సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. సెక్రటరియేట్‌ను బాంబుపెట్టి పేల్చేస్తాంమంటూ అగంతకుడు సీఎం రేవంత్‌రెడ్డి పీఆర్‌ఓపీకి ఫోన్ చేశాడు. బెదిరింపులతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ పోలీసులు తెలంగాణ సెక్రటరియేట్‌లో తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పారు. మూడు రోజుల నుంచి అగంతకుడు బెదిరింపు కాల్స్ చేశాడు. అగంతకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఎందుకు బెదిరింపు కాల్స్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment