Student JAC leaders
-
చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలు
కర్నూలు: చంద్రబాబు చేపట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఎక్కడ చూసిన నిరసన గళమే వినిపిస్తోంది. గురువారం, శుక్రవారాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై టీడీపీ నేతల గూండా వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు మిన్నంటాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే కర్నూలులో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, నిన్నటి పర్యటనలో చంద్రబాబు రెచ్చిపోతూ, ఊగిపోతూ మాట్లాడారు. ‘తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనమవడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అది నా సభ్యత. నాకు çహుందాతనం ఉంది’ అని అంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పనికి మాలిన వ్యక్తుల్లారా.. నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతారా.. రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమికొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా.. పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా’ అంటూ సహనం కోల్పోయారు చంద్రబాబు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. -
కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఎమ్మిగనూరు విశాఖ గార్డెన్ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన తెలిపింది. సీమాంధ్ర ద్రోహి చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. న్యాయ రాజధానిపై చంద్రబాబు వైఖరి ప్రకటించాలని, లేదంటే చంద్రబాబు కర్నూలు పర్యటనను అడ్డుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ న్యాయవాదులు మండిపడ్డారు. చదవండి: పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా? -
రిజిస్ట్రార్‌పై దాడి ఎఫెక్ట్
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై దాడి ఘటన పట్ల ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బీఈడీ కళాశాలల స్టాఫ్ అప్రూవల్ విషయంలో ఈనెల 5న రిజిస్ట్రార్‌పై ఎస్కే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిపై కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దాడికి యత్నించినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయాన్ని బంద్ చేసి ఆందోళనలు చేపట్టారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో పలు సందేహాలకు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వర్సిటీ ఘటనపై చర్యలకు పూనుకుంది. ఈమేరకు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్కేయూ, ఆర్యూ ఇన్చార్జ్ వీసీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని, ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. శుభపరిణామం ఆర్యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడి ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించడం శుభపరిణామమని ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవటం వర్సిటీ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది విజయమన్నారు. -
తెలంగాణ బీజేపీలోకి చేరికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు బీజేపీలో చేరినట్టు చెప్పారు. బీజేపీ ద్వారానే దళితులకు సామాజిక న్యాయం లభిస్తుందన్న నమ్మకంతో విద్యార్థి నేత గద్దల అంజిబాబు పార్టీలో చేరారని తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో టీఆర్ఎస్కు చెందిన దళిత నేత రామలింగేశ్వరరావు బీజేపీలో చేరినట్టు వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యంపై అసంతృప్తితోనే దళిత నేతలు కమలదళంలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల ఎబీసీడీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. -
సెక్రటేరియట్ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
ఎన్నికల తరుణంలో పార్టీలవారీగా నేతల అభిప్రాయాలు
టీ విద్యార్థి జేఏసీ నేతలకు కాంగ్రెస్ టికెట్లు! సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి జేఏసీ నాయకులకు కూడా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. జేఏసీ నేతలకు టికెట్లు ఇస్తామని గతంలోనే ఏఐసీసీ వర్గాలు ప్రకటించాయి. ఎస్సీ నియోజకవర్గాల్లో జేఏసీ నేతలకు టికెట్లు కేటాయించే అంశాన్ని పార్టీ జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు పర్యవేక్షిస్తున్నారు. ఇదే సందర్భంలో విద్యార్థి జేఏసీ నేతల పేర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించినట్టు తెలిసింది. ఇందులో మునుగోడు లేదా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పున్నా కైలాశ్, మహబూబ్‌నగర్ నుంచి కె.విజయ్‌కుమార్, సత్తుపల్లి నుంచి మానవతారాయ్, మిర్యాలగూడ నుంచి మరో విద్యార్థి నేత పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్లో ఆకుల రాజేందర్ చేరిక సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని రాజేందర్‌కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అవమానించినందువల్లే మనస్తాపానికి గురై రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాజేందర్‌తో రాజీ యత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ‘మహబూబ్‌నగర్’ అభ్యర్థి నేనే!: విఠల్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం టికెట్ తనకే దక్కుతుందన్న ఆశాభావాన్ని మాజీ ఎంపీ డి.విఠల్‌రావు వ్యక్తం చేశారు. శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో దిగ్విజయ్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్ స్థానం నాకే ఇస్తారన్న నమ్మకం ఉంది. గతంలో రాజ్యసభ సీటు ఆశించినప్పుడు సోనియాను కలిశాను. తక్కువ తేడాతో ఓడిపోయినందున ఈ సారి లోక్‌సభకే పోటీచేయాలని ఆమె సూచించారు. అందువల్ల ఈ సారి సీటు ఇస్తారన్న నమ్మకం ఉంది. చేనేత కార్మిక వర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఏకైక అభ్యర్థిని కాబట్టి వేరేవారికి ఇస్తారనుకోను. అయితే అధిష్టానానికి కట్టుబడి ఉంటా..’ అని పేర్కొన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ టికెట్లకు గట్టి పోటీ: డొక్కా సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ టికెట్ల కోసం నాయకులు పోటీపడుతున్నారని ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కోచైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. బస్సుయాత్రతో పార్టీలో నూతనోత్సాహం పెరిగిందన్నారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాజిక న్యాయం కాంగ్రెస్ వల్లనే సాధ్యమని.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం తమ పార్టీతోనే వస్తుందన్నారు. గతంలో భూ సంస్కరణల సమయంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని రాజేశారని గుర్తుచేశారు. ఇపుడు బీసీ, ఎస్సీలకు రాజ్యాధికారం వస్తుందనే సమయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగేసుకొని ముందుకు వస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలి: గద్దర్ హైదరాబాద్, న్యూస్‌లైన్: ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం మొఘల్‌పురా ఉర్దూఘర్‌లో ‘తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ కోరుతూ అనేక మంది ముస్లింలు ఉద్యమించి అమరులయ్యారని, వారి త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణలో జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్, ఆలిండియా ముస్లిం సంఘం అధ్యక్షుడు హయాత్ హుస్సేన్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ‘మంద కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి’ హైదరాబాద్. న్యూస్‌లైన్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని శుక్రవారం ఓయూలో జరిగిన ఓయూ, కేయూ జేఏసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయుకులు వూట్లాడుతూ.. అణగారిన వర్గాలవారి హక్కుల కోసం ఉద్యమించి, బడుగులలో చైతన్యం కల్గించిన నేత వుంద కృష్ణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన ఆయనను ఉద్యమనేతగా గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బండారు వీరబాబు, వట్టికూట రామారావు తదితరులు పాల్గొన్నారు. -
స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ: ఓయూ జేఏసీ
సాక్షి,హైదరాబాద్: రాజకీయ పార్టీలు తమను విస్మరిస్తే స్వతంత్రంగా పోటీ చేసేందుకైనా వెనుకాడబోమని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థినేతలంతా ఆర్ట్స్ కళాశాలలో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను రాజకీయపార్టీలు విస్మరిస్తూ టికెట్లు అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. తాము పదవుల మీద ఆశతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తెలంగాణ నవనిర్మాణంలో భాగస్వాములు కావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే... టీఎస్ జేఏసీ చైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్(నల్లగొండ పార్లమెంట్), అధ్యక్షుడు దేశగాని సాంబశివ(హుజూర్నగర్ అసెంబ్లీ), జేఏసీ నేతలు బొమ్మ హనుమంతరావు(పాలేరు), పుప్పాల మల్లేష్( సూర్యపేట), బాలలక్ష్మి (జనగాం), సల్మాన్బాబు (సత్తుపల్లి), రవితేజారెడ్డి (పాలకుర్తి) నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.