముందు కూర్చుని సమాధానాలు ఇస్తే సరిపోతుంది. బీ.ఆర్క్ కోర్సు చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు లభిస్తాయి. నవీన నిర్మాణాల్లో ఆర్కిటెక్చర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. దీంతో పాటు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా బీటెక్ ప్లానింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఫెసిలిటీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో 5 రకాల కోర్సులు ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో 5 రకాలకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ద్వారా సీట్లను భర్తీ చేస్తాం. మొత్తం మీద రెండు విభాగాల్లో కలిపి 500 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిన ప్రత్యేక కోర్సులు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విశ్వవిద్యాలయ ఏర్పాటు.. పనుల ప్రగతి.. 2020–21 విద్యాసంవత్సరం నుంచి వైఎస్ఆర్ ఏఎఫ్‌యూను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చక్కటి తోడ్పాటు ఇస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా అధికారులు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. దీంతో కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లె వద్ద దాదాపు 140 ఎకరాల మేర స్థలాన్ని గుర్తించి అప్పగిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మేము మరో 50 ఎకరాలు కావాలని కోరుతున్నాం. డిసెంబర్ నాటికి టెండర్ల దశకు వెళ్లి నూతన విశ్వవిద్యాలయాల భవన పనులను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విజయకిశోర్ తెలిపారు. తరగతుల నిర్వహణ.. ప్రారంభం.. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అనుసరించి తరగతులు ప్రారంభిస్తాం. బహుశా అక్టోబర్ చివరినాటికి తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. అత్యుత్తమ బోధకులను తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తాం. తొలుత తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు అంతర్జాతీయస్థాయిలో వసతులు, సౌకర్యాల కల్పన చేస్తాం. దీనికి సంబంధించిన సిలబస్ రూపకల్పన, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసి శాశ్వత భవనాల్లోకి వెళ్తాం. రానున్న రోజుల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. -
ఆదర్శ మాతృమూర్తులకు అవార్డ్స్ ప్రధానం
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్వర్యంలో 'మదర్స్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటా డీసీ మెట్రో వారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నలుగురు ఆదర్శ మాతృమూర్తులను గుర్తించి వారికి గౌరవ ప్రదమైన ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలతో సత్కరించడం రివాజుగా మారింది. అందులో భాగంగానే ఈసారి కూడా అమెరికా రాజధాని పరిసర ప్రాంతాల తెలుగు సేవా సంస్థలైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షురాలు కవితా చల్లా, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, వారధి అధ్యక్షురాలు పుష్యమి దువ్వూరి, ఉజ్వల ఫౌండేషన్ అధ్యక్షురాలు అనిత ముత్తోజు, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) అధ్యక్షురాలు సుధారాణి కొండపులను ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరంతా తమ కుటుంబ బాధ్యతలే కాక వృత్తి, వ్యాపారాలకు న్యాయం చేస్తూనే అనేక సేవాకార్యక్రమాలతో ఆడదంటే అబల కాదు అని నిరూపిస్తున్నారు. వారిని ఈ ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తూ మదర్స్ డే రోజున వారందరికీ ఆదర్శ మాతృమూర్తి గౌరవ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి నాటా ఉమెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి సారధ్యం వహించారు. సంధ్య బైరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని టీవీ ఏషియా తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రితిక స్వాగత గీతం పాడగా.. ఆర్వీపీ అనిత నాటా సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఆర్వీపీ చైతన్య నాటా ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్ వారికి, లోకల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్‌కు, నాటా నాయకులు సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(సంయుక్త కార్యదర్శి), బోర్డు సభ్యులు సతీష్ నరాల, కిరణ్ గుణ్ణం, బాబూ రావు సామల, కలాడి మోహన్, మీడియా మిత్రులకు, నాటా శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెలుగు రాష్ట్రాలకు నాటా విరాళం
-
నాటా ఆధ్వర్యంలో ఘనంగా బ్యాడ్మింటన్ పోటీలు
చికాగొ : నాటా ఆధ్వర్యంలో శనివారం(మార్చి 7న) అత్యంత ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రవాస భారతీయులు దాదాపు 60 మంది పాల్గొన్నారు. పోటీలో విజేతలుగా నిలిచినవారికి రంగరాజు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ డైరెక్టర్ లింగారెడ్డిగారి వెంకట్‌రెడ్డి, నాటా రీజనల్ ప్రెసిడెంట్లు పరమేశ్వర్ రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, రీజనల్ ఆర్డినేటర్లు లక్ష్మీ నారాయణ, శివశంకర్, కమ్యూనిటీ కార్యకర్తలు ఆది, వెంకటేశ్వర్లు, శివకుమాకర్రెడ్డి, సృజన తదితరులు పాల్గొని పోటీలను విజయవంతంగా నిర్వహించారు. -
వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం
మిన్నిసోటా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) వారి మిన్నిసోటా విభాగం అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం అమెరికాలోని మిన్నిసోటా రాష్త్రంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుకున్న సంఖ్యలో కంటే రెట్టింపు స్థాయిలో జనం వచ్చారని, సమస్త మహిళా లోకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభాప్రాంగణ అలంకారములు, పసందైన విందు భోజనం, చాయాగ్రహకుల కష్టం మరెన్నో విశేషాలను మహిళా లోకం ప్రస్తావించటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. "నాటా - మిన్నిసోటా" కార్యనిర్వాహక బృందం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి పడ్డ కృషిని మహిళలు గుర్తించినందుకు వినమ్ర నమస్కారం తెలియజేసింది. అదే విధంగా, ఆడవారి కోసం గత కొద్ది రోజులుగా ఎంతో సహాయసహకారాలు అందించిన మగవారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. "నాటా - మిన్నిసోటా" గుర్తించి, ఈ కార్యక్రామనికి ధనసహాయం అందించిన దాతృత్వముగల దాతలందరికీ, పేరు పేరునా శిరస్సువంచి నమస్కరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రస్తుత అధ్యక్షులుగా గోశాల రాఘవ రెడ్డి, కాబోయే అధ్యక్షులుగా కొర్సపాటి శ్రీధర్, మిన్నిసోటా విభాగం ఉపాధ్యక్షులు పిచ్చాల శ్రీనివాస రెడ్డి , ఎర్రి సాయినాథ్, ప్రాంతీయ సమన్వ్వయకర్తలుగా చింతం వెంకట్, పేరూరి రవి మరియు నారాయణ రెడ్డి, సలహాదారులుగా బండి శంకర్, చౌటి ప్రదీప్ ఉన్నారు. అదే విధంగా, ఈ కార్యక్రమ నిర్వాహణలో మూర్తి (అలంకరణ), వసుంధర రెడ్డి, దేవరపల్లి సౌజన్య, వుయ్యూరు మాలతి, చీకటి శైల, మిక్కిలినేని జయశ్రీ, బుడగం ప్రవీణ్, యడ్డాల ప్రతీప్ ఎంతగానో కష్టపడి ముఖ్య భూమికను పోషించారు. -
నాటా వేడుకలకు సీఎంకు ఆహ్వానం
సాక్షి,అమరావతి: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి జి.నారాయణరెడ్డి, పీఆర్వో డీవీ కోటిరెడ్డి సీఎంను కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. -
సీఎం జగన్‌తో ‘ఆస్క్ ఏ క్వశ్చన్ టు సీఎం’
వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం.. సీఎం జగన్ నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) ఉంటుంది. అనంతరం డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఇక సీఎంతో సమావేశం నేపథ్యంలో నాటా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను సంప్రదించి.. సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఓ వెబ్సైట్ రూపొందించింది. ఈ కింది లింక్ ద్వారా సీఎం జగన్‌ను ప్రశ్నలు అడగొచ్చు. https://www.cmysjaganusa2019.com/#ask_question -
న్యూజెర్సీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో తందూరి ఫ్లేమ్స్ రెస్టారెంట్లో ఈ వేడుకలు జరిగాయి. వందలాది మంది వైఎస్సార్ అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా వైఎస్సార్ లాగే పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ 50 రోజుల పాలన చాలా బాగుందని ప్రశంసించారు. సీఎం జగన్ అమెరికా పర్యటన కోసం వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యూఎస్ఏ కన్వీనర్ కడప రత్నాకర్, వైఎస్సార్ పౌండేషన్ కోర్ సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి గాగసాని, వైఎస్సార్సీపీ యూఎస్ఏ కోర్ టీమ్ సభ్యులు డాక్టర్ త్రివిక్రమ భానోజ్రెడ్డి, పార్సిప్పనీ టౌన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, ఐఏసీసీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఐఏసీసీ అధ్యక్షుడు దుత్తారెడ్డి,, నాటా వర్కింగ్ కమిటీ సభ్యులు, వైఎస్సార్ పౌండేషన్ కమిటీ సభ్యులు, ఆటా వర్కింగ్ కమిటీ సభ్యులు, డాక్టర్ వాసుదేవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) బృందం కలిసింది. వెలగపూడిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నాటా సభ్యులు ఆయన ఛాంబర్లో కలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే ‘నాటా’ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు నాటా సభ్యులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ మేకా శివ, ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్ మల్లు ప్రసాదరెడ్డి ఉన్నారు. -
‘నాటా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
నార్త్ కరోలినా: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహిళా దినోత్సవ వేడుకలను షార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాటా ప్రెసిడెంటు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాటా తలపెట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 300పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం సమీరా ఇళ్ళెందుల యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అనురాధా పన్నెం దర్శకత్వం లో ప్రదర్శించిన నాటికఅందరిని కడుపుబ్బ నవ్వించింది. సునీత సౌందరరాజన్ చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో హుందాగా సాగింది. దుర్గా శైలజ దలిపర్తి, లావణ్యకోనురి ఆధ్వర్యంలో సాగిన నాట్య విన్యాసాలు అందరిని ఆనందపరిచాయి. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట’ ను ఆచరిస్తూ ఆటపాటలే ముఖ్యోద్దేశం కాకుండా సేవాతత్వం తో విరాళాలు సేకరించారు. షార్లెట్ లో స్వచ్చందం గా సేవలు అందించే లిల్లిపాడ్ హేవన్ అనే సంస్థకి ఆ విరాళాలు అందించారు. ఈ మహిళా దినోత్సవం లో పాలుపంచుకొన్న మహిళలందరూ నాటా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారని ప్రధాన కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ రామిరెడ్డి తెలిపారు. -
నాటా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
వాషింగ్టన్ డిసి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు . చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీడీఎప్, జీడబ్యూటీసీఎస్(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు. -
బాధిత విద్యార్థులకు ‘నాటా’ న్యాయసహాయం
న్యూజెర్సీ : ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (నాటా) ముందుకొచ్చింది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఫేక్ అని తెలియక చాలా మంది విద్యార్థులు మోసపోయారని నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. బాధితుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) అరెస్టయిన వారిలో చాలామంది తమ వర్క్ పర్మిట్ పొందడానికి ఈ యూనివర్సిటీలో చేరానని వెల్లడించారు. బాధిత విద్యార్థులు నాటాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం అందిస్తామని నాటా నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డిగారి, సంతోష్‌రెడ్డి సోమిరెడ్డి, యాయా తిబిట్ బాధిత విద్యార్థులతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వలసదారుల హక్కులేమిటో తెలిపారని, మళ్లీ ఇలాంటి ఘటనల్లో బాధితులు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారని తెలిపారు. తల్లిదండ్రులు భయపడొద్దు.. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని నాటా నాయకులు తెలిపారు. విచారరణ పూర్తయిన అనంతరం విద్యార్థుల భారత్‌కు పంపుతారని వెల్లడించారు. హోమ్ ల్యాండ్ సెక్యురిటీ శాఖ నిర్బంధంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భరోసానిచ్చారు. వివరాలు తెలుసుకోవాలంటే.. అరెస్టయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov వెబ్సైట్లో లేదా ఇండియన్ ఎంబసీ వారికి {(202) 322-1190, (202) 340-2590} ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివరాలకోసం.. cons3.washington@mea.gov.in కి ఈమెయిల్ చేయవచ్చని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులా ఫేక్ యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా.. అన్ని రూల్స్ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి OPT/CPT పొందడం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు. ఎటువంటి కోర్లులు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా CPT అందించినట్టయితే అలాంటి వర్సిటీలను నమొద్దని హెచ్చరించారు. 129 మంది భారతీయులే.. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. -
నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ రాఘవరెడ్డి
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రాఘవరెడ్డి గోశాల బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఎన్నికైన నాటా కార్యవర్గ సభ్యులతో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమసాగర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కమిటీలో రాఘవరెడ్డితోపాటు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, బాలా ఇందుర్తి, ఆళ్ల రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి, సోమ వరపు శ్రీనివాసులురెడ్డి, శివ మేక, గంగసాని రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి కొట్లూరు, రమణారెడ్డి క్రిస్టపాటి, కోటిరెడ్డి బుర్ల, శ్రీనివాస్‌రెడ్డి కానుగంటి, పెనుమాడ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. డాక్టర్ రాఘవరెడ్డి గోశాల ప్రస్థానం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కొండమీది కొండూరు గ్రామంలో రైతు కుటుంబంలో రాఘవరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన ఉన్నత విద్యకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు. వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాటా ద్వారా అమెరికాలోని తెలుగువాళ్లకే కాకుండా ఏపీ, తెలంగాణల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాఘవరెడ్డి నాటా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏటా సొంత ఊరికి వచ్చి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటారని, ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కాదనకుండా చేస్తారని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. -
నాటా నూతన కార్యవర్గం ఎన్నిక
-
నాటా నూతన కార్యవర్గం ఎన్నిక
న్యూజెర్సీ : న్యూజెర్సీలోని అట్లాంటిక్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని కొత్తగా ఎంపికైన డా. రాఘవరెడ్డి గోసలకి అప్పగించారు. రెండేళ్లకోసారి జరిగే నాటా కన్వెన్షన్‌ని 2020లో అట్లాంటిక్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. కార్యనిర్వాహక కమిటీ : డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(అధ్యక్షులు), కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(కాబోయే అధ్యక్షులు), బాలా ఇందుర్తి(కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు), ఆళ్ళ రామిరెడ్డి(ప్రధాన కార్య నిర్వహణ అధికారి), గండ్ర నారాయణ రెడ్డి(కోశాధికారి), సోమవరపు శ్రీనివాసులు రెడ్డి (జాయింట్ సెక్రటరీ), శివ మేక (జాయింట్ ట్రెజరర్), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (మాజీ అధ్యక్షులు), శ్రీనివాస రెడ్డి కొట్లూరు(కార్యనిర్వహణాధికారి), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), కోటి రెడ్డి బుర్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ రెడ్డి కానుగంటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) పెనుమాడ శ్రీకాంత్ రెడ్డి(కన్వెన్షన్ సలహాదారు) అడ్వైజరీ కౌన్సిల్ : డాక్టర్ ప్రేమ్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్), డాక్టర్ మోహన్ మల్లం (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), ఏ వీ ఎన్ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ స్టాన్లీ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు) నాటా కన్వెన్షన్ 2020: హరి వేల్కూర్(కన్వీనర్), మందపాటి శరత్ రెడ్డి(సమన్వయకర్త), అన్నా రెడ్డి(కన్వెన్షన్ జాతీయ కో ఆర్డినేటర్) ఇండియా కో ఆర్డినేటర్లు : డా. ద్వారకానాత రెడ్డి(ఇండియా కో ఆర్డినేటర్), రమా దేవి(తెలంగాణ), రఘునాథ రెడ్డి గజ్జల(ఆంధ్రప్రదేశ్), ఎమ్. దయాసాగర్ రెడ్డి(కర్నాటక), డీవీ కోటి రెడ్డి(మీడియా, పీఆర్) -
మన బడికి ప్రతిష్టాత్మక నాటా పురస్కారం
కాలిఫోర్నియా : గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 'విద్యా ప్రదాయని' పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్ వేదిక మీద నాటా అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్ ప్రేం కుమార్ రెడ్డి, అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తదుపరి అధ్యక్షులు రాఘవ రెడ్డి తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాలకు పైగా అమెరికా, కెనడాలతో పాటు 10 ఇతర దేశాలలో 35,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్సైట్ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 'భాషాసేవయే భావితరాల సేవ' అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలూ కృషి చేస్తుందని అన్నారు. -
విష్ణుప్రియకు సన్మానం
న్యూజెర్సీ : కళాభారతి న్యూజెర్సీ ఆధ్వర్యంలో నాటా ఐడల్-2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణుప్రియ కొత్తమాసును ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర తెలుగు సంఘాల పెద్దలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో విష్ణుప్రియా కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. ఈ వేడుకలకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణుప్రియకు తన తర్వాతి చిత్రంలో గాయనిగా అవకాశం ఇవ్వనున్నట్లు కళ్యాణ్ మాలిక్ ప్రకటించారు. అనంతరం అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రముఖులు విజేతను అభినందించారు. చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ కళాభారతి జరిపిన కార్యక్రమం ఎంతో బాగుందని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటంలో కళాభారతి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, హోలీ, దీపావళి వంటి పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన చిన్నతనం నుంచి పాల్గొంటున్న విష్ణుప్రియ ఈ అవార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని విజయాలను అందుకోవాలని కళాభారతి సభ్యులు, పెద్దలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు అతిథులను అలరించాయి. -
కోన రఘుపతిని సత్కరించిన ఎన్నారైలు
వాషింగ్టన్ డీసీ : నాటా సభలకు హాజరైన వైఎస్సార్సీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఘనంగా సత్కరించారు. పిలిచిన వెంటనే.. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతిని శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఎళ్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ.. నాటా కోరిక మేరకు సభలో పాల్గొన్నందుకు వచ్చినందుకు కోన రఘుపతికి కృతజ్ఞతలు తెలిపారు. -
కోన రఘుపతిని సత్కరించిన నాటా సభ్యులు
-
ప్రొఫెసర్ సాంబరెడ్డికి నాటా సత్కారం
ఫిలడెల్పియా : ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డిని నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఘనంగా సత్కరించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్‌లో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, వైద్యరంగంలో డా. సాంబరెడ్డి చేసిన సేవలను కొనియాడి శాలువాతో సత్కరించారు. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి. -
అలరించిన నరాల రామారెడ్డి అష్టవధానం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా సభల్లో నరాల రామారెడ్డి అష్టవధానం అందరిని ఆకట్టుకుంది. నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి నరాల రామారెడ్డిని వేదికపైకి ఆహ్వానించగా, సభాధ్యక్షత వహించిన డా. వడ్డేపల్లి కృష్ణ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి గౌరవఅతిథిగా హాజరయ్యారు. దత్త పదిగా తానా, ఆటా, నాటా, అమెరికా అను పదాలతో భారతార్థంలో గూడూరి శ్రీనివాస్ పృచ్ఛకునిగా శార్దూల వృత్తాన్ని కోరగా అవధాని చమత్కారంగా పూరించారు. 'రంగమ్మ నిను వీడ జాలనియోన్ రాముడు విభ్రాంతుండై' అన్న సమస్యను డా. పుట్టపర్తి నాగపద్మిని ఇవ్వగా 'సారంగమ్మా' అను సంభోధనతో అవధాని మాయలేడిని వర్ణిస్తూ సమస్యను పూరించి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు. మిగతా పృచ్ఛకులుగా వర్ణన- జయదేవ్, ఆశువు-డా. ఆడువాల సుజాత, న్యస్తాక్షరి- అశోక్, ఘంటసాల-ఆదినారాయణ, అప్రస్తుత ప్రసంగం- సదాశివ రాంపల్లి నిర్వహించారు. నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వరరెడ్డి అవధాని డా. నరాల రామారెడ్డి, పృచ్ఛకులందరినీ శాలువాతో సన్మానించారు. -
ఫిలడెల్ఫియాలో ఘనంగా నాటా సాహిత్య సమావేశాలు
ఫిలడెల్ఫియా : జూలై 7, 8 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా - 2018 కన్వెన్షన్‌లో భాగంగా సాహిత్య కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ 'భాషా - సాహిత్యం - సమాజం' సెషన్ తిమ్మాపురం ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సెషన్లో తెలుగులో శాస్త్రీయ సాహిత్యం, వైజ్ఞానిక సాహిత్యం ఆవశ్యకతను గురించి నరిసెట్టి ఇన్నయ్య ప్రసంగించారు. భారతీయ సాహిత్యంలో తెలుగు భాషా స్థానం గురించి హిందీ నుంచి తెలుగులోకి అనేక అనువాదాలు చేసిన ఢిల్లీకి చెందిన లక్ష్మిరెడ్డి సోదాహరణంగా మాట్లాడి సభికులను ఆలోచింప చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తీరు తెన్నులు, అకాడమీ చేసిన మంచి పనులు, అకాడమీ నిర్వహణలో సాధక బాధకాల గురించి దుగ్గిరాల సుబ్బారావు వివరించారు. తమిళ నాట తెలుగు భాషా ఉద్యమం గురించి నంద్యాల నారాయణ రెడ్డి ఆవేశంతో, ఆవేదనతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 'తెలుగు సాహిత్యంలో భిన్న దృక్పథాలు' సెషన్లో వక్తల ప్రసంగాలతో పాటు, పుస్తాకావిష్కరణలు, స్వీయకవితా పఠనం జరిగాయి. రచయిత్రి కల్పనా రెంటాల అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విక్రంసింహపూరి విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సీఆర్ విశ్వేశ్వర రావు ఇంగ్లీష్ లోవచ్చిన తెలుగు అనువాదాల గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. పుట్టపర్తి వారి అభ్యుదయ వాదం గురించి వారి కుమార్తె, విదుషీమణి పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి వారి మహోన్నత వ్యక్తిత్వం పరిచయం చేశారు. ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణికి రచయిత్రి కల్పనారెంటాల నివాళి ప్రసంగం చేశారు. యడ్లపల్లి భారతి 'ఎడారి బతుకులు' వడ్డేపల్లి కృష్ణ తెలుగు కవిత్వానికి ఇంగ్లీష్ అనువాదాల పుస్తకం, తదితర పుస్తకావిష్కరణలు జరిగాయి. నాటా సాహిత్య కమిటీ చైర్ మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్ ఆధ్వర్యం లో జరిగిన ఈ సెషన్స్ సాహిత్యాభిమానులను అలరించాయి. -
నాటా వేడుకల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి కోరారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన ‘నాటా’ మహా సంబరాల్లో ఆయన మాట్లాడారు. నాటా సంబరాల్లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, అనిల్‌కుమార్ యాదవ్, గౌరు చరితారెడ్డి, కోన రఘుపతి, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా ‘యాత్ర’ టీజర్‌ను ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. -
‘రాజధాని పేరిట వసూళ్లకు పాల్పడ్డారు’
సాక్షి ప్రతినిధి: అమరావతి నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఎన్నారైలు మండిపడ్డారు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు హోస్ట్‌గా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో నాటా పొలిటికల్ డిబేట్(ఆంధ్ర ప్రదేశ్) జరిగింది. ఈ చర్చాకార్యాక్రమంలో ఎన్నారైలతోపాటు మాజీ ఎంపీలు సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కోరుముట్ల, ఇంకా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ తీరుపై ఎన్నారైలు, నేతలు విమర్శలు గుప్పించారు. అమరావతి పేరిట మోసం.. రాజధాని నిర్మాణం పేరిట తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని పలువురు ఎన్నారైలు మండిపడ్డారు. ‘అమరావతి నిర్మాణం అంటూ డబ్బు వసూలు చేశారు. ఇప్పటి వరకు లెక్క లేదు. భవనాలు కట్టలేదు. ఇది మోసం కాదా?.. నిధుల విషయంలో టీడీపీ-బీజేపీలు దొంగాట ఆడుతున్నాయి’ అని వాళ్లు పేర్కొన్నారు. వైసీపీ నేతల స్పందన... ‘హోదా కోసం రాజీనామా చేశాం. టీడీపీ ఎంపీలు కలిసి వస్తే కేంద్రం స్పందించేది. పోలవరం ప్రాజెక్టులో ట్రక్కు మట్టి తీయటానికి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు’ అని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ మిథున్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా వైఎస్సార్ సీపీకి సమానమేనని వైసీపీ నేత శిల్పా చక్రపాణి తెలిపారు. ‘నంద్యాల లో టీడీపీ ఏం చేసిందో నాకు తెలుసు. 2016 వరకు హోదాపై మాట కూడా మాట్లాడొద్దని నాడు పార్టీ నేతలకు ఆదేశాల ఇచ్చారు’ ఆయన చక్రపాణి పేర్కొన్నారు. ‘నంద్యాల తరహా ఎన్నిక చేస్తామని టీడీపీ ప్రచారం చేస్తోంది, మరి బీజేపీ ఎందుకు అప్పుడు స్పందించలేదు??’ నారుమిల్లి పద్మజ అన్నారు.. ‘జర్మనీని హిట్లర్ నాశనము చేస్తున్నారని చుట్టూ ఉన్న వాళ్లు చెబితే జర్మన్లు నమ్మలేదు, ఇప్పుడు అమరావతిలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని’ కృష్ణ దేవరాయ తెలిపారు. చంద్రబాబు అంటేనే మోసం... ‘చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మమ్మల్ని మోసం చేసింది. చంద్రబాబు గతంలో వాజ్‌పేయిని మోసం చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో అదే తీరును ప్రదర్శించారు. ఇకపై ఎప్పటికీ ఏ పార్టీ కూడా బాబును నమ్మొద్దు’ అని బీజేపీ నేత విలాస్ సూచించారు. -
నాటా పొలిటికల్ డిబేట్లో రసాభాస
-
రేవంత్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పెన్సిల్వేనియాలో(యూఎస్ఏ) జరిగిన నాటా(NATA) పొలిటికల్ డిబేట్(తెలంగాణ) రసాభాసగా ముగిసింది. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక పరిస్థితిలో పరిస్థితి చెయ్యి దాటి ఉద్రిక్తంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత కృష్ణ సాగర్, మరికొందరు నేతలు ఈ డిబేట్లో పాల్గొన్నారు. అయితే విపక్ష నేతలు టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసిన క్రమంలో వ్యవహారం కాస్త ముదిరింది. టీఆర్ఎస్ పాలనపై విమర్శలు... చర్చాకార్యక్రమంలో ముందుగా మధు యాష్కీ మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైన్ వ్యవహారంపై మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట కోట్ల ప్రజా ధనాన్ని టీఆర్ఎస్ సర్కార్ వృధా చేస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం?.. మిషన్ కాకతీయ భవిష్యత్‌లో మిషన్ కల్వకుంట్ల కాకూడదని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్‌దే. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయబోమని సోనియా ఆనాడే స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ, కేసీఆర్ ఆ క్రెడిట్ మొత్తం లాగేసుకున్నారు.’ అని విమర్శించారు. దీనికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ నేతల ఆరోపణలు పస లేనివని.. గాంధీభవన్ నుంచి వచ్చే విమర్శలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత కృష్ణ సాగర్ మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికి రావట్లేదు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యారు. అది వర్క్ ఫర్ హోమ్ కూడా’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకానోక టైంలో రేవంత్-జగదీశ్‌లు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటంతో డిబేట్ వేడెక్కింది. వారిని శాంతిపజేసేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని హోస్ట్(సాక్షి కన్సల్టెంట్ ఎడిటర్) ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తమపైనా దురుసు వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారైలు ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాహకులు పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
జూలై 6 నుంచి నాటా ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆధ్వర్యంలో జూలై 6 నుంచి 8 వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుపనున్నట్టు నాటా ప్రతినిధులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతులతో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని.. హిందూ సంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా కళ్యాణం జరిపించడానికి టీటీడీ నుంచి వేద పండితులు జీఏవీ దీక్షితులు, కే పురుషోత్తం ఆచార్యులు ప్రత్యేకంగా వస్తున్నారని వెల్లడించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం ఇవ్వనున్నామన్నారు. కళ్యాణ సమయంలో గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనల రూపంలో శ్రీనివాసుని కళ్యాణ ప్రశస్తిని భక్తులకు వివరిస్తారని.. చైతన్య సోదరుల గాత్రం, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం మృదంగం, సత్యనారాయణ శర్మ వయోలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగే తెలుగు మహాసభల నిర్వహకులు ఎందరో కార్యకర్తలు అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా ఈ కళ్యాణంలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం nata2018.org వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని తెలియజేశారు. -
జూలై 7న నాటా మీట్ అండ్ గ్రీట్
వాషింగ్టన్ డీసీ : ఫిలడెల్ఫియాలో నాటా కన్వెన్షన్‌లో జూలై 7న జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్దమొత్తంలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ యూఎస్ఏ కమిటీ కోరింది. నాటా ఎలక్ట్ ప్రెసిడెంట్ డా. రాఘవ రెడ్డి గోసాల, నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్‌రెడ్డి గంగసాని, వైఎస్సార్ ఫౌండేషన్ యూఎస్ఏ ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డిలు అందిస్తున్న సహకారానికివైఎస్సార్సీపీ యూఎస్ఏ కన్వీనర్లు డా. వాసుదేవరెడ్డి ఎన్, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, రత్నాకర్ పండుగాయల, మధులిక చవ్వ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొననున్నారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు. -
నాటా ఉత్సవాల్లో నరాల రామారెడ్డి అష్టవధానం
వాషింగ్టన్ డీసీ : తన పదహారవఏటనే అవధానం ప్రారంభించిన నరాల రామారెడ్డి నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు అష్టవధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు. అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరై విజయవంతం చేయాలని నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి కోరారు. అవధాన చరిత్ర : తెలుగు సాహిత్యనందనోద్యానంలో విలక్షణంగా వికసించిన పుష్పం అవధానం. ఇది పద్యకవితా సుమగంధాలను విరజిమ్ముతుంది. చమత్కారమకరందాలను చిందిస్తుంది. భారతీయ భాషల్లో కేవలం తెలుగు బాషలోనే రూపుదిద్దుకున్న ప్రక్రియ అవధానం ఇది తెలుగువారి సొంతం. సంస్కృత భాష లో వున్న "సమస్యాపూరణం" అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని 1854 సంవత్సరంలో మహా పండితులు మాడభూషి వేంకటాచార్యులు “సమస్య” అనే అంశానికి "నిషిద్ధాక్షరి దత్తపది, వ్యస్తాక్షరి, మొదలైన అంశాలను జోడించి " "అష్టావధానం" అనే పక్రియను రూపకల్పన చేశారు. అవధాన ప్రాశస్త్యం : మాడభూషి వారి మార్గ దర్శకత్వంలో జంటకవులైన తిరుపతి వేంకట కవులు తెలుగు ప్రాంతమంతట జైత్రయాత్ర సాగించి అవధాన పక్రియను జన బాహుళ్యంలోకి తెచ్చారు. "అష్టావధాన కష్టాలంబనమన్న నల్లేరుపై బండిన డక మాకు శతావధాన విధాన సంవిదానంబన్న షడ్రసోపేత భోజనము మాకు" అని తిరుపతి కవులు అవధానరంగంలో సింహాల్లా విజృంభించారు. అష్టావధానంలొ ఎనిమిది అంశాలుంటాయి. సమస్యాపూరణం , దత్తపది అనే అంశాలు అవధాని చమత్కార ప్రతిభను పరీక్షిస్తాయి. నిషిద్దాక్షరి, వ్యస్తాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. ఘంటాగణనం, పురాణపఠనం అవధాని ఏకాగ్రతను పరీక్షిస్తాయి. వర్ణన ఆశుకవిత అవధాని కవితా కౌశల్యాన్ని పరీక్షిస్తాయి. అవధానం చేసే వ్యక్తికి ధార (Flow), ధారణ ( preservation ), ధిషణ (talent), ధోరణి (presence of mind), ధైర్యం (courage) అనే పంచధకారాలు ఉండాలని విజ్ఞులు చెప్పారు. -
నాటా సభలకు లక్ష్మీపార్వతి
సాక్షి,హైదరాబాద్ : నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఉమెన్స్ ఫోరం ఆహాన్వం మేరకు అమెరికాలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే నాటా సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా నాటా మహాసభల్లో నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 10న డెట్రాయిడ్ చేరుకుని అక్కడ ట్రాయి అసోసియేషన్ వారిని కలుస్తారు. 15న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారు ఏర్పాటు చేసే ఓ కార్యక్రమం లో పాల్గొంటారు. అక్కడ ఎన్టీఆర్ బయోగ్రఫీ ఫస్ట్‌పార్ట్ పుస్తకాన్ని విడుదల చేస్తారు. అక్కడ నిర్వాహకులు ఆమెకు సన్మానం చేయనున్నారు. తర్వాత వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్సీపీ నేత రమేశ్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 25న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. -
వేడుకలకు సిద్ధమైన నాటా
-
సంబరానికి నాటా సై..!
సాక్షి, హైదరాబాద్: సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కనీవినీ ఎరుగని రీతిలో వేడుకలకు సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా జూలై 6, 7, 8 తేదీల్లో జరగనున్న నాటా మహా సభలకు 13 వేల మంది హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహావృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. రెండేళ్లకోసారి కన్వెన్షన్ నిర్వహిస్తున్న నాటా.. 2016లో డాలస్‌లో, ఈసారి ఫిలడెల్ఫియాలో వేడుకలు నిర్వహిస్తోంది. సామాజిక సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్నాం. ఈసారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13 వేల మంది రానున్నారు. ఒకే గొడుగు కిందకు వస్తున్నాం: డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ నాటాతో ఎన్నారైలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రాంతీయ భేదాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. నేను నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. అమెరికాకు వచ్చి అతిపెద్ద ఆస్పత్రుల నెట్వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45 వేల అమెరికన్లకు ఉద్యోగాలిచ్చా. నాటా వేదికగా వైఎస్సార్ జయంతి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నాటా వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. -
జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు
ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు జరుగనున్నాయని నాటా లిటరరీ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి జయదేవ్, కో- చైర్ తిమ్మాపురం ప్రకాష్ తెలిపారు. కమిటీ సభ్యులు ఆదినారయణరావు రాయవరపు, శ్రీనివాస్ సోమవారపు, కమిటీ సలహదారులు శరత్ వేట, తిరుపతి రెడ్డిలతో చర్చించి నాటా సాహిత్య సభల షెడ్యూల్‌కు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం నుంచి మీడియా సాహిత్యం వరకూ జరిగే మొత్తం 5 సెషన్లలో ప్రముఖ రచయితలూ, విమర్శకులూ పాల్గొననున్నారు. ప్రతి సెషన్ మధ్యలో స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉండనున్నాయి. జూలై 7 శనివారం రెండు సాహిత్య సెషన్లు జరుగుతాయి. మొదటి సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ప్రొఫెసర్ అఫ్సర్ అధ్యక్షతన 'తెలుగు ప్రసార మాధ్యమాల సాహిత్య కృషి' అనే అంశంపైన జరుగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తెలుగు అచ్చు పత్రికలు- సాహిత్యం అనే అంశం మీద ప్రొఫెసర్ అఫ్సర్, అంతర్జాలంలో తెలుగు పత్రికల సాహిత్య కృషి గురించి ప్రముఖ కవి, విమర్శకులు, ఎడిటర్ రవి వీరెల్లి, ఎలక్ట్రానిక్ మీడియా : మన సాహిత్యం అనే అంశం గురించి డాక్టర్ నరసింహ రెడ్డి దొంతి రెడ్డి, తెలుగు సినిమా సాహిత్యం గురించి ప్రసిద్ధ సినిమా కవి వడ్డేపల్లి కృష్ణ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. రెండో సెషన్ ౩ గంటల నుంచి 5 గంటల వరకు 'అమెరికా తెలుగు సాహిత్యం - కొత్త ధోరణులు' అనే అంశం మీద జరుగుతుంది. ప్రముఖ కవి, విమర్శకులు నారాయణ స్వామి వెంకట యోగి సభకి అధ్యక్షత వహిస్తారు. నారాయణ స్వామి 'అమెరికా తెలుగు సాహిత్యంలో రూపం సారం' అనే అంశం గురించి మాట్లాడతారు. అమెరికాలో తెలుగు సాహిత్య సంఘాలు చేస్తున్న కృషి, కొత్త తరం సాహిత్య సృష్టిలో ఆ సంఘాల పాత్ర గురించి ప్రసిద్ధ రచయిత, వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టెన్ రాజు ప్రసంగిస్తారు. కెనడా సాహిత్య ప్రముఖులు సరోజా కొమరవోలు అమెరికా తెలుగు రచనల విశ్లేషణ అందిస్తారు. అమెరికాలో తెలుగు కథ: కొత్త ధోరణుల గురించి ప్రసిద్ధ కథకులు శివకుమార్ శర్మ తాడికొండ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. జూలై 8 ఆదివారం ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు అవధాని సార్వభౌమ, అవధాని కంఠీరవ నరాల రామారెడ్డి అవధానంతో రెండో రోజు సాహిత్య కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఓ భిన్నమైన అంశం మీద ప్రసంగాలతో రెండో సమావేశం మొదలవుతుంది. కేవలం సాహిత్యం మాత్రమే కాకుండా, ఆ సాహిత్యానికి వెన్నెముక లాంటి భాష, సమాజాలతో సాహిత్యానికి ఉండే సంబంధాల గురించి 'భాష - సాహిత్యం - సమాజం' సెషన్ ఉంటుంది. ఇందులో సాహిత్యంలో శాస్త్రీయ విలువల గురించి ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య, భారతీయ సాహిత్యంలో తెలుగు భాష స్థానం గురించి ప్రముఖ అనువాదకులు లక్ష్మి రెడ్డి, కేంద్రీయ సాహిత్య అకాడమీ తీరు తెన్నుల గురించి సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, అనువాదకులు దుగ్గిరాల సుబ్బారావు, తమిళనాట తెలుగు ఉద్యమానికి అంకితమైన నంద్యాలరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఉద్యమ స్వభావాన్ని గురించి మాట్లాడతారు. ఈ సెషన్ తరువాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. 'వర్తమాన సాహిత్యం- భిన్న దృక్పథాలు'అనే సెషన్లో ప్రసిద్ధ రచయిత్రి, సారంగ సాహిత్య పత్రిక ఎడిటర్ కల్పనా రెంటాల 'మన సాహిత్యం స్త్రీలూ పురుషులూ' అనే అంశం మీద మాట్లాడతారు. ఇంగ్లీషులోకి తెలుగు అనువాదాల గురించి ప్రముఖ విద్యావేత్త సి. ఆర్. విశ్వేశ్వర రావు, పుట్టపర్తి అభ్యుదయ వాదం గురించి మహాకవి పుట్టపర్తి కుమార్తె, నాగపద్మిని పుట్టపర్తి మాట్లాడతారు. ఇదే సెషన్ లో ప్రముఖ విద్యావేత్త జే. ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి. -
నాటా వేదికగా హోదా ఆవశ్యకత
వాషింగ్టన్ డీసీ : నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహా సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యకతను చాటి చెపుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. నాటా సభలు జరగనున్న ఫిలడెల్ఫియాకు జులై 5 కల్లా వైఎస్సార్ కాంగ్రెస్ బృందం రానుందని పార్టీ గవర్నింగ్ కౌన్సిల్ రమేష్ రెడ్డి వల్లూరు, పార్టీ యూఎస్ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల తెలిపారు. హోదా పోరులో ఏపీలో, ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ఎన్నారైల ముందుంచుతామని, నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ ఎలా వెన్నుపోటు పొడిచారో వివరిస్తామని తెలిపారు. మహానేత వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకు అమెరికా కమిటీ ఆహర్నిశలు కష్టపడుతుందన్నారు. ప్రజలందరికీ మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను నాటా వేదికగా వేలాది మంది ఎన్నారైలకు చాటి చెపుతామన్నారు. జులై 8, 2018 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ సిపి యూఎస్ఏ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని చంద్రబాబు ప్రలోభపెట్టి ఏ విధంగా పార్టీ ఫిరాయించేలా చేశారో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వివరిస్తారని తెలిపారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు. -
వేడుకలకు సిద్ధమవుతున్న నాటా
-
సెయింట్ లూయిస్‌లో ఘనంగా మెగా నాటా డే వేడుకలు
సెయింట్ లూయిస్ : ఫిలడెల్ఫియాలో జులైలో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి ముందు సెయింట్ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్, మాథ్స్ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఈవెంట్లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు. స్థానిక గాయకులు మాధురి గాజుల, సుమ ఆరెపల్లి, సాహితి ముంగండిలు కెనడా నుంచి వచ్చిన ధీరజ్ బాల్ర, న్యూజెర్సీ నుంచి వచ్చిన దీప్తి నాగ్‌లతో కలిసి తమ గాత్రంతో అభిమానులను హోరెత్తించారు. ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకు జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి వచ్చి విజయవంతం చేయాలని సెయింట్ లూయిస్ తెలుగు కమ్యునిటీవారిని నాటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి కోరారు. మెగా నాటా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ బృందంవారికి కృతజ్ఞతలు తెలిపారు. డీజే రవి జూలకంటి, ఈవెంట్ మేనేజ్మెంట్ స్టేజ్ డిజైనర్ కుమార్ రెడ్డి, ఎంసీ నిక్కి భూమా, హన్సితా తెలుగుంట్ల, నర్సిరెడ్డి ఉప్పునూరిలతో పాటూ వాలంటీర్లు ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డల్లాస్‌కు చెందిన తిరుమల రెడ్డి కుంభం(ఫైనాన్సియల్ సర్వీస్ మానియా), అట్లాంటాకు చెందిన డా. ధనుంజయ రెడ్డి గడ్డం(షెపర్డ్ యానిమల్ హాస్పిటల్)లు ఉన్నారు. -
అనుమతి లేకుండా ఫొటో వేస్తారా?: యాంకర్ రష్మి
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)పై బుల్లితెర హాట్ యాంకర్, నటి రష్మిగౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో నాటా నిర్వహించే ఓ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇలా తన అనుమతి లేకుండా ఫొటోలు వేయడం ఇదే తొలి సారి కాదన్నారు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చూసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలను గుర్తించిన కొందరు ట్విటర్లో తనకు ట్యాగ్ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు. ఇక నాటా నిర్వహించే ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, డైరెక్టర్ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతున్నట్లు నిర్వాహకులు కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. How can they put me up here as a guest when no one even asked me in the very 1st place and this isn’t the 1st time y dont these organisations actually check for the official acceptance letter before putting the pics up can some one find and tag this association pic.twitter.com/DRFwldDyO2 — rashmi gautam (@rashmigautam27) May 20, 2018 @natatelugu to who so ever concern... no one approached me for this event and May I request the management to pls check with the artist for an official acceptance letter before starting the publicity @nriwala #nataconvention2018 pic.twitter.com/3KWd1tqxIE — rashmi gautam (@rashmigautam27) May 20, 2018 -
లఘు చిత్ర దర్శకుడికి నాటా ఆహ్వానం
లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్ కుమార్‌కు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోషియేషన్) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్ కుమార్ పాల్గొననున్నారు. డాక్టర్ అయిన ఆనంద్ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. హార్మోన్స్ సినిమాతో దర్శకుడి పరిచయం అయిన ఆనంద్, తరువాత లఘు చిత్రాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఆనంద్ రూపొందించిన ప్రజా హక్కు, అన్ టచ్ ఎబిలిటీ లాంటి షార్ట్ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరు తేజ్ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు నాటా ఫిలడెల్ఫియాలో నిర్వహించబోయే మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానం అందింది. జూలై 6 నుంచి 8 వరకు జరగబోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. -
నాటా తెలుగు మహాసభలను విజయవంతం చేయండి
-
నాటా మహాసభలకు రావాలని వైఎస్ జగన్‌కు ఆహ్వానం
-
నాటా మహాసభలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
అమరావతి బ్యూరో : నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహాసభల్లో పాల్గొనాల ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం నిడమోలు వద్ద పాదయాత్ర సాగిస్తున్న జగన్‌ను నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసానిరెడ్డి కలిశారు. నాటా మహాసభల ఆహ్వాన లేఖను ఆయనకు అందజేసి.. సభల్లో పాల్గొనాలని కోరారు. మహాసభలు జూలై 6 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి. -
సాహిత్య పోటీలకు నాటా ఆహ్వానం
ఫిలడెల్ఫియా : నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆహ్వానం పలికింది. సారంగ వెబ్ సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు. ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 15 వేలు, రెండో బహుమతికి రూ. 10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు ఇవ్వనున్నారు. కవితల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 5 వేలు, రెండో బహుమతికి రూ. 3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు. జూన్ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది. పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు. రచనలు Literaty@nata2018.org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఉత్సవాలకు హాజరు కావాలసిందిగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం అందింది. 2018 జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నాటా ఉత్సహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాటా కమిటీ మంగళవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలుసుకుంది. నాటా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా నాటా బృందం విజ్ఞప్తి చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో నాటా అధ్యక్షులు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి. రాఘవరెడ్డి (ఎలక్ట్), శ్రీదర్ కొర్రపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్. నారాయణరెడ్డి, మనోహర్ తదితరులు ఉన్నారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
-
నాటా ఆధ్వర్యంలో వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
హన్మకొండ చౌరస్తా: అద్భుత ఫలితాలు అందించే యువతరాన్ని సానపెట్టడమే తమ లక్ష్యమని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్ అన్నారు. వరంగల్ నగరానికి చెందిన సామల ప్రదీప్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికాల వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాటా సేవా డేస్ పేరుతో ప్రతీ రెండేళ్లకు ఓ సారి స్వంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో 2015లో సేవ్ చైల్డ్ గర్డ్ థీమ్‌తో పని చేశారు. ఈ సారి భావి భవిత యువత అనే కాన్సెప్టుతో డిసెంబరు 21న వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రదీప్ వెల్లడించారు. ... నెగిటివ్ తగ్గించాలి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం. ఎడ్యుకేషన్ హబ్ దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతరం ఇక్కడుంది. కానీ కాలేజ్ ఏజ్‌లో లక్ష్యానికి దూరంగా తీసుకెళ్లే ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటికి ఈ కోవలోకే వస్తాయి. వీటికి సమ యువత, సమాజం నుంచి క్రమక్రమంగా ఆమోదముద్ర లభించడం మంచి పరిణామంక కాదు. పాజిటివ్ పెంచాలి పరీక్షల్లో పాసవడమే లక్ష్యంగా చదువుల సాగించే విద్యార్థులు గ్లోబలేజేషన్ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, ఉపాధి పొందడం కష్టం. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా విద్యార్థులు తమలో ఉన్న సహాజ ప్రతిభకు ఎలా మెరుగు పెట్టుకోవాలి, మన ప్రయత్నంలో ఎదురయ్యే అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి. మన సమస్యలకు పరిష్కార మార్గాలు వినూత్నంగా ఎలా ఎంచుకోవాలి అనే అంశంపై నిపుణులతో సమావేశాల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు జనాభాలో సగం ఉన్న మహిళల సాధికరత సాధించడం ఎంతో కీలకం. అందుకే మహిళా సాధికారతకు నాటా పెద్ద పీట వేస్తుంది. 21న కార్యక్రమాలు నైపుణ్యం కలిగిన యువత, మహిళా సాధికారత లక్ష్యంగా మారథాన్ వాక్, సెమినార్లు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డిసెంబరు 21న ఉదయం 7:00 గంటలకు వేయిస్థంభాలగుడి నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు మారథాన్ వాక్ నిర్వహిస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సభర్వాల్, సినీ నటులు అలి, పూనమ్‌కౌర్‌లు ఈ వాక్‌లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:00– నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు డ్రగ్స్,డ్రైవ్ అంశంపై అకున్ సభర్వాల్, మిషన్ స్మార్ట్‌రైడ్ ఎన్జీవోకు చెందిన నందా భాఘీ, వోట్ 4 గర్ల్స్ సంస్థ నుంచి అనుషా భర ధ్వాజ్, హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. లీడ్ ఇండియా 20:20 సీఈవో హరి ఇప్పనపల్లిలు దేశాభివద్ధిలో యువత, స్త్రీల పాత్ర అనే అంశాలపై ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు అందచేస్తారు. సాంస్కతిక కార్యక్రమాలు నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా డిసెంబరు 21 సాయంత్రం 7 గంటలకు పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఉన్న జానపద కళాకారులచే ప్రదర్శన,కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘుకుంచే,గాయకులు గీతామాధురి, శ్రీ కష్ణ తదితరులు పాల్గొంటారు. -
యూఏటీసీకు నాటా ఆరు లక్షల డాలర్ల సేకరణ
అట్లాంటా: ఆటా, టాటాలతో కలసి వచ్చే ఏడాది జులైలో ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న యూనైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్(యూఏటీసీ)కు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) నిధుల సేకరణను ప్రారంభించింది. ఈ మేరకు నాటా నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆరు లక్షల డాలర్లను విరాళంగా వచ్చాయి. ఈ మేరకు నాటా ఓ ప్రకటన విడుదల చేసింది. బోర్డు సమావేశంలో నాటా అడ్వైజరీ కౌన్సిల్ డా. ప్రేమ్ రెడ్డి, సభ్యులు డా. స్టాన్లీ రెడ్డి, జితేందర్ రెడ్డి, డా. ఆదిశేష రెడ్డి, అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని, డా. రాఘవా రెడ్డి ఘోసల, మాజీ అధ్యక్షుడు డా. మోహన్ మల్లం, ఈవీపీ శ్రీధర్ కొర్సపాటి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పెనుమాడ, కోశాధికారి చిన్నాబాబు రెడ్డి, సంయుక్త కార్యదర్శి అన్నా రెడ్డి, ఐవీపీ సాంబా రెడ్డి, రమేశ్ అప్పారెడ్డి, బోర్డు డైరెక్టర్లు అంజన్ కర్ణంతి, బాబురావు సమాల, ద్వారక్ వారణాసి, హరి వెల్కూర్, జనార్ధన్ రెడ్డి బోయెళ్ల, మల్లిఖార్జున్ జెర్రిపోతుల, నారాయణ రెడ్డి గండ్ర, ప్రదీప్ సమల, ప్రసూన దోర్నాదుల, రఘురామి రెడ్డి ఏటుకూరు, రామసూర్యా రెడ్డి, శరత్ మండపాటిలు పాల్గొన్నారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో నాటా అట్లాంటా టీంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొట్లూరి శ్రీనివాస రెడ్డి, మెంబర్షిప్ కమిటీ చైర్ నంద గోపినాథ్ రెడ్డి, మాజీ బీఓడీ రవి కందిమల్ల, ఆర్వీపీ కిరణ్ కందుల, ఓవర్సీస్ కో-ఆర్డినేటర్ వెంకట్ మొండెద్దు, సోషల్ మీడియా చైర్ మాధవి ఇందుర్తి, నాటా జర్నల్ కమిటీ చైర్మన్ గురు పరాధరమి, పబ్లిసిటీ కో-చైర్ ధనుంజయ రెడ్డి, సుధీర్ అమిరెడ్డి, నరసింహా రెడ్డి, రమేష్ మేడా, అనిల్ రెడ్డి, వెంట్రామి రెడ్డి చింతం, ఉమా కావలికుంట, కృష్ణ నరేసపల్లి, జయచంద్రా రెడ్డిలు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో నాటా సేవా దినాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటా సేవా దినాలను నిర్వహించాలని కూడా బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి 23 వరకూ కర్నూలు, బెంగుళూరు, తిరుపతి, గుంటూరు, నల్గొండ, వరంగల్‌లో సేవా దినాలను నిర్వహిస్తారు. సేవా దినాల్లో భాగంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, హెల్త్ క్యాంప్‌లు, వాటర్ ప్లాంట్స్, టాయిలెట్స్, కవి సమ్మేళనం, బిజినెస్ సెమినార్లు ఉంటాయి. -
వరంగల్, హన్మకొండను విభజించొద్దు
జనగామ, గద్వాలను జిల్లాలుగా ప్రకటించాలి నాటా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి గంగసాని పోచమ్మమైదాన్ : రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక వరంగల్, హన్మకొండను వేర్వేరు జిల్లాలుగా విభజించొద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి గంగసాని అన్నారు. వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఓ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు జనగామ, గద్వాలను జిల్లాలుగా ప్రకటించకుండా, కోరని హన్మకొండను జిల్లాగా ఎందుకు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా విభజన ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు తుగ్లక్ పాలనలా ఉందని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల డబ్బు వృథా తప్పా ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఆ ప్రాజెక్టు నిర్మించొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కేసీఆర్‌ను ఎన్ఆర్ఐలే ప్రోత్సహించారని అన్నారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో నాటా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ముత్తుజా, నాటా వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, వెల్ది ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఘనంగా ముగిసిన నాటా మహా సభలు
తెలుగు ప్రజలంతా డల్లాస్, టెక్సాస్ వేదికగా ఒకే చోట చేరడంతో నగరం పులకించిపోయింది. మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిగిన నాటా మహా సభలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డల్లాస్‌లో ఓమ్ని హోటల్‌తో అనుబంధంగా విస్తరించిన కన్వెన్షన్ సెంటర్లో , వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎటు చూసినా తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు సంభాషణలు, నవ్వులు, పువ్వులు, కబుర్లతో పండుగను తలపించింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో కొత్త జీవనోత్సాహాన్ని నింపిన నాటా నిర్వాహకులు.. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి(నాటా మహానాయకులు, పోషకులు), నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం, అడ్వైజర్ ఎ వి ఎన్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి, జితేందర్ రెడ్డి, కన్వీనర్ గూడూరు రమణారెడ్డి, కన్వెన్షన్ కో ఆర్డినేటర్ రామసూర్యారెడ్డి, మాజీ అధ్యక్షులు సంజీవ రెడ్డికి, నాటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వర్ గంగసాని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గోశాలరాఘవరెడ్డి, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డి, ట్రెజరర్ హరి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గానగోని, మల్లిక్ బండ, ఇండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాధరెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ళరామిరెడ్డి, కన్వెన్షన్ అడ్వైజర్ ప్రదీప్ సామల, శ్రీధర్ కొర్సపాటి, ఫల్గుణ్ రెడ్డి, నాగిరెడ్డి దర్గా రెడ్డి, సురేష్ మండువ, గీత దమ్మన, వెంకట్ వడ్డాడి, శేఖర్ కోనాల, మోహన్ కలాడి, తలపులపల్లి చిన్నబాబురెడ్డి తదితరులను వీక్షకులు కొనియాడారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వాళ్ళు, అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి కుటుంబాలతో కదలివచ్చినవాళ్ళు ఉన్నారు. నెల రోజులపాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన కొత్త తరం తెలుగు గాయకుల అన్వేషణా కార్యక్రమం నాటా ఐడల్. ఈ కార్యక్రమాన్ని నాటా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబోస్, సంగీత దర్శకులు రఘు కుంచె, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డిలు తమ భుజస్కంధాలపై వేసుకుని ఎంతో శ్రమతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నాటాకు మరింత కీర్తిని అందించారు. విశేష సేవలందించిన వారికి.. నాటా అవార్డులు ముఖ్యంగా నాటా వేదిక మీద వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి నాటా అవార్డులతో సత్కరించింది. సుధాకర్ రామకృష్ణ(వ్యాపారం), ఆరాధ్యుల కోటేశ్వరరావు, వినయిని జయసింఘే( కల్చరల్), తుర్లపాటి ప్రసాద్(సాహిత్యం),మాంచు ఫర్రర్, ఆర్ కె పండిటి(కమ్యూనిటీ సర్వీస్), చంద్రుపట్ల తిరుపతిరెడ్డి(ఇంజనీరింగ్), జిబికె మూర్తి(జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్), డాక్టర్ కాంతారెడ్డి, డాక్టర్ జగన్ కాకరాల(మెడిసిన్), వేల్కూరి శ్రీహరి సంజీవి( పబ్లిక్ సర్వీస్), కెఆర్ కె రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి(రీసెర్చ్), ప్రణతి శర్మ గంగరాజు, తీగల సాహిత్ రెడ్డి(యూత్) లకు అవార్డులను బహుకరించింది. నాటా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రఖ్యాత సినిమా దర్శకులు ఎ. కోదండరామిరెడ్డికి అందించింది. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కవులు, నాటకరంగ కళాకారులు, ఆధ్యాత్మిక గురువులు, పత్రికా సంపాదకులు హాజరై నాటా తెలుగుదనానికి మరింత సొబగులు అద్ది తెలుగు పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తన ఆటాపాటలతో వినోదాన్ని అందించే నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, నిత్యామీనన్, హీరోలు సుదీర్ బాబు, వరుణ్ తేజ్ లు అలరించారు. రాజకీయ ప్రముఖులు వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, ఎమ్మెల్యే సంపత్ కుమార్, బుడ్డా రాజశేఖర్‌రెడ్డిలు హాజరై తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వేదిక గా నిలిచారు. నాటాలో ఫోర్త్ ఎస్టేట్ పత్రికా సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నాటా నిర్వహించిన ఫోర్త్ ఎస్టేట్ సదస్సుకు విచ్చేసి తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ, సామజిక పరిణామాలను, పార్టీల పోకడలను వివరించారు. నరాల రామిరెడ్డి, అఫ్సర్ ల ఆధ్వర్యంలో నాటా తెలుగు సాహితీసభ విజయయవంతమైంది. ఇక అమెరికా లోని అలుమ్ని అసోసియేషన్ల కలయికలు సభకు విచ్చేసిన వారందరికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విద్యార్థినాటి జ్ఞాపకాలు, కబుర్లు, ముచ్చట్లు సరదా సరదాగా జరిగాయి. వీటిలో ముఖ్యంగా ఎన్ బి కె ఆర్ ఐఎస్ టి, ఎపిఎంజి యుఎస్ఎ, కర్నూలు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, ఎస్వీ యూనివర్సిటీ, విఆర్ కాలేజీ, గీతమ్ యూనివర్సిటీ, చిత్తూరు ఎన్ఆర్ఐ, రాయలసీమ ఎన్ఆర్ఐ ఫోరం, గ్యారంపల్లి ఎపిఆర్ జెసి స్కూల్, ఎన్ఐటి వరంగల్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, కెఎస్‌ఆర్‌ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల కలయిక నాటా కన్వెన్షన్ కు కొత్త కళ తీసుకొచ్చింది. అలా ఉత్సాహంగా ప్రారంభమైన కార్యక్రమం చివరి ముగింపు వరకు ప్రేక్షకులకు, తెలుగు వారందరికి ఎన్నో మధురానుభూతులను పంచిపెట్టింది. ముఖ్యంగా ముగింపు చివరి క్షణాల్లో నాటా అడ్వయిజర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆట, పాట ప్రేక్షకులకు కొత్త జోష్ ను తీసుకొచ్చాయి. ఆయన ఆటకు పాటకు, కోటి సంగీత కచ్చేరీ కన్వెన్షన్ ముగింపు సన్నివేశాలకు కొత్తకళను తీసుకొచ్చింది. అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లంగారి సమర్థవంతమైన సభా నిర్వహణ మొత్తం కన్వెన్షన్‌కు నిండుదనం తీసుకొచ్చింది. ఇక మూడు రోజులపాటు జరిగిన ఈ పండుగ విజయోత్సవానికి మూలకారకులు, శ్రమజీవులు అన్ని విభాగాల చైర్స్, వాలంటీర్లనే చెప్పాలి. వారిలో ప్రధానంగా డాక్టర్ రాఘవరెడ్డి( లోకల్ అడ్వయిజర్), విష్ణు బత్తుల(ఆడిట్), శ్రీరంగపల్లి సుధాకర్ రెడ్డి( అలుమ్ని), ప్రసాద్ జి. రెడ్డి( అవార్డ్స్), రేఖారెడ్డి(బాంక్వెట్), ఆనంద్ దాసరి(సెమినార్స్), డాక్టర్ మర్యాద రెడ్డి( సిఎంఇ), శ్రీనివాస్ గనగోని( కార్పొరేట్), నాగిరెడ్డి దర్గా రెడ్డి(కల్చరల్), సరితారెడ్డి కొండా(డెకరేషన్స్), ప్రసున్నా రెడ్డి( ఫైనాన్సు), మల్లు మధు( ఫుడ్), మురారి మల్లికార్జునరెడ్డి(హాస్పిటాలిటీ), డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ(లాంగ్వేజ్ లిటరరీ), క్రిష్టపాటి రమణారెడ్డి(ఇమ్మిగ్రేషన్, ఐటి), రమేష్ గదిరాజు(ఇన్ఫో హబ్), జయ పలగల(ఎన్ఆర్ఐ), తిరుమల రెడ్డి( మీడియా), శ్రీకాంత్ కొత్తపల్లె(పబ్లిసిటీ, పిఆర్), రవి అరిమండ (ప్రోగ్రామ్స్, ఈవెంట్స్), ఉమా మహేశ్వర్ రెడ్డి( పొలిటికల్ ఫోరం), శ్రీనివాస్ రెడ్డి ఓబులరెడ్డి( ప్యానెల్ డిస్కషన్స్), వడ్డాడి వెంకట్( రిజిస్ట్రేషన్స్), శ్రీదేవి తేనేపల్లి( రిసెప్షన్), శ్రీనివాస్ గనగోని( షార్ట్ ఫిలిమ్స్), రవి కొండ( సెక్యూరిటీ), కొత్త రఘునాథ్ రెడ్డి(సావనీర్), డాక్టర్ సుబ్రమణ్యం బోయరెడ్డి( స్పిర్చువల్), సురేష్ కాకు(స్టేజి, ఎవి), ఎన్ఎంఎస్ రెడ్డి( స్పోర్ట్స్, హెల్త్), ఉమా మహేష్ పర్నపల్లి( ట్రాన్స్ పోర్టేషన్), సురేష్ మండువ( వెన్యూ), నగేష్ బాబు దిండుకుర్తి( వాలంటీర్స్), శశి లింగనేని( వెబ్), శుభాంజాలి వెలగ( విమెన్స్), శుభద్ర( యూత్). శ్రీధర్ కొర్సపాటి, గీత దమ్మన, సురేష్ మండువ, సురేష్ వెంకటేష్ ముత్యాల ఇంకా అనేక మంది కృషి మరువలేనిదనే చెప్పాలి. కల్చరల్ చైర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి ఆధ్వర్యంలో కన్వెన్షన్ సెంటర్లో అతిపెద్ద వేదికైన ఎరీనా, రెండో వేదిక అందించి వినోదానికి ప్రేక్షకులు మధురానునుభూతులతో తడిసి ముద్దయ్యారు. -
ఘనంగా ముగిసిన నాటా సంబరాలు
డల్లాస్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) వారు నిర్వహించిన సంబరాలు ఘనంగా ముగిశాయి. వైఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలను స్మరించుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. 2016 ఏడాదికి గానూ వైఎస్ఆర్ అవార్డును డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డికి వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు, నాటా అసోసియేషన్ సభ్యులు, అతిథులతో పాటు దాదాపు ఆరు వందలకు పైగా వైఎస్ఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎ.రామిరెడ్డి వేదికపైకి పేరుపేరున అతిథులను ఆహ్వానించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ సలహా మండలి చైర్మన్ ప్రేమ్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తో తన కాలేజీ రోజులను, రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత పేదవాళ్లకు చేసిన సేవలను కొనియాడారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆయన కలిసిన వ్యక్తులను వారి సమస్యలతో సహా గుర్తుపెట్టుకున్నారని, ఎన్నో ప్రాజెక్టులను ఆయన చేపట్టారని పేర్కొన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పెదల కష్టాన్ని, సమస్యలను గుర్తించి ముఖ్యంగా పేదల ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని ఎప్పుడూ తాపత్రయ పడేవారని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ దినపత్రిక సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఏ సందర్భంలోనూ జర్నలిస్టులను ప్రభావితం చేయాలని చూడలేదని, వారికి ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారని ఈ సందర్భంగా వెల్లడించారు. కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తనను ఇష్టపడే వారికి మాత్రమే కాదు తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా సహాయం చేసిన గొప్పవ్యక్తి అని వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకరరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ జి. ప్రకాశ్ రావు, ఇతర ప్రముఖులను వేదికకు పరిచయం చేశారు. డాక్టర్ స్టాన్లీ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జి. రాఘవరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రమేశ్ అప్పారెడ్డి, వైఎస్ఆర్సీపీ అమెరికా కన్వీనర్లు గురువారెడ్డి, రాజ్ కేసిరెడ్డి, పి. రత్నాకర్, వెంకట మేడపాటి, వాసుదేవరెడ్డి, ఇతర ప్రముఖులు వేదికను పంచుకున్నారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ సెక్రటరీ అన్నారెడ్డి, కోశాధికారి విష్ణు కోటిమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఇ.రఘురామి, సంయుక్త కోశాధికారి శరత్ మందపాటి, అంజన్ కర్నాతి, ద్వారక్ వారణాసి, కిరణ్ కందుల, మల్లికార్జున్ జెర్రిపోతుల, నంద గోపినాథ్, ప్రభాకర్ రెడ్డి, ఎ. రాజశేఖర్, పి. శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు . -
ఘనంగా రెండో రోజు నాటా వేడుకలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) కన్వెన్షన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలలో నటి హంసానందిని సందడి చేసింది. రెండో రోజు వేడుకల్లో పాల్గొనేందుకు రాజకీయ, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే సంగీత కార్యక్రమంలో గాయకులు హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తాము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి అడ్వైజరీ కౌన్సిల్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. -
నాటా తెలుగుసభల్లో కోటి సంగీత విభావరి
అమెరికాలోని డల్లాస్‌లో నాటా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత విభావరిలో స్థానిక డల్లాస్ కళాకారులతో పాటు , సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణులు కూడా పాల్గొంటున్నారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హేమచంద్ర, సాయిచరణ్, సాయి శిల్ప, శృతి, శివ దినకర్, నూతన మోహన్, నరేంద్ర తదితరులు తమ పాటలను వినిపిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను సాంస్కృతిక కార్యక్రమాల విభాగం నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి దర్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణారెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి, కో కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి తదితరులు మహాసభల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. -
జీబీకే మూర్తికి నాటా జర్నలిజం అవార్డు
సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పడి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాటా జర్నలిజం-పబ్లిక్ రిలేషన్స్ అవార్డుకు కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ జీబీకే మూర్తిని ఎంపిక చేసినట్లు నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం ఓ ప్రకటనలో తెలిపారు. మే 27-29 తేదీల్లో డల్లాస్‌లో జరిగే నాటా కన్వెన్షన్‌లో అవార్డు ప్రదానం చేస్తామన్నారు. -
డల్లాస్ 'నాటా' ఉత్సవాలకు సినీతారలు
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో డల్లాస్ కన్వెన్షన్ 2016 మహా సభలు జరుగనున్నాయి. మే 27 నుంచి మే 29 వరకు మూడు రోజుల పాటు నాటా మహా సభలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు వంటి పలు కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకోనున్నాయి. యూత్ ఫారమ్ కోసం ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి సైన్స్ వర్క్‌షాపులు, యూత్ నైట్, ఆర్ట్స్అండ్ క్రాఫ్ట్స్ సహా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు నాటా పేర్కొంది. నాటా ఉత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. రాజకీయ నేతలు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డీకె అరుణ, పీవీ మిథున్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్ఎ సంపత్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. సినీతారలు హీరో సంపూర్ణేశ్ బాబు, నటి నిత్యా మీనన్, హంస నందిని, శియా గౌతమ్, తేజస్వనీ, మాధూరి ఇటాగీ, తెలుగు దర్శకులు హరీష్ శంకర్, కోదండరామిరెడ్డి, గాంధీ ఈ ఉత్సవాల్లో సందడి చేయనున్నారు. హాస్య నటులు పృధ్వీ బాలిరెడ్డి, సప్తగిరి, ప్రవీన్, బిట్టార్ శెట్టి, బిత్రి సావిత్రి.. తమ హాస్యంతో అందరినీ అలరించనున్నారు. ఆధ్యాత్మికవేత్తలు ప్రకాశ్ రావు వెలగపూడి, కల్యాణ్ విశ్వనాథన్, స్వామి సర్వేశానంద, స్వామి పరత్మానంద, స్వామి అభిషేక్ చైతన్య గిరి లను ఆహ్వానించనున్నారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. రవీంద్ర సన్నారెడ్డి, సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి, యూప్ టీవీ సీఈఓ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ట్రావెల్, హోటల్ వసతులకు సంబంధించి అన్ని వివరాలు, సంప్రదించాల్సిన నిర్వాహకుల వివరాలను అధికారక వెబ్సైట్లో పొందపరిచినట్టు నాటా వెల్లడించింది. డల్లాస్ నాటా ఉత్సవాల్లో పాల్గొనాలంటే website: http://nata2016.org/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నో వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నాటా అధ్యక్షులు మోహన్ మల్లం, కాబోయే అధ్యక్షులు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణా రెడ్డి గూడూరు, సమన్వయకర్త రామ సూర్యా రెడ్డి, సహ కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డిలు సభ విజయవంతం కావడానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.