Telangana Secretariat
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారుబీఆర్ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందిఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్కగత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందిరూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను మాత్రమే -
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్‌పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
తెలంగాణ సచివాలయం వద్ద భారీ భద్రత
హైదరాబాద్: ‘ఛలో సచివాలయం’కు బెటాలియన్ కానిస్టేబుల్స్ పిలుపునివ్వడంతో సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.ఒకే పోలీస్ వ్యవస్థ( ఏక్ పోలీస్ వ్యవస్థ) కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్ పట్టుబడుతుండగా గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన ఉధృతం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) ఛలో సచివాలయంకు పిలుపునిచ్చారు. దాంతో ఆందోళన చేపట్టిన వారిపై పోలీస్ శాఖ వేటు వేస్తోంది. ఇప్పటికే పది మందిని సర్వీస్ రిమూవ్ చేయగా, 34 మందిని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుల్స్ తమకు కచ్చితమైన హామీ వచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. -
మేం వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడికే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్‌రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు. ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్‌చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్ -
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్
సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని21వసెంచరీలోకి తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొనియాడారు. అలాంటి నేత విగ్రహాన్నికూలగొడతామని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదన్నారు.య గాంధీభవన్‌లో మంగళవారం(సెప్టెంబర్16) వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది బీఆర్ఎస్కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.‘దేశం కోసం ప్రాణాలు అర్పించినిన ఫ్యామిలీ గాంధీలది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. విగ్రహాలు కూలుస్తాం లాంటి మాటల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలోనే పెట్టాలి. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి’అని వీహెచ్ హితవు పలికారు. ఇదీ చదవండి.. టచ్ చేసి చూడు.. పొన్నం సవాల్ -
టచ్ చేసి చూడు: పొన్నం సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంగళవారం(జులై 16) ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలకుపైగానే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ లేకపోవడంతో సెక్రటేరియట్లో పలు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుపుతుండగానే ఈ విఘాతం చోటు చేసుకోవడం గమనార్హం. సెక్రటేరియెట్‌కు ఇంటర్నెట్ సేవలు అందించే ‘నిపుణ’ నెట్‌వర్క్‌కు పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయని, అందుకే సేవలు నిలిచిపోయాననే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఇంటర్ నెట్ నిలిపివేసిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే.. అధికారులు మాత్రం టెక్నికల్‌గా తలెత్తిన సమస్యేనని, కాసేపటికే వైఫై సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని అంటున్నారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రెండు గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన మరో రెండు గ్యారంటీ హామీల ప్రారంభోత్సవ వేదిక మారింది. ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనుంది. నిజానికి మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలవడం, వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభ కోసం టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్‌సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్‌గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్‌ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
పొలిటికల్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందని తెలిపారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం.. కేసీఆర్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురకలు అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
జీవో 81ను సవరణ చేయాలని వీఆర్ఏల డిమాండ్
-
తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెక్రటేరియల్ గేటు ముందు బైఠాయించి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, తక్షణమే అలర్ట్ అయిన పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్‌ను పాత పద్దతితోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
పదేళ్ల తెలంగాణ.. ఆవిర్భావ వేడుకల ఫోటోలు
-
ఆ అవకాశం నాకు దక్కింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించి.. అక్కడి సభా వేదిక నుంచి ప్రసంగించారాయన. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 🎤 తెలంగాణపథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మన సంక్షేమ మోడల్‌ను కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏ పథకం తెచ్చినా అందులో మానవీయ కోణమే ఉంటుంది. 🎤 రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవా కానుకగా.. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. 🎤 పోడు భూముల శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నాం. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు చేపట్టబోతున్నాం. 🎤 గొల్ల, కుర్మలకు భారీ ఎత్తున్న గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో విడుత పంపిణీ చేయబోతున్నాం. 🎤 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అర్హులైన వాళ్లకు ఇళ్ల స్థలాలు అందిస్తాం. గృహలక్ష్మి పథకం ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 🎤 దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇస్తున్నాం. హుజూరాబాద్‌లో వందకు వంద శాతం ఈ పథకం అమలు అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 50 వేలమందికి దళిత బంధు లబ్ధి చేకూరింది. 🎤 మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల కింద పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 🎤 ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. అన్నీ వరి కోతలే 🎤 గ్రామీణఆర్థిక వ్యవస్థను బలపరిచాం. మన పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తున్నాయి. 🎤 ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు వచ్చాయి.స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ సమస్యలు లేవు. 🎤 నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాళేశ్వరంను అతితక్కువ కాలంలో పూర్తి చేశాం. 🎤 రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కళ్లు తెరిపించింది. 🎤 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. 🎤 పవర్ హాలీడేతో పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. మోదీ స్వరాష్ట్రంలోనూ పవర్ హాలీడే అమలు అవుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. -
అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కే సాధ్యం: విజయేంద్ర ప్రసాద్
పట్టుదల, అకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేపడుతూ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. “ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు, స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్. చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య రాజేశ్ పంచాయితీ.. స్పందించిన రష్మిక -
సరికొత్త లుక్‌లో తెలంగాణ నూతన సచివాలయం (ఫోటోలు)
-
TS New Secretariat Latest Images: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
-
TS New Secretariat: కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కొత్త సచివాలయం ప్రారంభ సంబరాలు (ఫొటోలు)
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)