rayalaseema
-
సీమలో పుట్టి.. సీమకే షాకిచ్చిన చంద్రబాబు
-
హంద్రీ–నీవా.. చుక్కాని లేని నావ!
సాక్షి, అమరావతి : దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. సీమకు కల్పతరవు వంటి హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసింది. ప్రధాన కాలువ ప్రవా హ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేసింది. తద్వారా సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తా గు నీటికీ తల్లడిల్లాల్సిన దుస్థితిలోకి సీమ ప్రజలను నె ట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజులపాటు 3,850 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీ–నీవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీ–నీవాపై ఆధారపడి చేపట్టిన భైరవా నితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగు నీటి కోసం గాజులదిన్నెకు 3 టీఎంసీల తరలింపు.. తదితర ప్రాజెక్టులకు మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది. అంటే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని రోజులు వరద ప్రవాహం, నిల్వ ఉండదు. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–1 తీర్పు అమల్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తామని ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 2,578 టీఎంసీలను పూర్తిగా వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవాకు మిగులు జలాలను విడుదల చేస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవాకు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశమే ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవకాశం ఉన్న రోజుల్లో కూడా కేవలం 3,850 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోయడం వల్ల కనిష్ట స్థాయిలో మాత్రమే హంద్రీ–నీవాకు నీటిని తరలించే పరిస్థితి ఉంటుందని తేల్చి చెబుతున్నారు.తెలంగాణ దోపిడీ..ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్నడూ లేని రీతిలో జూన్ నుంచి ఇప్పటి వరకు 1,575.62 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చింది. జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 806.2 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటి తరలింపును ప్రారంభిస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఆగస్టు 2 నుంచి హంద్రీ–నీవాకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. రోజుకు కనిష్టంగా 253 నుంచి గరిష్టంగా 1,695 క్యూసె క్కుల చొప్పున ఎత్తిపోయడం వల్ల ఆగస్టు 2 నుంచి బు« దవారం వరకు అంటే 152 రోజుల్లో కేవలం 19.65 టీ ఎంసీలను మాత్రమే తరలించగలిగింది. శ్రీశైలం ప్రా జెక్టులో ఏడాదికి 33 టీఎంసీలు ఆవిర వుతాయి. అంటే.. ఆవిరయ్యే నీటిలో 59 శాతం మేర కూడా హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలించలేదన్నది స్ప ష్టమవుతోంది. ఎడమ గట్టు కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రా జె క్టు నుంచి దిగువకు నీటిని తరలించేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఇక ఎన్ని రోజులు నీరు నిల్వ ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీన్ని బట్టి సీమ ప్రజలకు కూట మి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నది స్పష్టమవుతోంది.తాగునీటికీ కష్టాలే.. పరిశ్రమలు మూతే » శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. 2009 నాటికే తొలి దశ పనులు పూర్తవడంతో 2012 నుంచి నీటిని తరలిస్తున్నారు.» 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి సామర్థ్యం మేరకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, సీమను సస్యశ్యామలం చేసింది. గతంలో చంద్ర బాబు 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్పుడుగానీ, ఇప్పుడుగానీ హంద్రీ–నీవా సా మ ర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవు. » వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే రోజులు తగ్గడం వల్ల కృష్ణా నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసి పట్టి.. హంద్రీ–నీవా నుంచి తరలించే ఎత్తిపోతలు, ప్రధా న కాలువ (–4.806 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. » కాలువలో నీటి ప్రవాహం లేనప్పుడు కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారు. రోజుకు 6,300 క్యూసెక్కుల చొప్పున 120 రోజులు తరలిస్తేనే హంద్రీ–నీవా, దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమతం చేయడం.. బ్రిజేష్‌కు మార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే సీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందే అవకాశమే లేదని, గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కియా వంటి పరిశ్రమల అవసరాలకు నీటి లభ్యత ఉండదని, ఇది సీమలో ఉపాధి అవకాశాలను మరింత దెబ్బ తీస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
తిరుమలలో భారీ వర్షం.. సీమకు ఎల్లో అలర్ట్
సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. -
రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన
-
‘ఫెంగల్’ దోబూచులాట!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నేటి నుంచి వర్షాలు..ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్‌ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
బాబు మోసం.. నోరుమెదపని ఎమ్మెల్యేలు, ఎంపీలు
-
అంతులేని అన్యాయం.. సీమకు బాబు వెన్నుపోటు
-
రాయలసీమలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
కర్నూలులో హైకోర్టు పెట్టాలి లేదంటే ప్రత్యేక రాష్ట్రం
-
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!
ఈనెల 9న పుట్టపర్తి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ‘నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.. రక్తచరిత్ర.. రక్త చరిత్ర..’ అంటూ పాటలు వేసుకుని టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా డ్యాన్సులు చేశారు. ఇవి చూసి భక్తజనం బెంబేలెత్తిపోయారు.ఈనెల 10న రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో టీడీపీ కార్యకర్త గంగాధర్ నాటు తుపాకీతో నానా హంగామా చేశాడు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత కేశవపై దాడి చేయబోయాడు. అతను అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈనెల 11న మడకశిర మండలం గుండుమల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులు బహిరంగంగా కత్తులు, తుపాకీలతో విన్యాసాలు చేశారు. ఇది చూసి జనం బేజారెత్తిపోయారు. సాక్షి, టాస్‌్కఫోర్స్ : రాయలసీమ జిల్లాల్లో నాటు తుపాకుల సంస్కృతి మళ్లీ ఊపిరిపోసుకుంటోందనడానికి ఈ ఘటనలే తాజా ఉదాహరణలు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకుల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వీటితో బహిరంగంగా డ్యాన్సులు చేస్తూ చెలరేగిపోతున్నారు. దీంతో ‘ఆర్ఓసీ’ రోజులు మళ్లీ దాపురించాయా! అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి.. నాటు తుపాకులు, బాంబులు, కత్తులు.. ఈ మాటలు వింటే ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో ఆర్ఓసీ (రీఆర్గనైజింగ్ కమిటీ) అరాచకాలు గుర్తుకొస్తాయి. అప్పట్లో టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి నేతృత్వంలో ఈ దారుణాలు విచ్చలవిడిగా సాగాయి. ఇందుకు ఎందరో బలయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ నాటి రోజులు గుర్తొచ్చేలా ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఉదా.. రామగిరి మండలంలో మాజీమంత్రి పరిటాల సునీత అనుచరులు నాటు తుపాకులతో నానా హంగామా చేస్తున్నారు. ‘మాతో పెట్టుకుంటే అంతే.. కాల్చిపడేస్తాం.. మళ్లీ మాకు పాత రోజులు వచ్చాయి’ అని రెచి్చపోతున్నారు. ఒకచోట గన్ ఘటన వెలుగులోకి రాగానే.. మరోచోట వినాయక నిమజ్జనంలో తుపాకులతో విన్యాసాలు చేశారు. ఇంకోచోట.. రక్తచరిత్ర పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేశారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రామగిరి మండల వ్యాప్తంగా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కుంటిమద్ది గ్రామంలో కూడా రోడ్లు వేశారు. తాగునీటి సౌకర్యం కలి్పంచారు. ఫలితంగా ఈ ప్రాంతం ఫ్యాక్షన్ ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ పరిటాల కుటుంబం ఆ గ్రామంలో ఫ్యాక్షన్ వాతావరణానికి ఆజ్యం పోస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సి ఉండగా.. గ్రామాల్లో కొందరు టీడీపీ అల్లరిమూకలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా చెలరేగిపోయారు. నాటు తుపాకులు, కత్తులు, డమ్మీ తుపాకులు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదేంటని ప్రశి్నంచిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో మళ్లీ ‘ఆర్ఓసీ’ కాలంలో మాదిరిగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని ప్రజలు వణికిపోతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించం.. తుపాకులు వాడాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అనుమతులు పొందిన వారే వాడాలి. ఎవరుపడితే వారు నాటు తుపాకులతో రెచ్చిపోతే కేసులు తప్పవు. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేదిలేదు. – వి. రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ -
మరిచారా బాబూ.!
సీమ ముద్ద బిడ్డను.. కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలకు పేర్లు మార్చడం సహజం. తమ పార్టీ నాయకులు లేదా నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే జాతీయ నాయకుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం పరిపాటి. ఇదే కోవలో తాజాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ పథకాల పేర్లు మార్చింది. అందులో జగనన్న గోరుముద్ద పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’అని పేరు మార్చంది. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి ఆదుకున్న డొక్కా సీతమ్మ పేరుపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలు మృత్యు ముఖంలోకి జారుతున్న విషాద సమయంలో తన ఆస్తుల్ని ధాన్యంగా మార్చి వేలాది పేదల కడుపు నింపి ప్రాణాలు కాపాడిన పూర్వపు కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామ వాసి బుడ్డా వెంగళరెడ్డి పేరు ప్రభుత్వానికి ఎందుకు స్ఫురణకు రాలేదని ఇక్కడి మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. దాతృత్వానికి మరో పేరు వెంగళరెడ్డి 1866లో రాయలసీమను భయంకర కరువు ఒకటి కబళించింది. ప్రజలు దాన్ని ఎర్రగాలి కరువు అని పిలిచేవారు. తినడానికి తిండి లేక, తాగేందుకు గుక్కెడు నీరు సైతం కరువై ప్రజలు డొక్కలు ఎండి అస్థిపంజరాలుగా మారారు. కలరా, మశూచి, బోవెల్ వ్యాధులు విజృంభించి వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. కడుపు చేతపట్టుకుని వలసలు వెళ్లడంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. ఈ తరుణంలో బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం గురించి ఆ నోటా ఈ నోటా విన్న బళ్లారి, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు ఉయ్యాలవాడ గ్రామానికి చేరుకోవడం ప్రారంభించారు. అలా వేల సంఖ్యలో వచ్చిన కరువు బాధితులతో గ్రామం కిటకిటలాడింది. వెంగళరెడ్డి తాము నిల్వ ఉంచిన 12 పాతర్ల ధాన్యం అంటే 1440 బస్తాలు ఖర్చు చేసి పూటకు ఎనిమిది వేల మందికి చొప్పున అన్నం, అంబలి వంటివి అందజేసి ప్రాణాలు నిలిపారు. చివరికి తన భూములు అమ్మి అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించారు. అలా మూడు నెలలకు పైగానే ఈ కార్యక్రమం నడిచింది. కరువు వల్ల తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేకపోయారని తెలుసుకున్న వెంగళరెడ్డి తాళిబొట్లు, ముక్కెరలు దానం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని తెలియడంతో ప్రజలు తమ గ్రామాలకు బయలుదేరే సమయంలో 15 రోజులపాటు తినడానికి అవసరమైన భత్యం ఆయన అందజేశారు. రైతులకు పశువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కూడా సమకూర్చారు. ముఖ్యమంత్రి సీమ వాసి అయినా.... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంలోని మహనీయుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతృత్వం, త్యాగంలో ఎవరికీ తీసిపోని ఎంతోమంది రాయలసీమలో జన్మించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి గట్టిగా తీసుకు వెళ్లాలంటున్నారు. ‘సీమ’నేతల వైఖరే కారణం డొక్కా సీతమ్మ పేరును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కోస్తా నాయకులు ఎలాంటి వారైనా ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సుద్దపల్లె లక్షుమ్మ, చిన్నదండ్లూరు శివమ్మ తదితర గొప్పవాళ్ల గురించి రాయలసీమ నేతలు ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల గొప్పతనాన్ని తెలుసుకుంటే ప్రజలు తమను అసహ్యించుకుంటారనే భయమే ఇందుకు కారణం. ఈ ప్రాంత నాయకుల వైఖరి వల్లే రాయలసీమ వివక్షకు గురవుతోంది. – సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి ఇది ముమ్మాటికీ వివక్షే కరువులో పేదలను ఆదుకోవడమే కాకుండా అనేక దానధర్మాలతో బుడ్డా వెంగళరెడ్డి మహాదాతగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర భావనే లేని రోజుల్లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీషర్లపై గొప్ప పోరాటం చేసి భావి జాతీయోద్యమానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఏదైనా చారిత్రక స్థలానికి ఆయన పేరు పెట్టాలి. తొలి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామచార్యులు వంటిఎందరో మహానీయులకు రాయలసీమ జన్మనిచ్చింది. మొట్టమొదటి ఆధునిక కావ్యాన్ని రాసిన కట్టమంచి రామలింగారెడ్డి సీమ వాసి. ఆధునిక సాహిత్య విమర్శకు ఆయన ఆద్యుడు. రాష్ట్ర సాహిత్య అకాడమికి ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం. రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి, అక్కడి అభివృద్ధి తప్ప మరేది పట్టలేదు. కనీసం ప్రభుత్వ పథకాల్లో కూడా సీమ వాసుల పేర్లు పెట్టలేదంటే ఇది ముమ్మాటికీ వివక్షే. – ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పథకాల పేర్ల మార్పులో రాయలసీమపై వివక్ష! కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న మేధావులు మిగతా పథకాలకై నా ‘సీమ’వాసులకు స్థానం కల్పించాలి -
‘పుట్టా’ పాపం..‘సీమ’కు శాపం
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన రోడ్డు నిర్మాణ సంస్థ ఈ ఫోటోలో కనిపిస్తున్న హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చివేసి దీనిపై తాత్కాలిక రహదారిని నిర్మించింది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కుచెందిన పీఎస్కే ఇన్ఫ్రా ఈ రహదారి నిర్మాణ పనులను చేస్తోంది. కాలువలో కనీసం పైపులు అమర్చి రోడ్డు నిర్మించినా నీళ్లు పారేవి. ఆ మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పుట్టా సంస్థతో పాటు జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించగా నీటి విడుదల నిలిచిపోవటానికి కారణాలు వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జలవనరులశాఖ నిర్లక్ష్యం, పుట్టా సంస్థ పీఎస్కే ఇన్ఫ్రా లెక్కలేనితనం వెరసి ప్రభుత్వ వైఫల్యం.. రాయలసీమకు పెనుశాపంగా పరిణమించింది. కళ్లెదుట కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నిండటంతో నీళ్లు దిగువకు విడుదలవుతున్నా హంద్రీ–నీవాకు నీళ్లు మళ్లించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టాది కావడంతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉన్నారు. తాత్కాలిక రోడ్డు వేసే సమయంలోనే కాలువలో నీళ్లు దిగువకు వెళ్లేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? 15 రోజులుగా కృష్ణాకు వరద నీరు వస్తున్నా హంద్రీ–నీవాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అని సమీక్షించి అప్రమత్తం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. సర్కారు నిర్వాకాలతో ఈ ఏడాది ‘సీమ’లో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.గత ఐదేళ్లూ ముందుగానే..గతేడాది రాయలసీమలో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే అదృష్టవశాత్తూ మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర పోటెత్తాయి. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిగా నిండటంతో ఆరు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో హంద్రీ–నీవా నీటితో చెరువులు, రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకోవచ్చని సీమ రైతులు ఆశ పడ్డారు. గత ఐదేళ్లూ పోతిరెడ్డిపాడు కంటే ముందుగానే హంద్రీ–నీవాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులకు చేరితే హంద్రీ–నీవాకు నీళ్లు విడుదల చేయవచ్చు. ముచ్చుమర్రి ద్వారా 800 అడుగులకే నీరు లిఫ్ట్ చేయవచ్చు. అయితే రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా, కారణాలు చెప్పకుండా దాగుడు మూతలాడుతోంది. 15 రోజులుగా నీళ్లు విడుదల కాకపోవడంపై రైతన్నలు తీవ్రంగా మథన పడుతున్నారు.పైపులు వేసి ఉంటే..కర్నూలు–విజయవాడ నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఎన్‌హెచ్–340 సి రోడ్డు పనుల్లో ఒకటో ప్యాకేజీని పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్కే ఇన్ఫ్రా దక్కించుకుంది. ఈ ప్యాకేజీలో 30.6 కి.మీ. నాలుగు లేన్ల రహదారిని రూ.827.39 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో గార్గేయపురం, బ్రాహ్మణ కొట్కూరు మధ్య హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మించాలి. దీంతో కాలువపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన నిర్మిస్తున్నారు. రాకపోకల కోసం హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చేసి తాత్కాలిక రోడ్డు వేశారు. పైపులు వేసి రోడ్డు నిర్మిస్తే కాలువలో నీటి ప్రవాహానికి వీలుండేది. 15 రోజుల క్రితమే హంద్రీ–నీవా నీళ్లు విడుదలయ్యేవి. పీఎస్కే ఇన్ఫ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించి పైపులు వేయకుండా కాలువను పూర్తిగా పూడ్చేసింది. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. హంద్రీ–నీవాపై ఆధారపడ్డ 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’పై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జిల్లాలలో 30 లక్షలమందికి తాగునీరు అందుతోంది. క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ల కింద వందల చెరువులకు ఏటా నీళ్లు ఇస్తున్నారు. 76 చెరువులకు గత ప్రభుత్వం నీరందించింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ కుప్పానికి కూడా హంద్రీ–నీవా నీటిని విడుదల చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాలో నీళ్లున్నా విడుదల చేయకుండా అన్నదాతలతో పరిహాసమాడుతోంది. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను 120 రోజుల పాటు ఎత్తిపోసేలా పథకాన్ని డిజైన్ చేశారు. అయితే అన్ని రోజులు కృష్ణాలో ప్రవాహం ఉండటం లేదు. దీంతో కెనాల్‌ను విస్తరించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో 15 రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించకపోవడంతో ‘సీమ’కు తీవ్ర నష్టం జరుగుతోంది.రోడ్డు తొలగించి నీటిని విడుదల చేస్తాంజాతీయ రహదారి పనుల్లో భాగంగా హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మాణం జరుగుతోంది. నీటిని విడుదల చేసే లోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు దాటితే ఏజెన్సీతో పని లేకుండా రోడ్డు తొలగించి, పూడిక తీసేసి నీటిని విడుదల చేస్తాం. – రామగోపాల్, ఎస్ఈ, హంద్రీ–నీవా సుజల స్రవంతిప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాంపీఎస్కే ఇన్ఫ్రా హంద్రీ కాలువపై వంతెనను నిర్మిస్తోంది. కాలువను నిర్మాణ సంస్థే పూడ్చింది. నీటి విడుదల కోసం జలవనరులశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డును తొలగించే యోచనలో ఉన్నారు. ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం. – జి.గోవర్ధన్, పీడీ, నేషనల్ హైవేస్ అథారిటీ, కర్నూలు -
ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లుభారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం -
వరుణించిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం. సస్యశ్యామల ‘సీమ’ నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.ఆ జిల్లాలో జూన్‌లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.జూలైలోనూ సమృద్ధిగా.. జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. -
రాయలసీమ వాసులకు గుడ్‌న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వీడీ14 వర్కింగ్ టైటిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీని ప్రధానంగా రాయలసీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ప్రత్యేకంగా ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి' అంటూ సీమ యాసలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారిని ఆడిషన్స్ ద్వారా సినిమా ఛాన్సులు ఇవ్వనున్నారు. మరి ఇక ఆలస్యమెందుకు? సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్ కొట్టేయండి. -
రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురిది. గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నేడు, రేపు కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. -
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.