భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ | Bus Hijack Drama By Husband To Save Wife Fake Phone Call To Police | Sakshi
Sakshi News home page

భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ

Published Tue, Dec 1 2020 7:44 PM | Last Updated on Wed, Dec 2 2020 4:35 AM

Bus Hijack Drama By Husband To Save Wife Fake Phone Call To Police - Sakshi

మథురై : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జనపథ్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మా బస్సు హైజాక్‌కు గురైందని.. వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని బస్సును ఆపారు. అయితే అసలు విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

వివరాలు.. మథురై నుంచి బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు నౌహ్జీల్‌ పరిధిలోని బజ్నాకు చేరుకునేసరికి ఒక ప్రయాణికునిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఫోను చేసింది. తనను అనుమానంగా చూస్తున్నాడని.. భయమేస్తుందని భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫోను చేసి, బస్సు హైజాక్ అయిందంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన భార్యను రక్షించుకోవడం కోసం బస్సు హైజాక్‌ అయిందంటూ నాటకమాడిన సదరు వ్యక్తిని చట్ట నియమాలను ఉల్లఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి : ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement