చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు | Rayalaseema Student JAC Protest Against Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు

Published Sat, Nov 19 2022 11:06 AM | Last Updated on Sat, Nov 19 2022 3:04 PM

Rayalaseema Student JAC Protest Against Chandrababu Naidu - Sakshi

కర్నూలు:  చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఎక్కడ చూసిన నిరసన గళమే వినిపిస్తోంది. గురువారం, శుక్రవారాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులపై టీడీపీ నేతల గూండా వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే కర్నూలులో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. 

కాగా, నిన్నటి పర్యటనలో చంద్రబాబు రెచ్చిపోతూ, ఊగిపోతూ మాట్లాడారు. ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్‌ వాన్ని తన్ను.. రేయ్‌ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా’ అంటూ సహనం కోల్పోయారు చంద్రబాబు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement