
(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు.
సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు.