Dallas
-
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటింగ్ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్‌గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు.ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
టెక్సాస్‌లో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం..!
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తన సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 2 వ తేదీ ఆదివారం నాడు ప్రిస్కో, టెక్సాస్‌లో అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 50 మందికి పైగా స్వచ్చంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, టీల్ & లెగసీ మధ్య రెండు మైళ్ల దూరం ఉన్న ఫీల్డ్స్ పార్క్‌వే వీధిని శుభ్రం చేశారు. అందులో సగం మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం విశేషం. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు నేర్పించగలగటం ముఖ్య ఉద్దేశ్యమని టెక్సాస్ నాట్స్ సభ్యులు పేర్కొన్నారు. డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ , శ్రవణ్ నిడిగంటి లు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారరందరికి కృతజ్ఞతలు తెలిపారు. డల్లాస్ చాప్టర్ వారు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, డల్లాస్ టీం అడ్వైజర్ కవిత దొడ్డ, నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, డల్లాస్ చాప్టర్ సభ్యులు బద్రి బియ్యపు, పావని నున్న, కిరణ్ నారె, శివ మాధవ్, వంశీ కృష్ణ వేనాటి, సాయిలక్ష్మి నడిమింటి మరియు ఇతర నాట్స్ డల్లాస్ సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ సమాజ సేవలో ముందుండి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి ప్రశంసించారు. అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అందరిని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.(చదవండి: ట్రంప్ దెబ్బకు..పీడ కలగా అమెరికా చదువు..!) -
డల్లాస్‌లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్, అమెరికా: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, మొత్తం 251 పేజీలఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయన్నారు. 1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అన్నారు.ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని అన్నారు.”ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తి తో జరిగిన ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
డల్లాస్‌లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరుపున రక్తదానం విజయవంతం
శ్రీప్రణవపీఠ వ్యవస్థాపకులు, త్రిభాషామహాసహస్రావధాని శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారి ఆశీస్సులతో వారి శిష్యులు అమెరికాలోని డల్లాస్‌లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" https://vaddipartipadmakar.org/ తరఫున కార్టర్ బ్లడ్ కేర్‌తో కలిసి నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. ఫ్రిస్కో, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా జరిగిన ఈ డ్రైవ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. 33 కన్నా ఎక్కువ మంది దాతలు రావటంతో కార్టర్ బ్లడ్ కేర్ కొంతమంది దాతలను వెనుకలకు పంపాల్సివచ్చింది. ఉదయం 9.30 నిలకు మొదలైన రక్తదాన కార్యక్రమం మద్యాహ్నం 1.30 ని.ల వరకు జరిగింది.అమెరికాలో, టెక్షాస్ రాష్ట్రం డల్లాస్ లో నెలకొల్పబడిన "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరపున సత్సంగ సభ్యులందరూ ఏకగ్రీవంగా కలిసి ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు. రక్తదానం చేయలేని వారు కూడా తమ పూర్తి సహాయసహకారాలు అందించి సేవా బాధ్యతలను స్వీకరించారు. (చదవండి: న్యూజెర్సీలో ఘనంగా బాలల సంబరాలు..) -
ఎవర్నువ్వు..!
‘అనగనగ ఒక రాజు ఉండేవాడు... చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు...’ అంటూ మొదలవుతుంది ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్. బాలకృష్ణ(Daaku Maharaaj) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ ( Daaku Maharaaj ). ఈ చిత్రంలో బాబీ డియోల్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవర్నువ్వు... నానాజీ అమ్మా.., నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే... నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా...’, ‘చెప్పింది వినాలి... ఇచ్చింది తీసుకోవాలి’, ‘వాడి ముందు నువ్వు కాదు... నేనుండాలి’, ‘అసలు ఎవడ్రా నువ్వు... మైఖేల్ జాక్సన్’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి ‘డాకు మహారాజ్’ చిత్రంలోని బాలకృష్ణ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘‘యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానం
భాగ్యనగరం నుంచి అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. కేవలం ట్రాన్సిట్ ఎయిర్‌పోర్ట్‌గానే కాకుండా పశ్చిమాసియా దేశాలకు ప్రధాన హబ్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు హైదరాబాద్ నుంచి గణనీయంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పలు ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసులను విస్తరిస్తున్నాయి. ఏటా సుమారు 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణమైన సామర్థ్యంతో.. ఎయిర్పోర్ట్ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా మారింది. దీంతో ప్రస్తుతం పలు అంతర్జాతీయ నగరాలకు విమానాలను నడుపుతున్న విమానయాన సంస్థలు.. మరిన్ని కొత్త నగరాలకు తమ సేవలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కోవిడ్ అనంతరం అంతర్జాతీయ పర్యటనలు సైతం భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల పర్యాటకులు నచ్చిన దేశాలు, పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పర్యాటకుల డిమాండ్, అభిరుచి ఉన్న ప్రాంతాలకు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు, శ్రీలంక, దుబాయ్ వంటి దేశాలతో పాటు పర్యాటకులు సందర్శించే జాబితాలో కొత్తగా మరిన్ని దేశాలు వచ్చి చేరాయి. అమ్‌స్టర్‌డ్యామ్, ఇథియోపియా, వియత్నాం, డాలస్, షికాగో తదితరాలకు హైదరాబాద్ నుంచి త్వరలో డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. –సాక్షి, హైదరాబాద్హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి కంటే..ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, దోహా, షార్జా, జెడ్డా, అబుదాబి, రియాద్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, ఖతార్, సౌదీ తదితరాలకు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. గతంలో షికాగోకు విమాన సర్వీసులను నడిపారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయాయి. త్వరలో షికాగోతోపాటు డాలస్, శాన్ఫ్రాన్సిస్కో నగరాలకు కూడా హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 55000 మంది దేశీయ, మరో 15000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్క నవంబర్ నెలలోనే 40,179 మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశీయానం చేశారు. 2467 అంతర్జాతీయ సర్వీసులు నడిచాయి.ఆసియా దేశాల్లో యూరప్ అనుభూతిఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరప్ దేశాల పర్యటన ఖరీదుగా మారింది. నలుగురు కుటుంబసభ్యులు కలిసి వారం రోజుల పాటు పర్యటించాలంటే కనీసం రూ.8 లక్షల పైనే ఖర్చవుతుంది. కానీ చాలా తక్కువ బడ్జెట్లో యూరప్ దేశాల్లో పర్యటించిన అనుభూతిని కలిగించేవిధంగా కొన్ని దేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జార్జియా, అజర్బైజన్, ఉజ్బెకిస్తాన్, ఆర్మీనియా తదితర దేశాలు.. తక్కువ బడ్జెట్లో సందర్శించేందుకు అనువుగా ఉన్నాయి. దీంతో ఈ దేశాలను ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్నట్లు పర్యాటక సంస్థలు పేర్కొంటున్నాయి. ‘స్విట్జర్లాండ్‌లోని మంచుకొండల్లో విహరించాలని కోరుకొనేవాళ్లు ఇప్పుడు కజకిస్తాన్‌లోని షింబులాక్ మౌంటెయిన్స్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. స్విట్జర్లాండ్ పర్యటనకు కనీసం రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందనుకంటే.. కేవలం రూ.2 లక్షల్లోనే కజికిస్తాన్ పర్యటనను పూర్తి చేయవచ్చు. ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్స్‌కు ప్రాధాన్యం పెరిగింది’.. అని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్ ఎండీ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మరోవైపు ఉచిత వీసా సదుపాయం కలిగిన దేశాల్లో కూడా ఎక్కువమంది పర్యటిస్తున్నారు. మలేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఆ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. త్వరలో రష్యా సైతం ఉచిత వీసా సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో ట్రావెల్స్ ఏజెన్సీలు, పర్యాటక సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు ఎయిర్‌లైన్స్ కూడా ఈ డిమాండ్ మేరకు సర్వీసులను విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ఇండియా వంటి సంస్థలు తమ సర్వీసులను పెంచుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు కనెక్టివిటీ..కేఎల్ఎం ఎయిర్‌లైన్స్.. నెదర్లాండ్స్, ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ఇథియోపియా తదితర దేశాలకు త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెట్టనుంది. ఇథియోపియాకు విమానసర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ నుంచి ఆఫ్రికా దేశాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది. వియట్ జెట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమానాలు నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. టర్కీకి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. అమ్‌స్టర్‌డామ్, డల్లాస్ నగరాలకు కూడా 2025లోనే సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమానాలు నడుస్తుండగా, 2025లో మరో 10 నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. -
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు జయంతి సందర్భంగా ప్రతి యేటా నాట్స్ డల్లాస్ విభాగం బాలల సంబరాలు నిర్వహిస్తోంది. గత పద్నాలుగు ఏళ్లుగా ఓ సంప్రదాయంలా నిర్వహిస్తున్నఈ సంబరాలను ఈ సారి ప్రిస్కో నగరంలో వండేమేట్టర్ మిడిల్ స్కూలులో ఘనంగా జరిపింది. బాలల సంబరాల్లో భాగంగా చదరంగం, గణితం, సంగీతం నృత్యం, తెలుగు పదజాలం, తెలుగు ఉపన్యాసం విభాగాల్లో జరిగిన పోటీల్లో దాదాపుగా 250 కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో దరఖాస్తు చేసుకున్న పిల్లల్ని వివిధ వయసుల వారీగా విభజించి ఈ పోటీలు నిర్వహించారు. నాట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు విద్యార్థులే కాకుండా, ఇతర ప్రవాస భారతీయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ సంగీతం, నృత్యంతో పాటు సినిమా సంగీతం, నృత్యం విభాగాల్లో జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు పదజాలం, తెలుగు ప్రసంగ పోటీల్లో అనర్ఘళంగా తెలుగు మాట్లాడి అతిథులను అబ్బురపరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో దాదాపు 90 మందికి పైగా పిల్లలు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి నేతృత్వంలో ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు మూడు నెలల ముందు నుండే పక్కా ప్రణాళికతో బాలల సంబరాలను నాట్స్ డల్లాస్ బృందం విజయవంతం చేసింది.నాట్స్ బాలల సంబరాలకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఉప కోశాధికారి రవి తాండ్ర, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, మీడియా రిలేషన్స్ నేషనల్ కోఆర్డినేటర్ కిషోర్ నారెలు ఇచ్చిన అమూల్యమైన సూచనలు, మార్గదర్శకత్వం బాలల సంబరాల విజయానికి దోహదపడ్డాయని స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి తెలిపారు.డల్లాస్ చాప్టర్ సలహా బోర్డు సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, కవిత దొడ్డ, డీ వీ ప్రసాద్, రవీంద్ర చుండూరు, డాలస్ చాప్టర్ జట్టు సభ్యులు సౌజన్య రావెళ్ల , కావ్య కాసిరెడ్డి, పావని నున్న, శ్రీనివాస్ ఉరవకొండ, కిరణ్ నారె, ఉదయ్, నాగార్జున, బద్రి బియ్యపు, మోహన్ గోకరకొండ, యూత్ టీం నుండి నిఖిత, సహస్ర, ప్రణవి, వేద శ్రీచరణ్, అద్వైత్, ధృవ్, పావని, అమితేష్, ఈశ్వర్, చంద్రాంక్ తదితరులు నాట్స్ బాలల సంబరాల్లో పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.బాలల సంబరాలను జయప్రదం చేసిన జట్టు సభ్యులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, న్యాయనిర్ణేతలకు, దాతలకు, యువ సభ్యులకు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి ధన్యవాదాలు తెలిపారు. ఈ బాలల సంబరాలను పద్నాలుగు సంవత్సరాలక్రితం డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసి, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, మరిన్ని నాట్స్ చాఫ్టర్లు ఉన్న నగరాలకు విస్తరించామని తెలిపారు. మన ప్రవాస భారతీయ పిల్లలకు, ప్రత్యేకంగా తెలుగు వారి పిల్లలకు, వారి ప్రతిభను, నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని పెంపొందించే అవకాశాలను కల్పించటం చాలా సంతోషంగా ఉందని బాపు నూతి అన్నారు. ఈ బాలల సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుండటంపై బాపు హర్షం వ్యక్తం చేశారు. స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వోల్డీలక్స్ మరియు ఫార్మ్2కుక్ లకు నాట్స్ డల్లాస్ చాప్టర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్వజయంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం) -
డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా డల్లాస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్‌ను ఈ సారి కూడా చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలు, వెయ్యికి పైగా ఫుడ్ క్యాన్స్‌ను నాట్స్ డల్లాస్ సభ్యులు సేకరించారు.అలా సేకరించిన ఆహారాన్ని తాజాగా టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సభ్యులు అందించారు. నాట్స్ 918 పౌండ్లు బరువు ఉన్న ఆహారపు పదార్ధాలను ఫుడ్ బ్యాంక్‌కు ఇవ్వడం ద్వారా దాదాపు 765 మందికి ఒక పూట భోజన సదుపాయం కల్పించవచ్చని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు తెలిపింది.. గత పద్నాలుగు ఏళ్లుగా ప్రతి సంవత్సరం నాట్స్ చేస్తున్న ఈ ఫుడ్ డ్రైవ్‌ని నిర్వహిస్తున్న నాట్స్‌ని నార్త్ టెక్సాస్ ఫుడ్ డ్రైవ్ ప్రతినిధులు ప్రశంసించారు.నాట్స్ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న యువ వాలంటీర్లను, సభ్యులను వారిని ప్రోత్సహించి, సహకారం అందించిన తెలుగువారందరిని నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి అభినందించారు. ఆహార పదార్ధాలను అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేకరణ కార్యక్రమంలో అత్యంత చురుగ్గా పాల్గొన్న వేద శ్రీచరణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటి, అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ న్యాలమడుగుల, బద్రి బియ్యపు, ఉదయ్ పాకలపాటి, నాట్స్ యువ సభ్యులు వేద శ్రీచరణ్, అద్వైత్, అర్ణవ్, అరిహంత్, అథర్వ్లతో పాటు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఎస్సీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నాట్స్ జాయింట్ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ నారె లు పాల్గొన్నారు.ఈ ఫుడ్ డ్రైవ్‌కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి ధన్యవాదాలు తెలిపారు.. గత 14 సంవత్సరాలుగా ఫుడ్ డ్రైవ్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీం ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నాట్స్ డల్లాస్ విభాగం గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. డల్లాస్‌లో నాట్స్ నిర్వహించిన ఈ 16వ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. దసరా పండుగ రోజు దాదాపు 200 మంది వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నీలో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు.డల్లాస్ చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా తమ అపార అనుభవం, ప్రతిభాపాటవాలు రంగరించి ప్రణాళిక నుండి కార్యాచరణ వరకు టోర్నీని దిగ్విజయం చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అందించిన మద్దత్తు దిశానిర్దేశం వల్ల తమ మొదటి కార్యక్రమం ఇంత విజయవంతం అయిందని నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ తెలిపారు. అందరి క్రీడా స్ఫూర్తి వల్ల నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులకు ఈ టోర్నమెంట్ మరిచిపోలేని అనుభవంగా మిగిలిందని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చిందని డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి అన్నారు.నాట్స్ డల్లాస్ 16వ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను, సహకరించిన వాలంటీర్స్, వారిని ప్రోత్సహించడానికి వచ్చిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డల్లాస్ చాప్టర్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి. అలానే, అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది.విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు , యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పెద్దవారితో పోటీపడి అత్యంత ప్రతిభని ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ కు ప్రత్యేక గుర్తింపునిస్తూ గిఫ్ట్ కార్డుని బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఇక ఈ టోర్నమెంటు నిర్వహణలో నాట్స్ డల్లాస్ చాప్టర్ టీం నుండి గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు రవి తాండ్ర మరియు కిషోర్ నారెలు, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు,ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు.ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో సాంసృతిక మరియు క్రీడా కార్యక్రమాలకు చేపట్టబోతున్నామని డల్లాస్ చాప్టర్ టీం తెలిపింది. ఈ టోర్నమెంట్ కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి డల్లాస్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ నిర్మాణంలో సహకరించిన దాతలకు, అధికారులకు అభినందన పూర్వక విందు సమావేశం ఇర్వింగ్ నగరంలో ఉన్న విండాం హోటల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీకరి లంకా వీణానాదం; చక్రి పైలా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు గాంధీ ఆశయాలపై చేసిన ప్రసంగాలు, రవీంద్ర గుడిమెళ్ళ, సమీర శ్రీపాద శిక్షణలో పాల్గొన్న సింధు గుడిమెళ్ళ, సంయుక్త గుడిమెళ్ళ, అన్షు చుండి, అయేషాని చుండి, సంహిత్ చిలకమర్రి, రిత్విక లక్కిరెడ్డి, అభినవ్ కార్తీక్ లక్కిరెడ్డి, సమన్విత మాడా, పవన్ కుమార్ గడగండ్ల, రవీంద్ర గుడిమెళ్ళ, శ్రీకర్ దేసు లు గానం చేసిన దేశభక్తి గీతాలు; సింధుజ ఘట్టమనేని శిక్షణలో పాల్గొన్న నందిత దినేష్, గ్రీష్మ అశోక్, తేజస్విని శర్వణన్, నక్షత్ర నల్లమోతు, నిత్య ఆవాల, ఆర్షియ మాచవోలు, ప్రియ దర్శిని కృష్ణమూర్తి, రుషిక కల్ల, సహన కార్తీక్, శ్రీనిత ఆర్కాటి, రియ బూర, వీక్షవ్ సురకంటి, ప్రణిత కొసరాజు, నేహశ్రీ పిల్లా, ప్రిష మదన్, సరయు తూనుగుంట్ల, అకిర తేర, నిహారిక కొండూరు, సాన్విక కొలన్పాక, ఆద్యవర్మ కొండూరు బృందం వందేమాతరం, జనగణమన గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకత్వానికి దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు శుభాశ్సీసులు తెలియజేసిన ప్రత్యేక అతిథులుగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్, కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ ఖబీర్, కాపెల్ నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షులు గోపాల్పోణంగిలను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యులు మురళి వెన్నం, రన్నా జానీ, జాన్ హామండ్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, తాయాబ్ కుండావాల, సి.సి తియోఫిన్, స్వాతి షా, షబ్నం మాడ్గిల్ లు సత్కరించారు.కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజూ మాత్యు మరియు రమేశ్ ప్రేమ్ కుమార్ లు కాపెల్ నగర మేయర్ మహాత్మా గాంధీ మెమోరియల్ ను అభినందిస్తూ చేసిన అధికారిక అబినందన పత్రాన్ని (ప్రోక్లమేషన్), మరియు ఇర్వింగ్ నగర మేయర్ వ్రాసిన ప్రశంసా పత్రాన్ని మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్ లు డా. ప్రసాద్ తోటకూర కు అందజేశారు.ఇటీవలే గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులుగా నియమితులైన రాంకీ చేబ్రోలు, జాన్ హామండ్, రన్నా జానీ, కిషోర్ కంచర్ల, తిరుమలరెడ్డి కుంభం, లోకేష్ నాయుడు కొణిదల, అనంత్ చౌదరి మల్లవరపు, అక్రం సయ్యద్, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట్ల, వినోద్ ఉప్పు, రాజేంద్ర వంకావాల లను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేసి తోటి సభ్యులతో కలసి వారందరినీ సన్మానించారు.మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారుచేసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విజయవాడకు చెందిన బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనీను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులందరూ కలసి ఘనంగా సన్మానించారు. షబ్నం మాడ్గిల్ వందన సమర్పణతో, రుచికరమైన విందు భోజనంతో ఈ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
అమెరికాలో సచిన్‌కు సత్కారం.. దేవుడు ఇక్కడే ఉన్నాడన్న ఉన్ముక్త్! (ఫొటోలు)
-
Ratan TATA: డాలస్‌లో రతన్ టాటాకు ఘన నివాళి
డాలస్, టెక్సాస్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన ప్రవాస భారతీయులు. రతన్ టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త అని, ఆయన మరణం తీరనిలోటని మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన టి.సి.ఎస్ లో రతన్ టాటాతో కలసి పనిచేసి, ఆ తర్వాత విప్రో సంస్థలోచేరి సీఈఓ స్థాయికి ఎదిగిన అబిద్ఆలీ నీముచ్ వాలా రతన్ టాటాకున్న దూరదృష్టి, సాటి ఉద్యోగులతో కలసి పనిచేసిన తీరు, హాస్యపూర్వక సంభాషణలు, టాటా కంపెనీని అభివృద్ధిపధంలో నడిపినతీరు మొదలైన ఎన్నో వివరాలను సోదాహరణంగా వివరించి రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “రతన్ టాటా కంపెనీ ఛైర్మన్ గా తన రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రస్థానంలో కేవలం భారతీయకంపెనీగా ఉన్న టాటా కంపెనీని అంతర్జాతీయకంపెనీ స్థాయికి తీసుకువెళ్ళిన తీరు, కంపెనీ లాభాలను 50 రెట్లు పెంచిన విధానం, లాభాలలో 60 శాతానికి పైగా సమాజాభివృద్ధికి వెచ్చించిన సామాజికస్పృహ అందరికీ ఆదర్శప్రాయం” అంటూ పుష్పాంజలి ఘటించారు. రతన్ టాటా ప్రతి అడుగులోనూ దేశభక్తి కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని, భౌతికంగా రతన్ టాటా మనకు దూరం అయినప్పటికీ ఆయనచేసిన సేవలు చిరస్మరణీయం అంటూ మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజీవ్ కామత్, మురళీ వెన్నం, రన్నా జానీ, రజనీ జానీ, రాంకీ చేబ్రోలు, తాయాబ్ కుండావాలా, ఫాతిమా కుండావాల, తిరుమల్ రెడ్డి కుంభం, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, లెనిన్ వేముల, విజయ్ బొర్రా, వాసు గూడవల్లి, జిగర్ సోనీ, రాజేశ్వరి ఉదయగిరి, కిశోర్, షోవిన్ మొదలైనవారు రతన్ టాటా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
డాలస్‌లో ఘనంగా 'గాంధీ శాంతి నడక-2024'
డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక 2024 పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఎఎన్టి అధ్యక్షులు రాజీవ్ కామత్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎం.జి.ఎం.ఎన్.టి) కార్యదర్శి రావు కల్వాల అతిథులకు స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీ స్మారకస్థలి నిర్మాణంలో సహకరించిన తోటి కార్యవర్గ సభ్యులకు, ప్రజలకు, సంస్థలకు, దాతలకు, ఇర్వింగ్ నగర అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ మాట్లాడుతూ “నేను ఎక్కడకు వెళ్ళినా, విదేశాలలో సైతం మీది మహత్మాగాంధీ విగ్రహం నెలకొనియున్న ఇర్వింగ్ నగరమేనా అని అడుగుతున్నప్పుడు ఆశ్చర్యంతోపాటు గర్వం కలుగుతోందన్నారు. కేవలం మహత్మాగాంధీ విగ్రహ నిర్మాణమేగాక, ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్క్ సుందరీకరణలో కూడా భాగమైన ఎం.జి.ఎం. ఎన్.టి నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.్ఙ హ్యుస్టన్ నగరంనుంచి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ మాట్లాడుతూ “మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆశయాలు సర్వత్రా అన్నివేళలా సజీవంగా ఉంటాయి. శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహత్మాగాంధీ విగ్రహాన్ని ఇర్వింగ్ నగరంలో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనల్ఙు అన్నారు. ఈ వేడుకలలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన ఈ మహత్మాగాంధీ విగ్రహశిల్పి బుర్రా శివ వరప్రసాద్ విజయవాడనుండి, ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గుజరాత్ నుండి, కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ల గా ఎన్నికైన భారత సంతతికి చెందిన బిజు మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్ లను, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులు రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడులను డా. ప్రసాద్ తోటకూర, ముఖ్య అతిథులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలసి ఘనంగా సన్మానించారు. దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాతలపేర్లతో కూడిన శిలాఫలకాన్ని కాన్సుల్ జెనరల్ ఆఫ్ ఇండియా డి. సి మంజునాథ్ ఆవిష్కరించారు. “గాంధీ శాంతి నడక 2024్ఙ ను ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ ప్రారంభించే ముందు శాంతికి సంకేతంగా 10 తెల్లటి పావురాలను అందరి హర్ష ధ్వానాలు, కేరింతలమధ్య గాలిలోకి విడుదలజేశారు. నడక పూర్తయిన తర్వాత, మహాత్మాగాంధీ విగ్రహానికి అందరూ పుష్పాంజలి ఘటించి అల్పాహారం ఆరగించి, ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈనాడు దినపత్రిక (ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, కర్ణాటక) సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ ఈ విగ్రహనిర్మాణ సాకారంలో అవిరళ కృషిచేసి సాధించిన వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, కార్యవర్గ సభ్యులందరినీ ప్రశంసిస్తూ ఇది ప్రవాసభారతీయులు ఐకమత్యానికి చిహ్నం అన్నారు. ప్రవాస భారతీయుడుగాఉన్న గాంధీ దక్షిణఆఫ్రికా దేశంనుండి మాతృదేశానికి తిరిగివచ్చి భారతదేశపు స్వాతంత్య్ర సముపార్జనలో దశాబ్దాలగా సాగించిన శాంతియుత పోరాటం చరిత్ర మరువలేని సత్యం అన్నారు. అమెరికాపర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారి పర్యటనలో భాగంగాఉన్న ప్రవాస తెలుగుదేశంపార్టీ నాయకులు జయరాం కోమటి, సతీష్ వేమన, సినీ నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త రాం గుళ్ళపల్లి, మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.వేడుకలలో: ఎం.జి.ఎం.ఎన్.టి వవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాజీవ్ కామత్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, షబ్నం మాడ్గిల్, కుంతేష్, గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు, రాజేంద్ర వంకావాల, వినోద్ ఉప్పు, లోకేష్ నాయుడు వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. -
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!
దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఏఎఫ్.ఏ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఉదాహరణంగా వివరించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఏ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఏ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనేగ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యం చేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్‌ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. క్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.” శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు) -
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు. చిన్న వయసులోనే గుండెపోటు మరిణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవిష్యత్తు కలలతో విదేశాలకు వెళ్లిన కన్న కొడుకు ఆకస్మిక మరణం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కావూరు గ్రామానికిచెందిన చిలుకూరి శ్రీరాఘవ దొర (24) మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని బంధువులు తెలిపారు. కష్టపడి చదువుకున్నాడని, చాలా మంచి వ్యక్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాఘవ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
డల్లాస్ లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు టెకీలు దుర్మరణం
డల్లాస్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు టెకీలు మృతి చెందారు. డల్లాస్‌లో శనివారం(ఆగస్టు31) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. -
తమ్ముడిని మిస్ అవుతున్నా..
మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్.రాంకోటి, ప్రభావతికు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరిలో పెద్దమ్మాయి సౌమ్య పెళ్లి అనంతరం గత నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మూడేళ్లు చికాగోలో ఉండగా ఏడాది నుంచి డల్లాస్‌లో ఉంటున్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి ప్రతి రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొనేవారు. గతేడాది ఇక్కడికే వచ్చిన ఆమె తమ్ముడికి స్వయంగా రాఖీ కట్టింది. ఈ ఏడాది అమెరికాలో ఉండడంతో తన తమ్ముడు వినయ్‌కుమార్‌కు డల్లాస్ నుంచి కొరియర్ ద్వారా తమ్ముడికి రాఖీ పంపించింది. దీంతో వినయ్‌కుమార్ అక్క సౌమ్య పంపిన రాఖీతోపాటు మరో సోదరి విష్ణుప్రియతో రాఖీ కట్టించుకుంటానని పేర్కొన్నాడు.తమ్ముడిని మిస్ అవుతున్నా.. చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం డల్లాస్‌లో ఉండడం వల్ల తమ్ముడిని రాఖీ కట్టలేకపోతున్న. గతేడాది రాఖీ పండుగ రోజు అక్కడే ఉండడం వల్ల తమ్ముడికి రాఖీ కట్టాను. ఈ ఏడాది రాఖీ పండుగ రోజు తమ్ముడిని ఎంతో మిస్ అవుతున్నా. నేను పంపే రాఖీ తమ్ముడికి అందాలనే ఉద్దేశంతో మూడేళ్ల నుంచి కొరియర్ ద్వారా పంపుతున్న. ఆ రోజు వీడియో కాల్లో తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతాను. – సౌమ్య, ఎన్ఆర్ఐ (డల్లాస్) -
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
డల్లాస్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. -
TANA: తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రల్ఙు సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడంద్వారా కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక ఆయా ప్రముఖులు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరునుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘జీవితచరిత్రలు’ లేదా ‘ఆత్మకథలు’ చాలా ముఖ్యభూమిక వహిస్తాయన్నారు. కృష్ణాజిల్లాలోని ‘ముదునూరు’ అనే గ్రామంలో “జీవితచరిత్రల గ్రంధాలయం్ఙ వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథిగా పాల్గొని ఈ గ్రంధాలయ స్థాపన వెనుకఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్నవారిలో సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాల్ఙు అనే జీవితచరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం్ఙ అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాల హృద్యంగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు “అప్పయ్య దీక్షితుల్ఙు మరియు “అల్లూరి వేంకటాద్రిస్వామ్ఙి జీవిత చరిత్రలలోని అనేక విశేషాలను పంచుకున్నారు.ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును “రాగిణీదేవ్ఙి గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్నదీ, నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసిందీ, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందీ లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. అలాగే తాను నమ్మిన సిద్దాంతంకోసం తన తుదిశ్వాస వరకు ఏవిధంగా గిడుగు ఒంటరి పోరాటం చేసినదీ, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్త్ఙి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థులకోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/watch?v=PpLUQ3jT2JU -
డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోదీ 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర చెప్పారు.డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి డా.మంజునాథ్‌కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తోటకూర సహా, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు , ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు – మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ తదితరులు యోగావేడుకలు విజయవంతంలో కీలకపాత్ర వహించారు. విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు. -
T20 WC: తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!.. కెనడా భారీ స్కోరు
క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్ వేదిక. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్లు, బ్యాట్‌తో ‘స్కోర్ ఫోర్’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.పీజే గోడ్హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు లింకన్ అతిథిగా హాజరయ్యారు. కెనడా భారీ స్కోరుటీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో ఆరోన్ జాన్సన్(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్ ధాలివాల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)తొలి హాఫ్ సెంచరీతద్వారా టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ పగ్రాత్ సింగ్(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.ఇక వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్ హేలిగెర్(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్ సింగ్ 11 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చండీగఢ్‌లో జన్మించిఅక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్ ధాలివాల్. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అవర్ కిడ్స్ మాంటిస్సోరిలో రోబో గణేశన్ నృత్య, నటన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరంలో 20 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. ఎంతో మంది ఔత్సాహికులు ఈ శిక్షణా శిబిరంలో నృత్యం, నటనలోని మెళుకువలు నేర్చుకున్నారు. తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు.. ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా నిర్వహించిన రోబో గణేశ్‌ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, ఇతర డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని, తదితరులను బాపు నూతి ప్రత్యేకంగా ప్రశంసించారు. డల్లాస్‌లో తెలుగువారి కోసం ఇంత చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!) -
గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆసంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగిరెడ్డి, చెన్నాకొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం,చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధకారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు,పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహ కోరుకునే యువతియువకుల కోసం మాట్రిమోనీ మొదలయిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. గ్రేటర్ రాయలసీ సంస్కృతిని కాపాడటం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవేకాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు వైద్య నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. డల్లాస్ నగరంలో రాలయసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజురోజుకి సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డల్లాస్ వాసలు, డల్లాస్‌కి వచ్చేవారు గ్రాడా(GRADA) సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఫిబ్రవరి 17న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్(North Texas Food Bank) వారి ద్వారా దాదాపు 500 మందికి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచి పెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డల్లాస్ వాసుల కోసం GRADA నిర్వర్తించనుంది. ఈ కార్యక్రమంలో నందకొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమామహేశ్వర్ గర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణి కుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల,భానుమితి రేవుల, సునీల జంపాల, హర్షదళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్కుంట, హరినాత్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవని మెట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. (చదవండి: అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..) -
నాట్స్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ పోటీలకు విశేష స్పందన
భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్.. తెలుగు వేడుకలకు సిధ్దమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన 'బ్యాడ్మింటన్ మరియు పికిల్‌బాల్' టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్‌లోని లెవిస్విల్లేలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్లేయర్స్ పెద్ద ఎత్తున పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు. ఒపెన్ మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఒపెన్ ఉమెన్స్ డబుల్స్, సినీయర్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో పికిల్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఆసక్తిగా సాగాయి. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 15,16 తేదీల్లో జరిగే నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలను అందించనున్నారు. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
డల్లాస్ లో యాత్ర 2 మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్
-
డల్లాస్ లో గ్రాండ్ గా యాత్ర 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిమీద ఉంది” అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్య్రసిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రవాసభారతీయులు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బీ.ఎన్ జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇవి చదవండి: అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం -
డల్లాస్ లో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. -
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం!
అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ డల్లాస్‌లోని ఇస్కాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా కళాచంద్ జీ ఆలయం రామ నామ జపంతో మార్మోగింది. ఇక భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్ ఇస్కాన్ టెంపులలో దీపావళిని తలపించే విధంగా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకింది. (చదవండి: ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
-
డాలస్‌లో బతుకమ్మ వేడుకలు, స్పెషల్ అట్రాక్షన్‌గా సంయుక్తా మీనన్
డాలస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను సంయుక్తంగా ఫ్రిస్కో పట్టణ పరిధిలోని కొమెరికా సెంటర్లో వైభవంగా జరిపించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీపాడ్ బృందం తెలిపింది. ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ సంయుక్తామీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగువలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అనంతరం దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్‌బలయ్ తీసుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన అనంతరం కళాకారుల బృందం అమ్మవారి మహాశక్తిని నృత్యరూపకంగా ప్రదర్శించి గూస్బంప్స్ తెప్పించింది. అటు డ్యాన్సర్లు, ఇటు గాయకుల అలుపెరగని ప్రదర్శనతో కార్యక్రమం మరింత కనులవిందుగా, వీనులవిందుగా మారింది. సింగర్స్ సమీర భరద్వాజ్, పృథ్వీ, ఆదిత్య, అధితీ భావరాజు.. దాదాపు 3 గంటల పాటు తమ పాటలతో మనసునిండా పండుగ తృప్తితో పాటు సాంత్వన కలిగిస్తూ కొత్త శక్తిని నింపారు. జాతరను తలపించిన కొమెరికా సెంటర్ కార్యక్రమంలో భాగంగా బైక్రాఫెల్, 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల గోల్డ్రాఫెల్ను సినీనటి సంయుక్తామీనన్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. జాతరకు ఏమాత్రమూ తీసిపోదన్నట్టు వెలిసిన వెండర్బూతలు ఆసాంతం రద్దీతో కనిపించాయి. కొమెరికా సెంటర్లోకి అడుగుపెట్టేందుకు తొక్కిసలాట జరగకుండా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. -
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
-
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టిప్యాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
-
అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని
పాన్ ఇండియా నటుడు అక్కినేని నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అల నాడే పాన్ ఇండియా నటుడు అయ్యారు అన్నారు పూర్వ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ ఉప కులపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య కొలకలూరి ఇనాక్.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్టొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికా లోని డల్లాస్ నగరం లోని ప్రిస్కో లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా,నటసమ్రాట్ ఆక్కి నేని - ఆకృతి జాతీయ పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాదుకు ప్రదానం చేశారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ దుశ్హాలువాతో, పుష్పగుచ్ఛంతో, ఘనంగా సత్కరించి అక్కినేని ఆకృతి జాతీయ పురస్కారాన్ని తోటకూర ప్రసాద్ కు అందించారు.. చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తూ, అక్కినేని తన పాత్రల ఎంపిక లో ఎంతో పరిణతి చూపెవారన్నారు.. స్వయం కృషి తో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు.. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రలలో పరిధవిల్లడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు.. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ అమెరికా లోని తెలుగు సమాజానికి అండగా వుంటు అక్కినేని పేరిట అనేక కార్య క్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పురస్కార గ్రహీత పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తన బలం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేవారని అన్నారు.. ఆయన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు.. విశిష్ట అతిథిగా డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికా లోని ప్రముఖ కార్డియాజిస్ట్ డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆకృతి అమెరికా లో నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు.. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కలవల అక్కినేని తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్, మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా వ్యవహరించారు.. ఈ సందర్భంగా అమెరికా లో తెలుగు గాయకులు చంద్రహాస్, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేనీ చిత్ర గీతాల విభావరి జనరంజకంగా నిర్వహించారు.. -
డల్లాస్ లో ఘనంగా చిన్న బతుకమ్మ
-
టెక్సాస్ లో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ
-
డల్లాస్ లో SVES కాలేజీల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
-
మెగా మెడిటేషన్ సమ్మిట్ 2023
-
డల్లాస్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
డల్లాస్ లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
-
డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!
ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) భాషే రమ్యం , సేవే గమ్యం, తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో, డల్లాస్ లో అసంఖ్యాకంగా పెరుగుతున్న తెలుగు వారి సంరక్షణ నిమిత్తం, ఇటీవల పెరుగుతున్న నేరాలు, దోపిడీలను దృష్టిలో ఉంచుకొని కాఫీ విత్ ఎ కాప్ (Coffee with a Cop) అనే కార్యక్రమాన్ని నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ఫ్రిస్కో మోనార్చ్ వ్యూ పార్క్, ఫ్రిస్కో, టెక్సాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రిస్కో పోలీస్ శాఖ నుండి విచ్ఛేసిన ఆఫీసర్ గిబ్సన్ మరియు డిటెక్టివ్ చావెజ్ ముఖ్యంగా ప్రజలు దొంగతనాలు, దోపిడీల బారిన పడకుండా వహించాల్సిన జాగ్రత్తలు , ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లను వివరించారు. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, చెట్లను క్రమ పద్ధతిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను, లైటింగ్ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియచేశారు. పండుగలు, సెలవలు వంటి సందర్భాలలో విలువైన నగలు, ఇతర వస్తువులను భద్రపరచటంలోనూ, వాటిని ధరించి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా, విద్యార్థులు స్కూల్స్ లో కంప్యూటర్ ఉపయోగించటంలోను, సైబర్ భద్రత విషయంలోను, బుల్లియింగ్ విషయంలోను మరియు ఇతర అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు. అంతేకాక, అనుమానిత వ్యక్తులను గుర్తించినపుడు దూరం నుండే వారి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించి వెంటనే పోలీసులకు అందివ్వాలని సూచించారు. అలాగే ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న వివిధ కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా హాజరై, చివరలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పోలీస్ ఆఫీసర్ ల నుండి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను అందిస్తున్నందుకు అక్కడకు వచ్చిన అందరూ నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రశంసించారు. నాట్స్ డల్లాస్ కార్యవర్గ సభ్యులు చాప్టర్ కో అర్డినెటర్స్ రవి తాండ్ర, సత్య శ్రీరామనేని ఇతర సభ్యులు శ్రీధర్ న్యాలమాడుగుల, రవి తుపురాని, పార్థ బొత్స, శివ నాగిరెడ్డి, రవీంద్ర చుండూరు, గౌతమ్ కాసిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔనాట్స్ అధ్యక్షులు బాపు నూతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల ఈ కార్యక్రమంలో పాల్గొని, మన కమ్యూనిటీకి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి కూడా ఈ సందర్భంగా డల్లాస్ చాప్టర్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నాక్స్ మరియు టీ అందించిన స్వాగత్ బిర్యానీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే, నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్ , ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ముందు, ముందు మరిన్ని విలక్షణమైన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియచేశారు. (చదవండి: కువైట్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!) -
T20 WC 2024: ఐసీసీ ప్రకటన.. ఆ 3 నగరాలకు గుడ్‌న్యూస్
3 USA venues locked in for ICC Men's T20 WC 2024: ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది. మొట్టమొదటిసారి కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోగా.. వేదికల ఎంపికలో ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్లకు ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫ్యాన్స్ కోసమే ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్‌లు నేరుగా వీక్షించేందుకు యూఎస్ఏలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం దొరకనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా.. -
డల్లాస్ లో బండి సంజయ్ కి ఘన స్వాగతం
-
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 'భగవద్గీత పారాయణం
-
వైఎస్సార్ 14వ వర్థంతి: డాలస్‌లో రక్తదాన శిబిరం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలోని డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్‌లో బ్లెడ్ డ్రైవ్ నిర్వహించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ సభ్యులు తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
NATA Convention 2023: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డాలస్ లో నిర్వహించిన నాటా కన్వెన్షన్ 2023లో ఎన్నో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో నాటా విమెన్ ఫోరమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సానపురెడ్డి, నాటా మహిళా ఫోరం ఛైర్పర్సన్ సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసంలో తెలుగు మహిళలు చేసిన పనులు స్ఫూర్తిదాయకం అన్నారు. ఏ ఏ అంశాలు? గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, లైంగిక వేధింపులు, హాలీవుడ్ సినిమాలో నటించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నాటా మహిళా ఫోరం సలహాదారులు కృష్ణవేణి రెడ్డి, లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వినూత్నంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారు, నిర్వాహకులు, సమన్వయ కర్తలు అందరూ మహిళలే అవడం, "మా అందరిదీ ఒకే మాట ఒకే బాట" అంటూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఉమాభారతి కోసూరి (నృత్య సాహిత్య కళా భారతి) మధురమైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనీ శాస్త్రి (అమేరికోకిలా) మధురమైన గళముతో పాడి వినిపించారు. మహిళా పరివర్తన - దశాబ్దాలుగా 'స్త్రీ' ఎదుగుదల - సంగీత సాహిత్య దృశ్య కథనం విభాగంగా అతివల గురించి అందమైన శ్రవణ దృశ్యాలతో పాటు చక్కని మాటలతో పాటలతో మనసుకు హత్తుకునేలా చేశారు. మహిళా విశిష్టత మహిళా ప్రతిభ - చరిత్రలో తెలుగింటి ఆడపడుచులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఆడపడుచుల అనుభవాలను, అనుభూతులను, కష్టాలను, ఎదుగుదల, ఈ స్థాయికి ఎలా వచ్చారో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కల్పించారు అమల దుగ్గిరాల (EVP ఎంట్రప్రెస్స్ CIO at USAA ), ఉమా దేవిరెడ్డి (TEDx Leadership Coach),, ప్రేమ రొద్దం (Corporate & Business Immigration Attorney ) స్పూర్తిదాయకమైన స్త్రీలు వారి జీవితంలో ఎన్నుకున్న వృత్తి ఎంతవరకు వారు న్యాయం చేశారో చేస్తున్నారో చర్చించారు. అమ్మ నుండి అంతరిక్ష మహిళ వరకు “మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సంస్కరణలు, మహిళా సాధికారతకు తమవంతుగా మహిళలు తాము వున్నాం అని తెలపడం జరిగింది. అమ్మ నుండి అంతరిక్షం వరకు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు.. ఎందులోనూ తీసిపోరు అన్నట్లు వసంత లక్ష్మి అయ్యగారితో నిర్వహించిన మహిళా మిమిక్రీ కార్యక్రమం అత్యంత జనరంజకంగా సాగింది. ఇన్నాళ్లు మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకున్న ఈ మిమిక్రీ కళను అత్యంత సమర్థతతో నిర్వహించి కడుపుబ్బా నవ్వించారు. మరికాస్త హాస్యం కోసం ‘టాక్ ఆఫ్ ది టౌన్ 'లో సజితా తిరుమలశెట్టి , కవిత రాణి కోటి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. మనీ శాస్త్రి వారి మధురమైన గళముతో పాడి వినిపించారు, ఉమాభారతి కోసూరి వ్యాఖ్యాతగా (నరేషన్) సంగీత సాహిత్య సమ్మోహనం - మాన్యుల మన్నన మనల్ని అలరించే ఓ అద్భుతమైన దృశ్యం. ముఖ్య అతిధులుగా వాసిరెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఛైర్ పర్సన్ అఫ్ TTD LAC in ఢిల్లీ ఉమెన్స్ ఫోరమ్.. మహిళలందరిని ప్రశంసించారు. ఇక్కడి మహిళలు తమ వృత్తిని, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనేక జనరంజక కార్యక్రమాలలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న కూచిపూడి నృత్య కళాకారిణి పద్మ శొంఠి నృత్య కార్యక్రమం, మహిళా రక్షణ గురించి వివేక్ తేజ చెరుపల్లి ప్రసంగం తో పాటుగా మహిళలు తనకు తానుగా రక్షణ, భద్రత ఉపాయాలు మెళకువలు తెలిపారు. వైష్ణవి రామరాజు 'సొగసు చూడతరమా' అంటూ మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వేసుకునే మహిళల వస్త్రధారణ తీరులను ప్రదర్శన చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్ అయింది. అరుణ సుబ్బారావు (పేరడీ క్వీన్, ఫోక్ సింగర్)- తన పేరడీ తో పాటు కొన్ని ఫోక్ పాటలు కూడా పాడి వినిపించడం ద్వారా ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. మహిళ ప్రతిభ మహిళా సాధికారత” (Women Empowerment) విభాగంలో మన తెలుగింటి ఆడపడుచులు పల్లవి శాస్త్రి (Hollywood Producer & Actress) వారి మూవీ "LAND GOLD" (Brilliant Film on Faith Family & Culture in America) కీర్తన శాస్త్రి, Hollywood Producer & Casting Director) మరియు అపూర్వ గురుచరణ్ (Los Angels based Indian Producer) మూవీ "JOYLAND " వారిని 'మహిళా ప్రతిభ' పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలో వేటికవే గొప్ప ప్రదర్శనలు అయినప్పటికీ 'పురాతన సంప్రదాయ చీరల ప్రదర్శన' మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1930 నుండి 1990 వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని చీరల ప్రదర్శన, ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 40 చీరలు పైగా ఈ ప్రదర్శనలో చూడటం జరిగింది. ఆ కాలంలో వాడిన కాంచీపురం, ధర్మవరం, ఆరణి, వేంకటగిరి, మంగళగిరి, పైతాని, బనారస్, షికార్గ్, కశ్మీరీ పట్టు చీరలు , ఈ కాలంలో దొరకని అపురూప చీర సంపదలను ప్రదర్శించి, ఆహూతులను అచ్చెరువొందేలా చేశారు. ఈ చీరలను చూసి తమ అమ్మమ్మ, నానమ్మ దగ్గర చూసిన చీరలు అని అందరూ తమ గత జ్ఞాపకాల్లోకి జారుకుని, ఆనందానుభూతులకు లోనయ్యారు. సంధ్య పుచ్చలపల్లి (ఫౌండర్ అఫ్ ఆర్తి హోమ్) చీరలు మగ్గం మీద నేయడం ఒకొక్కటిగా వివరించి, నేత కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం, చీర యొక్క పుట్టుపూర్వోత్తరాలు వివరించడం విశేషం. ఆఖరున కృష్ణవేణి రెడ్డి శీలం, NATA ఉమెన్స్ ఫోరమ్ Advisor కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, అభిమానులకు, NATA ప్రెసిడెంట్ శ్రీ కొర్సపాటి శ్రీధర్ గారికి మరియు వారి కార్యవర్గానికి NATA ఉమెన్స్ కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో మహిళల ప్రాధాన్యత, వారి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రయత్నం అంచనాలను మించి విజయవంతం అయిందని, దీనికి తోడ్పాటు అందించిన వారిందరికి నాటా మీడియా అడ్వైజర్ కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
గ్రామాలకు చేయూత
మీలో ఎంతో మంది మూలాలు మన మట్టిలోనే, మన గ్రామాల్లోనే ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మీలో ఎంతో మంది అక్కడ రాణించేందుకు కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ కారణం. ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. అలాంటి కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉండటాన్ని నేను చూశా. ఆకాశాన్ని అధిగమించి ఎదిగేందుకు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలన్న తపనతో నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. గ్లోబల్ సిటిజన్‌గా ఎదగాలంటే చదువన్నది ఒక పెద్ద సాధనం. – ప్రవాసాంధ్రులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు విలువైన తమ నైపుణ్యాలు, అనుభవాలను పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐక్యంగా కాపాడుకుంటూ ఎన్నారైలు విదేశాల్లో కీలక పదవుల్లో, ఉన్నత స్థానాల్లో రాణిస్తుండటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ‘నాటా’ (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ సోమవారం వీడియో సందేశం పంపారు. గ్లోబల్ సిటిజన్‌గా ఎదిగేందుకు చదువన్నది కీలక సాధనమన్నారు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు నాలుగేళ్లుగా విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, గ్రామాల్లోనే అందిస్తున్న సేవలను గమనించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీరంతా మాకు గర్వకారణం.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తోపాటు అందరికీ శుభాకాంక్షలు. నాలుగేళ్ల క్రితం నేను డల్లాస్ వచ్చిన సందర్భంగా మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. విదేశాల్లో ఉన్న ఇంత మంది తెలుగువారు గొప్పవైన మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, పేరు పొందిన డాక్టర్లుగా రాణిస్తున్న మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం. సర్కారు స్కూళ్ల స్వరూపాన్ని మార్చేశాం రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన మార్పులను గమనిస్తే మన గవర్నమెంట్ బడులన్నీ పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు – నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్య అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి అన్నిచోట్లా వీటి ఏర్పాటు పూర్తి అవుతుంది. మన గవర్నమెంట్ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్, ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వ తరగతి నుంచే సన్నద్ధం చేసి టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్.. ఇలా పదో తరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ విద్యా వ్యవస్ధలో తెచ్చిన మార్పులు. చదువు అనే ఆయుధం ఎంత అవసరమో తెలియచేసేందుకు ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తోంది. సుదీర్ఘంగా వెల్లడించే సమయం లేకున్నా రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగా. గ్రామాల్లోనే 600 రకాల పౌర సేవలు విద్యారంగం ఒక్కటే కాదు.. ఏది చూసినా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. అంతెందుకు.. మీ అందరికీ గ్రామాల్లోనే మూలాలు, పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి మీ గ్రామాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ చూడని విధంగా విలేజ్ సెక్రటేరియట్ మీ కళ్లెదుటే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది ఉద్యోగులు మీ ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి 2,000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను తెచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్న గొప్ప పరిస్థితి ఇవాళ ఉంది. పౌర సేవల్ని వలంటీర్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. పెన్షన్, రేషన్ అన్నీ మన ఇంటి ముంగిటికే వస్తున్న గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. విత్తనం నుంచి పంట విక్రయాల వరకూ ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తోంది. నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కూడా కనిపిస్తాయి. ప్రివెంటివ్ కేర్‌పై దృష్టి ప్రివెంటివ్ కేర్‌పై ఒక ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ లాంటి జీవన శైలి జబ్బులకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్, కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే ప్రివెంటివ్ కేర్ చాలా ముఖ్యం. అందుకే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను తెచ్చాం. ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క వైద్య రంగంలోనే 48 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. నాడు – నేడుతో ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం. మన గ్రామాల్లో ఆర్థిక సుస్థిరత ఇక్కడ మన రాష్ట్రం గురించి మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తే వినియోగం పెరిగిపోయి ఉత్పత్తిదారులు లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత తలెత్తి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే విక్రయిస్తాం. ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే రవాణా వ్యయం కూడా ఉంటుంది. అంతేకాకుండా రీటైల్ మార్జిన్, సరఫరా వ్యయం కూడా భరించాలి. అందుకే ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న పనులతో వాటిని చేరుకోగలం. గ్రామాల్లో ఉన్నవారు ఏం కోరుకుంటారో గమనిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. పిల్లలకు ఇంగ్లిష్ రావాలని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్నవారి కోసం విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను ప్రవేశపెట్టాం. ఇవికాకుండా వ్యవసాయ రంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అనేది రాబోయే రోజుల్లో సాకారం కానున్న గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామానికి వస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కూడా వస్తాయి. గ్రామస్ధాయిలో మన కళ్లెదుటే జరుగుతున్న గొప్ప మార్పులివి. పోర్టులు, హార్బర్లు, ఇండ్రస్టియల్ కారిడార్లు.. మౌలిక వసతులపై నాలుగేళ్లుగా పురోగతిని గమనిస్తే పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు సాకారమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లుగా రాష్ట్రంలో ఆరు పోర్టులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాం. తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటవుతుండగా అందులో మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన గ్రామాలపై దృష్టి పెట్టండి.. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపార నైపుణ్యం మీకుంది. మన రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా తోడ్పాటు అందించండి. ఆర్ధికంగా అనే మాటలు కాస్తో కూస్తో బాగుంటాయి కానీ అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం మీద, మన గ్రామాలపైన ధ్యాస పెట్టగలిగితే అవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. నాటా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఏది కావాలన్నా ఇంగ్లిష్‌లోనే.. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను మన పిల్లలు చదువుతున్నారు. ప్రపంచంలో విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం ఇంగ్లిష్. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్‌గా ఎదగటానికి ఇంగ్లిష్ ఒక సాధనం. ఏది చదువుకోవాలన్నా, సబ్జెక్ట్పె అవగాహన పెంచుకోవాలన్నా ముందు ఇంగ్లిష్‌పై పూర్తి స్థాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్ ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉంది. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఇంగ్లిష్ ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. ఈవోడీబీలో మూడేళ్లుగా నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం వరుసగా మూడేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్ 4, 5 స్థానాల్లో ఉంది. మనందరి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, మహిళా సంక్షేమం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన.. ఇలా ప్రతి విషయంలో దేశంలోనే గొప్ప మార్పులకు నాంది పలికింది. -
నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా, టెక్సాస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 30 నుంచి జులై 2 వరకు జరుగుతున్న తెలుగు మహాసభల్లో భాగంగా అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. నాటా మహాసభల్లో రెండోరోజు వేడుకల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో వైకాపా ప్రభుత్వ ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైకాపా సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా వినియోగించుకోవడం, వైకాపాను ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. (చదవండి: డల్లాస్‌లో ఘనంగా నాటా మహాసభలు..జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు) -
NATA Convention : అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జూన్ 30 నుంచి జులై 2 వరకు డల్లాస్‌లో జరిగిన నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. (నాటా పూర్వ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి) ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ & ట్రైనింగ్ చల్లా మధుసూధన్ రెడ్డి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ఆర్టీ మేడపాటి వెంకట్, అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ వైపు అడుగులు వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్.మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (నాటా వేదికగా జరిగిన వైఎస్సార్ జయంతికి హాజరైన ప్రముఖులు) ఓటమి ఎరుగని నేత 1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఉత్తాన పతనాలు వైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లోనూ వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. వైఎస్సార్ సిపి @ నాటా వేడుకల కన్వెన్షన్ నాటా వేడుకల సందర్భంగా విచ్చేసిన అతిథులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. డాలస్ లోని కన్వెన్షన్ సెంటర్ వద్ద తోరణాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ పరిపాలన ముఖ్యాంశాలను ప్రదర్శించింది. (అమెరికా డాలస్ లోని నాటా వేదిక) అమెరికాతో డా.YSRకు అనుబంధం మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. తన చిరకాల మిత్రుడు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. (చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్) -
భగవద్గీత పరాయణంతో పులకించిన డాలస్
-
డల్లాస్‌లో నాటా మహాసభలు.. ఘనంగా ఏర్పాట్లు పూర్తి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా)మహాసభలు ఈనెల 30నుంచి అమెరికాలో ఘనంగా జరగనున్నాయి. డల్లాస్‌లో జూలై 1, 2 తేదిల్లో విమెన్స్ ఫోరం కార్యక్రమాలు విమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్ 2023 విమెన్స్ ఫోరం ఛైర్పర్సన్ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. విమెన్స్ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి అని పేర్కొన్నారు. జులై 1న వివిధ రంగాల్లో ప్రముఖులైన ఉపన్యాసాలు, పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జులై2న టాక్ ఆఫ్ ద టౌన్‌తో మొదలై, మహిళా తెలుసుకో సెగ్మెంట్లో అలంకరణపరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సూచనలు, సొగసు చూడతమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటుందని తెలిపారు. నాటా సభల్లో వాసిరెడ్డి పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి శాస్త్రి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్ణవి రంగరాజన్, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్ మరియు వివేక్ తేజ చేరుపల్లి తదితరులు పోల్గొననున్నారు. -
‘నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అవార్డు ఇన్ జర్నలిజం–2023కు ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నాటా” ఆహ్వానం మేరకు సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు ఈ నెల 29న (గురువారం) పయనమౌతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యం లో ఏటా జరిగే తెలుగు ప్రజల ఉత్సవాలను యీ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో నిర్వహిస్తున్నారు. జూన్ 30 నుండి జులై 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను సన్మానించడం జరుగుతుంది. 2023 సంవత్సర "నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్స్ లెన్స్" అవార్డును అందుకునేందుకు శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు జులై 1 నాటికి చేరుకుంటారు. తిరిగి జులై 16న విజయవాడ చేరుకుంటారు. ఇది కూడా చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
నాటా వేడుకలకు వేళాయె!
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండు వరకు అమెరికాలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ వేదికవుతోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజసేవే నాటా బాట’ అనే నినాదంతో ఇప్పటివరకు ఆ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నాటా సభలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో వంద మందికి పైగా రాజకీయ, సినీ, అధికార ప్రముఖులు ఉంటారని సమాచారం. ఈ సభల్లో దాదాపు 20 వేల మంది వరకు ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించి ఏరోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందుకు నాటా అధ్యక్షుడు డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి ఆతిథ్యం వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు పలు కమిటీల సభ్యులు, వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడురోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కరోనా తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రవాసాంధ్రులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలుగా ఇవి మిగిలిపోనున్నాయని నిర్వాహకులు అంటున్నారు. ప్రవాసాంధ్రులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్క కుటుంబం అనే భావన తీసుకురావడమే ప్రపంచ తెలుగు మహాసభల వెనుక ఉన్న ఉద్దేశమని చెబుతున్నారు. భావి తరాలకు ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమవంతు సహాయం చేయడం, కొత్త తరానికి స్ఫూర్తిదాయక సందేశం ఇవ్వడమే నాటా ముందున్న లక్ష్యాలు. కరోనా తర్వాత నిర్వహిస్తుండటంతో ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లలో వసతి, రాకపోకలకు అధునాతన రవాణా సౌకర్యం, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగువారి వనభోజనం
డాలస్ మురిసేటట్టు.. ప్రకృతి పరవశించేటట్టు.. తెలుగువారి వనభోజనం అమెరికాలోని డాలస్ మహానగరంలో జాతరను మరిపించింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో ఆర్గైల్‌లోని పైలట్ నాల్ పార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇక్కడ స్థిరపడిన తెలుగువారి హృదయాలను ఆకట్టుకున్నది. టీపాడ్ బృందం సభ్యులు ఫ్లాష్‌మాబ్‌తో హుషారు నింపుతూ సుమారు 2500 మంది అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించడమే కాకుండా వీనులవిందైన సంగీతం, నయనానందకరమైన నృత్య ప్రదర్శనలతో మరపురాని వినోదాన్ని పంచారు. అందాల సరస్సు చెంత ఏర్పాటు చేసిన ఈ ఆటవిడుపు కార్యక్రమం అందరి చింతలను పక్కనపెట్టి హాయిగొలిపిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత దగ్గరి బంధువులను కలుసుకున్న అనుభూతితో పాటు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత ప్రస్ఫుటమైంది. అనుబంధాలను నెమరువేసుకున్నారు. చిన్నా, పెద్దా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీపాడ్ బృందం సభ్యులు కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించారు. విభిన్నంగా స్టేజ్ నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డల్లాస్ యువత ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా నృత్య ప్రదర్శనలిచ్చి అతిథులను అలరించారు. సరస్సు ఒడ్డున 60 ఎకరాల్లో విస్తరించిన పైలట్ నాల్ పార్క్... 2500 మంది తెలుగువారితో రద్దీగా, కళకళలాడుతూ కనిపించింది. హైదరాబాదీ దమ్-చికెనబిర్యానీ, బగారారైస్, పచ్చిపులుసు, పికిల్స్.. తెలంగాణ టేస్ట్‌ను ఎంజాయ్ చేసేందుకు జనం ఉత్సాహం చూపించారు. భోజనానికి బారులు తీరకుండా, నిమిషాల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అందరి ప్రశంసలు అందుకున్నది. తెలుగురాషా్ట్రల్లో జాతరలప్పుడు ప్రత్యేక దుకాణాలు కొలువుదీరిన రీతిలో.. ఇక్కడ 17 వెండర్బూత్లకు అవకాశం కల్పించారు. ఫేస్ పెయింటింగ్, మెహందీ ఆర్టిస్టులకు భలే డిమాండ్ లభించింది. కార్యక్రమంలో భాగంగా రఫెల్ ప్రైజులు అందజేశారు. టీపాడ్ వనభోజన కార్యక్రమానికి ఏటేటా విశేష స్పందన లభిస్తుండడంతో.. ఈ ఏడాది ఇంకా వినూత్నంగా ఆర్గనైజ్ చేయాలన్న టీపాడ్ సభ్యుల ఆరువారాల కసరత్తుకు అందరి మద్దతు దొరకడమే కాకుండా ఊహించని ఆదరణ లభించడం విశేషం. టీపాడ్ ఘనంగా నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్ బండారు (చైర్ ఆఫ్ ఫౌండేషన కమిటీ), సుధాకర్ కలసాని (చైర్ ఆఫ్ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్), రోజా ఆడెపు (కోఆర్డినేటర్) మార్గదర్శకత్వంలో మధుమతి వైశ్యరాజు సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు).. ఈవెంట్ ఆద్యంతం సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించారు. ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్ సుంకిరెడ్డి, అశోక్ కొండల, విజయ్ తొడుపునూరి, శ్రీధర్ వేముల, గోలి బుచ్చిరెడ్డి స్వయంగా వండివార్చారు. ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇనచార్జిగా అనురాధ మేకల (టీపాడ్ వైస్ ప్రెసిడెంట్) వ్యవహరించారు. మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేశారు. స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు.. బహుమతులు, పూజలు, ఇతరత్రా బాధ్యతలు చూసుకున్నారు. అతిథులందరూ లొట్టలేసుకుటూ తినేలా గ్రిల్డ్ స్వీట్‌కార్న్, చికెనబార్బిక్యూను అప్పటికప్పుడు వేడివేడిగా అందించేందుకు శ్రమించిన కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, సురేందర్ చింతల, ఆదిత్య గాదెలకు పలువురి నుంచి ప్రశంసలు దక్కాయి. వనభోజనం ఆసాంతం సజావుగా, అంచనాలకు మించి విజయవంతంగా సాగడానికి కారకులైన స్పాన్సర్లకు, తెలుగువారందరికీ టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. -
డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA బోర్డు సమావేశం
-
RGUKT బాసర VC ప్రొఫెసర్ వి.వెంకట రమణ మీట్ అండ్ గ్రీట్
-
చరిత్ర సృష్టించిన వు యిబింగ్.. టైటిల్ గెలిచిన తొలి చైనీయుడిగా..
ATP Tour- Dallas Open: ఏటీపీ టైటిల్ గెలిచిన తొలి చైనీయుడిగా వు యిబింగ్ చరిత్ర సృష్టించాడు. డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ ఫైనల్లో జాన్ ఇస్నర్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో యిబింగ్ 6-7(4) 7-6(3) 7-6(12) తేడాతో అమెరికాకు చెందిన జాన్‌ను ఓడించాడు. తద్వారా డాలస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గి రికార్డులకెక్కాడు. మీ వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం ఈ సందర్భంగా యిబింగ్ మాట్లాడుతూ.. ‘‘నా దేశం గర్వించదగ్గ రీతిలో ఈరోజు నేనిక్కడ చరిత్ర సృష్టించాను. నాకు చాలా చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన నా అభిమానులు, సహాయక సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాన్..‘ ఎంతగా పోరాడినా ఒక్కోసారి చేదు అనుభవాలు తప్పవు. యిబింగ్ మాత్రం చాలా బాగా ఆడాడు. అతడి ప్రతిభ అమోఘం’’ అని ప్రశంసించాడు. ఒకే ఒక్కడు కాగా మహిళల టెన్నిస్‌లో చైనా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ ఉన్నా... పురుషుల టెన్నిస్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్కరు కూడా కనీసం ఏటీపీ టోర్నీలోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయారు. అయితే డాలస్ ఓపెన్‌లో 23 ఏళ్ల యిబింగ్ వు ఈ లోటును తీర్చాడు. ఈ టోర్నీ సెమీఫైనల్లో 97వ ర్యాంకర్ యిబింగ్ వు 6–7 (3/7), 7–5, 6–4తో 8వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఇదే జోష్‌లో.. ఫైనల్లోనూ సత్తాచాటి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. చదవండి: Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు That winning slide though 😅 What a moment for Wu Yibing after an electric game against Isner 🍿@DALOpenTennis | #DalOpen pic.twitter.com/x2r8D1FAdm — ATP Tour (@atptour) February 12, 2023 -
Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
Saketh Myneni- Yuki Bhambri: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్–మార్కస్ జిరోన్ (అమెరికా) జోడీపై గెలిచింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్ ఫైనల్లో జూలియన్ క్యాష్–హెన్రీ ప్యాటర్న్ (బ్రిటన్)లతో సాకేత్–యూకీ ఆడతారు. చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం -
సిర్నాపల్లి సంస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపిన రాణి కథ తెలుసా? 1905లోనే..
రాజులైనా, సంస్థానాధిపతులైనా, ప్రజాస్వామ్యంలోనైనా పాలకులు చేసిన మంచిని ప్రజలు ఎంత కాలమైనా మరిచిపోరనడానికి నిజామాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చుట్టుముట్టు దట్టమైన అడవి వున్నా ఒకప్పుడు దాదాపు వంద గ్రామాల సంస్థానంగా వెలుగు వెలిగిన గ్రామం సిర్నాపల్లి. దాన్ని బహుకాలం(1859-1920) ఏలిన రాణి శీలం జానకీ బాయి. రాణిగారు తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ఆమె పట్టుదల వల్లనే ఆనాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1899 లో తలపెట్టిన హైదరాబాద్-బోధన్ -మన్మాడ్ రైల్వే లైన్‌ను సిర్నాపల్లి, ఇందూర్(నేటి నిజామాబాద్ )ల వైపు తిప్పారని, ఫలితంగా తమకు 1905లోనే రైలు సౌకర్య భాగ్యం కలిగిందని, ఇందల్వాయి రామాలయాన్ని ఆమెనే నిర్మించిందని గ్రామస్తులు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. పోలీస్ చర్య తర్వాత భారత్‌లో విలీనమైపోయిన హైదరాబాద్ రాజ్యంతో పాటు నాటి సంస్థానాలు 14 కూడా తమ అధికారాన్ని వదులుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట తాకిడితో సిర్నాపల్లి రాణిగారి వారసులు గ్రామాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన నక్సలైట్ ఉద్యమంతో దాదాపు 5 ఎకరాల్లో విస్తరించివున్న సిర్నాపల్లి కోటగడి ప్రభుత్వ బడిగా మారిపోయింది. రాణి జానకీబాయి (1859-1920) వేల్పూర్ రేకులపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిందంటారు. వేటకు వచ్చి అడవిలో తప్పిపోయి, ప్రమాదకర పరిస్థితుల్లోనున్న ఒక నవాబుకు, అడవిలోకి వంటచెరుకు కోసం వచ్చిన ఒక 12 సంవత్సరాల బాలిక దారి చూయించి ఆదుకున్నదని, అతను ఆమె ధైర్య సాహసాలను నిజాం దృష్టికి తీసుకుపోవడంతో రాజు జానకీ బాయి అనే ఆ బాలికను సంస్థాన పాలకరాలుగా నియమించాడన్నది ప్రచారంలో నున్న ఒక కథ. అయితే భర్త అకాల మరణంతో అధికారాన్ని చేపట్టిన జానకీ బాయి సంస్థానాన్ని పాపన్నపేట రాణి శంకర్మమ్మలా సమర్థవంతంగా నడిపి 'మషాల్ దొరసాని'గా (పగలే దివిటీలు వెలగడం ) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చరిత్ర. రాణిగారికి సంస్థాన పాలనలో లింగన్న అనే పట్వారి కీలక పాత్ర పోషించాడని చెప్పుకుంటారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి శీలం రాంభూపాల్ రెడ్డి గారు, INTACH అనబడే సాంస్కృతిక వారసత్వ సంస్థ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు రాణి జానకీ బాయి వారసులేనట. తెలంగాణ నయాగరాగా పేరొందిన సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ రాణి జానకీ బాయి పేరుతో పిలువబడడం ఆమెకున్న ప్రజాదరణను తెలుపుతుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి చదవండి: వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం! -
డల్లాస్‌లో గాంధీ స్మారకాన్ని సందర్శించిన డా.సతీష్ రెడ్డి
డల్లాస్: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్‌క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
హీరోయిన్ కమలిని ముఖర్జీ ఇలా మారిపోయిందేంటి? ఫోటోలు వైరల్
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు సడెన్‌గా మాయమవుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు అన్నది కూడా తెలియదు. అలాంటి వాళ్లలో హీరోయిన్ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 2004లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలిని ఆ తర్వాత ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె సినిమాల్లో నటించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసిన కమిలిని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్లో కనిపించి సందడి చేసింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కమిలిని ముఖర్జీ లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏంటి ఇలా మారిపోయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
డల్లాస్: మద్యం మత్తులో బాలయ్య-పీకే ఫ్యాన్స్ ఘర్షణ
డల్లాస్: ఫ్యాన్స్ వార్‌లో.. ఒక్కోసారి అభిమానులు విపరీతాల దాకా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ, కొందరు తారలు మాత్రం అభిమానుల్ని వద్దని వారించరెందుకో?. రాజకీయం కోసం ఒక్కటవ్వడం తెలిసిన వాళ్లు.. ఫ్యాన్స్‌కు మాత్రం నాలుగు మంచి మాటలు చెప్పడం చేయకపోగా.. ఆ తారలే అభిమానుల్ని పూచీక పుల్లలాగా తీసేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం!. అయినప్పటికీ అభిమానం పేరిట హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అభిమానులు. టీడీపీ, జనసేన అభిమానులు కొందరు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో రచ్చకెక్కారు. డిసెంబర్ 31 రాత్రి కొత్త సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డల్లాస్‌లో ఓ మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్న టీడీపీ ఎన్నారై కీలక సభ్యుడు కేసీ చేకూరి మద్యం మత్తులో.. ‘జై బాలయ్య’ అంటూ అక్కడే ఉన్న పవన్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. ప్రతిగా ‘జై పవన్’ అంటూ నినాదాలు చేశారు పీకే ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ‘అలగాజనం అంటూ తిట్టినా సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గరకొచ్చిన పవన్..’ అంటూ టీడీపీ సభ్యులు హేళన చేశారు. అక్కడితో ఆగకుండా చిరంజీవి , పవన్ పోస్టర్లను చించేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ప్రతిదాడికి పాల్పడబోయారు. గొడవ తీవ్రంగా మారడంతో ఈవెంట్ మేనేజర్లు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో.. వాళ్లపై కేసీ చేకూరి పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఈవెంట్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించగా.. కేసీ చేకూరిని అరెస్ట్ చేసి డల్లాస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణ సంగతి తెలిసిన టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం. కేసీ చేకూరి బెయిల్ కోసం తానా పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
మెతుకు సీమలో ప్రధాన పర్యాటకుల ఆకర్షణగా మెదక్ చర్చి
మెదక్ ఒకప్పటి మెతుకు సీమలో అడుగు పెట్టగానే అల్లంత దూరం నుంచి మనకు స్వాగతం చెప్పేది. అక్కడి కొండ పై నున్న కాకతీయుల కాలం నాటి మెదక్ కోట. అంతే ప్రాధాన్యత గలది, మెదక్ పట్టణానికే ఒక మైలురాయి లాంటిది, ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించేది. ఆసియాలోనే అతిపెద్ద చర్చులలో ఒక్కటైనది 'మెదక్ చర్చి'. బ్రిటిష్ వారి పాలనా కాలంలో తిరుమలగిరి లోనున్న వారి సైనికుల కోసం 1895 లో వచ్చిన రెవరెండ్ చార్లెస్ పోస్నెట్ అనే క్రైస్తవ మత గురువు, హైదరాబాద్‌కు వంద కి.మీ దూరంలోనున్న మెతుకు సీమ కరువు కాటకాలతో అల్లాడుతుందని తెలుసుకొని అక్కడికి గుర్రం మీద ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళాడట. కరువు పీడితులను ఆదుకోడానికి 'ఫ్రీ కిచెన్' అన్నదానాల కన్నా వారికి ఉపాధి నిచ్చే పని కల్పించడం ఉత్తమమని ఆలోచించాడు. అందుకోసం 1914 లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని విశాల స్థలంలో ప్రస్తుత చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా అది పది సంవత్సరాలు కొనసాగిందట. దీని వాస్తు శిల్పి థామస్ ఎడ్వార్డ్ హార్దింగ్ క్యాతెడ్రాల్. ముప్పై మీటర్లు వెడల్పు, అరవై మీటర్లు పొడువు ఈ నిర్మాణం దాదాపు ఐదు వేల మందికి సరిపడే ప్రార్థనాలయం. దీనికి కావలసిన మొజాయక్ టైల్స్‌ను ఆ రోజుల్లోనే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వాటిని పరిచే ఇటాలియన్ మేస్త్రీలను బొంబాయి నుంచి పిలిపించారట. బోలు స్పాంజ్‌తో పై కప్పువేసి సౌండ్ ప్రూఫ్‌గా మార్చారట. క్రీస్తు జీవితంలోని క్రీస్తు జననం, శిలువ వేయడం, ఆరోహణ వంటి విభిన్న దృశ్యాలున్న స్టాయిన్ గ్లాస్ కిటికీలు ఇందులో ప్రత్యేకమైనవి. ఈ చర్చి 'బెల్ టవర్' మరీ ప్రత్యేకమైంది. దీని ఎత్తు 53 మీటర్లు అంటే చార్మినార్ కన్నా కూడా ఎత్తయిందన్న మాట. హైదరాబాద్ నగరానికే మకుటాయమానమైన చార్మినార్ కన్నా కూడా మించిన ఎత్తులో ఈ బెల్ టవర్‌ను నిర్మించడం ఆనాటి నిజాంగారికి నచ్చలేదంటారు. ఏదేమైనా 1924 నాటికీ అన్ని హంగులతో సిద్దమైన ఈ చర్చి క్రైస్తవ భక్తులనే కాదు దేశ విదేశ పర్యాటకులను కూడా ఆకర్శించడం సంతోషకరం. వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ -
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ!
ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు శ్రీ శ్రీ. రాజులూ రాణుల పల్లకిలే కాదు యుద్దాలు జరిగినప్పుడు గాయపడ్డ సైనికులను చికిత్స కోసం శిబిరాలకు చేర్చడానికి కూడా రాజులు బోయీల సేవలను వాడుకున్నారు. అలా అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బటాలియన్లో ఒక 'బోయీ'గా పని చేసినవాడు సూరిటి అప్పయ్య. 1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాదులలో ప్లేగు మహమ్మారి విజ్రుoభించి వేలాది మంది జనం కుప్ప తెప్పలుగా చనిపోతున్న కాలంలో బెటాలియాన్తో పాటు మధ్య భారత్ లోని ఉజ్జయినికి బదిలీ పై వెళ్లిపోయాడు అప్పయ్య. అంతేకాదు అక్కడున్న మహంకాళి ఆలయానికి వెళ్లి తనకోసమో తన కుటుంబం కోసమో కాదు అందరికోసం తల్లీ! ఈ మహా విపత్తు నుండి మానవాళిని కాపాడుమని, అదే జరిగితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెడతానని, గుడి కడతానని మొక్కుకున్నాడు. 'ఈ సామాన్య బోయీతో అది అయ్యే పనేనా, అయినా సరే భక్తుడిని పరీక్షిద్దా' మనుకుందో ఏమో అన్నట్లుగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడం, అప్పయ్య సికింద్రాబాద్‌కు బదిలీ అయి రావడం జరిగిపోయింది. సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా సహచరుల సహాయం కూడా తీసుకొని కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని నాటి లష్కర్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో (1815 జులైలో) ప్రతిష్టించి, చిన్న గుడి కూడా కట్టించాడట. ఆ నిర్మాణ సమయంలో అక్కడున్న ఒక పాత బావిని బాగు చేస్తున్నప్పుడు దొరికిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని కూడా ఆ గుడిలోనే ప్రతిష్టించాడని చెబుతారు. అప్పయ్యనే భక్తుల సహకారంతో (1864 లో )కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించాడంటారు. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య (1900) ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య ( 1914), అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఇంతా జరిగాక 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు' అన్నట్లుగా పలుకుబడి గల పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి, చివరికి దేవాదాయ శాఖవారికి ఈ ఆలయాన్ని( 1947 లో ) అప్పగించారట. ఎట్లయితేనేమి,తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక ఆలయానికి ప్రభుత్వ అజమాయిషీ అవసరమే కాదనడం లేదు, కానీ అసలు సిసలు ధర్మకర్తలను, ఈ ఆలయాన్ని స్థాపించిన సామాన్యులను ఎవరూ లెక్క చేయక పోవడమే విచారకరం. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ వారి అధికారిక వెబ్ సైట్ లో , తెలంగాణ ప్రభుత్వ టూరిజం వారి సమాచారంలో 'సూరిటి అప్పయ్య డోలి బేరర్'అని ఒక్క మాట అనేసారే గాని ఈ ఆలయ ఏర్పాటు కోసం అయన పడ్డ పాట్లను చెప్పలేదు, ఈ గుడి కోసం చెమటోడ్చిన అప్పయ్య మూడు తరాల మేస్త్రి వారసుల ప్రస్తావన అసలే తేలేదు. అంతా పల్లకి నెక్కిన ప్రభువులను కొనియాడే వారే, అది మోసిన బోయీల సేవలను గుర్తించే దెవరు? బోనాల పండగ మరుసటి రోజు 'భవిష్య వాణి' కోసం మాతంగి స్వర్ణలత చుట్టూ మూగేవారే అందరూ కానీ తరతరాలుగా ఆ భాగమ్మలు జోగమ్మలు పడుతున్న బాధలు పట్టించుకునేదెవరు? -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా! -
కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!
‘ఊరు గాదు అడవి గాదు మాట్లాడే మనిషి లేడు ఒంటరి బతుకై పాయే ఒంటెలతో చావాయే దిక్కు మొక్కు లేని గల్ఫ్ బతుకవాయెనే కొడుకు చితికి పాయెనే!' అంటూ 'ఎడారి బతుకులు' కవితలో వాపోయాను. నిజమే కాని మన ఊర్లో మన కళ్ళ ముందు మన పశువుల కాపర్లు పడే కష్టాలు తక్కువేం కాదు సుమా! ఇంత చద్దన్నం కట్టుకొని వెళ్లిన వారు పొద్దంతా ఆ నోరులేని జీవాలతో వేగడం,రాత్రికి గాని ఇల్లు చేరలేకపోవడం అత్యంత కష్టమైన పనే కదా! ఒకప్పుడు సంపదంటే పశువులే. వాటితోనే పాడి, వ్యవసాయం, ప్రయాణాలు కూడా. అలాంటి పశువులు, వాటి పోషణే నేటికీ చాలా మంది బతుకు దెరువు మరి. అలా పశువులు కాస్తూ మంద నుండి తప్పిపోయిన ఒక గేదెను వెతుకుతూ కొండపైకి వెళ్లిన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సింగం సంజీవుడికి పొదల్లో హనుమంతుడి విగ్రహం కనబడిందట. మరునాడు భార్య ఆశమ్మతో కలిసి వచ్చి ఆ స్వయంభూ స్వామిని వెలుగులోకి తెచ్చి, దానికో చిన్న గుడికట్టి, అందరికన్నా ముందు కొండగట్టు ఆంజనేయుడికి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులు. ఇది దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి మాట. ఆ తర్వాతి కాలంలో కృష్ణారావు దేశముఖ్ అనే దొరవారు ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంవల్ల స్వామివారి దర్శనానికి వచ్చి పోయే భక్తుల సంఖ్య పెరగడం, 1968 లో దాని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖవారు చేపట్టడం జరిగింది. చాత్తాద వైష్ణవులే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కి మీ దూరంలో, కరీంనగర్ హైవే పైనున్న కొండగట్టు దేవస్థానం ఏడాది పొడుగునా వచ్చిపోయే హనుమాన్ భక్తులతో కళకళలాడుతుంటుంది. 'ఆంజనేయ స్వామి దీక్ష'ల కాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్త జనం. అయితే ఇక్కడ సరియైన రోడ్లు లేకనే చాలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలకు జవాబా అన్నట్లుగా ఇటీవలే జగిత్యాల జిల్లా సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ఈ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం విశేషం. 'బల్మూరి కొండాలరాయుడా నీ చరిత పౌరుషానికి మారు పేరురా!' అని ఇక్కడ జానపదులు పాడుకునే పాట. మానాల, పొలవాస, ఎలగందుల నుండి గోల్కొండ వరకు పేరు గాంచిన కొండాలరాయుడు ఈ గట్టును తన స్థావరంగా వాడుకున్నాడని అందుకే దీన్ని కొండగట్టు అన్నారని కొందరంటారు. సంజీవుడు ఆశమ్మలు ఆంజనేయస్వామికి చేసిన సేవలకు శాసనాధారం కూడా చూపుతున్నారు కాబట్టి ఆ గొల్ల దంపతుల విగ్రహాలు, పౌరుషానికి మారు పెరైన కొండలరాయుడి విగ్రహము కూడా కొండగట్టుపై పెట్టడం సమంజసంగా ఉంటుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి... చదవండి: Sagubadi: అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే.. -
డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
డాలస్: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా బాలల సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా తెలుగు చిన్నారుల్లోని ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.. సత్య శ్రీరామనేని, రవికుమార్ తాండ్ర, రవీంద్ర చుండూరు, శ్రీనాథ్ జంధ్యాల ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, తేజ వేసంగి, డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, మణిధర్ గూడవల్లి, స్వప్న కాట్రగడ్డ, శ్రీధర్ న్యాలమడుగుల, నాగిరెడ్డి, శ్రీనివాస్ ఉరవకొండ, గౌతమ్ కాసిరెడ్డి, పార్ధ బొత్స, కృష్ణ వల్లపరెడ్డి, సురేంద్ర ధూళిపాళ్ల, యువ నిర్వాహకులు నిఖిత దాస్తి, యశిత చుండూరు, రేహాన్ న్యాలమడుగుల, ప్రణవి మాదాల తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారులు బాపూజీ జంధ్యాల చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు)ని అభినందించారు. గత పన్నెండు సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ డల్లాస్ విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తన సందేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నిర్వాహకులు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి కొన్ని బహుమతులను అందించారు. (క్లిక్ చేయండి: ఘనంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్) -
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. కాగా, వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం. pic.twitter.com/peyMeEMA25 — Giancarlo (@GianKaizen) November 12, 2022 BREAKING: 2 planes, including a B-17 Flying Fortress, collide at Dallas airshow pic.twitter.com/hdieiJuqvX — BNO News Live (@BNODesk) November 12, 2022 -
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
డాలస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తాజాగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 69 మంది రక్తదానం చేశారనీ, 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ఏడాదికి రెండు సార్లు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు టీప్యాడ్ వెల్లడించింది. గత ఎనిమిదేళ్లో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి అని, తాజాగా సేకరించిన బ్లడ్‌ను కార్టర్ బ్లడ్ కేర్‌కు అందించినట్లు తెలిపింది. రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారుతోపాటు వలంటీర్లకు, కార్టర్ బ్లడ్ కేర్ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్‌సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి డ్రైవ్‌లో 53 రిజిస్ట్రేషన్లు జరగ్గా, తాజాగా 69 మంది రిజిస్ట్రేషన్లతో రోజంతా జరిగిన రక్తదానంలో దాతలు రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు. అయితే సమయాభావం వల్ల చాలా మంది దాతలు రక్తదానం చేయలేకపోయారని నిర్వాహకులుతెలిపారు. ఈ డ్రైవ్‌లో సేకరించిన 52 యూనిట్ల రక్తంతో దాదాపు 10 మందికి గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు లేదా, 17 మందికి రక్త మార్పిడి లాంటి ఇతర అవసరాలకు సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారికి భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి సహకరించిన అభినందించి బ్లాంకెట్లను బహుమతిగా అందజేశారు. -
డల్లాస్‌లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్‌తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
డాలస్‌లో నాటా బోర్డు మీటింగ్: నిధుల సేకరణకు విశేష స్పందన
డాలస్: అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి), శ్రీనివాస్ సోమవరపు(కోశాధికారి), మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కార్యదర్శి ), సతీష్ నరాల (సంయుక్త కోశాధికారి ) తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మరియు రీజినల్ కోఆర్డినేటర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూన్ 30, జులై 1-2 2023 లో డాలస్ లో జరిగే కన్వెన్షన్ గురించి వివరాలు తెలిపారు. బోర్డు సమావేశం తర్వాత సభ్యులు అందరూ డాలస్ కన్వెన్షన్ టూర్ కు వెళ్లి అక్కడ వేదికను పరిశీలించి నాటా మెగా కన్వెన్షన్‌కు రానున్న పదిహేను వేల మంది అతిధులకు కల్పించే సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన నిధుల సేకరణ విందు లో పాల్గొన్న ఏడు వందల పైగా పలువురు దాతలు కనీవిని ఎరుగని రీతిలో రెండు మిలియన్ల ఆరు వందల వేల డాలర్లు ($2,600,000) ఇస్తామని నాటా కు వచ్చిన హామీ అమెరికాలో సరిక్రొత్త రికార్డు సృష్టించింది. ఈ విధంగా నిధుల సేకరణకు విశేష కృషి చేసిన డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి గారిని నాటా కార్యవర్గం ప్రత్యేకం గా అభినందించింది. వివిధ రాష్టాల నుండి వచ్చిన నాటా కార్యవర్గ సభ్యులను గండ్ర నారాయణ రెడ్డి (ప్రధాన కార్యదర్శి) నిధుల సేకరణ విందు లో పాల్గొన్న దాతలకు పరిచయం చేసినారు. ఈ కార్యక్రమాన్ని గిరీష్ రామిరెడ్డి (కన్వీనర్ ), బూచిపూడి రామి రెడ్డి (కోఆర్డినేటర్ ), కృష్ణ కోడూరు (కో కన్వీనర్), భాస్కర్ గండికోట(కో కోఆర్డినేటర్), రమణ రెడ్డి క్రిస్టపాటి(డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ ఆవుల (డిప్యూటీ కోఆర్డినేటర్), రవీంద్ర అరిమండ (బోర్డు సభ్యుడు), వీరా రెడ్డి వేముల, దర్గా నాగిరెడ్డి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), పుట్లూరు రమణ(బోర్డు సభ్యుడు), చెన్నా రెడ్డి, మోహన్ రెడ్డి మల్లంపాటి, ప్రసాద్ చొప్ప ఇతరులు అతిధులకు సౌకర్యాలను కల్పించారు. ఈ నిధుల సేకరణ విందుకు హాజరై హామీ ఇచ్చిన దాతలు అందరిని నాటా కార్యవర్గం పేరు పేరున అభినందించింది. -
డాలస్‌లో బాపూజీ 153 వ జయంతి సంబరాలు
డాలస్‌లో అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలి మహాత్మాగాంధీజీ 153వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి రావు కలవల స్వాగతోపన్యాసం చేయగా, నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ఉర్మాట్ సింగ్ మాట్లాడుతూ ఈ ఏడాది గాంధీ జయంతి వేడుకలలో ఎప్పటిలాగానే “గాంధీ శాంతి నడక” కొనసాగించడం ఆనందంగా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించడం అంటే విశ్వమానవాళి శాంతి కాముకుడైన గాంధీజీకి ఘన నివాళి అర్పించడమేనని ఎంజీఎంఎన్టీ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర కొనియాడారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇర్వింగ్ నగర్ కౌన్సిల్ సభ్యుడు మార్క్ జేస్కిను, పోలీస్ చీఫ్ డెరెక్ మిలార్త ను డా. తోటకూర సభకు పరిచయం చేశారు. ప్రవాస భారతీయులు ఇర్వింగ్ నగర అభివృదికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. బోర్డు సభ్యులు తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం పోలీస్ చీఫ్ శాంతి వాక్‌ను ప్రారంభించారు. పిల్లలు, పెద్దలు స్త్రీలు ఉత్సాహంగా పాల్గొని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ప్రసాద్ తోటకూరతోపాటు, రావు కలవల, ఉర్మాట్ జునేజా, సల్మాన్ ఫర్హోరి, ఇందు మందాడి , తైయాబ్ కుండవాలా, ప్పయూష్ పటేల్, షబ్నం, మొద్గిల్,రాజీవ్ ,శైలేష్ , చంద్రిక, హేతల్ సా, సాంటే చారి, పులిగండ్ల విశ్వనాధం, సత్యన్ కల్యాణ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2 సాయంత్రం ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీం మహాజన్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బాపూజీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాపూజీ సిద్ధాంతాలు సర్వత్రా ఆచరణీయమన్నారు. అతిపెద్ద గాంధీ స్మారక స్థలిని ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని ప్రత్యేక అతిధిగా హాజరైన నగర మేయర్ రిక్ స్తోఫెర్ కొనియాడారు. అక్టోబరు 2ను “గాంధీ డే” గా ప్రకటిస్తూ ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు, ఇతర సభ్యులకు అందించారు. దాదాపు 250 మందికి పైగ చిన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రేడియో సురభి సభ్యులు రాజేశ్వరి ఉదయగిరి, రవి తూపురాని, అంబా లక్ష్మి, స్ఫూరిత మలవరపు, మైత్రేయి మియాపురం, వేణు చెరుకుపల్లి, శివ దేశిరాజుల ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించారు. చివరగా సురభి రేడియో తోపాటు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, వివిధ సంస్థలు, చిన్నారులు ,అతిధులకు ఐఏఎన్టీ బోర్డు ఛైర్మన్ సల్మాన్ ఫర్హోరి కృత్జజ్ఞతలు తెలిపారు. -
డాలస్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం