అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆసంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగిరెడ్డి, చెన్నాకొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం,చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధకారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు,పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహ కోరుకునే యువతియువకుల కోసం మాట్రిమోనీ మొదలయిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు.
గ్రేటర్ రాయలసీ సంస్కృతిని కాపాడటం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవేకాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు వైద్య నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. డల్లాస్ నగరంలో రాలయసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజురోజుకి సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డల్లాస్ వాసలు, డల్లాస్‌కి వచ్చేవారు గ్రాడా(GRADA) సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
ఫిబ్రవరి 17న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్(North Texas Food Bank) వారి ద్వారా దాదాపు 500 మందికి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచి పెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డల్లాస్ వాసుల కోసం GRADA నిర్వర్తించనుంది. ఈ కార్యక్రమంలో నందకొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమామహేశ్వర్ గర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణి కుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల,భానుమితి రేవుల, సునీల జంపాల, హర్షదళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్కుంట, హరినాత్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవని మెట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
(చదవండి: అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..)
Comments
Please login to add a commentAdd a comment