fake call
-
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. -
ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావును టార్గెట్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట డబ్బు కాజేయాలని చూశాను. కానీ, వీహెచ్ తెలివిగా వ్యవహరించి.. కేటుగాళ్లకు టోకరా ఇచ్చారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియన్ నేత వీహెచ్‌ను మోసగించేందుకు ఓ సైబర్ నేరగాడు యత్నించాడు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. ఆపదలో ఉన్నానని, గూగుల్‌పే ద్వారా డబ్బు పంపాలని సదరు వ్యక్తి అభ్యర్థించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి వీహెచ్.. హరిరామ జోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఫేక్ కాల్ అని వీహెచ్ నిర్ధారించుకున్నారు. అనంతరం.. ఫేక్ కాల్‌పై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాడు ఖమ్మం నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా.. రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ -
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు
-
బిగ్‌బీ బంగ్లా, మూడు రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్ కలకలం
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లలతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే స్టేషన్లతో పాటు బిగ్‌బీ నివాసంవద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మర తనిఖీల అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు అమర్చినట్టు చెప్పాడు. వెంటనే స్పందించిన అధికారులు ఇతర రక్షణ సిబ్బందిని అలర్ట్ చేశారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బాంబు స్క్వాడ్, జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువుల జాడ ఏదీ తమకు లభించలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఫోన్‌కాల్ ఎక్కడనుంచి వచ్చింది, ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు. -
గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు
టీ.నగర్ : ఆడగొంతుతో మాట్లాడి రూ.36 లక్షలు మోసగించిన నైజీరియా యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై కీల్పాక్కంకు చెందిన జోసెఫ్ (48), రాయల్ ట్రేడింగ్ పేరిట సంస్థ నడుపుతున్నాడు. తన ఫేస్బుక్ పేజీలో వ్యాపార వివరాలను పొందుపరిచారు. దీన్ని గమనించిన లండన్‌కు చెందిన ఎలిజబెత్ అనే మహిళ మెసెంజర్ ద్వారా జోసెఫ్‌ను సంప్రదించి పరిచయం పెంచుకుంది. ముంబైలో రక్త క్యాన్సర్‌ను నయం చేసే ఫోలిక్ ఆయిల్ లభిస్తున్నట్లు దీన్ని కొని పంపితే నగదు చెల్లిస్తానని నమ్మబలికింది. రూ. 36 లక్షల ఫోలిక్ ఆయిల్ పంపితే ఇందుకు రూ.6 లక్షలు కమిషన్‌గా అందజేస్తానని తెలిపింది. సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని కోరింది. దీంతో జోసెఫ్ మెసెంజర్ ద్వారా సునీతతో మాట్లాడగా తన బ్యాంకు అకౌంట్‌కు రూ.36 లక్షలు జమ చేసినట్లయితే వెంటనే ఫోలిక్ ఆయిల్ పంపుతానని తెలిపారు. జోసెఫ్ ఆమె ఖాతాకు రూ.36 లక్షలు చెల్లించి సునీత, ఎలిజబెత్‌ల కోసం ఫోన్లో సంప్రదించగా వారు స్విఛాప్ చేసివున్నారు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న జోసెఫ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముంబైలో మోసం జరిగినట్లు తెలిసింది. -
భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ
మథురై : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జనపథ్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మా బస్సు హైజాక్‌కు గురైందని.. వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని బస్సును ఆపారు. అయితే అసలు విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు.. మథురై నుంచి బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు నౌహ్జీల్ పరిధిలోని బజ్నాకు చేరుకునేసరికి ఒక ప్రయాణికునిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఫోను చేసింది. తనను అనుమానంగా చూస్తున్నాడని.. భయమేస్తుందని భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫోను చేసి, బస్సు హైజాక్ అయిందంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన భార్యను రక్షించుకోవడం కోసం బస్సు హైజాక్ అయిందంటూ నాటకమాడిన సదరు వ్యక్తిని చట్ట నియమాలను ఉల్లఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి : ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య) -
100కు ఫోన్ చేసి ప్రధానికి బెదిరింపు
నోయిడా : 'మేము ఆపదలో ఉన్నామంటూ.. ఇక్కడ ప్రమాదం జరిగిందంటూ..' డయల్ 100కు ఫోన్ చేసి విసిగించే ఆకతాయిలు చాలా మందే ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి హాని తలపెడతానంటూ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. నోయిడాలో సోమవారం చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన హర్భజన్ సింగ్ నోయిడాలోని సెక్టార్ 66లో నివసిస్తున్నాడు. సోమవారం ఆకస్మాత్తుగా డయల్ 100కు ఫోన్ చేసి ప్రధానికి హాని తలపెడాతనంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హర్భజన్‌ను ట్రేస్ చేస్తుండగా ఫేస్-3 పోలీసులకు మమూరా వద్ద పట్టుబడ్డాడు. హర్భజన్ సింగ్ మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా వైద్యపరీక్షల కోసం హర్భజన్‌ను ఆసుపత్రికి పంపించినట్లు నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. -
ఇంటర్సిటీ ట్రైన్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఉదయం 5:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆందోళన రేగింది. డయల్ 100కు ఫోన్ చేసి ట్రైన్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో రైల్వే స్టేషన్లోనే ఆ రైలును ఆర్పీఎఫ్ పోలీసులు నిలిపివేశారు. రైలును అణువణువు తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ సీనియర్ డివిజన్ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. అదేవిధంగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌ను ఫేక్ కాల్‌గా గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
సాక్షి, బెంగళూరు/కుప్పం(చిత్తూరు జిల్లా): కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడబోతున్నట్లు బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ కాల్ సంచలనం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తిని మాజీ సైనిక ఉద్యోగి స్వామి సుందరమూర్తిగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం పేలుళ్ల సమాచారం ఉత్తిదే అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం స్వామి సుందరమూర్తి బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తానొక లారీ డ్రైవర్నంటూ పరిచయం చేసుకున్నాడు. అతడు తమిళం, కొంచెం హిందీ భాషల్లో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు జరుపుతారనే సమాచారం తన వద్ద ఉందన్నాడు. ముఖ్యంగా రైళ్లలో దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతూ తమిళనాడు రామనంథపురంలో 19 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫోన్ కాల్ వచ్చిన లొకేషన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరు శివార్లలోని ఆవలహళ్లి సమీపంలోని ఇంటి నుంచి ఆ కాల్ వచ్చిందని గుర్తించారు. శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లి సుందరమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఇక్కడ కూడా ఇదేవిధంగా జరిగే అవకాశం ఉండొచ్చని ఊహించి తాను ఫోన్ కాల్ చేసినట్లు సుందరమూర్తి అంగీకరించాడు. మరింత లోతైన విచారణ కోసం అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీలో 20 ఏళ్ల పాటు సుందరమూర్తి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుందరమూర్తి ఇద్దరు పిల్లలు కూడా జవాన్లుగా పనిచేశారు. వీరిలో ఒకరు కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందారు. దక్షిణాది రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు పేలుళ్ల వార్త నేపథ్యంలో కర్ణాటక డీజీపీ నీలమణి ఎన్.రాజు ముందస్తు హెచ్చరికలతో కూడిన అత్యవసర ఫ్యాక్స్‌ను దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. అలాగే కర్ణాటకలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దాడులపై కర్ణాటక పోలీసులు హెచ్చరిస్తూ విడుదల చేసిన నోటీసులు మూడు రాష్ట్రాల కూడలి ప్రదేశంలో ఉన్న కుప్పంలో హల్చల్ చేస్తున్నాయి. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. వాటిని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
బ్యాంకులో బాంబు ఉందని కాల్.. మహిళ అరెస్టు!
అనకాపల్లి టౌన్: బ్యాంకులో బాంబు ఉందని మేనేజర్‌కు ఓ మహిళ ఫోన్లో చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. బ్యాంకుని తనిఖీ చేసిన పోలీసులకు అక్కడ బాంబు కనిపించకపోవడంతో కాల్ని నకిలీగా గుర్తించి సెల్ నెంబర్ ఆధారంగా మహిళను అదుపులోకి తీసుకుని విచారించి బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాలలో జరిగింది. తుమ్మపాల పంచాయతీ గుండాలవీధిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో బాంబు ఉన్నట్లు మంగళవారం బ్యాంక్ మేనేజర్ గాలి కిరణ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. వెంటనే ఆయన రూరల్ ఎస్ఐ ఆదినారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంకు వద్దకు వెళ్లి గాలించగా అక్కడ ఎటువంటి బాంబు లభించలేదు. దీంతో అది ఫేక్ కాల్‌గా నిర్ధారించి కాల్ చేసిన నెంబర్‌ను ట్రేస్ చేశారు. ఆ నెంబర్ అనకాపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన ‘వెలుగు’ కాంట్రాక్ట్ ఉద్యోగిని రాచేపల్లి వీర శివరంజనిదిగా గుర్తించారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇదే నెంబర్‌తో ఆమె గుంటూరు రూరల్ ఎస్పీ విజయరాజుకి, మరో 16 మంది వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈవీఎంలు పేల్చడంతో పాటు ఎస్బీఐ బ్యాంకుల్లో బాంబులు అమర్చినట్లు మంగళవారం పలు మెసేజ్‌లు పంపినట్లు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. తన స్నేహితురాలు ఇంట్లో ఈ నెల 13న సిమ్ దొంగలించినట్లు తెలిపింది. శివరంజనిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. -
‘సీఎం ఇంట్లో బాంబు.. పేలబోతోంది’
కృష్ణరాజపురం : కర్ణాటక ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేసిన యువకుడిని జేపీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరప్పన అగ్రహార ప్రాంతానికి చెందిన మన్సూర్ సోమవారం రాత్రి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తన పేరు గోపాల్ అని జేపీ నగర్లో ఉన్న సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్ది సేపట్లో బాంబు పేలనుందంటూ చెప్పి ఫోన్ పెట్టేసాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రత బలగాలు, బాంబు నిర్వీర్య దళం, శ్వానదళంతో అక్కడికి చేరుకొని అణువణువు క్షుణ్ణంగా గాలించగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఇది కేవలం బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కంట్రోల్ రూమ్‌కు వచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన జేపీ నగర్ పోలీసులు విచారణ జరపగా తన అసలు పేరు మన్సూర్ అని పోలీసులను తప్పుదారి పట్టించడానికి తన పేరు గోపాల్‌గా మార్చి చెప్పినట్లు అంగీకరించాడు. -
పోలీసులకు చుక్కలు చూపించిన వృద్ధ దంపతులు
బంజారాహిల్స్: తాగిన మైకంలో వృద్ధ దంపతులు పోలీసులకు చుక్కలు చూపించారు. తన భార్య మెడను నరికేసి మొండాన్ని చెరువులో, తలను కుంటలో పడేశానంటూ వృద్ధుడు పోలీసులకు ఫోన్‌చేసి చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులు 24 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా ఉరుకులు పరుగులు తీశారు. వివరాలు.. బోరబండ సమీపంలోని రాజీవ్‌గాంధీనగర్ పార్కులో నర్సయ్య (75), కిష్టమ్మ (72) దంపతులు వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం సమీపంలోని కల్లు కాంపౌండ్‌లో పీకల దాకా కల్లు తాగి ఇంటికి వచ్చి గొడవపడ్డారు. దీంతో కిష్టమ్మ బయటకు వెళ్లిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో స్థానిక కాంగ్రెస్ నేత లియాఖత్‌అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి నర్సయ్య అనే వ్యక్తి తన భార్య మెడను నరికేసి కుంటలో పడేశాడని చెబుతున్నాడని సమాచారం ఇచ్చాడు. ఆందోళన చెందిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి నర్సయ్యను విచారణ చేశారు. తన భార్య మెడ నరికేశానని మొండాన్ని చెరువులో వేశానని చెప్పాడు. దీంతో నర్సయ్యను వెంటబెట్టుకొని ఆ ప్రాంతాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో గాలించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎన్నిసార్లు ప్రశ్నించినా తన భార్యను చంపేశానంటూ చెబుతుండటంతో పోలీసుల ఆందోళన మరింత పెరిగింది. నాలుగు బృందాలు రాత్రంతా గాలించినా శవం ఎక్కడా కనిపించలేదు. తీరా సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ మెయిన్‌రోడ్డులో ఫుట్‌పాత్‌పై పడుకున్న కిష్టమ్మను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 24 గంటల పాటు పోలీసులకు నరకాన్ని చూపించిన కిష్టమ్మ, నర్సయ్య దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికే ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో కిష్టమ్మ మిస్సింగ్ కేసు నమోదై ఉంది. అక్కడి పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. -
‘హలో.. నా బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేయరా.. ’
కోల్‌కతా: సాధారణంగా పోలీసులు వేధిస్తున్నారని అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ, పోలీసులే తీవ్ర వేధింపులకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌లో కనిపిస్తోంది. ఎందుకంటే అత్యవసర సేవలు అందించే పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 100కు అర్ధం పర్ధం లేని ఫోన్ కాల్స్ దండిగా వస్తున్నాయంట. రోజుకు కనీసం 1000 వరకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని వాటికి సమాధానం చెప్పలేకపోతున్నామని బిధన్నగర్ సిటీ పోలీస్ కంట్రోల్ రూం పోలీసులు చెబుతున్నారు. బాగా తాగిన వాళ్లు, చిన్నపిల్లలు, చిల్లరగాళ్లు, బాయ్‌ఫ్రెండ్స్‌తో చిన్న చిన్న గొడవలు పడి ఒత్తిడితో ఫోన్ చేసేవాళ్లు, ఇంట్లో తినకుండా చదవకుండా, భోజనం చేయకుండా మారాం చేస్తున్నాడని ఫిర్యాదులు చేసేవాళ్లు ఎక్కువయ్యారని అంటున్నారు. ఇలాంటి ఫోన్ల కారణంగా నిజంగా ఇబ్బందుల్లో పడి ఫోన్ చేసేవాళ్లు నష్టపోతున్నారని, ముఖ్యంగా సెలవు రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఏ ఫోన్‌కాల్ అయినా ఫేకా కాదా అనే విషయం మాట్లాడేవరకు తెలియదని, ముందుగా ఫిల్టర్ చేయడం సాధ్యం కాదని ఈ కారణంగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వస్తేనే చిరాకు లేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ‘తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన ఓ అమ్మాయి ఫోన్ చేసి మా బాయ్ ఫ్రెండ్‌ను అరెస్టు చేయండి అంటుంది. అలాగే, మా అబ్బాయి మారాం చేస్తూ అసలు తినడం మానేశాడని కాస్త బెదరించండి అంటూ మరో ఇంటావిడ ఫోన్ చేస్తుంది. అలాగే, బాగా తాగి ఉన్న వాళ్లు, చిన్నారులు ఇలా ఎవరు పడితే వాళ్లు అత్యవసర నెంబర్‌కు ఫోన్ చేసి విసిగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇవి బాగా ఎక్కువయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటితో చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని కంట్రోల్ రూమ్ అధికారులు తమ సమస్యను చెప్పుకుంటున్నారు. -
బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ..
మెదక్ : ఎస్బీహెచ్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఒక్కసారి కన్ఫార్మ్ చేసుకోండని మాయమాటలు చెప్పి అకౌంట్ వివరాలు తీసుకొని అందులోని నగదు అపహరించిన సంఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. శంకరంపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఎస్బీహెచ్ అకౌంట్ వివరాలు తెలుసుకొని అందులో నుంచి రూ.10 వేలు డ్రా చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుభాష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఇదే విధంగా మోసపోయానని, ఎస్బీహెచ్ నుంచి మాట్లాడుతున్నామంటే వివరాలు చెప్పానని.. అనంతరం అకౌంట్ చెక్ చేసుకుంటే రూ. 25 వేలు మాయమయ్యాయన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
పెళ్లి ఆపిన ఫేక్ కాల్
హసన్‌పర్తి(వరంగల్ జిల్లా): వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి.. బంధు మిత్రుల రాకతో అంతా కోలాహలం.. ఆదివారం ఉదయం 11.24 గంటలకు ముహూర్తం. శనివారం రాత్రి 10 గంటలకు వరుడికి ఫోన్ కాల్. 'నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి అంతకు ముందు మరో యువకుడిని ప్రేమించింది' అనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. ఇంకేముంది వరుడు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి జరగదనే సమాచారం వధువు ఇంటికి చేరవేశాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. నగరంలోని నయీంనగర్‌కు చెందిన కోలా రఘు పరకాల డివిజన్లోని ఎల్ఐసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం హసన్పర్తికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈనెల 27న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కట్నకానుకల కింద వరుడికి రూ.20 లక్షల నగదుతో పాటు ఇతర లాంచనాలు ఇచ్చారు. ఏకైక కూతురు కావడంతో పెళ్లి ఘనంగా నిర్వహించాలనుకున్న వధువు తల్లిదండ్రులు భీమారంలోని పొద్దుటూరి గార్డెన్లో వేదిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో.. తనకు వచ్చిన ఫోన్‌కాల్‌తో పెళ్లి చేసుకోబోనని పెళ్లి కుమారుడు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో ఎవరో కావాలనే ఈ పెళ్లిని ఆపాలని కుట్ర పన్నుతున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరుడి ఇంటి ముందు వధువు బంధువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. అయితే, అప్పటికే వరుడు పరారు కావడంతో బాధితులు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వరుడి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్ చేయగా 15 రోజులు గడువు ఇవ్వాలని, ఆ తర్వాత ఏ విషయం చెపుతామని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
ప్రైజ్‌మనీ అంటూ రూ.4 లక్షలకు టోపీ
షాద్‌నగర్ (మహబూబ్ నగర్) : ప్రైజ్ మనీ వచ్చిందని ఓ అమాయకుడిని మోసం చేసి లక్షలు దండుకున్న ఉదంతం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యూసుఫ్‌కు ఇటీవల 92347880001 నంబరు నుంచి ఆకాష్ వర్మ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. 'కంగ్రాచులేషన్స్.. మీకు లక్కీ డిప్లో రూ.25 లక్షలు ప్రైజ్ వచ్చింది... ఆ డబ్బు కావాలంటే మేం సూచించిన బ్యాంకు ఖాతాలో కొంత డబ్బు జమ చేయాల్సి ఉంటుంది' అని చెప్పాడు. ప్రైజ్ మనీ ఆనందంలో యూసుఫ్ ఆ వ్యక్తి చెప్పినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతను చెప్పిన సమయం ప్రకారం, తెలియజేసిన వ్యక్తుల పేరుతో రూ.4 లక్షలు జమ చేశాడు. అనంతరం ప్రైజ్‌మనీ ఎంతకీ రాకపోయేసరికి యూసఫ్ పదే పదే ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. చివరికి ఆన్లైన్లో ఒక చెక్కును యూసఫ్‌కు పంపించాడు. అది డూప్లికేట్ చెక్కు అని, ఒరిజినల్ చెక్కు కావాలంటే మరో రూ.1.70 లక్షలు ఖాతాలో జమ చేయాలని ఫోన్ చేశాడు. దీంతో యూసుఫ్ మోసపోయిన విషయం గమనించి శుక్రవారం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు. -
ఆఫర్ అంటూ కుచ్చుటోపీ..
వలిగొండ (నల్లగొండ జిల్లా) : మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ నెంబర్ వాడుతున్నారు, మీకు మా కంపెనీ ఆఫర్ ప్రకటించిందంటూ.. వచ్చిన ఫోన్ కాల్ నమ్మి ఓ వ్యక్తి చేతి చమురు వదిలించుకున్నాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్లకు చెందిన వరికుప్పల ఆగమయ్యకు పది రోజుల క్రితం 911133564001, 911133564044 నెంబర్ల నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎన్ని రోజులుగా మా నెట్వర్క్ వాడుతున్నారని అవతలివారు అడిగారు. దీంతో ఆగమయ్య.. పది సంవత్సరాలుగా వాడుతున్నానని తెలిపాడు. మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ వాడుతున్నందున మా నెట్వర్క్ కంపెనీ మీకు మంచి ఆఫర్ ప్రకటించిందని తెలిపారు. మీకు సామ్సంగ్ సెల్‌ఫోన్, 4జీ మొమరీ కార్డు, రెండు గడియారాలు, 5 వేల విలువ చేసే షాపింగ్ వోచర్లు పది రోజులలో పంపిస్తామని చెప్పారు. అలా చెప్పి ఆగమయ్య పోస్టల్ అడ్రస్ తీసుకున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకునే సమయంలో ఫోస్టాఫీస్లో కేవలం రూ.3 వేలు చెల్లించండని తెలిపారు. గిఫ్ట్‌ప్యాక్ పంపించాం, అందిందా అని తిరిగి సోమ, మంగళవారాలలో 911133564031 నెంబరు నుంచి ఫోన్ చేశారు. వీరి ఫోన్ రావడంతో ఆగమయ్య మంగళవారం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాడు. పోస్టాఫీస్‌లో ఆయన పేరున గిఫ్ట్ ప్యాక్ వచ్చి సిద్ధంగా ఉంది. దీంతో వారు చెప్పిందంతా నిజమని నమ్మిన ఆగమయ్య 3 వేలు చెల్లించి గిఫ్ట్ ప్యాక్‌ను అందుకున్నాడు. వెంటనే గ్రామస్తుల ముందు దానిని ఓపెన్ చేసి చూడగా వారు చెప్పింది ఒక్కటి కూడ లేదు. అందులో హనుమాన్ చిన్న విగ్రహం, యంత్రం, దేవుడి ఫోటో, సీడీ క్యాసెట్ మాత్రమే కనిపించాయి. దీంతో ఆగమయ్య పరిస్థితి ఆగంగా మారింది. నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నాడు. -
ఫోను వచ్చిందా... సొత్తు గోవిందా!
బొబ్బిలి రూరల్: ‘బ్యాంక్ సే బాత్ కర్ రహాహూ... ఆప్కా ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాసే యహాతక్ నహీ కియా.... ఆధార్ నంబర్ బతాయియే..’ అంటూ కాల్ వచ్చిందా మీ సొత్తుకు ఎవరో టెండర్ పెడుతున్నట్టేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఆప్కా ఏటీఎంకా సోలహ్ ఆంక్ బతాయియే..’(మీ ఏటీఎంపై ఉన్న 16అంకెలు చెప్పండి..) అంటూ తరువాత పిన్ నంబర్ మారుతుంది. మీకు మూడు మెసేజ్‌లు వస్తాయని ఫోన్లో చెబితే అది కచ్చితంగా మోసమేనని, అలాంటి ఫోన్సకాల్స్కు వీలైనంత దూరంగా ఉండాలని, అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఆన్లైన్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరి వద్దా ఏటీఎం ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏటీఎం నంబర్లు తెలుసుకుని దుండగులు ఖాతాదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల ఓ ఇద్దరు ఇలా మోసపోయారు కూడా. వారి ఏటీఎంల నుంచి 5వేల రూపాయలు, ఒకరి ఏటీఎం నుంచి కొద్దిమొత్తం పోయినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఏటీఎంల నుంచి మన ఏటీఎం నంబర్, పిన్ నంబర్ మనతోనే చెప్పించి మోసం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్‌తో మన ఏటీఎం ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. మన ఏటీఎం కార్డు, పిన్‌నెంబర్ ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా ఆధార్, ఏటీఎం నెంబర్లు అడిగితే ఒకటికి పదిమార్లు కన్ఫర్మ్ చేసుకుని వివరాలు వెల్లడిస్తే మోసపోకుండా ఉండవచ్చని చెబుతున్నారు. -
కాల్ చేశారు: లక్ష కొట్టేశారు
కరీంనగర్: ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోయింది. కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలపండని ఫోన్ చేసి అకౌంట్లోని డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పెదపల్లి ఐటీఐ కాలేజీలో మంగళవారం వెలుగుచూసింది. పెదపల్లి ఐటీఐ కాలేజీలో పనిచేసే నందగోపాల్‌కు దుండగులు ఫోన్ చేసి కార్డు వివరాలు తీసుకుని అతడి అకౌంటు నుంచి రూ. 66 వేలు కాజేశారు. అనంతరం మరో సారి కాల్ చేసి నగదు తప్పుగా జమ అయ్యాయని మరో కార్డు వివరాలు చెబితే అందులోకి బదిలీ చేస్తామని నమ్మబలికారు. ఇలా నలుగురి వివరాలు తీసుకుని రూ. లక్ష పై చిలుకు దొచుకున్నారు. -
మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తం: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: బీమా వ్యాపారంలో మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్డీఏ ప్రజలను హెచ్చరించింది. దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఐఆర్డీఏ ఆధ్వర్యంలో అధిక రాబడులు వచ్చే బీమా పాలసీలు ఉన్నాయని, బోనస్‌లు ఇస్తోందంటూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, ఐఆర్డీఏ బీమా వ్యాపారంలో లేదని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలెవరైనా ఇలాంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటే, తక్షణం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. -
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు మొదలుపెట్టారు. గతంలో కూడా ఈ విమానాశ్రయానికి ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటి విషయంలో కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. అంతకుముందు ఈనెల 13వతేదీ గురువారం నాడు హైకోర్టుకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. హైకోర్టులో నాలుగు బాంబులున్నాయని, అవి ఏ క్షణమైనా పేలవచ్చునంటూ ఓ ఆగంతకుడు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. కానీ అది ఉత్తుత్తి బెదిరింపేనని తర్వాత తేలింది.