మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అవార్డు ఇన్ జర్నలిజం–2023కు ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్‌ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
నాటా” ఆహ్వానం మేరకు సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు ఈ నెల 29న (గురువారం) పయనమౌతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యం లో ఏటా జరిగే తెలుగు ప్రజల ఉత్సవాలను యీ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో నిర్వహిస్తున్నారు. జూన్ 30 నుండి జులై 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను సన్మానించడం జరుగుతుంది.
2023 సంవత్సర "నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్స్ లెన్స్" అవార్డును అందుకునేందుకు శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు జులై 1 నాటికి చేరుకుంటారు. తిరిగి జులై 16న విజయవాడ చేరుకుంటారు.
ఇది కూడా చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment